భీమ్ యాప్ వాడితే, పెట్రోల్‌పై డిస్కౌంట్
పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్
Published Fri, Sep 22 2017 8:30 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్‌లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు కొండెక్కుతున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష దగ్గర్నుంచి రేట్లు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది. ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటరు పెట్రోల్‌పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక అకౌంట్ ఈ ప్రకటన చేసింది. అంతేకాక బ్యాంకు కార్డులకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయట.
ఇటీవల అమెరికాలో సంభవించిన ఇర్మా, హార్వే తుఫాన్ల కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ ప్రభావంతో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు 15 శాతం మేర పైకి ఎగిశాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ డ్యూటీలను కోత పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ వచ్చే నెల దీపావళి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయంటూ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
Advertisement