downloads
-
చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర! నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు
వాషింగ్టన్: నిత్యం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలే జనం వారి అవసరాలకు తగ్గ యాప్, చాట్‌బోట్ వస్తే వాటికి ఎంతగా కనెక్టవుతారనేందుకు ఇది మరో ఉదాహరణ. కృత్రిమ మేథ చాట్‌బోట్ అయిన చాట్‌జీపీటీకి జనవరిలో రెండు, మూడు రోజులు రోజుకు 1.3 కోట్ల మంది చొప్పున కొత్త యూజర్లు జత చేరారు! ఇన్‌స్ట్రాగాం, టిక్‌టాక్ వంటివాటికి రెండేళ్లకు కూడా సాధ్యంకాని యూజర్ల సంఖ్యను రెండు నెలల్లోనే చాట్‌జీపీటీ సాధించి చూపించింది. అసలు గత నవంబర్‌లో లాంచైన ఐదు రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లను సాధించింది. ఇది కూడా మరే సోషల్ మీడియా మాధ్యమానికీ, యాప్‌కూ సాధ్యం కాని ఘనతే. లాంచైన రెండు నెలలకే చాట్‌జీపీటీ ఖాతాలో ఇప్పుడు 10 కోట్ల మంది యూజర్లు ఉండటం విశేషం. 10 కోట్ల యూజర్లు కావడానికే టిక్‌టాక్‌కు తొమ్మిది నెలలు, ఇన్‌స్ట్రాగామ్‌కు 2.5 సంవత్సరాలు పట్టిందని సెన్సార్ టవర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రేమలేఖలూ రాస్తుంది... చాట్‌జీపీటీ పనితీరు అంతా ఇంతా కాదు. మన ఆదేశాలకనుగుణంగా అదే ఇ–మెయిల్ రాసిపెడుతుంది. మన భావాలు తెలిపితే చక్కటి ప్రేమలేఖనూ సిద్ధం చేస్తుంది. దాంతో యువతతోపాటు పలు రంగాల వృత్తినిపుణులు కూడా దీనికి ఫిదా అయిపోయారు. సాప్ట్వేర్ ఉద్యోగాల్లో ఎంట్రీ లెవల్ (ఎల్3) స్థాయిలో కోడింగ్ కూడా రాసిపెడుతుందని గూగుల్ వర్గాలు ధ్రువీకరించినట్టు సీఎన్‌బీసీ ఇటీవల ఒక కథనంలో పేర్కొంది. సెర్చ్ ఇంజన్ రంగంలో తన ఆధిపత్యానికి చాట్‌జీపీటీ ఎసరు తెస్తుందని ఊహించిన గూగుల్ వెంటనే తన సొంత కృత్రిమ మేథ చాట్‌బోట్ లాఎండీఏను సిద్ధంచేస్తోంది. మేలో దాన్ని ఆవిష్కరించే అవకాశముంది. దీనితోపాటే మరో 21 కృత్రిమ మేథ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గూగుల్ దృష్టిపెట్టింది. -
ఫేస్బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్రయ్ అంటూ రాకెట్లా..!
రష్యాకు చెందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు ఒక బిలియన్ (100కోట్లకు) పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. టెలిగ్రామ్‌ను రష్యాకు చెందిన పావెల్ దురోవ్ 2013లో స్థాపించారు. కలిసొచ్చిన ఫేస్బుక్ డౌన్...! అక్టోబర్ 4 న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో టెలిగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. ఫేస్బుక్ డౌన్ అవ్వడంతో సుమారు 70 మిలియన్ల కొత్త యూజర్లు టెలిగ్రామ్ తలుపు తట్టారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ కావడం ఇదే తొలిసారి. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన సెన్సార్ టవర్ డేటా ప్రకారం... ఈ ఏడాది ఆగస్టులో టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డౌన్లోడ్ల మైలురాయిని దాటిందని పేర్కొంది. ఒక బిలియన్ డౌన్లోడ్స్ను దాటిన యాప్స్ జాబితాలో వాట్సప్ , ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ , స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ సరసన టెలిగ్రామ్ కూడా చేరింది. అంతేకాకుండా టెలిగ్రామ్ భారత మార్కెట్లో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా ఆవిర్భవించిందని సెన్సార్ టవర్ వెల్లడించింది. భారత్, రష్యా, ఇండోనేషియా దేశాలు టెలిగ్రామ్ ప్రధాన మార్కెట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో యాప్ ఇన్‌స్టాల్స్‌లో భారత్ నుంచి 22 శాతం, రష్యా 10 శాతంతో, ఇండోనేషియా 8 శాతంతో టెలిగ్రామ్ నిలిచింది. 2021 ప్రథమార్ధంలో 214.7 మిలియన్ యూజర్లు టెలిగ్రామ్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. 2020తో పోలిస్తే 61 శాతం మేర అత్యధికంగా డౌన్లోడ్స్ పెరిగాయి. చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..!
అగ్రరాజ్యాలను సైతం వెనక్కినెట్టి భారత్ సరికొత్త రికార్డులను సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లను అత్యధికంగా డౌన్లోడ్ చేసిన దేశంగా భారత్ నిలిచింది. యాప్ యానీ రూపొందించిన ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ యాప్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. 2021 ప్రథమార్థంలో యాప్స్ డౌన్లోడ్ విషయంలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతున్న వారిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. చదవండి: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..! నివేదిక ప్రకారం, 2021 ప్రథమార్ధంలో యాప్స్ డౌన్లోడ్ విషయంలో ఆసియా ఖండం 60 శాతం మేర ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అందులో 1.5 బిలియన్లకు పైగా యాప్ డౌన్లోడ్లతో భారత్ ముందుంది. వాస్తవానికి భారత్ యాప్ డౌన్లోడ్స్ విషయంలో 2018 నుంచి అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు 70 బిలియన్ల మేర యాప్స్‌ను డౌన్లోడ్ చేసినట్లు యాప్ ఆన్నీ తన నివేదికలో పేర్కొంది. 2021 ప్రథమార్ధంలో 4.7 బిలియన్ యాప్‌లు డౌన్లోడ్ అయ్యాయి. గంటలపాటు యాప్స్‌లోనే.. భారత్‌లో ఎమ్ఎక్స్ టాకటాక్, ఇన్స్టాగ్రామ్, జోష్, మోజ్, స్నాప్‌చాట్ యాప్‌లను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్లోడ్ చేసినట్లు యాప్ఆన్నీ పేర్కొంది. యాప్ ఆన్నీ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రథమార్ధంలో పలు సోషల్ మీడియా యాప్స్‌లో యూజర్లు 740 బిలియన్ గంటల మేర గడిపారు. భారత్‌లో యూజర్లు సుమారు 160 బిలియన్ గంటల పాటు సోషల్ మీడియా యాప్స్‌లో గడిపినట్లు యాప్ ఆన్నీ పేర్కొంది. భారతీయుల్లో ఎక్కువగా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రూకాలర్ యాప్స్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతున్న యాప్స్‌గా నిలిచాయి. యూట్యూబ్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వాడుతున్న యాప్‌గా యూట్యూబ్ నిలిచింది. అందులో మాత్రం అమెరికానే ఫస్ట్..! పలు యాప్స్‌కు రుసమును వెచ్చించి సేవలను పొందుతున్న యూజర్ల సంఖ్యలో భారత్ 17 వ స్థానంలో నిలిచింది. భారత్‌లో ఎక్కువగా హాట్‌స్టార్, చామెట్, టాంగో లైవ్, ట్రూ కాలర్, జీ 5 యాప్స్‌లకు ఎక్కువ మంది యూజర్లు వాడుతున్నారు. పెయిడ్ యాప్ సర్వీసులను వాడుతున్న యూజర్ల సంఖ్యలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..? -
వెనుకబడ్డ ఫేస్బుక్..దూసుకెళ్లిన టిక్‌టాక్..!
షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంగా నిలిచిన ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. భారత్ లాంటి దేశాల్లో నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డౌన్‌లోడ్‌లో టిక్‌టాక్ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ యాప్‌లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి. కాగా టిక్‌టాక్‌ను తిరిగి భారత మార్కెట్లలోకి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్‌టాక్ భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే టిక్‌టాక్ యాప్ డౌన్లోడ్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ ఏషియా పేర్కొంది. -
ప్రపంచ జనాభాను మించి... యూట్యూబ్ వరల్డ్ రికార్డ్ !
ప్రపంచంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. టెక్నాలజీ ప్రపంచంలో మిగిలిన యాప్‌లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరీ అందనంత ఎత్తులో నిల్చుంది. 1000 కోట్లు ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు, అయితే ఇప్పటి వరకు యూ ట్యూబ్ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్లోడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటన్నింటీని వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు వచ్చాయి. దీంతో యూట్యూబ్ వరల్డ్ రికార్డు సాధించగలిగింది. ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్ యాప్ వెయ్యి కోట్ల సార్లు డౌన్లోడ్ అయ్యింది. తర్వాత స్థానం ప్లే స్టోర్‌కి సంబంధించి యూట్యూబ్ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్లోడ్లలతో ఫేస్బుక్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాట్సప్ 600 కోట్లు, ఫేస్బుక్ మెసేంజర్ 500 కోట్లు, ఇన్స్టాగ్రామ్ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ సైతం ఇక సంచలనాలకు కేంద్ర బిందువైన టిక్‌టాక్ 200 కోట్లు, సబ్వే సర్ఫర్ వంద కోట్లకు పైగా డౌన్లోడ్లు సాధించాయి. ఫేస్బుక్ లైట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్‌లు రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్లోడ్ అయ్యాయి. -
గేమింగ్‌కు మహిళల ఫ్యాషన్ హంగులు
సాక్షి, బెంగగళూరు: స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ దేశీయంగా మహిళలు మొబైల్ గేమ్స్‌పై మరింతగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫ్యాషన్, హెయిర్ స్టయిల్ మొదలైన థీమ్స్‌తో రూపొందిన గేమ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, బ్రెజిల్ తరహాలో ఫ్యాషన్ గేమ్స్‌కు భారత్ కూడా కీలక మార్కెట్‌గా ఎదుగుతోంది. యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ అధ్యయనం ప్రకారం 2020లో ఈ తరహా యాప్స్ డౌన్లోడ్లు 100 శాతం పైగా పెరిగాయి. ఇక ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి మధ్య దాకా చూస్తే జింగా సంస్థకు చెందిన ’హై హీల్స్’ గేమ్ 68 లక్షల పైగా ఇన్‌స్టాలేషన్స్ నమోదు చేసుకుంది. అలాగే, లయన్ స్టూడియోస్కి చెందిన ’ఐసింగ్ ఆన్ ది డ్రెస్’ డౌన్లోడ్లు దాదాపు 41 లక్షల మేర నమోదయ్యాయి. కార్టూన్ ఆర్ట్ స్టయిల్ గల ఫ్యాషన్ థీమ్ గేమ్స్‌కు బ్రెజిల్, భారత్ వంటి మార్కెట్లలో బాగా ప్రాచుర్యం లభిస్తోంది. హెయిర్ సెలూన్ అనే గేమ్ డౌన్లోడ్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2020లో ఏకంగా 314 శాతం పైగా నమోదవడం ఇందుకు నిదర్శనంగా సెన్సార్ టవర్ పేర్కొంది. హైహీల్స్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని దీన్ని రూపొందించిన రోలిక్ సంస్థ వర్గాలు తెలిపాయి. ఆడటం సులువు... గందరగోళ నిబంధనలేమీ లేకుండా సరళంగా ఉండటం, మరీ ఎక్కువ సేపు సమయం వెచ్చించాల్సిన అవసరం లేకపోవడం ఈ తరహా గేమ్స్‌కి ప్రధాన ఆకర్షణగా ఉంటోంది. సరదాగా కాస్సేపు ఆడాలనుకునే మహిళలకు ఇవి అనువుగా ఉంటున్నాయని సెన్సార్ టవర్ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాషన్ పోకడలను ప్రతిఫలించేలా తీర్చిదిద్దుతున్న గేమ్స్ వైపు కూడా మహిళలు మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. క్రేజీల్యాబ్స్ సంస్థ రూపొందించిన ఎక్రిలిక్ నెయిల్స్ ఈ కోవకి చెందినదే. గత కొద్ది నెలలుగా ఈ విభాగంలో అత్యధికంగా డౌన్లోడ్లు నమోదు చేసుకున్న టాప్ 3 యాప్స్‌లో ఇది కూడా ఒకటి. కొత్తగా డిజైన్ చేసిన ఎక్రిలిక్ నెయిల్స్ వీడియోలు, ఫొటోలు వంటివి పోస్ట్ చేసే అవకాశం వీటిలో ఉండటం గేమర్స్‌ను ఆకర్షిస్తోంది. దీంతో ప్రధానంగా మహిళల కోసం ఇలాంటి గేమ్స్ మరిన్ని రూపొందించడంపై గేమింగ్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. 43 శాతం మంది మహిళలే.. దేశీయంగా మొబైల్ గేమ్‌లు ఆడేవారిలో 43 శాతం మంది మహిళలు ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 77 శాతం మంది కనీసం రోజుకోసారైనా ఒక్క మొబైల్ గేమ్ అయినా అడుతున్నారు. 32 శాతం మంది మహిళలు స్వల్పంగా పది నిమిషాల సమయమైనా గేమింగ్ కోసం వెచ్చిస్తున్నారు. -
పబ్జీ లాభాల్లో భారత్ వాటా 1.2 శాతమే...
ముంబై: దేశంలో పబ్జీ యాప్ నిషేధించినప్పటికీ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పబ్జీ మొబైల్ యాప్ 2018లో పారంభమైనప్పటి నుంచి యాప్ వినియోగదారులు 3.5 బిలియన్ డాలర్స్ ఖర్చు చేసినట్లు సెన్సార్ టవర్స్ అనే కంపెనీ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. కేవలం ఈ ఏడాదిలోనే 19.8 కోట్ల డౌన్లోడ్లు కాగా... 1.8 బి.డా(180కోట్లు) సంపాధించడం విశేషం. అంతే కాదు గత 72 రోజుల్లో 50 కోట్ల డాలర్లు పబ్జీ యాప్ ఆర్జించింది. ఈ గణాంకాలు ఇదిలా ఉండగా, భారత దేశంలో ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పబ్జీ యాప్ వినియోగదారుల్లో 24 శాతం మన దేశంలోనే ఉన్నారు. కానీ ఈ యాప్‌కు వచ్చే లాభాల్లో మన దేశం నుంచి కేవలం 1.2 శాతం మాత్రమే. రాయల్ పాస్, రకరకాల రంగులు, ఇంకా యాప్‌లోని కొన్ని పరికరాలు కొనేందుకు మన దేశంలో ఉన్న పబ్జీ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఈ నెల 2న చైనాకు చెందిన 118 యాప్స్‌తో పాటు పబ్జీ కూడా నిషేధించిన విషయం తెలిసిందే. దీన్ని ద్వారా ఈ యాప్ పబ్లిషర్ టెన్సెంట్ కంపెనీకి 34 బి.డా నష్టపోయింది. మన దేశంలో పబ్జీని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. ఇప్పుడు మన దేశంలో ఈ యాప్‌ను డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయడం చట్ట విరుద్ధం. రెవెన్యూ పరంగా మన దేశంలో కొంత నిరాశగానే ఉన్నా, మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. ఈ వివాదాన్ని పరిశీలించి టెన్సెంట్ కంపెనీ నుంచి పూర్తి హక్కులు పొందినట్లు పేర్కొంది. భారత్‌లో మళ్లీ పబ్జీని ప్రారంభించేందుకు స్వదేశీ బ్రాండ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: భారత్‌లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్) -
వాట్సాప్ @ 500 కోట్ల డౌన్లోడ్లు
శాన్ఫ్రాన్సిస్కో: దిగ్గజ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్‌యేతర యాప్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్ నుంచి చేసుకున్న డౌన్లోడ్లు మాత్రమేగాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్ ఫోన్లలో ప్రీఇన్స్టాల్గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్‌కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు 130 కోట్ల మంది, వియ్చాట్కు 110 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. సోషల్ నెట్‌వర్క్‌లలో ఫేస్బుక్, యూట్యూబ్‌ల తర్వాత వాట్సాప్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్ 230 కోట్ల డౌన్లోడ్లను సాధించగా, ఫేస్బుక్ 300 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. మరోవైపు టిక్‌టాక్ యాప్ 2019లో రెండో అత్యధిక డౌన్లోడ్లు సాధించిన యాప్‌గా నిలిచింది. వాట్సాప్ సేవల్లో అంతరాయం.. భారత్‌తో పాటు, పలు దేశాల్లో వాట్సాప్ స్తంభించింది. ఫొటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్లు చేయలేకపోయామని పలువురు యూజర్లు ట్విట్టర్ వేదికగా ‘వాట్సాప్‌డౌన్’ హాష్‌టాగ్‌తో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు. సందేశాలు అందుకోవడం, పంపడం వంటి వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారత్, యూరోప్, మలేసియా, ఇండోనేసియా, బ్రెజిల్‌లోని పలు చోట్ల ఈ సమస్య ఎదురైంది. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను వాట్సాప్ ఇంజనీర్లు పరిష్కరించారు. -
ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టిన టిక్‌టాక్..
న్యూఢిల్లీ : చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ ఎంతో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఇది మరోసారి రుజువైంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా టిక్‌టాక్ యాప్ డౌన్లోడ్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింట్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ మెసేంజర్‌ను వెనక్కినెట్టివే సిందని పేర్కొంది. 2018లో డౌల్‌లోడ్స్ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్బుక్ మేసెంజర్, ఫేస్బుక్ యాప్‌లను అధిగమించి రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. టిక్‌టాక్ యాప్ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధాన కారణమని తెలిపింది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్లోడ్ చేసుకున్నవారిలో 45 శాతం భారత్ నుంచే ఉన్నట్టు పేర్కొంది. అయితే డౌన్లోడ్స్ పరంగా వాట్సాప్ యాప్‌ను టిక్‌టాక్ క్రాస్ చేయలేకపోయింది. దాదాపు 850 మిలియన్లపైగా డౌన్‌లోడ్స్‌తో వాట్సాప్ యాప్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. 2019 చివరి మూడు నెలల్లో వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్స్‌లో 39 శాతం పెరుగుదల కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది. సెన్సార్ టవర్ వెల్లడించిన వివరాల ప్రకారం వాట్సాప్ మొదటి స్థానంలో, టిక్‌టాక్ రెండో స్థానంలో, ఫేస్బుక్ మెసేంజర్ మూడో స్థానంలో, ఫేస్‌బుక 4వ స్థానంలో, ఇన్స్టాగ్రామ్ 5వ స్థానంలో నిలిచాయి. ఇందులో టిక్‌టాక్ తప్ప మిగిలిన నాలుగు యాప్‌లు కూడా ఫేస్బుక్ సంస్థకు చెందినవే. -
ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్ పే
సాక్షి: ఆన్లైన్ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే మే నెలలో4.70 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో గూగుల్ పే(తేజ్) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పే పాల్, క్యాష్ యాప్, యూనియన్ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పది కోట్ల డౌన్లోడ్లు సాధించాయి. కాగా గూగుల్ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్లోడ్ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్లోడ్లు ఇండియాలోనే జరిగాయి. -
10 నెలల్లో కోటిదాటిన ‘యోనో’ యాప్ డౌన్లోడ్స్!
డౌన్‌లోడ్స్‌లో ఎస్బీఐ యోనో (యూ ఓన్లీ నీడ్ వన్) యాప్ రికార్డు సృష్టించింది. పది నెలల్లో కోటికిపైగా ‘యోనో’ యాప్ డౌన్లోడ్స్ జరిగినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏబీఎఫ్ రిటైల్ బ్యాంకింగ్ అవార్డ్, 2018లో కూడా ‘మొబైల్ బ్యాంకింగ్ ఇనిషియోటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను యోనో గెలుచుకుంది. 2017 నవంబర్ 24వ తేదీన యోనో సేవల ఆవిష్కరణ జరిగింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి కోటికిపైగా యాప్ డౌన్లోడ్స్ జరిగినట్లు పేర్కొన్న ఎస్బీఐ... ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తున్న మర్చంట్ల సంఖ్య 85 దాటినట్లు వివరించింది. -
డిలీట్ చేసినా మళ్లీ డౌన్లోడ్ చేయొచ్చు
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మనకు ఇతరులు పంపిన ఫొటోలు, వీడియోలు తదితరాలను మనం ఒకసారి డిలీట్ చేస్తే వాటిని మళ్లీ డౌన్లోడ్ చేయడం ఇప్పటివరకు సాధ్యమయ్యేది కాదు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా తెచ్చిన ఫీచర్‌తో ఇది సాధ్యమే. వాట్సాప్‌లో ఎవరైనా పంపిన ఫైళ్లను ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి డిలీట్ చేసినా.. మళ్లీ ఆ ఫైల్ పంపిన వారి చాట్ విండోలోకి వెళ్లి వాటిని మరోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.18.106 లేదా ఆపై వర్షన్లలో ఈ అప్డేట్ ఉన్నట్లు సమాచారం. గతంలో వాట్సాప్‌లో ఒకరు పంపిన ఫైల్‌ను గ్రహీత డౌన్లోడ్ చేయగానే ఆ ఫైల్ వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అయిపోయేది. ఒకవేళ గ్రహీత ఆ ఫైల్‌ను డౌన్లోడ్ చేయకపోతే గరిష్టంగా 30 రోజుల వరకు అది సర్వర్లలో ఉండేది. ఇకపై గ్రహీత ఫైల్‌ను డౌన్లోడ్ చేసినా సరే అది వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అవ్వదు. కాబట్టి వినియోగదారులు ఆ ఫైల్‌ను తమ ఫోన్లో పొరపాటున డిలీట్ చేసినా మరోసారి డౌన్లోడ్ చేసుకోగలరు. -
బాహుబలి ది గేమ్@మిలియన్ డౌన్లోడ్స్
న్యూఢిల్లీ: బాహుబలి సినిమా నుంచి ప్రేరణతో రూపొందించిన 'బాహుబలి ది గేమ్'ను ఒక మిలియన్ మంది డౌన్లోడ్ చేశారు. ముఖ్యంగా బాహుబలి-2 విడుదల అనంతరం గేమ్ డౌన్లోడ్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో దేశంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన గేమ్‌లలో బాహుబలి ది గేమ్ పదో స్ధానానికి చేరింది. బాహుబలి సినిమాకు పని చేసిన కొంతమంది ఆర్టిస్టులు గేమ్ తయారీలో కూడా పాల్గొన్నారు. ఈ గేమ్‌ను బెంగుళూరుకు చెందిన మూన్‌ఫ్రాగ్ ల్యాబ్స్ అనే కంపెనీ రూపొందించింది. -
భీమ్ యాప్ @1.8 కోట్ల డౌన్లోడ్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘భీమ్’ డౌన్లోడ్స్ 1.8 కోట్లను అధిగమించాయి. సురక్షితమైన త్వరితగతి క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ల కోసం కేంద్రం గతేడాది డిసెంబర్లో ఈ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘భీమ్ యాప్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. యాప్‌ను ఆవిష్కరించిన రోజైన 2016 డిసెంబర్ 30 నుంచి చూస్తే దీని డౌన్లోడ్స్ ఇప్పటికే 1.8 కోట్లను అధిగమించాయి. గో క్యాష్‌లెస్ గో డిజిటల్’ అని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విటర్లో తెలిపారు. కాగా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. -
భీమ్ యాప్ డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ భీం(బీహెచ్ఐఎం) రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారరంభించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ కు భారీ ఆదరణ లభిస్తోంది డౌన్ లోడ్స్లో 17 మిలియన్లను దాటిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. తొలుత ఈ యాప్‌కు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పిన కాంత్ అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీంతో పాపులర్ ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబరు, డిసెంబర్ కాలంలో యూఎస్ఎస్డీ ఆధారిత ట్రాన్సాక్షన్లు (ఫీచర్ ఫోన్లో బ్యాంకింగ్ సేవలకు పయోగించే మొబైల్ కోడ్ సందేశం) 45 శాతం పెరిగాయని, నవంబరు 8కి ముందు భారత్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని అమితాబ్ కాంత్ వెల్లడించారు. కాగా డీమానిటైజేషన్ అనంతరం డిశెంబర్ 30 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ బీమ్ యాప్ ను లాంచ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహ అందించే దిశగా ఈయాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ముఖ్యంగా మొబైల్ వాలెట్స్, యూఎస్ఎస్డీ,రూ పే లాంటి డిజిటల్ చెల్లింపులకు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. -
ఉల్లి లొల్లి
నగరంలో భారీ కొరత మహారాష్ట్ర నుంచి సాధారణ దిగుమతి సిండికేట్ వ్యాపారంతో చాలని పరిస్థితి ప్రైవేట్ మార్కెట్లో రూ.30పై మాటే రైతుబజార్లలో లేనేలేవు విజయవాడ : నగరంలో ఉల్లిపాయల కొరత తారస్థారుుకి చేరింది. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో రైతుబజార్లలో ఉల్లి విక్రయూలు కనుమరుగయ్యూరుు. కర్నూలులో పంట ముగిసి మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అరుు్య కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధర అమాంతం పెంచేశారు. దీంతో ప్రైవేట్ మార్కెట్లో కేజీ రూ.30పైనే అమ్ముతున్నారు. వారంలో కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా రోజూ విజయవాడ మార్కెట్‌కు దాదాపు వంద లారీల ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటారుు. ఒక్కో లారీలో పది టన్నుల ఉల్లిపాయలు ఉంటాయి. ప్రస్తుతం కర్నూలులో ఉల్లిపాయల పంట ముగియడంతో నగరంలో భారీ కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర సరుకుపై ఆధార పడాల్సి వస్తోంది. దూరప్రాంతం నుంచి సరుకు దిగుమతి కావటంతో ధర ఒక్కసారిగా పెరిగింది. వారం రోజులుగా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు 50 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఇందులో 25 లారీలు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, మిగిలిన 25 లారీలు నగర మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అరుు్య వీటిని కూడా ప్రజలకు కాకుండా చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్ మొదట్లో మహారాష్ట్రలోని నాందేడ్, అహ్మద్‌నగర్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యూరుు. అరుుతే, అక్కడ కూడా వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేలర్స్ సోలాపూర్ ఉల్లిపాయలను తెప్పిస్తున్నారు. ఇంతా కష్టపడి తెప్పించే ఉల్లిపాయలను వ్యాపారులు సిండికేట్‌గా మారి విక్రరుుస్తున్నారు. సాధారణంగా నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా రోజుకు పది లారీల ఉల్లిపాయల విక్రయాలు మాత్రమే జరుగుతుంటాయి. అలాగే, జిల్లాలోని రైతుబజార్లలో 43 టన్నులు, బహిరంగ మార్కెట్‌కు మరో 60 టన్నులు కేటారుుస్తారు. ఈ నేపథ్యంలో రోజూ మార్కెట్‌కు వచ్చే 25 లారీల ఉల్లిపాయల్లో పది లారీలు పోగా, మిగిలిన వాటిని వ్యాపారులు నిల్వ ఉంచేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఉల్లి కొరత ఏర్పడటంతో నిల్వ ఉన్న వాటిని బయటకు తీసి అధిక ధరలకు విక్రరుుస్తున్నారని తెలిసింది. రైతుబజార్లలో కనుమరుగు వారం రోజులుగా నగరంలోని స్వరాజ్యమైదానంతో పాటు జిల్లాలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు నిలిచిపోయూరుు. మెక్కుబడిగా అక్కడక్కడ మాత్రమే విక్రరుుస్తున్నారు. వీటికి మార్కెటింగ్ శాఖ అధికారులు కేజీ రూ.17గా ధర నిర్ణయించారు. అరుుతే, కొరత కారణంగా విజయవాడ మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులే కేజీ రూ.22కు కొంటున్నారు. రిటైల్ వ్యాపారులు రవాణా, ఇతర ఖర్చులు కలుపుకొని రూ.26కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రైతుబజార్లో మార్కెటింగ్ అధికారులు నిర్ణరుుంచిన రూ.17కు అమ్మడానికి వ్యాపారులు ఇష్టపడట్లేదు. అలా చేస్తే తమకు నష్టమని కొందరు ఉల్లిపాయలు అమ్మడమే మానేశారు. మరికొందరు మాత్రం నాసిరకం సరుకు అమ్ముతున్నారు. ప్రజల్లో ఆందోళన ఉల్లిపాయల ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు మాయాజాలం చేసి రేట్లు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉల్లిపాయలు దొరక్క అవస్థలు పడుతున్నారు. మార్కెటింగ్ అధికారులు జోక్యం చేసుకుని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. 4.