
న్యూఢిల్లీ: హ్యాండ్‌సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్‌టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment