యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై విదేశాల్లోని భారతీయులు జరిపే నగదు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ యూపీఐ నగదు లావాదేవీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వెస్ట్రన్ యూనియన్‌తో ఒప్పందం..
భారత నగదు చెల్లింపుల సంస్థ ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) ప్రముఖ విదేశీ నగదు ట్రాన్స్‌ఫర్ సంస్థ వెస్ట్రన్ యూనియన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతరులు యూపీఐ పేమెంట్ యాప్స్‌ను ఉపయోగించి నగదు లావాదేవీలను జరపవచ్చునని ఎన్‌ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లాతో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్రన్ యూనియన్, పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో నివసిస్తోన్న 30 మిలియన్ల భారతీయులకు లబ్ధి చేకూరనుంది.
మరింత సులువుగా..వేగంగా..!
ఇతర దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతర వ్యక్తులు భారత్‌లోని యూపీఐ కస్టమర్లు నగదు లావాదేవీలను సులభంగా, వేగంగా జరుపవచ్చును. వెస్ట్రన్ యూనియన్ , యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్‌ల ద్వారా డబ్బు పంపించుకోవచ్చును.
ఛార్జీలు ఏలా ఉంటాయంటే..!
విదేశీ మార్కెట్‌లో రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిపే లావాదేవీలోని ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, అందుబాటులోని ఛానెల్‌లపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఎన్‌పీసీఐ , వెస్ట్రన్ యూనియన్ భాగస్వామ్యంతో ఆయా లావాదేవీల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్..!
Comments
Please login to add a commentAdd a comment