Bhim App
-
ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. -
పేటీఎంకు బైబై.. సంబరపడిపోతున్న ప్రత్యర్థులు!
పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్‌లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్లోడ్లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్లోడ్లు 10.6 శాతం తగ్గాయి. న్యూయార్క్‌లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్లోడ్లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి. ♦ భీమ్ యూపీఐ డౌన్లోడ్లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి. ♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్లోడ్లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి. ♦ ఫోన్ పే డౌన్లోడ్లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్‌లకు మారారు. ‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమేనని, పేటీఎం యాప్‌పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు. ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్లోడ్లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు. -
ఈ యాప్ యూజర్లకు ఆఫర్లే ఆఫర్లు.. రూ.750 వరకు క్యాష్‌బ్యాక్!
BHIM App Offers: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ (BHIM) తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పొందడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. యూజర్ బేస్ పెంచుకునేందుకు మొదట్లో గూగుల్ పే అందించినట్టుగానే భీమ్ యాప్ కూడా విభిన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ అందించే రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 1 శాతం క్యాష్ బ్యాక్ వచ్చే మరో ఆఫర్ కూడా ఉంది. భీమ్ యాప్‌లో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి. ఆఫర్లను మరింత కాలం పొడిగించే అవకాశం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. రూ.750 క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే.. ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ చేసే యూజర్లు భీమ్ యాప్ ద్వారా రూ. 150 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ ఖర్చులు అంటే రైల్వే టిక్కెట్ బుకింగ్‌లు, క్యాబ్ రైడ్లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులపై రూ. 100 మించి లావాదేవీలు చేస్తే రూ. 30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను కనీసం 5 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా గరిష్టంగా రూ. 150 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఇక రూ. 600 క్యాష్‌బ్యాక్ అందించే మరో ఆఫర్ కూడా ఉంది. రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యాప్‌నకు లింక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అన్ని మర్చంట్ యూపీఐ పేమెంట్లపై రూ. 600 క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను అందుకోవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్‌పై రూ. 30 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా ఈ ఆఫర్లన్నీ కలుపుకొంటే మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. ఇవేకాకుండా భీమ్ యాప్ ఉర్జా (Urja) ఒక శాతం స్కీమ్‌ను కూడా అందిస్తోంది. దీని కింద పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో సహా అన్ని ఫ్యూయల్ పేమెంట్లపై 1 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ రూ. 100 లేదా అంతకు పైబడి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులపై కూడా వర్తిస్తుంది. భీమ్ యాప్‌తో లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లలో ఈ క్యాష్‌బ్యాక్ నేరుగా క్రెడిట్ అవుతుంది. -
రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్!
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు.. ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి ► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. ► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది.. ►1.Send Money ►2. Request Money ►3. Check Balance ►4. My Profile ►5. Pending Request ►6. Transactions ►7. UPI Pin ► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయండి. ► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి (send) ఎంటర్ చేయండి. ► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపండి. ► ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి (send) ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది. చదవండి: అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! -
అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు లాభాలు!
ఆన్లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్ (Rupay credit card)లను భీం యాప్ (BHIM UPI) యాప్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్‌లో షాపింగ్‌తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డులను స్వైపింగ్ మిషన్ల వద్ద స్వైప్ చేయాల్సిన అవసరం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం! క్రెడిట్ కార్డ్ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్లైన్ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్పీసీఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా.. భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లేకుండానే కేవలం భీం యాప్‌కి లింక్ చేసిన మీ యూపీఐ అకౌంట్‌తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే సమస్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి. ఈ బ్యాంకులకు మాత్రమే.. కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే తొలుత భీం యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేరకు గత సెప్టెంబర్ 20న ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రభుత్వం రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ ప్రత్యేక పథకానికి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2021 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద సుమారు రూ.1300 కోట్ల మేర భారం పడనుంది. భీమ్-యూపీఐ ద్వారా రూ.2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకులు రూపే డెబిట్ కార్డు, భీమ్-యుపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలను చేసేవారికి ప్రోత్సాహకలు అందించనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని మంత్రివర్గం పేర్కొంది. బ్యాంకు సేవలు అందుకోలేనివారు, దిగువ వర్గాలకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ డిజిటల్ ఏకొ సిస్టమ్ లో పేద ప్రజలను భాగస్వామ్యం చేయాలని చూస్తుంది. (చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!) -
సింగపూర్‌లోనూ భీమ్ యాప్
సింగపూర్: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్. అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను (ఎస్‌జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ పేర్కొన్నారు. -
ఇక్కడంతా వెరీ 'స్మార్ట్' !
సాక్షి, ఆత్మకూరు : కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా టెక్నాలజితో సమానంగా పరుగులు తీస్తున్నారు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్నే చుట్టి వస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు ఉంటే చాలు ఏ పనైనా సులువుగా చేసేస్తున్నారు. 4జీదే హవా ప్రస్తుత ప్రతి ఒక్కరి చేతిలో 4 జీ సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. స్టూడెంట్ మొదలు ఉద్యోగి దాకా అంతా స్మార్ట్‌బాటలో పయనిస్తున్నారు. తమ అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఎక్కువగా ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు. దూరానికి వెళ్లి చేసుకోవాల్సిన పనులు సైతం ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో కానిచ్చేస్తున్నారు. పరుగుకు స్వస్తి గతంలో కరెంట్ బిల్లులు , గ్యాస్ బిల్లులు, రేషన్ బిల్లులు ఇలా ఏ బిల్లు చెల్లించాలన్నా ఆయా కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి కొన్ని పనులకు అర్ధరోజు కూడా పట్టేది. అయితే ఇప్పుడు డిష్ బిల్లు మొదలు టిఫిన్ బిల్లు దాకా నీటి పన్ను మొదలు సినిమా టికెట్ దాకా అన్నింటికీ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్‌లను వినియోగిస్తూ చక్కబెట్టుకుంటున్నారు. తప్పిన చిల్లర సమస్య గతంలో ఏ దుకాణానికి వెళ్లినా రూ.5 విలువ చేసే వస్తు కొనాలంటే చిల్లర సమస్య వచ్చేది. దీంతో దుకాణదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు టీ తాగినా సరే ఎక్కువ మంది యాప్‌ల ద్వారానే నగదును బదిలీ చేసేస్తూ ఏ గొడవా లేకుండా బయటపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా చిన్న బడ్డీ కొట్టు మొదలు పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల దాకా వాటి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, సరుకుల అంగళ్లు, ఎరువుల దుకాణాలు ఒక్కటేంటి అంతా స్మార్‌బాట పట్టారు. -
20% జీఎస్టీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. -
జీఎస్టీ గుడ్‌న్యూస్ : డిజిటల్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను రూపే, భీమ్ యాప్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు లభించనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పైలట్ ప్రాజ్జెక్టుగా ముందుగా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు ప్రయోగాత్మంగా, స్వచ్ఛందంగా ప్రారంభించనున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సాధించిన ఆదాయం, నష్టం లాంటి అంశాలను అంచనా వేయనున్నామని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహాకాలపై బీహార్ డిప్యూటీముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం ప్రతిపాదనలకౌన్సిల్ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే 20శాతం దాకా క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెల్లించనున్నామని వెల్లడించారు. మొత్తం జీస్‌ఎటీపై గరిష్టంగా వంద రూపాయలు వరకు పొందవచ్చని గోయల్ చెప్పారు. కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29తేదీల్లో గోవాలో జరుగనుంది. -
యాప్‌కీ కహానీ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సులభ, తక్షణ లావాదేవీల కోసం ‘భీమ్ ఎస్బీఐ పే’ అనే యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని ఏ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు అయినా ఉపయోగించొచ్చు. ‘భీమ్ ఎస్బీఐ పే’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ యాప్‌ను ఉపయోగించాలంటే.. బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. అలాగే డెబిట్ కార్డు కూడా అవసరమౌతుంది. ♦ వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ).. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్.. క్యూఆర్ కోడ్ వంటి మూడు విధానాల్లో చెల్లింపులు నిర్వహించొచ్చు. ♦ మీరు కస్టమర్ అయితే చెల్లింపులు చేయవచ్చు. అదే వ్యాపారి అయితే పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. ♦ ఒక ట్రాన్సాక్షన్ ద్వారా గరిష్టంగా లక్ష రూపాయలు పంపగలం. అలాగే ఒక రోజులో గరిష్టంగా ఇతరులకు రూ.లక్ష వరకు పంపొచ్చు. ♦ అదే మీరు వ్యాపారస్తులు అయితే.. ‘ఐ యామ్ ఎ మర్చంట్’ ఆప్షన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత కస్టమర్ల నుంచి పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. ♦ మల్దిపుల్ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించొచ్చు. లావాదేవీల వివరాలు పొందొచ్చు. ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. -
ఐఆర్సీటీసీ ఆఫర్ : వారికి ఫ్రీ ట్రావెల్
దేశీయ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది. భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా రైల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడానికి నెలవారీ లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. భీమ్ యాప్ లేదా యూపీఐ పేమెంట్ ఆప్షన్లను వాడే వారి కోసం గత నెలలోనే ఈ స్కీమ్‌ను దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లాంచ్ చేసింది. ఆరు నెలల కాలంలో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి నెలా తొలి వారంలో ముందటి నెలలోని ఐదుగురు లక్కీ ప్రయాణికులను కంప్యూటరైజడ్ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ డ్రాలో గెలుపొందిన ఐదుగురికి మొత్తం రైల్వే టిక్కెట్ ధరను వెనక్కి ఇచ్చేస్తారు. భీమ్ లేదా యూపీఐ ఆప్షన్ల ద్వారా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌పై ఈ-టిక్కెట్లను విజయవంతంగా బుక్ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారని ఐఆర్సీటీసీ ప్రకటించింది. టిక్కెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు, పీఎన్ఆర్లకు వ్యతిరేకంగా టీడీఆర్ ఫైల్ చేసిన వారు ఈ స్కీమ్‌కు అర్హులు కారని తెలిపింది. డిసెంబర్1 నుంచి భీమ్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకునే అనుమతిని రైల్వే అందిస్తోంది. -
‘భీమ్’తో బుక్ చెయ్... రిఫండ్ కొట్టెయ్
న్యూఢిల్లీ: ప్రజలు భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ప్రోత్సహించడానికి రైల్వే శాఖ నెలవారీ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించింది. ఇందులో విజేతలుగా నిలిచే ఐదుగురికి మొత్తం ప్రయాణ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. భీమ్ యాప్ లేదా ఠీఠీఠీ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn వెబ్సైట్లో యూపీఐ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ ఈ పథకాన్ని గత నెలలో ప్రవేశపెట్టింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా అంతకు ముందు నెలకు సంబంధించిన ఐదుగురు విజేతలను ప్రకటిస్తారు. ప్రయాణికుడు తాను ప్రయాణించిన నెలలోనే ఈ పథకం కింద లక్కీ డ్రాకు అర్హుడు. -
భీమ్ యాప్ వాడితే, పెట్రోల్‌పై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు కొండెక్కుతున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష దగ్గర్నుంచి రేట్లు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది. ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటరు పెట్రోల్‌పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక అకౌంట్ ఈ ప్రకటన చేసింది. అంతేకాక బ్యాంకు కార్డులకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయట. ఇటీవల అమెరికాలో సంభవించిన ఇర్మా, హార్వే తుఫాన్ల కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ ప్రభావంతో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు 15 శాతం మేర పైకి ఎగిశాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ డ్యూటీలను కోత పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ వచ్చే నెల దీపావళి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయంటూ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీదారు కార్బన్ కే 9 కవచ్ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫింగర ప్రింట్ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్ ధరనుకేవలం రూ.5290 కేఅందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది. కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ -
డబ్బు రూపంలో ఫీజులు తీసుకోవద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
ఇక వేలిముద్రతో నగదు రహిత చెల్లింపులు
న్యూఢిల్లీ: ఇక నగదు రహిత లావాదేవీలకు డిబెట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అక్కర్లేదు, పేటీఎం తరహా చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్ లావా దేవీలూ అవసరం లేదు. మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం, ఓటీపీ నెంబర్లు చూసుకోవడం, పిన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల నెంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. త్వరలోనే ఇవన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆధార్ ఆధారిత భీమ్ యాప్‌తో సాధ్యం కానున్నాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ యాప్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే. 1. ఆధార్ ఆధారిత భీమ్ యాప్ బయో మెట్రిక్ విధానంతో నడుస్తుంది. ఆధార్ ఇచ్చేటప్పుడు అధికారులు వేలి ముద్రలు తీసుకున్నారుకనుక, ఆ వేలు ముద్రల ధ్రువీకరణ ద్వారానే లావాదేవీలు నడుస్తాయి. 2. ఇప్పటికే దేశంలోని బ్యాంకులన్నింటికీ ఆధార్ కార్డులకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాలు అధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాలను భీమ్ యాప్‌కు అనుసంధానం చేస్తున్నారు. మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులుంటే చాలు. ఎక్కడైనా వేలి ముద్ర ధ్రువీకరణ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. 3. వ్యాపారులు మాత్రం వేలి ముద్రలను స్కాన్‌చేసే పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిలో వినియోగదారుడు ఎంత చెల్లించాలో పేర్కొన్నాక వేలిముద్ర ఇస్తే చాలు. వేలి ముద్రను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాను గుర్తించి ఆ ఖాతాలోని ఆ సొమ్మును భీమ్ యాప్ వ్యాపారస్థుని ఖాతాలోకి బదిలీ చేస్తుంది. 4. ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 30 బ్యాంకులు భీమ్ యాప్ లావాదేవీల్లో పొల్గొంటున్నాయి. వాటిల్లో ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు ఉన్నాయి. 5. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో పనిచేసే భీమ్–ఆధార్ యాప్‌ను గత డిసెంబర్లోనే ప్రారంభించగా ఇప్పటి వరకు 1.9 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 6. కార్పొరేట్ స్థాయి లావాదేవీలకు కాకుండా ప్రస్తుతానికి సాధారణ చెల్లింపులకు పరిమితం చేయనున్నారు. -
భీమ్ యాప్ @1.8 కోట్ల డౌన్లోడ్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘భీమ్’ డౌన్లోడ్స్ 1.8 కోట్లను అధిగమించాయి. సురక్షితమైన త్వరితగతి క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ల కోసం కేంద్రం గతేడాది డిసెంబర్లో ఈ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘భీమ్ యాప్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. యాప్‌ను ఆవిష్కరించిన రోజైన 2016 డిసెంబర్ 30 నుంచి చూస్తే దీని డౌన్లోడ్స్ ఇప్పటికే 1.8 కోట్లను అధిగమించాయి. గో క్యాష్‌లెస్ గో డిజిటల్’ అని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విటర్లో తెలిపారు. కాగా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. -
15 ఏళ్లు దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: 15 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఆధార్ అప్డేట్ తప్పనిసరని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. 15 ఏళ్ల లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారు తిరిగి తమ ఆధార్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల వయస్సు లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. సామాజిక పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేసిన కారణంగా బయోమెట్రిక్ సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వృద్ధుల బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్‌ను పరిగణన లోకి తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు త్వరలో భీమ్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. -
‘భీమ్’తో రూ.361 కోట్ల లావాదేవీలు
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భీమ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు రూ.361 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ⇔ ఉద్యోగుల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించడం లేదా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేయడానికి వీలు కల్పించే వేతనాల చెల్లింపు(సవరణ) బిల్లు–2017కు పార్లమెంట్లో ఆమోదం లభించింది. ⇔ వ్యాధులను నయంచేయడంలో పంచగవ్య (ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో తయారయ్యే మిశ్రమం) పాత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ⇔ దిగుబడి నష్టం, తెగుళ్ల దాడులు, ధరల పతనంతో ఆదాయంలో తగ్గుదల నుంచి రైతులను ఆదుకునేందుకు తోట పంటలకు ఆదాయ బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
గతవారం బిజినెస్
మాల్యా కేసులో 8 మంది అరెస్ట్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి... ఐడీబీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యోగేష్ అగర్వాల్ సహా 8 మందిని సీబీఐ గత సోమవారం అరెస్ట్ చేసింది. వీరిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ ఉద్యోగులు ముగ్గురు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నలుగురు ఉన్నారు. సరైన తనఖాలు లేకుండా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు రూ.950 కోట్లు రుణమిచ్చారని యోగేశ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్యా నివాసం సహా బెంగళూరులోని యూబీ టవర్స్‌లో, అగర్వాల్ తదితరుల నివాసాల్లో సీబీఐ సోమవారం తనిఖీలు చేశాక అరెస్ట్‌లు జరిగాయి. బీఎస్ఈ ఐపీఓకు భారీ స్పందన బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. దేశంలో తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ, ఈ ఏడాది తొలి ఐపీఓ కూడా అయిన బీఎస్ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖవిలువ గల 1.54,27,197(28.26 శాతం వాటా) షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు మినహా జారీ చేయనున్న 1,07,99,039 షేర్లకు గాను 55,23,34,986 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. బుధవారం ముగిసిన రూ.805–806 ఇష్యూ ధరగా ఉన్న ఈ రూ.1,243 కోట్ల ఐపీఓకు రూ.44,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. డిమోనేటైజేషన్ తర్వాత వచ్చిన తొలి ఐపీఓ ఇది. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ బీఎస్‌ఈనే. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ప్రపంచంలో పదవది. త్వరలో ఎన్ ఎస్ఈ రూ.10,000 కోట్ల ఐపీఓ రానుంది. భారత్‌లో త్వరలో ఐఫోన్స్ తయారీ! అమెరికా, చైనాలో ఐఫోన్ ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వ్యయాలు తగ్గించుకునే దిశగా ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ల తయారీపై ఆసక్తి వ్యక్తం చేసిన యాపిల్.. తాజాగా ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకుంది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేశ్ అభిషేక్ సారథ్యంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందంతో భేటీ అయిన కంపెనీ వర్గాలు ఈ విషయాలు వివరించాయి. తెలుగులో భీమ్ యాప్ డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్ ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) వెల్లడించింది. అప్డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్డేట్. డాక్టర్ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ల డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది. పీవీఆర్ స్క్రీన్ల వేట మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. స్క్రీన్ల కొనుగోళ్ల కోసం ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోబోమని, అంతర్గత వనరుల నుంచే నిధులు సమకూర్చుకుంటామని వివరించారు. ప్రస్తుతం పీవీఆర్ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. మారుతీ కార్లు ప్రియం మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెరిగాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 రూ.8,014 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)వరకూ పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కమోడిటీ, రవాణా, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.2.45 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.12.03 లక్షలు ధర ఉన్న ఎస్–క్రాస్ మోడల్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఈ కంపెనీ కొన్ని రకాల మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.5,000 రేంజ్లో పెంచింది. కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజా ధరను రూ.20,000, ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనో ధరను రూ.10,000 చొప్పున పెంచింది. -
దుమ్ము రేపుతున్న ’భీమ్’ యాప్
-
డిజిటల్ చెల్లింపులపై ‘టోల్‌ఫ్రీ’
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులపై ప్రజల సందేహాలు తీర్చడానికి, సమాచారం అందించడానికి కేంద్రం 14444 అనే టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మధ్యే ప్రారంభించిన భీమ్ యాప్, ఈ వాలెట్లు, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, యూఎస్ఎస్డీలకు సంబంధించిన సందేహాలకు హెల్ప్‌లైన్ బదులిస్తుంది. 14444 హెల్ప్‌లైన్ ప్రస్తుతానికి హిందీ, ఆంగ్ల భాషల్లో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా, త్వరలో దేశమంతా విస్తరిస్తారు. -
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే:మోదీ
-
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే: మోదీ
పెద్ద నోట్లను రద్దు చేసిన అంనంతరం బయటికొచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ముగియడంతో దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన ఢిజీధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు భీమ్ పేరుతో ఓ కొత్త యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 50 రూపాయల నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి ఈ బహుమతులు అందజేయనున్నామని, అంబేద్కర్ జయంతి రోజును మొదటి డ్రా ప్రారంభమవుతుందని వెల్లడించారు. వందరోజుల పాటు లక్కీ డ్రాలో 15వేల మందికి, రూ.10వేలను బహుకరించనున్నారు. దేశంలోనే భీమ్ యాప్‌కు ప్రత్యేకత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.