Phone Pay
-
UPI Transactions: రోజుకు రూ.67,165 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హవా కొనసాగుతోంది. యూపీఐ వేదికగా 2024 జూన్ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. గత నెలలో (1–29 తేదీల మధ్య) రూ.19,47,787 కోట్ల విలువైన 1,342.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో రూ.14,75,464 కోట్ల విలువైన 933 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనినిబట్టి చూస్తే యూపీఐ హవా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో, సురక్షితంగా చెల్లింపులు చేసే వీలుండడం వల్లే యూపీఐ ఈ స్థాయిలో దూసుకుపోతోంది. టెల్కోల దూకుడుతో మారుమూల పల్లెలకూ యూపీఐ యాప్స్ విస్తరించడం విశేషం.598 సంస్థల సేవలుదేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో 598 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు నిమగ్నమయ్యాయి. యూపీఐ యాప్స్‌లో ఫోన్‌పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యూపీఐ వేదికగా ఒక నెలలో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సాధించిన తొలి యాప్‌గా ఫోన్‌పే సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో ఫోన్‌పే ద్వారా ఏకంగా 683 కోట్ల లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.10,33,589 కోట్లు ఉంది. గూగుల్‌పే రూ.7,23,316 కోట్ల విలువైన 522 కోట్ల లావాదేవీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో ఉన్న పేటీఎం యాప్ వేదికగా ఆర్బీఐ ఆంక్షల ప్రభావంతో లావాదేవీలు భారీగా క్షీణించాయి. మే నెలలో పేటీఎం ద్వారా రూ.1,24,705 కోట్ల విలువైన 114 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 జనవరిలో పేటీఎం యాప్‌తో రూ.1,92,615 కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి. -
భారత్‌పే, ఫోన్‌పే మధ్య వివాదం పరిష్కారం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజాలు భారత్‌పే గ్రూప్, ఫోన్‌పే గ్రూప్‌ల మధ్య ’పే’ పదం ట్రేడ్‌మార్క్‌పై నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచి్చంది. సుమారు అయిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరును సామరస్యంగా సెటిల్ చేసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో పరస్పరం ఒకదానిపై మరొకటి దాఖలు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. దీనితో తమ తమ ట్రేడ్‌మార్క్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుందని వివరించాయి. ఇది రెండు కంపెనీలకూ ప్రయోజనకరమని ఫోన్‌పే ఫౌండర్ సమీర్ నిగమ్, భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. -
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు. -
సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, BHIM యాప్‌ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 వరకు ఫోన్‌పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. యూజర్లను ఆకర్శించడానికి ఫోన్‌పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్‌లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్‌పే డౌన్లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది. ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే.. గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్లోడ్ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. -
యూపీఐ పేమెంట్స్‌లో కొత్త రూల్స్.. అవేంటో మీకు తెలుసా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్ అకౌంట్ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్‌ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్‌గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్టే చేయాలని బ్యాంకులను కోరింది. ఎన్పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేలా ఆర్బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్‌పే నెంబర్ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్‌పే నెంబర్‌కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్‌లో యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాయంతో పేమెంట్ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్ఎఫ్సీ ఫీచర్‌ను తప్పని సరి త్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను వినియోగించి ఏటీఎం మెషిన్ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్ చేసి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది. -
‘ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్.. వచ్చి మన పార్టీకే ఓటు వేయాలే’
కరీంనగర్‌రూరల్: ‘అన్నా.. మంచిగున్నవానే.. ఈ ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్.. గుర్తుంది కదా..? జరంత తప్పకుండా అందరూ రావాలే. వదినను కూడా తీసుకుని రండ్రి. అందరూ మనపార్టీకే ఓటు వేయాలే. మనోళ్లను గెలిపించుకోవాలే. ఎంత పనిఉన్నా కొంచెం పక్కనపెట్టుకుని ముందే రావాలే. రానూపోను ఖర్చులు మేమే భరిస్తాం. అవసరమైతే ముందుగాలనే పేమెంట్ కొడతాం.. ఇంతకీ.. నీది ఫోన్‌పేనా..? గూగుల్ పేనా..? అన్నా..’ అంటూ.. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లను సంప్రదిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూ ర్ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం స్థిరపడిన వారిని సంప్రదిస్తూ.. ‘ఓట్ల’గాలం వేస్తున్నారు. ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ.. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఒక్కో సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు.. ఓడిన ఉద్ధండులూ ఉన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతీ ఓటరును అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్ర లేవగానే అందరి ‘టచ్’లోకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దిరోజులుగా కష్టపడుతున్నారు. వలస ఓటర్లు, కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు.. స్నేహబంధాలు.. బంధుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరిని పలుకరించి తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఏదోఒక సమయంలో నేరుగా కలుస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్లో సంప్రదిస్తున్నారు. కార్యకర్తల ద్వారా ‘టచ్’లోకి.. జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసవెళ్లినవారు వేలల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలైన చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌లో ఈ వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి వరంగల్, హైదరాబాద్, భీవండి, సూరత్ లాంటి పొరుగు ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లినవారు, బెంగళూరు, పుణే, చెన్నైలాంటి సిటీల్లో ప్రయివేటు ఉద్యోగులుగా స్థిరపడిన వారు అనేకం. ఎన్నికల సందర్భంగా వారు స్వ స్థలానికి వచ్చి ఓటు వేస్తారో.. వేయరో అన్న భయం నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో తమ కార్యకర్తల ద్వారా వారికి టచ్‌లోకి వెళ్తున్నారు. అన్నా.. అక్కా అంటూ.. గ్రామాల్లో ఉన్నవారి నుంచి ఫోన్ నంబర్లు తీసుకుని, ఫోన్‌చేసి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అన్నా.. అక్కా అంటూ సంబోధిస్తూ.. ఓటేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని కోరుతున్నారు. ఎన్నిపనులు ఉన్నా.. ఒక్కరోజు టైం ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైతే దారిఖర్చులు ఇస్తామని చెబుతున్నారు. నమ్మకం లేకుంటే.. ముందస్తుగానే పంపిస్తామని.. మీది ఫోన్‌పేనా..? గూగుల్ పేనా? అంటూ అడుగుతూ.. ఆన్లైన్ పేమెంట్లు చేసేస్తున్నారు. తమ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాల ని కోరుతున్నారు. ఇలా వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న జిల్లాలోని వివిధ పార్టీల కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓటు బ్యాంకు పెంచే పనిలో నిమగ్నమవడం కనిపిస్తోంది. -
దుకాణంలో మాయమాటలతో.. ఫోన్‌పే మోసం.. ఏమైందో తెలస్తే షాక్!
సాక్షి, ఖమ్మం: పట్ట పగలు సినీ ఫక్కీలో దుండగుడు డబ్బులు కాజేశాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు విస్తుపోయాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కిరాణా దుకాణానికి ఒడిశాకు చెందిన వ్యక్తి సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. తన ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని, ‘మీ’ ఫోన్ ఇస్తే సరుకుల లిస్ట్‌ను ఇంట్లో వారిని అడిగి కనుక్కుంటానని నమ్మించాడు. దీంతో సదరు దుకాణ యజమాని ఫోన్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి దుకాణంలో సరుకులు కడుతున్నాడు. ఇదే అదునుగా ఫోన్ మాట్లాడినట్లు నటించి ఫోన్ పే ద్వారా (పాస్వర్డ్ సులభంగా ఉండటంతో) రూ.72,500 కాజేశాడు. అనంతరం సదరు మోసగాడు సరుకుల లిస్టు ఇంటి దగ్గర ఉందని, వెంటనే వెళ్లి తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తరువాత దుకాణ యజమాని ఫోన్‌ను పరిశీలిస్తే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులోని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒడిశాకు చెందిన వ్యక్తిగా చూపిస్తోందని బాధితుడు గెల్లా వాసు వివరించారు. -
భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్‌లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్‌పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్‌పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
ఇదేం బాలేదు.. కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్!
భోపాల్: ఈ సారి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. పోస్టర్ల ప్రచారానికి తెర లేపింది. సీఎం శివరాజ్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుపై ఆరోపణలు చేసింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి దాంట్లో శివరాజ్ బొమ్మను చేర్చి ఆ పోస్టర్లును పలు చోట్ల అంటించింది. పోస్టర్ల రచ్చ అందులో "50% లావో, ఫోన్‌పే కామ్ కరో (మీ పని పూర్తి కావాలంటే 50% కమీషన్ చెల్లించాలి). అయితే ప్రస్తుతం ఆ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్టర్ యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే సంస్థ తమ కంపెనీ పేరు, లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫోన్‌పే పోస్టర్లపై స్పందిస్తూ, "రాజకీయ లేదా రాజకీయేతర వాటికోసం తమ బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటికి తమ కంపెనీ లోగోను వాడవద్దు అని తన ట్వీట్లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే కంపెనీ తెలుపుతూ.. ఆ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరింది. బీజేపీ స్పందన ఇదే భోపాల్, ఇండోర్, గ్వాలియర్, సెహోర్, రేవా, మందసౌర్, ఉజ్జయిని, భింద్, బాలాఘాట్, బుధ్ని, మరికొన్ని నగరాల్లో వెలువడిన ఈ పోస్టర్ల వీడియోలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. పోస్టర్లపై బీజేపీ స్పందిస్తూ.. పలు నగరాల్లో పోస్టర్లు అంటించిన తర్వాత కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. చదవండి: రైలు అక్కడకు రాగానే ‘అంధకారం’.. విచిత్రమో, విడ్డూరమో కాదు! -
సారీ తమ్ముడూ.. విధిలేక మోసం చేశా!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మాటలు కలిపి.. నమ్మకం కలిగించి.. ముందస్తుగా రూ.15వేల నగదు తీసుకుని.. ఫోన్‌పేలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉడాయించిన దుండగుడి ఉదంతం అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్‌లోని రామాలయం వద్ద సెల్పాయింట్ నిర్వహిస్తున్న మణికంఠ ఫోన్‌పే ట్రాన్స్ఫర్, వేలిముద్ర వేయించుకుని కమీషన్‌పై నగదు చెల్లింపులు చేసే ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఓ అపరిచిత వ్యక్తి అతని వద్దకు వచ్చి ఫోన్ పే ద్వారా బదిలీ చేసి రూ.10వేల నగదు తీసుకున్నాడు. మాటామంతి చేసి అక్కడే కాసేపు గడిపాడు. శనివారం కూడా ఆ వ్యక్తి వచ్చి మణికంఠతో ముచ్చటించిన తర్వాత రూ.15వేల నగదు ఇవ్వు.. ఫోన్‌పేలో డబ్బు పంపుతానని చెప్పాడు. సరేనని కమీషన్ పట్టుకుని నగదు లెక్కపెట్టి మణికంఠ ఇచ్చాడు. అయితే ఆ అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేయలేదు. అత్యవసరమన్నట్టుగా.. తన కొడుక్కు డబ్బు ఇచ్చి, తర్వాత ఫోన్‌పే పంపుతానని అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయే సరికి మణికంఠ అనుమానం వచ్చి ఆ పరిసరాల్లో వెతికినా కనిపించలేదు. అనంతరం అపరిచిత వ్యక్తి నుంచి మణికంఠకు పలు మెసేజీలు వచ్చాయి. ‘సారీ తమ్ముడు..రెండు రోజులుగా అన్నం కూడా లేదు. ఆకలేస్తోంది. విధిలేక నిన్ను మోసం చేయాల్సి వచ్చింది’ అంటూ సందేశంలో పేర్కొన్నాడు. బాధితుడు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తనకు న్యాయం చేయాలని కోరాడు. -
ఫోన్ పే వాడుతున్నారా .. అయితే ఈ శుభవార్త మీకే
-
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
-
ఫోన్‌పేకు జనరల్ అట్లాంటిక్ నిధులు
న్యూఢిల్లీ: డెకాకర్న్ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ నుంచి 10 కోట్ల డాలర్లను(రూ. 820 కోట్లు) సమీకరించింది. ఇప్పటికే ప్రారంభించిన బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ప్రస్తుత పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీ 12 బిలియ న్ డాలర్ల విలువలో నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఇప్పటివరకూ 75 కోట్ల డాలర్ల పెట్టుబడులను అందుకుంది. జనరల్ అట్లాంటిక్ 2023 జనవరిలో 35 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! వాల్‌మార్ట్ 20 కోట్ల డాలర్లు, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ 10 కోట్ల డాలర్లు చొప్పున ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేశాయి. -
ఒక్క క్లిక్‌తో చెల్లిస్తున్నారు.. తొలి స్థానంలో ఫోన్‌పే.. నమ్మశక్యం కాని అంకెలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ వ్యవస్థ దేశంలో 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే 2023 జనవరిలో నమోదైన గణాంకాలే అత్యధికం. టెలికం కంపెనీల దూకుడుతో పల్లెలకూ ఇంటర్నెట్ చొచ్చుకుపోయింది. స్మార్ట్ఫోన్లు జీవితంలో భాగమయ్యాయి. బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం లేకుండా పేమెంట్ యాప్స్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా క్షణాల్లో సులభంగా, సురక్షితంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. ఈ అంశాలే ఇప్పుడు యూపీఐ వేగంగా విస్తరించడానికి కారణమయ్యాయి. నమ్మశక్యం కాని అంకెలు.. యూపీఐ లావాదేవీల విలువ తొలిసారిగా 2018 డిసెంబర్లో రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. ఆ నెలలో 62 కోట్ల లావాదేవీలకుగాను రూ.1,02,595 కోట్ల విలువైన మొత్తం చేతులు మారింది. సరిగ్గా ఏడాదిలో లావాదేవీల విలువ రెట్టింపు అయింది. 2022 మే నాటికి లావాదేవీలు ఏకంగా రూ.10 లక్షల కోట్లకు ఎగిశాయి. 2017 జనవరిలో రూ.1,000 కోట్ల మార్కును దాటి రూ.1,696 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు అదే ఏడాది డిసెంబర్లో రూ.13,174 కోట్లకు చేరాయి. సరిగ్గా ఏడాదిలో లక్ష కోట్ల స్థాయికి ఎగిశాయి. ఈ గణాంకాలను చూస్తుంటే యూపీఐ పేమెంట్ యాప్స్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఇట్టే అర్థం అవుతోంది. 2023 జనవరి నాటికి 385 బ్యాంకులు యూపీఐ వేదికగా ఉన్నాయి. తొలి స్థానంలో ఫోన్‌పే.. దేశంలో యూపీఐ చెల్లింపుల్లో తొలి స్థానంలో నిలిచిన ఫోన్‌పే 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,088 కోట్లు, యస్ బ్యాంక్ రూ.12,116 కోట్లు, భీమ్ రూ.8,164 కోట్లు, అమెజాన్ పే రూ.5,797 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.3,324.8 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్సీ బ్యాంక్ రూ.2,222 కోట్లు, ఎస్బీఐ రూ.1,902 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,467 కోట్లు సాధించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్,, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, వాట్సాప్, మొబిక్విక్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రూ.707 కోట్ల లావాదేవీలు నమోదు చేయడం విశేషం. చిన్న మొత్తాలే అధికం.. జనవరి గణాంకాల ప్రకారం మొత్తం 803 కోట్ల లావాదేవీల్లో కస్టమర్లు వర్తకులకు చెల్లించిన వాటా 54.88 శాతం కాగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు 45.12 శాతం ఉన్నాయి. కస్టమర్లు వర్తకులకు చెల్లించిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ కలిగినవి 83.36 శాతం కైవసం చేసుకున్నాయి. రూ.500–2,000 మధ్య 11.63 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 5.01 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీల్లో రూ.500లోపు విలువ కలిగినవి 54.71 శాతం, రూ.500–2,000 మధ్య 22.11 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.18 శాతం ఉన్నాయి. -
'యువగళం మనకోసం' వాట్సాప్ గ్రూపులో ఘరానా మోసం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): యువగళం పేరుతో ఓ వైపు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే.. ఆయన అనుచరులు అదే పేరుతో వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి మోసాలకు తెగబడుతున్నారు. అలాంటి గ్రూప్‌లో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి యువగళం మనకోసం వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. గ్రూప్ సభ్యులకు రూ. 2 లక్షల వరకూ లోన్ ఇస్తానంటూ గత నెల 29న కాకినాడకు చెందిన అడ్మిన్ మనోహర్ చౌదరి గ్రూపులో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితుడు తనకు లోను కావాలంటూ మెసేజ్ చేశాడు. 30వ తేదీన మనోహర్ చౌదరి బాధితుడికి ఫోన్ చేసి లోన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 3,800 చెల్లించాలని కోరడంతో బాధితుడు గూగుల్ పే ద్వారా చెల్లించాడు. తనకు రూ. 15 వేలు పంపిస్తే లోను మంజూరు చేస్తానని మనోహర్ చౌదరి మరోసారి చెప్పగా బాధితుడు మళ్లీ గూగుల్ పే ద్వారా చెల్లించాడు. ఇలా మాయమాటలు చెప్పి బాధితుడి వద్ద నుంచి మనోహర్ చౌదరి మొత్తం రూ. 1.43 లక్షలు కాజేశాడు. ఇంత చెల్లించినా ఇంకో రూ. 15 వేలు పంపమని చెప్పడంతో బాధితుడు ఎదురుతిరగగా.. మనోహర్ చౌదరి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు. తక్షణమే స్పందించిన పోలీసులు మనోహర్ చౌదరికి చెందిన 2 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. మోసగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, తనకు వచ్చిన లింక్ ద్వారా యువగళం మనకోసం గ్రూపులో సభ్యుడిగా చేరానని బాధితుడు తెలిపాడు. గ్రూపు అడ్మిన్ మనోహర్ చౌదరి తనను మోసం చేయడమే కాకుండా.. తననే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని వాపోయాడు. -
భారత్‌కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్ చెప్పారు. ‘భారత్ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్ వేల్యుయేషన్‌ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్‌లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్‌మార్ట్, టెన్సెంట్ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. -
ఫోన్‌పే: 8,200 కోట్ల పన్ను చెల్లించాల్సిందే!
ఫోన్‌పే ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించినందకు గానూ వాల్‌మార్ట్, ఇతర ఫోన్‌పే వాటాదారులుపై భారీగా పన్నులు భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ పే మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేశాక.. అందులో మెజారిటీ యాజమాన్య హక్కులను వాల్‌మార్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫోన్‌పే విలువ పెరగడం, దీంతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఇండియాకు తరలించడంతో దాదాపు 1 బిలియన్ డాలర్లు పన్ను కట్టాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కన్నాయి. జనరల్ అట్లాంటిక్, కతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఇతరుల నుంచి 12 బిలియన్ డాలర్ల ప్రీ-మనీ వాల్యుయేషన్‌తో నిధులను సేకరించడం వల్ల ఫోన్‌పే పై భారీ చార్జీలు విధించే అవకాశం ఉంది. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్తో సహా ఇన్వెస్టర్లు భారత్‌లో ఫోన్‌పే షేర్లను కొత్త ధరకు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటికే ఉన్న వాటాదారులకు దాదాపు 80 బిలియన్ రూపాయల పన్ను విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వీటిపై ఫోన్‌పై ప్రతినిధి స్పందించలేదు. చాలా సంవత్సరాలుగా, టెక్ కంపెనీలు తమ వ్యాపారాలు, కార్యకలాపాల్లో ఎక్కువ భాగాన్ని భారతదేశంలో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన కార్యాలయాన్ని మాత్రం సింగపూర్‌లో ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆ దేశంలో ఉన్న ఫ్రెండ్లీ ట్యాక్స్ విధానం, విదేశీ పెట్టుబడులను సులభంగా పొందే సౌలభ్యమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఇండియా బ్రీఫింగ్ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి 8,000 భారతీయ స్టార్టప్‌లు సింగపూర్‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్, అంతకు మించితే!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రాకతో నగదు భారత్‌లోని చెల్లింపుల వ్యవస్థనే మార్చివేయడమే కాదు ఈ విభాగంలో సరికొత్త విప్లవానికి దారితీసింది. అందుకే ఇటీవల ఎక్కువగా ఉపయోగించే రోజువారీ చెల్లింపు పద్ధతిగా మారింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు పద్ధతి దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది. దీని రాకతో బయటకు వెళ్లే సమయంలో ప్రజలు నగదు లేదా వాలెట్‌ను మోసుకెళ్లే భారం తప్పిందనే చెప్పాలి.. కేవలం జేబులో స్మార్ట్‌ఫోన్ అందులో గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm), అమెజాన్ పే (Amazon Pay) వంటి వివిధ యాప్‌ల ఉంటే బ్యాంక్ ఖాతా, యూపీఐ, ఈ యాప్‌లు ఉండే ఎవరికైనా చిటికెలో నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. మీ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే మొత్తంపై పరిమితి ఉందని మీకు తెలుసా? యూపీఐ చెల్లింపులు.. లిమిట్ ఇదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక రోజులో యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఇది కాకుండా, మీరు ఒక రోజులో యూపీఐ ద్వారా డబ్బులు బదిలీ చేయాలంటే అది మీ బ్యాంక్, మీరు ఉపయోగిస్తున్న యాప్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం! గూగుల్‌పే గూగుల్ పే (Google Pay) లేదా జీపే (GPay) వినియోగదారులు యూపీఐ (UPI) ద్వారా ఒక్క రోజులో రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లింపులు చేయలేరు. ఇది కాకుండా, యాప్ వినియోగదారులను ఒక రోజులో 10 కంటే ఎక్కువ లావాదేవీలు కూడా చేసేందుకు అనుమతి ఉండదు. దీనర్థం జీ పే యూజర్లు ఒకే సారి ఒక లక్ష రుపాయల లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు. ఆపై ఈ యాప్ నుంచి పేమెంట్స్ చేయలేము. పేటీఎం ఎన్పీసీఐ (NPCI) ప్రకారం, పేటీఎం ( Paytm )కూడా ఒక రోజులో రూ. 1 లక్ష వరకు మాత్రమే చెల్లింపును అనుమతిస్తుంది. కాకపోతే యూపీఐ చెల్లింపుల విషయంలో పేటీఎంకి ఎలాంటి పరిమితి లేదు. ఫోన్‌పే ఫోన్‌పే (PhonePe) గూగుల్ పే (Google Pay) తరహాలోనే ఒక రోజుకు చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. అయితే ఇందులో ఒక రోజులో 10 లావాదేవీలు మాత్రమే చేయాలనే పరిమితి లేదు. ఒక రోజులో రూ.లక్ష విలువ మించకుండా వినియోగదారులు ఎన్ని పేమెంట్స్ అయినా చేసుకోవచ్చు. అమెజాన్ పే అమేజాన్ పే (Amazon Pay) UPI ద్వారా రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు. లేదా ఒక రోజులో 20 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. కొత్త కస్టమర్లు మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!
గతంలో నగదు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లడమో లేదా ఇంటర్నెట్ బ్యాంకులు వంటివి ఉపయోగించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రావడంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నగదు చెల్లింపుల విధానంలో ఓ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఎంతో సులువుగా అవతలి వాళ్లకు డబ్బులను ఈ విధానాన్ని ఉపయోగించి చిటికెలో పంపతున్నాం. అయితే ప్రజలకు కొన్ని సందర్భాల్లో నగదు పొరపాటున తాము అనుకున్న ఖాతాకు కాకుండా వేరు వారికి బదిలీ చేసిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఆ సమస్యకు పరిష్యారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించి సెకనులో డబ్బులను అవతలి వాళ్ల బ్యాంక్ అకౌంట్‌కు పంపవచ్చు. ఈ విధానం సులువుగా ఉండడంతో మొదట్లో యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య వేల నుంచి ప్రస్తుతం కోట్లకు చేరింది. అలా ప్రస్తుతం ఇది మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కాదు రోడ్‌సైడ్ వెండర్ల నుంచి రిటైల్ షాపుల వరకు ఎక్కడ చూసిన ఇదే కనిపిస్తుంది. ఇది సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అయినప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పొరపాటు మీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. వేరే ఖాతాకు నగదు బదిలీ.. వెనక్కి రావాలంటే ఇలా చేయండి యూపీఐ ఐడీని తప్పుగా నమోదు చేయడం లేదా పొరపాటుగా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడం లాంటివి జరుగుతుంటాయి. మనకో లేదా మనకు తెలిసిన వాళ్లకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో మీరు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్బీఐ ప్రకారం, మీరు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బదిలీ చేసిన మొత్తం నగదు తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి మొదట ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థతో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మీరు పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe) వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం పొందవచ్చు. వారి ద్వారా నగదు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించలేపోతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చని తెలపింది. చదవండి: అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 700 మిలియన్ డాలర్లు క్యాష్ పేఔట్!
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్టాక్ ఆప్షన్స్ కలిగి ఉన్న దాదాపు 25,000 ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేయనుంది. ఫోన్‌పే (PhonePe), మింత్రా (Myntra), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థలోని ప్రస్తుత ఉద్యోగులే కాకుండా మాజీ సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరునుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని టాప్ 20 ఉద్యోగులు, కంపెనీలో అత్యంత సీనియర్ సిబ్బంది స్థాయి వారికి ఈ చెల్లింపులో దాదాపు 200 మిలియన్ డాలర్ల వరకు అందుకోనున్నారు. అమెజాన్ నుంచి ఫోన్‌పే (PhonePe) పూర్తిగా వేరు కావడంతో ఈ చెల్లింపు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌పేను 2015లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లో ఫోన్‌పే విలువను అన్‌లాక్ చేయడానికి దాన్ని ప్రత్యేక సంస్థగా మార్చింది. అయినప్పటికీ ఫోన్‌పేలో అధిక వాటాను కొనసాగించింది. ఇటీవల డిసెంబర్ 23న ఫోన్‌పేలోని తన వాటాలన్నింటినీ ప్రస్తుత వాటాదారులకు విక్రయిస్తున్న కీలక ప్రకటన చేసింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అందిస్తున్న ఈ క్యాష్ పేఔట్ దేశీయ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఆఫర్‌గా నిలిచింది. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
ఫ్లిప్‌కార్ట్ నుంచి విడివడ్డ ఫోన్‌పే
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మాతృ సంస్థకాగా.. ఫోన్‌పేను 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాదారులు ఫోన్‌పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వెరసి ఫోన్‌పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్ గ్రూపులలోనూ వాల్‌మార్ట్ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్ బేస్ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్‌పే స్వస్థలాన్ని(డొమిసైల్) సింగపూర్ నుంచి భారత్‌కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు. -
ఊపిరి పీల్చుకోండి.. ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల మొత్తం లావాదేవీల్లో థర్డ్ పార్టీ యూపీఐ సంస్థల (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ తదితర) వాటా ఒక్కోటీ 30 శాతం మించకూడదన్న నిబంధన అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది. దీంతో 2024 డిసెంబర్ చివరి వరకు అదనపు సమయం లభించినట్టయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో 30 శాతానికి పైగా వాటా కలిగిన ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ఊరటనివ్వనుంది. యూపీఐ నిర్వహణను ఎన్పీసీఐ చూస్తుంటుంది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తుండడం తెలిసిందే. ఒక్క థర్డ్ పార్టీ యాప్ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్‌లో ఎన్పీసీఐ తీసుకొచ్చింది.ఈ నిర్ణయం వాస్తవానికి అయితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి. అయితే 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్‌లు అయిన గూగుల్, ఫోన్‌పే సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది. ‘‘యూపీఐ ప్రస్తుత వినియోగం, భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. నిర్ధేశిత పరిమితికి మించి (30 శాతానికి పైగా) లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్ సంస్థలకు నిబంధనల అమలుకు ఇచ్చిన రెండేళ్ల అదనపు గడువును, 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించాం’’అని ఎన్పీసీఐ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ఉన్న భారీ అవకాశాల దృష్ట్యా బ్యాంకులు, నాన్ బ్యాంకులు సైతం ఈ విభాగంలో మరింత వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే వాటా సుమారు 46 శాతం, గూగుల్‌పే వాటా 33 శాతంగా, పేటీఎం వాటా 11 శాతం మేర ఉంది. చదవండి: 17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్ మస్క్‌తో కలిసి -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్‌పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్‌ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్‌కు వచ్చిన క్యూ ఆర్‌కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్‌లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్‌కోడ్‌ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్‌కోడ్‌ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
వామ్మో రూ.12.11 లక్షల కోట్లు.. ఏం వాడకం రా బాబు!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్‌లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్‌లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్‌ని ఏఈపీఎస్‌తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్‌లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్! -
ఫోన్‌పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
Munugode Bypoll: ఆన్లైన్లో డబ్బులు పంపిణీ.. రిజర్వ్ బ్యాంక్ సాయం కోరతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్‌రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీఆర్ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు. ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం. ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. -
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్: ఫోన్‌ఫే కో-ఫౌండర్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 2022లో నిర్వహించిన అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ దేశీయ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. 8వ ఫ్రాంచైజీ- ముంబై మీటార్స్‌ను ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు. అలాగే భారత వాలీబాల్ టీమ్ మాజీ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారని ఫోన్‌పే ఫౌండర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ క్రీడాకారుడిగా వాలీబాల్ ఆట ఆనందం గురించి తనకు తెలుసునని రూపే పీవీఎల్ తమకు ఖచ్చితమైన అవకాశాన్ని ప్రొఫెషనల్ మార్గంలో ప్రపంచశ్రేణి స్ధాయిలో నిర్మించే అవకాశం అందిస్తుందని భావిస్తున్నామంటూ కోఫౌండర్ సమీర్ నిగమ్ సంతోషం వెలిబుచ్చారు. భారతీయ క్రీడా వ్యవస్థ అత్యంత ఉత్సాహ పూరిత మైందనీ, ముఖ్యంగా క్రికెటేతర రంగంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న రంగంలో తగిన తోడ్పాటునందించేందుకు రూపే పీవీఎల్ తమకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మరో కో ఫౌండర్ రాహూల్ చారి తెలిపారు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన కార్పోరేట్ లీడర్లు సమీర్, రాహుల్‌లు ఫ్రాంచైజీ యజమానులుగా చేరడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ముంబై ఫ్రాంచైజీ యజమానులును స్వాగతించిన థామస్ ముత్తూట్, యజమాని, కొచి బ్లూ స్పైకర్స్ మాట్లాడుతూ వారి వ్యాపార అనుభవం, ఈ క్రీడ పట్ల అభిరుచి రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు తోడ్పడుతుందనిపేర్కొన్నారు. రెండో సీజన్ 2023 సంవత్సరారంభంలో ప్రారంభమవుతుందని అంచనా. వాలీబాల్ అంతర్జాతీయ సంస్ధ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ వాలీబాల్, ఎఫ్‌ఐవీబీ)కు వాణిజ్య విభాగం, వాలీబాల్ వరల్డ్ ఇప్పుడు పీవీఎల్‌తో చేతులు కలపడంతో పాటుగా పలు సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్ట్రీమింగ్ భాగస్వామిగా వ్యవహరించనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. ఈ లీగ్‌కు మొత్తం 133 మిలియన్ల టెలివిజన్ వ్యూయర్షిప్ ఉంది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలలో కామెంట్రీ ఎంచుకునే అవకాశమూ అందించింది. -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గట్టి షాక్.. రెడీగా ఉండండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ డిజిటల్లోకి మారుతోంది. నోట్ల రద్దు నాడు మొదలైన డిజిటల్ ట్రెండ్ ముఖ్యంగా కరోనా రాకతో డబ్బులు మార్పిడి తగ్గి ఫటా ఫట్‌మంటూ యూపీఐ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇదేదో బాగుందనుకుని అప్పటి నుంచి నగదు లావాదేవీల కొరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లను తెగ వాడుతున్నారు. ఎంతలా అంటే చిన్న షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు మొత్తం యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ, ఫ్రీగా లావాదేవీలకు అలవాటు పడిపోయిన వారికి కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇకపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరింది. సాధారణంగా క్రెడిట్ కార్డు వాడితే ఎండీఆర్(MDR) ఛార్జీలు వేస్తారు. దీన్ని బ్యాంకులతో పాటు కార్డు జారీ కంపెనీలు పంచుకుంటాయి. ఇదే తరహాలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే యూపీఐ యాప్‌లను వినియోగించే వారికి పెద్ద షాక్ తగలనుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాంగా యూపీఐ పేరు సంపాదించింది. నగదు బదిలీలతో పాటు వ్యాపార చెల్లింపులు కలిపి ప్రతి నెలా 6 బిలియన్ల లావాదేవీలు, రూ. 10 ట్రిలియన్ల వరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది! -
ఐపీఓ బాటలో ఫోన్‌పే
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైలింగ్ కంపెనీ వాల్‌మార్ట్ గ్రూప్‌లోని యూపీఐ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు మెజారిటీ వాటాగల కంపెనీ ఇందుకు బ్యాంకర్లు, న్యాయ సలహాదారు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ 8–10 బిలియన్ డాలర్ల(రూ. 62,000– 78,000 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. నిధులతో యూపీఐ ఆధారిత చెల్లింపుల నిర్వహణతోపాటు ఫైనాన్షియల్ సర్వీసుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలున్నట్లు పేర్కొన్నాయి. మేడిన్ ఇండియా సంస్థగా ఆవిర్భవించే బాటలో రిజిస్టర్డ్ హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఫోన్‌పే బోర్డు అనుమతించడం గమనార్హం! దేశీయంగా ఊపిరి ఇటీవల పలు కంపెనీలు విదేశాలలో లిస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే మాత్రం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. స్నేహపూర్వక వ్యాపార నియంత్రణలు, పన్ను చట్టాలు గల యూఎస్ లేదా సింగపూర్‌లో లిస్టింగ్‌కు పలు స్టార్టప్‌లు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పేను నిజానికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ఏర్పాటు చేశారు. తదుపరి 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్‌పే సహా ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. 2023కల్లా... ఫోన్‌పే లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని చూస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 2023కల్లా టర్న్అరౌండ్ కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో ఈ డిసెంబర్‌కల్లా సిబ్బంది సంఖ్యను 5,200కు చేర్చుకునే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం 2,600 మంది ఉద్యోగులను కలిగిన ఫోన్‌పే మరో 2,800 ఉపాధి అవకాశాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారీ విలువలో ప్రమోటర్లు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల నుంచి ఫోన్‌పే 70 కోట్ల డాలర్లు సమీకరించింది. దీంతో 2020లో కంపెనీ విలువ 5.5 బిలియన డాలర్లకు చేరింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, టెన్సెంట్ తదితర దిగ్గజాల నుంచి 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. యూపీఐ విభాగంలో నెలవారీ లావాదేవీల్లో కంపెనీ 47 శాతం మార్కెట్ వాటాతో అగ్రపథంలో ఉంది. వెల్త్‌డెస్క్, ఓపెన్‌క్యూ, గిగ్ఇండియాలను కొనుగోలు చేసిన కంపెనీ మ్యూచువల్ ఫండ్, ఎన్‌బీఎఫ్‌సీలైసెన్సులకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఎంఎఫ్ పంపిణీ లైసెన్స్‌ను కలిగి ఉంది. వెల్త్‌మేనేజ్‌మెంట్ ప్రొడక్టుల్లో భాగంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లను జమ చేసుకుంటోంది. బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ యూపీఐ సిప్‌ను ప్రవేశపెట్టింది. -
యూజర్లకు పేటీఎం భారీ షాక్!
మీరు మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తున్నారు? పేటీఎం నుంచి చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. పేటీఎం యాప్ నుంచి మొబైల్ రీఛార్జ్ చేస్తే అందుకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేటీఎం యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఎంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే విషయం వెలుగులోకి రాలేదు. కానీ పలు నివేదికలు మాత్రం రూ.1 నుంచి రూ.6 మధ్యలో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్‌ఛార్జి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.100కి మించిన ట్రాన్సాక్షన్లు చేస్తే వాటిపై సర్ ఛార్జీల మోత తప్పదనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్!
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): కాలం ఎంతగామారింది.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజనులు తమ సంప్రదాయ పండగలకు వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా ఈ నెలలో ఇటుకల పండగ నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రధాన రహదారుల్లో గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద తాచేరు (డబ్బులు) వసూలు చేస్తుంటారు. చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి అయితే చిల్లర లేదని చెప్పి కొందరు వాహనచోదకులు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలు, యువతులు గేట్ల వద్ద ఫోన్ పేకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను ఉపయోగించి తాచేరు వసూలు చేస్తున్నారు. పురుషులు వేటకు అడవి బాట పడుతుండడంతో మహిళలే ఈ పనిలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు ఫోన్లో సంభాషించడమే అంతగా తెలియని గిరిజనులు ఇప్పుడు స్కానర్ ద్వారా తాచేరు వసూలు చేయడం చూసి మైదాన ప్రాంతాలకు చెందిన వాహన చోదకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్!
సాక్షి,ఖమ్మం: పెద్ద నోట్ల రద్దు, ఆపై కరోనాతో నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. షాపింగ్ మాళ్లు మొదలు తోపుడు బండ్ల వ్యాపారులకు వరకు అందరూ ఫోన్ పే, గూగుల్ పేలతో నగదు స్వీకరిస్తున్నారు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా గ్రామాల్లో పిల్లలు మామూళ్ల కోసం వెళ్తూ ఫోన్ పే స్కానర్ వెంట తీసుకెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. సూది తెచ్చుకుంటేనే టీకా! సత్తుపల్లి టౌన్ : ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగతా విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు అయిన శిశువులకు 24 గంటల్లోపు బీసీజీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఈ టీకా చిన్నారుల్లో క్షయవ్యాధి రాకుండా కాపాడుతుంది. అయితే, 0.01 ఎంఎల్ సిరంజీతో మాత్రమే శిశువులకు వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు వారాలుగా అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో సిరంజీలు లేవని సిబ్బంది చెబుతుండగా. తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లిల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఏరియా ఆస్పత్రుల్లో జరిగే వ్యాక్సినేషన్‌కు వచ్చే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం.రాజేష్‌ను విరణ కోరగా సిరంజీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్‌లు చాలు.. వాటిపై ఆసక్తి లేదు.. వాల్‌మార్ట్ సంచలన ప్రకటన
ముంబై: భారత్‌లో రిటైల్ స్టోర్ల ఏర్పాటు పట్ల ఆసక్తి లేదని అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రకటించింది. కాకపోతే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, పేమెంట్స్ సేవల సంస్థ ఫోన్‌పే బలోపేతానికి కొనుగోళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. కొన్నేళ్ల క్రితం 16 బిలియన్ డాలర్లు (రూ.1.20 లక్షల కోట్లు) వెచ్చించి ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే సంస్థలను వాల్‌మార్ట్ సొంతం చేసుకోవడం గమనార్హం. ‘‘మాకు ఓమ్నిచానల్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) వ్యూహం ఉంది. ఈ రెండూ ఉన్నప్పుడు కస్టమర్ల అనుభవం అవరోధాల్లేకుండా ఉంటుంది. కోరుకున్నప్పుడు స్టోర్‌కు వెళ్లి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ, ప్రస్తుత దశలో మేము దానిపై దృష్టి సారించడం లేదు. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే విజయవంతానికే కృషి చేస్తున్నాం’’ అని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్ ముంబైలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు సందర్భంగా చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీవో అంతిమ లక్ష్యం ఫ్లిప్‌కార్ట్ ఐపీవో అన్నది అంతిమ లక్ష్యమంటూ, ఎప్పుడు దీన్ని తీసుకొచ్చేది ఆయన స్పష్టం చేయలేదు. ‘‘ఏదో ఒక సమయంలో ఐపీవో సరైన నిర్ణయం అని ఆరంభం నుంచి అనుకుంటూనే ఉన్నాం. కానీ, బలమైన పునాదిని మేం నిర్మించాల్సి ఉంది. సన్నద్ధత ఆధారంగా నిర్వహణ టీమ్ ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఐపీవోకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలను ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకు సంబంధించి స్థానిక నాయకత్వాలే తీసుకుంటాయి’’ అని మెక్‌మిల్లన్ తెలిపారు. -
ఏం స్కెచ్ వేశాడు, ఫోన్ మాట్లాడుతా అని.. ఫోన్ పే చేశాడు
సాక్షి,రామగిరి(నల్లగొండ): ఫోన్ మాట్లాడుతా అని ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి ఫోన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు పంపించుకున్న సంఘటన మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సోమగోని సైదులు తిప్పర్తి సెంటర్లో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తెలిసిన వాళ్లకి డబ్బులు పంపించాలని సైదులును అడిగాడు. పంపిస్తామని సైదులు చెప్పాడు. ముందుగా ఒక రూపాయి పంపమని అన్నాడు. సైదులు ఫోన్‌పే ద్వారా రూపాయి పంపిస్తున్న సమయంలో చాటుగా పాస్‌వర్డ్‌ను చూసిన సదరు వ్యక్తి డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకుంటానని సైదులు ఫోన్ అడిగాడు. ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూ రెండు సార్లు రూ.20 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు తనకు పంపించుకున్నాడు. అనంతరం సైదులకు ఫోన్ ఇచ్చి వెంటనే వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. సైదులు తేరుకొని చూసేసరికి ఫోన్ నుంచి డబ్బులు పంపించుకున్నట్లు గమనించి డబ్బులు పంపిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా ఒకసారి ఎత్తి మాట్లాడాడు. మరల తిరిగి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి, సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. -
యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..!
యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై విదేశాల్లోని భారతీయులు జరిపే నగదు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ యూపీఐ నగదు లావాదేవీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ యూనియన్‌తో ఒప్పందం.. భారత నగదు చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) ప్రముఖ విదేశీ నగదు ట్రాన్స్ఫర్ సంస్థ వెస్ట్రన్ యూనియన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతరులు యూపీఐ పేమెంట్ యాప్స్‌ను ఉపయోగించి నగదు లావాదేవీలను జరపవచ్చునని ఎన్ఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లాతో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెస్ట్రన్ యూనియన్, పలు సంస్థల భాగస్వామ్యంతో విదేశాల్లో నివసిస్తోన్న 30 మిలియన్ల భారతీయులకు లబ్ధి చేకూరనుంది. మరింత సులువుగా..వేగంగా..! ఇతర దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులతో పాటుగా, ఇతర వ్యక్తులు భారత్‌లోని యూపీఐ కస్టమర్లు నగదు లావాదేవీలను సులభంగా, వేగంగా జరుపవచ్చును. వెస్ట్రన్ యూనియన్ , యూపీఐ ఇంటిగ్రేటెడ్ ఛానెల్‌ల ద్వారా డబ్బు పంపించుకోవచ్చును. ఛార్జీలు ఏలా ఉంటాయంటే..! విదేశీ మార్కెట్లో రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిపే లావాదేవీలోని ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు సాధారణంగా మార్కెట్ డైనమిక్స్, అందుబాటులోని ఛానెల్‌లపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఎన్పీసీఐ , వెస్ట్రన్ యూనియన్ భాగస్వామ్యంతో ఆయా లావాదేవీల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్..! -
కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ. 1.72 లక్షలు మాయం
హిమాయత్‌నగర్: ఫోన్‌పేలో డబ్బులు కట్ అయ్యాయని కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. ఉన్న వాటిని లూటీ చేశారని నగరవాసి ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరవాసి ఫోన్‌పే నుంచి కొంత డబ్బులు కట్ అయ్యాయి. తాను ఎవరికీ పంపకుండా ఇలా కట్ అవ్వడంపై తెలుసుకునేందుకు గూగుల్‌లో కనిపించిన ఫోన్‌పే కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేశాడు. వారు చెప్పిన విధంగా బ్యాంకు వివరాలు అన్నీ చెప్పడంతో అకౌంట్లో నుంచి రూ. 1.72 లక్షలు స్వాహా చేశారు. బజాజ్ ఫైనాన్స్ పేరుతో... బజాజ్ కార్డుపై లోను వచ్చిందని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని నగర వాసి ఒకరు సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి తాను బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నానని కాల్ చేశాడు. మీ కార్డుపై రూ. 5 లక్షల రుణం మంజూరైందన్నాడు. అది మీ అకౌంట్‌కు రావాలంటే డాక్యుమెంట్స్‌కి కొంత ఖర్చు అవుతుందన్నాడు. దీనికి సరే అనడంతో పలు దఫాలుగా రూ. 2.70 లక్షలు చెల్లించాడు. ఆపై రుణం రాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్ తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
ఫోన్‌పేలో ఉచితాలకు కోత.. ఈ సర్వీసులకు మొదలైన బాదుడు..
Phone Pay User Charges: ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇండియాలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఫోన్‌పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంతకాలం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులకు సంబంధించి ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో పెట్రోలు డీజిలు ధరలు పెరుగుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది. యూజర్ ఛార్జీలు ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, మొబైల్ రీఛార్జ్ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్ ఛార్జీల విధానాన్ని ఫోన్‌పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. బాదుడు ఇలా మొబైల్ రీఛార్జీలకు సంబంధించి రూ.50లోపు ఉన్న రీఛార్జీ సేవలను గతంలోలాగానే ఉచితంగా అందిస్తోంది. కానీ రూ. 50 నుంచి 100ల మధ్యన రీఛార్జ్ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్‌ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్‌లకు రెండు రూపాయల వంతున యూజర్ ఛార్జీలుగా ఫోన్‌పే విధించింది. కవరింగ్ మొబైల్ రీఛార్జీ యూజర్ చార్జీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌పే పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ప్రయోగాత్మకంగా యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది మాత్రమే యూజర్ ఛార్జీల పరిధిలోకి వస్తున్నారంటూ కవరింగ్ ఇస్తోంది. మార్కెట్ లీడర్ కానీ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఫోన్‌పే ద్వారా రికార్డు స్థాయిలో 165 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. యూపీఏ సర్వీసులు అందిస్తున్న థర్ట్ పార్టీ యాప్‌లలో ఒక్క ఫోన్‌పేనే 40 శాతం వాటాను ఆక్రమించింది. మార్కెట్ లీడర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే సమయంలో ఫోన్‌పై యూజర్ ఛార్జీలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం యూజర్ ఛార్జీలకు సంబంధించి ముందుగా కొంత ప్రచారం చేయాల్సిందని అంటున్నారు. చదవండి:ఇలా చేస్తే రూ.5000 ఉచితం..! -
బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో!
Buying Gold On PhonePe: కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. టీ బిల్లు దగ్గరి నుంచి ఇంటి రెంట్ వరకు అంతా యూపీఐ పేమెంట్స్‌లోనే చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు జోరు మీదున్నారు. ఆన్లైన్లో కొనేస్తున్నారు పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర ఆనవాయితీ. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్లైన్లో బంగారం కొనుగోలుకు ఓకే అనేస్తున్నారు. ఇటీవల ఫోన్ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్‌పే యాప్ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్‌పే యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 ఫోన్‌పేకు తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్‌ల కంటే ఫోన్‌పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. ఆన్లైన్ ట్రాన్స్క్షన్స్కి సంబంధించి యూనైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్ సేవలు అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో 42 శాతం తమ యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్‌పే ద్వారానే ట్రన్సాక్షన్స్ జరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్‌పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నాటక తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫోన్‌పే యాప్ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఫోన్ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైర్ టూ సిటీల్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి టైర్ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయి. అదే టైర్ 3 సిటీస్‌కి వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి రెంటు, హోటల్ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్ 3 సిటీస్‌లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతానికి పరిమితమయ్యాయి. అదే టైర్ 1 విషయానికి వస్తే ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు అయ్యింది. ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదు అయ్యాయి. పెరిగిన లావాదేవీలు ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో చేయడం మొదలైంది. అయితే 2020 మార్చిలో కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగింది. 2020 మార్చికి ముందు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో జరిగే ఆర్థిక లావాదేవీ విలువ ప్రతీరోజు సగటు 2 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 6 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్లలో రాని మార్పు కేవలం 18 నెలల్లోనే మూడింతలు అయ్యింది. చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే? -
ఫోన్‌పేకు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్
న్యూఢిల్లీ: చెల్లింపుల సేవల్లోని ప్రముఖ కంపెనీ ఫోన్‌పే.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నుంచి బీమా బ్రోకింగ్ లైసెన్స్ లభించినట్టు సోమవారం ప్రకటించింది. కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్‌తో బీమా వ్యాపారంలోకి ఫోన్‌పే గతేడాదే ప్రవేశించింది. నిబంధనల కింద ఒక్కో విభాగంలో మూడు కంపెనీలతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఉంటుంది. కానీ, ఇప్పుడు నేరుగా బ్రోకింగ్ లైసెన్స్ లభించడంతో అన్ని బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అనుమతులు లభించినట్టయింది. దీంతో బీమా బ్రోకింగ్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ సంస్థకు 30 కోట్లకుపైగా యూజర్ల బేస్ ఉంది. భారీ సంఖ్యలోనున్న యూజర్లకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయగలదు. -
యూపీఐ లావాదేవీల్లో ఎస్బీఐ, పేటీఎం, ఫోన్‌పే టాప్
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక లావాదేవీల రికార్డును ఫిబ్రవరి నెలలో ఎస్బీఐ నమోదు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఫోన్‌పే కూడా పలు విభాగాల్లో అగ్రగామిగా నిలిచాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై యాప్ ఆధారిత లావాదేవీలు, విలువ పరంగా ఎక్కువ నమోదు చేసింది ఫోన్‌పే. యాప్ విభాగంలో ఫోన్‌పే ద్వారా 975.53 మిలియన్ యూపీఐ చెల్లింపుల లావాదేవీలు జరిగాయి. ఎస్బీఐ 652.92 మిలియన్ల రెమిటెన్స్ లావాదేవీలను ఫిబ్రవరిలో నమోదు చేసింది. భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇకమీదట ఫిర్యాదుల స్వీకరణ కాగా, డిజిటల్ లావాదేవీలకు భీమ్ యూపీఐ యాప్‌ను వినియోగించే వారు తమ పెండింగ్ (అపరిష్కృత) లావాదేవీల వివరాలను పరిశీలించుకోవడంతోపాటు, ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చని ఎన్పీసీఐ ప్రకటించింది. కస్టమర్ అనుకూల, పారదర్శక ఫిర్యాదుల పరిష్కార విధానం ఉండాలన్న ఆర్బీఐ విధానంలో భాగమే నూతన సదుపాయమని పేర్కొంది. భీమ్ యూపీఐ యాప్‌పై యూపీఐ–హెల్ప్ ఆప్షన్ నుంచి ఈ సదుపాయాలను పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
డిజిటల్ బంగారం.. భద్రమేనా?
బంగారం అంటే ఆభరణమే కానక్కర్లేదు. పెట్టుబడి సాధనంగా బంగారానికి మన దేశంలో ఆదరణ పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో బంగారం ధరల ర్యాలీ.. ఇన్వెస్టర్లలో కొత్త విశ్వాసాన్ని చిగురింపజేసింది. 3,000 సంవత్సరాల నుంచి బంగారానికి విలువైన లోహంగా గుర్తింపు ఉంది. మన దేశంలో బంగారం ఆభరణాలు కుటుంబ ఆస్తిలో భాగం. దీనికి తోడు పెట్టుబడి సాధనంగానూ డిమాండ్ పెరుగుతోంది. గతేడాది కరోనా మహమ్మారి సమయంలోనూ బంగారంలో డిజిటల్ పెట్టుబడులు కొనసాగడం దీన్నే సూచిస్తోంది. డిజిటల్ గోల్డ్‌తోపాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు, బంగారంపై ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ‘బంగారం’ సాధనాలపై వివరాలను అందించే çసాక్షి ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. సహజంగా బంగారాన్ని భౌతిక రూపంలో (ఆభరణాలు, కాయిన్లు) కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికితోడు సార్వభౌమ బంగారం బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ కూడా ఆదరణ పొందుతోంది. ఇటీవలి కాలంలో బంగారానికి పెట్టుబడి దృష్ట్యా డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుండడం ఆసక్తికరం. మరి డిజిటల్ గోల్డ్ సంగతేంటి..? ఆభరణాల కోసమైతే ఫర్వాలేదు. అలా కాకుండా పెట్టుబడి కోణంలో భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వాటి స్వచ్ఛత ఎంతన్నది గుర్తించడం కష్టం. భద్రంగా దాచుకోవడం కూడా సమస్యే. అవసరమొచ్చి విక్రయించాలనుకుంటే ఆ బంగారానికి ఎంత విలువ కడతారన్నది చెప్పలేము. కానీ, డిజిటల్ గోల్డ్‌కు ఇటువంటి సమస్యలేవీ లేవు. ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. బీమా సదుపాయం కలిగిన ఖజానాల్లో వీటిని భౌతిక రూపంలో విక్రయదారే భద్రపరుస్తారు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు సులభంగా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. వేదికలు... మన దేశంలో డిజిటల్ గోల్డ్‌ను ప్రధానంగా మూడు సంస్థలు అందిస్తున్నాయి. అవి ఆగ్మంట్ గోల్డ్, ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (సేఫ్ గోల్డ్ బ్రాండ్‌పై). వీటి తరఫున గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎమ్, గ్రోవ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, అమెజాన్ ఇండియా తదితర సంస్థలు తమ వేదికలపై డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను కల్పిస్తున్నాయి. అంటే ఈ వేదికలపై కొనుగోళ్లు, అమ్మకాలు పైన చెప్పుకున్న మూడు సంస్థల తరఫున నడుస్తుంటాయి. ఆర్డర్ చేసిన తర్వాత.. అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు భౌతిక రూపంలో కొనుగోలు చేసి ఇన్వెస్టర్ పేరు మీద ఖజానాల్లో భద్రపరుస్తాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం, మొబైల్ నుంచే సు లభంగా పెట్టుబడులకు వీలుండడం డిజిటల్ గోల్డ్ పట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలని చెప్పుకోవాలి. డిజిటల్ బంగారంలో ట్రేడింగ్ గ్రోవ్, పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లేదా మోతీలాల్ ఓస్వాల్ సెక్యూ రిటీస్ మరే ఇతర సంస్థ అయినా కావచ్చు.. ఆయా ప్లాట్ఫామ్లో యూజర్ అయిఉండాలి. కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవాలనుకుంటే.. గ్రాములు లేదా రూపాయి వ్యాల్యూలో కొనుగోలు చేసుకోవచ్చు. పేమెంట్ విధానాన్ని ఎంచుకుని చెల్లింపులు చేస్తే సరిపోతుంది. బ్యాంకు ఖాతా, కార్డులు లేదా వ్యాలెట్ నుంచి అయినా చెల్లింపులు చేయవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించుకోవచ్చు. స్వచ్ఛంగా.. భౌతికంగా అందుకోవచ్చు.. ఒకవేళ విక్రయించుకునే ఉద్దేశం లేకుండా.. భౌతిక రూపంలో డెలివరీ తీసుకోవాలనే అనుకుంటే ఆ సదుపాయం కూడా ఈ వేదికల రూపంలో అందుబాటులో ఉంది. కాయిన్లు లేదా బులియన్ (బ్రిక్ ) రూపంలో మీ ఇంటి వద్దకే డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. డెలివరీ చార్జీలను కస్టమరే భరించాలి. స్వచ్ఛత/చార్జీలు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ, సేఫ్గోల్డ్ రెండూ 24 క్యారట్ బంగారాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. స్వచ్ఛత విషయానికొస్తే ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ 99.9 శాతం ప్యూరిటీ బంగారాన్ని ఇస్తుండగా.. సేఫ్గోల్డ్ మాత్రం 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తే నిల్వ కోసం ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఐదేళ్ల వరకు ఉచితంగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బంగారం కాయిన్లలోకి మార్చి డెలివరీ తీసుకోవాలి లేదా విక్రయించడం తప్పనిసరి. అకౌంట్ అచేతనంగా మారకుండా ఉండాలంటే ఆరు నెలలకు ఒక లావాదేవీ అయినా నిర్వహించాలి. ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై సేఫ్గోల్డ్ సంస్థ అందించే బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం స్టోరేజీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి రెండేళ్లకు ఎటువంటి చార్జీల్లేవు. మొదటిసారి కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా రెండేళ్లకు బంగారం 2 గ్రాములు అంతకంటే తక్కువే ఉంటే ప్రతీ నెలా విలువపై 0.05 శాతం చార్జీ కింద చెల్లించాలి. గోల్డ్ బ్యాలన్స్ నుంచి దీన్ని ప్రతీ నెలా మినహాయించుకుంటారు. గరిష్టంగా ఏడేళ్ల వరకు డిజిటల్ రూపంలో గోల్డ్‌ను సేఫ్గోల్డ్ వద్ద కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత డెలివరీ తీసుకోవడం లేదా విక్రయించడం చేయాలి. డిజిటల్ రూపంలో ఉంచుకోవాలనుకుంటే విక్రయించి మర్నాడు మళ్లీ కొనుగోలు చేయడం ఒక మార్గం. పెట్టుబడికి డిజిటల్ గోల్డ్‌తో పోలిస్తే మెరుగైన సాధనాలు ఉన్నాయి. బంగారం సౌర్వభౌమ బాండ్లను పరిశీలించొచ్చు. ఇందులో ప్రవేశ సమయంలో బంగారం మార్కెట్ ధర ఆధారంగా కేటాయింపులు చేస్తారు. గడువు తీరిన తర్వాత కూడా మార్కెట్ ధర ఆధారంగానే చెల్లింపులు చేస్తారు. దీనికితోడు వార్షికంగా 2.5% వడ్డీని చెల్లిస్తారు. కాకపోతే లాభాలపై పన్ను లేకపోవడం ఆకర్షణీయం. గోల్డ్ ఈటీఎఫ్‌లో అయితే లిక్విడిటీ పరంగా సమస్యఉండదు. క్రయ, విక్రయాలు అన్ని ట్రేడింగ్ రోజుల్లోనూ చేసుకోవచ్చు. ఫోన్‌పే ► ఫోన్‌పే సంస్థ అటు సేఫ్గోల్డ్ నుంచి.. ఇటు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ వేదికల నుంచి డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను అందిస్తోంది. అప్పుడు ప్రతీ లాకర్‌ను విడివిడిగా నిర్వహిస్తారు. ► రూపాయి లేదా 0.001 గ్రాము నుంచి బంగారాన్ని కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ► కనీసం రూ.5 గోల్డ్ కలిగి ఉండాలి. ఒకే రోజు కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్‌ను అదే రోజు అమ్మలేరు. ► యాప్‌లో కనిపించే బంగారం ధరలో కస్టమ్స్ డ్యూటీలు, పన్నులు కూడా కలిసే ఉంటాయి. ► గ్రాము పరిమాణం నుంచి కాయిన్ లేదా పెండెంట్ రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. పేటీఎమ్ పేటీఎమ్ ప్లాట్‌ఫామ్‌పై రూపాయి నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. గ్రాముల్లో అయితే 0.0005 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఒక కస్టమర్‌కు 50 గ్రాములు. ఇంతే పరిమాణాల్లో విక్రయించుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా కొనుగోలు చేసిన బంగారాన్ని నిల్వ చేసుకో వాలంటే అందుకు చార్జీ చెల్లించుకోవాలి. బంగారాన్ని విక్రయించే సమయంలో బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో విక్రయించిన 72 గంటల్లో ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసిన బంగారాన్ని మీకు నచ్చిన వారికి కానుకగా ఇచ్చుకునే సదుపాయం కూడా ఉంది. పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను కాయిన్‌గా మార్చుకోవాలంటే కనీస బంగారం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ కాయిన్ అయితే 0.5 గ్రాము నుంచి ప్రారంభమవుతుంది. ఆగ్మంట్ కాయిన్లు 0.1 గ్రాము నుంచి లభిస్తాయి. పేటీఎమ్ ఇటీవలే కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ తదితర సంస్థలతోనూ టైఅప్ అయింది. దీంతో పేటీఎమ్ యూజర్లు తమ డిజిటల్ గోల్డ్‌ను కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ సంస్థల్లో ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. గోల్డ్ రష్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు చెందిన.. ‘గోల్డ్రష్ఆన్లైన్ డాట్ కో డాట్ ఇన్’ పోర్టల్ నుంచి డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు అకౌంట్‌ను ప్రారంభించి, కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితమే. కనీసం రూ.100 నుంచి బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. రూ.50,000 మించితే పాన్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం ఒక గ్రాము అయినా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసిన బంగారాన్ని భద్రంగా నిల్వ చేస్తారు. బంగారం కొనుగోలుపై పరిమితి లేకపోవడం ఆకర్షణీయం. డిజిటల్ గోల్డ్ సానుకూలతలు ► భౌతిక రూపంలో పసిడిని ఒక్క రూపాయి నుంచే కొనుగోలు చేసుకునే సదుపాయం. ► ఆన్లైన్లో రుణాలకు తనఖా పెట్టొచ్చు. ► లావాదేవీలన్నీ 24 క్యారట్‡ స్వచ్ఛత కలిగినవి. సేఫ్ గోల్డ్ అయితే 99.5 శాతం స్వచ్ఛత బంగారాన్ని ఆఫర్ చేస్తుండగా, ఎమ్ఎమ్టీసీ పీఏఎమ్‌పీ అయితే 99.9 స్వచ్ఛతతో అందిస్తున్నాయి. ► కొన్న పసిడికి బీమా ఉంటుంది. ► డిజిటల్ గోల్డ్‌ను ఆభరణాలు, కాయిన్లు, బులియన్‌తో మార్పిడి చేసుకోవచ్చు. ► పెట్టుబడి కాల వ్యవధి తర్వాత బంగారాన్ని భౌతిక రూపంలో డెలివరీ అందుకోవచ్చు. ప్రతికూలతలు ► చాలా ప్లాట్ఫామ్ల్లో డిజిటల్ గోల్డ్ కొను గోలు ఒక కస్టమర్‌కు రూ.2లక్షల పరిమితిగా అమల్లో ఉంది. మరింత అధికంగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే పూర్తి కేవైసీ తప్పనిసరి. ► నిర్ణీత కాలం వరకే బంగారం నిల్వ సదుపాయాన్ని ఆఫర్ చేస్తూ, ఆ తర్వాత డెలివరీ తీసుకోవాలని సంస్థలు కోరుతున్నాయి. లేదంటే విక్రయించాల్సి రావచ్చు. కొనసాగిస్తే అదనపు చార్జీలు ఉంటాయి. ► డిజిటల్ గోల్డ్ కొనుగోలుపైనా 3% జీఎస్టీని చెల్లించాలి. ఉదాహరణకు రూ.1,000తో డిజిటల్ గోల్డ్‌కు ఆర్డర్ చేస్తే రూ.970విలువకే బంగారం పొందగలరు. దీనికితోడు ఇతర చార్జీలు కూడా ఉంటాయి. ► స్టోరేజీ చార్జీలు, బీమా, ట్రస్టీ ఫీజుల రూపంలో సంస్థలు 2–3 శాతం మేర చార్జీల కింద రాబట్టుకుంటున్నాయి. ► బంగారం డెలివరీ తీసుకోవాలంటే డెలివరీ చార్జీలు, కాయిన్లుగా అందుకోవాలంటే తయారీ చార్జీలను భరించాల్సి ఉంటుంది. నియంత్రణ ఎవరిది? డిజిటల్ గోల్డ్ కొనుగోలు, అమ్మకం ఎంతో సులభంగా ఉన్నప్పటికీ దీనిపై నియంత్రణ ఎవరిది? అన్న ప్రశ్న కచ్చితంగా ఇన్వెస్టర్లకు వస్తుంది. కొనుగోలు చేసిన విలువకు సరిపడా బంగారాన్ని మూడో పక్షానికి చెందిన ఖజానాల్లో భద్రపరుస్తారు. ఈ బాధ్యతలను చూసేందుకు ట్రస్టీలు ఉంటారు. కానీ, ఆచరణలో ఇలా నిల్వ చేస్తున్నారా? లేదా? అని చూసే యంత్రాంగం ఇప్పటికైతే లేదు. స్టాట్యుటరీ ఆడిట్లు నిర్వహించినప్పటికీ.. డిజిటల్‌గోల్డ్‌ను అందిస్తున్న సంస్థలకే నివేదికలను సమర్పించడం జరుగుతుంది. కానీ, ఇతర బంగారం డిజిటల్ సాధనాలు పలు నియంత్రణ సంస్థల కింద పనిచేస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. అదే సౌర్వభౌమ బంగారం బాండ్లపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. నియంత్రణ సంస్థ ఉంటే తగిన తనిఖీలు, పర్యవేక్షణ ఉంటుందని.. నియంత్రణ సంస్థ లేని పక్షంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల విషయంలో రాజీకి అవకాశం లేకపోలేదని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. కనుక డిజిటల్‌గోల్డ్‌ను కొనుగోలు చేసుకునే వారు బీమా సదుపాయం ఉందో, లేదో విచారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
మోసం: కారు గెలుచుకున్నారంటూ లూటీ
సాక్షి, ఎమ్మిగనూరు రూరల్: లక్కీడిప్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసానికి పట్టణానికి చెందిన ఓ యువకుడు బలయ్యాడు. ఒకే రోజు రూ.47,580లు ఫోన్ పే ద్వారా డబ్బు పంపి మోసపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఎం శ్రీనివాసులు షాపుల్లో చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగించేవాడు. గత నెలలో షాప్ క్లూస్‌లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా టీషర్ట్ కొనుగోలు చేశాడు. ఈ నెల 2న టీషర్ట్ తీసుకున్నందుకు మహింద్రా కంపెనీ కారు లక్కీ డ్రాలో గెలుపొందారంటూ మేసేజ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం 7890946443 నంబరుకు ఫోన్ చేయాలని ఉంది. వెంటనే ఫోన్ చేయగా ఫోన్‌తో పాటు కారు గెలుపొందారని, కారు వద్దనుకుంటే రూ.14,43,000 బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. అందుకు ట్యాక్స్ కింద రూ.14,430, ఆర్బీఐ చార్జీల కింద రూ.23,150, సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు మార్పు చేయడానికి రూ.10 వేలు పంపాలని చెప్పటంతో అలాగే పంపాడు. అదే రోజు సాయంత్రం 5.36 గంటలకు మరోసారి ఫోన్ చేసి ఎన్ఈఎఫ్టీ చార్జీ కింద రూ.24,600 పంపాలని చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇప్పటికే రూ. 47,580లు పంపానని ఇంకా డబ్బు కావాలనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించాడు. అయినా తాము అడిగిన డబ్బు పంపితేనే మొత్తం డబ్బు జమ చేస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటున్నాడు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) -
ఐపీవో బాట- ఫ్లిప్‌కార్ట్ బోర్డులో మిస్త్రీ
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా బోర్డు పునర్వ్యవస్థీకరణకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ అంశాలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి ఉద్యోగులకు తాజాగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం 2021లో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. బోర్డులో సీఈవో కళ్యాణ్‌తోపాటు.. హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ చేరనున్నారు. ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్లోబల్ సీఈవో సురేష్ కుమార్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ సైతం బోర్డులో సభ్యులు కానున్నారు. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ సీఈవో జుడిత్ మెకెన్నా బోర్డుకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. బోర్డు నుంచి బయటకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి హైప్రొఫైల్ వ్యక్తులు కొంతమంది వైదొలగనున్నారు. జాబితాలో వాల్‌మార్ట్ వ్యవస్థాపకులు స్టువార్ట్ వాల్టన్‌తోపాటు, కుటుంబ సభ్యులున్నారు. మరోవైపు వాల్‌మార్ట్ ఏషియాకు వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిర్క్ వాన్ డెన్ బెర్గే పదవీ విరమణ చేయనున్నారు. తద్వారా ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి తప్పుకోనున్నారు. మేక్‌మైట్రిప్‌కు చెందిన రాజేష్ మాగో, స్వతంత్ర డైరెక్టర్ రోహిత్ భగత్ సైతం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలగనున్నారు. రోహిత్ భగత్ ఫోన్‌పే కొత్త బోర్డులో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 40 బిలియన్ డాలర్లు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ విలువను మాతృ సంస్థ వాల్‌మార్ట్ 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. ఈ బాటలో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ విభాగం ఫోన్‌పేను ప్రత్యేక సంస్థగా విడదీయనుంది. దీనిలో భాగంగా ఫోన్‌పేకు సొంత బోర్డును ఏర్పాటు చేయనున్న్లట్లు తెలుస్తోంది. తదుపరి దశలో ఫోన్‌పే 5.5 బిలియన్ డాలర్ల విలువలో నిధులను సమకూర్చుకునే ప్రణాళిల్లో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
2020: గూగుల్ పే, ఫోన్ పే టాప్ వ్యాలెట్స్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యస్‌బ్యాంకు, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ బ్యాంకు 2020 సంవత్సరానికి అగ్రగామి 10 బ్యాంకుల్లో స్థానం సంపాదించుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, డూచే బ్యాంకు, ఐడీబీఐ టాప్ 10లో వరుసగా ఉన్నాయి. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్‌పే టాప్–2 వ్యాలెట్లుగా నిలిచినట్టు.. విజికీ విడుదల చేసిన ‘ది బీఎఫ్ఎస్ఐ మూవర్స్ అండ్ షేకర్స్ 2020’ నివేదిక ప్రకటించింది. బ్యాంకులు, వ్యాలెట్లు, యూపీఐ, ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల వేగవంతమైన పురోగతి గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తదనంతర పరిణామాలతో బీమాకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది యూపీఐ, వ్యాలెట్లు బాగా వినియోగంలోకి వచ్చాయని, కస్టమర్లకు ఇవి చేరువ కావడానికి నూతన అవకాశాలు వాటికి అందుబాటులోకి వచ్చాయని వివరించింది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందినట్టు పేర్కొంది. ఇక యోనో నంబర్ 1గా నిలవగా, నియో, కోటక్ 811 యాప్‌లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘‘ఎన్బీఎఫ్సీలు ఈ ఏడాది ఎంతో కీలకపాత్ర పోషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) నిధుల అవసరాలకు ప్రధాన వనరుగా మారాయి. కరోనా కాలంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు మరింతగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ విభాగంలో ఎక్స్పోజర్ పెంచుకున్నాయి’’ అని ఈ నివేదిక వివరించింది. -
గూగుల్‌పే స్క్రాచ్ కార్డులతో జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. చేతిలో డబ్బులు లేకపోయిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా కొనొచ్చు. ఎందుకంటే ప్రతి చోట పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటితో పాటు ఎవరికి డబ్బులు పంపిచాలన్న, వినియోగదారులు బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ నుంచే చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి స్క్రాచ్ కార్డులను కూడా అందిస్తున్నాయి. అయితే వీటిని అడ్డం పెట్టుకొని కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. వారు ఎలా మోసానికి పాల్పడుతున్నారో తెలుపే ఒక వీడియోని తెలంగాణ పోలీసుశాఖ తమ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో మీకు స్క్రాచ్ కార్డు వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి అని చూపెడుతుంది. అలా అక్కడ క్లిక్ చేయగానే మీ అకౌంట్లోకి డబ్బులు రావాల్సింది పోయి మీ అకౌంట్ నుంచే డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతాయి. అందుకే ఇక నుంచి స్క్రాచ్ కార్డులు అవి ఉపయోగించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: పోలీసులే లక్ష్యంగా మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్ -
ఫోన్‌పే యాప్ పేరు చెప్పి..
నెల్లూరు, ఉదయగిరి: ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయం చేసిన ఘటన బుధవారం ఉదయగిరిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక దిలార్‌భాయ్ వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి స్వీట్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఫోన్‌పే యాప్ గడువు తీరిందని, వివరాలు తెలిపితే తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పాడు. ఏటీఎం కార్డు, పిన్ నంబర్ చెబితేనే ఫోన్‌పే పనిచేస్తుందని నమ్మబలికాడు. దీంతో మహబూబ్ బాషా తనకు ఆ నంబర్లన్నీ తెలియవని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ వ్యక్తి మహబూబ్ బాషా సెల్‌ఫోన్‌కు ఒక లింక్ పంపి ఫోన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్‌పే పునరుద్ధరణ జరుగుతుందని వివరించాడు. దీంతో మహబూబ్ లింక్ ఓపెన్ చేశాడు. ఈక్రమంలో ఖాతాలోని నగదును ఆన్లైన్ ద్వారా డ్రా చేశారని చెబుతున్నాడు. బుధవారం బంధువులకు నగదు పంపేందుకు తన ఫోన్‌పే ద్వారా బ్యాలెన్స్ పరిశీలించుకోగా రూ.1,03,900 ఉండాల్సి ఉండగా కేవలం 36 పైసలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. దీంతో సదరు వ్యక్తి నగదు మాయం చేశాడని గుర్తించిన మహబూబ్ వెంటనే స్థానిక సిండికేట్ బ్యాంక్‌కు వెళ్లి అక్కడి అధికారులకు తెలిపాడు. వారి సూచన మేరకు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కీ చైన్.. గూగుల్ పే
కోవిడ్ వైరస్ నేపథ్యంలో మార్కెట్లో చిత్ర విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బడా షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద దుకాణాల్లోనే గూగుల్ పే వసతి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. కరెన్సీతో కరోనా సోకుతుందనే భయం కొందరిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కీ చైన్ల విక్రయదారు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించే వెసులుబాటును ఏర్పర్చుకున్నాడు. ఈ ‘వి’చిత్రం మంగళవారం కుత్బుల్లాపూర్‌లో కనిపించింది. భౌతికదూరమేశ్రీరామరక్ష! కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించడమే సరైన మార్గం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అనుసరించడం తప్పనిసరిగా మారుతోంది. మంగళవారం పంజగుట్టలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో వినియోగదారులు ముఖానికి మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి కొనుగోళ్లు చేశారు. చార్మినార్.. షాన్‌దార్.. చారిత్రాక స్మారకం.. అద్భుత నిర్మాణ వైభవం.. నాలుగు స్తంభాల్లోని నిర్మాణ శైలి అపురూపం.. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి చిహ్నం చార్మినార్. రంజాన్ పర్వదినం రోజు వెలిగిపోయినచార్మినార్కు మరుసటి రోజు ప్రకృతి రంగులద్దింది. మంగళవారంసాయంత్రం వేళ సప్తవర్ణ శోభితంగాచార్మినార్ వెలిగిపోయింది.ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఆ కట్టడం మరింతఆకర్శణీయంగా కనిపించింది. -
ఫోన్ పేతో అడ్డంగా దొరికిపోయాడు
న్యూఢిల్లీ : మెడికల్ షాపులో దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. ఈ వింత ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా వీధిలో ఉన్న ఒక ఫార్మసీ షాపులో గౌరవ్‌కుమార్ పనికి కుదిరాడు. అయితే పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోమవారం కుమార్ తన ముఖాన్ని టవల్‌తో చుట్టుకొని టోపీని అడ్డుపెట్టుకొని ఒక కస్టమర్‌లాగా షాపులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సేల్స్‌మెన్ కస్టమర్‌కు మందులను అమ్ముతున్నాడు. షాపులో సేల్స్‌మెన్ తప్ప ఎవరు లేకపోవడంతో దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించి కస్టమర్ వెళ్లిపోయాక కుమార్ షాపు షెట్టర్‌ను మూసేశాడు. తర్వాత సేల్స్‌మెన్ చేతులను కట్టేసి, నోటిలో గుడ్డను కుక్కి రూ. 75 వేల నగదు, రూ. 3వేలు విలువ చేసే మందులను ఎత్తుకెళ్లాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న షాపు ఓనర్ క్లోజ్ చేసిన షెటర్‌ను తెరవగానే సేల్స్‌మెన్‌ను షాక్‌కు గురయ్యాడు. తర్వాత సేల్స్‌మెన్ చేతులకున్న కట్లను విప్పేసి అసలు విషయం తెలుసుకొని తమకు సమాచారమందించాడని అల్ఫోన్స్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న తమకు మొదట ఏం ఆధారాలు దొరకలేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కవర్‌ను షాపు ముందు పడేయడం గమనించాము. వెంటనే ఆ కవర్‌ను పరిశీలించగా దాని మీద ఒక బార్కోడ్ ఉండడంతో స్కాన్ చేసి చూడగా 21 స్టోర్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. అన్ని స్టోర్స్‌కు వెళ్లి విచారించగా నిందితుడు ఆ కత్తిని ఫోన్ పే ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిసిందని అల్ఫోన్స్ వెల్లడించారు. విచారణలో నిందితుడి ఫోన్ నెంబర్ వివరాలను సేకరించి అతన్ని పట్టుకొని రూ. 65వేల నగదు, మందులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పేర్కొన్నారు. కాగా మిగతా రూ.10 వేలను నిందితుడు తన అవసరాలకు వాడినట్లు తెలిపాడు. నిందితుడి మీద కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీసీపీ అల్ఫోన్స్ వెల్లడించారు. కాగా, నిందితుడు గౌరవ్‌కుమార్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్పత్ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంతకముందు 2010లో దంపతుల హత్య కేసులో జైలుకెళ్లిన కుమార్ 8 సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించి 2018లో విడుదలయ్యాడని తెలిపారు. -
ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్ పే
సాక్షి: ఆన్లైన్ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే మే నెలలో4.70 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో గూగుల్ పే(తేజ్) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పే పాల్, క్యాష్ యాప్, యూనియన్ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పది కోట్ల డౌన్లోడ్లు సాధించాయి. కాగా గూగుల్ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్లోడ్ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్లోడ్లు ఇండియాలోనే జరిగాయి. -
డిజిటల్ గోల్డ్.. జిగేల్!
న్యూఢిల్లీ: బంగారం డిజిటల్ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012–13లో బంగారం డిజిటల్ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ రూపంలో బంగారాన్ని ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బంగారాన్ని ఆయా సంస్థల వద్దే స్టోర్ చేసుకునే అవకాశం లేదంటే భౌతిక రూపంలో డెలివరీ తీసుకునే సదుపాయాలు కూడా వినియోగదారులను ఆకర్షింపజేస్తున్నాయి. సేఫ్గోల్డ్, డిజిటల్ గోల్డ్ వంటి సంస్థలూ ఈ సేవలను అందిస్తున్నాయి. ఆగ్మంట్ అనే సంస్థ రిఫైనరీల వద్ద స్వచ్ఛమైన బంగారం నుంచి దాన్ని మార్కెటింగ్ వరకు సమగ్ర సేవల్లో ఉన్న కంపెనీ. ఈ సంస్థ ‘డిజిగోల్డ్’ పేరుతో 2012 నుంచి డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ సేవల్లోకి గూగుల్‌పే సైతం అడుగు పెట్టడం ఈ మార్కెట్ భారీగా విస్తరించేందుకు చేయూతనివ్వగలదని పరిశ్రమకు చెందిన ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్... వివిధ రకాల వేదికలుగా వార్షికంగా తొమ్మిది టన్నుల వరకు డిజిటల్ గోల్డ్ విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ అంచనా. ఇందులో సుమారు మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు దారులు ప్రత్యక్ష రూపంలో డెలివరీ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ వేదికల్లో బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతుండడం గమనార్హం. డిజిటల్ గోల్డ్ కొనే వారు పెరిగిపోతుండడం, దీనికి తోడు ఆన్లైన్లోనే ఆభరణాలు కొనే ధోరణి విస్తరిస్తుండడం సంప్రదాయ జ్యుయలరీ వర్తకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్‌కు ఆసక్తి చూపించడానికి నాణ్యమైన, పారదర్శక సేవల ప్రాముఖ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్న డిజిటల్ బంగారాన్ని ఉచితంగా స్టోర్ చేసుకునే సదుపాయం, కోరినప్పుడు బంగారం రూపంలోనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సేవలను అవి ఆఫర్ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్ గోల్డ్‌ను బంగారు ఆభరణాల కొనుగోలుతో మార్చుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆభరణాలుగా డిజిటల్ గోల్డ్ ఆగ్మంట్ సంస్థకు సొంతంగా గోల్డ్ రిఫైనరీ (బంగారం శుద్ధి కర్మాగారం) కూడా ఉంది. డెలివరీ కోరుకుంటే బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తోంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వేదికలుగానే స్టోర్ చేసుకునేందుకు గాను ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సేఫ్ గోల్డ్, ఆగ్మంట్ సంస్థలు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌తో ఇందుకోసం టై అప్ అయ్యాయి. డిజిటల్ ఖాతాల్లోని బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని క్యారట్‌లేన్, క్యాండిర్ (కల్యాణ్ జ్యుయలర్స్ ఆన్లైన్ సబ్సిడరీలు) సౌజన్యంతో అందిస్తున్నట్టు డిజిటల్ గోల్డ్ ఇండియా ఎండీ గౌరవ్ మాథుర్ తెలిపారు. సేఫ్గోల్డ్ మాతృ సంస్థే డిజిటల్‌గోల్డ్. వినియోగదారులకు మరిన్ని ఎంపికల అవకాశాలను అందించేందుకు జ్యుయలర్స్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు మాథుర్ చెప్పారు. పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్‌పే సంస్థల వేదికలపై కొనుగోలు చేసిన మొత్తాన్ని బంగారం రూపంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా సంస్థ తమ వోల్ట్‌లలో భద్రంగా ఉంచేస్తుంది. కోరితే డెలివరీ కూడా చేస్తుంది. గూగుల్ పే రాకతో డిజిటల్ ఖాతాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఓ కంపెనీ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఆగ్మంట్ సంస్థ బంగారం కాయిన్లను సైతం డెలివరీ చేస్తోంది. ‘‘వేల సంఖ్యలో జ్యూయలర్లను మా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. దీంతో ఆగ్మంట్ కస్టమర్లు తమ బంగారాన్ని ఆభరణాలతో మార్పిడి చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్, వ్యాలెట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆగ్మంట్ గోల్డ్ కొనే అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’’ అని ఆగ్మంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ► వ్యాలెట్ల నుంచి యాప్స్ నుంచి బంగారం కొనుగోలు చేసుకోవడాన్నే డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటారు. ► జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మంది డెలివరీ తీసుకోవడం లేదు. ► డెలివరీ తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది కాయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఈ ధోరణి కాస్తా భవిష్యత్తులో బంగారం ఆభరణాలను డెలివరీ తీసుకోవడానికి మారనుందని అంచనా. ► కనీసం రూ.100 నుంచి కూడా పేటీఎం, సేఫ్గోల్డ్ వేదికల్లో బంగారం కొనుక్కోవచ్చు. ► ప్రస్తుతం రోజువారీగా జరుగుతున్న డిజిటల్ గోల్డ్ లావాదేవీల పరిమాణం 8–9 కిలోలు. గూగుల్ పే ద్వారా పసిడి కొనుగోళ్లు ఎంఎంటీసీ–పీఏఎంపీతో జట్టు న్యూఢిల్లీ: చెల్లింపుల యాప్ గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కూడా జరిపే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇందుకోసం బులియన్ రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. గూగుల్ పే ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని యూజర్ల సూచనల మేరకు ఎంఎంటీసీ–పీఏఎంపీ సురక్షితమైన వోల్ట్‌లలో భద్రపరుస్తుందని గూగుల్ తెలిపింది. ఈ బంగారాన్ని లేటెస్ట్ ధర ప్రకారం ఎప్పుడైనా యూజర్లు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయొచ్చని వివరించింది. గూగుల్ పే యాప్‌లో ఎప్పటికప్పుడు తాజా ధరలు చూసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అసలు గూగుల్ పే యాప్.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు తగిన అనుమతులు తీసుకుందా, లేదా అన్న విషయంపై వివరణనివ్వాలంటూ నియంత్రణ సంస్థ ఆర్బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ కొత్తగా మరో ఫీచర్ ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థ కేవలం చెల్లింపులకు సంబంధించి టెక్నాలజీపరమైన సేవలు మాత్రమే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్సు అవసరం లేదని గూగుల్ వివరణనిచ్చింది. -
జియో యూజర్లకు ‘బర్త్‌డే’ గిఫ్ట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో పుట్టిన రోజు కానుకను ప్రకటించింది. రెండో వార్షికోత్సవ సెలబ్రేషన్స్‌లో భాగంగా నెలకు 100 రూపాయలకే 42 జీబీ హైస్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, జియో యాప్స్‌ను సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 21 వరకు వాలిడ్‌లో ఉండనున్నట్టు తెలిపింది. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 84 రోజులకు అందిస్తున్న రూ.399 ప్లాన్ ద్వారా పొందాల్సి ఉంది. రూ.399 ప్లాన్‌ను రూ.100 డిస్కౌంట్‌తో కేవలం రూ.299కే అందిస్తుంది. దీంతో నెలకు ఈ రీఛార్జ్ ప్లాన్ ధర 100 రూపాయలే పడుతుంది. రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 126 జీబీ డేటా, ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు. అంటే నెలకు సగటున 42 జీబీ డేటాను వస్తోంది. రూ.50ను జియో ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుండగా.. మరో రూ.50 క్యాష్‌బ్యాక్‌ను మైజియోపై ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు, ఫోన్‌పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే లభిస్తుంది. ఎలా ఈ ఆఫర్ పొందాలి? మొదట మైజియో యాప్‌లోకి లాగిన్ కావాలి. ‘బయ్’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి, రూ.399 రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పేమెంట్ మోడ్ పేజీలో, అందుబాటులో ఉన్న వాలెట్ ఆప్షన్ల జాబితా నుంచి ఫోన్‌పేను ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్‌పే అకౌంట్లోకి సైన్-ఇన్ అయి, వన్-టైమ్ పాస్‌వర్డ్‌తో ఫోన్‌పే అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలి. ‘పే బై ఫోన్‌పే’ను క్లిక్చేయాలి. -
ఫోన్‌పే చేతికి జాపర్ రిటైల్
న్యూఢిల్లీ: జాపర్ రిటైల్ సంస్థను డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే కొనుగోలు చేసింది. ఆఫ్‌లైన్ వ్యాపార విస్తరణలో భాగంగా జాపర్‌ను కొనుగోలు చేసినట్లు ఫోన్‌పే తెలిపింది. ఈ డీల్ ఆర్థిక వివరాలేవీ వెల్లడి కాలేదు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం హైపర్ లోకల్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ప్లాట్‌ఫామ్‌ను జాపర్ రిటైల్ నిర్వహిస్తోంది. కాగా మూడు లక్షలకు పైగా ఆఫ్‌లైన్, ఆన్లైన్ వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఫోన్ పే చెల్లింపులను అంగీకరిస్తున్నాయి. ఈ ఏడాది మేలో కంపెనీ వినియోగదారుల సంఖ్య పదికోట్లను, వార్షిక చెల్లింపుల టర్నోవర్ 2,000 కోట్ల డాలర్లను దాటాయి. -
దిగ్గజాలకు షాక్: ఫోన్ పేలో భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేకు మాతృసంస్థ నుంచి భారీ నిధులు సమకూరాయి. ఆన్లైన్ రిటైల్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పేకు రూ. 518 కోట్ల నిధులను అందించింది. డిజిటల్ పేమెంట్స్‌కు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్య తీసుకుంది. తద్వారా దేశంలో టాప్ కంపెనీగా ఎదగాలని పథకాలు రచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులు గూగుల్ తేజ్ పేటీఎం, అమెజాన్ పే లాంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌కు చెందిన పేరెంట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్ పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (సిఆర్సీ) తో దాఖలు చేసిన తాజా రెగ్యులేటరీ డాక్యుమెంట్ల ప్రకారం 518 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ తాజా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ మార్చి 19 న జరిగింది. రాబోయే సంవత్సరాల్లో తన చెల్లింపుల వ్యాపారం కోసం ఈ పెట్టుబడులను వెచ్చించినట్టు ఫోన్ పే తెలిపింది. -
పేటీఎం, ఫోన్‌పే.. ఢిష్యూం ఢిష్యూం
సాక్షి, న్యూఢిల్లీ: మెరిసే దంతా బంగారం కాదంటూ ప్రత్యర్థి కంపెనీపై ప్రముఖ చెల్లింపుల యాప్ ఫోన్ పే తీవ్ర విమర్శలకు దిగింది. తానే మార్కెట్ లీడర్నంటూ పేటీఎం అన్నీ గప్పాలు కొడుతోందని తన ప్రధాన ప్రత్యర్ధి, మరో డిజిటల్ మనీ పేమెంట్స్ ప్లాట్‌ఫాం పేటీఎంపై దాడికి దిగింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ లీడర్‌గా చెప్పుకుంటున్న పేటీఎంవి అన్ని అబద్ధాలే అంటూ ఆరోపిస్తోంది ప్లిప్కార్ట్కు చెందిన ఫోన్‌పే. అయితే ఈ మధ్య పేటియం యుపీఐ అధారిత డబ్బు చెల్లింపుల్లో తమే ముందున్నట్టు చెప్పుకుంది. దీంతో తమకు తామే నెంబర్ వన్‌గా పేటీయం చెప్పుకోవడం ఫోన్‌పేకు ఆగ్రహం తెప్పించింది. లావాదేవీల పరంగా చూస్తే పేటీయం చెల్లింపుల మార్కెట్లో ముందున్నట్టు కనిపిస్తున్నా.. దాని మొత్తం లావాదేవీల సగటు విలువతో పోల్చుకుంటే లావాదేవీల విలువ రూ.40 తక్కువగా ఉందని తెల్పింది. అసలు దాని వద్ద లావాదేవీల వివరాలు సరిగ్గా లేవని విమర్శించింది. యుపీఐను అధారిత సమాచారాన్ని పేటీయం తప్పుదోవ పట్టిస్తుందిని ఆరోపించింది. మొత్తం 21 మిలియన్ లావాదేవీలు పేటీయం వినియోగదారుల నుంచి ఫోన్ పే కు జరగగా అందులో 40వేల ప్రత్యేక వినియోగదారులు 500 లావాదేవీలను రూ.40 కంటే తక్కువగా జరిపారని తెలిపింది. మెరిసేదంతా బంగారం కాదు అంటు పేటీయం ను ఉద్దేశించి తన బ్లాగ్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపు యాప్‌లను వాడుతుండటంతో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి పోటీ తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఫోన్‌పే’లో ఫ్లిప్‌కార్ట్ 50 కోట్ల డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్.. తన చెల్లింపుల విభాగం ఫోన్‌పేలో 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,250 కోట్లు) పెట్టుబడిగా పెడుతోంది. 2015లో ఫోన్‌పే సంస్థను కొనుగోలు చేశామని, అప్పటి నుంచి ఈ సంస్థలో 7.5 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. ఫోన్‌పే కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం కోసం తాజాగా 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. ఒక భారత ఫైనాన్షియల్ టెక్నాలజీ చెల్లింపుల రంగంలో ఇదే అత్యధిక పెట్టుబడి అని పేర్కొంది. ఈ నిధులను టెక్నాలజీ ప్లాట్ఫార్మ్స్ కోసం, మర్చంట్ నెట్వర్క్ విస్తరణకు, వినియోగదారులను మరింతగా పెంచుకోవడానికి వినియోగిస్తామని ఫోన్‌పే సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన సమీర్ నిగమ్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రతి రెండు నెలలకు వంద శాతం చొప్పున ఫోన్‌పే వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా జోరుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఈ కామర్స్‌లు కీలకమని, యువజనం, టెక్నాలజీ కారణంగా ఇవి మంచి వృద్ధిని సాధించనున్నాయని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ బిన్నీ బన్సాల్ చెప్పారు. -
ఫోన్‌పే
ఫోన్‌పే అనేది ఒక మొబైల్ పేమెంట్స్ యాప్. యూపీఐ ట్రాన్సాక్షన్ల దగ్గరి నుంచి రీచార్జ్‌ల వరకు, నగదు బదిలీ నుంచి ఆన్లైన్ బిల్లుల చెల్లింపుల వరకు అన్నింటినీ ఈ యాప్ ద్వారా నిర్వహించొచ్చు. ‘ఫోన్‌పే’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ యాప్‌ను యస్ బ్యాంక్ ప్రమోట్ చేస్తోంది. ఫోన్‌పే అనేది ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ అనుబంధ కంపెనీ. ప్రత్యేకతలు ► డబ్బుల్ని ఏ సమయంలోనైనా పంపొచ్చు, పొందొచ్చు. ► డేటా కార్డులు, డీటీహెచ్, మొబైల్ ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్‌పెయిడ్ ఫోన్/డేటా కార్డు/ల్యాండ్‌లైన్ బిల్లులను కట్టేయవచ్చు. ► ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు. ► బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ► రిఫండ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చే మొత్తాన్ని వెంటనే పొందొచ్చు. ఇది వాలెట్‌కు వస్తుంది. దీన్ని తర్వాత బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ► ఫోన్‌పే వాలెట్‌ను డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ద్వారా నింపుకోవచ్చు. ► ఈ యాప్ తెలుగు సహా పలు స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ► ఫోన్‌పే యాప్ ద్వారా త్వరితగతి సురక్షితమైన లావాదేవీలను నిర్వహించవచ్చని కంపెనీ భరోసా ఇస్తోంది.