భీమ్‌ యాప్ @1.8 కోట్ల డౌన్‌లోడ్స్‌ | BHIM app breaks all records, crosses 18 million downloads | Sakshi
Sakshi News home page

భీమ్‌ యాప్ @1.8 కోట్ల డౌన్‌లోడ్స్‌

Published Sat, Mar 18 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

భీమ్‌ యాప్ @1.8 కోట్ల డౌన్‌లోడ్స్‌

భీమ్‌ యాప్ @1.8 కోట్ల డౌన్‌లోడ్స్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ‘భీమ్‌’ డౌన్‌లోడ్స్‌ 1.8 కోట్లను అధిగమించాయి. సురక్షితమైన త్వరితగతి క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్ల కోసం కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ఈ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘భీమ్‌ యాప్‌ అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. యాప్‌ను ఆవిష్కరించిన రోజైన 2016 డిసెంబర్‌ 30 నుంచి చూస్తే దీని డౌన్‌లోడ్స్‌ ఇప్పటికే 1.8 కోట్లను అధిగమించాయి. గో క్యాష్‌లెస్‌ గో డిజిటల్‌’ అని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విటర్‌లో తెలిపారు. కాగా భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) యాప్‌ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement