2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్‌లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్‌ల వినియోగదారులున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా.
చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే!
ఫీచర్ ఫోన్‌లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్‌పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు (రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోటీ ఈ నెల 12న ముగియనుంది. విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment