
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తన సరికొత్త ఒప్పో కే13 5G (Oppo K13 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. రూ. 20,000 సెగ్మెంట్‌లోనే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, భారీ 7000mAh బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్ వచ్చింది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
ఉన్నాయి.
ధర..
8GB RAM + 128GB స్టోరేజ్: రూ.17,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ.19,999
లాంచ్ ఆఫర్: లాంచ్ రోజున, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఫలితంగా ధరలు రూ.16,999, రూ.18,999కి తగ్గుతాయి. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.
లభ్యత: 2025 ఏప్రిల్ 25 నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డిస్‌ప్లే: 6.67-ఇంచ్ ఫుల్ HD+ (2400x1080 పిక్సెల్స్) AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: 4nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా-కోర్ (2.3GHz వరకు), అడ్రినో 810 GPUతో, స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లు
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15, 2 సంవత్సరాల OS అప్‌డేట్స్. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్.
కెమెరా: వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.
బ్యాటరీ: 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 62%, గంటలోపే పూర్తి ఛార్జ్)