
ట్రాయ్ డిసెంబర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్‌లో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్‌డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది.
వైర్‌లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్‌స్కయిబర్స్‌ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.
మరోవైపు, వైర్‌లైన్ యూజర్ల సంఖ్య నవంబర్‌లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్‌లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్‌టెల్‌కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్‌ఎల్ 14,054 మంది సబ్‌్రస్కయిబర్స్‌ను కోల్పోయాయి.
బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు..
మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు నవంబర్‌లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్‌లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్‌టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్‌టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment