petrol prices
-
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం
గెలవగానే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం పెట్రోల్ ధరల తగ్గింపులో రాష్ట్రం, కేంద్రం కలసి పనిచేస్తే పేదలపై భారం తగ్గుతుంది. కేంద్రం తగ్గించినా కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదు? రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తాం. ఏం చెప్పామో చేసి చూపిస్తాం.. బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో. ఇది మోదీ గ్యారంటీ. బీజేపీని నెలకొల్పి నప్పటి నుంచి నేటి వరకు.. ఎక్కడైనా మా మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఐదేళ్లలోపు పూర్తిచేశాం. ఆర్టీకల్ 370 రద్దు అయినా, రామమందిర నిర్మాణమైనా, త్రిపుల్ తలాక్ రద్దు అయినా, దీన్ దయాళ్ ఉపాధ్యయ సూచించిన అంత్యోదయ విధానమైనా..చేసి చూపించాం.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి సహా వివిధ అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై విచారణ జరిపిస్తామని.. ఇందుకోసం సుప్రీంకోర్డు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. తమ అవినీతి వ్యతిరేక పోరాటం తెలంగాణలో కూడా శక్తివంతంగానే నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చివరిదశకు చేరినా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చర్య తీసుకోవడం బీజేపీ సంస్కృతి కాదని పేర్కొన్నారు. విచారణ పూర్తికాగానే తప్పు జరిగిందని తేలిన చోట కచ్చితంగా చర్యలు ఉంటాయని.. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చామని చెప్పారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు అన్నిరంగాల్లో విఫలమైందని ఆరోపించారు. శనివారం రాత్రి బీజేపీ మీడియా సెంటర్లో ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ–2023.. మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా’ట్యాగ్‌లైన్‌తో పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌షా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ప్రభుత్వం అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల విరోధి సర్కార్. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మూడోసారి మళ్లీ గద్దె ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినపుడు రూ.370 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది కాస్తా.. ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడితే వాటి వల్ల ప్రజలకు ఏమేరకు ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తారు. తెలంగాణలో మాత్రం మరింతగా కమీషన్ల కోసం ప్రాజెక్టుల పరిమాణాన్ని, అంచనా వ్యయాలను భారీగా పెంచారు. ఇది కేసీఆర్ కుటుంబ అవినీతికి తార్కాణం. తాంత్రికుల సలహాతో పార్టీ పేరును మార్చిన చరిత్ర కేసీఆర్‌ది. íప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖర్చుచేస్తున్న డబ్బంతా ప్రజలదే. తెలంగాణ నుంచి సంపాదించిన డబ్బును కేసీఆర్, కర్ణాటకలో కొల్లగొట్టిన మొత్తాన్ని కాంగ్రెస్ ఖర్చు చేస్తున్నాయి. అవినీతి చిట్టా పెద్దదే.. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో లోక్తంత్రానికి (ప్రజాస్వామ్యం) బదులు లూటీతంత్రంగా, ప్రజాతంత్రం కాస్తా పరివార్ (కుటుంబ పాలన) తంత్రంగా మారిపోయింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతికి అంతులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మద్యం కుంభకోణం, పౌల్ట్రీ దాణా, గ్రానైట్, బైపాస్ రోడ్ల కుంభకోణం, మిషన్ కాకతీయ.. అవినీతి చిట్టా పెద్దదే. కేసీఆర్‌కు కేటీఆర్‌ను సీఎం చేయడం, కుమార్తె కవిత గురించి ఆలోచించడం తప్ప.. ప్రజల అభ్యున్నతి గురించి ఎలాంటి ఆలోచన లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మునిగింది. పాలమూరు–రంగారెడ్డికి రూ.32,250 కోట్లు ఖర్చుచేసినా పనికాలేదు. నిధులు కేటాయించలేదు. ఉద్యోగాల పరీక్షలు 17 సార్లు వాయిదా పడ్డాయి. రెండు లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన రూ.3,016 భృతి అమల్లోకి రాలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు కాలేదు. 7 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చి అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ తెలంగాణను అవహేళన చేసింది ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నప్పుడు మేం మూడు రాష్ట్రాలిచ్చాం. ఎక్కడా ఏ గొడవా కాలేదు. కానీ ఏళ్లుగా తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ అవహేళన చేస్తూ వచ్చింది. చివరికి ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం అధికారం చివరిలో తొందర తొందరగా తెలంగాణ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీజేపీకి కీలకపాత్ర ఉంది. పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన దానితో పోల్చితే 2014 నుంచి మోదీ సర్కారు 160 శాతం ఎక్కువగా తెలంగాణకు కేటాయింపులు చేసింది. సమ్మక్క–సారక్క గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చాం. పసుపుబోర్డు ఇచ్చాం. కృష్ణా జలాల వివాద పరిష్కారానికి చొరవ తీసుకున్నాం. నేషనల్ హైవేలు, వందేభారత్ రైళ్లు ఇచ్చాం. మా హయాంలో ఒక్క కుంభకోణం కూడా లేదు..’’అని అమిత్‌షా పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, పార్టీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వినర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీ సీఎం అన్నందుకే పార్టీ వీడారు బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోందని, అందుకే రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వంటివారు పార్టీ మారారని అమిత్‌షా చెప్పారు. వాళ్లు పార్టీ మారింది స్వప్రయోజనాల కోసమేనని, వారి కోసం తాము విధానాలను మార్చుకోలేం కదా! అని పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అమిత్‌షా సమాధానమిచ్చారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘ కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు యాక్షన్ తీసుకుంటాయి..’’ అని సమాధానమిచ్చారు.‘‘తెలంగాణలో కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయి. వాటిపై కేసీఆర్‌ను, కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి. ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవి. వారంతా ప్రశ్నించాలి..’’ ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. అధికారానికి వస్తామని ఎలా చెప్పగలుగుతున్నారని అడగగా.. ‘డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో మీరే చూస్తారు..’’ అని చెప్పారు. -
90 డాలర్ల ఎగువకు చేరిన బ్యారెల్ చమురు ధర
-
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
బ్యాటరీ బండి దూకుడు
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బండి పరుగులు పెడుతోంది. పర్యావరణ హితమైన వాహనాల పట్ల నగర వాసులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది ఇంధన భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాటిలో రవాణా వాహనాల కంటే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గతేడాది 23 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి. ఈ సంవత్సరం మే చివరి నాటికి 12 వేలకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి లక్ష వాహనాలకు జీవితకాల పన్ను నుంచి రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కేటగిరీకి చెందిన సుమారు 47 వేలకు పైగా కార్లు, బైక్‌లపైన ఇప్పటి వరకు రూ.220 కోట్ల వరకు రాయితీని అందజేశారు. మరో 53 వేల వాహనాలకు ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. రానున్న రెండేళ్ల వరకు ఈ అవకాశం ఉండవచ్చునని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలే టాప్.... మొదట్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల విముఖత చూపారు. నాణ్యత లేని బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఉదంతంతో చాలా మంది వెనుకడుగు వేశారు. దీంతో వాహన తయారీ సంస్థలు బ్యాటరీల నాణ్యతపైన ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి ప్రవేశించడంతో సమర్థవంతమైన బ్యాటరీలు కలిగిన బండ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో వాహనదారుల్లో వాటిపైన నమ్మకం కలిగింది. ఫలితంగా వీటి కొనుగోళ్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 50 వేలకు పైగా నమోదు కాగా, గతేడాది అనూహ్యంగా 27 వేలకు పైగా రోడ్డెక్కాయి. వీటిలో 23 వేలకుపైగా ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం. భారీగా వెయిటింగ్ లిస్టు... ప్రస్తుతం డిమాండ్ మేరకు వాహనాలు లభించడం లేదు. కొన్ని బ్రాండ్లకు చెందిన వాహనాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడవలసి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మాత్రమే బండి నడిచేది. ఇప్పుడు వంద కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. నిస్సందేహంగా కొనొచ్చు ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత చాలా బాగుంది. ఎలాంటి సందేహం లేకుండా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న వాహనాలే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. – సంధ్య గద్దె, ఎలక్ట్రిక్ వాహన డీలర్, లింగంపల్లి పెట్రో ‘బాదుడు’ నుంచి ఊరట పెట్రోల్ ధరల దృష్ట్యా బండి బయటకు తీయాలంటేనే వెనుకడు గు వేయాల్సి వస్తోంది. బ్యాటరీ బండితో చాలా వరకు ఈ భారం తగ్గుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే వాహనాలు వస్తే బాగుంటుంది. – కోల రవికుమార్ గౌడ్ ధరలు కాస్త ఎక్కువే లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చి నప్పటికీ ధరలు ఎక్కువగా నే ఉన్నాయి. మధ్యతరగ తి వర్గాలకు భారంగానే ఉంది. పెట్రోల్, డీజిల్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల వైపు వస్తున్నా రు. కానీ ధరలు చూడగానే వెనుకడుగు వేయాల్సి వస్తోంది. – సుధాకర్‌రెడ్డి -
2013లో లీటర్ పెట్రోల్ రూ.76.. ఇప్పుడేమో 110.. క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. '2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఏమైనా ఊరట లభిస్తుందేమోనని భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉందని.. పన్నులు, ధరల నుంచి ఉపశమనం ఉండాలని పేద, మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పెరుగుతుందా అని వేతన జీవులు.. పలు రకాల పన్నుల నుంచి ఉపశమనం ఏదైనా ఉంటుందా అని చిన్నా, పెద్దా వ్యాపారులు ఉత్కంఠగా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సామాన్యులపై భారం, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని నిధుల కేటాయింపులు, పన్నుల విధింపు ఉంటే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పలువర్గాల వారి నుంచి ‘సాక్షి’ అభిప్రాయాలను సేకరించింది. ఆ వివరాలు.. పన్నుల భారం తగ్గించాలి సామాన్యులపై పన్నుల భారం తగ్గించేలా కేంద్ర బడ్జెట్ ఉండాలి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నా భార్య గృహిణి. మా వృత్తిలో వేతనాలు పెరిగినా.. అంతే స్థాయిలో పన్నుల భారం తప్పడం లేదు. నిత్యావసరాల ధరలు చూస్తే చుక్కల్లోకి చేరుతున్నాయి. కోట్లలో బ్యాంకులను ముంచేస్తున్న వారికి మాఫీలు చేస్తున్న ప్రభుత్వం.. మాలాగా నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై భారాన్ని ఎందుకు తగ్గించకూడదు? – ఉదయ, నాగేందర్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబ ఖర్చు పెరిగింది.. రోజువారీ సాధారణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్ ముందు మా కుటుంబ నెలవారీ ఖర్చు రూ.18 వేలు ఉండేది. ఇప్పుడది రూ.28 వేలకు పెరిగింది. ఆదాయంమాత్రం ఆ మేరకు పెరగలేదు. ప్రతిదాని ధర పెరిగి.. సామాన్యుల జీవనం అతలాకుతలం అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి ఆ దిశగా ధరలు తగ్గేలా చూడాలి. – కావలి నర్సింహ,ప్రైవేటు ఉద్యోగి, పరిగి ఆదాయ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పెంచాలి ఉద్యోగులపై ఆదాయ పన్ను భారం తగ్గించాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని వర్గాలకు తప్పనిసరి అయ్యాయి. అలాంటి వాటి ధరలు తగ్గేలా చూడాలి. పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గేలా జీఎస్టీ పరిధిలోకి తేవాలి. – శ్రీవిందు, శ్రీనివాసరావు, ప్రైవేటు ఉద్యోగి మందుల ధరలు తగ్గాలి వృద్ధాప్యంలో మందుల ఖర్చే ఎక్కువ. రిటైర్ అయినప్పటి నుంచీ పెన్షన్‌లో సగం మందుల కోసమే ఖర్చు చేస్తున్నాను. కామన్‌గా వాడే మందుల ధరలు తగ్గిస్తే పెన్షనర్లకు మేలు చేసినట్టు అవుతుంది. – పి.మోహన్‌రావు, రిటైర్డ్ ఉద్యోగి మెరుగైన విద్య, వైద్యం అందాలి దేశంలో ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలు, గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. టెక్నాలజీ రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా నిధులు ఇవ్వాలి. – ఏవీ సుధాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇబ్రహీంపట్నం స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఉండాలి ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్‌లు అంటున్నాయి. సమర్థత ఉన్న ఐటీ నిపుణులు స్టార్టప్‌లు పెట్టుకునేందుకు ఊతం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఉండాలి. – ఆదిత్య కొండూరు, ఐటీ ఉద్యోగి చిరు వ్యాపారులకు రాయితీలు ఇవ్వాలి పెద్దపెద్ద మాల్స్ వచ్చాక చిరు వ్యాపారులు బతికే అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్ వచ్చినప్పుడల్లా మా గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నుల భారం పడుతూనే ఉంది. మాల్స్‌లో ఒకదానిపై తగ్గించినా, మరోదానిపై రాబడతారు. ఎక్కువ వ్యాపారం ఉంటుంది కాబట్టి కలిసి వస్తుంది. కానీ చిరు వ్యాపారాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మా లాంటి వారికి ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటిస్తే బాగుంటుంది. – కాకి వీరభద్రం, చిరు వ్యాపారి డీజిల్ ధర అతలాకుతలం చేస్తోంది భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో తెలంగాణలో 19 మంది లారీ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. డీజిల్ ధర లీటరుకు రూ.50–60 ఉన్నప్పుడు ఖరారు చేసిన చార్జీలనే వ్యాపారులు ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇందులో డీజిల్‌కే ఎక్కువగా ఖర్చవుతోంది. బీమా చార్జీలు రెండింతలు అయ్యాయి. రవాణా వాహనాల యజమానులు బ్యాంకు కిస్తీలు కట్టలేని దుస్థితిలో ఉన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డీజిల్ ధరలను తగ్గించి తీపి అందించాలి. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బతుకు భారం కాకుండా చూడాలి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇంట్లో వాడే నిత్యావసరాలకు కోత పెట్టుకునే పరిస్థితి ఉంది. సరదాగా ఎక్కడికైనా వెళ్తే జీఎస్టీ పేరుతో పిండేస్తున్నారు. ఇంటి బడ్జెట్ రెండేళ్లలోనే డబుల్ అయింది. ప్రతీ దానిపైనా పన్నులేస్తే బతికేదెట్లా? చిన్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉండేలా బడ్జెట్ ఉండాలి. జీఎస్టీ నుంచి పేద వర్గాలు ఉపయోగించే వస్తువులను తొలగించాలి. – కె.రూపాదేవి, గృహిణి -
ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు దిగువన ఉన్నా.. ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ధరలు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలిగించకుండా, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను కేంద్రం భారీగా పెంచుతోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు, సెస్సుల రూపంలో జనం నుంచి దోచుకున్న రూ.26 లక్షల కోట్లను కార్పొరేట్ పెద్దల రుణాలు మాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, కాయకష్టం చేసుకునే దిగువ, మధ్య తరగతి వర్గాలపై మోదీకి ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. ధరల అదుపులో విఫలమైన విషయాన్ని మోదీ ఒప్పుకోవాలన్నారు. 2014లో 110 డాలర్లుగా ఉన్న ముడిచమురు బ్యారెల్ ధర.. 2015 జనవరిలో 50 డాలర్లు, 2016 జనవరిలో 27 డాలర్లకు పడిపోగా, 2020 కరోనా లాక్డౌన్ సమయంలో ఏకంగా 11 డాలర్లకు పడిపోయిందన్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడూ పెట్రో ధరలు తగ్గించిన పాపాన పోలేదన్నారు. ముక్కుపిండి వసూలు చేశారు.. పెట్రో ధరలను పెంచడం ద్వారా ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్ దానిని మరింత పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకునేందుకు 2020 మార్చిలో చట్ట సవరణ చేసిందని కేటీఆర్ విమర్శించారు. కోవిడ్ మహమ్మారితో ప్రజలు ఆర్థికంగా చితికి పోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా 2020 నాటికే ఒక్క ఎక్సైజ్ సుంకం రూపంలోనే సుమారు రూ.14 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే వ్యూహంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచి కేంద్రం తన ఖజానా నింపుకుంటోందన్నారు. కేంద్రం విధించిన పెట్రో సుంకాలను ఎత్తివేస్తే లీటరు పెట్రోల్‌పై రూ.30 వరకు వినియోగదారులకు ఉపశమనం కలుగు తుందన్నారు. సెస్సులు, సుంకాల పేరుతో ఓ వైపు ప్రజల నుంచి దోపిడీ చేస్తూ ఆ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపై నెడుతోందని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై అన్ని రకాల సెస్సులను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
Vizianagaram: ఎలక్ట్రికల్ వాహనాల జోరు..
విజయనగరం: ఓ పక్క అందుకోలేని పెట్రోల్ ధరలు.. మరో పక్క నిర్వహణ భారం.. వెరసి ద్విచక్ర వాహనాలు నడపడానికే భయపడాల్సిన రోజులు.. దీంతో పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాలు రంగప్రవేశం చేశాయి. శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో పాటు ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 60,70 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉండడంతో పట్టణ ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై మక్కువ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఎలక్ట్రికల్ వాహనాల ఏజెన్సీలు ఏర్పాటు కావడంతో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన జత చేశారు. It is always people first for us! Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh — Narendra Modi (@narendramodi) May 21, 2022 Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets. https://t.co/tHNKmoinHH — Narendra Modi (@narendramodi) May 21, 2022 -
భారీ పెట్రో ఉపశమనం
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ తగ్గింపు దోహదపడుతుందని అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిపోతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.9.5, డీజిల్ ధర రూ.7 చొప్పున తగ్గుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.లక్ష కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.6,100 కోట్ల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్æ డ్యూటీ తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ రూ.96.67 పలుకుతోంది. కేంద్ర పన్నుల తగ్గింపుతో ఆదివారం ఈ ధరలు వరుసగా రూ.95.92, రూ.89.67కు పడిపోనున్నాయి. పీఎం ఉజ్వల యోజన కింద ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,003 ఉంది. రూ.200 రాయితీతో రూ.803కే పొందవచ్చు. పెట్రో, వంట గ్యాస్ ధరల భారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్లాస్లిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కోసం మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే దిగుమతి చేసుకొనే ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల మన దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా ఇనుము, ఉక్కు ధరలను సైతం తగ్గించడానికి వీలుగా ఆయా ముడి సరుకులపై కస్టమ్స్ పన్ను తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఉక్కుకు సంబంధించి కొన్ని ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించబోతున్నట్లు తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా సిమెంట్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు నిర్మల ప్రకటించారు. సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కాగా, స్టేట్ ట్యాక్స్ లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పాక్షికంగానే తగ్గించిందని విమర్శించింది We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman (File Pic) pic.twitter.com/13YJTpDGIf — ANI (@ANI) May 21, 2022 ప్రజలే మాకు ప్రథమం: ప్రధాని మోదీ తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రథమం అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో ఆయన శనివారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. ఎరువులపై అదనంగా రూ.1.10 లక్షల కోట్ల రాయితీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పునద్ఘాటించారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే తమ హయాంలో సగటు ద్రవ్యోల్బణం గత ప్రభుత్వాల కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మన దేశంలో సరుకుల ధరలను అదుపులో ఉంచామని గుర్తుచేశారు. ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని, ఈ భారం మన రైతులపై పడకుండా ఎరువులపై సబ్సిడీకి రూ.105 లక్షల కోట్లకు అదనంగా రూ.1.10 లక్షల కోట్లు కేటాయించామన్నారు. -
ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం
మార్కెట్లో దూసుకెళ్లడం కోసం కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుడగలు వేస్తుంటారు వ్యాపారులు. కార్పోరేట్ కంపెనీల నుంచి గల్లీ కొట్టు వరకు వారి వారి స్థాయిల్లో వివిధ పద్దతుల్లో ప్రచారం చేస్తుంటారు. ఫెస్టివల్ సీజన్, స్టాక్ క్లియరెన్స్ పేరుతో ఇప్పటి వరకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వారణాసికి చెందని ఓ మొబైల్ స్టోర్ యజమాని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సరికొత్త ప్రచారానికి తెర తీశాడు. వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్టోర్‌లో పది వేల రూపాయలకు పైగా విలువైన ఫోన్‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామంటూ ప్రకటించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై ఐదు నిమ్మకాయలు కూడా ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. మిగిలిన మొబైల్ స్టోర్లకు భిన్నంగా మొబి వరల్డ్ ప్రకటించిన ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మండుటెండలో కూడా ఈ ఆఫర్ ఏంటా అని తెలుసుకునేందుకు స్టోర్‌కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా అమ్మకాలు కూడా బాగున్నాయంటున్నారు స్టోర్ నిర్వాహకులు. మార్కెట్లో పెట్రోల్, నిమ్మకాయల రేట్లు మండిపోతుండటంతో వాటిని ఉచితంగా అందిస్తామంటూ ఆఫర్ ప్రకటించడం తమకు కలిసి వచ్చిందంటున్నారు స్టోర్ నిర్వాహకులు. చదవండి: యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు -
పంచేటోళ్లు కావాలా? పెంచేటోళ్లు కావాలా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలన్నీ పెంచుకుంటూ పోతోంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. పెట్రోల్, మంచినూనె ధరలు పెంచింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ పంచుకుంటూ పోతోంది. రైతుబంధు కింద ఎకరానికి రూ.పది వేలు ఇస్తోంది. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష ఇస్తోంది. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలిస్తోంది. మరి పంచెటోళ్లు కావాలా? పెంచెటోళ్లు కావాలా? అని ప్రజలు ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గుద్దుడు గుద్ది.. గద్దెదించాలి..’అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు అభయహస్తం పథకంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ వాటా కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేందుకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ‘ఒకడు పాదయాత్ర.. ఇంకోడు సైకిల్‌యాత్ర.. ఇంకోడు మోకాళ్లయాత్ర.. బయలెల్లిండ్రు.. ఏం యాత్రలు.. తిట్టుడు తప్ప ఏమీలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో అమలవుతయా? చెప్పాలి.. కాంగ్రెస్, బీజేపీ పాలనల్లో ఏం జరిగింది?.. ఈ ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి’ అని హరీశ్‌రావు అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్ల మంజూరు ఈనెల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. -
Sakshi Cartoon: పెరుగుతూనే ఉన్న పెట్రోల్ ధరలు
పెరుగుతూనే ఉన్న పెట్రోల్ ధరలు -
పోలింగ్ ముగుస్తూనే.. పెట్రో బాంబ్?
(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్‌పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే. బల్క్ ధరలు ఇప్పటికే పెంపు! నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్‌గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే రిటైల్‌గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్‌గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్‌పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్మనక మానదు. బల్క్‌కు ఎప్పుడూ తక్కువ ధరే! సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.4.39 ఎక్కువ.!! రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ... రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది. ఎన్నికల తరువాత ఎంత బాదుడు? బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్‌తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్‌ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది. భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
గుడ్‌న్యూస్..! పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 తగ్గింపు..! ఎక్కడంటే..
టూవీలర్ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. గత కొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రూ. 5, డిజీల్ రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జార్ఖండ్‌లో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ధరలపై భారీ ఊరటను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. టూవీలర్ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री @HemantSorenJMM pic.twitter.com/MsinoGS60Y — Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021 చదవండి: ఎలన్‌మస్క్ కీర్తికిరీటంలో 2021 ఘనతలు -
వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని భారతదేశం యోచిస్తున్నట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అన్నారు. భారతదేశం, జపాన్‌తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వ చేస్తుంది. ఇందులో నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ 7-10 రోజులలో ప్రారంభం కానున్నట్లు ఆ అధికారి తెలిపారు. వ్యూహాత్మక నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)లకు స్టాక్స్ విక్రయించనున్నారు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది. (చదవండి: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసిన సౌండ్‌కోర్..!) -
‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గగలవని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పకుండా వీటిని జీఎస్టీలోకి చేర్చేందుకు ప్రయత్నించగలరని గడ్కరీ చెప్పారు. ‘జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు‘ అని బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై స్పందిస్తూ.. సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. -
petrol prices: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.10 తగ్గింపు
ఛండిఘర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం భారీ అదనపు తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్‌జిత్ చన్నీ ఆదివారం ప్రకటించారు. గత 70 ఏళ్లలో చమురు ధరలు ఇంతస్థాయిలో తగ్గించడం ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. చదవండి: Money Laundering Case: ఈడీ కస్టడికీ అనిల్ దేశ్‌ముఖ్ ఢిల్లీతో పోల్చుకుంటే ప్రస్తుతం పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.9 తక్కువగా లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. -
వరుసగా ఏడో రోజు పెంపు.. రూ. 120 దిశగా పెట్రోలు రేటు
పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్‌కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.27 పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి. -
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
సెంచరీ దాటిన లీటరు డీజిల్ ధర
Petrol Price: హైదరాబాద్ : చమురు సంస్థల ధరల పెంపు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. గురువారం పెంచిన ధరలతో దాదాపు రెండు రాష్ట్రాల్లో అన్ని లీటరు డీజిల్ ధర వంద రూపాయలను దాటేసింది. జూన్‌లోనే లీటరు పెట్రోలు ధర వందను దాటింది. పెంపు ఇలా పెట్రో వడ్డన కార్యక్రమం షురూ అయ్యింది. వరుసగా మూడో రోజు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర రూ. 107.36లకు పెరగగా డీజిల్ ధర 100.09లుగా నమోదు అయ్యింది. అక్టోబరు తొలి వారంలో ఏకంగా మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మాటలకే పరిమితం పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామంటూ కేంద్రం ఫీలర్లు వదలడమే తప్ప ఆ దిశగా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలకు తగ్గిపోయే ఆదాయం, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడంలో కేంద్రం విఫలమవుతోంది. ఫలితంగా పెట్రోలు ధరల భారం సామాన్యులపై పడుతోంది. చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. ఇకపై బాదుడే నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ అయిల్‌కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రలజకు పెట్రో వడ్డన చేయనుంది ప్రభుత్వం. వెనువెంటనే జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటుఇటుగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారు. కానీ గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరగడం ఆలస్యం ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై మోపింది ప్రభుత్వం. చదవండి : పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు! -
ఆగని పెట్రోమంట..మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై 25పైసలు, డీజిల్ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు సెంచరీని క్రాస్ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..!
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పదిహేను రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు దిగిరావడంలేదంటే... పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవని వెల్లడించారు. పెట్రోలు, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై రాష్ట్రాలు సిద్దంగా లేవని మీడియాతో తెలిపారు. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న హర్దీప్ సింగ్‌పురి టీఎమ్సీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీఎమ్సీ ప్రభుత్వం భారీగా పన్నులను మోపడంతో పశ్చిమబెంగాల్లో పెట్రోల్ రూ. 100 మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్స్టర్...! -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్‌ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్‌పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
నేడు కాంగ్రెస్ ‘పెట్రో’ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించాలని ఈనెల 8న జరిగిన టీపీసీసీ నూతన కార్యవర్గం తొలిసమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్మల్‌లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీల్లో పాల్గొని అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క నేతృత్వంలో పలువురు వికలాంగులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను కలసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. -
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో గత పది, పదిహేను రోజుల్లోనే ముడి చమురు ధరలు 10 శాతం మేర తగ్గిపోతే భారత్‌లో మాత్రం పెట్రో ధరలు స్థిరంగా ఉండటం విశేషం. అయితే గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చెక్ పెడుతూ.. ఇతర ప్రాంతాల్లో ధరల్లో తగ్గుదల కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు నేడు నాలుగు మహానగరాలలో అంతటా స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.78, లీటరు డీజిల్ ధర రూ.81.10గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉంటే డీజిల్ రూ. 88.20గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.82గా ఉంటే డీజిల్ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.94.39, లీటరు డీజిల్ ధర రూ.88.45గా ఉంది. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్!
ప్రస్తుతం పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ ధర రూ.100 కూడా దాటేసింది. దింతో ప్రజానీకం ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75, డీజిల్ రూ.68 కు దిగొస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. రాజకీయ నాయకులు సంకల్పం తీసుకోలేకపోవడం వల్ల భారతదేశంలో చమురు ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఎస్బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే అమ్మకపు పన్ను/వ్యాట్ పన్నులే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అందువల్ల చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై 50 నుంచి 60 శాతం పన్నులు విధిస్తున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను మాత్రమే విధించాల్సి ఉంటుంది. నిజంగా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.75, లీటర్ డీజిల్ రూ.68కే రానున్నట్లు ఆర్థికవేత్తలు తెలిపారు. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, ఇది దేశ జీడీపీలో కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. చమురు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని భవిష్యత్ లోకి పూడ్చుకోవచ్చు అని తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చమురు ధర విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం -
సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ధరలతో సామాన్య ప్రజల జోబులకు చిల్లు పడుతున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజూ పెరగడంతో నిత్యావసర ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్‌పై 30 పైసల నుంచి రూ.50 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. సాధారణ పెట్రోల్ ధర రూ. 97.38గా ఉంది. అదే ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ.95.21కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23 చేరుకున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఆధారంగా మారుతూ ఉంటాయి. చదవండి: ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
రికార్డు స్థాయికి పెట్రో ధరల పరుగు
సాక్షి, న్యూఢిల్లీ: చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే గరిష్ఠ సాయికి చేరాయి. కాగా చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచేశాయి. మంగళవారం లీటర్ పెట్రోల్, డీజల్‌పై మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్ ధర దేశరాజధాని ఢిల్లీలో 85 రూపాయలకు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలో రూపాయికిపైగా పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. జనవరి 6 నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ .1.49, రూ .1.51 పెరిగాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి వద్ద లీటరు రూ .91.80 కు చేరుకోగా, డీజిల్ రేటు లీటరుకు రూ .82.13 కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20, డీజిల్ ధర 75.38 చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 87.85 వద్ద, డీజిల్ ధర రూ. 80.67 కోలకతాలో లీటరు పెట్రోలు ధర రూ. 86.63 వద్ద, డీజిల్ ధర రూ. 78.97 హైదరాబాద్‌లో లీటరుపెట్రోలు ధర రూ. 88.63 వద్ద, డీజిల్ ధర రూ. 82.26 అమరావతిలో లీటరు పెట్రోలు ధర 91.43, డీజిల్ ధర రూ. 84.58 -
మళ్లీ చమురు సెగ- ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు?
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్డవున్లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై) పన్నుల వాటా అధికం ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్‌కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది. చమురు కంపెనీలూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్‌ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్‌యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) మళ్లీ ధరల సెగ విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్‌చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 20 రోజులుగా పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నియంతలా పాలిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యుల గోడు పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, దేశంలో పెట్రో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిందుకు సోమవారం ఆయన లేఖ రాశారు.‘ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉపాధి లేక వలస కార్మికులు ,పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంత దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే విచిత్రంగా మనదేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014లో క్రూడాయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ 71.40 డీజిల్ రూ. 59.59 ఉంది. 2020 లో క్రూడాయిల్ ధర 43.41 డాలర్లకు అంటే సుమారు 60 శాతం తగ్గితే పెట్రోల్ లీటర్ కి రూ 20.68 ఉండాలి కానీ రూ 82.96 ఉంది. మోదీ ప్రభుత్వం ఒక నియంతలాగ పాలిస్తోంది. ఇష్టానుసారంగా ఎక్సైజ్ డ్యూటీ పెంచుతోంది. గత ఆరేళ్లుగా ఈ రూపంలో సుమారు రూ. 18 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని, వారిశ్రమను చార్జీల రూపంలో లాగేసింది. వెంటనే జోక్యం చేసుకుని ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోండి.’ అని ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. -
21వ రోజు.. ఆగని పెట్రో, డీజిల్ ధరలు
ఢిల్లీ : దేశంలో వరుసగా 21వ రోజు కూడా పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.38 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.40 రూపాయలకు చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్‌పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్‌పై 9.18 రూపాయలు పెరిగాయి. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్ 7 నుంచి దేశంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్ 1న లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 80.33 రూపాయలకు చేరింది. కరోనా నేపథ్యంలో రోజురోజుకు పెట్రో, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజైన శుక్రవారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచిన సంగతి తెలిసిందే. -
మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చరిత్రలో ఎన్నడు ఎరగనంతగా పడిపోయాయి. ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఓ బారెల్ ధర కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడి పోయింది. నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడి పోయాయి. అయినా దేశీయంగా భారత్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గక పోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు జనవరి నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఇప్పటికీ ముంబైలో లీటరు పెట్రోలు ధర 76.31 రూపాయలు, డీజిల్ ధర 66.21 రూపాయలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరల్లో భారతీయులకు పెద్దగా ప్రయోజనం ఎందుకు కలగలేదు? అందుకు కారణాలేమిటీ? కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మార్చి 14వ తేదీన పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచింది. ఈ కారణంగా కేంద్రానికి సమకూరే సొమ్ము 39 వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును సవరించింది. చమురు ధరల హెచ్చింపు, తగ్గింపులపై ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు భారత్‌లో పెట్రోలు ధరలు తగ్గుతూ, పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతగా పన్నులను పెంచడానికి ఆర్థిక అవసరాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య వ్యత్యాసం మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి చేరుకుంటుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్ ఓస్వాల్’ బ్రోకరేజ్ సంస్థ ఏప్రిల్ 13న విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది. కేంద్రం నిర్ణయం సరైనది కాదు: కేజ్రీవాల్ -
‘పెట్రోల్ ధరలు రూ. 60 కంటే తగ్గించాల్సింది పోయి..’
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భారీగా తగ్గినా, వాటి ప్రభావం మన దేశంలో నామమాత్రంగానే ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంపై దృష్టిపెట్టి, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు కుదేలై 35 శాతం కంటే తక్కువగా పడిపోయిన విషయాన్ని ప్రధాని గమనించలేకపోయారని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలను రూ.60 దిగువకి తగ్గించి, అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్ ధరల ప్రభావాన్ని సామాన్య ప్రజలకు చేరేలా చేయలేరా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు తగ్గించి, మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. Hey @PMOIndia , while you were busy destabilising an elected Congress Govt, you may have missed noticing the 35% crash in global oil prices. Could you please pass on the benefit to Indians by slashing #petrol prices to under 60₹ per litre? Will help boost the stalled economy. — Rahul Gandhi (@RahulGandhi) March 11, 2020 -
తెలుగు రాష్ట్రాల్లో ఇం‘ధన’హాసం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ‘ఇంధనం’ ధరల్లో దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. పెట్రోల్ ధరలో ఏపీ రాజధాని ‘అమరావతి’, డీజిల్ ధరలో తెలంగాణ రాజధాని ‘హైదరాబాద్’ టాప్‌లో ఉన్నాయి. డీజిల్ ధరలో అమరావతి, పెట్రోల్ ధరలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. రోజువారీగా రెండు మూడు లీటర్లు వినియోగించే వారికి పెద్దగా భారం పడనప్పటికీ.. వందల లీటర్లు వినియోగించే వారికి మాత్రం ఆర్థికంగా భారంగానే ఉంది. దీంతో ఇంధనాన్ని భారీగా వినియోగించే వారు పన్ను తక్కువ ఉన్న ప్రాంతాల నుంచి బల్క్‌గా తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పన్నుల వాత ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికి పైగా పన్నుల రూపంలోనే ఉన్నాయి. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్ను పోటు పడుతోంది. ఇందులో పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం పడుతోంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్ కింద పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం పన్నుగా వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 32 శాతం వ్యాట్ విధిస్తుండగా.. అదనంగా ప్రతి లీటర్‌పై రూ.2 వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.2 అదనపు వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజీల్ ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. అదే పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతం, తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 25 శాతం పన్ను విధిస్తున్నారు. గత పదిరోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు వారి సవరణతో దూకుడుగా ఉన్నాయి. -
వాహనదారులకు పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతుండగా బడ్జెట్లో ఇంధన ధరలపై సెస్ విధించడంతో ఇవి మరింత భారం కానున్నాయి. ప్రతి లీటర్‌పై రూ 1 అదనంగా బడ్జెట్లో సెస్ విధించారు. అదనపు సెస్‌తో పెట్రో ధరలు సామాన్యుడికి సెగలు పుట్టించనున్నాయి. మరోవైపు పెట్రో సెస్ ద్వారా కేంద్రానికి రోజూ దాదాపు రూ 200 కోట్ల రాబడి సమకూరుతుందని అంచనా. పెట్రో ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు భారమై నిత్యావసరాల ధరలూ ఎగబాకే అవకాశం ఉంది. -
ఎన్నికల తర్వాత భారీగా పెట్రో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తర్వాత జనం చేతి చమురు వదిలించేలా చమురు కంపెనీలు భారీగా పెట్రో ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడం, చమరు సరఫరాల్లో ఒపెక్ కోతలు విధించడంతో పాటు ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై భారత్ సహా పలు దేశాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మే 2 నుంచి అమెరికా తాజా ఉత్తర్వుల ప్రకారం ఇరాన్ నుంచి చమరు దిగుమతులు నిలిచిపోవడంతో పాటు ట్రంప్ వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, ఈ పరిణామం చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలపై పెను ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కారణంగా పెట్రో ధరల పెంచకుండా చమురు మార్కెటింగ్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తున్నా మే 23 ఓట్ల లెక్కింపు అనంతరం భారీ వడ్డనకు చమురు కంపెనీలు సన్నద్ధమవుతాయని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు సంకేతాలు పంపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మార్చి తొలి వారం నుంచీ భారమవుతున్నా ఎన్నికల వేళ పెట్రో ధరల పెంపునకు కేంద్రం అనుమతించకపోవడంతో ఇంధన విక్రయాలపై భారీగా నష్టపోతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాపోతున్నాయి. ఇక మే19న తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రో షాక్‌లకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉండటంతో ఏ రేంజ్లో పెట్రో షాక్‌లు ఉంటాయా అని వాహనదారుల్లో గుబులు మొదలైంది. -
పెట్రో భారాల నుంచి స్వల్ప ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : రికార్డు స్ధాయిలో పరుగులు పెట్టిన పెట్రో ఉత్పత్తుల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజులు పైగా వరుసగా తగ్గుతున్న పెట్రో ధరలు శుక్రవారం సైతం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 27 పైసలు తగ్గి రూ 85.71కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 80.85కు చేరగా, ముంబైల్ పెట్రోల్ లీటర్‌కు రూ 86.33కు దిగివచ్చింది. ఇక డీజిల్ లీటర్‌కు ఏడు పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో రూ 74.73 పలికింది. ముంబైలో డీజిల్ ధర లీటర్‌కు ఎనిమిది పైసలు తగ్గి రూ 78.33కు చేరింది. భగ్గుముంటున్న పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అక్టోబర్ 4న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 1.50 మేర తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్ ధరలు లీటర్‌కు 15 పైసలు తగ్గగా, డీజిల్ లీటర్‌కు 5 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నాయి. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 76 డాలర్లకు తగ్గాయి. ఈనెల ఆరంభంలో బ్యారెల్ ముడిచమురు ధర 86 డాలర్లకు ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక గురువారం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 85.98 కాగా, డీజిల్ ధర లీటర్‌కు రూ 81.36 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 81.10 కాగా, డీజిల్ లీటర్ రూ74.80గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ 86.58 కాగా, డీజిల్ లీటర్‌కు రూ 78.41 పలికింది. ముడిచమురు ధరలు తగ్గడంతో డాలర్‌తో రూపాయి విలువ బలపడింది. అక్టోబర్‌లో డాలర్‌తో రూపాయి మారకం రూ 74 దాటగా ప్రస్తుతం రూ 73.31గా నమోదైంది. -
సగటు జీవికి ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు ఆదివారం వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 81.74 పలికింది. డీజిల్ ధర లీటర్‌కు 17 పైసలు పతనమై రూ 75.19గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా దిగివచ్చి రూ 86.90కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 87.21గా నమోదైంది. డీజిల్ ధర లీటర్‌కు 18 పైసలు దిగివచ్చి రూ 78.82కు తగ్గింది. కాగా గతవారం అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ చమురు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఇంధన ధరలు దిగిరావడం గమనార్హమని ఇంధన నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మండుతున్న ఇంధన ధరలను నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈనెల 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంధన ధరలపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా ఎడాపెడా పెరిగిన చమురు ధరల నుంచి సామాన్యులకు పండుగ రోజు కొంత ఊరట లభించింది. వరుసగా రెండో రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 85 డాలర్ల నుంచి 80 డాలర్లకు పడిపోవటంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కొంత పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. గురువారం లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గించగా శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గించాయి. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.82.38, డీజిల్ రూ. 75.48గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ. 87.84, డీజిల్ రూ. 79.13కు చేరుకుంది. ఈ నెల 5న లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 (ఎక్సైజ్ సుంకం రూ.1.50, చమురు కంపెనీల సబ్సిడీ రూపాయి) తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారం చేపట్టిన తర్వాత 2014 నుంచి 2016 మధ్య కాలంలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 11.77, డీజిల్‌పై 13.47 రూపాయాలు పెంచింది. -
మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
ఢిల్లీ: ఇటీవల పెరుగుతూ వచ్చిన చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.38, డీజిల్ రూ. 75.48కి చేరింది. ముంబయిలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్ రూ. 87.74, డీజిల్ రూ. 79.13గా కొనసాగుతోంది. గురువారం సైతం పెట్రో ధరలు మోస్తరుగా తగ్గిన సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు తగ్గడం అంతంత మాత్రంగానే ఉంది. అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది. ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ సమ్మె... పెట్రోల్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి. దసరా కానుకగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు -
దసరా కానుకగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు
ముంబై : దసరా పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ రేట్లు దిగొచ్చాయి. గత 13 రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న ఈ ధరలు, నేడు కాస్త ఉపశమనం కలిగించాయి. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో పెట్రోల్ 21 పైసలు తగ్గగా.. చెన్నైలో 22 పైసలు తగ్గింది. ఇక నాలగు మెట్రోల్లో డీజిల్ ధర 11 పైసలే తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.62గా, కోల్‌కతాలో రూ.84.44గా, ముంబైలో రూ.88.08గా, చెన్నైలో రూ.85.88గా ఉన్నాయి. ఇక డీజిల్ ధరలు న్యూఢిల్లీలో లీటరు రూ.75.58గా, ముంబైలో రూ.79.24గా, చెన్నైలో రూ.79.93గా, కోల్‌కతాలో రూ.77.43గా నమోదయ్యాయి. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాక ఒక్క రోజు మాత్రమే ఇంధన ధరలు తగ్గాయి. మళ్లీ వెంటనే పెరగడం ప్రారంభించాయి. అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది. ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ సమ్మె... పెట్రోల్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి. -
ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై ఐదు రూపాయలు తగ్గింపు
వాహనదారులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఒక గంట క్రితమే గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూపాయిని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంటే మొత్తం లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో, వెంటనే రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. తమ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గించాలని నిర్ణయించిందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రకటించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, తమ వ్యాట్ తగ్గింపుతో మొత్తంగా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఐదు రూపాయల మేర తగ్గనున్నట్టు పేర్కొన్నారు. విజయ్ రూపాని మాత్రమే కాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ‘పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 ధర తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు. ఇది సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద ఊరట. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజానీకానికి లీటరు పెట్రోల్‌కు అదనంగా మరో రూ.2.50 ఊరట ఇవ్వాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా మా రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.5 తగ్గుతుంది’ అని దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ చేశారు. కాగా, ముంబైలోనే అత్యధికంగా పెట్రోల్ ధర రూ.91ను క్రాస్ చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై భారీ ఊరట ఇవ్వడంతో, ముంబై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రకటించారు. దీంతో మొత్తంగా తమ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ఐదు రూపాయలు చౌకగా లభ్యం కానున్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఇక రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించి, వాహనదారులకు ఊరట ఇవ్వాల్సి ఉంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం శుభవార్త
-
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అటు విపక్షాలు, ఇటు వాహనదారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లతో, దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంతేకాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధరను రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.50 తగ్గాయి. తగ్గించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను రూ.2.50 తగ్గించాలని అరుణ్‌జైట్లీ ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు. దీంతో కరెన్సీ మార్కెట్‌తో పాటు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరలను డీరెగ్యులేషన్ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్, చమురు ధరల సెగ స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించడంతో, వెంటనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
ముంబైలో పెట్రోల్ రూ.90
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్ ధరలు సోమవారం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆ ర్థిక రాజధాని ముంబైలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్క్‌ను దాటి రికార్డ్ సృష్టించింది. ముంబై నగరంలోని ఐవోసీ ఔట్లెట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.08, డీజిల్ రూ.78.58. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సోమవారం లీటర్ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి. -
బతుకుల్లో ‘చితి’ పేరుస్తున్న చమురు
రెండో మాట ప్రభుత్వం కోరుకున్నట్టే నేడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య తేడా క్రమంగా తగ్గిపోతోంది. ఈ కారణంగా ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుపోతోంది. లీటరు పెట్రోల్ రూ. 35 ధరకే అందజేస్తామన్న హామీ మాయమైంది. ధర నేడు రూ. 90కి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పన్నుల పేరుతో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చాటున దాగి సరకుల ధరలు పెంచుతుండగా, రాష్ట్రాలు స్థానిక పన్నుల (సేల్స్ టాక్స్–అమ్మకం పన్ను) పేరుతో ప్రజలను దంచుతున్నాయి. నిన్న పెంచిన ఇంధన ధరలను నేటి కంట్రోల్ ధరగా చూపించి, ప్రజలను మురిపించజూసే ప్రయత్నం పాలకుల పనిగా ఉండకూడదు. ప్రపంచానికే నాయకత్వ స్థానంలో విశ్వగు రువుగా భావించుకున్న ఇండియాలోని ప్రధాన ప్రసార మాధ్యమాల పరిస్థితి కాస్తా దయార్ద్ర మైన మూకాభినయ స్థితికి చేరుకుంది. ఫలితంగా ప్రజల పరిస్థితి దుర్బ లంగా మారింది. టెలివిజన్ కార్యక్రమాల సంధానకర్తలను(యాంకర్లు) తొలగించడంతోటే ప్రశ్నలు సంధించాలనుకునేవాళ్ల నోళ్లను మూయించ డానికి ఒకట్రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే చాలనుకునే తత్వం అధికార స్థాయిలో బలిసిపోయింది. మనం ఆశించిన ఇండియా ఇదేనా? నీ కళ్ల ముందే ఆవిష్కరించుకుంటున్న ఆశా భారతాన్ని ఓసారి వెను తిరిగి చూసుకో భారతీయుడా! 2018లో నుంచి 2013 వైపు చూసుకో, జరిగిన మోసం నీ ముందు సాక్షాత్కరిస్తుంది. అధికారంలోకి రాక ముందు తాని చ్చిన ఉపన్యాసాలు చూసుకుని ప్రధానమంత్రి కలత చెందుతారా? లేక ఆనాటి మెరుగైన ఉపన్యాసాలు తయారు చేసుకోవడంలో మునిగిపోయి ఉంటారా? లేక అప్పటి దాకా ఆయన పాత రొడ్డకొట్టుడు ప్రసంగాలకే కట్టుబడి ఉండదలచారా? – చిత్రా పద్మనాభన్, ప్రసిద్ధ వ్యాఖ్యాత ‘వైర్’ వెబ్సైట్ నేటి బీజేపీ పాలకులు కూడా నిశిరాత్రి నిర్ణయాలకు అలవాటు పడిన ఫలితంగా అకస్మాత్తుగా పెద్దనోట్ల రద్దు పేరిట దేశ ఆర్థిక వ్యవస్థను, చిరు వర్తక, వ్యాపార వర్గాలను అల్లకల్లోలానికి గురిచేశారు. ఆ వెంటనే శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, సాంస్కృతిక కళారంగాల్నింటినీ నిర్వీర్యం చేసే నిర్ణయాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, సమాచారం పొందే హక్కు చట్టానికి తూట్లు పొడిచే చర్యలకు దిగారు. బలమైన భిన్నాభిప్రాయం ఏ మూల నుంచి వ్యక్త మైనా సంస్థలను, వ్యక్తులను హతమార్చే ప్రత్యేక సంస్కృతికి తెర లేపారు. వీటన్నింటినీ వ్యతిరేకించే వారి నోళ్లు మూస్తూనే ‘మా నిర్ణయా లకు దేశంలోని 125 కోట్ల మంది ప్రజలూ ఆమోదం తెలుపుతున్నారు’ అని చెప్పారే గానీ, బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడి సొమ్మసిల్లి చనిపోయిన 125 మందిని మరిచిపోయారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం సంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు జాంబవంతుని అంగలతో ముందుకు సాగుతున్నాయి. ఈ ధరల పెరు గుదలకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అడ్డూ అదుపూ ఉండదు. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలను సైతం మన పాలకులు పాటించ కుండా చమురు శుద్ధి కర్మాగారాల చిట్టా ఆవర్జా లాభ నష్టాలతో ముడి పెట్టి నాటకం ఆడుతున్నారు. ఇంధన ధరలు అంతర్జాతీయంగా అదు పులో ఉన్నా సరే, మన దేశంలో వాటి ధరలు పెంచివేయడం చమురు కంపెనీల ప్రయోజనాల రక్షణకు దోహదం చేయడమేనని రుజువవు తోంది. దేశ ప్రజల అవసరాలకు భిన్నంగా ఏకపక్షంగా వీటి ధరలు పెంచేస్తున్నారు. విచిత్రమేమంటే ఈ తొక్కిసలాటలో పాలకులకు మద్దతుగా ‘ఆత్మలోకంలో దివాలా స్థితిని కనపడకుండా చేసే ఆధ్యాత్మి కస్వాములు’ కొందరుంటారు. పాలకులను సమర్ధిస్తూ ప్రతి కాలం లోనూ కొంత మంది ‘డబ్బారేకుల సుబ్బారాయుళ్లు’ మాట్లాడుతుం టారు. అలాంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఒకరు ‘ఇక ముందు ముందు రూపాయి విలువ అమెరికన్ డాలర్‌ను తొక్కేసి రూ. 40ల స్థాయికి చేరుకుంటుంది’ అని చెప్పిన జోస్యం కాస్తా మూన్నాళ్ల ముచ్చ టగా సరిపెట్టుకుంది. కానీ, ఒకనాడు బ్రిటిష్ పౌండ్ ధాటికి కునారిల్లిన మన రూపాయి క్రమంగా అమెరికన్ గుత్తపెట్టుబడి శాసనాలతో స్వాతం త్య్రానంతరం పీటముడి వేసుకుంది. ఫలితంగా ఆ డాలర్ కనుసన్నల్లో రూపాయి తన ఉనికిని కాపాడుకుంటూ రావలసి వచ్చింది. రూపాయి విలువ నేడు గణనీయంగా కోల్పోయింది. డాలర్‌కు సుమారు రూ.100 చెల్లించుకోవలసిన దుర్దశకు దగ్గరలో ఉన్నాం. కునారిల్లుతున్న కొనుగోలు శక్తి! ఇక ‘విశ్వ గురువు’ నోటికి తాళం పడుతోంది. ప్రభుత్వం కోరుకున్నట్టే నేడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య తేడా క్రమంగా తగ్గిపోతోంది. రెండింటి ధరలు పోటీపడుతున్న కారణంగా ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుపోతోంది. లీటరు పెట్రోల్ రూ. 35 ధరకే అందజేస్తామన్న హామీ మాయమైంది. ధర నేడు రూ. 90కి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండూ పన్నుల పేరుతో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చాటున దాగి సర కుల ధరలు పెంచుతుండగా, రాష్ట్రాలు స్థానిక పన్నుల (సేల్స్ టాక్స్– అమ్మకం పన్ను) పేరుతో ప్రజలను దంచుతున్నాయి. అందుకే, ప్రసేన్ జిత్ బోస్ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జీఎస్టీ చట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఉండేలా కేంద్రం భరించాలని కోరారు. కార్పొ రేట్ ప్రయోజనాల దృష్ట్యా తన రాబడిని పెంచుకునే వ్యూహం నుంచి వైదొలగాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు నిన్న పెంచిన ఇంధన ధరలను నేటి కంట్రోల్ ధరగా చూపించి, ప్రజలను మురిపించ జూసే ప్రయత్నం పాలకుల పనిగా ఉండకూడదు. మనకు లీటర్ పెట్రోలు ధర రూ. 90కి, డీజిల్ ధర రూ. 80కి చేరబోతున్న సమయంలో మన పొరుగు దేశాల్లో వీటి ధరలెలా ఉన్నాయో చూద్దాం. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 53.55, డీజిల్ ధర రూ. 61.47 కాగా, శ్రీలంకలో పెట్రోల్ రూ. 63.96, డీజిల్ రూ.52.05, నేపాల్‌లో పెట్రోల్ రూ. 63.96, డీజిల్ రూ. 54.86 ధరలకు లభ్యమౌతున్నాయి (2018,సెప్టెంబర్ 1–పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ శాఖ). పొరుగునున్న చిన్న దేశాల్లో ఇంధన ధరలు పైన చెప్పినట్టు ఉండగా, ఇండియాలోనే పెట్రోల్, డీజిల్ చిల్లర(రీటెయిల్) ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ఇంధన సరకులపై అధికారికంగా సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్(విలువ ఆధారిత) పన్ను భారం పెరుగుతున్నందునే. పరోక్ష పన్నుల రూపంలో కేంద్ర ఎక్సైజ్ సుంకం ప్రతి లీటర్ పెట్రోల్‌పై రూ.19.48 ఉండగా, డీజిల్‌పై రూ. 15.33. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరపైన అదనంగా వ్యాట్‌ను వసూలు చేస్తు న్నాయి. ఇలా రెండూ కలిసి వసూలు చేస్తున్న పరోక్ష పన్నులు పెట్రోల్‌కు 100 శాతం, డీజిల్‌కు 70 శాతం మించిపోయాయి. పరోక్ష పన్నులు లేక పోతే అంతర్జాతీయ ముడి చమురు ధర ప్రస్తుత స్థాయిలో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధర రూ. 40కి మించదు. 2009–10 నుంచి 2013–14 మధ్య పెట్రో ఉత్పత్తుల నుంచి ఎక్సైజ్ సుంకాల వసూళ్లు మొత్తం పన్ను రాబడిలో 8.8 శాతం కాగా, 2014–15 నుంచి 2017–18 మధ్య సగటున ఈ వసూళ్ల శాతం 12.5 శాతానికి పెరిగింది. కాని, మొత్తం పన్ను వసూ ళ్లలో కార్పొరేట్ సంస్థల నుంచి వసూలు చేసిన పన్ను వసూళ్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో సగటున 36.5 శాతం నుంచి 30.7 శాతానికి పడిపోయాయి. యూపీఏ మలిదశ పాలనలో మొత్తం పన్ను రాబడుల నుంచి ఆదాయ పన్ను వసూళ్ల శాతం 19 నుంచి 21 శాతానికి పెరిగింది. ఎక్సైజ్ సుంకాల వసూళ్ల శాతం 2009–10లో 10.2, 2010–11లో 9.7, 2011–12లో 8.4, 2012–13లో 8.1 ఉండగా, బీజేపీ–ఎన్డీఏ పాలనలో ఈ పన్నుల నుంచి వసూలైన మొత్తాలు 2014–15లో 8.6 శాతం, 2015–16లో 13.7, 2016–17లో 16.1, 2017–18లో 11.8 శాతం నమోదయ్యాయి (బడ్జెట్ వసూళ్లు: 2018–19 ‘కాగ్’ నివేదిక). కార్పొరేట్లకు రాయితీలు... ప్రజలపై పన్నులు ఎన్డీఏ పాలనలో బడా కార్పొరేషన్ల నుంచి రాబట్టిన వసూళ్లలో పన్నుల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పెట్రోల్, డీజిల్ వాడకందార్ల నుంచి వసూళ్ల శాతం పెరిగిపోయింది. అంటే పేద, మధ్య తరగతి వర్గాల ప్రయోజనాలను పక్కనపెట్టి, బడా కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చారని నిపుణుల అంచనా. ఈ రకమైన అన్యాయమూ, అస హజమూ అయిన రెవెన్యూ వసూళ్ల సమీకరణ వెంటనే రద్దు చేయవ లసిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు నిర్మొహమాటంగా చెప్పారు. నిజానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ చట్రం కిందికి తీసుకు రావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువలో ఎక్కువ 28 శాతం మేర జీఎస్టీ పన్ను వసూలు చేసినా కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర రూ. 55 కంటే మించదు. దీని వల్ల కోల్పోయే రెవెన్యూ నష్టాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి పన్నుల్ని ఎక్కువగా వసూలు చేయడం ద్వారా, కార్పొరేట్లకు పన్నుల నుంచి మినహాయించే చర్యలను మానుకోవడం ద్వారా పూడ్చు కోవచ్చని నిపుణుల భరోసా. నిజానికి 2018–19 బడ్జెట్ వసూళ్లను బట్టి చూస్తే కార్పొరేట్లకు కల్పించిన పన్ను రాయితీల మూలంగా కోల్పో యిన ప్రభుత్వ రాబడి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి రూ. 85,000 కోట్లు చొప్పున ఉంది. కనుక ఆదాయ వనరుల సమీకరణలో పాలకుల వ్యూహాన్ని సవరించుకోక తప్పదని నిపుణుల సలహా. ఎందు కంటే 2016 చివర్లో అర్థంతరంగా పెద్ద కరెన్సీ నోట్లరద్దు వల్ల 2017 నుంచీ కార్మికుల సంఖ్య పడిపోయింది. ఉపాధి కునారిల్లిపోతోంది. ఉద్యోగాలు లభించే అవకాశాలు, ఆశ సన్నగిల్లడంతో పొట్ట చేతబట్టు కుని పరాయి పంచలకు వలసపోతున్నారు. పైగా మోదీ హయాంలో ప్రణాళికా సంఘాన్నే చాపచుట్టి దాని స్థానే ముక్కూ ముఖం లేని ‘నీతి ఆయోగ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ఉపాధ్యక్షుడిగా బాధ్య తలు స్వీకరించిన రాజీవ్ కుమార్ ‘అవసరమైతే మరొక వరస కరెన్సీ నోట్ల రద్దుకు మేము సిద్ధం’ అని ప్రకటించడం విస్మయకరమే. ‘ఆటో రిక్షాలో ప్రయాణం కన్నా విమాన చార్జీలు చౌక’ అని మంత్రి జయంత్ సిన్హా వాపోయారు. ఈ ప్రకటనలన్నీ రూపాయి విలువ డాలర్ మార కంలో రూ. 100కు దగ్గరగా పతనావస్థకు చేరుకుంటున్న దశలో చేసినవే. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశంలో అత్యధికంగా అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ రూ.89.97 కాగా, డీజిల్ ధర 78.53గా రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.87.57, డీజిల్ 80.40, విజయవాడ పెట్రోల్ ధర 86.95 కాగా, డీజిల్ రూ 79.51గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ 82.61, కాగా డీజిల్ ధర 73.77గా ఉంది. భారీ పెట్రోల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారు. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. పెట్రో భారాలకు నిరసనగా ఆ పార్టీ గతవారంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్‌ను పాటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని ఇటీవల పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతోనే ప్రధాని విధిలేని పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ ద్వారా ఎద్దేవా చేసింది. -
చవకగా పెట్రోల్ కావాలా.. అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యునికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. బండి తీసుకుని రోడ్డు మీదకి వెళ్లాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు ఇలా ఒకటేమిటి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు కన్పిస్తున్నాయి. అయితే పొరుగుదేశం నేపాల్‌లో మాత్రం ఇంధన ధరలు సాధారణంగానే ఉన్నాయి. ఈ కారణంగా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం నేపాల్‌కు వెళ్తున్నారు. దూరం, సమయం గురించి ఆలోచించకుండా నేపాల్‌కు వెళ్లి అక్కడే పెట్రోల్, డీజిల్ రీఫిల్ చేయించుకుంటున్నారు. దీంతో నేపాల్ సరిహద్దు జిల్లాలు భారత ‘ఇంధన సందర్శకుల’తో కళకళలాడుతున్నాయి. 14 రూపాయలు తేడా.. ఉత్తరాఖండ్‌లోని చంపావట్ జిల్లా ఉద్ధమ్ నగర్లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 82.63గా ఉండగా, లీటర్ డీజిల్ ధర 74.90గా ఉంది. ఇదే సమయంలో భారత సరిహద్దులో గల నేపాల్‌లోని కాంచన్‌పూర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 68. 20, డీజిల్ ధర రూ. 58.30గా ఉంది. కాగా ఈ రెండు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో సుమారు 14 రూపాయల వ్యత్యాసం ఉండటంతో కాంచన్‌పూర్ జిల్లాలో బిజినెస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో ఉద్ధమ్నగర్ పెట్రోల్ బంకులన్నీ వెలవెలబోతున్నాయి. పూట గడవాలంటే తప్పదుగా మరి.. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు దేశానికి వెళ్లి మరీ పెట్రోల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఉద్ధమ్ సింగ్ నగర్ టాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ రామ్ నరేశ్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోజూ 25 టాక్సీలను సరిహద్దులో ఉంచుతున్నాం. దీనికి నంబరింగ్ విధానం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరం వెళ్లి ట్యాంకు ఫుల్ చేయించుకుంటాం. కెపాసిటీకి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ఫిల్ చేయిస్తున్నాం. ఇది కొంత రిస్క్‌తో కూడుకున్న పనే. అయితే పూట గడవాలంటే టాక్సీ నడపడం తప్పనిసరి కదా. ఇక్కడే పెట్రోల్, డీజిల్ కొని టాక్సీ నడపాలంటే.. మేం పస్తులు ఉండాల్సిందే అంటూ తమ బాధలు చెప్పుకొచ్చారు. రోజుకి 7 లక్షలు.. నెలకి 2.5 కోట్ల రూపాయల నష్టం పెట్రోల్ కోసం నేపాల్‌కు వెళ్తున్న వారి సంఖ్య పెరగిపోతుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ.. ఈ మూడు రాష్ట్రాల్లోని సరిహద్దు ఇంధన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 7 లక్షల రూపాయల చొప్పున నెలకి 2.5 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నామన్నారు. అంతేకాకుండా కొంత మంది నేపాల్ నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి.. లాభానికి అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. దీంతో ఇటు బంకు వ్యాపారులు, అటు వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే.. ఇక్కడి(భారత్) కంటే అక్కడి(నేపాల్) నుంచి తెచ్చే పెట్రోల్, డీజిల్ ధరలకు రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే తమకు లాభమే కదా అంటున్నారు కొంత మంది వినియోగదారులు. ఉదాహరణకు 100 లీటర్లు కొనుగోలు చేస్తే 100 రూపాయలు ఆదా అవుతుంది. ఈ లెక్కన ఇంకో లీటరున్నర పెట్రోల్ వస్తుంది. ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకుండా అధర్మంగా వ్యవహరిస్తుంటే..తాము మాత్రం ఎందుకు ధర్మాన్ని అనుసరించాలని నిలదీస్తున్నారు. ఏదేమైనా సరే భారత్‌లో ఇంధన ధరలకు రెక్కలు రావడంతో తమ వ్యాపారం బాగా వృద్ధి చెందిందని, సుమారు రోజుకు 9 వేల లీటర్ల పెట్రోల్ అమ్ముతున్నామంటూ నేపాల్ కాంచన్‌పూర్ జిల్లా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోల్ ధర రూ.100 : బంకులు మూత పడతాయ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడా తగ్గేది లేకుండా.. పెరుగుతూనే ఉంది. కొత్త ఏడాది కానుకగా ప్రభుత్వం పెట్రోల్‌ను 100 రూపాయలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదికి దగ్గర దగ్గర 100 రోజుల సమయం ఉంది. ఈ వంద రోజుల్లో పెట్రోల్ కూడా 100 రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో లీటరు పెట్రోల్ 100 రూపాయలను దాటిన రికార్డును 2019 సొంతం చేసుకోబోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అలా పెరుగుకుంటూ వెళ్తూ.. 100 రూపాయలను క్రాస్ చేస్తే, పరిస్థితేంటి? అనే భయాందోళనలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాధారణంగా పెట్రోల్ 100 రూపాయలు దాటితే, అవి పాత మిషన్లలో చూపించడం కష్టం. ఎందుకంటే, భారత్‌లో ఇంధనం సరఫరా చేసే మిషన్లు మూడు అంకెల ధరల విధానాన్ని సపోర్టు చేయడం లేదు. ఆక్టేన్ పెట్రోల్ ప్రస్తుతం లీటరు రూ.100.33గా నమోదవుతోంది. కానీ పెట్రోల్ బంకుల మిషన్లలో ఇది కేవలం 0.33గా మాత్రమే చూపిస్తోంది. దీంతో పెట్రోల్ పంపు ఆపరేటర్లు మాన్యువల్‌గా పెట్రోల్ ధరలను అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ నార్ముల్ పెట్రోల్ విషయంలోనూ అదే జరిగితే, మాన్యువల్ ధరలను నిర్వహించడం కుదరదు. అది సాధ్యం కాని పని కూడా. పెట్రోల్ 100 రూపాయలు దాటిన తర్వాత మిషన్లను అప్డేట్ చేయడం ప్రారంభిస్తే, సరఫరా కష్టంగా మారుతుంది. అన్ని పెట్రోల్ పంపులు ఆటోమేటెడ్‌గా రన్ అవుతున్నాయి. సెట్రల్ సర్వర్‌లో మారిన తర్వాత నుంచే అన్ని సర్వర్లలో మారుతూ ఉంటాయి. ఇలా ధర పెరుగుకుంటూ పోతే మాత్రం, పెట్రోల్ పంపులు మూత పడి, అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాతనే ప్రారంభమవుతాయి. మరి అప్పటి వరకు వాహనదారులు ఎక్కడికి పోవాలి. ఏ వాహనం కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడుతోంది. అలా అయితే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 80 శాతం పెట్రోల్ బంకులు పాత మిషన్లనే వాడుతున్నాయి. ఇప్పటికే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.90లను దాటేసింది. ప్రస్తుతం రూ.91.96 వద్ద నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరో కొత్త సవాల్‌ను సృష్టించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజిల్ ధరలను ఎక్కడా తగ్గనీయ కుండా పరుగులు పెట్టిస్తున్నాయి. అంతేకాకుండా... అమెరికా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు భారత్‌కు చుక్కలు చూపిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇరాన్ ఉంది. అయితే తాజాగా ట్రంప్ సర్కార్ ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలు, భారత్, ఇరాన్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా.. ఇరాన్ నుంచి చమురు దిగుమతి అయ్యే ట్యాంకర్లను అమెరికా ఆపివేస్తోంది. దీంతో భారత చమురు ఉత్పత్తుల మార్గాల్లో ఒకటైన ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులు మూతపడనున్నాయి. ఇరాన్‌పై రెండో దశ ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత చుక్కలు చూపిస్తుంటే, అదే రెండో దశ అమల్లోకి వచ్చాక పరిస్థితి మరింత దిగజారనుంది. ఇరాన్ విషయంలో అమెరికా అసలు మెత్తబడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రస్తుతం నడుస్తుందని ట్రయల్ మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను మరింత చుక్కలు చూపించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ను దేశీయంగా జీఎస్టీలోకి తేవాలనే ప్రతిపాదనను పాలకులు చాకచక్యంగా పక్కన పెట్టడం కూడా ప్రతికూలంగా నిలుస్తోంది. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం
బెంగళూరు : పెట్రోల్, డీజిల్ ధరలపై కర్నాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ధరలను నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలను క్రాష్ చేస్తోంది. ‘ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు, పన్నులు తగ్గి, ధరలు తగ్గితే బాగుండని భావించారు. కుల్బర్గి నుంచి ప్రకటిస్తున్నా.. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కనీసం రెండు రూపాయల పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. మా సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కర్నాటక ప్రజలకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు, రెండున్నర రూపాయలు తగ్గించాయి. కాగా.. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.06గా, కోల్‌కతాలో రూ.83.91గా, ముంబైలో రూ.89.44గా, చెన్నైలో రూ.85.31గా, బెంగళూరులో రూ.84.74గా ఉంది. డీజిల్ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78గా, కోల్‌కతాలో రూ.75.63గా, ముంబైలో రూ.78.33గా, చెన్నైలో రూ.78గా, బెంగళూరులో రూ.76.16గా రికార్డైంది. -
ఆల్-టైమ్ గరిష్టంలో పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరగడమే తప్ప, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి, రూ.82.06గా నమోదైంది. ముంబైలో కూడా 15 పైసలు పెరిగి, ఆల్-టైమ్ గరిష్టంలో రూ.89.44 మార్కును టచ్ చేసింది. పెట్రోల్‌కు తగ్గ రీతిలో డీజిల్ ధరలు కూడా సామాన్యులకు వాత పెడుతున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ.73.78గా నమోదైంది. అలాగే ముంబైలో రూ.78.33గా ఉంది. రాజధానుల పరంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంది కోల్‌కతాలోనే. ఈ నగరంలో లీటరు పెట్రోల్‌ను రూ.83.91 వద్ద, లీటరు డీజిల్‌ను రూ.75.53 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.31కి, డీజిల్ ధర రూ.78 కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.86.85గా, లీటరు డీజిల్ ధర రూ.80.19గా నమోదైంది. జనవరి 1 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర 15.4 శాతం పెరిగింది. అంటే రూ.69.97 నుంచి ప్రస్తుతం రూ.82.06కు చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా 22 శాతం ఎగిసింది. ఇంతలా పెట్రోల్, డీజిల్ సామాన్యులను గడగడలాడిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం లేదు. ఆగస్టు నుంచి అయితే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అసలు తగ్గడం లేదు. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఈ ధరల పెరుగదలకు మరింత తోడ్పడుతోంది. -
ద్రవ్యలోటుపై లక్ష్యాన్ని చేరుకుంటాం
న్యూఢిల్లీ: పెరుగుతున్న పన్ను ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల మద్దతుతో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతానికి పరిమితం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం వెల్లడించారు. అయితే పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశన్నంటుతున్నా, వాటిపై పన్నులను తగ్గించే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు, డాలర్‌తో రూపాయి మారకం విలువను బలపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్ర, శనివారాల్లో స్థూల ఆర్థిక సమీక్షా సమావేశం జరిగింది. శనివారం సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ ‘బడ్జెట్లో చెప్పిన 7 నుంచి 7.5 శాతం కంటే ఎక్కువే జీడీపీ వృద్ధిని సాధిస్తాం. మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకుంటాం. బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే పన్ను వసూళ్లను రాబడతాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించడం ద్వారా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువే సమీకరిస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్రో ధరలపై సమాధానం నిరాకరణ పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నులను తగ్గించే అంశంపై సమావేశంలో చర్చించారా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు పెట్రో పన్నుల తగ్గింపుపై కూడా సమావేశంలో చర్చిస్తారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు. రూపాయి బలహీనపడుతుండటంటో ముడిచమురు కొనుగోలు భారంగా మారుతోందనీ, దీంతో కరెంట్ ఖాతా లోటుపై తీవ్ర ప్రభావం పడుతోందని జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. తాము చేపట్టిన నల్లధన వ్యతిరేక చర్యలు, నోట్లరద్దు, జీఎస్టీతోనే పన్ను ఆదాయం పెరిగిందని జైట్లీ చెప్పుకొచ్చారు. ‘బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువే పన్ను వసూళ్లు ఈ ఏడాది వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి స్పష్టం చేస్తోంది. కొన్ని నెలల్లో వస్తు, సేవల వినియోగం పెరిగితే పరోక్ష పన్ను రాబడి కూడా పెరుగుతుంది’ అని జైట్లీ తెలిపారు. -
బాదేస్తున్నారు
సాక్షి,సిటీబ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలకు మాత్రం అమాంతం రెక్కలొచ్చాయి. పెరిగిన ధరలు తెలంగాణలో సామాన్యుడికి గుదిబండగా మారాయి. ధరల మంటపై పెల్లుబికిన ఆందోళనలకు పలు రాష్ట్రాలు దిగివచ్చి ధరలు కొంతమేర తగ్గించినా.. తెలంగాణ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 4 శాతం పన్నును తగ్గించింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై రూ.2.50 ధర తగ్గింది. పక్కనున్న ఏపీలో సైతం పెట్రోల్, డీజిల్‌పై అదనంగా వసూలు చేస్తున్న పన్నులో రూ.2 తగ్గించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం రూపాయి ధర తగ్గించింది. తెలంగాణ రాష్ట్రంలో ధరల తగ్గింపు లేని కారణంగా దేశంలోనే డీజిల్ ధర టాప్లోను, పెట్రోల్ ధర రెండో స్థానంతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. క్రూడాయిల్ తగ్గినా ధరల మంట ఐదేళ్ల క్రితంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 31.25 శాతం తక్కువగా ఉంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర రూ.4,950కు చేరింది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.86.18గాను, డీజిల్ రూ.79.73కు చేరింది. 2013 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర రూ.7,200 చేరడంతో అప్పట్లో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.83.07తో రికార్డు సృష్టించింది. డీజిల్ రూ.58.67కు చేరింది. తర్వాత 2016 జనవరి నాటికి ముడి చమురు బ్యారెల్ రూ.2,048కు తగ్గడంతో లీటర్ పెట్రోల్ రూ.60.63కు, డీజిల్ రూ.54.40 తగ్గింది. ఈ ఏడాది జనవరి నాటికి ముడి చమురు బ్యారెల్ రూ.4,416కు చేరడంతో పెట్రోల్ ధర రూ.75.47, డీజిల్ రూ.67.23గా చేశారు. తాజాగా ముడిచమురు ధరకు రెక్కలు రావడంతో మార్కెటింగ్ సంస్థలు రోజు వారి సవరణలతో పెట్రో, డీజిల్ ధరలను మరింత పెంచేశాయి. ప్రతిరోజు సగటున పెట్రోల్‌పై 13 నుంచి 51 పైసలు, డీజిల్æపై 11 నుంచి 48 పైసలు పెరుగుతున్నాయి. ఫలితంగా పక్షం రోజుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.83, డీజిల్‌పై రూ.3.36 పెరిగింది. నగరంలో ఈ ఏడాది ఇందనధరల పెంపు(లీటర్‌పై రూ.లో) ఇలా.. నెల పెట్రోల్ డీజిల్ (రూ) (శుక్రవారం) 86.18 79.73 సెప్టెంబర్ 1 83.25 76.37 ఆగస్టు 1 80.90 73.76 జూలై 1 80.03 73.24 జూన్ 1 82.94 75.22 మే 1 79.04 71.63 ఏప్రిల్ 1 78.08 70.16 -
పెట్రోల్, డీజిల్ చౌకగా దొరికేది ఇక్కడే!
న్యూఢిల్లీ : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ.. హడలెత్తిస్తున్నాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్, రవాణా ఖర్చుల్లో మార్పుతో ఒక నగరానికి, మరో నగరానికి ధరల్లో మార్పు కనిపించినప్పటికీ, చాలా నగరాల్లో మాత్రం ధరలు వాత పెడుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే, మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.45రూపాయలతో అత్యధికంగా ఉంది. లీటర్ డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికంగా 79.73 రూపాయలు ఉంది. ఇంతలా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వాతపెడుతుంటే, భారత్‌లోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.69.97కే లభ్యమవుతోంది. కానీ అదే ఇంధనం మహారాష్ట్రలో రూ.90.45 పలుకుతుంది. అంటే మహారాష్ట్రలోని పర్బానీతో పోల్చుకుంటే, అండమాన్ నికోబార్‌లో లీటర్ పెట్రోల్ 20 రూపాయలు తక్కువకు దొరుకుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండు వ్యాట్ శ్లాబులు అమలవుతున్నాయి. దీంతో పెట్రోల్ ధరలు ఆ రాష్ట్రంలో వాసిపోతున్నాయి. అండమాన్‌లోని పోర్ట్ బ్లయర్తో పాటు గోవా రాజధాని పనాజీలో కూడా లీటర్ పెట్రోల్ రూ.74.97, అగర్తలలో 79.71రూపాయలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో 80రూపాయలకు పైగానే ఉంది. ఈ మూడు చోట్ల తప్ప. ఇదిలా ఉంటే, తెలంగాణలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. దీనికి కారణం అధిక వ్యాట్. తెలంగాణలో డీజిల్‌పై విధించే వ్యాట్ 26.01 శాతంగా ఉంది. దీంతో తెలంగాణలో డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి,లీటరు రూ.79.73గా నమోదవుతోంది. చత్తీష్‌గడ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధర అధికంగా ఉంది. అమరావతిలో లీటరు డీజిల్ ధర రూ.78.81గా, తిరువనంతపురంలో రూ.78.47గా, రాయ్‌పూర్‌లో రూ.79.12గా, అహ్మదాబాద్‌లో రూ.78.66గా ఉన్నాయి. అయితే డీజిల్ కూడా పోర్ట్ బ్లేయర్, ఇటానగర్, ఐజ్వాల్‌లలో చాలా చౌకగా లభ్యమవుతుంది. పోర్ట్ బ్లేయర్‌లో రూ.68.58గా ఉన్న డీజిల్ ధర, ఇటానగర్‌లో రూ.70.44గా, ఐజ్వాల్‌లో రూ.70.53గా ఉంది. అండమాన్, నికోబార్ ఐల్యాండ్, పోర్ట్ బ్లైర్లు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి బెస్ట్ ప్లేస్‌గా నిలుస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణమేంటంటే.. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌పై 6శాతం మాత్రమే వ్యాట్‌ను విధిస్తారు. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. -
లీటరు పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు
కోల్‌కతా : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి గుద్దిబండలా మారాయి. రోజురోజుకు పైకి ఎగియడమే తప్ప, అసలు తగ్గడం లేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు నిన్న భారత్ బంద్ కూడా చేపట్టాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న ఆందోళనలు పెల్లుబిక్కుతున్న ఈ సమయంలో రాష్ట్రాలు రేట్ల తగ్గింపుపై దృష్టిసారిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరపై వాహనదారులకు ఊరటనిచ్చింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి ధర తగ్గించింది. ‘తాము పన్నులను పెంచడం లేదు. మేము నిరంతరం సామాన్య ప్రజల గురించే ఆలోచిస్తుంటాం. పెట్రోల్, డీజిల్ పరిమితిని మించి ఎగియడంతో, లీటరు ఇంధన ధరపై ఒక్క రూపాయి తగ్గించాలని నిర్ణయించాం’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వెంటనే సెంట్రల్ సెస్‌ను కేంద్రం ఉపసంహరించాలని కూడా మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఓ వైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ధరలను పెంచుతున్నారని, సెస్‌ను పెంచుతున్నారని, ఈ రెండింటిన్నీ పెంచకూడదని అన్నారు. కాగా, మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. మహారాష్ట్రాలో అయితే ఏకంగా పెట్రోల్ ధర సరికొత్త రికార్డులో రూ.90 క్రాస్ చేసింది. న్యూఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.80.87గా, కోల్‌కతాలో రూ.83.75గా, ముంబైలో రూ.88.26గా, చెన్నైలో రూ.84.07గా ఉన్నాయి. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.72.97గా, కోల్‌కతాలో రూ.75.82గా, ముంబైలో రూ.77.47గా, చెన్నైలో రూ.77.15గా రికార్డయ్యాయి. ఆదివారం రాజస్తాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నును తగ్గించింది. ఈ ధరలపై 4 శాతం పన్ను రేట్లను తగ్గించినట్టు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు. దీంతో ఆ రాష్టంలో లీటరు ఇంధన ధరలు రూ.2.5 తగ్గాయి. -
నటుడు శివాజీ చంద్రబాబు బినామీ?
సాక్షి, కర్నూలు : సినీ నటుడు శివాజీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపీలేశ్వరయ్య మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ ఒక బూటకమని అన్నారు. చంద్రబాబుకు కేంద్రం నోటిసులు ఇస్తుందంటూ.. నటుడు శివాజీ కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడపై పూర్తి విచారణ జరపాలని బీజేపీ కోరిందని, కానీ పోలీసులు స్పందించలేదని తెలిపారు. చంద్రబాబును వెనకేసుకుంటూ నటుడు శివాజీ చేస్తున్న కామెంట్లు, చంద్రబాబుకు అతను బినామీ అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే శివాజీ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, 'ఆపరేషన్ గరుడ' పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందంటూ సంచలనం సృష్టించి సినీ నటుడు శివాజీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారారు. తనకు ప్రాణహానీ ఉందంటూ చెప్పుకొచ్చారు. శివాజీ ఈ ఆరోపణలపై బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు కపీలేశ్వరయ్య మండిపడ్డారు. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన చేయడం స్వాగతించాల్సిన అంశమన్నారు. అయితే రాష్ట్రాలు విధిస్తున్న రూ.10 మేర పన్ను భారాన్ని ఉపసంహరించుకోవాలని గతంలోనే కేంద్రం కోరిందని తెలిపారు. ఏపీలో అధిక పెట్రోల్ ధరలకు టీడీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రజలపై టీడీపీ ప్రభుత్వం పన్ను భారం మోపిందని అన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని కోరారు. -
కేంద్రంలో అధికారంలోకొస్తే..జీఎస్టీలోకి పెట్రో ధరలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తద్వారా పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీతో కలసి ఉత్తమ్ మాట్లాడారు. పెట్రో ధరల పెరుగుదలకు ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 2014లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 70, డీజిల్ ధర రూ.55 ఉండేదన్నారు. కానీ 2018లో లీటర్ పెట్రోల్ ధర రూ. 85కు, డీజిల్ ధర రూ.79కి పెరిగిందన్నారు. యూపీ ఏ హయాంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా దేశంలో పెట్రో ధరలు పెరుగుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ ని 12 సార్లు పెంచారని, 3.5 శాతం ఉన్న డ్యూటీ 15 శాతానికి పెరిగిందన్నారు. ఒక దేశం, ఒక పన్ను నినాదమిచ్చిన మోదీ పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన సీఎం కేసీఆర్ కేంద్రంతో పోటీపడి ధరలు పెంచడం దురదృష్ట కరమన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలకన్నా పెట్రోల్‌పై వ్యాట్ తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై 35 శాతం, డీజిల్‌పై 28 శాతం వ్యాట్ వసూలు చేస్తోందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పన్ను పెంచారని విమర్శించారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను రాష్ట్రంలో విజయవంతమైందని ఉత్తమ్ తెలిపారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. బంద్ సందర్భంగా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకొచ్చాక ప్రతి పేద కుటుంబానికి ఏటా 6 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీ, బోసురాజు, సలీం అహ్మద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అతిత్వరలో పొత్తు చర్చలు ప్రారంభం... రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు రాజకీయ, రాజకీయేతరపక్షాలు, విద్యార్థు లు, ప్రభుత్వోద్యోగులు, ఎన్జీవోలు, మహిళలు, పౌరసమాజం తమతో కలసి రావాలని ఉత్తమ్ మరోసారి పిలుపునిచ్చారు. తెలుగుదేశం సహా ఇతర పార్టీలతో అతిత్వరలోనే పొత్తు చర్చలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పొత్తులపై అందరం సమన్వ యంతో ముందుకెళ్తామన్నారు. బుధవారం ఆజాద్ సమక్షంలో పార్టీలో చేరికలుంటాయన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను త్వరలోనే కలుస్తామని ఓ ప్రశ్నకు ఉత్తమ్ బదులిచ్చారు. నేటి నుంచి కాంగ్రెస్ జెండా పండుగ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ‘కాంగ్రెస్ జెండా పండుగ’నిర్వహించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. గ్రామాలతోపాటు పార్టీ కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై కాం గ్రెస్ జెండా ఎగురవేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులపై చర్చించాలని సూచించారు. రేపు హైదరాబాద్‌కు ఆజాద్.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ బుధవారం హైదరాబాద్ వస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశంలో ఆజాద్ పాల్గొంటారని, అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో జరిగే మైనారిటీల సదస్సుకు హాజరవుతారన్నారు. ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాలి: జానారెడ్డి దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలను ప్రజ లు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 139–140 డాలర్లుగా ఉండేదని, దీంతో అప్పుడు పెట్రోల్ లీటర్‌కు రూ.81గా ఉండేదని కుంతియా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారెల్ 75–85 డాలర్ల మధ్యే ఉన్నా లీటర్ పెట్రోల్ ధర రూ. 81కి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పెట్రో సెగ: బండిని భుజాలపై మోస్తూ నిరసన
పట్నా: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డిజీల్ ధరలను నిరసిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన భారత్‌బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. అయితే బిహార్‌లోని శరద్‌యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెట్రోల్ ధరలతో బైక్‌ను నడపడం కన్నా దానిని మోసుకుపోవడమే బెటర్ అంటూ భూజాలపై ఎత్తుకుని నిరసన తెలిపారు. పెరిగిన ధరలు తమకు ఎంత భారంగా మారాయో తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేట్ స్కూళ్లు స్వచ్చందంగా బంద్‌పాటిస్తున్నాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బైక్స్‌ను ఎడ్ల బండిపై ఎక్కించి నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బంద్‌కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 12 పైసలు, డీజిల్‌పై 10 పైసలు పెంచుతూ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. దీంతె హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధన 85.35 పైసలుండగా.. డీజిల్ 78.98కు చేరుకుంది. ముంబై అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 90(89.97)కు చేరుకుంది. -
39 పైసలు పెరిగిన పెట్రోల్ ధర
-
పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట?
న్యూఢిల్లీ : సామాన్యులకు పెట్రో వాత మారుమోగిపోతుంది. గత నెల నుంచి పెట్రోల్, డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి, తప్ప అసలు తగ్గడం లేదు. స్కై రాకెట్‌లాగానే ఈ ధరలు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్, పన్నులు దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటరుకు రూ.80 మార్కును దాటిపోయింది. శనివారం ఒక్క రోజులోనే లీటరు పెట్రోల్ ధర 39 పైసలు పెరిగి, రూ.80.38గా నమోదైంది. డీజిల్ ధరలు కూడా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. లీటరు డీజిల్ ధర కూడా 44 పైసలు పెరిగి రూ.72.51గా ఉంది. ముంబైలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు రూ.87.77గా, రూ.76.98గా ఉన్నాయి. ఈ మేర సెగపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు నెలల్లో మనకు ఊరటనియనున్నాయట. రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, ఈ ధరల్లో మార్పులు చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల సమయంలో కూడా 20 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చూడలేదు. కానీ కర్ణాటక ఎన్నికలు అయిపోగానే, ఈ ధరలు ఒక్కసారిగా రయ్‌మని పైకి ఎగిశాయి. గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పులు లేకుండా.. అదే విధంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్ ఎన్నికలు ఉండటమే కారణం. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీష్‌గడ్, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ఏడాది ముగింపునఎన్నికలకు వెళ్లబోతున్నాయి. తెలంగాణకు కూడా ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలను నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కస్టమర్లకు కాస్త ఊరటనిస్తూ... పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ నవంబర్ నుంచి ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓ వైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్ర నిరసన.. మరోవైపు త్వరలో జరుగబోతున్న రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం. తద్వారా ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకుని, ఓట్లను క్యాష్ చేసుకోబోతుంది. -
పెట్రోల్, డీజిల్ ధరలు : వాటితో మనీ సేవ్
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరగడమే కానీ తగ్గడం కనిపించడం లేదు. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 50 పైసలు మేర పైకి ఎగిశాయి. మొత్తంగా గత నెల నుంచి పెట్రోల్‌పై లీటరుకు మూడు రూపాయలు, డీజిల్‌పై లీటరుకు నాలుగు రూపాయలు ధర పెరిగింది. ఇలా వాతపెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో మీ జేబులు ఖాళీ అవుతుంటే, వెంటనే బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులను వాడడంటూ ఆఫర్ చేస్తున్నాయి. మీ క్రెడిట్ కార్డుల వాడకం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. అన్ని ప్రైవేట్, ప్రభుత్వం రంగ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను మాఫీ చేస్తున్నాయి. అంతేకాక రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకుని, ఇంధనం కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నాయి. కొటక్ మహింద్రా: కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు... రూ.500 నుంచి రూ.3000 మధ్యలో లావాదేవీలకు కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుదారులకు ఫ్యూయల్ సర్ఛార్జ్ మాఫీ లభిస్తుంది. గరిష్ట మాఫీని ఏడాదిలో రూ.3500 పొందేలా పరిమితం చేసింది ఈ బ్యాంక్. సిటీ బ్యాంక్ : సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు... మీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.125 విలువైన ప్రతి కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ను పొందవచ్చు. అప్పీరల్ లేదా డిపార్ట్మెంట్ స్టోర్లలో చేసే కొనుగోళ్లపై పది రెట్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఈ రివార్డు పాయింట్లను దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో ఇంధన బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క రివార్డు పాయింట్ విలువ 0.25 పైసలు. ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం కార్డు... దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో 150 రూపాయల విలువైన ఇంధన కొనుగోళ్లపై 4 టర్బో పాయింట్లను పొందవచ్చు. ఈ టర్బో పాయింట్లను ఉచిత ఇంధనం పొందడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క టర్బో పాయింట్ ఉచిత ఇంధన విలువ రూపాయి. షాపింగ్, డైనింగ్ వంటి వాటిపై టర్బో పాయింట్లను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ : హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డు... ఇంధన కొనుగోళ్లుపై ప్రతి నెలా గరిష్టంగా 250 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : బీపీసీఎల్ ఎస్బీఐ కార్డు... మీరు జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత, రూ.500 విలువైన రివార్డు పాయింట్లు క్రెడిట్ అవుతాయి. వీటిని భారత్ పెట్రోలియయం అవుట్లెట్లలో ఇంధన బిల్లు చెల్లింపులకు వాడుకోవచ్చు. అంతేకాక బీపీ అవుట్లెట్ వద్ద ప్రతి ఫ్యూయల్ కొనుగోళ్లపై 4.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్లను ఎస్బీఐ ఇస్తోంది. 4000 రూపాయల వరకు ఉన్న ప్రతి లావాదేవీపై, 1 శాతం సర్ఛార్జ్ మాఫీతో పాటు 3.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు అండ్ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు.... రూ.500 నుంచి రూ.3000 మధ్యలో ఉన్న లావాదేవీలపై 1 శాతం సర్ఛార్జ్ మాఫీ వినియోగదారులకు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా నెలకు 100 రూపాయల వరకు మాఫీనీ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా... తన అన్ని క్రెడిట్ కార్డులపై జీరో ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తుంది. -
పెట్రోల్ ధరలు : నీతి ఆయోగ్ నిర్లక్ష్య వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నాయి. గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు పెరగడంతో, పెట్రో మంట వినియోగదారులకు వాత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ సెగ ఇప్పుడు అన్ని వాటిపై చూపుతుంది. స్కూల్ వ్యాన్ ఫీజులు పెరిగిపోయాయి. అటు స్టాక్ మార్కెట్లకు దీని సెగ తగిలి, కుప్పకూలుతున్నాయి. రూపాయి అయితే ఏకంగా పాతాళంలోకి పడిపోయింది. అయితే ఇంత మేర ప్రభావం చూపుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు. రోజూ, వారం మారే ఆయిల్ ధరలపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఆయిల్ ధరలు రోజువారీగా, వారంవారీగా, పిరియాడిక్గా మారుతూనే ఉంటాయని, కమోడిటీ ధరలను గమనించాలని, కానీ వీటిపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదని అన్నారు. ‘జూన్‌లో ధరలు పెరిగాయి. జూలైలో తగ్గిపోయాయి. అవునా కాదా? ఇదే పరిస్థితి మరోసారి జరుగుతుంది’ అంటూ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పన్నులు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.31గా రికార్డు స్థాయిలో నమోదైంది. డీజిల్ కూడా ఆల్-టైమ్ గరిష్టంలో రూ.71.34గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు వాత పెడుతున్న, ప్రభుత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదనడం గమనార్హం. -
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. రాజధాని అమరావతిలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ. 84.84, డీజిల్ రూ. 77.64గా నమోదైంది. గతమూడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించని చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పుడు రూపాయి పతనం పేరుతో ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. గత మే నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లకు చేరుకున్న తర్వాత నెల రోజుల్లో 70.55 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు 77.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే మే 29న అమరావతిలో లీటరు పెట్రోలు రూ.84.66, డీజిల్ రూ.76.63గా నమోదు కాగా శుక్రవారం ఈ రికార్డు చెరిగిపోయింది. గత ఏడాది కాలంలో డీజిల్ ధరలు 21 శాతం, పెట్రోల్ ధరలు 12 శాతం పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ. 75.58గా ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 9.26 పెరిగి రూ. 84.84కి చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ 13.27 పెరిగి రూ. 64.37 నుంచి రూ. 77.64కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు తగ్గించకుండా ప్రభుత్వ సహకారంతో ఆ ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోనే వేసుకొని, ఇప్పుడు డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ధరలు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు పన్నులు మాత్రం తగ్గించరు పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా ప్రభుత్వాలు కనికరం చూపించడం లేదు. నాలుగేళ్ల క్రితం ధరలు తగ్గినప్పుడు ఆదాయం పెంచుకోవడానికి విధించిన అదనపు పన్నులను ఇప్పుడు రికార్డు స్థాయి ధరల సమయంలోనూ కొనసాగించడం ఎంత వరకు సమంజసమంటూ ప్రజలు నిలదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ. 60 సమీంపంలో ఉన్నప్పుడు లీటరుకు రూ. 4 విధించిన అదనపు వ్యాట్‌ను కొనసాగిస్తూ ఖజానా నింపుకోవడానికే చూస్తున్నారు కానీ, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ సామాన్యులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద తేడా లేదంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే చెబుతుండటంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే లీటరు పెట్రోలు గరిష్టంగా రూ. 7.5 వరకు, డీజిల్ రూ.5 వరకు అధికంగా ఉన్న సంగతి ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. -
మీ పెట్రోల్ బిల్లు తగ్గబోతుంది.. ఎలా?
న్యూఢిల్లీ : వాహనాదారులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. తగ్గేటప్పుడు ఒకటి, రెండు పైసల్లో తగ్గినా.. పెరిగేటప్పుడు మాత్రం రెండకెల్లోనే ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో, మన దేశంలో కూడా ఆయిల్ ధరలు వాహనదారులకు వాత పెడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి, కరెంట్ అకౌంట్ లోటుకు పెను ముప్పులా మారుతున్న ఈ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నీతి ఆయోగ్ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఓ సరికొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. దీంతో నెలవారీ మీ పెట్రోల్ బిల్లు తగ్గిపోనుందట. అదే మిథనాల్. ప్రతి ఒక్క వాహనదారుడు కచ్చితంగా తమ వాహన పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ కలిపి వాడేలా ఆదేశాలు జారీచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేబినెట్ నోట్‌ను కూడా కేంద్రం ముందు ఉంచింది. ఒకవేళ కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదిస్తే, మీ నెలవారీ పెట్రోల్ బిల్లు కనీసం 10 శాతం తగ్గిపోనుందట. అంతేకాక ప్రభుత్వ ఆయిల్ దిగుమతి బిల్లు కూడా క్రమంగా తగ్గేందుకు ఇది సహకరించనుందని తెలిసింది. దీనిపై జూలై చివరి వారంలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా దీనిపై సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశం జరిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మిథనాల్ ఎకానమీ’ రోడ్‌మ్యాప్‌ను కూడా నీతి ఆయోగ్ రూపొందించింది. రవాణా వ్యవస్థ, గృహ అవసరాలకు 15 శాతం మిశ్రమ ఇంధనాన్ని వాడితే 2030 నాటికి క్రూడ్ దిగుమతుల్లో వార్షికంగా 100 బిలియన్ డాలర్ల తగ్గింపు పొందవచ్చని నీతి ఆయోగ్ తన ప్రణాళికలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 10 శాతం ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్నారు. ఎథనాల్ ధర లీటరు 42 రూపాయలు. ఒకవేళ మిథనాల్ మిశ్రమం వాడితే లీటరుకు 20 రూపాయల కంటే తక్కువగానే నమోదు కానుంది. దీంతో పెట్రోల్ ధరలు 10 శాతం తగ్గిపోనున్నాయి. మిథనాల్ వాడకంతో ఇంధన ధరలు, దేశీయ వార్షిక ఆయిల్ దిగుమతి బిల్లు తగ్గడమే కాకుండా.. కాలుష్యం కూడా నిర్మూలించవచ్చు. మిథనాల్‌తో 20 శాతం క్రూడ్ వినియోగాన్ని రీప్లేస్ చేస్తే, దేశీయ కాలుష్యం 40 శాతం తగ్గిపోనుందని నీతి ఆయోగ్ చెబుతోంది. ఒక్కసారి నీతి ఆయోగ్ రూపొందించిన ఈ పైలట్ ప్రాజెట్లు విజయవంతమైతే, ప్రభుత్వం ఈ మిథనాల్ కమర్షియల్ ప్రొడక్షన్‌ను బొగ్గు నుంచి చేపట్టడం ప్రారంభించనుంది. బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే కమర్షియల్ ప్రొడక్షన్‌కు పుణే, హైదరాబాద్, తిరుచ్చి ప్రాంతాల్లో రూ.100 కోట్లతో మూడు ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్‌లను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నడుపుతోంది. అంతేకాక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్‌లు సిద్ధమై ఉన్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను కేటాయించాయి. అయితే మిథనాల్‌ను సరఫరా చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాల్ అని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కాగ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారి దేశంగా భారత్ ఉంది. 2900 కోట్ల లీటర్ల పెట్రోల్, 9000 కోట్ల లీటర్ల డీజిల్‌ను వార్షికంగా మన దేశంలో వినియోగిస్తున్నాం. -
నెల బ్రేక్ : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్
న్యూఢిల్లీ : వాహనదారులకు నెల పాటు ఎలాంటి షాకింగ్‌లు లేకుండా.. బ్రేక్ ఇచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. 36 రోజుల అనంతరం గురువారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు మెట్రో నగరాల్లో 16 నుంచి 17 పైసల చొప్పున పెరుగగా.. డీజిల్ ధరలు 10 నుంచి 12 పైసల చొప్పును ఎగిశాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.75.71గా, కోల్‌కతాలో రూ.78.39గా, ముంబైలో రూ.83.10గా, చెన్నైలో రూ.78.57గా ఉన్నాయి. అటు లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.67.50గా, కోల్‌కతాలో రూ.70.05గా, ముంబైలో రూ.71.62గా, చెన్నైలో రూ.71.24గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు రోజువారీ ఈ ధరల సమీక్ష చేపడుతున్నారు. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నట్టు తెలిసింది. దేశరాజధానిలో విక్రయ పన్ను లేదా వ్యాట్ తక్కువగా అమలు చేస్తుండటంతో ఈ ధర ఢిల్లీలో అన్ని నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంది. కాగ, గత నెల రోజుల్లో పెట్రోల్ ధరలు 22 సార్లు, డీజిల్ ధరలు 18 సార్లు తగ్గించారు. మిగతా రోజుల్లో స్తబ్ధుగా ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయంగా వీస్తున్న ఆందోళనకర పరిస్థితులతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైనట్టు తెలిసింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇన్ని రోజులు వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా మళ్లీ భగ్గుమననున్నాయట. దీనికి గల కారణం త్వరలో అట్లాంటిక్ మహాసముద్రంలో హారికేన్లు ప్రారంభం కానున్నాయట. అట్లాంటికా బేసిన్లో కనుక హారికేన్లు ప్రారంభమైతే, దేశీయంగా ఇంధన ధరలు భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ నది, మెక్సికో గల్ఫ్ కలిగి ఉన్న ప్రాంతాన్ని అట్లాంటిక్ బేసిన్గా పేర్కొంటారు. ఈ బేసిన్లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా రాకాసి హారికేన్ల విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ చివరి వరకు రాకాసి హారికేన్లకు పీక్ సీజన్. ఒకవేళ ఈ హారికేన్లు కనుక ఏర్పడితే, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను చవిచూడాల్సి వస్తోంది. గతేడాది కూడా భారీ ఎత్తున్న హార్వే హారికేన్, ఇర్మా హారికేన్ ఏర్పడటంతో, అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని రోజుల్లో అట్లాంటిక్ బేసిన్ ప్రాంతంలో ఏర్పడబోయే హారికేన్లు, ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హారికేన్లకు, భారత్‌లో ఇంధన ధరలకు సంబంధం : గతేడాది సంభవించిన హార్వే, ఇర్మా హారికేన్లు, గల్ఫ్ కోస్ట్‌లోని అమెరికా రిఫైనరీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. దీంతో సరఫరా తగ్గిపోయింది. అవుట్‌పుట్ పడిపోవడంతో, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నైమెక్స్‌లో కూడా ఇంధన ధరల ఫ్యూచర్స్ పెరిగాయి. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా గ్లోబల్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగానూ ధరలు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోయింది. వీటన్నింటి పలితంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు మారేలా.. మన చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను చేపట్టాయి. ఈ రోజువారీ ధరల సమీక్షతో, తగ్గడం కంటే ఇంధర ధరలు పెరగడమే ఎక్కువగా ఉంది. -
పెట్రోల్, డీజిల్ : వరుసగా ఆరో రోజూ...
న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజూ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధరలు ఢిల్లీ, కోల్‌కత్తాలో 14 పైసలు, ముంబైలో 18 పైసలు, చెన్నైలో 15 పైసలు చొప్పున తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో వెల్లడైంది. మంగళవారం తగ్గిన అనంతరం, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.75.55గా, కోల్‌కత్తాలో రూ.78.23గా, ముంబైలో రూ.83.12గా, చెన్నైలో రూ.78.40గా ఉంది. పెట్రోల్ ధరలతో పాటు నేడు డీజిల్ ధరలు కూడా ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తాలో 10 పైసలు, ముంబైలో 12 పైసలు తగ్గాయి. తాజా ధరల సమీక్ష ప్రకారం లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.67.38గా, కోల్‌కత్తాలో రూ.69.93గా, ముంబైలో రూ.71.52గా, చెన్నైలో రూ.71.12గా నమోదైంది. గరిష్ట స్థాయిల్లో ఎగిసిన ఇంధన ధరలు, మే 30 నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు రూ.2.88 తగ్గగా.. డీజిల్ ధరలు రూ.1.93 క్షీణించాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. లిబియాన్ ఇంధన ఎగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ బెంచ్ మార్క్ వద్ద 0.3 శాతం పెరిగి బ్యారల్‌కు 74.95 డాలర్లుగా నమోదైంది. -
నేటి నుంచి లారీల బంద్
సాక్షి, బెంగళూరు: రకరకాల బాధలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు, లారీల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలను భారీగా పెంచిందని ఆరోపిస్తూ సోమవారం నుంచి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా లారీలు, ట్రక్కుల యజమానులు సమ్మెకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోనున్న తొమ్మిది లక్షల లారీలు, ట్రక్కులతో పాటు దేశవ్యాప్తంగా సుమారు కోటి లారీలు, ట్రక్కులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్‌లు తగ్గించాలంటూ అనేకసార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నట్లు లారీ, ట్రక్కు ఓనర్స్ అసోసియేన్స్ ప్రతినిధులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి వరకు రూ.27 వేలుగా ఉన్న థర్డ్‌పార్టీ ప్రీమియమ్‌ను ధరను ఒకేసారి రూ.48 వేలకు పెంచడంతో లారీల యజమానులపై తీవ్రభారం పడుతోందన్నారు. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అఖిల భారత లారీ సరుకు సేవా వాహనాల యజమానుల సంఘం,రాష్ట్ర లారీ యజమానుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్ ధరలు తగ్గించే వరకు లారీల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు లారీల స్ట్రైక్‌తో పాలు, బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్,డీజిల్ రవాణా నిలిచిపోయే ప్రమాదముంది. ఆదివారం నుంచే అనేక నగరాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె సాకు చూపి అధిక ధరలతో దోచుకోవడానికే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించారంటూ ప్రజలు పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి లారీ సమ్మె కారణంగా పెట్రోల్ కోసం ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిల్లో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయిల్ కంపెనీలు గత కొన్ని రోజులుగా ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. వరుసగా 11వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. లీటరు పెట్రోల్‌పై 40 పైసలు, లీటరు డీజిల్‌పై 30 పైసలు ధర తగ్గించినట్టు తెలిసింది. ఈ తగ్గింపు గత 10 రోజుల పోలిస్తే నేడే అత్యధిక తగ్గింపు. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.02గా నమోదైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.84గా, కోల్‌కతాలో రూ. 79.68, చెన్నైలో రూ. 79.95గా, హైదరాబాద్‌లో రూ.81.59గా ఉంది. ఇక డీజిల్ ధరలు కూడా 30 పైసలు తగ్గడంతో, లీటర్ డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ. 68.28గా, ముంబైలో రూ. 72.70గా, కోల్‌కతాలో రూ. 70.83గా, చెన్నైలో రూ. 72.08గా, హైదరాబాద్‌లో రూ.74.22గా నమోదైంది. మొత్తంగా ఈ పదకొండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.42, డీజిల్ ధర రూ. 1.03 తగ్గింది. అయితే ధరలు పెంచేటప్పుడు భారీగా పెంపును చేపట్టిన ఆయిల్ కంపెనీలు, తగ్గించేటప్పుడు చాలా మెల్లగా చేపడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. -
పెట్రోల్ ధరలపై అతిపెద్ద తగ్గింపు నేడే
న్యూఢిల్లీ : 16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ తగ్గింపు గత 10 రోజుల్లో పెట్రోల్ ధరలపై చేపట్టిన తగ్గింపులో అతిపెద్ద తగ్గింపని తెలిసింది. లీటరు పెట్రోల్‌పై 21 పైసలు, లీటరు డీజిల్‌పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో 21 పైసలు తగ్గి 77.42గా... లీటరు డీజిల్ ధర 15 పైసలు తగ్గి 68.58గా నమోదైంది. నేడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో నమోదైన డేటాలో లీటరు పెట్రోల్ ధర ముంబైలో రూ.85.45గా, కోల్‌కతాలో రూ.80.28గా, చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ముంబైలో రూ.73.17గా, కోల్‌కతాలో రూ.71.28గా, చెన్నైలో రూ.72.56గా ఉన్నాయి. కాగ, గత 10 రోజుల్లో మొత్తం పెట్రోల్ ధర రూపాయి మేర తగ్గింది. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఇదే అతిపెద్ద కోత అని తెలిసింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురావాలని, దీంతో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులను తేలికగా గమనించవచచ్చని కేంద్ర ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పిన ఒక్కరోజులోనే, ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌పై భారీగా కోత పెట్టాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో, దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. తొలుత ఒక్క పైసా, ఐదు పైసలు అలా తగ్గించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కాస్త పెంచి, రెండకెల్లో ధరలను తగ్గించాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం వరుసగా 16 రోజుల పాటు ఎడతెరపి లేకుండా పెరుగుతూనే పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు, గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. -
3 టైర్లు పంక్చరైన కారు.. మన ఆర్థికవ్యవస్థ
థానే : వినియోగదారులకు వాత పెడుతున్న పెట్రోల్ ధరలు, ఇతర సమస్యలపై మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడు టైర్లు పంక్చరైన కారు లాగా ఉందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ థానేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ‘ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ ఖర్చులు భారత ఆర్ధిక వ్యవస్థకు నాలుగు ఇంజిన్ల లాంటివి. ఇవి ఓ కారుకు నాలుగు టైర్లు లాంటివి. ఒకవేళ ఒకటి, రెండు టైర్లు పంక్చర్ అయితేనే వేగం తగ్గిపోతుంది. కానీ మన ఆర్ధిక వ్యవస్థ విషయంలో మూడు టైర్లకు పంక్చర్ అయింది’ అని సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు. ప్రభుత్వం ఖర్చులు కేవలం ఆరోగ్య సంరక్షణ, కొన్ని ఇతర సదుపాయాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చులు కొనసాగించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ పైనా పన్నుల భారం వేసిందన్నారు. ప్రజల నుంచి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజా సౌకర్యాల కోసం కొద్ది మొత్తంలోనే ఖర్చుపెడుతుందన్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ రంగంలో ఏమైనా కేంద్రం ఖర్చు చేయడం చూశారా? అంటూ చిదంబంర ప్రశ్నించారు. 10 దిగ్గజ కంపెనీలు దివాలా తీస్తే, వాటిలో ఐదు స్టీల్ కంపెనీలే ఉన్నాయని, దీంతో ఆ రంగాల్లో పెట్టుబడులు ఎలా ఆశిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఐదు శ్లాబుల జీఎస్టీ పాలనను కూడా చిదంబరం విమర్శించారు. ఈ ఐదు శ్లాబులకు తోడు సెస్ వసూలు చేయడం పైనా చిదంబరం విమర్శలు సంధించారు. మిగతా దేశాల్లో జీఎస్టీ కింద ఒకే పన్ను వ్యవస్థ ఉంటుందనీ.. కానీ భారత్‌లో మాత్రం రెండు రకాల పన్నుల వ్యవస్థ అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మోదీ ప్రభుత్వం నాన్ కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల రుణం ఇస్తుందని, సరాసరిన ఓ వ్యక్తికి ముద్ర రుణం కింద దక్కేది రూ.43 వేలు మాత్రమే. ఈ తక్కువ మొత్తంతో పకోడా స్టాల్ పెట్టుకోవడం తప్ప.. ఏ పెట్టుబడి పనికి రాదు’ అని చిదంబరం అన్నారు. -
పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలు
న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం సోమవారం లీటరు పెట్రోల్‌పై 15 పైసలు ధర తగ్గింది. అదేవిధంగా లీటరు డీజిల్ ధరపై కూడా 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. కర్ణాటక ఎన్నికల అనంతరం నుంచి వరుసగా 16 రోజుల పాటు వాహనదారులకు వాత పెట్టిన చమురు సంస్థలు, ఆ అనంతరం మే 30 నుంచి తగ్గడం ప్రారంభించాయి. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 33 పైసలు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ధరల తగ్గింపు అమలవుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.82.59గా, డీజిల్ ధర రూ.74.97గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంకేతాలు కూడా ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయని. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే, పరిస్థితి పూర్తిగా మన అదుపులోకి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిందని చెప్పారు. రికార్డు స్థాయిలను చేధించిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కరాన్నే ఎంచుకునేలా ముందుకు సాగుతోంది. -
పెట్రో వాత: దీర్ఘకాల పరిష్కారం త్వరలో
పుణె : పెట్రోల్, డిజిల్ ధరలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. శనివారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. ధరలు పెరగడంలో రాష్ట్రాలకు కూడా వాటా ఉందని, వారు కూడా పన్నులు విధిస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసొస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. గత యూపీఎ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు నియంత్రణ తప్పాయని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు పెరగడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది నుంచి ఆయిల్ కంపెనీలు రోజువారి ధరల సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా పెట్రోల్, డిజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ కంపెనీలు పెంచేటప్పుడు భారీగా పెంచడం, తగ్గించేటప్పుడు మాత్రం పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరో 9 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 20 పైసలు ధర తగ్గింది. ఇది ఇలా ఉంటే రికార్డ్ స్థాయిల్లో ఉన్న లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను కేవలం పైసల్లో తగ్గించడంతో పండుగ చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వాహనదారులు సెటైర్లు వేస్తున్నారు. -
4 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఎంత తగ్గాయో తెలుసా?
న్యూఢిల్లీ : వాహనదారులకు ఆయిల్ కంపెనీలు పైసా పైసా ముష్టి వేస్తున్నాయి. పెంచేటప్పుడు భారీగా పెంచేసి, తగ్గించేటప్పుడు పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఎంత అనుకుంటున్నారు? అది కేవలం 9 పైసలు మాత్రమే. దీంతో నాలుగు రోజుల పాటు వరుస తగ్గింపుతో పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 20 పైసలు ధర తగ్గింది. న్యూఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.78.20గా, లీటరు డీజిల్ ధర రూ.69.11గా పలుకుతోంది. సమీక్షించిన ధరల ప్రకారం ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.80.84గా, ముంబైలో రూ.86.01గా, చెన్నైలో రూ.81.19గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్ ధర కోల్‌కతాలో రూ.71.66గా, ముంబైలో రూ.73.58గా, చెన్నైలో రూ.72.97గా రికార్డయ్యాయి. మే 30 ముష్టివేసినట్టు ఒక్క పైసా ధర తగ్గించిన ఆయిల్ కంపెనీలు, ఆ తర్వాత రోజు పెట్రోల్ ధరపై 7 పైసలు, డీజిల్‌పై 5 పైసల తగ్గింపును చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఇదే మాదిరి పెట్రోల్‌పై 6 పైసలు, డీజిల్‌పై 5 పైసలు తగ్గించాయి. ఇలా.. సింగిల్ డిజిట్లో పైసల లెక్కనే తగ్గిస్తున్నాయి.. కానీ వాహనదారులపై ఆయిల్ కంపెనీలు కనీస కనికరం చూపించడం లేదు. ఆయిల్ కంపెనీలు చేపడుతున్న ఈ పైసల తగ్గింపుపై వాహనదారులు మండిపడుతున్నారు. పైసా పైసా కూడగట్టుకుని అపార్ట్మెంట్లు కట్టించుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, ఈ పైసలను మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేసుకోవాలా? అంటూ ఛలోక్తులు కురిపిస్తున్నారు. ఈ పైసాతో నేను వెంటనే డిస్కొంట్ రేట్లలో కారు కొంటాను.. త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో ఫుల్‌గా కామెంట్లు పేలుతున్నాయి. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ : మరో ఇంధనం చూసుకోండి
న్యూఢిల్లీ : గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగో రోజు ఈ ధరలు 9 పైసల వరకు తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలపై సుదీర్ఘకాల పరిష్కారం కనుగొనాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని పక్కన పెట్టి, ప్రత్యామ్నాయ ఇంధన వాడకాలను చేపట్టాలని మంత్రి సూచించారు. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిన అనంతరం మంత్రి ఈ ప్రకటన చేశారు. తగ్గింపు ధరల అనంతరం లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.78.20గా, లీటరు డీజిల్ రూ.69.11గా ఉంది. ముంబైలో కూడా లీటరు పెట్రోల్ రూ.86.01 వద్ద, డీజిల్ రూ.73.58 వద్ద రికార్డయ్యాయి. పుణేలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేపట్టిన విజయాలన్నింటిన్నీ ప్రస్తావించారు. ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాల పరిష్కారాన్ని వెతుకుతుందని చెప్పారు. ఇప్పటికే తాము పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీని నిలిపివేశామని, 8 కోట్ల మంది ఎల్పీజీ కనెక్షన్లను అందించామని చెప్పారు. ఇంతమంది ప్రజలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రధాన కారణం, పెట్రలో, డీజిల్‌పై సబ్సిడీ రద్దు చేయడమేనని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఇథనాల్, బయో-డీజిల్, బయో-పీఎన్జీ, ఎలక్ట్రిక్లుగా చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లను వెచ్చిస్తుందని, దీర్ఘకాలిక పరిష్కారంతో, ఈ వ్యయాలను తగ్గించుకోబోతున్నట్టు చెప్పారు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుతం హైబ్రిడ్ వాహనాలను రూపొందించడంలో తలమునకలయ్యాయని, ఇవి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడుస్తాయన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల కంటే వాటి ధరలు తక్కువేనని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నెలకు ఒక్కొక్కరూ రూ.4000 వరకు పొదుపు చేసుకోవచ్చన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ కిందకి తీసుకొస్తే, ఇంధన ధరలను 8 రూపాయల వరకు తగ్గించవచ్చని కూడా తెలిపారు. మరోవైపు ఎల్పీజీ, ఇంధన ధరలు పెరగడంపై మోదీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెలరేగుతుంది. -
పెట్రోల్, డీజిల్‌పై 5 రూపాయల తగ్గింపు..!?
ముంబై : వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధరల తగ్గింపు ఎలా అనే సాధ్యాసాధ్యాలపై తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇంధనంపై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 4 రూపాయల నుంచి 5 రూపాయల మేర కిందకి దిగిరానున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన అనంతరం, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు రాష్ట్రాలను సైతం వాల్యు యాడెడ్ ట్యాక్స్(వ్యాట్)ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా విక్రయాలపై వారి కమిషన్ తగ్గించుకోనున్నాయి. మోదీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఉన్నతాధికారి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్లాన్ వివరాల గురించి హిందూస్తాన్ టైమ్స్‌కు చెప్పారు. ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు.. ఇంధన ధరలు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉందని, త్వరలోనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ఉంటుందని తెలిసింది. కానీ రేట్ల తగ్గింపులో రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఒక్కటే ఈ భారాన్ని మోసలేదని, రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నీ సహకరిస్తే, ఇంధన ధరలపై వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చని తెలిపారు. మరోవైపు లెఫ్ట్ పాలన నడుస్తున్న కేరళలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క రూపాయి తగ్గాయి. ఇంధనంపై విక్రయ పన్నును తగ్గించి తాము, పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయి మేర తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. 2016-17లో దేశీయ బాస్కెట్లో బ్యారల్‌కు 47.56 డాలర్లు పలికిన క్రూడ్ ధర, 2017-18 నాటికి 56.43 డాలర్లకు పెరిగింది. మార్చి నాటికి ఇది 63.80 డాలర్లకు, ఏప్రిల్ నాటికి మరింత ఎగిసి 69.30 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారల్ క్రూడ్ ధర 75 డాలర్లుగా ఉంది. ఇది గతవారం అత్యధిక స్థాయిలో 80 డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. దేశీయంగా కూడా వరుసగా 16 రోజుల పాటు గరిష్ట స్థాయిలను నమోదు చేసిన ఇంధన ధరలు, నిన్నటి నుంచి పైసల్లో తగ్గుముఖం పట్టాయి. నేడు(గురువారం) దేశీయంగా లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇంధన ధరలపై విధించే పన్నుల్లో కేంద్రం 25 శాతం, రాష్ట్రాలు విధించే పన్నులు 21.2 శాతం, డీలర్ మార్జిన్లు 4.7 శాతం ఉంటాయి. -
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. వినియోగదారులకు ముష్టి వేసిన మాదిరిగా నిన్న(బుధవారం) 1 పైసా మాత్రమే తగ్గించిన ఆయిల్ కంపెనీలు, నేడు కూడా అదే ధోరణిలో లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధరలు తగ్గించినట్టు తెలిసింది. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ ధర బుధవారం రూ.69.30గా ఉంది. ఎడతెడపి లేకుండా.. వరుసగా 16 రోజుల పాటు పెరిగిన ఇంధన ధరలు, ప్రస్తుతం వరుసగా రెండో రోజూ తగ్గాయి. 16 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్‌పై రూ.3.8, డీజిల్‌పై రూ.3.38 ధర పెరిగింది. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ ఆయిల్ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు తాము శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. -
పైసా తగ్గింపుపై ఫైర్..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను ఒక పైసా తగ్గించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రో ధరలను నామమాత్రంగా తగ్గించడం పరిణితిలేని చర్యగా అభివర్ణించారు. చమురు కంపెనీలు ఇంధన ధరలను ఒక పైసా తగ్గించడం పట్ల మోదీ సర్కార్ తీరును తప్పుపట్టారు. పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడం మీ (ప్రధాని) సూచనే అయితే అది ఏమాత్రం పరిణితి లేని చర్య. గతవారం తాను చేసిన ఫ్యూయల్ ఛాలెంజ్‌కు ఒక పైసా తగ్గింపు ఏమాత్రం సరిపోదని రాహుల్ వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా మేర తగ్గించినట్టు బుధవారం ఉదయం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను ప్రధాని స్వీకరించిన క్రమంలో ఇంధన ధరలను తగ్గించాలని ఈనెల 24న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానికి సవాల్ విసిరారు. కాగా మే 14 నుంచి వరుసగా 16 రోజుల పాటు పెట్రో ధరలను పెంచుతూ వచ్చిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం స్వల్పంగా తగ్గించాయి.గత 15 రోజుల్లో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 3.80, డీజిల్ ధరలు రూ 3.38 మేర భారమయ్యాయి. -
ఇది కూడా తగ్గింపేనా..?
-
పెట్రోల్ ధరల తగ్గింపు.. జనం సంబరాలు
న్యూఢిల్లీ : గత 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు చుక్కలు చూపించిన ఆయిల్ కంపెనీలు నేడు జనానికి సర్ప్రైజ్ ఇచ్చాయి. వాహనదారులకు ఊరట కల్పిస్తున్నామని.. పెట్రోల్ ధరలను 60 పైసలు, డీజిల్ ధరలపై 56 పైసలు తగ్గించామంటూ ప్రకటనలు ఇచ్చాయి. హమ్మయ్య.. కాస్తో కూస్తో ధరలు తగ్గాయి కదా..! అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనూహ్యంగా మరో ప్రకటన చేసింది. రెండు మూడు గంటల వ్యవధిలోనే తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే తగ్గించామంటూ సవరణ ప్రకటన వెలువరించి జనంతో జోకులు చేసింది. పెట్రోల్, డీజిల్ విక్రయించే ధరలను పోస్టు చేసే తమ వెబ్సైట్లో సాంకేతిక సమస్య నెలకొందని, పెట్రోల్, డీజిల్ ధరలను పునఃసమీక్షిస్తున్నామంటూ ప్రకటించింది. ఇంధన ధరల తగ్గింపు స్వల్పమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. Indian Oil Corporation corrects earlier figures, Petrol prices went down not by 60 paise in Delhi & 59 paise in Mumbai but by just 1 paise. Diesel prices also went down by just 1 paise instead of 56 paise in Delhi & 59 paise in Mumbai pic.twitter.com/OXqR2QEIBP — ANI (@ANI) 30 May 2018 ఈ పైసా తగ్గింపుతో తామేదో గొప్ప మనసును చాటుకున్నట్టు ప్రకటనలు ఇస్తూ.. ఆయిల్ కంపెనీలు జనాన్ని వేళాకోళం చేస్తున్నాయి. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ విడ్డూరపు ప్రకటనలు ఇవ్వడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. పైసా తగ్గింపుతో తామేమీ పండుగ చేసుకోవాలంటూ ఆయిల్ కంపెనీలను దుమ్మెత్తి పోస్తున్నారు. పైసా తగ్గింపు ఎందుకని? అది ఎవరికి లాభమని? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయిల్ కంపెనీలు ఎంతమేర ధరలను అమలు చేస్తున్నాయి, వాటిని డీలర్లు ఏ మేరకు పాటిస్తున్నారు? అన్నది ప్రశ్నార్థకమే. ఇండియన్ ఆయిల్ కంపెనీలే ఒక్క పైసా తగ్గిస్తే, ఇంక డీలర్లేమీ అమలు చేస్తారంటూ మండిపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు ఎలాంటి చడీచప్పుడు లేకుండా.. ధరలను యథావిధిగా ఉంచిన కంపెనీలు, ఆ ఎన్నికలు అయిపోవడమే తమదే రాజ్యం అన్నంటూ వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. ఆ రోజు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిందే కానీ, తగ్గింది లేదు. రికార్డు స్థాయిలో వాహనదారులను బాదేస్తూ.. తమ రెవెన్యూలను దండీగా లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పులు చేపడతామని, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామంటూ రోజువారీ సమీక్షను చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రయోజనం అంటే.. ఎంతో అనుకుని సంబుర పడిపోతారని ముందే ఊహించిన ఆయిల్ కంపెనీలు, తాము తగ్గించేది ఒక్క పైసా, రెండు పైసలే అంటూ ఈ ప్రకటనలు చేస్తూ.. వాహనదారులను మరింత ఉడికిస్తున్నాయి. చదవండి... (శుభవార్త : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి) -
పెట్రోల్ కోసం నేపాల్‌కు పరుగులు
సాక్షి, పట్నా : దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటుంటే బిహార్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెట్రో సెగలను తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెతికారు. రక్సల్, సీతామర్హి ప్రాంతాల్లోని ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు పక్కనే ఉన్న పొరుగు దేశం వెళతున్నారు. భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్ రూ 15, డీజిల్ రూ 18 తక్కువ కావడం గమనార్హం. మరోవైపు మన కరెన్సీ రూ 100 నేపాలీ రూపీ 160.15తో సమానం. దీంతో నేపాల్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండటంతో సరిహద్దు ప్రాంత ప్రజలు పెట్రోల్ కోసం సరిహద్దులు దాటుతున్నారు. నేపాల్ సరిహద్దుకు సీతామర్హి కేవలం 30-40 కిమీ దూరంలో ఉంది. మరోవైపు కొందరు వ్యాపారులు నేపాల్‌లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొని వాటిని భారత్‌లో విక్రయిస్తున్నారు. భారత్ సరిహద్దుల్లో గత కొద్దిరోజులుగా పెట్రోల్ విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరిగాయని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. నేపాల్‌లో పెట్రో విక్రయాలు పెరగడంతో నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ సంబరపడుతుంటే బిహార్ సరిహద్దుల్లోని పెట్రో పంపులు వినియోగదారులు లేక కళతప్పాయి.ఇక నేపాల్‌కు సైతం పెట్రోలియం ఉత్పత్తులను భారత్ సరఫరా చేస్తోంది. పొరుగు దేశానికి భారత్ నుంచి రోజూ 250 ట్యాంకర్ల ఆయిల్ నేపాల్ సరఫరా అవుతోంది. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పెట్రోల్ ధరలు భారమవుతుండగా, నేపాల్‌లో ఏకపన్ను వ్యవస్థ అమల్లో ఉంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజుల నుంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న అనంతరం వరుసగా 13 రోజుల నుంచి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్‌కు 80 డాలర్ల గరిష్ట స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం 2.42 డాలర్లు తగ్గి, 76.37 డాలర్లుగా నమోదైంది. దీంతో ఇక దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలున్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం మారుతున్న ధరలు, గ్లోబల్ ట్రెండ్ మాదిరిగా వచ్చే రోజుల్లో తగ్గబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే, వాటి ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు చేరేలా కేంద్రం రోజువారీ ధరల సమీక్ష చేపట్టింది. ఈ రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి ఇంధన ధరలు పెరగడమే కానీ, తగ్గుదల మాత్రం చాలా అరుదుగా సంభవించింది. అందుకు కారణం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నందున్న, దేశీయంగా కూడా వినియోగదారులు గుడ్‌న్యూస్‌ను వినబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక కాకపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. దీంతో కేంద్రం సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలోనే ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనబోతుంది. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.77.97గా, కోల్‌కతాలో రూ.80.61గా, ముంబైలో రూ.85.78గా, చెన్నైలో రూ.80.95గా, హైదరాబాద్‌లో రూ.82.60గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.68.90గా, కోల్‌కతాలో రూ.71.45గా, ముంబైలో రూ.73.36గా, చెన్నైలో రూ.72,74గా, హైదరాబాద్‌లో రూ.74.89గా రికార్డైంది. -
రూ.11 పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు భారీ ఎత్తున్న జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తుతున్న ఇంకా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరుసగా 12వ రోజు ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు 32 పైసలు, 18 పైసల చొప్పున పెరిగాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్తాయనే కారణంతో దాదాపు 19 రోజుల పాటు ఈ ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. అయితే కర్ణాటక ఎన్నికలు అలా అయిపోగానే.. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు వాత పెట్టడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కర్నాటక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధర 11 రూపాయల మేర పెరగగా... డీజిల్ ధర రూ.7.27 ఎగిసింది. దీంతో నేడు లీటరు పెట్రోల్ ధర మెట్రోపాలిటన్ నగరాల్లో.. ఢిల్లీలో రూ.77.83గా ఉండగా.. ముంబైలో రూ.85.65గా, కోల్‌కతాలో రూ.80.47గా, చెన్నైలో రూ.80.80గా ఉంది. సమీక్షించిన ధరల ప్రకారం లీటరు డీజిల్ ధర.. ఢిల్లీలో రూ.68.75గా, ముంబైలో రూ.73.2గా, చెన్నైలో రూ.72.58గా, కోల్‌కతాలో రూ.71.30గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి. పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపినప్పటికీ, భారీగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రష్యా నుంచి సరఫరా పెరగనుందనే సంకేతాలతో ఈ ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో దేశీయంగా ఏమైనా ధరలు తగ్గే అవకాశముందో లేదో చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటి పన్నులు తగ్గిస్తే, దాని ప్రభావం సబ్సిడీలపై పడనుందని కేంద్రం చెబుతోంది. అయినప్పటికీ, ధరల పెంపును తగ్గించడానికి దీర్ఘకాలిక పరిష్కారం కనుగొంటామని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఒక్క రూపాయి మేర తగ్గించినా.. ప్రభుత్వానికి 130 బిలియన్ రూపాయిలు నష్టం చేకూరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కోతలో కాస్త వెనుకంజ వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకి తీసుకురావాలని కూడా నితిన్ గడ్కారీ అన్నారు. -
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఛాలెంజ్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజుల నుంచి వినియోగదారులకు భారీగా వాత పెడుతున్న సంగతి తెలిసిందే. పెరిగేదే కానీ, అసలు తగ్గేదే కనిపించడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం త్వరలోనే తగ్గిస్తామంటూ మాటలు చెప్పుకొస్తుంది కానీ, ఎప్పుడు తగ్గింపు చేపడతామనే విషయంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతోంది. ఓ వైపు ఇంధన ధరలను సైతం జీఎస్టీ కిందకి తీసుకొచ్చి, వాటి ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. మండుతున్న ఈ ధరలపై విపక్షాల సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ ఈ విమర్శలపై ప్రధాని మోదీ నోరైనా మెదపడం లేదు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంపై మండిపడ్డారు. ‘డియర్ పీఎం, విరాట్‌కోహ్లి ఫిట్నెస్ ఛాలెంజ్‌ను మీరు స్వీకరిస్తున్నట్టు చూడటం ఆనందదాయకంగా ఉంది. నా నుంచి కూడా ఓ ఛాలెంజ్ ఉంది. ఇంధన ధరలను తగ్గించాలి లేదంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ధరలను తగ్గించాల్సి వస్తుంది. దీనిపై మీ స్పందన ఎలా ఉంటుందో చూస్తాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. #ఫిట్నెస్ఛాలెంజ్ మాదిరి #ఇంధనఛాలెంజ్ అంటూ రాహుల్ గాంధీ, ప్రధానికి ఒక గట్టి హెచ్చరికనే జారీచేశారు. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, దేశీయంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతేకాక డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించడం కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. కానీ ప్రభుత్వాలు విధించే పన్నులను తగ్గిస్తే ఈ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. కానీ పన్నులు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. పన్నులు తగ్గిస్తే, ఆ ప్రభావం సంక్షేమ పథకాలపై పడుతుందని కేంద్రం అంటోంది. గత 11 రోజుల్లో 11 సార్లు ఈ ధరలు పెరిగాయి. అంటే ఒక్కరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 19 నుంచి 31 పైసల శ్రేణిలో పెరిగాయి. నేడు లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.47గా , కోల్‌కతాలో రూ.80.12గా, ముంబైలో రూ.85.29గా, చెన్నైలో రూ.80.42గా ఉంది. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.68.53గా, కోల్‌కతాలో రూ.71.08గా, ముంబైలో రూ.72.96గా, చెన్నైలో రూ.72.35గా నమోదైంది. Dear PM, Glad to see you accept the @imVkohli fitness challenge. Here’s one from me: Reduce Fuel prices or the Congress will do a nationwide agitation and force you to do so. I look forward to your response.#FuelChallenge — Rahul Gandhi (@RahulGandhi) May 24, 2018 -
మీరు తగ్గించాలి.. కాదు మీరే..!
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్నా సామాన్యుడికి ఊరట కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపటం లేదు. గత ఎనిమిది రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోలు రూ. 2.64, డీజిల్ రూ.2.25 చొప్పున పెరిగినా ఉపశమన చర్యలు చేపట్టకపోవటంతో వాహనదారులు అల్లాడుతున్నారు. 2016 జనవరి నుంచి చూస్తే పెట్రోలు లీటరుకు రూ.17.9, డీజిల్ రూ.25.17 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు రూ. 83.37, డీజిల్ రూ. 75.61కు చేరుకున్నాయి. పెట్రోల్‌పై రూ.11.47, డీజిల్‌పై రూ.15.47 దాకా పెరిగిన పన్నుల భారమే ఉండటం గమనార్హం. ధరలు దించండి... వ్యాట్ తగ్గించుకోండి ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గతేడాది జూన్ నుంచి రోజు వారీ ధరల విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే లీటరు పెట్రోలు రూ.12.45, డీజిల్ రూ.14.58 పెరిగాయి. ఇంత భారీగా ధరలు పెరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా మీరు తగ్గించాలంటే మీరు తగ్గించాలంటూ తప్పించుకుని సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు కేంద్రం తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారం ప్రజలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏకంగా పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు. అయితే ఒక లీటరు పెట్రోల్‌లో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.12 వస్తే రాష్ట్రం ఏకంగా రూ. 26 తీసుకుంటూ కేంద్రంపై విమర్శలు చేయడాన్ని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే తాము కొంత ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం కాబట్టి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలే వ్యాట్‌ను తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ‘వ్యాట్’ వాత అధికం.. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉన్నందున ఇన్నాళ్లూ అదనపు ఆదాయం ఆర్జించిన నేపథ్యంలో ఇకనైనా పన్నులు తగ్గించి ఉపశమన చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్‌పై లీటరుకు రూ.1.58 నుంచి రూ.7.51 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. డీజిల్‌పై లీటరుకు రూ. 1.29 నుంచి రూ.6.06 వరకు ఎక్కువ భారం పడుతోంది. దీనికి కారణం మన రాష్ట్రంలో విధించిన అదనపు వ్యాటే. 2015లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం ప్రతి లీటరుపై రూ.4 అదనపు వ్యాట్ విధించింది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.21.83, డీజిల్‌పై రూ.16.52 చొప్పున ఆదాయం నేరుగా వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఖజానాకు రూ.9,785 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. మీరే తగ్గించొచ్చుగా... కేంద్రం సహకరించకపోయినా బాండ్లు సమీకరించి మరీ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేయకుంటే తామే బాగు చేసి టోల్ వసూలు చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు సామాన్యుల గోడు పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై మోపిన అధిక పన్నులను తగ్గించాలంటూ రెండేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఫలితం లేదు. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా ముందుగా తానే పన్నులు తగ్గించి కేంద్రానికి ఆదర్శంగా నిలవవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అమ్మకాలు డీలా... ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోలియం డీలర్లు వాపోతుండగా, లారీలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని లారీ యజమానులు చెబుతున్నారు. గతంలో తమ బంకులో ప్రతి రోజూ 4,500 లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతుండగా గత వారం రోజులుగా ధరల పెరుగుదలతో విక్రయాలు 3,500 లీటర్లకు పడిపోయినట్లు గుంటూరుకు చెందిన ఒక డీలరు తెలిపారు. డీజిల్ విక్రయాలు 10 వేల లీటర్ల నుంచి 7 వేల లీటర్లకు తగ్గాయని చెప్పారు. పెరుగుతున్న డీజిల్ ధలరకు వ్యతిరేకంగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఏపీ లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
పెట్రో దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత పది రోజులుగా రోజువారీ సవరణలతో ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రెండో స్థానంలో ఉండగా, డీజిల్ ధర ఆల్‌టైమ్ టాప్‌గా మారి రికార్డు సృష్టిస్తోంది. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.81.43, డీజిల్ ధర రూ.74.00.. అమరావతిలో పెట్రోల్ ధర రూ.83.00, డీజిల్ ధర రూ.75.29 ఉంది. పది రోజులుగా నిత్యం సగటున పెట్రోల్‌పై 15 నుంచి 47 పైసలు, డీజిల్‌పై 23 నుంచి 31 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రో ధర విషయంలో ముంబై తొలిస్థానంలో ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర మంగళవారం నాటికి రూ.84.70గా ఉంది. ఐదేళ్ల నాటి రికార్డు దిశగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 సెప్టెంబర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.07 పైసలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. తాజాగా ఏపీలో పెట్రోల్ ధర రూ.83.00కు పెరిగి ఈ రికార్డును సమీపించింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా రూ.72.24, డీజిల్ రూ.61.75 పైసలు పలికింది. అప్పటి నుంచి చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణ పేరిట సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. గతేడాది జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. -
28 నెలల్లో డీజిల్ ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సరికొత్త రికార్డులను ఛేదిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్ దూసుకుపోతున్నాయి. గత 28 నెలల్లో డీజిల్ ధరల పెంపు 50 శాతానికి పైగా అంటే 51.17 శాతం పెరిగినట్టు తెలిసింది. 2016 జనవరి 16న ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.44.18 ఉంటే, 2018 మే 17 అంటే నేటికి లీటరుకు రూ.66.79కు పెరిగినట్టు వెల్లడైంది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల డేటా ప్రకారం నేడు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.66.79గా రికార్డు కాగ, కోల్‌కతాలో రూ.69.33గా, ముంబైలో రూ.71.12గా, చెన్నైలో రూ.70.49గా నమోదైనట్టు తెలిసింది. నేడు ఢిల్లీలో రికార్డైన ఈ డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై. అంటే ఈ మేర డీజిల్ ధరలు ఎప్పుడూ ఎగియలేదు. మరోవైపు ఢిల్లీలో పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైకు 1 శాతం మాత్రమే దూరంలో ఉంది. లీటరు పెట్రోల్ ధర నేడు ఢిల్లీలో రూ.75.32గా ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.78.01గా, ముంబైలో రూ.83.16గా, చెన్నైలో రూ.78.16గా రికార్డయ్యాయి. మొత్తంగా నేడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లీటరుకు 22-24 పైసలు ఎగిసినట్టు ఇండియన్ ఆయిల్ కంపెనీల డేటాలో తెలిసింది. కాగ, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు రోజుల నుంచి మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. గురువారంతో కలిపి ఈ నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరు 69 నుంచి 73 పైసల మేర పెరిగాయి. డీజిల్ ధరలు కూడా 70 నుంచి 93 పైసలు ఎగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 2014 నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తుండటంతో, దేశీయంగా కూడా ఈ మేర ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నేడు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్‌కు 80 డాలర్లకు పైకి ఎగిశాయి. 2014 నవంబర్ తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. ఈ ప్రభావంతో కూడా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. -
‘హ్యాట్రిక్’ మోత...
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల మోత మళ్లీ మోగుతోంది. చమురు సంస్థలు 19 రోజుల విరామం తర్వాత మళ్లీ విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోజువారీ ధరల సవరణ జోలికి వెళ్లని దేశీయ మార్కెటింగ్ సంస్థలు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి రోజువారీ ధరల సవరణకు దిగాయి. మూడు రోజులుగా రోజుకు పెట్రోల్‌పై 15 నుంచి 22 పైసలు, డీజిల్‌పై 21 నుంచి 26 పైసలు పెరిగాయి. రోజువారీ ధరల సవరణ అనంతరం దేశంలోనే హైదరాబాద్‌లో డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తుండగా... పెట్రోల్ ధర రెండో స్థానంలో రికార్డుగా నమోదైంది. మూడు రోజుల్లో.. మూడు రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 75 పైసలు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌పై 46 పైసలు, డీజిల్‌పై 68 పైసలు, ఢిల్లీలో పెట్రోల్‌పై 47 పైసలు, డీజిల్‌పై 64 పైసలు, బెంగళూరులో పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై 67 పైసలు పెరిగాయి. ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో చమురు సంస్థలు సైలెంట్‌గా బాదేస్తున్నాయి. -
మూడు రోజుల నుంచి భగ్గుమంటున్న పెట్రోల్
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్దుగా ఏ మాత్రం మారకుండా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల అనంతరం భగ్గుమంటున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో స్కై రాకెట్లా దూసుకుపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.75 మార్కును క్రాస్ చేసింది. ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్ నుంచి ఇదే గరిష్ట స్థాయి. ఇతర మెట్రోపాలిటన్ నగరాలు కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్‌లో రూ.79.55గా నమోదైనట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ డేటాలో వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్‌కతాలో 16 పైసలు పెరిగాయి. మరోవైపు డీజిల్ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ.. వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్‌కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్‌లో రూ.72.36గా నమోదవుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రికార్డు స్థాయిలో ఈ ధరలను పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా ఎగుస్తున్నాయి. దాంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తోంది. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్‌కు ప్రస్తుతం 78 డాలర్లు ఉంది. -
పెట్రోల్, డీజిల్ దెబ్బ : ద్రవ్యోల్బణం జంప్
న్యూఢిల్లీ : నేడు ఉదయం విడుదలైన ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకగా.. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి పెరిగినట్టు తెలిసింది. మార్చి నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.28 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కాక పుట్టిస్తున్నాయి. కాగ, రాయిటర్స్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 4.42 శాతానికి పెరుగుతుందని మాత్రమే భావించారు. కానీ అంచనాలకు మించి ఇది పెరిగింది. ద్రవ్యోల్బణాలు పెరగడం తదుపరి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమీక్షలో రేట్ల కోతకు అవకాశాలను సన్నగిలుస్తున్నాయి. తదుపరి ఆర్బీఐ మానిటరీ పాలసీ జూన్‌లో ఉండనుంది. కాగ, ఉదయం విడుదలైన డబ్ల్యూపీఐ కూడా నాలుగు నెలల గరిష్టంలో 3.18 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఆహార ధరల్లో పెరుగుదల ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీసినట్టు తెలిసింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు మారడం లేదు?
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధర మంట తెలిసిందే. గత వారం క్రితం రికార్డు స్థాయిల్లో ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్న, దేశీయంగా మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. విడ్డూరమని అనిపించినా ఇది నిజం. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 24 నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అప్పటి నుంచి లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.63, కోల్‌కత్తాలో రూ.77.32, ముంబైలో రూ.82.48, చెన్నైలో రూ.77.43గా ఉన్నాయి. బెంగళూరులో ఒక్క లీటరు పెట్రోల్ ధర రూ.75.82గా ఉంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తంగా 224 సెగ్మెంట్లలో మే 12న పోలింగ్ జరుగబోతోంది. ఈ సమయంలో ధరల పెంపు అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. గత వారం క్రితం వరకు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును ప్రధానమైన అంశంగా తీసుకున్న విపక్షాలు, కర్నాటక ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా మలుచుకున్నాయి. దీంతో గత ఆరు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రభుత్వం చేపట్టడం లేదు. పెట్రోలు ధరల్లో మార్పు ఎందుకు లేదన్న విషయమై అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక ఎన్నికలు ముగియగానే, ఒక్కసారే ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలై నుంచి పరిశీలిస్తే పెట్రోలు ధర రూ. 11కు పైగా, డీజిల్ ధర రూ. 12కు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలను కొంతకాలం సవరించలేదు. -
ఆల్ టైం రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్,డీజిల్ ధరలు
-
స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్
ముంబై : పెట్రోల్ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెట్రోల్ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్ సైతం ఆల్-టైమ్ హైలో రూ.65.46గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం 2013 సెప్టెంబర్ నుంచి ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు కొనసాగుతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం శనివారం పెట్రోల్ ధరలు న్యూఢిల్లీలో రూ.74.21గా, కోల్‌కత్తాలో రూ.76.91గా, ముంబైలో రూ.82.06గా, చెన్నైలో రూ.76.99గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.65.46గా, కోల్‌కత్తాలో రూ.68.16గా, ముంబైలో రూ.69.7గా, చెన్నైలో రూ.69.06గా నమోదయ్యాయి. గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అత్యధిక స్థాయిలకు చేరుకుంటున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీ కోతలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 2017 అక్టోబర్‌లో మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. -
మోత..వాత
జోగిపేట(అందోల్): డీజిల్, పెట్రోల్ ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రభుత్వాలు మాత్రం వివిధ రకాల పన్నులు వేస్తూ దండుకుంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు వాహనదారులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తున్నా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు. జిల్లాలోని జోగిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో సుమారు 60 వరకు పెట్రోల్ పంపులు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ద్విచక్రవాహనదారులు, ఇతర వాహనాల యజమానులు పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటారు. డీజిల్‌ను ట్రాక్టర్లతో పాటు లారీలు, జీపులు, ఇతర వాహనదారులు వినియోగిస్తారు. 2017 జూన్ నుంచి 2018 ఏప్రిల్ వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ.10.82, డీజిల్‌పై రూ.11.89 ధర పెరిగింది. కాంగ్రెస్ హయాంలో క్రూడాయిల్ ధర బ్యారెల్ రూ.100 ఉంటే ప్రస్తుతం ఒక్కసారిగా రూ.40కి పడిపోయింది. అయినప్పటికీ పెట్రో ల్, డీజిల్ ధరలు దించడం ఎందుకని భావించిన ప్రభుత్వాలు అనేక రకాల పన్నులను పెంచాయి. దీంతో క్రూడాయిల్ రూ.68కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడంతో 25 నుంచి 33 శాతం మేర పన్నులు వినియోగదారులు భరించాల్సి వస్తోంది. ఇదే జీఎస్టీలోకి చేర్చితే కేవలం 12శాతం పన్నులు వేసే అవకాశం ఉంటుందని, తద్వారా ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. పన్నులతోనే భారం క్రూడాయిల్ ధరలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చితే ధరలు దిగి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి వేస్తున్న పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.– శ్రీనివాస్, జోగిపేట,పంపు యజమాని -
17 రోజుల్లో 14 సార్లు పెంపు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పైపైకి ఎగుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పైకి ఎగిశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరగా.. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. గత 17 రోజుల్లో ఇప్పటి వరకు 14 సార్లు ఈ ధరలు పెరిగినట్టు తెలిసింది. 2018 మార్చి 18 నుంచి కొనసాగింపుగా ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయని వెల్లడైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం నేడు పెట్రోల్ ధరలు ఢిల్లీలో లీటరు రూ.73.95 ఉండగా.. కోల్‌కత్తాలో రూ. 76.66గా, ముంబైలో రూ.81.8గా, చెన్నైలో రూ.76.72గా రికార్డయ్యాయి. డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో లీటరుకు రూ.64.82గా, కోల్‌కత్తాలో రూ.67.51గా, ముంబైలో రూ.69.02గా, చెన్నైలో రూ.68.38గా నమోదయ్యాయి. 2017 జూన్‌లో రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరుగుతూనే ఉన్నాయి.క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు, రూపాయి-డాలర్ ఎక్స్చేంజ్ రేటు, దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు చేరుకుంది. మంగళవారం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకున్నాయని వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్టాలను చేరుతుండటంతో, వెంటనే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వెనువెంటనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై విముఖత వ్యక్తం చేస్తోంది. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య కాలంలో తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలు పెంచిన ప్రభుత్వం, ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీను తగ్గించింది. దీంతో ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించకుండా... వినియోగదారులపై భారం మోపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మళ్లీ రూ.80 మార్కు దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్ ధర 15 పైసలు, లీటరు డీజిల్ ధర 7 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో మరోసారి రూ.80 మార్కును పెట్రోల్ ధర అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్ రేట్లు అత్యధికంగా ఉండటంతో, అక్కడ ధరలు మోత మోగుతున్నాయి. ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్ ధర ఎగిసింది. లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్ ధర రూ.64.14గా రికార్డయ్యాయి. డిసెంబర్ మధ్య నుంచి లీటరు పెట్రోల్ ధర కనీసం రూ.4, డీజిల్ ధర రూ.5.77 మేర పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి. రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన అంతర్జాతీయ ఆయిల్ ధరలు ప్రస్తుతం తగ్గుతున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఆ ప్రభావం కనుబడుట లేదు. -
పెట్రో షాక్ నుంచి రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జైట్లీ బడ్జెట్ పలు వర్గాలను నిరాశపరిచినా పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలైన మధ్యతరగతికి మాత్రం కొంత ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి సర్కార్ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం రెండు రూపాయల మేర తగ్గించింది. అన్‌బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు ప్రభుత్వం రూ 6.48 నుంచి రూ 4.48కి తగ్గించింది. బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 7.66 నుంచి రూ 5.66కు తగ్గించింది. ఇక బ్రాండెడ్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 8.69కు తగ్గించింది. పెట్రో ఉత్పత్తుల ధరలు ఇటీవల పెరుగుతూ దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో లీటర్‌కు రూ 80కి చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంతో ఆ మేరకు వీటి ధరలు కొద్దిగా దిగివచ్చే అవకాశం ఉంది. -
భగభగమంటున్న పెట్రోల్.. భగ్గుమంటున్న ప్రజలు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో ఆ భారాన్ని పెట్రోలియం కంపెనీలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయి. దీంతో పెట్రోల్ ధర మోత మోగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75కు అటు-ఇటుగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఇంచుమించు ఇదేరీతిలో ఉంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు ఉపశమన చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిక్షాలు మండిపడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముంబైలో ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు చేతిలో పళ్లెలను పట్టుకొని.. వాటిని మోగిస్తూ.. నిరసన తెలిపారు. ‘దేశంలోనే పెట్రోల్‌కు అత్యధిక ధర ఉన్నది ముంబైలోనే. గతంలో ఎప్పుడూ ఇంతటి ధరలు లేవు. ప్రధాని మోదీ పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’ అని కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ అన్నారు. (ముంబైలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన) ఇక, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే.. వీటి ధరలు తగ్గే అవకాశముందన్న వాదన ఉంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వేస్తున్న పన్నులు, సుంకాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అవలంబించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ పరిధిలోకి ఇవి వస్తే సామాన్యులకు కొంత ఊరట లభించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై తమకు అభ్యంతరం లేదని పెట్రోలియం కంపెనీలు సైతం చెప్తున్నాయి. (ముంబైలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన) ఇలా చేయడం వల్ల పెట్రో పన్నుల ప్రక్రియ సులభతరం అవుతుందని అంటున్నాయి. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ స్పందిస్తూ.. ‘పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. ఈ ప్రక్రియ సులభతరం అవుతోంది. ప్రతి ఒక్కరూ అన్ని ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అన్ని ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడం మాకు కొంత ప్రతికూలతగానే అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. మొత్తానికి పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తెస్తారా? లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గా కనిపిస్తోంది. -
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేర అత్యధిక స్థాయిలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.38గా రికార్డైందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల రోజువారీ జాబితాలో వెల్లడైంది. ఇది 2014 మార్చి నాటి గరిష్ట స్థాయి. అదేవిధంగా డీజిల్ ధర లీటరుకు రికార్డు స్థాయిలో రూ.63.20ను తాకింది. ముంబైలో ఈ రేట్లు మరింత అధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధరలు 80 మార్కును దాటగా.. డీజిల్ రూ.67.30 వద్ద అమ్ముడుపోతుంది. ముంబైలో స్థానిక విక్రయ పన్ను లేదా వ్యాట్ రేట్లు అధికంగా ఉండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్ మధ్య నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ.4.86 జంప్ చేసినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ఎక్కువగా పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వచ్చే వారంలో పార్లమెంట్‌కు సమర్పించనున్న 2018-19 కేంద్ర బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీని కోత పెట్టాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిర మంత్రిత్వ శాఖను కోరుతోంది. ప్రీ-బడ్జెట్‌కు ముందు సమర్పించిన మెమోరాండంలో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ముందు ఉంచినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే లెవీల్లో లీటరు పెట్రోల్‌పై రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించి, సాధారణ ప్రజలకు కొంత మేర అయినా ఉపశమనం కల్పించాలని అధికారులు తెలిపారు. అయితే గ్లోబల్‌గా ఆయిల్ ధరలు తగ్గుముఖంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలను పెంచింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ డ్యూటీకు కోత పెట్టింది. -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారీగా పెరిగిన పెట్రోల్ ధర, మరింత పైకే..
ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలకు దగ్గరిలో రూ.79.44గా రికార్డైంది. అంటే ఒక్కరోజులోనే 17పైసల మేర పైకి ఎగిసింది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్ ధరలు లీటరుకు రూ.71.56గా, రూ.74.28గా, రూ.74.20గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ముంబైలో బుధవారం కంటే 21 పైసలు ఎక్కువగా రూ.66.30గా నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా లీటరు డీజిల్ ధర ఒక్కరోజులోనే 19 పైసలు పెరిగి రూ.62.65గా ఉంది. ఇలా కోల్కత్తా, చెన్నై, హైదరాబాద్‌లో కూడా డీజిల్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.75.32ను క్రాస్ కాగ, డీజిల్ ధర లీటరుకు రూ.67.09గా ఉంది. ఇవి ఇక్కడ ఆల్-టైమ్ హైగా తెలిసింది. గతవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తుండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల అనంతరం, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి కూడా జీఎస్టీ కింద ఆయిల్, నేచురల్ గ్యాస్ తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు పలు ప్రధాన అంశాలపై నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. దీనిలో పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ప్రధాన అంశంగా తెలుస్తోంది. -
రికార్డులను దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డులను క్రాస్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటంతో, దేశీయంగా సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేడు డీజిల్ ధరలు లీటరుకు రూ.61.74 వద్ద రికార్డు గరిష్టాలను తాకగా.. పెట్రోల్ ధరలు లీటరు 71 రూపాయలు దాటేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర సోమవారం రూ.71.18కు పెరిగింది. 2014 ఆగస్టు తర్వాత ఇదే అత్యధిక గరిష్ట స్థాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర రూ.61.74 గా రికార్డైంది. ముంబైలో మరింత ఎక్కువగా రూ.65.74గా నమోదయ్యాయి. ముంబైలో స్థానిక విక్రయ పన్ను అత్యధికంగా ఉండటంతో ఢిల్లీలో కంటే కూడా డీజిల్ ధరలు అక్కడ ఎక్కువగా ఉన్నాయని ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది. రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ డ్యూటీలను సైతం తగ్గించింది. కానీ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో గత నెల నుంచి డీజిల్ ధరలు రూ.3.4 పెరుగగా.. పెట్రోల్ ధరలు రూ.2.09 పెరిగాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించినా.. రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. రాష్ట్రాలు సైతం వ్యాట్ తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. కొన్ని ప్రభుత్వాలు తగ్గించినప్పటికీ, మిగతా ప్రభుత్వాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించకుండా.. వినియోగదారులపై ఆ మోత మోగిస్తున్నాయి. -
ఆల్-టైమ్ హైలో డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయిలోకి ఎగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇంధన ధరలు భారీగా పైకి పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఢిల్లీలో లీటరు డీజిల్‌ను రూ.59.70కు విక్రయించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి. కోల్కత్తా, చెన్నైలో కూడా డీజిల్ ధరలు 2014 సెప్టెంబర్ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో కూడా డీజిల్ ధరలు 2017 మార్చి నాటి స్థాయిలను నమోదుచేస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా, మిగతా నగరాల్లో పెట్రోల్ ధరలు కూడా 2017 అక్టోబర్ 3 నాటి అత్యధిక ధరలు పలుకుతున్నట్టు వెల్లడైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, కస్టమర్లకు కాస్త ఉపశమనం కల్పించడానికి పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం అక్టోబర్ నెలలోనే ఎక్సైజ్ డ్యూటీని రూ.2 తగ్గించింది. అదే నెలలో వంటగ్యాస్‌పై నెలవారీ పెంపుదల చేపడుతున్న ధరల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరగడమే తప్ప తగ్గడం కనిపించలేదు. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. నగరాలు డీజిల్ ధరలు(లీటరుకు రూపాయిల్లో) పెట్రోల్ ధరలు(లీటరుకు రూపాయిల్లో) ఢిల్లీ 59.70 69.97 కోల్కత్తా 62.36 72.72 ముంబై 63.35 77.87 చెన్నై 62.90 72.53 -
త్వరలోనే చౌకగా పెట్రోల్
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలోనే పెట్రోల్ చౌకగా లభ్యం కానుంది. కేంద్ర ప్రభుత్వం నేడు మిథనాల్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీతో పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు. దీంతో పెట్రోల్ ధరలు దిగి వస్తాయని, కాలుష్యాన్ని కూడా అరికట్ట వచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్ల శాఖమంత్రి నితిన్ గడ్కారీ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.80తో పోలిస్తే, బొగ్గు నుంచి ఉత్పత్తికి అయ్యే మిథనాల్ ఖర్చు లీటరుకు కేవలం రూ.22లు మాత్రమేనని చెప్పారు. చైనా అయితే ఏకంగా దీన్ని రూ.17కే ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేయగలవని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గుతాయని, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. స్వీడన్ ఆటో మేజర్ వోల్వో మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజీన్‌ను రూపొందించిందనీ, స్థానికంగా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కారీ తెలిపారు. అలాగే ఇథనాల్ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. మంగళవారం మెట్రోల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 10-12 పైసల చొప్పున పెరిగాయి. రోజువారీ ధరల సమీక్ష కింద ఉదయం 6 గంటలకు మారిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.8, కోల్‌కత్తాలో రూ.72.55, ముంబైలో రూ.76.9, చెన్నైలో రూ.72.35గా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ధరలు సోమవారం స్థాయి ధరలకు 11-12 పైసలు అధికం. అదేవిధంగా ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.58.26, కోల్‌కత్తాలో రూ.60.92, ముంబైలో రూ.60.98, చెన్నైలో రూ.61.36గా ఉన్నాయి. సోమవారం రేట్లతో పోలిస్తే డీజిల్ ధరలు కూడా లీటరుకు 10-11 పైకి ఎగిశాయి. ఈ నెల మొదటి నుంచి లీటరు పెట్రోల్ ధరలు 65-71 పైసల చొప్పున పెరుగగా.. డీజిల్ ధరలు 56-60 పైసలు చొప్పున పెరిగాయి. 2017 జూన్ 16 నుంచి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ ధరల సమీక్ష ప్రకారం అంతర్జాతీయ ఆయిల్ ధరల్లో మార్పులను వెనువెంటనే వినియగదారులకు చేరవేయలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగడం తప్ప, తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశీయంగా కూడా చమురు ధరలు మోతెక్కిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 2015 జూన్ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.5 శాతం పెరిగి 64.23 డాలర్లుగా నమోదైంది. -
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ కోత: ధరలు కిందకి
మరో బీజేపీ పాలిత రాష్ట్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అనంతరం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల్పై వ్యాట్ తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్‌పై రిటైల్ వ్యాట్‌ను 3 శాతం, డీజిల్‌పై రిటైల్ వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తున్నట్టు మధ్య ప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈ తగ్గించిన వ్యాట్ ప్రకారం కొత్త ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను కొంత నిరోధించడానికి ఎక్సైజ్ డ్యూటి వీటిపై లీటరు రూ.2 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు అనంతరం రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను 5 శాతం మేర తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల సీఎంలను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో కోతపెడుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో మూడు నెలలుగా భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు కొంత ఊరట లభించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తూ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. -
వ్యాట్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
మోతెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఇంధనాలపై 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కిందకి దిగొచ్చాయి. వ్యాట్‌ను తాము 4 శాతం తగ్గించామని, ఈ మేరకు లీటరు పెట్రోల్ రూ.2.93, లీటరు డీజిల్ రూ.2.72 కిందకి దిగొచ్చాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర కూడా వ్యాట్‌ను తగ్గించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.2, లీటరు డీజిల్ ధరను రూ.1 తగ్గించినట్టు ప్రకటించింది. వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ది పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వీరికి అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలకు వినియోగిస్తోంది. కాగ, పెట్రోల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.21.48 నుంచి రూ.19.48కు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.17.33 నుంచి రూ.15.33కు తగ్గించింది. ఈ ప్రభావంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.5, లీటరు డీజిల్ ధర రూ.2.25 తగ్గాయి. -
ఒక్కసారిగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీసుకున్న ఎక్సైజ్ సుంకం కోత నిర్ణయంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు కిందకి దిగొచ్చాయి. రోజువారీ సమీక్ష నేపథ్యంలో బుధవారం ఉదయం ఆరుగంటలకు జరిపిన సమీక్షలో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.2.25, కోల్‌కత్తాలో రూ.2.25, ముంబైలో రూ.2.38, చెన్నైలో రూ.2.41 తగ్గినట్టు తెలిసింది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.56.89గా, కోల్‌కత్తాలో రూ.59.55గా, ముంబైలో రూ.60.43గా, చెన్నైలో రూ.59.89గా నమోదయ్యాయి. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో ఈ విషయం వెల్లడైంది. అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా తగ్గిన్నట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ డేటాలో తేలింది. ఢిల్లీ, కోల్కత్తా, ముంబైలలో లీటరు పెట్రోల్ ధర రూ.2.5 తగ్గినట్టు వెల్లడైంది. అదేవిధంగా చెన్నైలో ఈ తగ్గింపు రూ.2.6గా ఉంది. దీంతో నేటి రిటైల్‌లో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.38గా, కోల్‌కత్తాలో రూ.71.16గా, ముంబైలో రూ.77.51గా, చెన్నైలో రూ.70.85గా నమోదయ్యాయి. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్స్చేంజ్ సుంకం తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. తగ్గింపు అనంతరం ఈ సుంకాలు వరుసగా రూ.19.48, రూ.15.33గా ఉంటాయి. -
వాహనదారులకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రెండు రూపాయల మేర తగ్గించింది. నూతన ఎక్సైజ్ డ్యూటీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. సెప్టెంబర్‌లో ముడిచమురు ధరలు ఏకంగా 12 శాతం మేర పెరిగాయి. భారత వినియోగదారులు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రో ధరలను చెల్లించాల్సి రావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులూ పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు తెస్తున్నాయి. ఇక పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర దిగిరానున్నాయి. -
ఆల్-టైమ్ హైలో డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్ ధరలు ఇటీవల వాహనదారులకు కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో డీజిల్ ధర ఆల్-టైమ్ హైలోకి ఎగిసింది. ఒక్క ఢిల్లీలో మాత్రమే కాక ఇతర నగరాల్లోనూ ఈ ధర భారీగా పెరిగినట్టు తెలిసింది. రోజువారీ ధరల సమీక్ష ప్రకారం సోమవారం లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.59.07గా రికార్డైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2002 నుంచి ఇదే అత్యధిక స్థాయి. కోల్‌కత్తాలోనూ డీజిల్ ధర మూడేళ్ల గరిష్టంలోకి ఎగిసింది. ముంబై, చెన్నైలో కూడా ఈ ధర అత్యధిక స్థాయిలో నమోదవుతుందని తెలిసింది. కోల్కత్తా, ముంబై, చెన్నైలో 2014 ఆగస్టులో డీజిల్ ధర జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదుచేసింది. ప్రస్తుతం కూడా ఇదే స్థాయిలో డీజిల్ ధర దూసుకుపోతోంది. అమెరికాలో హరికేన్ ప్రభావంతో రిఫైనరీ తగ్గిపోవడంతో అంతర్జాతీయంగా డీజిల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ధరల పెరగడం డీజిల్ వాహన యజమానులకు, డీజిల్‌తో ఉత్పత్తి అయ్యే పవర్‌పై ఆధారపడిన వ్యవసాయదారులకు, వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్క డీజిల్ మాత్రమే కాక పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.79.94గా నమోదైంది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయి. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్ ధరలు కాకపుట్టిస్తున్నట్టు వెల్లడవుతోంది. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరు రూ.7.74, రూ.5.74 మేర పెరిగినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో తెలిసింది. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు సుమారు 12 శాతం పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 59 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ రేట్ల ప్రభావం దేశీయ ఇంధన రేట్లపై పడటం, దేశీయంగా పన్నుల వ్యవస్థ వంటి కారణాలతో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పైకి ఎగుస్తున్నాయి. రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి పెంపు అత్యధికంగా ఉంది. స్థానిక లెవీల ప్రకారం, రాష్ట్ర, రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం జంప్
సాక్షి, న్యూఢిల్లీ : రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రభావంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగుస్తున్నాయని, త్వరలోనే తగ్గుతాయంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తోంది. జూన్ మధ్య కాలం నుంచి అంటే రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం పైకి జంప్ చేసినట్టు రేటింగ్ ఏజెన్సీ ఐక్రా పేర్కొంది. ఈ ధరలు ఇలా భారీగా పెరగడం, డిమాండ్ వృద్ధిపై ప్రభావం చూపుతుందని, అంతేకాక ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీస్తుందని ఐక్రా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు 14 శాతం పెరగడం వల్ల, దేశీయంగా ఇంధన రేట్లు పెరుగుతున్నాయని, అంతేకాక పెట్రోల్ పంపు డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచడం కూడా వీటిపై ప్రభావం చూపుతున్నాయని ఈ రేటింగ్ ఏజెన్సీ రిపోర్టు తెలిపింది. డీలర్లకు ఇచ్చే కమిషన్ 40 శాతం ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతకముందు రూ.2.55గా ఉన్న కమిషన్‌ను రూ.3.57కు పెంచింది. దీంతో వారి మార్కెటింగ్ మార్జిన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 17 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధరలు 7.9 శాతం పెరిగి లీటరుకు రూ.70.41గా నమోదయ్యాయి. కొంతమంది డీలర్లు, వినియోగదారులు ధరల మార్పులను ముందుగానే అంచనావేసి, బల్క్ మొత్తంలో కొనుగోళ్లు చేపడుతున్నారని ఐక్రాకు చెందిన అధికారి కే. రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు మార్జిన్లు కోల్పోతున్నాయని చెప్పారు. అదేవిధంగా తక్కువ రాజకీయ ప్రమేయం, ఎక్కువ స్వయం ప్రతిపత్తితో ఆయిల్ సంస్థలు తమ మార్కెటింగ్ మార్జిన్లను పెంచుకుంటున్నాయని కూడా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటే, ధరల సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్వతంత్ర తగ్గి, ధరల పెరుగుదలను అరికట్టవచ్చని చెప్పారు. -
భీమ్ యాప్ వాడితే, పెట్రోల్‌పై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు కొండెక్కుతున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష దగ్గర్నుంచి రేట్లు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది. ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటరు పెట్రోల్‌పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక అకౌంట్ ఈ ప్రకటన చేసింది. అంతేకాక బ్యాంకు కార్డులకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయట. ఇటీవల అమెరికాలో సంభవించిన ఇర్మా, హార్వే తుఫాన్ల కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ ప్రభావంతో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు 15 శాతం మేర పైకి ఎగిశాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ డ్యూటీలను కోత పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ వచ్చే నెల దీపావళి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయంటూ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
కేంద్రంపై శివసేన ఫైర్
సాక్షి, ముంబయి : కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు పెంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. బుల్లెట్ రైలుకు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించేందుకే ఇంధన ధరలను పెంచుతున్నారా అని కేంద్రాన్నినిలదీసింది. గత నాలుగు నెలల్లో 20 సార్లు పెట్రో ధరలను పెంచడాన్ని ప్రభుత్వంలో ఉన్న వారు సమర్ధిస్తే అది సరైంది కాదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం స్పష్టం చేసింది. గత ఏడాదిలో వంట గ్యాస్ ధరలు 15 సార్లు పెరిగాయని పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 320 రూపాయలు దాటలేదని, ప్రస్తుతం సిలిండర్ ధర రూ 785కు చేరిందని తెలిపింది. ప్రధాని ప్రజలకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ప్రజలు ఇప్పుడు వారి స్కూటర్లు, కార్లలో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. ఓ వైపు సంపన్నులు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించనుంటే..మరోవైపు వాహనాలను భరించలేని సామాన్యులు ఎద్దుల బండిలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆకలితో అలమటిస్తున్నారా?
పెట్రోల్ ధరలపై వాహనదారులనుద్దేశించి మంత్రి ఆల్ఫోన్స్ వ్యాఖ్య తిరువనంతపురం: దేశంలోని వాహనదారులు ఆకలితో అలమటించడం లేదనీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను భరించగలరని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సగానికి తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరిగిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరమనీ, వాటి సమీకరణ కోసమే పెట్రో ఉత్పత్తులపై పన్నులు వేస్తున్నామని ఆల్ఫోన్స్ సమర్థించుకున్నారు. ‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచింది. ఆ డబ్బంతా పేదలకు వెళ్తుంది’ అని ఆల్ఫోన్స్ అన్నారు. ఇటీవలి పునర్వ్యవస్థీకరణలో మోదీ మంత్రివర్గంలో పర్యాటక, ఐటీ మంత్రిగా చేరిన ఆల్ఫోన్స్... మంత్రి అయ్యాక తొలిసారి కేరళలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘భరించగలిగే వారిపై మాత్రమే మేం పన్నులు వేస్తున్నాం. కారు, బైక్ ఉండి డీజిల్, పెట్రోల్ కొనేవారు కచ్చితంగా ఆకలితో అల్లాడేవారు కాదు. వాళ్లు పన్ను కట్టాలి’ అని అన్నారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు మరికొన్ని ఇతర అవసరాలకోసం ఆ డబ్బును ఉపయోగిస్తామన్నారు. -
'పెట్రోల్' వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు
తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపును సమర్థిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. 'పెట్రోల్ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం. కారు, బైక్ ఎవరైతే వాడతారో వారే పెట్రోల్ కొనుగోలు చేస్తారు. వారిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి వ్యక్తులు సాధారణంగానే ఆకలితో అలమటిస్తున్నవారు కాదు. మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవమైన జీవితాన్ని ఇచ్చేందుకే. ఈ మార్గంలో వస్తున్న డబ్బంతా కూడా ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదు.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నాం' అంటూ అటు పెట్రోల్ ధరల పెంపును, పన్నుల విధానాన్ని కేజే ఆల్ఫాన్స్ సమర్థించుకున్నారు. అసలే పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మంత్రి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మంత్రి వ్యాఖ్యలపై ఒక్కసారిగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. కార్లు, బైక్‌లు కేవలం డబ్బున్న వాళ్లే వాడతారంటున్నారు. అలాంటప్పుడు మీరు చెప్పినట్టుగానే పేదవారు ప్రయాణించడానికి ఉపయోగించే బస్సులు, రైళ్ల టికెట్ల ధరలను ఎందుకు పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వాహనాల వాడకాన్ని మానేసి ముందు పెట్రోల్ కొని తిరగండి సామాన్యుల బాధలు అప్పడు తెలుస్తాయి. పూట గడవక బైక్ ల మీద ఊర్లల్లో వీధుల్లో తిరిగి కూరగాయలు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు, అల్లం వెల్లుల్లి, పచ్చళ్లు,బట్టలు అమ్ముకొనే వారి సంగతేంటి సారూ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. సాక్షి ఫేస్బుక్ పేజీలో మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన కాగా, తాను పెట్రోల్ ధరలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ మంత్రి కేజే ఆల్ఫాన్స్ శనివారం సాయంత్రం చెప్పుకు రావడం గమనార్హం. -
'కారు, బైకున్న వారు భరిస్తారు.. పెంపు కరెక్టే'
తిరువనంతపురం : పెట్రోల్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్ ఈ అంశంపై మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగించనున్నామని చెప్పారు. 'ప్రభుత్వం ముందుగా అనుకునే తీసుకున్న నిర్ణయం. ఎవరైతే భరించగల పన్ను చెల్లించగల ప్రజలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరికి కారు, బైక్ ఉందో వారే పెట్రోల్ కొనుగోలు చేస్తారు. అలాంటి వ్యక్తులు సాధారణంగానే ఆకలితో అలమటిస్తున్నవారు కాదు. మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవమైన జీవితాన్ని ఇచ్చేందుకు. వారికి ఒక ఇళ్లు వస్తుంది. మరుగుదొడ్డు వస్తాయి.. కనీస అవసరాలకు కావాల్సిన వన్నీ తీరుతాయి. ఈ మార్గంలో వస్తున్న డబ్బంతా కూడా ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదు.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నాం' అంటూ అటు పెట్రోల్ ధరల పెంపును, పన్నుల విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్: లీ రూ. 43.44
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. వినియోగదారుల పాలిట గుదిబండలా తయారయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగానే ఉన్న భారత్‌లో మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని నియంత్రించే విధంగా ఇటీవల చమురు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. మంత్రి చెప్పినట్లుగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న జీఎస్టీ స్లాబ్‌లలో అత్యథికంగా ఉన్న 28శాతంలో చేరిస్తే లీటర్ పెట్రోల్ గరిష్టంగా రూ43.44లకే లభిస్తుంది. 18శాతం స్లాబ్‌లో రూ.40.05లకు, 12శాతం స్లాబ్‌లో కనిష్టంగా కేవలం రూ.38.10లకే అందుబాటులోకి వస్తుంది. అలాగే డీజిల్ ధరల్లో కూడా భారీ మార్పులు జరుగుతాయి. 12శాతం స్లాబ్‌లో 36.65, 18శాతం స్లాబ్‌లో రూ.38.61లకే వస్తుంది. 2014 నుంచి కేంద్రం, అంతర్జాతీయం ముడిచమురు ధరలు పతనమైనా ఎక్సైజ్ పన్నును పెంచింది. అన్ని పన్నులతో కలుపుకొని డీజిల్ ఇప్పటి రూ13.47 పెరగగా, పెట్రోల్ రూ.11.77 పెరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను నుంచి వచ్చే ఆదాయం రెట్టింపు అయింది. 2014-15లో ఎక్సైజ్ పన్నుతో రూ.99వేల కోట్లు ఆదాయం రాగా, 2016-17లో సుమారు రెండితలు పెరిగి రూ.2 లక్షల 42 వేల కోట్లకు చేరింది. -
భారీగా పెరిగిన పెట్రోల్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి తొలిసారి పెట్రోల్ ధరలు అత్యధిక గరిష్ట ధరలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.79.41గా రికార్డైంది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ రోజు ఒక్కరోజే లీటరు పెట్రోల్ ధర 13 పైసలు, లీటరు డీజిల్ ధర 25 పైసల మేర పెరిగింది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో, పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉన్నాయి. ఈ విభిన్నమైన ధరలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.70.30, కోల్‌కత్తాలో రూ.73.05గా, చెన్నైలో రూ.72.87గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో రూ.58.62గా, కోల్‌కత్తాలో రూ.61.27గా, ముంబైలో రూ.62.26గా, చెన్నైలో రూ.61.73గా ఉన్నాయి. రోజువారీ సమీక్ష విధానం చేప్పటినప్పటి నుంచి పెట్రోల్ ధరలు లీటరు 7 రూపాయల మేర పెరిగినప్పటికీ, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. అంతర్జాతీయ ఆయిల్ ధరల్లో కొద్దీ మార్పు వచ్చినప్పటికీ ఆ ప్రయోజనం వెనువెంటనే వినియోగదారులకు చేరవేయడానికి రోజువారీ ధరల సమీక్ష ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జూన్ 16 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విధాన్ని చేపడుతున్నాయి. రోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. కాగ, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాలు(ఓపెక్)లో క్రూడ్ ధరలు బ్యారల్‌కు 50 డాలర్ల మార్కును దాటాయి. సెప్టెంబర్ 4న ఈ ధరలు 50.36 డాలర్లుంటే, శుక్రవారం ముగింపుకు ఓపెక్ బాస్కెట్లో బ్యారెల్ క్రూడ్ ధర 52.53 డాలర్లుగా నమోదైంది. -
పెట్రోల్ ధర రూ.6 పెరిగినా...
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు రెండు నెలల కాలంలో రూ.6.6 మేర పెరిగినప్పటికీ, రోజువారీ ధరల సమీక్ష విధానాన్నే కొనసాగిస్తామని చమురు శాఖామంత్రి ధర్మేంద ప్రధాన్ అన్నారు. రోజువారీ విధానంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే వెనువెంటనే ఆ ప్రయోజనాలను వాహనాదారులకు చేరవేయవచ్చని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో పెట్రోల్, నేచుర్ గ్యాస్‌కు సహాయమంత్రిగా ఉన్న ప్రధాన్ కేబినెట్ మంత్రి హోదాను దక్కించుకున్నారు. అంతేకాక అదనంగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీన్యూర్షిప్కు కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. '' ఇది వినియోగదారుల ఆసక్తి మేరకు తీసుకున్న నిర్ణయం. దీనిలో మార్పులు చేయాల్సినవసరం లేదనుకుంటున్నా'' అని తెలిపారు. 15 ఏళ్ల విధానానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఈ మార్పులు చేపడుతున్నాయి. రోజువారీ ధరల విధానం వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.6.6 మేర పెరిగింది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక స్థాయి. డీజిల్ ధర కూడా రూ.4.02మేర ఎగిసింది. రోజువారీ ధరలు సమీక్షించడం మంచి పద్ధతి అని, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గితే 15 రోజుల పాటు ఆగకుండా వెనువెంటనే ఆ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేయవచ్చని మంత్రి తెలిపారు. ఇటీవల గ్లోబల్‌గా ధరలు పెరగడంతోనే, ఇక్కడ కూడా ధరలు పెరుగుతున్నాయన్నారు. ఒకేసారి రూ.2.50 లేదా రూ.3 మేర పెట్రోల్ ధరలు పెంచడం కంటే, ఇలా చిన్నచిన్న మొత్తాల్లో ధరలు పెంచడమే మేలని పేర్కొన్నారు. -
పెట్రోల్ ధరెంత పెరిగిందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు భారీగానే నడ్డి విరుస్తున్నాయి. జూలై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ.5.79 పైసలు మేర పెరిగాయి. జూలై 1 దేశరాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.63.09, రూ.53.33గా ఉంటే, నిన్న(బుధవారం) సమీక్షించిన లీటరు పెట్రోల్ ధర రూ.68.88, లీటరు డీజిల్ ధర రూ.57.06గా నమోదైంది. ప్రభుత్వం వీటికి జీఎస్టీ నుంచి విముక్తి కల్పించినప్పటికీ, పలు రాష్ట్రాలు, కేంద్రం వేస్తున్న లెవీలు మాత్రం ధరలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదని ఓ వైపు నుంచి విపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరలు దిగొస్తుంటే దేశీయ ధరలు తగ్గాల్సింది పోయి, ఎక్సైజ్ పెరుగుతుందని, ఈ ప్రభావం ధరలపై పడుతుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇది చాలా అన్యాయమంటూ ఆయన ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. కాగ, జూన్ 16 నుంచి ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 6 గంటలకు రోజూ ఇంధన ధరలు బంకుల వద్ద మారుతాయి. అంతకముందు వరకు ఈ ధరలను ఆయిల్ కంపెనీలు 15 రోజులకు ఒక్కసారి సమీక్షించేవి. రోజువారీ ధరల విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టే వరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పలుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేవి. -
పెట్రోల్,డీజిల్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులతో వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. గత నెల నుంచి అవలంభిస్తున్న ఈ విధానంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినట్టు తెలిసింది. లీటర్ పెట్రోల్‌పై ఇప్పటి వరకు రెండు రూపాయలకు పైగా తగ్గగా.. డీజిల్‌పై రూపాయి మేర కిందకి పడిపోయింది. జూన్ 16 నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజూవారీ మారుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ఈ రేట్లలో మార్పు కనిపిస్తోంది. ఈ రోజువారీ సమీక్ష పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ.2.40 తగ్గాయి. అంతేకాక, డీజిల్ ధర కూడా లీటరుకు రూ.1.05 తగ్గింది. జూన్ 16న ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.65.48గా, డీజిల్ రూ.54.49గా ఉండగా... నేడు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.63.08గా, డీజిల్ ధర రూ.53.44గా నమోదవుతోంది. అంతకముందు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ప్రతి 15రోజులకు ఒకసారి చూసేవాళ్లం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన కంపెనీలు ఆ సమీక్ష చేపట్టేవి. కొత్త విధానంతో అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల్లో రోజువారీ మార్పులు వెనువెంటనే దేశీయ వినియోగదారులకు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. తొలుత మే 1 నుంచే ఉదయ్ పూర్, జంషెడ్పూర్, విశాఖపట్నం, ఛండీగర్, పుదుచ్చేరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అనంతరం దేశమంతటా దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతున్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతున్నాయి. -
పెట్రోల్ ధరలు రోజూ ఛేంజ్..తెలుసుకోండిలా!
న్యూఢిల్లీ : ఇక నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ వారీ మారతాయి. మారుతున్న ధరలకు అనుగుణంగా వినియోగదారులు రోజుకో ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇంధన సంస్థలు ఈ మార్పులు చేపడతారు. ఇన్ని రోజులు అంతర్జాతీయ ఇంధన ధరలు, డాలర్ తో రూపాయి మారకం రేటుకు అనుగుణంగా 15 రోజులకు ఒకసారి ఇంధన సంస్థలు ఈ రేట్లలో మార్పులు చేపట్టేవి. కానీ నేటి నుంచి రోజువారీ మార్పునకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటే, వాటిని తెలుసుకోవడం ఎలా? ప్రాంతానికి బట్టి కూడా ధరల మార్పు ఎలా ఉంటుంది? వీటన్నింటిన్నీ తెలుసుకోవడం కొన్ని మార్గాలున్నాయంట. అవేమిటో ఓ సారి చూడండి... మొబైల్ యాప్ మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించారు. అది Fuel@IOC - IndianOil. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే, నగరాల్లో రోజూవారీ మారుతున్న ధరల అప్ డేట్ ను ఇది అందిస్తోంది. బీపీసీఎల్ కూడా ఇదే తరహాలో SmartDrive, అలాగే హెచ్‌పీ కూడా MYHPCL యాప్ లను తీసుకొచ్చాయి. ఈ యాప్స్ ద్వారా కూడా మీరున్న ప్రాంతంలోని పెట్రోల్ బంకుల్లో ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అప్ డేట్ కోసం ఎస్ఎంఎస్... పెట్రోల్ బంకుల్లో ధర తెలుసుకోవడం కోసం 9224992249 నెంబరుకు (రిటైల్ సేల్ ప్రైజ్)RSP< SPACE >DEALER CODEగా మెసేజ్ పంపితే చాలు. వెనువెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలిసిపోతాయి. భారత పెట్రోలియం కూడా ఇదే ఫార్మాట్ లో 9223112222 నెంబర్ ను తీసుకొచ్చింది. హిందూస్తాన్ పెట్రోలియం కస్టమర్లు అయితే 9222201122 నెంబర్ కు HPPRICEDEALERCODE అని మెసేజ్ చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తాయి. వెబ్సైట్ ద్వారా.. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ www. iocl.comలో ఆర్ఓ లొకేటర్ ద్వారా మీరు ఏ ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ధర తెలుసుకోవాలనుకుంటున్నారో చూసుకోవచ్చు. అయితే దేశంలోని మొత్తం పెట్రోల్ బంకుల్లో 20 శాతం వరకూ మాత్రమే ఆటోమేటెడ్ విధానంలోకి మారాయని తెలుస్తోంది. రేట్లను చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. కొన్ని బంకుల యజమానులు వీటిని ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా రోజువారీ ధరల మార్పులను తెలుసుకోవచ్చని తెలుస్తోంది. -
రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఛేంజ్
న్యూఢిల్లీ : ఇన్ని రోజులూ పదిహేను రోజులకొక్కసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో పెరిగాయో తెలిసేది. 15 రోజుల సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించాయి. కానీ ఇకనుంచి రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారబోతున్నాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా రేట్ల సమీక్షలను ఇక ప్రతిరోజూ చేపట్టాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. దేశీయ ప్యూయల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంలు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఓ ప్రభుత్వ రంగ చమురు సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రోజూ వారీ ధరల సమీక్ష చేపట్టి, పెట్రోల్, డీజిల్ ధరలను మార్చబోతున్నట్టు చెప్పారు. రోజువారీ ధరల విధానంపై చర్చించడానికి ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు, ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో బుధవారం భేటీ అయ్యారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడా రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయని, 53 వేల ఫిలింగ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనని తెలిపారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవని అంటున్నారు. -
లీటరు పెట్రోల్ వాస్తవ ధర 31.94!
మిగతాదంతా పన్నులు గతంలో ఎన్నడూలేనంతగా పెరిగిన ధరలు అడ్డగోలు ధరలపై అడిగే నాథుడే లేడు అది 2013, దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. లీటరు రూ.69.06కు చేరింది. భారతీయ జనతా పార్టీ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేసింది. "ఇది దేశ ద్రోహం. దీనిపై వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. ధరలను అదుపులోకి తేవాల్సిందే'' అని అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ నిందించారు. తిరిగి చూస్తే నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ71.14. , 2013లో డీజిల్ రూ 48.16 నుంచి రూ.59.02కు చేరింది. వంట చేసుకునే కిరోసిన్ రూ14.96 నుంచి రూ.18.54కు పెరిగింది. వంటగ్యాసు రూ.410.50నుంచి 585 కు గణనీయంగా పెరిగింది. 2013లో ఉన్న ముడి చమురు ధర కంటే ఇప్పుడు సగమే ఉంది. బ్యారల్ రేటు 114డాలర్లు ఉండగా ఇప్పుడు 54డాలర్లుగా ఉంది. ఇప్పుడు డాలర్ రేటుతో పోలిస్తే రూపాయి విలువ అంతగా లేదు. 2013లో డాలర్ విలువ రూ.54.30 నుంచి రూ68కు పెరిగింది. రూపాయి పరంగా చూస్తే బ్యారల్ ముడి చమురు అప్పుడు రూ. 6210కు వస్తే ఇప్పుడు రూ.3625లకే వస్తోంది. భారత్ కరెన్సీ తో పోలిస్తే బలహీనంగా ఉన్న పొరుగు దేశాల్లో ఇవన్నీ చాలా చవకగ్గా లభిస్తున్నాయి. చాలా ఎక్కువ రాయితీలు ఇస్తున్నాయి. భారత కరెన్సీలో పాకిస్తాన్ లో కేవలం రూ.43.70, శ్రీలంకలో రూ.54.18. బంగ్లాదేశ్ లో రూ.75.42లకే లీటర్ పెట్రోల్ లభిస్తోంది. రవాణా ఖర్చులతో సహా రూ. 64.38లకే వస్తుంది. డీజిల్ విషయానికొస్తే పాకిస్తాన్ లో రూ. 49.60, శ్రీలంకలో రూ.43.99, బంగ్లాదేశ్ లో రూ.57, నేపాల్ లో రూ49.16లకు వస్తోంది. భారత్ లో అధిక ధరల వెనుక కారణాలు రవాణా ధరలు, పన్నులు. ప్రభుత్వరంగ చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం జనవరి 16న బ్యారల్ ముడి చమురు ధర 68.88 డాలర్లుగా ఉంది. రిఫైనరీ కంపెనీలు లీటరుకు రూ.28.19 వసూలు చేస్తున్నాయి. దీనిని చమురు కంపెనీలు రూ.31.94కు డీలర్లకు అమ్ముతున్నాయి. ఇది రోజువారీ మనం ఉపమోగించే పెట్రోల్ వాస్తవిక ధర. మిగిలినది మనం పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నాం. నేడు దేశ రాజధానిలో వినియోగదారుడు రూ.21.48 ఎక్సైజ్ పన్ను కడుతున్నాడు. అంటే రిఫైనరీలు (ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్) అమ్మే ధరకు సుమారు 75శాతం పన్ను చెల్లిస్తున్నాడు. డీలర్ కమీషన్ రూ.2.60, రాష్ట్ర పన్నులు 27శాతం అంటే రూ.15.12 అన్ని కలుపుకొని వినియోగదారుడు లీటరు పెట్రోల్‌కు రూ.71.14 చెల్లిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు కంపెనీల ధరకు 125 శాతం పన్నులు వేసి లీటరుకు అదనంగా రూ.36.60 పిండుతున్నాయి. చమురు కంపెనీల రేటు లీటరుకు రూ.28.59, డీలరు కమీషన్ రూ.1.65, కేంద్ర ఎక్సైజ్ పన్ను రూ.8.72 కలుపుకొన్నా మొత్తం రూ.59.02గా ఉండాలి. మిగిలిన రూ.26.05లు కేంద్ర రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను భారం. ఇది దాదాపు చమురు కంపెనీలు ఇచ్చే రేటుకు(రూ.28.59)కు సమానం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధానిలో రవాణా చార్జీలు చాలా తక్కువ. పరిస్థితి ఇలా కొంతమంది నేతలు మాత్రమే రవాణా చార్జీల మీద మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను అన్యాయంగా దోచుకుంటోందని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఉమెన్ చాందీ విమర్శించారు. -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
– రోజుకు పెరిగే భారం రూ.11.73 లక్షలు ఒంగోలు: నూతన సంవత్సరం రోజున పెట్రో ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత నెల 17వ తేదీ పెట్రోలుపై రూ.2.71, డీజిల్‌పై రూ.2.41లు పెరిగిన ధరలు మరవకముందే మరోమారు పెట్రో ధరలు పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ ఆదివారం ప్రకటించింది. తాజా పెంపుదల ప్రకారం ప్రతి లీటరు పెట్రోలుపై రూ.1.29లు, డీజిల్‌పై రూ.0.97లు పెంచారు. అయితే పెట్రోలియంపై వ్యాట్ టాక్స్ ప్రతి లీటరుకు 41 పైసలు అదనం. డీజిల్‌పై వ్యాట్ 22 పైసలు పెరుగుతుంది. దీనిద్వారా పెట్రోలుపై ప్రతి లీటరుకు రూ.1.70లు, డీజిల్‌పై రూ.1.19లు పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 2 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.3.40 లక్షల భారం పడుతుంది. ఇక డీజిల్ వినియోగం రోజుకు జిల్లాలో 7 లక్షల లీటర్లు. దీని ప్రకారం రోజుకు డీజిల్ వినియోగంపై పడే భారం రూ.8.33 లక్షలు. మొత్తంగా పెట్రోలు, డీజిల్ వినియోగంపై రోజుకు పెరుగుతున్న భారం రూ.11.73 లక్షలు. ఆర్టీసీ రోజుకు 50 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నందున దానిపై కూడా రోజుకు రూ.59,500లు అదనపు భారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ధరలు మరోమారు పెంచక తప్పదనే భావన ఆర్టీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశానికి అత్యవసరమైన చమురు ఇంధనాలు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగనున్నాయట. గ్లోబల్‌గా చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు ఎగిస్తే, దేశీయంగా పెట్రోల్ ధర రూ.80ను, డీజిల్ ధర రూ.68ను టచ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. చమురు మార్కెట్‌ను సమతుల్య పరచడానికి ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) సభ్యులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ ధరలు బ్యారల్‌కు సుమారు 55 డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో వంతు చమురు ఉత్పత్తిని ఈ ఒపెక్ దేశాలే చేస్తుండటంతో వారు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని వెల్లడించింది.. నవంబర్ 28న ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు సంచలన ప్రకటన విడుదల చేశాయి. జనవరి 1 నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోత పెట్టేలా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద కోత. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 19 శాతం ఎగిశాయి. నాన్-ఒపెక్ సభ్యులు కూడా వియెన్నాలో డిసెంబర్ 10 మీటింగ్ తర్వాత మరో 0.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని కోత పెట్టనున్నట్టు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 80గా, లీటర్ డీజిల్ ధర రూ.68కు పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. 2017 మార్చికు బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధరలు 50-55 డాలర్లకు పెరుగనున్నట్టు వివరించింది. ఈ ధరలు 60 డాలర్లకు పెరుగనున్నట్టు తాము విశ్వసిస్తున్నామని, దీంతో దేశీయంగా కూడా రేట్లు పెరుగనున్నట్టు వెల్లడించింది. -
17 ఏళ్ల కనిష్ట స్థాయికి పెట్రోల్ ధరలు
కాన్ బెర్రా: ఇండియా పెట్రోల్ ధరలు ఎగబాకుతుంటే ఆస్ట్రేలియాలో మాత్రం రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి. ఆసీస్ లో పెట్రోల్ ధరలు 17 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా పెట్రోల్ ధర 1999 నాటి స్థాయికి పతనమైందని ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్జుమర్ కమిషన్(ఏసీసీసీ) తెలిపింది. 2016, మార్చితో ముగిసిన క్వార్టర్ లో పెట్రోల్ ధర దాదాపు 10 శాతం తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 54 రూపాయలకు(81.4 అమెరికా సెంట్ల)కు దిగొచ్చింది. ముడి చమురు ధరల పతనం, ధరల నియంత్రణను ఎప్పటికప్పడు కనిపెట్టి చూస్తుండడంతో పాటు పెట్రోల్ ధర తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని ఏసీసీసీ చైర్మన్ రొడ్ సిమ్స్ తెలిపారు. పెట్రోల్ ధర 17 ఏళ్ల కనిష్టస్థాయికి దిగిరావడంతో ఆ మేరకు వాహనదారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. సిడ్నీలో అతి తక్కువగా లీటర్ పెట్రోల్ ధర రూ. 53గా ఉంది. కాన్ బెర్రా, టస్మానియా రాజధాని హొబర్ట్ లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 59గా ఉంది. -
మళ్లీ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: పెట్రో, డీజిల్ ధరల్ని మంగళవారం మరోసారి పెంచారు. లీటర్ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మే 17నే ధరల్ని పెంచిన కంపెనీలు, ఒకే నెలలో రెండోసారి పెంచి మరింత భారం మోపాయి. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ.65.60, డీజిల్ రూ.53.93 వసూలు చేస్తారు. పెంచిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్ మారకం విలువల వల్లే ధరలు పెంచినట్లు ఐఓసీ పేర్కొంది. -
పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ. 2.94 పెంపు న్యూఢిల్లీ: శనివారం అర్ధ రాత్రి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.09, డీజిల్‌పై లీట రుకు రూ. 2.94 పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. డాలర్‌తో రూపాయి మారకవిలువలో మార్పుల వల్ల ధరలు పెరిగాయంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 61.13 నుంచి రూ. 62.19, డీజిల్ రూ.48.01 నుంచి రూ. 50.95కి పెరిగింది. ఏప్రిల్ 16న స్వల్పంగా పెట్రో ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. -
అనంతలో ఆందోళనల హోరు
పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలి నగరంలో గురువారం వామపక్షాలు, వ్యాపారవర్గాలతో పాటు, ఆశావర్కర్లు ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ నాయకులు, విధానాలపేరుతో వేధింపులు మానుకోవాలని వ్యాపారులు ప్రదర్శనలు నిర్వహించారు. తొలగింపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వామపక్షాల డిమాండ్ అనంతపురం అర్బన్: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక టవర్ క్లాక్ వద్ద వేరువేరుగా సీపీఎం, సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్రం ప్రజలపై భారం మోపుతోందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్‌ను అదనంగా మోపడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. నగర కమిటీ కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి: జగదీశ్ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్యని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. పెంచిన ధరను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ గురువారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. సమరశీల పోరాటాలకు సంసిద్ధులు కావాలి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని నాయకులు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
దేశంలో ఎక్కడా పెట్రోలు ధర ఇంత లేదు
పెట్రోలు, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఆ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ప్రజలపై దీనివల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. అందువల్ల ఈ అంశంపై చర్చించాల్సిందేనని, అవసరమైతే దీనికోసం జీరో అవర్‌ను రద్దు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31 శాతం ప్లస్ నాలుగు రూపాయలు, డీజిల్‌పై 22.1 శాతం ప్లస్ నాలుగు రూపాయల వ్యాట్ విధిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తోందని గుర్తు చేశారు. సర్కారు తీరువల్లే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. -
పెట్రో డీలర్లకు న్యాయం చేయాలి
-ఏపీఎఫ్పీటీ రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని పెట్రోలియం ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ (ఏపీఎఫ్పీటీ) రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ అన్నారు. మంగళగిరికి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లోఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న ఔట్లెట్లను తగ్గించడంతో పాటు ప్రస్తుతం వున్న ఔట్లెట్ల మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే అపూర్వచంద్ర కమిటీ నివేదికను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు లీటరుకు రెండు రూపాయిల నుంచి ఏడు రూపాయల వరకు తక్కువగా ఉండడంతో ఆంధ్ర రాష్ట్రంలోని డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఒకే విధానం ఉండాలన్నారు. పెట్రోలు డీలర్లు 24 గంటలు విధుల్లో ఉంటారని, రాత్రి వేళల్లో డీలర్లు, సిబ్బందిపై దాడులు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గతంలో 125 డాలర్లు ఉండగా ప్రస్తుతం 30 డాలర్లకు పడిపోయిందని చెప్పారు. పెట్రో ధరలు తగ్గించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని, ఇందుకోసం ఏడాది నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవకపోవడం బాధాకరమన్నారు.ఈ సమావేశంలో బాపట్ల, పలాస ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గౌతు శ్యామ్‌సుందర్ తో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 మంది పెట్రో డీలర్లు పాల్గొన్నారు. -
పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదంటే?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. అయినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు అధికంగానే ఉంటున్నాయి? అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల కన్నా తక్కువే ఉంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యల్ప ధర అయినా దేశీయంగా పెట్రోల్ వినియోగదారులకు ఆ మేరకు ఎందుకు ఊరట లభించడం లేదు? ఈ విషయంలోని లోగుట్టును కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం వివరించే ప్రయత్నం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా.. వాటిపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం పెరుగుతుండటంతో ఆ లబ్ధి వినియోగదారులకు అందడం లేదు. చమురు అమ్మకం విషయమై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 42శాతం వరకు రాష్ట్రాలకే వెళుతున్నదని, మిగతాది అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళుతున్నదని అరుణ్‌జైట్లీ వివరించారు. 'ఎక్సైజ్ సుంకంలోని కొంత భాగం జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతోంది. తమ కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ తో ఆ రోడ్లపైనే వాహనదారులు తమ వెహికిల్స్ నడుపుతున్నందున ఇందుకు వారు చెల్లించాల్సిందే' అని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో అధికపాత్ర పోషించే వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రాష్ట్రాలకే వెళుతున్నదని, దానిలో నాలుగోవంతు రుసుం మాత్రం చమురు కంపెనీలు తీసుకుంటున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా అవి భారీ నష్టాలను చవిచూస్తున్నాయని జైట్లీ తెలిపారు. చమురు కంపెనీలు 80 డాలర్లకు కొనుగోలు చేస్తే.. అమ్మే సమయానికి 60 డాలర్లకు ధర పడిపోతున్నదని, ఈ పరిస్థితితో అవి ఒకానొక సమయంలో రూ. 40వేల కోట్ల వరకు నష్టాలను చవిచూశాయని ఆయన చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెటరీ కోతలు లేకుండానే ద్రవ్యలోటు (జీడీపీలో 3.9శాతం) ను ఈ సంవత్సరం పూడ్చుకునే అవకాశముందని ఆయన చెప్పారు. -
పెరిగిన ధరలపై వామపక్షాల ధర్నా
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగాయి. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎమ్ పార్టీలు తమ నిరసన గళాన్ని వినిపించాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దిష్టి బొమ్మను సీపీఐ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డితో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్‌పై లీటరుకు రూ. 2.71 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. -
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ముంబై: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరపై రూ.2.42 తగ్గగా, లీటర్ డీజిల్ పై రూ. 2.25 తగ్గినట్లు చమురు కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. గత నెల్లో పెట్రోల్ పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 17.01 తగ్గగా, డీజిల్ ధర రూ. 12.96 పైసలు వరకూ తగ్గింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గింపు న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఆరేళ్ల కనిష్టానికి తగ్గడంతో పెట్రోల్‌పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నిజానికి అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. లీటరు పెట్రోలుపై రూ. 4.42, లీటరు డీజిల్‌పై రూ. 4.25 తగ్గాల్సి ఉంది. అయితే, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఎక్సైజ్ పన్నును మరో రెండు రూపాయలు పెంచుతూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుడికి దక్కాల్సిన ప్రయోజనంలో ఆ రెండు రూపాయలు కోత పడింది. గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరను వరుసగా తొమ్మిదోసారి, డీజిల్ ధరను ఐదోసారి తగ్గించారు. ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 14.69, డీజిల్ ధర రూ. 10.71 తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్ గత జూన్‌లో 115 డాలర్లుండగా, ప్రస్తుతం అది 46 డాలర్లకు పడిపోయింది. తగ్గింపు అనంతరం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 64.37కు, డీజిల్ ధర రూ. 55.02 నుంచి రూ. 52.57కు తగ్గింది. ప్రభుత్వానికి 20 వేల కోట్ల ఆదాయం.. గత నవంబర్ నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పెంచడం నాలుగోసారి. జనవరి 2వ తేదీనే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ పన్నును రూ. 2 పెంచింది. రెండు వారాలు తిరగకముందే మరో రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా పెట్రోలు, డీజిల్‌పై నవంబర్ 12, డిసెంబర్ 2న ఎక్సైజ్ పన్నును పెంచింది. ఈ పెంపుల వల్ల మొత్తంమీద వినియోగదారులు లీటరుకు పెట్రోల్‌పై రూ. 7.75, డీజిల్‌పై రూ. 6.50ల ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. అలాగే, ఈ పెంపుల మూలంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోంది. ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికీ చేరువవుతోంది. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: కాంగ్రెస్ ఎక్సైజ్ పన్నును పెంచి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారుడికి చేరడం లేదని, ఇది అన్యాయమని కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ విమర్శించారు. -
మళ్లీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వాహన దారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ లీటరకు రూపాయి చొప్పున తగ్గవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గత ఐదేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోతుండటమే దీనికి కారణం. ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదవ సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్నుంచి వరుసగా నాలుగోసారి తగ్గింది. -
పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గింపు
-
పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గింపు
సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: పెట్రోల్ డీజిల్, ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గతఐదేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోవడంతో అందుకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఢిల్లీలో ప్రకటించింది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వచ్చాయి. దీనితో, పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదవ సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్నుంచి వరుసగా నాలుగోసారి తగ్గింది. కొత్త రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.33నుంచి రూ 61.33కు తగ్గింది. ఢిల్లీలో గత 44 నెలల్లోనే అతితక్కువ స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది. కొత్త రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.69.19నుంచి రూ. రూ.67.02కు, లీటర్ డీజిల్ ధర రూ.57.19నుంచి రూ.55.02కు తగ్గింది. ఇక, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న వ్యాట్, స్థానిక అమ్మకం పన్నులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. తగ్గిన ముడిచమురు ధరల ప్రకారమైతే, పెట్రోల్, డీజిల్ ధరలు వాస్తవానికి మరింతగా గణనీయంగా తగ్గాల్సి ఉంది. అయితే, గత జూన్‌లో బ్యారెల్‌కు 115 అమెరికన్ డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర 62.37 అమెరికన్ డాలర్లకు తగ్గడం అదనుగా తీసుకున్న ప్రభుత్వం ఇటీవల, లీటర్ పెట్రోల్‌పై రూ. 2.25, డీజిల్‌పై ఒక రూపాయి ఎక్సయిజ్ సుంకాన్ని పెంచింది. అంత ర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇటీవలే అంటే, ఈ నెల 1న లీటర్ పెట్రోల్ ధరను 91 పైసలు, డీజిల్ ధరను 84 పైసలు తగ్గించారు. -
సామాన్యుడిపై మరో భారం
- పెట్రోల్‌పై రూ.1.69 పెంపు. - డీజిల్‌పై 50 పైసల బాదుడు - జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34 కోట్ల భారం - నిత్యావసరాలపై చూపనున్న ప్రభావం సాక్షి, అనంతపురం/ అనంతపురం కలెక్టరేట్ : రైలు చార్జీల తర్వాత పెట్రో ధర పెంపుతో సామాన్యులపై మరో భారం పడింది. లీటరు పెట్రోలుపై రూ.1.69, డీజిలుపై 50 పైసలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.77.57 ఉండగా పెరిగిన ధరతో రూ.79.26 కు చేరుకుంది. ఇక లీటరు డీజిల్ రూ.62.37 నుంచి రూ.62.87కు చేరుకుంది. పెట్రో ధరల పెంపు కారణంగా జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన రైలు చార్జీలతో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం పరోక్షంగా నిత్యవసరాలపై చూపనుంది. పెట్రో ధరల పెంపుపై సామాన్యులు భగ్గుమన్నారు. జిల్లాలో 225 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. లీటరు పెట్రోల్‌పై రూ.1.69 పైసలు పెరగడంతో రోజుకు రూ.4,22,500, నెలకు రూ.1,26,75,000, ఏడాదికి రూ.15.21 కోట్లు ప్రజలపై అదనపు భారం పడనుంది. ఇక జిల్లాలో రోజుకు 10.64లక్షల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ మేరకు లీటరుపై 50 పైసలు పెరగడంతో రోజుకు రూ.5.32 లక్షలు భారం పడనుండగా నెలకు రూ.1,59,60,000, ఏడాదికి రూ.19.15 కోట్ల భారం పడనుంది. . -
మళ్లీ పెట్రోభారం
- పెట్రోలుపై రూ.1.69 , డీజిల్‌పై 50పైసలు - అర్ధరాత్రి నుంచి అమలులోకి.. నెల్లూరు (సెంట్రల్): నరేంద్రమోడీ సర్కారు ఏర్పాటైన నెలకే ప్రజలపై రెండోసారి పెట్రోధరల భారం మోపింది. పెట్రోలుపై రూ.1.69, డీజిల్‌పై రూ.50 పైసలు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. పన్నులతో కలిపి పెట్రోలు ధర రూ.2, డీజిల్ ధర 62 పైసలు పెరిగింది. ఈ క్రమంలో పెట్రోలు ధర రూ.79.91, డీజిల్ రూ.63.24కి చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల కారణంగా జిల్లా వాసులపై నెలకు రూ.3.29 కోట్ల అదనపు భారం పడనుంది. -
పెరిగిన పెట్రో ధరలు
-
పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. పెట్రోల్ ధర లీటరుకు 60 పైసలు, డీజిల్ ధర 50 పైసలు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన ఈ పెంపునకు స్థానిక పన్నులు జతకానుండడంతో ప్రాంతాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. పెట్రోల్ ధర ఈ ఏడాదిలో పెరగడం ఇది రెండో సారి. జనవరి 4న దీనిపై 91 పైసలు వడ్డించారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 73 పైసలు పెరిగి రూ.73.16కు చేరింది. హైదరాబాద్‌లో రూ.79.11గా ఉన్న పెట్రోల్ ధర 79.90కి పెరిగింది. ఢిల్లీలో డీజిల్ 57 పైసలు పెరిగి రూ. 55.48కి చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.59.83 నుంచి 60.44కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 116.04 డాలర్ల నుంచి 118.1 డాలర్లకు పెరగడం, రూపాయి మారకం విలువ 62.02 నుంచి 62.12కు తగ్గడం వల్లే పెట్రోల్ రేటు పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. డీజిల్ అమ్మకాలపై నష్టాల భర్తీకి ప్రతినెలా 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఉండడంతో దాని ధరను పెంచామని పేర్కొంది. ఇంకా డీజిల్‌పై లీటరుకు రూ.8.37 నష్టం వస్తోందని వెల్లడించింది.