సాక్షి: ఆన్‌లైన్ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే మే నెలలో4.70 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో గూగుల్ పే(తేజ్) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పే పాల్, క్యాష్ యాప్, యూనియన్ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పది కోట్ల డౌన్‌లోడ్‌లు సాధించాయి. కాగా గూగుల్ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్‌లోడ్ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్‌లోడ్‌లు ఇండియాలోనే జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment