
ప్రతీకాత్మక చిత్రం
రెండో మాట
ప్రభుత్వం కోరుకున్నట్టే నేడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య తేడా క్రమంగా తగ్గిపోతోంది. ఈ కారణంగా ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుపోతోంది. లీటరు పెట్రోల్ రూ. 35 ధరకే అందజేస్తామన్న హామీ మాయమైంది. ధర నేడు రూ. 90కి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పన్నుల పేరుతో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చాటున దాగి సరకుల ధరలు పెంచుతుండగా, రాష్ట్రాలు స్థానిక పన్నుల (సేల్స్ టాక్స్–అమ్మకం పన్ను) పేరుతో ప్రజలను దంచుతున్నాయి. నిన్న పెంచిన ఇంధన ధరలను నేటి కంట్రోల్ ధరగా చూపించి, ప్రజలను మురిపించజూసే ప్రయత్నం పాలకుల పనిగా ఉండకూడదు.
ప్రపంచానికే నాయకత్వ స్థానంలో విశ్వగు రువుగా భావించుకున్న ఇండియాలోని ప్రధాన ప్రసార మాధ్యమాల పరిస్థితి కాస్తా దయార్ద్ర మైన మూకాభినయ స్థితికి చేరుకుంది. ఫలితంగా ప్రజల పరిస్థితి దుర్బ లంగా మారింది. టెలివిజన్ కార్యక్రమాల సంధానకర్తలను(యాంకర్లు) తొలగించడంతోటే ప్రశ్నలు సంధించాలనుకునేవాళ్ల నోళ్లను మూయించ డానికి ఒకట్రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే చాలనుకునే తత్వం అధికార స్థాయిలో బలిసిపోయింది. మనం ఆశించిన ఇండియా ఇదేనా? నీ కళ్ల ముందే ఆవిష్కరించుకుంటున్న ఆశా భారతాన్ని ఓసారి వెను తిరిగి చూసుకో భారతీయుడా! 2018లో నుంచి 2013 వైపు చూసుకో, జరిగిన మోసం నీ ముందు సాక్షాత్కరిస్తుంది. అధికారంలోకి రాక ముందు తాని చ్చిన ఉపన్యాసాలు చూసుకుని ప్రధానమంత్రి కలత చెందుతారా? లేక ఆనాటి మెరుగైన ఉపన్యాసాలు తయారు చేసుకోవడంలో మునిగిపోయి ఉంటారా? లేక అప్పటి దాకా ఆయన పాత రొడ్డకొట్టుడు ప్రసంగాలకే కట్టుబడి ఉండదలచారా?
– చిత్రా పద్మనాభన్, ప్రసిద్ధ వ్యాఖ్యాత ‘వైర్’ వెబ్‌సైట్
నేటి బీజేపీ పాలకులు కూడా నిశిరాత్రి నిర్ణయాలకు అలవాటు పడిన ఫలితంగా అకస్మాత్తుగా పెద్దనోట్ల రద్దు పేరిట దేశ ఆర్థిక వ్యవస్థను, చిరు వర్తక, వ్యాపార వర్గాలను అల్లకల్లోలానికి గురిచేశారు. ఆ వెంటనే శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, సాంస్కృతిక కళారంగాల్నింటినీ నిర్వీర్యం చేసే నిర్ణయాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, సమాచారం పొందే హక్కు చట్టానికి తూట్లు పొడిచే చర్యలకు దిగారు. బలమైన భిన్నాభిప్రాయం ఏ మూల నుంచి వ్యక్త మైనా సంస్థలను, వ్యక్తులను హతమార్చే ప్రత్యేక సంస్కృతికి తెర లేపారు. వీటన్నింటినీ వ్యతిరేకించే వారి నోళ్లు మూస్తూనే ‘మా నిర్ణయా లకు దేశంలోని 125 కోట్ల మంది ప్రజలూ ఆమోదం తెలుపుతున్నారు’ అని చెప్పారే గానీ, బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడి సొమ్మసిల్లి చనిపోయిన 125 మందిని మరిచిపోయారు.
ఈ పూర్వరంగంలో ప్రభుత్వం సంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు జాంబవంతుని అంగలతో ముందుకు సాగుతున్నాయి. ఈ ధరల పెరు గుదలకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అడ్డూ అదుపూ ఉండదు. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలను సైతం మన పాలకులు పాటించ కుండా చమురు శుద్ధి కర్మాగారాల చిట్టా ఆవర్జా లాభ నష్టాలతో ముడి పెట్టి నాటకం ఆడుతున్నారు. ఇంధన ధరలు అంతర్జాతీయంగా అదు పులో ఉన్నా సరే, మన దేశంలో వాటి ధరలు పెంచివేయడం చమురు కంపెనీల ప్రయోజనాల రక్షణకు దోహదం చేయడమేనని రుజువవు తోంది. దేశ ప్రజల అవసరాలకు భిన్నంగా ఏకపక్షంగా వీటి ధరలు పెంచేస్తున్నారు. విచిత్రమేమంటే ఈ తొక్కిసలాటలో పాలకులకు మద్దతుగా ‘ఆత్మలోకంలో దివాలా స్థితిని కనపడకుండా చేసే ఆధ్యాత్మి కస్వాములు’ కొందరుంటారు.
పాలకులను సమర్ధిస్తూ ప్రతి కాలం లోనూ కొంత మంది ‘డబ్బారేకుల సుబ్బారాయుళ్లు’ మాట్లాడుతుం టారు. అలాంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఒకరు ‘ఇక ముందు ముందు రూపాయి విలువ అమెరికన్ డాలర్‌ను తొక్కేసి రూ. 40ల స్థాయికి చేరుకుంటుంది’ అని చెప్పిన జోస్యం కాస్తా మూన్నాళ్ల ముచ్చ టగా సరిపెట్టుకుంది. కానీ, ఒకనాడు బ్రిటిష్ పౌండ్ ధాటికి కునారిల్లిన మన రూపాయి క్రమంగా అమెరికన్ గుత్తపెట్టుబడి శాసనాలతో స్వాతం త్య్రానంతరం పీటముడి వేసుకుంది. ఫలితంగా ఆ డాలర్ కనుసన్నల్లో రూపాయి తన ఉనికిని కాపాడుకుంటూ రావలసి వచ్చింది. రూపాయి విలువ నేడు గణనీయంగా కోల్పోయింది. డాలర్‌కు సుమారు రూ.100 చెల్లించుకోవలసిన దుర్దశకు దగ్గరలో ఉన్నాం.
కునారిల్లుతున్న కొనుగోలు శక్తి!
ఇక ‘విశ్వ గురువు’ నోటికి తాళం పడుతోంది. ప్రభుత్వం కోరుకున్నట్టే నేడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య తేడా క్రమంగా తగ్గిపోతోంది. రెండింటి ధరలు పోటీపడుతున్న కారణంగా ప్రజల కొనుగోలు శక్తి కునారిల్లుపోతోంది. లీటరు పెట్రోల్ రూ. 35 ధరకే అందజేస్తామన్న హామీ మాయమైంది. ధర నేడు రూ. 90కి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండూ పన్నుల పేరుతో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చాటున దాగి సర కుల ధరలు పెంచుతుండగా, రాష్ట్రాలు స్థానిక పన్నుల (సేల్స్ టాక్స్– అమ్మకం పన్ను) పేరుతో ప్రజలను దంచుతున్నాయి. అందుకే, ప్రసేన్ జిత్ బోస్ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జీఎస్టీ చట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఉండేలా కేంద్రం భరించాలని కోరారు.
కార్పొ రేట్ ప్రయోజనాల దృష్ట్యా తన రాబడిని పెంచుకునే వ్యూహం నుంచి వైదొలగాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు నిన్న పెంచిన ఇంధన ధరలను నేటి కంట్రోల్ ధరగా చూపించి, ప్రజలను మురిపించ జూసే ప్రయత్నం పాలకుల పనిగా ఉండకూడదు. మనకు లీటర్ పెట్రోలు ధర రూ. 90కి, డీజిల్ ధర రూ. 80కి చేరబోతున్న సమయంలో మన పొరుగు దేశాల్లో వీటి ధరలెలా ఉన్నాయో చూద్దాం. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 53.55, డీజిల్ ధర రూ. 61.47 కాగా, శ్రీలంకలో పెట్రోల్ రూ. 63.96, డీజిల్ రూ.52.05, నేపాల్‌లో పెట్రోల్ రూ. 63.96, డీజిల్ రూ. 54.86 ధరలకు లభ్యమౌతున్నాయి (2018,సెప్టెంబర్ 1–పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ శాఖ).
పొరుగునున్న చిన్న దేశాల్లో ఇంధన ధరలు పైన చెప్పినట్టు ఉండగా, ఇండియాలోనే పెట్రోల్, డీజిల్ చిల్లర(రీటెయిల్) ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ఇంధన సరకులపై అధికారికంగా సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్(విలువ ఆధారిత) పన్ను భారం పెరుగుతున్నందునే. పరోక్ష పన్నుల రూపంలో కేంద్ర ఎక్సైజ్ సుంకం ప్రతి లీటర్ పెట్రోల్‌పై రూ.19.48 ఉండగా, డీజిల్‌పై రూ. 15.33. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరపైన అదనంగా వ్యాట్‌ను వసూలు చేస్తు న్నాయి. ఇలా రెండూ కలిసి వసూలు చేస్తున్న పరోక్ష పన్నులు పెట్రోల్‌కు 100 శాతం, డీజిల్‌కు 70 శాతం మించిపోయాయి. పరోక్ష పన్నులు లేక పోతే అంతర్జాతీయ ముడి చమురు ధర ప్రస్తుత స్థాయిలో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధర రూ. 40కి మించదు. 2009–10 నుంచి 2013–14 మధ్య పెట్రో ఉత్పత్తుల నుంచి ఎక్సైజ్ సుంకాల వసూళ్లు మొత్తం పన్ను రాబడిలో 8.8 శాతం కాగా, 2014–15 నుంచి 2017–18 మధ్య సగటున ఈ వసూళ్ల శాతం 12.5 శాతానికి పెరిగింది.
కాని, మొత్తం పన్ను వసూ ళ్లలో కార్పొరేట్ సంస్థల నుంచి వసూలు చేసిన పన్ను వసూళ్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో సగటున 36.5 శాతం నుంచి 30.7 శాతానికి పడిపోయాయి. యూపీఏ మలిదశ పాలనలో మొత్తం పన్ను రాబడుల నుంచి ఆదాయ పన్ను వసూళ్ల శాతం 19 నుంచి 21 శాతానికి పెరిగింది. ఎక్సైజ్ సుంకాల వసూళ్ల శాతం 2009–10లో 10.2, 2010–11లో 9.7, 2011–12లో 8.4, 2012–13లో 8.1 ఉండగా, బీజేపీ–ఎన్డీఏ పాలనలో ఈ పన్నుల నుంచి వసూలైన మొత్తాలు 2014–15లో 8.6 శాతం, 2015–16లో 13.7, 2016–17లో 16.1, 2017–18లో 11.8 శాతం నమోదయ్యాయి (బడ్జెట్ వసూళ్లు: 2018–19 ‘కాగ్’ నివేదిక).
కార్పొరేట్లకు రాయితీలు... ప్రజలపై పన్నులు
ఎన్డీఏ పాలనలో బడా కార్పొరేషన్‌ల నుంచి రాబట్టిన వసూళ్లలో పన్నుల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పెట్రోల్, డీజిల్ వాడకందార్ల నుంచి వసూళ్ల శాతం పెరిగిపోయింది. అంటే పేద, మధ్య తరగతి వర్గాల ప్రయోజనాలను పక్కనపెట్టి, బడా కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చారని నిపుణుల అంచనా. ఈ రకమైన అన్యాయమూ, అస హజమూ అయిన రెవెన్యూ వసూళ్ల సమీకరణ వెంటనే రద్దు చేయవ లసిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు నిర్మొహమాటంగా చెప్పారు. నిజానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ చట్రం కిందికి తీసుకు రావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువలో ఎక్కువ 28 శాతం మేర జీఎస్టీ పన్ను వసూలు చేసినా కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర రూ. 55 కంటే మించదు.
దీని వల్ల కోల్పోయే రెవెన్యూ నష్టాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి పన్నుల్ని ఎక్కువగా వసూలు చేయడం ద్వారా, కార్పొరేట్‌లకు పన్నుల నుంచి మినహాయించే చర్యలను మానుకోవడం ద్వారా పూడ్చు కోవచ్చని నిపుణుల భరోసా. నిజానికి 2018–19 బడ్జెట్ వసూళ్లను బట్టి చూస్తే కార్పొరేట్‌లకు కల్పించిన పన్ను రాయితీల మూలంగా కోల్పో యిన ప్రభుత్వ రాబడి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి రూ. 85,000 కోట్లు చొప్పున ఉంది. కనుక ఆదాయ వనరుల సమీకరణలో పాలకుల వ్యూహాన్ని సవరించుకోక తప్పదని నిపుణుల సలహా. ఎందు కంటే 2016 చివర్లో అర్థంతరంగా పెద్ద కరెన్సీ నోట్లరద్దు వల్ల 2017 నుంచీ కార్మికుల సంఖ్య పడిపోయింది. ఉపాధి కునారిల్లిపోతోంది.
ఉద్యోగాలు లభించే అవకాశాలు, ఆశ సన్నగిల్లడంతో పొట్ట చేతబట్టు కుని పరాయి పంచలకు వలసపోతున్నారు. పైగా మోదీ హయాంలో ప్రణాళికా సంఘాన్నే చాపచుట్టి దాని స్థానే ముక్కూ ముఖం లేని ‘నీతి ఆయోగ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ఉపాధ్యక్షుడిగా బాధ్య తలు స్వీకరించిన రాజీవ్ కుమార్ ‘అవసరమైతే మరొక వరస కరెన్సీ నోట్ల రద్దుకు మేము సిద్ధం’ అని ప్రకటించడం విస్మయకరమే. ‘ఆటో రిక్షాలో ప్రయాణం కన్నా విమాన చార్జీలు చౌక’ అని మంత్రి జయంత్ సిన్హా వాపోయారు. ఈ ప్రకటనలన్నీ రూపాయి విలువ డాలర్ మార కంలో రూ. 100కు దగ్గరగా పతనావస్థకు చేరుకుంటున్న దశలో చేసినవే.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@ahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment