Online payments
-
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్‌వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
నగదు మాత్రమే ఇవ్వండి
జేబులో డబ్బులు పెట్టుకోవడం జనం మానేశారు. ఖర్మగాలి ఫోన్ పే పని చేయకపోతే తెల్లముఖాలు వేస్తున్నారు. నగదు లావాదేవీల వల్ల ఎంత ఖర్చవుతున్నదో ఎంత మిగిలి ఉన్నదో తెలిసేది. కాని ఆన్లైన్ పేమెంట్లకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆటో నడిపే ఒక పెద్దాయన తన ఆటోలో పెట్టిన నోటీస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. నగదు అవసరాన్ని గుర్తు చేసే పోస్ట్ ఇది. ‘జీ పే చేయొద్దు. డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం దగ్గర ఆపమని అడగొద్దు’ అని చెన్నైలో ఒక ఆటోబాబాయ్ పెట్టిన బోర్డు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. గతంలో అందరి దగ్గర డబ్బులుండేవి. ఆటో ఎక్కినా దిగినా డబ్బు ఇచ్చి బేరం ముగించేవారు. ఇప్పుడు అందరూ జీపే, ఫోన్‌పే చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ ‘నగదు మాత్రమే’ అనే బోర్డులు ఉన్నాయి. దానికి కారణం డిజిటల్ లావాదేవీల్లో ఏదైనా మోసం జరుగుతుందేమోనని. ఈ ఆటోబాబాయ్కి కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. లేదా ఎక్కిన వారు జీపే పని చేయకపోతే ఏటీఎం దగ్గరకు వెళదామని టైమ్ వేస్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే స్పష్టంగా ‘ఏటీఎం దగ్గర ఆటో ఆపమని అడగొద్దు’ అంటూ బోర్డ్ పెట్టాడు. చెన్నైలో ఇతని ఆటో ఎక్కిన మహిళ ఈ బోర్డును ఫొటో తీసి ‘ఎక్స్’లో పెడితే ఇంటర్నెట్లో మంచి డిబేట్ నడిచింది. ‘ఇలాగైతే ఎలా’ అని కొందరంటే ‘బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ పేమెంట్ల వల్ల ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి?’ అని కొందరు ప్రశ్నించారు. చివరకు ఆటో ఎక్కిన మహిళ తన అ΄ార్ట్‌మెంట్ దగ్గర దిగి, సెక్యూరిటీ దగ్గర అప్పు తీసుకుని ఆటో బాబాయ్‌కి చెల్లించి బతుకు జీవుడా అనుకుంది. -
పంచాయతీల్లో..ఆన్ లైన్ పేమెంట్
-
డబ్బులెందుకు.. ఫోన్ ఉంటే చాలు..
సాక్షి, అమరావతి: బడ్డీ కొట్టులో రూపాయి చాక్లెట్ కొన్నా.. ఇంట్లోనే కూర్చొని టికెట్లు బుక్ చేయాలన్నా.. గ్యాస్, కరెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నా.. అన్నింటికీ ప్రజలు ఇప్పుడు ‘యూపీఐ’ యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. చివరకు భిక్షాటనలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లనే ఉపయోగించేస్తున్నారు. అన్నింటికీ పేమెంట్ యాప్‌లతోనే చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్ల నుంచి జనం చేతుల్లో క్యాష్ తక్కువైపోయి.. స్కానింగ్ ఎక్కువైపోయింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వాడే ఒక వాహకం. దీని ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చాలా సులవుగా, వేగంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్‌ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసే అవకాశముండటంతో.. దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజలు బ్యాంకులకు వెళ్లి.. గంటల పాటు వేచి చూసే శ్రమ కూడా తప్పింది. సమయం కూడా ఆదా అవుతోంది. వేగంగా వృద్ధి.. ‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ ఎంతో వేగంగా వృద్ధి చెందాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక టాప్–10 డౌన్లోడెడ్ యాప్స్‌లో నాలుగు, ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి. ఆదమరిస్తే అంతే.. డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది. యూపీఐ పేమెంట్స్‌పై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మడం వల్ల చాలామంది మోసపోతున్నారు. లాటరీ తగిలిందని.. మీ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండని, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అదృష్టం వరిస్తుందని.. ఇప్పుడు కొత్తగా మా వీడియోలను చూస్తే చాలు, సోషల్ మీడియాలో లైక్ కొడితే చాలు డబ్బులిస్తామంటూ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి.. వన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ), యూపీఐ పిన్ నంబర్లు తెలుసుకొని డబ్బులు లాగేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే.. పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తుండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను తెరవకూడదు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. ఎవరికీ ఎలాంటి సందర్భంలోనూ ఓటీపీ చెప్పకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మోసాల నుంచి తప్పించుకోవచ్చు. -
జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? ఆర్డర్ పెట్టిన ఫుడ్‌కు ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా? లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటున్నారా? చేస్తే చేశారు కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి. సీవోడీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు ఆదా చేసుకోవచ్చు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫుడ్ ఆగ్రిగేటర్‌కు చెందిన డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు. అందులో ఓ కస్టమర్ డెలివరీ బాయ్ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట్లో వైరల్‌గా కాగా.. సదరు కంపెనీ సీఈవో స్పందించారు. సంస్థలోని లోపాల్ని సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తరాఖండ్ చెందిన ఎంట్రప్రెన్యూర్ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్ తెచ్చిన ఆ డెలివరీ బాయ్.. వినయ్‌తో.. ‘ సార్ నెక్ట్స్ టైం నుంచి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. ఎందుకుంటే? మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఖరీదు రూ.700 నుంచి రూ.800 ఉంటే.. క్యాష్ ఆన్ డెలివరీలో కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. మీరు నాకు రూ.200, రూ.300 ఇచ్చి రూ.1000 ఖరీదైన ఫుడ్‌ను ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ సెలవిచ్చాడు. దీంతో షాక్ తిన్న వినయ్ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిఇన్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో...జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్బంప్స్ వచ్చాయి. ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్ఘతం చేయాలా? అని ప్రశ్నించారు. నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నా. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్ పై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి పోస్ట్‌పై జొమాటో సీఈవో స్పందన చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
బిల్‌డెస్క్‌కు భారీ షాక్, రూ. 38,400 కోట్ల కొనుగోలు డీల్ రద్దు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ చెల్లింపుల కంపెనీ బిల్‌డెస్క్ కొనుగోలు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రోజస్ ఎన్వీ తాజాగా పేర్కొంది. 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 38,400 కోట్లు) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ నిర్వాహక సంస్థ ప్రోజస్ ఎన్వీ వెల్లడించింది. డీల్‌కు సంబంధించి గడువులోగా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని తెలియజేసింది. సెప్టెంబర్ ముగిసేలోగా ముందుగా చేసుకున్న కొన్ని ఒప్పంద పరిస్థితులను చేరుకోలేకపోవడంతో తాజా నిర్ణయానికి వచ్చినట్లు డచ్ ఈ–కామర్స్ దిగ్గజం ప్రోజస్ వివరించింది. అయితే ఈ డీల్‌కు సెప్టెంబర్ 5న కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు లభించినప్పటికీ ఏ ఇతర పరిస్థితులు అడ్డుపడ్డాయో వివరించకపోవడం గమనార్హం! డీల్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఆటోమేటిక్‌గా రద్దుకానున్నట్లు కూడా ప్రోజస్ వెల్లడించింది. భారీ కంపెనీగా బిల్‌డెస్క్‌ను పేయూ సొంతం చేసుకుని ఉంటే వార్షికంగా 147 బిలియన్ డాలర్ల విలువైన పరిమాణం(టీపీవీ) ద్వారా డిజిటల్ చెల్లింపుల దిగ్గజంగా ఆవిర్భవించి ఉండేది. ప్రత్యర్థి సంస్థలు రేజర్‌పే 50 బిలియన్ డాలర్లు, సీసీఎవెన్యూ(ఇన్ఫీబీమ్) 18–20 బిలియన్ డాలర్ల టీపీవీ కలిగి ఉన్నట్లు అంచనా. డీల్ పూర్తయిఉంటే ప్రోజస్ చేపట్టిన అతిపెద్ద కొనుగోలుగా నిలిచేది. కాగా.. గతేడాది ఆగస్ట్ 31న బిల్‌డెస్క్ కొనుగోలుకి ప్రోజస్ నగదు రూపేణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఫిన్‌టెక్ రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కేది. దేశంలో పెట్టుబడులు ప్రోజస్ మాతృ సంస్థ నేస్పర్స్ 4.5 లక్షల బిజినెస్‌లకు 100 రకాలకుపైగా చెల్లింపుల విధానాలలో సేవలు అందిస్తోంది. ప్రోజస్ ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. స్విగ్గీ, ఫార్మ్ఈజీ తదితర టెక్నాలజీ కంపెనీలలో 6 బలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇక బిల్‌డెస్క్‌ను ఆర్థర్ ఆండర్సన్, ఎంఎన్ శ్రీనివాసు, అజయ్ కౌశల్– కార్తిక్ గణపతి 2000లో ఏర్పాటు చేశారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఊపందుకుంది. ఇది కంపెనీ పురోభివృద్ధికి సహకరించింది. డీల్ సాకారమైతే వ్యవస్థాపకులు ఒక్కొక్కరికీ 50 కోట్ల డాలర్ల చొప్పున లభించి ఉండేవి. బిల్‌డెస్క్‌లో జనరల్ అట్లాంటిక్ 14.2 శాతం, టీఏ అసోసియేట్స్ 13.1 శాతం, వీసా 12.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ముగ్గురు ప్రమోటర్లకు దాదాపు 30 శాతం వాటా ఉంది. -
కరోనా తర్వాత ఆన్లైన్ వైపే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ తర్వాత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపే ధోరణి గణనీయంగా పెరిగిందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో రామ్మోహన్ రావు అమర తెలిపారు. తమ క్రెడిట్ కార్డుదారుల లావాదేవీల్లో దాదాపు 55 శాతం పైగా ఇవే ఉంటున్నాయని ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కార్డుల వినియోగం, సగటున కార్డుపై చేసే వ్యయాలు భారీగా ఉంటోందని రామ్మోహన రావు తెలిపారు. సాధారణంగా జూన్ త్రైమాసికం కాస్తంత డల్‌గా ఉంటుందని, కానీ ఈసారి కార్డుల ద్వారా ఖర్చు చేసే ధోరణి గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాబోయే పండుగ సీజన్లో కూడా ఇదే ధోరణి కనిపించవచ్చని ఆశిస్తున్నట్లు రామ్మోహన్ రావు తెలిపారు. కొత్తగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డును ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన ఈ విషయాలు వివరించారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కార్డుల వినియోగ ప్రయోజనాలను తర్వాత ఎప్పుడో అందుకోవడం కాకుండా తక్షణం లభించాలని వినియోగదారులు కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక విక్రేతకు మాత్రమే పరిమితం కాకుండా ఆన్లైన్లో చేసే కొనుగోళ్లన్నింటికీ సంబంధించి 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని పేర్కొన్నారు. తదుపరి బిల్లింగ్ స్టేట్మెంట్లో ఇది ప్రతిఫలిస్తుందని వివరించారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలకు నెలకు రూ. 10,000 మేర గరిష్ట పరిమితి ఉంటుందని రామ్మోహన్ రావు చెప్పారు. అటుపైన కూడా తగు స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తరహా కార్డును ఆవిష్కరించడం దేశీయంగా ఇదే తొలిసారని చెప్పారు ప్రత్యేక ఆఫర్ కింద 2023 మార్చి వరకూ దీన్ని ఎటువంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. టోకెనైజేషన్‌కు ఎస్బీఐ కార్డ్ రెడీ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, ఏదైనా డేటా లీకేజీకి వ్యతిరేకంగా భరోసా ఇవ్వడం పరంగా టోకెనైజేషన్ విధానం మెరుగైనదని రామ మోహన్ రావు తెలిపారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయని అక్టోబర్ నుండి ఈ విధానం ఎస్బీఐ కార్డ్ అమలు చేస్తుందని వెల్లడించారుకాగా, ఆన్లైన్ లేదా దుకాణాల్లో చెల్లింపుల సమయంలో కస్టమర్ తన కార్డు వివరాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు. స్మార్ట్‌ఫోన్ సహకారంతో డిజిటల్ టోకెన్ రూపంలో లావాదేవీ పూర్తి చేయవచ్చు. ప్రతి లావాదేవీకి టోకెన్ మారుతుంది. ఇది పూర్తిగా సురక్షితం. సైబర్ మోసానికి, డేటా చోరీకి ఆస్కారం లేదు. -
అమెరికాను మించిపోయిన్ భారత్.. ఆన్లైన్ @ 34.6 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్‌లో ఇంటర్నెట్’ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్‌లో 90 కోట్లను తాకుతుంది. యూపీఐ వినియోగం భేష్: ప్రధాని న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. -
క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా?
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారా....జేబులో డబ్బులు ఉంటేనే క్యాబ్ బుక్ చేసుకోండి. లేకుండా కష్టమే. చార్జీలు ఆన్లైన్లో చెల్లించవచ్చుననుకుంటే మీరు బుక్ చేసుకున్న క్యాబ్ మరో క్షణంలోనే రద్దయిపోవచ్చు. ఇది నిజమే. నగరంలో ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలకు అనుసంధానమై తిరుగుతున్న క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్లైన్, యూపీఐ చెల్లింపులకు నిరాకరిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్న మరుక్షణంలోనే డ్రైవర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. చార్జీలు నగదు రూపంలో చెల్లిస్తేనే వస్తామంటూ పేచీ పెడుతున్నారు. ఆన్లైన్లో చెల్లిస్తామంటే వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. దీంతో మరో క్యాబ్ కోసం, ఆటో కోసం తిరిగి మొబైల్ యాప్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. అలా గంటల తరబడి బుకింగ్‌ల కోసమే నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాలనుకొంటే కష్టమే. తీరా గమ్యం చేరుకున్న తరువాత చార్జీల చెల్లించేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు.’అని సీతాఫల్‌మండికి చెందిన సురేష్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వరకు క్యాబ్ బుక్ చేసుకొనేందుకు గంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చినుకు పడితే బండి కష్టమే... ఒకవైపు ఆన్లైన్ చెల్లింపులపైనా రైడ్‌కు డ్రైవర్లు నిరాకరిస్తుండగా ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు క్యాబ్ సంస్థలు సైతం ఉన్నపళంగా చార్జీలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా, ఏ కొంచెం వర్షం కురిసినా చాలు క్యాబ్ లభించడం కష్టంగా మారుతుంది. రద్దీ వేళల నెపంతో చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటే వర్షాన్ని సాకుగా చేసుకొని కొన్ని సంస్థలు రూ.550 నుంచి రూ.750వరకు పెంచేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను పెంచుకొనేందుకు కొన్ని క్యాబ్ సంస్థలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని రెగ్యులర్ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేస్తున్నారు. దీంతోపాటు సర్ చార్జీల రూపంలోనూ ప్రయాణకులపైన అదనపు వడ్డింపులకు పాల్పడడం గమనార్హం. ‘ప్రతికూలమైన వాతావరణం వల్ల త్వరగా ఇల్లు చేరాలంటే డిమాండ్ మేరకు చెల్లించక తప్పడం లేదు.’ అని అమీర్‌పేట్‌కు చెందిన నవీన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పారు. క్యాబ్ సంస్థల జాప్యం.. మరోవైపు నగదు చెల్లింపుల పైన డ్రైవర్ల వాదన మరో విధంగా ఉంది. క్యాబ్ సంస్థల ఖాతాలో పడే చార్జీలు తిరిగి తమ ఖాతాలోకి చేరేందుకు పడిగాపులు కాయవలసి వస్తుందని పేర్కొంటున్నారు. డ్రైవర్లు ప్రతి రోజు చేసే రైడ్‌లపైన క్యాబ్ సంస్థలు 30 శాతం వరకు కమిషన్ తీసుకొని మిగతా 70 శాతం వారి ఖాతాలో జమ చేయాలి. కానీ డ్రైవర్‌కు చెల్లించవలసిన డబ్బులు రెండు, మూడు రోజుల తరువాత మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తమ రోజువారీ అవసరాలకు కష్టమవుతుందని అంబర్‌పేట్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు ఖాతాలో జమ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బంది వస్తున్నట్లు చెప్పారు. -
అందరిదీ ఆన్లైన్ బాటే!
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులతో ఆన్లైన్లో కొనుగోళ్లు చేసే ధోరణి భారీగా పెరుగుతోంది. పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లో స్వైప్ చేయడంతో పోలిస్తే ఈ తరహా లావాదేవీలు మార్చిలో రూ. 30,000 కోట్ల పైగా అధికంగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం మార్చిలో 7.3 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆన్లైన్ కొనుగోళ్లపై రూ. 68,327 కోట్లు వెచ్చించారు. అదే పీవోఎస్ మెషిన్లలో స్వైపింగ్ చేయడం ద్వారా ఖర్చు చేసినది రూ. 38,377 కోట్లే. సంఖ్యాపరంగా చూస్తే ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 11 కోట్లుగాను, ఆఫ్‌లైన్ లేదా పీవోఎస్ మెషిన్ల ద్వారా లావాదేవీలు కాస్త ఎక్కువగా 11.1 కోట్లుగా నమోదయ్యాయి. తొలిసారిగా.. ఆర్బీఐ ఇలా ఆన్లైన్, పీవోఎస్ చెల్లింపుల గణాంకాలను వేర్వేరుగా విడుదల చేయడం ఇదే తొలిసారి. మార్చిలో మొత్తం మీద క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1,07,100 కోట్ల మేర కొనుగోళ్లు జరిగాయి. నగదు విత్‌డ్రాయల్స్ దాదాపు రూ. 343.71 కోట్లుగా ఉన్నాయి. 7.36 కోట్లకు క్రెడిట్ కార్డులు.. మార్చిలో కొత్తగా 19 లక్షల క్రెడిట్ కార్డులు జతవడంతో గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి మొత్తం సంఖ్య 7.36 కోట్లకు చేరింది. కొత్త కార్డుల జారీపై ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుహోల్డర్ల సంఖ్య అత్యధికంగా 1.67 కోట్ల స్థాయిలో నమోదైంది. ఎస్బీఐ (1.37 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (1.29 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదవండి: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్, టార్గెట్ ఎంతంటే? -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్‌లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్‌ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్‌లు, ఆటోలు ఠంచన్‌గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్‌లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్‌లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ) -
ఈ-కామర్స్‌కు ఆర్బీఐ పెద్దపీట! ఆన్లైన్ చెల్లింపులపై కీలక నిర్ణయం!
ముంబై: ఎగుమతులు–దిగుమతులు (ఎగ్జిమ్), ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్ధీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల ప్రక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్లైన్ ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ ప్రకటన సూచించింది. పరిమితులు ఇలా... 3,000 డాలర్లకు మించని విలువైన వస్తువులు, డిజిటల్ ఉత్పత్తులను ఆన్లైన్లో దిగుమతి చేసుకోవడానికి ఈ కామర్స్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఎగుమతుల విషయంలో ఈ విలువ 15,000 డాలర్ల వరకూ ఉంది. ప్రస్తుతం వస్తువులు, సేవల ఎగుమతులు, అలాగే వస్తువులు, సాఫ్ట్వేర్ల దిగుమతికి సంబంధించి చెల్లింపు ప్ర క్రియ నిర్వహించడానికి బ్యాంకింగ్‌కు అనుమతి ఉంది. దీనిప్రకారం ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే సర్వీ స్ ప్రొవైడర్లతో (ఓపీజీఎస్‌పీలు) స్టాండింగ్ కాంట్రాక్ట్‌లోకి ప్రవేశించడం ద్వారా దిగుమతి, ఎగు మతి సంబంధిత రెమిటెన్స్‌ల ప్రాసెసింగ్, సెటిల్మెంట్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. -
యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..!
యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై విదేశాల్లోని భారతీయులు జరిపే నగదు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ యూపీఐ నగదు లావాదేవీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ యూనియన్‌తో ఒప్పందం.. భారత నగదు చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) ప్రముఖ విదేశీ నగదు ట్రాన్స్ఫర్ సంస్థ వెస్ట్రన్ యూనియన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతరులు యూపీఐ పేమెంట్ యాప్స్‌ను ఉపయోగించి నగదు లావాదేవీలను జరపవచ్చునని ఎన్ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లాతో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్రన్ యూనియన్, పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో నివసిస్తోన్న 30 మిలియన్ల భారతీయులకు లబ్ధి చేకూరనుంది. మరింత సులువుగా..వేగంగా..! ఇతర దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతర వ్యక్తులు భారత్‌లోని యూపీఐ కస్టమర్లు నగదు లావాదేవీలను సులభంగా, వేగంగా జరుపవచ్చును. వెస్ట్రన్ యూనియన్ , యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్‌ల ద్వారా డబ్బు పంపించుకోవచ్చును. ఛార్జీలు ఏలా ఉంటాయంటే..! విదేశీ మార్కెట్లో రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిపే లావాదేవీలోని ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, అందుబాటులోని ఛానెల్‌లపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఎన్పీసీఐ , వెస్ట్రన్ యూనియన్ భాగస్వామ్యంతో ఆయా లావాదేవీల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్..! -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. సీఐఐ అభ్యర్థన మేరకే..! ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్లైన్ మర్చెంట్స్ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డ్‌లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..! -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల విషయంలో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌ను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. ఇకపై అన్ని వివరాలను గుర్తుంచుకోవాలి...! క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయా వెబ్సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో అంతకుముందే నిక్షిప్తమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇకపై నిక్షిప్తం కావు. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు నిర్వహించేటప్పుడు ఆయా వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో కొత్త ఏడాది నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా 16 అంకెల డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఇది వీలు కాకుంటే...టోకెనైజేషన్ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఆర్బీఐ 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది. చదవండి: ఎస్బీఐ బంపర్ ఆఫర్..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు అలర్ట్ ఐనా బ్యాంకులు..! వచ్చే ఏడాది నుంచి మారనున్న క్రెడిట్, డెబిట్ కార్డు రూల్స్ మారడంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇప్పటికే తమ ఖాతాదారులకు తెలియజేస్తోంది. టోకెనైజేషన్ అంటే..? ఆన్లైన్ లావాదేవీలను జరిపేటప్పుడు ఖాతాదారులు 16 అంకెల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను గుర్తుంచుకోకపోతే...టోకెనైజేషన్ విధానాన్ని వాడవచ్చును. ఈ విధానంలో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ ఎన్క్రిప్టెడ్ కోడ్‌ను బ్యాంకులు ఇస్తాయి. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. చదవండి: మార్కెట్క్రాష్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్ -
యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) రాకతో నగదు లావాదేవీలు మరింత సులభంగా మారాయి. బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పాన్ షాపు నుంచి మెడిసిన్స్ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూ ఆర్ కోడ్లను, అడ్రస్‌లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును. చదవండి: హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్‌గా రూ. 58 వేల కోట్లు స్వాహా..! 1. మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియనివారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా. ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు. 2. శక్తివంతమైన స్క్రీన్ లాక్‌ని సెట్ చేయండి మీరు వాడే గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌కు శక్తివంతమైన స్క్రీన్ లాక్‌ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్ ఆఫ్ బర్త్ను, మొబైల్ నంబర్ అంకెలను, స్క్రీన్ లాక్‌గా ఉంచకూడదు. మీ పిన్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి. 3. వేరిఫైకాని లింక్‌లపై క్లిక్ చేయవద్దు, నకిలీ కాల్స్‌ను హాజరుకావద్దు సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్ లింక్స్‌ను యూజర్లకు పంపిస్తున్నారు. యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్‌లను షేర్ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు. 4. ఎక్కువ యాప్స్ వాడకండి. ఆయా యూపీఐ పేమెంట్స్ యాప్స్ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ వాడడం మంచింది కాదు. 5. క్రమం తప్పకుండా యాప్స్‌ను అప్డేట్ చేయాలి. ఆయా యూపీఐ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్డేట్లు మెరుగైన UI , కొత్త ఫీచర్లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్‌లను తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది. చదవండి: ‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా తెలంగాణ..!’ -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్‌లెష్ పేమెంట్స్‌కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్‌లు యూపీఐ పేమెంట్స్‌కు అనుమతి ఇచ్చాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
డిజిటల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: ఆన్లైన్ విధానంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. బిల్లు వసూలు కేంద్రాలను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రతినెలా వచ్చే బిల్లులను వినియోగదారుడికి మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక మీదట తేలికగా డిస్కమ్ సైట్‌కు లింక్ అయ్యి, గేట్ వే ద్వారా బిల్లులు చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సులభం ► రాష్ట్రంలో 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.43,447 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు జరుగుతాయి. ఇందులో రూ.26,431 కోట్లు వినియోగదారుల నుంచి వసూలవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.3,102 కోట్లు, మిగతా మొత్తం ఇతర సబ్సిడీల రూపంలో డిస్కమ్‌ల ఖాతాల్లో చేరతాయి. ► ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ మీటర్లు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ.26,431 కోట్ల రెవెన్యూ సమస్యగా మారుతోంది. రెవెన్యూ కేంద్రాల నిర్వాహణకు డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఈ ఖర్చును తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. ► కరోనా నేపథ్యంలో రెవెన్యూ కేంద్రాలకు వెళ్లి బిల్లు కట్టే సంప్రదాయ వినియోగదారులు చెల్లింపులు ఆపేస్తున్నారు. ఎక్కువ సేపు లైన్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల డిస్కమ్‌ల రెవెన్యూ తగ్గిపోతున్నాయి. గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే దాదాపు 38 శాతం రెవెన్యూ వసూళ్లు తగ్గినట్టు తేలింది. ► క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అవసరమైతే గ్రామ సచివాలయం వలంటీర్లను ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ► మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పూర్తిస్థాయిలో ఆన్లైన్ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయిన గూగుల్ పే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్ టోకెన్‌తో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్ పే ఆన్‌డ్రాయిడ్ యూజర్లు ఈ డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు జరపవచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్తోపాటు ఆన్లైన్ లావాదేవీలూ దీని ఆధారంగా సులువుగా పూర్తి చేయవచ్చని కంపెనీ సోమవారం ప్రకటించింది. 3డీ సెక్యూర్ సైట్స్‌కు రీడైరెక్ట్ చేయకుండానే ఓటీపీతో ఈ–కామర్స్ లావాదేవీలు జరుపవచ్చు. ప్రస్తుతం యాక్సిస్, ఎస్బీఐ కార్డుదారులు ఈ సేవలు పొందవచ్చు. పెరుగుతున్న కస్టమర్లకు భద్రతతో కూడిన చెల్లింపులకు కట్టుబడి ఉన్నామని గూగుల్ పే బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు. మోసాలకు తావు లేకుండా డిజిటల్ టోకెన్ సాయపడుతుందని, కార్డు వివరాలు ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని అన్నారు. గూగుల్ పే భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు భద్రమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అందించేందుకు వీలైందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. -
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విస్తృతి కారణంగా దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. నగదుకు బదులుగా డిజిటల్, కాంటాక్ట్ రహిత చెల్లింపులకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ సర్వేలో తేలింది. పేస్ పల్స్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 2,000 మంది పాలుపంచుకున్నారు. 68 శాతం మంది ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ విధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. మహమ్మారి తదనంతరం కూడా ఈ విధానాన్నే అనుసరిస్తామని 51 శాతం మంది స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్యాష్, కార్డ్స్‌కు బదులుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను జరుపుతామని 48 శాతం మంది వెల్లyì ంచారు. మొబైల్ వాలెట్లతో.. భారత్‌లో మొబైల్ పేమెంట్ వాలెట్ల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో మొబైల్ వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 124.3 కోట్లు. మే నాటికి ఇది రెండింతలకుపైగా చేరి 253.2 కోట్లకు ఎగసింది. లావాదేవీల విలువ ఇదే కాలంలో రూ.2,836 కోట్ల నుంచి రూ.11,080 కోట్లకు చేరింది. సర్వేలో పాలుపంచుకున్న వారిలో 93 శాతం మందికిపైగా మొబైల్ వాలెట్లను వాడుతున్నారు. వీరిలో 24–39 ఏళ్ల వయసున్నవారే అధికం. చెల్లింపు అభిరుచులు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటాయని ఎఫ్ఐఎస్ ఎండీ మహేశ్ రామమూర్తి తెలిపారు. ఈ మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్ సంస్థలు, విక్రయదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా కరోన ప్రభావం.. ప్రజలపై కరోన ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధికి సంబంధించిన సమస్యలను 70 శాతం మంది ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా తమ జీతాల్లో కోత పడిందని 49 శాతం మంది తెలిపారు. ఉద్యోగాలు తాత్కాలికంగా కోల్పోయామని 20 శాతం, శాశ్వతంగా పోయిందని 10 శాతం మంది చెప్పారు. 20 శాతం మందికి పదోన్నతి, 18 శాతం మందికి వేతనం పెంపు, 23 శాతం మందికి బోనస్ వాయిదా పడిందని వివరించారు. ఆదాయం తగ్గితే ఆర్థికంగా మూడు నెలలకు మించి భారాన్ని తట్టుకోలేమని 48 శాతం మంది వెల్లడించారు. ఆర్థిక ముప్పు అధికంగా యువ జంటలకే ఉందని సర్వే తేల్చి చెప్పింది. మహిళలపైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది. -
గంటలు గడుస్తున్నా మందు రాకపోవడంతో..
ముంబై: లాక్డౌన్ సమయంలో ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు దోచేశారు. దాదాపు 83వేల రూపాయలను స్వాహా చేశారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చాందివ్లీ రహెజా విహార్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి (34) మే 18 న ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేయాలనుకున్నాడు. ఈక్రమంలో సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం వెతుకుతుండగా.. పేస్‌బుక్‌లో లభించిన ఓ వైన్స్‌కు సంబంధించిన నెంబర్‌కు కాల్ చేశాడు. రూ. 4,500 విలువ చేసే మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేశాడు. అయితే, అవతలి వ్యక్తి.. ఆన్లైన్లో డబ్బు చెల్లించాలని చెప్పి బాధితుని క్రెడిడ్ కార్డు వివరాలను అడిగి తెలుసుకున్నాడు. దాంతోపాటు.. బాధితుడు ఓటీపీ కూడా చెప్పాడు. కానీ, గంటలు గడుస్తున్నా మద్యం డోర్ డెలివరీ అవ్వలేదు. దాంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగి అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకుని కంగుతిన్నాడు. అతని అకౌంట్ నుంచి రూ.82,500 చెల్లింపులు జరిగాయని తేలింది. మరింత సొమ్ము కోల్పోవాల్సి వస్తుందని భావించిన బాధితుడు.. వెంటనే బ్యాంకుకు కాల్ చేసి.. కార్డ్ బ్లాక్ చేయించాడు. అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టాలని చెప్పాడు. అనంతరం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సైబర్ క్రైం డీసీపీ విశాల్ ఠాకూర్ చెప్పారు. తాజా ఘటనతో ముంబైలో.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే అనుమతిస్తున్నారు. -
నో చెలా‘మనీ’!
సాక్షి, సిటీబ్యూరో: కూరగాయలు, పండ్లు..ఇతర నిత్యావసరాలు, ఔషధాలు..ఇలా ఒక్కటేమిటి..అన్నింటి కొనుగోలుకూ ఇప్పుడు గ్రేటర్ సిటీజన్లు డిజిటల్ బాట పట్టారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో..అగ్గిపుల్లా..సబ్బు బిల్లా అన్న తేడా లేకుండా మెజార్టీ నగరవాసులు బహిరంగ మార్కెట్లో నగదు రహిత లావాదేవీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరెన్సీ ఇచ్చిపుచ్చుకుంటే కరోనా పొంచి ఉందన్న భయంతో ఇప్పుడు అందరూ ఇదే బాట పట్టడం విశేషం. పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి సగటు 42 శాతం ఉండగా..నగరంలో కోవిడ్ కంటే ముందు (లాక్‌డౌన్‌కు ముందు)సుమారు 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఈ చెల్లింపులు 70 శాతానికి చేరుకున్నాయని తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు నగదు రహిత చెల్లింపులు చేయని వారు సైతం ఈ బాట పట్టడం విశేషం. ఇక రోజువారీగా తాము చేసే కొనుగోళ్లకు సంబంధించి పేటీఎం వినియోగించే వారు 35 శాతం మందికాగా..గూగుల్ పే 25 శాతం..మరో 10 శాతం మంది ఫోన్‌పే, భీమ్ యాప్, అమెజాన్ మనీ తదితర డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్ భయమే కారణం... కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో పలవురు సిటీజన్లు నగదు రహిత చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. పలు కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, రైతు బజార్లు, మిల్క్షాపులు, మెడికల్ షాపులు ఇలా ఎటు చూసినా నగదు ఇచ్చిపుచ్చుకునే కంటే పేటీఎం, గూగుల్ పేకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నోట్ల రద్దు పరిణామం అనంతరం పలు వాణిజ్య ప్రైవేటు బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరిగినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. నెట్ బ్యాంకింగ్ వినియోగించే వారితోపాటు బ్యాంకు కార్యాలయాలకు వచ్చే వారు సైతం..నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, గృహిణులు, విద్యార్థులు చిరువ్యాపారులు అన్న తేడా లేకుండా ఇలాంటి లావాదేవీలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఏటీఎంలకు తగ్గిన రద్దీ... ‘డిజిటల్’ పేమెంట్స్ పుణ్యామా అని ఏటీఎం సెంటర్ల వద్ద రద్దీ పడిపోయిందనే చెప్పాలి. వేతనం పడడం ఆలస్యం..ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే అత్యవసర పరిస్థితిని డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తప్పించాయనే చెప్పాలి. అత్యవసర పరిస్థితిలో తప్ప డబ్బులు డ్రా చేసేందుకు జనం దాదాపుగా స్వస్తి చెప్పారు. ప్రస్తుతం సిటీలో ఎక్కడ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే..ఖాళీగా దర్శనమివ్వడం చూడవచ్చు. డిజిటల్ పేమెంట్స్ పెరిగాక కొన్ని బ్యాంకులు అయితే ఏటీఎం సెంటర్లను తగ్గించినట్లుగా సమాచారం. కొన్ని ఏటీఎం సెంటర్లయితే పెద్ద నోట్లకే పరిమితమయ్యాయి. సర్వాంతర్యామిగా మొబైల్.. నిన్నమొన్నటి వరకు అవతలి వారి మాటలను వినేందుకే ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ‘అగ్రగామిగా’ నిలిచిపోతుంది. ఒకప్పుడు ఊర్లో వారికి డబ్బు డిపాజిట్ చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి చేయాల్సి వచ్చేది. రానురాను బ్యాంక్‌లో సొంత ఖాతాదారులకు మినహా వేరే ఖాతాదారుల అకౌంట్ నెంబర్‌కు డబ్బు డిపాజిట్ చేసే సేవలకు స్వస్తి చెప్పేశారు. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిపాజిట్ మిషన్లను అందుబాటులో ఉంచారు. రానురాను ఈ మిషన్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో డిజిటల్ లావాదేవీల వైపు ఖాతాదారులు మళ్లారు. ఇదేవిధమైన లావాదేవీలు ఇప్పుడు నిత్యావసరాలకు విస్తరించుకున్నారు. దీంతో వినియోగదారుల బాటే మా బాట అంటూ వ్యాపారులు సైతం డిజిటల్ క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటుచేసుకుని డిజిటల్ పేమెంట్స్‌కు పచ్చ జెండా ఊపేస్తున్నారు. -
గూగుల్ పేతో జాక్‌పాట్!
పెనుకొండ: గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!
2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు (రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోటీ ఈ నెల 12న ముగియనుంది. విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! -
డిజిటల్ చెల్లింపులంటే భయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో ‘పెద్ద నోట్ల’ను రద్దు చేసినప్పటికీ డిజిటల్ చెల్లింపులు పెరక్క పోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్‌లో 1,003 మంది వ్యాపారులను సంప్రతించింది. వారిలో 97 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 79 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం తీసుకునే సదుపాయం కలిగిన డివైస్‌లు ఉన్నాయి. 54 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. 96 శాతం మందికి డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన జ్ఞానం ఉంది. వారిలో డిజిటల్ చెల్లింపుల ద్వారా వ్యాపారాన్ని నిర్వహించేందుకు 98.6 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ చెల్లింపులకు పడే ఆర్థిక భారాన్ని భరించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిలో కేవలం 42 శాతం మంది మాత్రమే డిజిటల్ చెల్లింపుల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇక వారి దగ్గరికి వస్తున్న వినియోగదారుల్లో 80 శాతం మంది నగదు రూపంలోనే చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు కారణం ఏమిటని వ్యాపారలను ప్రశ్నించగా, ఒకటి. డిజిటల్ చెల్లింపుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడం. రెండు. మధ్యలో ఎవరైన తమ డబ్బులను తస్కరిస్తారన్న భయం. మూడు ప్రభుత్వానికి ఎక్కడ పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయం అని వారు వివరించారు.