అగ్రరాజ్యాలను సైతం వెనక్కినెట్టి భారత్ సరికొత్త రికార్డులను సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లను అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన దేశంగా భారత్ నిలిచింది. యాప్ యానీ రూపొందించిన ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ యాప్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. 2021 ప్రథమార్థంలో యాప్స్ డౌన్‌లోడ్ విషయంలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతున్న వారిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
నివేదిక ప్రకారం, 2021 ప్రథమార్ధంలో యాప్స్ డౌన్‌లోడ్ విషయంలో ఆసియా ఖండం 60 శాతం మేర ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అందులో 1.5 బిలియన్లకు పైగా యాప్ డౌన్‌లోడ్‌లతో భారత్ ముందుంది. వాస్తవానికి భారత్ యాప్ డౌన్‌లోడ్స్ విషయంలో 2018 నుంచి అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు 70 బిలియన్ల మేర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసినట్లు యాప్ ఆన్నీ తన నివేదికలో పేర్కొంది. 2021 ప్రథమార్ధంలో 4.7 బిలియన్ యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యాయి.
గంటలపాటు యాప్స్‌లోనే..
భారత్‌లో ఎమ్‌ఎక్స్ టాకటాక్, ఇన్‌స్టాగ్రామ్, జోష్, మోజ్, స్నాప్‌చాట్ యాప్‌లను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసినట్లు యాప్‌ఆన్నీ పేర్కొంది. యాప్ ఆన్నీ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రథమార్ధంలో పలు సోషల్ మీడియా యాప్స్‌లో యూజర్లు 740 బిలియన్ గంటల మేర గడిపారు. భారత్‌లో యూజర్లు సుమారు 160 బిలియన్ గంటల పాటు సోషల్ మీడియా యాప్స్‌లో గడిపినట్లు యాప్ ఆన్నీ పేర్కొంది. భారతీయుల్లో ఎక్కువగా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రూకాలర్ యాప్స్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతున్న యాప్స్‌గా నిలిచాయి. యూట్యూబ్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వాడుతున్న యాప్‌గా యూట్యూబ్ నిలిచింది.
అందులో మాత్రం అమెరికానే ఫస్ట్..!
పలు యాప్స్‌కు రుసమును వెచ్చించి సేవలను పొందుతున్న యూజర్ల సంఖ్యలో భారత్ 17 వ స్థానంలో నిలిచింది. భారత్‌లో ఎక్కువగా హాట్‌స్టార్, చామెట్, టాంగో లైవ్, ట్రూ కాలర్, జీ 5 యాప్స్‌లకు ఎక్కువ మంది యూజర్లు వాడుతున్నారు. పెయిడ్ యాప్ సర్వీసులను వాడుతున్న యూజర్ల సంఖ్యలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది.
చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..?
Comments
Please login to add a commentAdd a comment