
పెనుకొండ: గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment