డౌన్‌లోడ్స్‌లో ఎస్‌బీఐ యోనో (యూ ఓన్లీ నీడ్ వన్) యాప్ రికార్డు సృష్టించింది. పది నెలల్లో కోటికిపైగా ‘యోనో’ యాప్ డౌన్‌లోడ్స్ జరిగినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏబీఎఫ్ రిటైల్ బ్యాంకింగ్ అవార్డ్, 2018లో కూడా ‘మొబైల్ బ్యాంకింగ్ ఇనిషియోటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను యోనో గెలుచుకుంది.
2017 నవంబర్ 24వ తేదీన యోనో సేవల ఆవిష్కరణ జరిగింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల నుంచి కోటికిపైగా యాప్ డౌన్‌లోడ్స్ జరిగినట్లు పేర్కొన్న ఎస్‌బీఐ... ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తున్న మర్చంట్‌ల సంఖ్య 85 దాటినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment