ఐఆర్‌సీటీసీ ఆఫర్‌ : వారికి ఫ్రీ ట్రావెల్‌ | Book train ticket on BHIM app, win a chance to travel for free: IRCTC | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ ఆఫర్‌ : వారికి ఫ్రీ ట్రావెల్‌

Published Sat, Dec 9 2017 12:21 PM | Last Updated on Sat, Dec 9 2017 12:21 PM

Book train ticket on BHIM app, win a chance to travel for free: IRCTC - Sakshi

దేశీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భీమ్‌ యాప్‌ లేదా యూపీఐ ద్వారా రైల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడానికి నెలవారీ లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. భీమ్‌ యాప్‌ లేదా యూపీఐ పేమెంట్‌ ఆప్షన్లను వాడే వారి కోసం గత నెలలోనే ఈ స్కీమ్‌ను దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లాంచ్‌ చేసింది. ఆరు నెలల కాలంలో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది.

ప్రతి నెలా తొలి వారంలో ముందటి నెలలోని ఐదుగురు లక్కీ ప్రయాణికులను కంప్యూటరైజడ్‌ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ డ్రాలో గెలుపొందిన ఐదుగురికి మొత్తం రైల్వే టిక్కెట్‌ ధరను వెనక్కి ఇచ్చేస్తారు. భీమ్‌ లేదా యూపీఐ ఆప్షన్ల ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పై ఈ-టిక్కెట్లను విజయవంతంగా బుక్‌ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. టిక్కెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు, పీఎన్‌ఆర్‌లకు వ్యతిరేకంగా టీడీఆర్‌ ఫైల్‌ చేసిన వారు ఈ స్కీమ్‌కు అర్హులు కారని తెలిపింది. డిసెంబర్‌1 నుంచి భీమ్‌ యాప్‌ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్‌ చేసుకునే అనుమతిని రైల్వే అందిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement