న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది.
మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్‌ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment