New Software
-
HyperOS: ఈ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే..
హైపర్ ఓఎస్ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లోకి తొలి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్ దీన్ని లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్ 14తో కూడిన హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది. పోకో తన ఎక్స్ సిరీస్‌ను రెండు కొత్త స్మార్ట్ఫోన్లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో మోడల్‌లు వచ్చే వారంలో భారత్‌లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్ఫోన్లకు సంబంధించిన కొన్ని స్పెక్స్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్6 సిరీస్‌కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోకో షేర్ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్ఓఎస్తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు. More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS. Global launch on 11th Jan, 5:30 PM on @flipkart. Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y — POCO India (@IndiaPOCO) January 5, 2024 పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే.. పోకో ఎక్స్6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్మెంట్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్ ఉన్నాయి. ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్ 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్6 సిరీస్ మోడల్‌లు 120Hz డిస్ప్లేతో వస్తున్నాయని రూమర్స్ వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు 64MP మెయిన్ కెమెరా, 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. -
పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్వేర్! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా..
90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది నోకియా. నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు. మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల నోకియా 130 స్పెసిఫికేషన్లు నోకియా 130 ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది. నోకియా 150 స్పెసిఫికేషన్లు ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. -
కొత్త సాఫ్ట్‌వేర్‌ను కొన్న బీసీసీఐ.. ప్రధాన లక్ష్యమదే..
-
వాణిజ్య బ్యాంక్‌లతో పోటీగా డిసీసీబీ.. రూ.1,500 కోట్ల చేరువలో..
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాతీయ వాణిజ్య బ్యాంక్‌లతో పోటీ పడుతోంది. రైతుల బ్యాంక్‌గా అవతరించిన డీసీసీబీ రైతులతో పాటు ప్రజలకు బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంకేతికపరంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 20 బ్రాంచ్‌లు కలిగి 177 మంది సిబ్బందితో లక్షలాది మంది రైతులు, ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోంది. నెల్లూరు (వీఆర్సీసెంటర్): వందేళ్ల చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నేడు నూతన సాంకేతికతను వినియోగించుకుని జిల్లా రైతులకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ల్లో ఒకటిగా డీసీసీబీ రైతులకు, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఐడీఏ సాంకేతికతను వినియోగించుకుంటున్న డీసీసీబీ తాజాగా టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటూ మెరుగైన, త్వరితగతిన సేవలు అందిస్తోంది. ఈ నూతన సాఫ్ట్‌వేర్‌తో బ్యాంకు ఖాతాదారులు మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయూత కరోనా విపత్కర సమయంలో డీసీసీబీ ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోవడంతో బ్యాంక్ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.33 కోట్లు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40 కోట్లు మెత్తం రూ.77 కోట్లు షేర్ క్యాపిటల్ అందించడంతో బ్యాంక్ ఆర్థికంగా నిలదొక్కుకుంది. రెండేళ్లలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలను అధిగమించి రూ.1,485 కోట్ల మేర వ్యాపార లావాదేవీల స్థాయికి పెరిగింది. బ్యాంకు పురోగతి 2021–22లో డీసీసీబీ రూ.13.68 కోట్లు ఆదాయాన్ని గడించి అద్వితీయమైన పురోగతి సాధించింది. రూ.80 కోట్ల డిపాజిట్లు సేకరించడంతో మొత్తం రూ.397 కోట్లకు చేరింది. రూ.224 కోట్ల మేర రుణాలు అందించింది. మొత్తంగా రూ.1,485 కోట్ల లావాదేవీలకు పెరిగింది. జిల్లా లో డీసీసీబీ నూతనంగా 6 ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక నూతన మొబైల్ ఏటీఎం వాహనాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు బంగారు రుణాలు ఇచ్చేందుకు జిల్లాలోని కొత్తపాళెం, ఊసుగుంటపాళెం, ఆల్తూరుపాడు, లింగసముద్రం, పడుగుపాడు, తోటపల్లిగూడూరు సహకార సంఘాలకు స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. చదవండి: (అజీజ్ భాయ్ ఏ క్యా హై!) బ్యాంకు ద్వారా రుణాలు డీసీసీబీ ద్వారా జిల్లాలోని రైతాంగానికి, ఖాతా దారులకు వ్యక్తిగత రుణాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.72 కోట్లు అందించింది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకుని రూ.కోటి రుణాలు అందించింది. రూ.2.30 కోట్లు హౌసింగ్, రూ.5.50 కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, రూ.19 కోట్లు 182 స్వయం సహాయక గ్రూపులకు రుణాల రూపంలో అందజేసింది. 134 సమష్టి భాగస్వామ్య బృందాలకు రూ.3 కోట్లు, వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రూ.6.50 కోట్లు అందిచడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పీఎం స్వానిధి, జగనన్న తోడు పథకాల ద్వారా అర్హులైన వారికి రూ.10 కోట్లు రుణాలు అందిస్తోంది. సీఎం సహకారంతో అభివృద్ధి డీసీసీబీ అభివృద్ధికి రెండేళ్లుగా షేర్ క్యాపిటల్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.77 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సహాయంతో ఈ బ్యాంకు ఆర్థికంగా నిలదొక్కుకుంది. రానున్న కాలంలో బ్యాంకు మరింత అభివృద్ధి పథంలో పయనిచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు, జిల్లా అధికారుల సూచనలతో రాష్ట్రంలో నెల్లూరు డీసీసీబీని అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తా. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మెరుగైన సేవలు అందిస్తాం డీసీసీబీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీసీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు, ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలు పడింది. ఎస్ఓడీ రుణాలతో పాటు తక్కువ వడ్డీకే గృహ రుణాలు, ఎస్టీ లోన్లను విరివిగా ఇస్తున్నాం. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘాకాలిక రుణాలను అందిస్తూ , జిల్లాలో రైతుల మన్ననలను పొందుతోంది – డాక్టర్ శంకర్‌బాబు, సీఈఓ -
కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్’గా..
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్‌కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు. -
చిట్ ఫండ్స్: లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే..
సాక్షి, అమరావతి: చిట్ ఫండ్ కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలన్నీ ఇకపై ఆన్లైన్లో కనిపించనున్నాయి. ప్రస్తుతం చిట్ ఫండ్ కంపెనీల గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆ కంపెనీలు చెబితేనో, లేకపోతే చిట్స్ రిజిస్ట్రార్ ద్వారానో కొంత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కంపెనీలు తమ వివరాలను ప్రతి నెలా మాన్యువల్‌గా చిట్స్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సమర్పిస్తున్నాయి. ఫైళ్ల ద్వారానే ఇవన్నీ జరుగుతుండటంతో రోజువారీగా ఆ కంపెనీల పనితీరును పరిశీలించడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాన్యువల్ విధానంతోపాటు ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. సంబంధిత కంపెనీల పనితీరు ప్రజలందరికీ తెలిసేలా వాటి వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో దీనిని అనుసంధానం చేసింది. ఆయా జిల్లాల్లో రిజిస్టరైన చిట్‌ఫండ్ కంపెనీలు మాన్యువల్‌గా సమర్పించిన వివరాలను కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యాలయాల్లో దీనిని పరీక్షిస్తున్నారు. 15 నుంచి 20 రోజులపాటు టెస్టింగ్ పీరియడ్‌లో వచ్చిన సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఆన్లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తారు. 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రాష్ట్రంలో ప్రస్తుతం 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆ కంపెనీలు నడుపుతున్న చిట్లు, వాటి చందాదారులు, ప్రతి నెలా వాటిలో జరుగుతున్న వేలం, చిట్టీ ఎవరు పాడుకున్నారు, ఎంతకి పాడారు, చిట్స్ నుంచి బయటకు వెళుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు, ఆ కంపెనీల టర్నోవర్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చిట్ ఫండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు వివరాలు సమర్పిస్తున్నాయా లేదా? ఏవైనా తేడాలున్నాయా? వంటి వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. తద్వారా కంపెనీల పనితీరును పర్యవేక్షించడం సులభమవుతుంది. ఆ కంపెనీల్లో చిట్లు కడుతున్న వారు, కొత్తగా కట్టాలనుకునే వారు వెబ్సైట్లో వాటి పనితీరును తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిట్ ఫండ్ కంపెనీలపై పూర్తిస్థాయి నిఘా ఉంటుంది. ఆ కంపెనీలు చేసే మోసాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. పారదర్శకత కోసం కొత్త వ్యవస్థ చిట్‌ఫండ్ కంపెనీల సమాచారం అంతా ఆన్లైన్లో ఉండేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల అంతా పారదర్శకంగా ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలు చేసే మోసాలు కూడా తగ్గుతాయి. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
పెగసస్ ఫోన్లోకి చొరబడితే.. అంతే సంగతి!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది.ఉగ్రవాదులు, నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైన సాఫ్ట్వేర్ ఇది. కానీ భారత్‌లో మాత్రం ప్రతిపక్షాలు, విలేకరులపై దీని సాయంతో నిఘా పెడుతున్నారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఈ స్పైవేర్ నిజంగా అంత భయంకరమైందా..? వివరాలు తెలుసుకుందాం.. ఏమిటీ పెగసస్ సాఫ్ట్వేర్? ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ అభివృద్ధిపరిచిన ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. స్మార్ట్ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మాల్వేర్ లేదా స్పైవేర్ ఉన్న స్మార్ట్ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే ఈ–మెయిళ్లు, లొకేషన్ డేటాను కూడా సంపాదించొచ్చు. ఎన్క్రిప్టెడ్ (రహస్యమైన సంకేత భాషలోకి మార్చేసిన) ఆడియో ఫైళ్లను, మెసేజీలను (వాట్సాప్ లాంటివి) కూడా పెగసస్ ద్వారా వినొచ్చు, చదవొచ్చని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారుచేసే కాస్పర్‌స్కై నివేదిక చెబుతోంది. ప్రభుత్వాలకు మాత్రమే.. 2010లో ఏర్పాటైన ఎన్ఎస్వో గ్రూపు తెలిపిన మేరకు ఈ పెగసస్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఉగ్రవాదం, నేరాల నిరోధమే లక్ష్యంగా తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని ఈ సంస్థ చెబుతోంది. 2017లో దుబాయ్ మానవహక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ తొలిసారి ఈ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్ కూడా ఈ మాల్వేర్ బారినపడటంతో ఈ విషయం బయటకొచ్చింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎస్ఎంఎస్లు వస్తుండటంతో అతడు తన ఫోన్‌ను సైబర్ సెక్యురిటీ సంస్థ సిటిజన్ ల్యాబ్‌లో చెక్ చేయించాడు. 2016 నుంచే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ఫోన్లలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గుర్తించడం చాలా కష్టం.. స్మార్ట్ఫోన్లలో పెగసస్ సాఫ్ట్వేర్ చేరినా దాన్ని గుర్తించడం చాలా కష్టం అంటున్నారు సైబర్ నిపుణులు. వాట్సాప్ కాల్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ మన ఫోన్లోకి చొరపడొచ్చని పేర్కొంటున్నారు. వాట్సాప్ కాల్‌ను మీరు కట్ చేసేసినా సరే.. ఈ సాఫ్ట్వేర్ మన ఫోన్లోకి చేరుతుంది. ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఇతరుల ఫోన్లలోకి పంపొచ్చు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా గుర్తించకుండా ఉండేందుకు తనను తాను చెరిపేసుకోగల (ఎరేజ్) సౌకర్యం కూడా దీంట్లో ఉంది. ఇతర అప్లికేషన్ల మాదిరిగా అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌లో అవశేషాలు వదిలిపెట్టదు. కొంతకాలం కింద వాట్సాప్ సంస్థ ఈ పెగసస్ విషయంలో ఎన్ఎస్వో గ్రూపుపై కోర్టులో దావా వేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ ప్లాట్ఫార్మ్ వద్ద పెగసస్ బాధితుల జాబితా ఉన్నట్లు స్పష్టమైంది. పెగసస్ చొరబడ్డ స్మార్ట్ఫోన్లకు వాట్సాప్ స్వయంగా మెసేజీలు పంపిస్తూ అప్డేట్ చేసుకోవాలని కోరుతోంది. పెగసస్ బారిన పడ్డామని తెలుసకునేందుకు ప్రస్తుతానికి ఇదొక్కటే దారి! ఇతర అప్లికేషన్లపై ప్రభావం ఉంటుందా? ఇతర అప్లికేషన్లపై దీని ప్రభావం ఏంటన్నది తెలియదు. మైక్, కెమెరా కంట్రోలర్ ద్వారా ఫైళ్లు, ఫొటోలు సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఎన్క్రిప్టెడ్ మెసేజీలు, ఈ–మెయిళ్లు కూడా. అయితే వాటిలో మార్పుచేర్పులు చేసేందుకు పెగసస్ అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. లొకేషన్ డేటా, స్క్రీన్షాట్లు తీయడం, టైపింగ్ తాలూకు ఫీడ్‌బ్యాక్ లాగ్స్‌ను సేకరించడం పెగసస్‌కు ఉన్న అదనపు సామర్థ్యాలు. మన కాంటాక్ట్‌ల వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ, మైక్రోఫోన్ రికార్డింగ్స్ కూడా సేకరిస్తుంది. ఏం చేయాలి? స్మార్ట్‌ఫోన్‌లో పెగసస్ ఉన్నట్లు తెలిస్తే.. ఆ ఫోన్‌ను వదిలించుకోవడం మినహా వేరే మార్గం లేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫోన్లో అన్ని అప్లికేషన్ల సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడం మేలని సిటిజన్ ల్యాబ్ సూచిస్తోంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్‌ను వాడినా పెగసస్ తొలగిపోదని వివరించింది. బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను జాగ్రత్తగా ఉంచుకునేందుకు క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోరింది. -
అరగంటలో ‘మ్యుటేషన్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయే తర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అరగంటలో పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందు బాటులోకి రానున్నాయి. గ్రామ పంచా యతీలు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లోనే మ్యుటేషన్లు పూర్తి కానున్నాయి. సరళీకృత ఫార్మాట్లో.. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం ప్రకారం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో (నాన్ అగ్రికల్చర్)ను క్లిక్ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్ స్లాట్ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ నమోదు చేయగానే వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. స్లాట్ బుక్ కాగానే అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడి మొబైల్ నంబర్‌కు సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్ బుకింగ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్లైన్లో ఈ–చలాన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు మళ్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. వెంటనే మ్యుటేషన్ సిగ్నేచర్ కోసం సబ్ రిజిస్ట్రార్‌కు పంపిస్తారు. ఈ సంతకం చేయడంతోనే సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. నేటి నుంచి ట్రయల్ రన్ .. బీఆర్కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి వార్‌రూంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి రోజుకు 10 రిజిస్ట్రేషన్ల చొప్పున మూడు రోజులపాటు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ధరణి సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించనున్నారు. ఈ నెల 23న నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
కరోనాపై పోరుకు ముందుకు రండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరులో ప్రభుత్వానికి సహకరించేందుకు పలు సంస్థలు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన నౌ ఫ్లోట్స్ కంపె నీ రూపొందించిన సమీకృత ఆన్లైన్ వీడియో క్లినిక్ సాఫ్ట్‌వేర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. దేశంలోని 1.15 మిలియన్ల (11.5 లక్షలు) మంది వైద్యులతో రోగులు తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించా రు. వైద్యుల అపాయింట్మెంట్, వీడియో ద్వారా ముఖాముఖి, ప్రిస్కిప్షన్ మేనేజ్మెంట్, రోగుల రికార్డుల నిర్వహణ, బిల్లుల చెల్లింపు వంటివి దీని ద్వారా సులభతరం అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని జిల్లాల్లో వెంటనే విని యోగిస్తామన్నారు. డాక్టర్ల సాయంతో డిజిటల్ సేవ లు పొందే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వంటి వాటిలో ఈ సాఫ్ట్‌వేర్‌ను సులభంగా ఉపయోగించవచ్చని, దేశంలోని 500 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అనుకూలంగా ఉం టుందని నౌ ఫ్లోట్స్ వెల్లడించింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నౌఫ్లోట్స్ రీసెర్చ్ హెడ్ నిఖిల్ సల్కర్ పాల్గొన్నారు. -
5 సెకన్లలో కరోనా నిర్ధారణ పరీక్ష
న్యూఢిల్లీ: ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ కేవలం 5 సెకన్లలో కోవిడ్ ఉందో లేదో తెలిపే ఎక్స్ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్ రూపంలో స్టోర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపినట్లు తెలిపారు. -
ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!
2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు (రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోటీ ఈ నెల 12న ముగియనుంది. విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! -
పైరవీలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న ఈ శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దళారులు, పైరవీకారుల ప్రభావం శాఖపై లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ విషయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. ఈసీల జారీ నుంచి నగదు రహిత లావాదేవీల అమలు వరకు జరుగుతున్న సమూల మార్పు లు శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇక అంత వీజీ కాదు గతంలో ఫలానా భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (సీసీ)ల జారీ అడ్డగోలుగా జరిగేది. ఒక్క చలానా మీదనే పలు ఈసీలు, సీసీలు తీసుకునే వెసులుబాటుండేది. కానీ, ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావడం ద్వారా ఈ విధానానికి చెక్ పెట్టారు. ఈసీ లేదా సీసీ కావాలంటే చలానా నెంబర్‌ను ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్రిజిస్ట్రార్ల లాగిన్ ద్వారానే వీటిని జారీ చేస్తున్నారు. దీంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. దీనికితోడు డాక్యుమెంట్ రైటర్ల ప్రభావం శాఖ పనితీరుపై పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రయ, విక్రయ లావాదేవీల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియలో ఆటోమేటెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు డాక్యుమెం ట్లను మాత్రమే స్కానింగ్ వరుసలో ఉంచి వాటి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే మరో డాక్యుమెంట్‌కు అవకాశం లభించే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా డాక్యుమెంట్ రైట ర్లు, శాఖ సిబ్బంది తమ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లను వెనుకా ముందు చేసే ఆస్కారం లేకుండా పోయింది. దీనికి తోడు స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన లావాదేవీలను బుకింగ్ కన్ఫర్మ్ అయిన రోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపే రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ తర్వాతే మాన్యువల్‌గా వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీంతో దాదాపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా పోయింది. వచ్చే నెల డబ్బులతో పనికాదు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ టి.చిరంజీవులు ఆదేశాలతో సంయుక్త ఐజీ వి.శ్రీనివాసులు పర్యవేక్షణలో మరో కీలక నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు. ఈ జూన్ మాసం నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యా లెట్ యాప్‌ను రూపొందించే పనిలో పడ్డారు. ఈ యాప్ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.1000లోపు విలువైన లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనుంది. మొత్తంమీద ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అమలవుతున్న సంస్కరణలు శాఖ పనితీరును మెరుగుపర్చడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటం గమనార్హం. మార్పు ఇలా.. డాక్యుమెంట్ల స్కానింగ్‌లో అటోమేటెడ్ విధానంతో దళారులు, డాక్యుమెంటు రైటర్ల ప్రభావం లేకుండా మార్పులకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. జూన్ నుంచి పూర్తిగా నగదురహిత లావాదేవీలే నిర్వహిస్తారు. వ్యవహారమంతా ఆన్లైన్లో జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ లాగిన్ ద్వారా సేవలు అందిస్తుండటంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. -
త్వరలో ఎన్జీటీలో ఈ–మెయిల్ పిటిషన్
గాంధీనగర్: ఆన్లైన్ ద్వారా పిటిషన్‌ను దాఖలు చేసేందుకు త్వరలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ తెలిపారు. గాంధీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్దిపాటి కోర్టు ఫీజు చెల్లింపుతో దేశంలో ఎక్కడి నుంచైనా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పిటిషర్ ముందుగా పర్యావరణ ఉల్లంఘన వివరాలు, అందుకు తగ్గ ఆధారాలు, ఉల్లంఘించిన వ్యక్తి లేదా సంస్థ వివరాలు తదితర అంశాలను పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం దరఖాస్తు రిజిస్టర్ అవ్వటంతోపాటు నంబర్‌ను కేటాయిస్తామన్నారు. -
ఈ– కుబేర్ ద్వారా వేతనాలు
జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. తాండూరు, పరిగి, మోమిన్‌పేట్, కొడంగల్‌లో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు 3,933 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరందరి వేతనాలు సబ్ ట్రెజరీ డీటీఓకు అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్లే సరికి మూడు నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నెల నుంచి ఇక జాప్యం జరగకుండా ఒకటో తేదీనే జీతాలు ఖాతాల్లో చేరనున్నాయి. వికారాబాద్ అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఇకనుంచి వేతనాల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో ఇప్పటికీ 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకావడం లేదు. దీనికి సంబంధించిన బిల్లులు చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనో, ట్రెజరీలో జరుగుతున్న ఆలస్యం కారణంగానో.. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారం వేతనాలు చేతికందుతున్నాయి. కానీ ఆగస్టు నెల వేతనం నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో క్రెడిట్ కానున్నాయి. అది కూడా 1వ తేదీ రోజునే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రవేశపెట్టిన నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ– కుబేర్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆగస్టు 1నుంచి దీన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీతాల చెల్లింపులో జాప్యానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్రెజరీలో జరిగే చెల్లింపులన్నీ ఈ– కుబేర్ ద్వారానే కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉద్యోగుల నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించారు. నేరుగా బ్యాంక్ ఖాతాలోకే... ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి నెల జీతాలు బిల్లులు తయారు చేసి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి అందజేస్తారు. ఇక్కడ అధికారులు వీటిని పరిశీలించి బిల్లులను సంబంధిత లింక్ బ్యాంకులకు పంపిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగుల వేతనాలు ఖాతాల్లో జమవుతాయి. అయితే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. దీంతో ప్రతి నెల నాలుగు, ఐదు తేదీల్లో వేతనాలు అందుతున్నాయి. ఈ జాప్యానికి స్వస్తి చెప్పేందుకు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు వీలుగా ఆర్బీఐ ట్రెజరీ కార్యాలయాల్లో ఈ – కుబేర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో... జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో ఆర్బీఐ ఒక ప్రభుత్వ ఖాతాను తెరుస్తారు. దీని ద్వారా అన్ని రకాల చెల్లింపులు చేసే విధంగా అధికారాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగలకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా జీతాలు తీసుకునే రోజువారీ కార్మికులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, హోంగార్డులు, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్ నిధులు, ఉపకార వేతనాలు, వివిధ ప్రభుత్వ పథకాలకు నేరుగా బిల్లులు చెల్లించనున్నారు. నేడు ఈ– కుబేర్ ద్వారానే జీతాలు... నేడు (ఆగస్టు) 1వ తేదీన అందాల్సిన జీతాలు ఇదే పద్ధతిన ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విధానాన్ని పూర్తిగా పరిశీలించేందుకు ఇటీవల ఉద్యోగుల ఖాతాల్లో 1 రూపాయి జమచేసి చూశారు. ఆ ఒక్క రూపాయి ఉద్యోగుల ఖాతాలో జమకాలేదంటే ఆ ఉద్యోగి వివరాలు ఈ– కుబేర్ వెబ్సైట్లో పొందపర్చలేదని అర్థం. వివరాలు ఇవ్వని ఆయా శాఖల ఉద్యోగుల వివరాలను సబ్ ట్రెజరీ అధికారులు పూర్తి స్థాయిలో తెప్పించుకున్నారు. -
‘అరుదైన’ నెలలోనే చిక్కాడు...
సాక్షి, సిటీబ్యూరో: షెల్ కంపెనీ ఏర్పాటు చేసి బోగస్ వ్యక్తుల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా రెండేళ్లల్లో నాలుగు బ్యాంకులను రూ.1.52 కోట్లకు ముంచిన కుంభం రంగారెడ్డిని పట్టుకోవడంలో నగర పోలీసు విభాగం సమీకరించుకున్న ‘360 డిగ్రీస్ వ్యూ’ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపకరించింది. ఇందులో కేసుల దర్యాప్తునకు ఉపకరించే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మరోపక్క రంగారెడ్డి కేసుకు సంబంధించి కొందరు కొరియర్ బాయ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గురువారం చిక్కిన ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో రెండు బ్యాంకులకు అధికారిక సమాచారం ఇచ్చేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. ‘పేర్లు’ మారుస్తూ తప్పుదారి... నగర పోలీసు గడిచిన కొన్నాళ్లుగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్త్రృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీనిని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్ళలో కొందరు, ఆర్థిక నేరాలకు పాల్పడి అజ్ఞాతంలోకి వెళ్ళిన వారు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓసారి అరెస్టు అయినప్పుడు ఇంటి పేరు ముందు, అసలు పేరు వెనుక చెబుతూ, మరోసారి అరెస్టు అయిన సందర్భంలో పేరు ముందు, ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇలాంటి మార్పు చేర్పులతోనే తమ గుర్తింపును సైతం మార్చేసుకుంటున్నారు. స్పెల్లింగ్స్‌లో మార్పుచేర్పులు చేస్తూ... ఇలాంటి ‘మార్పిడిగాళ్ళు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టైన ప్రతిసారీ బెయిల్ పొందడం కోసం న్యాయస్థానంలో, ఇతర సదుపాయాల కోసం ఆయా విభాగాల దగ్గర ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టు అయినప్పుడు చివరి స్పెల్లింగ్ (వైవైఏ) అంటూ, మరోసారి చిక్కినప్పుడు దీన్ని (ఐఏహెచ్)గా రాస్తూ బురిడీ కొట్టిస్తుంటారు. ఈ తరహా కేటుగాళ్ళ సంఖ్య పెరిగినట్లు తేలడంతో పోలీసు విభాగం ‘360 డిగ్రీస్ వ్యూ’కు సమకూర్చుకుంది. పబ్లిక్ డేటాబేస్లు ఏకతాటిపైకి... ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించిన అరెస్టైన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లైసెన్స్, రేషన్‌కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. సమాచారం కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న వరకు పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి సదరు వ్యక్తి ‘పేర్లు’ మార్చుకున్నా ఆ వివరాలన్నింటికీ అందిస్తుంది. అదే విధంగా ఆ వ్యక్తి పేరుతో ఉన్న ఇతర వాహనాలు, సిమ్‌కార్డులు తదితరాలకు సంబంధించిన వివరాలనూ అందిస్తుంది. ఇందులో సెర్చ్ చేయడం ద్వారా రంగారెడ్డికి చెందిన కొంత కీలక సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంగ్రహించగలిగారు. మరో రెండు బ్యాంకులకు లేఖలు... కర్మన్‌ఘాట్‌లో షెల్ కంపెనీ ఏర్పాటు చేసిన రంగారెడ్డి అండ్ కో అందులో 41 మంది పని చేస్తున్న ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. వీటితో పాటు నకిలీ పత్రాలు, ధ్రువీకరణల ఆధారంగా నాలుగు బ్యాంకులకు క్రెడిట్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ నుంచి 48 కార్డులు తీసుకుని రూ.45.72 లక్షలు, ఎస్బీఐ నుంచి 33 కార్డులు తీసుకుని రూ.25.29 లక్షలు, స్టాండర్డ్ చార్టర్డ్ నుంచి 41 కార్డులు తీసుకుని రూ.77.9 లక్షలు, ఆర్బీఎల్ బ్యాంకు నుంచి 3 కార్డులు తీసుకుని రూ.3.26 లక్షలు స్వైపింగ్ ద్వారా కాజేశారు. లిమిట్ ముగిసే వరకు వాడేసి ఆపై కార్డుతో పాటు దానికి లింకు చేసిన సిమ్కార్డునీ పారేయడం ఈ నిందితుల నైజం. డిఫాల్ట్ అయిన కార్డుదారుల వివరాల కోసం ప్రయత్నించిన బ్యాంకు యాజమాన్యాల్లో రెండు ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయాయి. కేవలం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ మాత్రమే ఫిర్యాదు చేశాయి. మిగిలిన రెండు బ్యాంకులకూ అధికారిక సమాచారం ఇచ్చి వారూ ఫిర్యాదు చేసేలా చేయడానికి పోలీసు విభాగం లేఖలు రాస్తోంది. ‘అరుదైన’ నెలలోనే చిక్కాడు... 2013–2015 మధ్య రెండేళ్ళ పాటు స్కామ్ చేసి, ఆపై రెండేళ్ళకు పైగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డి ‘అరుదైన నెల్లో’నే చిక్కాడు. రంగారెడ్డి తన ఫేస్బుక్ పేజ్‌లో 2015 ఫిబ్రవరి 17న ఓ పోస్ట్ పెట్టారు. దీని ప్రకారం ఆ నెల అత్యంత అరుదైనదిగా అందులో పేర్కొన్నాడు. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి వారం నాలుగుసార్లు వస్తోందని, ఇలా 823 సంవత్సరాలకు ఓసారి జరుగుతుందని, అందుకే ఈ నెల అరుదైందని వ్యాఖ్యను జోడించారు. సీన్ కట్ చేస్తే 2018 వరకు పుట్టగొడుగు రైతు ముసుగులో అజ్ఞాతంలో ఉండిపోయిన రంగారెడ్డి ఫిబ్రవరి నెల్లోనే చిక్కాడు. బోగస్ వ్యక్తుల పేర్లు, నకిలీ చిరునామాలతో రంగారెడ్డి గ్యాంగ్ క్రెడిట్‌కార్డుల కోసం అప్లై చేసుకుంది. వాస్తవానికి వీటిని డెలివరీ చేసే కొరియర్ బాయ్స్ అధికారిక చిరునామాలోనే అందించాలి. అయితే వారినీ ప్రలోభాలకు గురి చేసిన రంగారెడ్డి తనకే డెలివరీ చేసేలా చేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు ఆయా కొరియర్ బాయ్స్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. -
భూ వివాదాలను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో రెండో దశ ప్రారంభం కానుంది. తొలి, రెండో విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల గ్రామాల్లో సర్వే నంబర్లవారీ భూ రికార్డుల పరిశీలన కొనసాగుతుండగా ఇందులో గుర్తించిన తప్పొప్పులు, వివాదాలను పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆన్లైన్లో నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేశారు. అయితే తొలి విడత పరిష్కార ప్రక్రియలో కూడా తేలని, అత్యంత వివాదాస్పదమై సర్వే అవసరమైన భూ రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25% తప్పొప్పులు సరి చేసే అవకాశం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 లక్షలకుపైగా సర్వే నంబర్లలోని 39 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అందులో కోర్టు కేసులున్నవి, పట్టాదారుల పేర్లు సరిపోలనివి, చనిపోయిన పట్టాదారుల పేర్లున్నవి, పట్టాదారుల పేర్లలో అచ్చు తప్పిదాలున్నవి, ఆన్లైన్లో నమోదుకాని మ్యుటేషన్లు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములున్నవి, సర్వే నంబర్లలో తప్పిదాలున్నవి, ఇతర తప్పిదాలున్న సర్వే నంబర్లు 8 లక్షలకుపైగానే ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలు, ఫౌతి చేయాల్సినవి, పట్టాదారుల పేర్లు మార్చాల్సిన వాటిని రెవెన్యూ యంత్రాంగమే రికార్డులు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సరి చేయవచ్చు. కానీ పట్టాదారుల పేర్ల మార్పిడిలో వివాదాస్పదమైన భూములు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములను సరిచేయాలంటే కొంత కసరత్తు అవసరం. ఆ కసరత్తును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అన్ని సర్వే నంబర్లవారీ ప్రక్షాళన పూర్తయిన తర్వాత అన్ని తప్పులనూ ఒకేసారి సవరించేకన్నా రెండు ప్రక్రియలు సమాంతరంగా కొనసాగితే సమయం ఆదా అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే రికార్డుల పరిష్కార ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని, తాము సూచించిన ఫార్మాట్లో, ఆర్ఓఆర్ చట్టాలకు అనుగుణంగానే పూర్తి చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాం గానికి సూచించింది. ఇందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను కూడా శనివారం నుంచే అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన సర్వే నంబర్లలోని సమస్యల పరిష్కారం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు గుర్తించిన తప్పొప్పులు 29 శాతం ఉండగా అందులో 20–25 శాతం వరకు సరిచేయగలమని గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. కోర్టు కేసులున్న భూములను మినహాయిస్తే 1–2 శాతం భూముల రికార్డుల ప్రక్షాళనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్టు రెవెన్యూ వర్గాలంటున్నాయి. డిసెంబర్ 15–31 వరకు సంక్లిష్ట రికార్డుల సవరణ... వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళన నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. అయితే డిసెంబర్ 15 వరకే రికార్డుల పరిశీలన చేపట్టి మిగిలిన 15 రోజులపాటు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. అయితే సాధారణ సమస్యల పరిష్కారం ఇప్పుడే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంక్లిష్టంగా ఉన్న రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాలకు సూచించింది. సర్వే అవసరమైన భూములు, ప్రైవేటు వ్యక్తుల మధ్య తీవ్ర విభేదాలున్న భూములను అప్పుడు పరిష్కరించాలని ఎస్పీ సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. -
ప్రజల వద్దకే ప్రజావాణి
పారదర్శకంగా ఫిర్యాదుల పరిష్కారం నేటి నుంచి మండల, డివిజన్ స్థారుులో గ్రీవెన్ససెల్ మరో 20రోజుల్లో అమలులోకి నూతన సాఫ్ట్వేర్ {పతీ శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి హన్మకొండ : ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. తద్వారా జిల్లా కలెక్టర్లు ప్రతీ అంశంపై నేరుగా దృష్టి సారించే అవకాశం కలుగుతోంది. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చి ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో అర్జీలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ విధానంలో ప్రజలకు సమయం వృథా కావడంతో పాటు వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజావాణిని ప్రజల చెంతకే తీసుకువెళ్లేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడే దరఖాస్తులు జిల్లా నలుమూలల్లో ఏ గ్రామం వారైనా తమ సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులను ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిందే. ఇది ఇప్పటి వరకు కొనసాగుతున్న విధానం. ఈ విధానంలో ప్రజలు ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వీరి వెతలు తీర్చేందుకు మండల, డివిజన్ స్థారుులోనే ప్రజావాణి నిర్వహిస్తూ అక్కడే ప్రజలు దరఖాస్తులు ఇచ్చేలా కలెక్టర్ పాటిల్ సరికొత్త వ్యవస్థకు తెరతీశారు. ఈ విధానంలో డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కలెక్టరేట్ మాదిరిగానే ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తారు. అరుుతే, అక్కడ అందే ప్రతీ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ నేరుగా నజర్ పెట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. కాలపరిమితితో పరిష్కారం డివిజన్, మండల స్థారుులో నిర్వహించే గ్రీవెన్‌ససెల్‌లో అందేలా ప్రతీ ఫిర్యాదును కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగే, ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఒకవేళ పరిష్కరించినా, పరిష్కరించలేకున్నా దానికి గల కారణాలను ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ మరో 20 రోజుల్లో అందుబాటులోకి రానుంది. కాలపరిమితితో సమస్యలు పరిష్కరించడం, పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు ప్రజలు వ్యయప్రయాసాలకు లోనుకాకుండా చూడడం ఈ నూతన విధానం వెనుక ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ప్రతీ సోమవారం ప్రజావాణి మండల, డివిజన్ స్థారుులోనే పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్ణరుుంచారు. ఈ సోమవారం(నేడు) నుంచే ఇది అమలులోకి రానుంది. ప్రతీ దరఖాస్తుపై ఆయా విభాగం అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పరిశీలించేలా సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచనున్నారు. వీటి పురోగతిని కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించనుండడంతో అధికారుల్లో జవాబుదారీ పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఆ బాధను కళ్లారా చూశా.. అందుకే ఈ యాప్
లక్షలమంది ఐ ఫోన్ యూజర్లను అవయవ దానానికి ప్రోత్సహించడానికి యాపిల్ కొత్త సాప్ట్ వేర్ ను తీసుకొచ్చింది. అవయవ దానాన్ని తేలికగా చేయడానికి యాపిల్ తన హెల్త్ యాప్ సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. అప్ డేట్ చేసిన ఈ హెల్త్ యాప్ ను ఐఓఎస్ 10 యూజర్లందరికీ అందుబాటులో ఉంచనుంది. ఈజీ సైన్-అప్ బటన్ తో ఆర్గాన్ లు డొనేట్ చేసేలా కంపెనీ ఆ యాప్ ను రూపొందించింది. ఈ నెలలో లిమిటెడ్ గా ఈ కొత్త సాప్ట్ వేర్ ను యాపిల్ విడుదల చేయనుంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అవయవ దాత కొరత ఇబ్బందిని, ఈ యాప్ ద్వారా యాపిల్ తగ్గించగలదని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, 2009లో లివర్ మార్పిడికి, అవయవం దొరకక ఎంతో బాధను భరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన స్నేహితుడు ఎంతగా బాధపడ్డాడో కళ్లారా చూశానని, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని కుక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను లివర్ దానం చేస్తానన్న స్టీవ్ జాబ్స్ అంగీకరించలేదని తెలిపారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో 2011లో జాబ్స్ చనిపోయారని, సరియైన సమయానికి అవయవ దాత దొరకక ఇబ్బందిపడుతున్న వారికి ఈ యాప్ ఎంతో సహకరించగలదని టిమ్ కుక్ చెప్పారు. ఆన్ లైన్ లావాదేవీలన్నింటికీ స్మార్ట్ ఫోన్లు వాడే యువతకు, ఈ కొత్త సైన్-అప్ విధానంతో అవయవాలు దానం చేయడం కూడా సులభతరం అవుతుందని అన్నారు. 2014లో యాపిల్ ఐఫోన్ యూజర్లకు హెల్త్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ టూల్ తో యూజర్ల హెల్త్, ఫిట్ నెస్ డేటాను రికార్డు చేసుకునేలా పొందుపరిచింది. అయితే ప్రస్తుతం అప్ డేట్ చేసిన ఈ యాప్ తో, ఆర్గాన్ డొనేషన్ సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. అవయవ దాతగా నమోదు చేసుకున్న యూజర్ల సమాచారం, డొనేట్ లైఫ్ అమెరికాను నిర్వహిస్తున్న నేషనల్ డొనేట్ రిజస్ట్రీకి వెళ్తుంది. ఎవరికైనా అవయవం కావాల్సి వస్తే, ఫోన్ లాక్ లో ఉన్నా సరే ఎమర్జెన్సీ సమాచారంగా ఫోన్ పై డిస్ ప్లే అవుతుంది. ప్రస్తుతం డెవలపర్స్ బీటా ఐఓఎస్ 10 యూజర్లకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మరింత వ్యాప్తి చేయడానికి కొత్త ఐఓఎస్ వెర్షన్ కంపెనీ ఆవిష్కరించనుంది. అమెరికాలో 12వేలకు పైగా ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం అవయవదానానికి వేచిచూస్తున్నారు. వారిలో అవయవం అందక రోజుకు సగటున 22 మంది చనిపోతున్నారు. -
అణ్వాయుధ పరీక్షలను ఇట్టే పట్టేస్తుంది!
వాషింగ్టన్: ఇటీవల ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతర్జాతీయంగా భూప్రకంపనలను కొలిచే సమగ్ర అణ్వాయుధ పరీక్షల నిరోధ ఒప్పంద సంస్థ (సీటీబీటీవో) కొరియా దుందుడుకు చర్యను అందరికంటే ముందే ప్రపంచానికి వెల్లడించింది. అప్పటివరకు ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించినట్టు ప్రపంచానికి తెలియలేదు. అయితే, సీటీబీటీవో పెద్ద ఎత్తున జరిగే అణు పరీక్షలను మాత్రమే గుర్తించగలదు. మరీ ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు చిన్నస్థాయిలో చేపట్టే అణ్వాయుధ పరీక్షలను గుర్తించేది ఎలా? అంటే.. అందుకు సమాధానంగా తాజాగా శాస్త్రవేత్తలు ఓ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు అక్రమంగా నిర్వహించే చిన్నపాటి అణ్వాయుధ పరీక్షలను సైతం ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఏ అణ్వాయుధ పరీక్ష కూడా ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా జరుగకూడదన్న సీటీబీటీవో పిలుపునకు అనుగుణంగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ సడర్త్ ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సీస్ మిక్ అనలసిస్ (విసా) పేరిట రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ గుర్తించడానికి వీలులేకుండా చిన్నస్థాయిలో జరిగే అణ్వాయుధ పరీక్షలను సైతం గుర్తిస్తుంది. -
ఐటీ డిజిటల్ సంతకాలకు కొత్త సాఫ్ట్ వేర్
న్యూఢిల్లీ: డిజిటల్ సంతకాలతో కూడిన ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సులభతరంగా ఉండేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్తో ఐటీ రిటర్నులు అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రస్తుత ఈ-ఫైలింగ్ విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన దరిమిలా కొత్తది రూపొందించినట్లు వివరించింది. లేటెస్టు బ్రౌజర్లు భద్రతాపరమైన కారణాల రీత్యా కొన్ని ప్లగ్ఇన్ లను అనుమతించకపోవడం వల్లే ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో సమస్యలు వస్తున్నాయని సీబీడీటీ పేర్కొంది. గూగుల్ క్రోమ్, మోజిల్లా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ల లేటెస్టు వెర్షన్లలో ఈ-ఫైలింగ్ వెబ్సైటు సరిగ్గా పనిచేయలేకపోతోందని వివరించింది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పన్ను చెల్లింపుదారులు తమ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుని డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం ఉపయోగించవచ్చని సీబీడీటీ తెలిపింది. డిజిటల్ సంతకం చట్టం అమల్లో ఉన్న కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పన్ను రిటర్నుల ఈ-ఫైలింగ్ దాదాపు 27 శాతం ఎగిసింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 3.09 కోట్ల రిటర్నులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలయ్యాయి. -
అక్రమాలకు చెక్.. ఇక కొత్త సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్లు!
శ్రీకాకుళం సిటీ: రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త రోజులొస్తున్నాయి. గత విధానాలకు చెక్ పెడుతూ కొత్తగా తయారుచేసిన సాఫ్ట్వేర్ విధానాన్ని విధుల్లో అమలు చేసేందుకు ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. దేశంలో ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్లు చేయించుకునే ఆన్లైన్ విధానం అమలు చేయవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా..సౌకర్యవంతమైన సేవలు ఇక అందనున్నాయి. అలాగే ఈ కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియల్లో ఇక అక్రమాలకు చెక్ పడనుండడంతో క్రయ విక్రయ దారుల్లో అందోళనలు తొలిగినట్లే. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో పాత సాఫ్ట్‌వేర్‌ను మార్చేస్తూ, కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు కోసం ఈనెల 1 నుంచి 6 వతేది వరకు అన్ని చోట్లా.. రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి అంటే ఈనెల 7 నుంచి కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్‌తోనే రిజిస్ట్రేషన్లు, సేవలు క్రయవిక్రయదారులకు అందనున్నాయి. దసరా ముందు కావడంతో అవస్థలు.. రిజిస్ట్రేన్ల శాఖకు దసరా పండుగ అంటే పూర్తి డిమాండ్ ఉన్న కాలం. ఈసమయంలోనే భూముల క్రయ విక్రయాలు, బహుమతుల కింద ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాలు జిల్లాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. అయితే కొత్త సాఫ్ట్వేర్ మార్పు కారణంగా ఇలా వరుసగా ఆరు రోజులు రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో క్రయ విక్రయదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి కొత్త వ్యాపారాలు ప్రారంభం కోసం ఆస్తుల అమ్మకాలు, విక్రయాలు చేసే అవకాశాలుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొత్త సాఫ్ట్‌వేర్‌తో మరిన్ని సౌకర్యవంతమైన అవకాశాలుండడంతో కొంతమంది సంతృప్తి వ్యక్తపరుస్తుంటే.. పండుగ ముందు ఇలా చేయడం తగదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే గత నెల 30 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈనెల 6 వరకు వరుసగా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో, ఈనెల 7 నుంచి ఈతాకిడి అధికంగా ఉండే అవకాశముంది. అయితే ఈమేరకు ప్రత్యేక చర్యల ద్వారా రిజిస్ట్రేషన్లను వేగవంతం చేస్తే కాస్తా వెసలుబాటుగా ఉంటుందని క్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. ఇక తెలుగులోనే ఈసీలు కొత్త సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి రానుండడంతో భూముల లావాదేవీల వివరాలు తె లిపే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు (ఈసీ) ఇక తెలుగులోనే ఇవ్వనున్నారు. దీంతో ఇంతవరకు ఇంగ్లిష్‌లో ఈసీల కష్టాలు తొలిగిపోనున్నాయి. అలాగే ‘మీసేవ’ వంటి ఆన్లైన్ సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. అలాగే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇకపై ఇ-పాస్ పుస్తకాలుగా అందించనున్న దృష్ట్యా ఇటు రెవెన్యూ శాఖ, అటు రిజిస్ట్రేషన్ల శాఖలకు మధ్య ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఈకొత్త సాఫ్ట్వేర్ కల్గించనుంది. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లోనూ ఈకొత్త సాఫ్ట్వేర్ విధానం అమల్లోకి రానుండడంతోనే ఈనెల 6 వరకు రిజిస్ట్రేషన్ల సేవలు నిలుపుదల చేసామని, ఈనెల 7 నుంచి పూర్తి స్థాయిగా తమ శాఖ సేవలు అందిస్తామని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ బి.సూర్యనారాయణ తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్పారు. సిబ్బంది బదిలీ అలాగే జిల్లాలో శాఖ సిబ్బందికి బదిలీలకు ఈనెల 1న కౌన్సెలింగ్ చేశామని, ఈమేరకు మొత్తం 8 మంది జూనియర్ అసిస్టెంట్లను, ఒక షరాఫ్‌ను, 6 గురు అటెండర్లను బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఆదేశాలు అందిన రోజే దాదాపుగా సిబ్బంది అంతా రిలీవ్ అయి కొత్త స్థానాల్లో విధుల్లో చేరిపోయారని, అలా చేరని వారుంటే మాత్రం ప్రభుత్వ ఆదేశాలమేరకు జన్మభూమి కార్యక్రమం ముగింపు అంటే ఈనెల 21 తర్వాతే కొత్త బదిలీ స్థానంలో విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. -
రుణమాఫీ అమలుకు కొత్త సాఫ్ట్ వేర్!
హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ ను రూపొందిస్తుంది. లబ్దిదారుల ఎంపికకు ఏపీ సర్కార్ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకోనున్నదని అధికారులుత తెలిపారు. డబుల్ ఎంట్రీలు, నకిలీ లబ్దిదారులను ప్రభుత్వం రూపొందించే సాఫ్ట్ వేర్ ద్వారా ఏరివేస్తామంటుని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈనెల 15 తర్వాత లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రుణమాఫీ అమలుకు 6వేల కోట్లు సర్కార్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి రుణాల వివరాలు సమర్పించిన ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్, మిగిలిన బ్యాంకులకు 15 వరకు గడువు ఇస్తారని, వాయిదాల పద్దతిలో చెల్లింపులు చేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం.