ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇకపై చాలా ఈజీ
ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్‌మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.
కొత్తగా వచ్చిన ఫీచర్‌లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు.
చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment