ఫోన్‌పే ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించినందకు గానూ వాల్‌మార్ట్, ఇతర ఫోన్‌పే వాటాదారులుపై భారీగా పన్నులు భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ పే మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేశాక.. అందులో మెజారిటీ యాజమాన్య హక్కులను వాల్‌మార్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫోన్‌పే విలువ పెరగడం, దీంతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఇండియాకు తరలించడంతో దాదాపు 1 బిలియన్ డాలర్లు పన్ను కట్టాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కన్నాయి.
జనరల్ అట్లాంటిక్, కతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇతరుల నుంచి 12 బిలియన్ డాలర్ల ప్రీ-మనీ వాల్యుయేషన్‌తో నిధులను సేకరించడం వల్ల ఫోన్‌పే పై భారీ చార్జీలు విధించే అవకాశం ఉంది. టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో సహా ఇన్వెస్టర్లు భారత్‌లో ఫోన్‌పే షేర్లను కొత్త ధరకు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటికే ఉన్న వాటాదారులకు దాదాపు 80 బిలియన్ రూపాయల పన్ను విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వీటిపై ఫోన్‌పై ప్రతినిధి స్పందించలేదు.
చాలా సంవత్సరాలుగా, టెక్ కంపెనీలు తమ వ్యాపారాలు, కార్యకలాపాల్లో ఎక్కువ భాగాన్ని భారతదేశంలో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన కార్యాలయాన్ని మాత్రం సింగపూర్‌లో ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆ దేశంలో ఉన్న ఫ్రెండ్లీ ట్యాక్స్ విధానం, విదేశీ పెట్టుబడులను సులభంగా పొందే సౌలభ్యమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఇండియా బ్రీఫింగ్ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి 8,000 భారతీయ స్టార్టప్‌లు సింగపూర్‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment