ప్రజల వద్దకే ప్రజావాణి
పారదర్శకంగా ఫిర్యాదుల పరిష్కారం
నేటి నుంచి మండల, డివిజన్ స్థారుులో గ్రీవెన్‌ససెల్
మరో 20రోజుల్లో అమలులోకి నూతన సాఫ్ట్‌వేర్
{పతీ శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
హన్మకొండ : ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. తద్వారా జిల్లా కలెక్టర్లు ప్రతీ అంశంపై నేరుగా దృష్టి సారించే అవకాశం కలుగుతోంది. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చి ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో అర్జీలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ విధానంలో ప్రజలకు సమయం వృథా కావడంతో పాటు వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజావాణిని ప్రజల చెంతకే తీసుకువెళ్లేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
ఎక్కడికక్కడే దరఖాస్తులు
జిల్లా నలుమూలల్లో ఏ గ్రామం వారైనా తమ సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులను ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిందే. ఇది ఇప్పటి వరకు కొనసాగుతున్న విధానం. ఈ విధానంలో ప్రజలు ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వీరి వెతలు తీర్చేందుకు మండల, డివిజన్ స్థారుులోనే ప్రజావాణి నిర్వహిస్తూ అక్కడే ప్రజలు దరఖాస్తులు ఇచ్చేలా కలెక్టర్ పాటిల్ సరికొత్త వ్యవస్థకు తెరతీశారు. ఈ విధానంలో డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కలెక్టరేట్ మాదిరిగానే ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తారు. అరుుతే, అక్కడ అందే ప్రతీ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ నేరుగా నజర్ పెట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.
కాలపరిమితితో పరిష్కారం
డివిజన్, మండల స్థారుులో నిర్వహించే గ్రీవెన్‌ససెల్‌లో అందేలా ప్రతీ ఫిర్యాదును కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగే, ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఒకవేళ పరిష్కరించినా, పరిష్కరించలేకున్నా దానికి గల కారణాలను ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ మరో 20 రోజుల్లో అందుబాటులోకి రానుంది. కాలపరిమితితో సమస్యలు పరిష్కరించడం, పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు ప్రజలు వ్యయప్రయాసాలకు లోనుకాకుండా చూడడం ఈ నూతన విధానం వెనుక ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ప్రతీ సోమవారం ప్రజావాణి మండల, డివిజన్ స్థారుులోనే పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్ణరుుంచారు. ఈ సోమవారం(నేడు) నుంచే ఇది అమలులోకి రానుంది. ప్రతీ దరఖాస్తుపై ఆయా విభాగం అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పరిశీలించేలా సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచనున్నారు. వీటి పురోగతిని కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించనుండడంతో అధికారుల్లో జవాబుదారీ పెరుగుతుందని భావిస్తున్నారు.