
ఇండియన్ మార్కెట్లో.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్లను మాత్రమే కాకుండా, అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
ఏథర్ రిజ్టా (Ather Rizta)
ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ రిజ్టా ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్, ఇతర వస్తువులను ఉంచవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.
రివర్ ఇండీ (River Indie)
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఏకంగా 43 లీటర్లు. కాబట్టి రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచవచ్చు. ఇది కాకుండా అదనపు బాక్సులను అటాచ్ చేయడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్‌లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 1.43 లక్షలు.
బజాజ్ చేతక్ (Bajaj Chetak)
35 లీటర్ల అండర్ సీట్ కలిగిన ఈ బజాజ్ చేతక్ కూడా.. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఎక్కువ స్టోరేజ్ కోసం కంపెనీ బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్‌లో ఫిక్స్ చేసింది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 (Ola S1 Pro Plus Gen 3)
ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్టోరేజ్ కెపాసిటీ ఇతర ఓలా స్కూటర్ల కంటే ఎక్కువ అందిస్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 32 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.