
హైపర్ ఓఎస్ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లోకి తొలి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్ దీన్ని లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్ 14తో కూడిన హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది.
పోకో తన ఎక్స్ సిరీస్‌ను రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో మోడల్‌లు వచ్చే వారంలో భారత్‌లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన కొన్ని స్పెక్స్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్6 సిరీస్‌కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోకో షేర్ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్‌ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్‌ఓఎస్‌తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు.
More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS.
— POCO India (@IndiaPOCO) January 5, 2024
Global launch on 11th Jan, 5:30 PM on @flipkart.
Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y
పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే..
పోకో ఎక్స్6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్‌మెంట్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్ ఉన్నాయి.
ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్ 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్6 సిరీస్ మోడల్‌లు 120Hz డిస్‌ప్లేతో వస్తున్నాయని రూమర్స్ వచ్చాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 64MP మెయిన్ కెమెరా, 67 వాట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.