
ప్రభుత్వం మావోయిస్టులపై జరుపుతున్న యుద్ధాన్ని, మారణకాండను చర్చల ఆధారంగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది! వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మావోయిస్టు ముప్పును నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. ప్రస్తుతం 400 మంది సాయుధ కేడర్ మాత్రమే మిగిలి ఉన్నారని, ఎక్కువ భాగం ఆయుధాలు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నామని కూడా చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే మావోయిస్టుల వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం, శాంతి భద్రతల సమస్య ఏమీ లేదు. అయినా ఎన్‌కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సందర్భంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ సంభాషణకు సీపీఐ (మావోయిస్ట్) సంసిద్ధత వ్యక్తం చేయటం ప్రాముఖ్యాన్ని సంత రించుకుంది. దాన్ని సులభతరం చేయడానికి, చర్చల కాలంలో యుద్ధాన్ని నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. అయితే, మావోయిస్టులు ఎటువంటి షరతులు ముందుకు తేక పోతేనే బీజేపీ నేతృత్వంలోని ప్రభు త్వం చర్చలకు వెళుతుందని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అన్నారు. చర్చలలో మావోయిస్టు సమస్యకు తగిన పరి ష్కారం చూపి అమాయక ఆదివాసీల జీవనం సాఫీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించాలి.
– మన్నవ హరిప్రసాద్
సీపీఐ (ఎమ్‌ఎల్) రెడ్ స్టార్, పొలిట్ బ్యూరో సభ్యుడు