నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది.
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది.
క్యాంటీన్‌తో పాటు హాస్టల్‌లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.