
సియోల్: చైనాకు చెందిన కృత్రిమ మేథ అంకుర సంస్థ డీప్‌సీక్‌కు చెందిన చాట్‌బాట్ యాప్‌ల డౌన్‌లోడ్‌ను తమ దేశంలో తాత్కాలికంగా నిలిపేసినట్టు దక్షిణ కొరియా అధికారులు సోమవారం ప్రకటించారు. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌ల నుంచి స్థానిక వెర్షన్ల డీప్‌సీక్ యాప్‌లను శనివారం సాయంత్రం తొలగించామని వెల్లడించారు.
యాప్‌ను తిరిగి ప్రారంభించే ముందు వినియోగదారుల భద్రతను పెంచడానికి తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తాజాగా డీప్‌సీక్ అంగీకారం తెలిపిందని దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే తమ ఫోన్లలో డీప్‌సీక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో ఉపయోగించే వినియోగదారులు యథాతథంగా తమ యాప్‌ను వినియోగించుకోవచ్చు.
ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆందోళనల నడుమ అనేక దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు డీప్‌సీక్‌ను తమ నెట్‌వర్క్‌ల నుంచి తొలగించాయి. ఉద్యోగులు తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఈ చాట్‌బాట్ సేవలను పొందకూడదని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీచేశారు. అయితే జనవరి నాలుగోవారం నాటికే దక్షిణ కొరియాలో 12 లక్షల మంది మొబైల్ వినియోగదారులు డీప్‌సీక్‌ను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment