రెండో మాట
ప్రకృతిలో ఒక భాగమైన మనిషి అత్యాశకు పోయి దాని సహజ సూత్రాలను అతిక్రమిస్తున్నాడు. ఫలి తంగా ఎన్నో దుష్పరిణా మాలకు కారకుడవుతు న్నాడు. ఈ విషయాన్ని చెప్పడం కోసం కవి సుద్దాల అశోక్ తేజ అడవి రూపమెత్తి ‘నేను అడవిని మాట్లాడుతున్నా’నని దండోరా వేశాడు. ‘‘అఖిల సృష్టికి ప్రాణముద్ర ప్రకృతి ప్రకృతికి వేలిముద్ర అడవి అడవి నిలువెత్తు సంతకం చెట్టు’’ అనేది సుద్దాల భావన. మానవ సమాజం ప్రగతి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. అయితే ఈ కవి ఉత్తమోత్తమ ప్రగతిని – ‘‘ఆసుపత్రులు లేని భూగోళం నా చిరకాలపు కల/ న్యాయస్థానాలకు పని కల్పించని దృశ్యం/ నేనూ హించే సుందర ప్రపంచం’’ అని స్వప్నిస్తున్నాడు. ఇది సాధ్యమా? కాదు, కాదని చెబుతూనే ఆ ‘సుందర ప్రపంచం’ ఎలా సాధ్యమో ‘నీళ్లు నమల కుండా’ ఇలా ప్రకటించాడు.
‘‘హద్దు మీరిన వ్యాపారమే / చేసింది రాజ్యాంగేతర శక్తిగా / అధికార పదవీస్వీకారం/అధికార పదవుల్లో తిరిగే బొమ్మలకు / అసలు సిసలు సూత్రధారి/ తెరవెనుక బడా వ్యాపారి/ అడవి ధ్వంసం, కడలి ధ్వంసం/ వెరసి ప్రకృతి విధ్వంసం/ ఈ త్రిసూత్ర పథ కాలంలో/ ఎదుగు తున్నది కుటిల/ వ్యాపార త్రివిక్రమావతారం/ భయానికీ భయానికీ మధ్య / బతుకు నలుగు తున్నది/ ప్రకృతికీ మనిషికీ మధ్య / ఇనుపగోడ పెరుగుతున్నది/ ప్రకృతి సమాధిపైన ప్రగతి సౌధాలు / ఏ ఆర్థిక ప్రవక్త చెప్పాడిది/ ఏ పురోగ మన సూక్తం ఇది?! అంతేగాదు–‘‘జీవనంలో ఓడినవాడు, ఆధ్యా త్మిక జీవనం కోరినవాడు, సాయుధ రణ జీవనంలో చేరినవాడు, అరణ్యా నికే వస్తాడు – రావాలి!’’ ఎందుకంటారా?
ప్రకృతి మోహినీ రూపంలో రాదు గాక రాదు/ మోహ రించిన ప్రళయ రూపంలో/ ఎదురెత్తులేస్తూ ఉంటుంది/ హిమాలయాలను కరిగిస్తుంది/ జలాశయాలను మరి గిస్తుంది/ అరణ్యాలను చెరిపే స్తుంది/ ‘లావా’లను కురిపి స్తుంది. కనుకనే – ‘‘చర్యకు ప్రతిచర్య/ హింసకు ప్రతి హింస/ అనివార్యం – అది / ప్రకృతి ప్రాణ సూత్రం/ మీ చేతలవల్ల/ జరుగుతున్న పాతకా లకు, / ఘాతుకాలకు/ ప్రతీఘాత తీవ్రత/ ఏ స్థాయిలో ఉంటుందంటే/ మీ ఊహకు అందనంత/ అందినప్పుడు మీరుండరు!/ పెడమార్గం పట్టిన / చెడుమార్గం తొక్కిన మీ/ చేష్టలవల్ల/ ధర మేధం, గిరిమేధం/ తరుమేధం, చివరికి సమస్త/ నరమేధం జరిగి తీరుతుంది/ నరవరా! మళ్ళీ మళ్లీ చెబుతున్నా/ హంతకులూ మీరే/ హతులూ మీరే!’’
అందుకనే, సుద్దాల తీర్మానం – ‘‘ఏ పరిశో ధనైనా/ ఏ పురోగమనమైనా/ అరణ్యం అంగీ కరించే/ పర్యావరణం పరవశించే విధంగా’’ నేటి తరాలకు అభయంగా, రేపటి తరా లకు భరోసాగా ఉండాలన్నది సుద్దాల డిక్టేషన్! కనుకనే ‘‘వేల ఏళ్లు దాటొచ్చిన మానవ జాతి, ఇక వెనక్కెళ్లడం సాధ్యం కాదు గనుకనే, కుదరని వ్యవహారం కనుకనే – ఆ ప్రకృతినే ఆశ్రయించి, పిలిపించమని సుద్దాల అరణ్య రోదన, ఆయన సమస్త వేదన! కనుకనే ‘శ్రమ కావ్యం’ ద్వారా శ్రమ జీవుల ఈతిబాధల్ని కావ్యగతం చేసి ధన్యుడైన నేల తల్లి బిడ్డ సుద్దాల... తన అరణ్య కావ్యం ద్వారా ఈ చరా చర ప్రకృతిలో అసలు ముద్దాయి ఎవరో తేల్చినవాడు! మనిషే ఈనాడు ప్రకృతికి ప్రతి నాయకుడై వాతావరణ విధ్వంసానికి కారకుడని సుద్దాల మనోవేదనతో తీర్చిదిద్దినదే ఈ గొప్ప కావ్యం.
నిరుపేదల బతుకులు చట్టు బండలవుతున్న పరిస్థితిని చూస్తూ తట్టుకోలేని సుద్దాల– ‘‘అడివమ్మ మాయమ్మ అతి పేద ధీర ఆ అమ్మకున్నది ఒక్కటే చీర’’ అన్న పాట నిరుపేద కుటుంబాల ఆర్థిక దైన్యాన్ని, గుండె కోతను ప్రపంచానికి వెల్లడించాడు. ఆ స్పందించ గల హృదయాలను ఆకట్టుకుని అక్కున చేర్చు కున్న సుద్దాల సదా ధన్యుడు! – ఏబీకే ప్రసాద్, సీనియర్ సం΄ాదకులు
Comments
Please login to add a commentAdd a comment