peace talks
-
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్‌తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
కాల్పుల విరమణ: బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన హమాస్
న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు. -
సరిహద్దు సమస్యల పరిష్కారానికే పెద్ద పీట
గోవా: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్‌తో బెనౌలిమ్ బీచ్ రిసార్ట్‌లో జై శంకర్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్యతో పాటు ఎస్సీఒ, జీ–20, బ్రిక్స్‌కు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎస్సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్‌కు జిన్‌పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్‌ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్‌కు స్నేహహస్తం అందించారు. జిన్‌పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్‌పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్‌పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్‌పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్‌పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్‌పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్‌తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్‌పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్‌పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్‌తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్‌పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్‌పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్‌పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధాన్ని ఆపే దమ్ము చైనాకి ఉందా?
కీవ్/బీజింగ్: ఏడాది కాలంపాటు జరిగిన విధ్వంసకాండ.. నరమేధం తర్వాత ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకోబోతోందా?.. అదీ వీలైనంత తర్వలోనేనా?. దురాక్రమణను నిలిపేసి.. బలగాలను వెనక్కి రప్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా?.. ఒక బాధిత దేశంగా శాంతి చర్చలకు తామే తొలి అడుగు వేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన వేళ.. చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి చైనా వ్యతిరేకించడం లేదు. అలాగని సమర్థించడమూ లేదు. కానీ, ఉన్నపళంగా శాంతి చర్చల రాగం అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు శుక్రవారం.. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని సూచిస్తూ పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్ల పేపర్‌ను విడుదల చేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. వెనువెంటనే.. రష్యా సైతం చైనా శాంతి చర్చల పిలుపును స్వాగతించింది కూడా!. చైనా శాంతి ప్రణాళిక నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు ప్రకటించారు. జింగ్‌పిన్‌ను కలిసి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రష్యాకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా చూస్కోవడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని, చైనా కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. మరోవైపు.. జెలెన్స్కీ-జిన్‌పింగ్ భేటీ ఎప్పుడన్నదానిపై స్పష్టత లేకున్నా.. ఈ పరిణామంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ ఒక ప్రకటనలో.. చైనా శాంతి ప్రయత్నాలను అభినందించింది. బీజింగ్ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం అంటూ అందులో స్పష్టం చేసింది రష్యా విదేశాంగ శాఖ. ఈ తరుణంలో శాంతి చర్చలకు బీజింగ్ వేదిక కాబోతోందని, త్వరలోనే యుద్ధానికి పుల్‌స్టాప్ పడొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. పుతిన్ వార్నింగ్‌ను తప్పుబట్టిన చైనా! ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫిబ్రవరి 24వ తేదీతో.. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. రష్యా సైతం భారీగా బలగాల్ని కోల్పోయింది. అయినప్పటికీ రష్యా మాత్రం ‘తగ్గేదేలే..’ అనుకుంటూ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసింది. అసలు యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనేదానిపై ఎవరూ అంచనా వేయలేని స్థితి. ఈ తరుణంలో.. బుధవారం మాస్కోలోని చైనా దౌత్యవేత్త వాంగ్ యూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలిశాడు. ఆ తర్వాత చైనా నుంచి శుక్రవారం శాంతి ప్రణాళిక బయటకు రావడం గమనార్హం. చైనా ఇరు దేశాలకు శుక్రవారం కీలక సూచన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి. తక్షణ శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని చైనా తన శాంతి ప్రకటనలో సూచించింది. పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఉక్రెయిన్-రష్యాలు ముఖాముఖి చర్చలకు ప్రయత్నించాలని చైనా, యావత్ ప్రపంచాన్ని కోరింది. పుతిన్ అణ్వాయుధాల ప్రయోగం హెచ్చరికల నేపథ్యంలో.. అణ్యాయుధాలను వాడడమే కాదు, వాటిని యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు/ పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది. అత్యవసరంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని అందులో పేర్కొంది చైనా. చైనా వెరీ డేంజర్: వెస్ట్రన్ కంట్రీస్ ఇదిలా ఉంటే.. చైనా చేసిన శాంతి ప్రతిపాదలను ఉక్రెయిన్‌కు మద్ధతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో చాలావరకు తిరస్కరించాయి. పైగా మాస్కోతో బీజింగ్‌కు ఉండే సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్ను, జెలెన్స్కీని హెచ్చరించాయి. ‘‘రష్యా.. చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం. అలాంటి దేశంలో సన్నిహితంగా ఉంటూనే.. దురాక్రమణ విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది. ఇది ఉక్రెయిన్ గమనించాలి. ఇదేకాదు.. 12 పాయిట్ల పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఎక్కడా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా చెప్పలేదు. పైగా రష్యాపై సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ.. ‘‘ఏకపక్ష ఆంక్షల’’ను తీవ్రంగా ఖండించింది కూడా’’ అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఇక చైనా శాంతి చర్చల పిలుపుపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ స్పందించారు. బీజింగ్‌ను నమ్మడానికి వీల్లేదని, ఎందుకంటే అది ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఏనాడూ ఖండించలేదని తెలిపారు. మరోవైపు రష్యాకు బీజింగ్ నుంచి ఆయుధాల సరఫరా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీజింగ్ ఆ ఆరోపణను ఖండించింది. -
తలబొప్పి పలికించిన తత్త్వం
తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడదంటే ఇదే. పాలు పోసి పెంచిన తీవ్రవాద సర్పం తన మెడకే చుట్టుకొంటూ, అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా నట్టేట మునిగాక పాకిస్తాన్ తెలివి తెచ్చుకుంటున్నట్టుంది. నిరుడు పగ్గాలు పట్టిన ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోట హఠాత్తుగా ఊడిపడ్డ భారత్‌తో శాంతి చర్చల మాట చూస్తే అలాగే అనిపిస్తోంది. రెండురోజుల పర్యటనకు వెళ్ళిన ఆయన దుబాయ్ వార్తాఛానల్ ‘అల్ అరేబియా’తో సోమవారం మాట్లాడుతూ భారత్‌తో మూడు యుద్ధాలతో గుణపాఠాలు నేర్చామనీ, నిజాయతీగా శాంతి చర్చలు జరపాలనీ, ఉభయులకూ మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిగా వ్యవహరించాలనీ అన్నారు. కానీ, ఆ మర్నాడే పాక్ ప్రధాని కార్యాలయం హడావిడిగా వివరణనిచ్చింది. కశ్మీర్లో ‘చట్టవిరుద్ధ చర్యల’పై భారత్ వెనక్కి తగ్గితేనే చర్చలంటూ మెలికపెట్టింది. తప్పంతా తమదేనని అనిపించుకోవడం ఇష్టం లేని శక్తిమంతమైన సైనిక వర్గాలు ఒత్తిడి తేవడంతో పాక్ పాలకులు అలా స్వరం సవరించుకోవాల్సి వచ్చింది. కానీ అసలంటూ చర్చల ప్రస్తావన రావడం విశేషమే. భారత్‌తో శాంతి నెలకొంటేనే పాక్ ఆర్థికవ్యవస్థకు లాభమని షెహబాజ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు తరచూ చెబుతుంటారు. కానీ, భారత్‌తో చేసిన మూడు యుద్ధాలతో బుద్ధి వచ్చిందనీ, వాటి వల్ల కష్టాలు, కన్నీళ్ళు, నిరుద్యోగం, పేదరికమే దక్కాయనీ ఒక పాకిస్తానీ పాలకుడు అనడం ఇదే తొలిసారి. అందుకే, షెహబాజ్ తాజా మాటలు తరచూ చేసే శుష్క ప్రకటనల కన్నా భిన్నమైనవి, ప్రాధాన్యమున్నవి. అందులోనూ ఆర్థిక కష్టాల్లో 300 కోట్ల డాలర్ల మేర భుజం కాస్తున్న ‘సోదర’ దేశం యూఏఈని శాంతిసంధాతగా రమ్మనడమూ కీలకమే. నిజానికి, దాయాదుల మధ్య తెర వెనుక చర్చల ప్రక్రియకు మధ్యవర్తి పాత్ర తమ దేశమే పోషించిందని యూఏఈ ఉన్నత దౌత్యాధికారి 2021లో బయటపెట్టారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు నిచ్చాయన్నారు. మళ్ళీ ఆ సోదర దేశాన్నే పాక్ సాయం కోరింది. నిజాయతీ ఎంత ఉందో కానీ, ఇన్నాళ్ళకు పాక్ పాలకులు సరైన దోవలో ఆలోచిస్తున్నారు. డాలర్ నిల్వలు పడిపోతూ, శ్రీలంక బాటలో పాక్ కూడా దివాళా తీసే ప్రమాదపుటంచున ఉంది. ఈ నేపథ్యంలోనే ‘అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం చెలరేగితే, ఏం జరిగిందో చెప్పడానికైనా ఎవరూ మిగలర’న్న ఆకస్మిక జ్ఞానం వారికి కలిగిందనుకోవాలి. నిజానికి, పాక్ చర్చల ఆకాంక్ష, కశ్మీర్ సమస్య పరిష్కారం, చివరకు భారత్‌తో శాంతిస్థాపన ఆలోచనలు కొత్తవేమీ కావు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనలోనే ఈ కథ కంచి దాకా వెళ్ళినట్టే వెళ్ళి, ఆఖరి క్షణంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి, అక్కడ ముషారఫ్‌ను బలహీనపరిచిన దేశీయ సమస్యలు కలసి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చాయి. ఆ మధ్య ఇమ్రాన్ ఖాన్ – సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వా ద్వయం కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ప్రయత్నించింది. కానీ, పాక్ పాలక వర్గాలు పడనివ్వలేదు. దేశ ఆర్థిక సమస్యలు, తీవ్రవాద ‘తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్’ (టీటీపీ) తలనొప్పి, పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మార్పులు – ఇలా అనేకం శాంతి గీతాలాపనకు కారణం. పశ్చిమాసియాలో కీలకమైనవీ, పాక్‌కు ‘సోదర’ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా తాజా పరిస్థితుల్లో భారత్‌కు దగ్గరయ్యాయి. దీంతో, పాక్ రూటు మార్చక తప్పట్లేదు. పైగా, భారత్‌తో శాంతి నెలకొంటే వాయవ్యాన తలనొప్పిగా మారిన తాలిబన్లపై దృష్టి పెట్టవచ్చు. ఈ ఏడాదే పాక్‌లో ఎన్నికలు జరగనున్నందున ఈ శాంతి వచనాలు ఊహించదగ్గవే. అధికారం కోరే ప్రతి పార్టీ ఓటర్లకు గాలం వేస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో భారత్‌తో శాంతిస్థాపన అంశాన్ని చేర్చడం షరా మామూలే. గత ఎన్నికల్లో ప్రధాని పీఠానికి పోటీపడ్డ ముగ్గురూ ఆ వాగ్దానమే చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ షెహబాజ్ అదే పల్లవి అందుకున్నట్టున్నారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని భారత్ పునః సమీక్షించే అవకాశం లేదు. అది మినహాయించి, జమ్ము–కశ్మీర్‌ల రాష్ట్ర హోదా పునరుద్ధరణ లాంటివి కోరుతూ చర్చలంటే కథ కొంత ముందుకు నడుస్తుంది. అదే సమయంలో యూఏఈ సహా ఉభయ మిత్రులూ, తెర వెనుక శక్తిమంతులూ ఎందరున్నా... అంతర్గత అంశమైన కశ్మీర్‌పై అంతర్జాతీయ జోక్యం మనకు సమ్మతం కానే కాదు. అది గుర్తెరిగి ప్రవర్తిస్తేనే తాజా ప్రతిపాదనకు సార్థకత. పీఎంఓ ప్రకటన అటుంచి, చర్చలకు కట్టుబడి ఉన్నామని షెహబాజ్ బృందం చేతల్లో చూపాలి. పాక్‌తో గత అనుభవాల దృష్ట్యా ఆ దేశం నేర్చుకున్నట్టు చెబుతున్న గుణపాఠాల పట్ల భారత్‌కు అనుమానాలు సహజమే. అయితే, అనాలోచితంగా శాంతి ప్రతిపాదనకు అడ్డం కొట్టాల్సిన పని లేదు. దౌత్య, వాణిజ్యపరంగా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ పరిణామాల తర్వాత ఇరుదేశాల రాజధానుల్లోనూ హైకమిషనర్లు లేరు. కింది సిబ్బందే బండి నడుపుతున్నారు. పరస్పర విశ్వాసం పాదుగొల్పే చర్యల్లో భాగంగా రెండుచోట్లా హైకమిషనర్ల నియామకం జరగాలి. వీసాలపై షరతుల్ని సడలించాలి. సాంస్కృతిక, క్రీడా సంరంభాలను పునరుద్ధరించాలి. ముఖ్యంగా తీవ్రవాదానికి కొమ్ము కాయబోమని పాక్ నమ్మకం కలిగించాలి. శాంతి పథంలో సాగాలంటే అది అతి ముఖ్యం. అందుకు పాక్ రెండడుగులు ముందుకు వేస్తే, నాలుగడుగులు వేయడానికి శాంతికాముక భారతావని సదా సిద్ధంగానే ఉంటుంది. -
Russia-Ukraine War: చర్చలకు చరమగీతం
వాషింగ్టన్: మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే మారియుపోల్‌లో రష్యా విధ్వంసం దరిమిలా ఇకపై ఆ నగరం గతంలోలాగా ఉండకపోవచ్చని వాపోయారు. ఇటీవల కాలంలో రష్యాతో శాంతి కోసం చర్చలు జరిపామని, కానీ తాజా ఘటనలు చర్చలకు చరమగీతం పాడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ అజోవస్టాల్ స్టీల్ మిల్ ప్రాంతంలో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు ప్రతిఘటన కొనసాగిస్తున్నారు. వీరంతా ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా సైన్యం ప్రకటించింది. మారియుపోల్‌లో ఉన్నవారి రక్షణ గురించి బ్రిటన్, స్వీడన్ నేతలతో మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ వ్లాదిమిర్ ఫ్రోలోవ్ మరణించారు. మారియుపోల్‌లో తుదిదాకా పోరాడతామని ఉక్రెయిన్ ప్రధాని షైమ్హల్ ప్రకటించారు. బాంబింగ్ ఉధృతి పెరిగింది మాస్క్వా మునక తర్వాత రష్యా తన మిసైల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. ఖార్కివ్ నగరంపై దాడుల్లో ఐదుగురు మరణించారు. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. తమకు మరిన్ని ఆయుధాలందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్వివ్ నగరంపై రష్యా జరిపిన మిసైల్ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు ఈ నగరంతో సహా దేశ పశ్చిమభాగంపై రష్యా దాడులు పెద్దగా జరపలేదు. దీంతో చాలామంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు. కానీ తాజాగా ఈ నగరంపై కూడా రష్యా దాడుల ఉధృతి పెరిగింది. నగరంలోని మిలటరీ స్థావరాలు, ఆటోమెకానిక్ షాపుపై రష్యా దాడులు జరిపినట్లు నగర మేయర్ ఆండ్రీ చెప్పారు. దాడుల్లో ఒక హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న వాసైల్కివ్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నగరంలో ఒక మిలటరీ బేస్ ఉంది. ఉక్రెయిన్‌లోని ఆయుధ స్థావరాలను, రైల్వే తదితర మౌలికసదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు డోన్బాస్లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదన్నది రష్యా ఆలోచనగా చెబుతున్నారు. రష్యా సైతం తాము పలు మిలటరీ టార్గెట్లపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. మానవీయ కారిడార్లపై రష్యా దాడి చేస్తున్నందున పౌరుల తరలింపును నిలిపివేశామని ఉక్రెయిన్ పేర్కొంది. డోన్బాస్ నుంచి పారిపోతున్న నలుగురు పౌరులను రష్యా సేనలు కాల్చిచంపాయని ఆరోపించింది. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపునకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ ముట్టడి విఫలమైన దరిమిలా డోన్బాస్‌పై పట్టుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. మారియుపోల్ ఆక్రమణ ఈ దిశగా కీలక ముందడుగని నిపుణులు పేర్కొన్నారు. నగరంపై దాడిలో దాదాపు 21వేల మంది చనిపోయిఉంటారని ఉక్రెయిన్ తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు ఉన్నట్లు అంచనా. సిద్ధమవుతున్న సిరియా ఫైటర్లు ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందంటున్నారు. జనరల్ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే! గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
బలగాలు వెనక్కి.. ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి 30 రోజులకు పైగా దాటింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం టర్కీలో జరిగిన శాంతి చర్చల ద్వారా ఇరుదేశాలు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే ఇప్పటికే పలు మార్లు శాంతి కోసం చర్చలు జరిగినా, సూమారు నెలరోజుల తర్వాత ఇరుదేశాల చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో పురోగతి.. కీవ్, చెర్నిహివ్ నుంచి తమ బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా ప్రతినిధి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్‌లో కొనసాగుతూ ఉన్నాయి. చర్చలు జరుపుతున్న సమయంలోనూ కొనసాగిన దాడులు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండగా పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై రష్యా తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం ఓ వైపు చర్చలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై రష్యన్ బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక ముందడుగు
ఇస్తాంబుల్: ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు నెల రోజులుగా రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడమనేది అనుకున్నంత సులభం కాదని రష్యా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది. అయినా పట్టువీడకుండా అత్యాధునిక ఆయుధాలను సైతం రష్యా ఉపయోగిస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు మంగళవారం రోజున ఇస్తాంబుల్‌లో జరిగిన ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్, చెర్నీవ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్‌లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు. చదవండి: (రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం) యుద్ధం మొదలై నెలరోజులు దాటిపోయిన వేళ.. ఉక్రెయిన్, రష్యా మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా దీనికి హాజరయ్యారు. తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్, పొలాండ్ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు. -
జెలెన్స్కీ తగ్గినా..! పుతిన్ తగ్గట్లేదా?
-
అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?
టర్కీలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల శాంతి చర్చలు జరుగుతాయనే ప్రచారం నడుమ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆసక్తికర ప్రకటనకు తెర లేపాడు. యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆయన ప్రకటన ఉండడం విశేషం. ఆదివారం రాత్రి నేరుగా రష్యా జర్నలిస్టులను ఉద్దేశించి వీడియో కాల్లో మాట్లాడిన జెలెన్స్కీ.. తటస్థ వైఖరిని అవలంభించేందుకు ఉక్రెయిన్ సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశాడు. మూడో పార్టీ సమక్షంలో తప్పనిసరి ఒప్పందం, రెఫరెండానికి సైతం సిద్ధమంటూ పేర్కొన్నాడు జెలెన్స్కీ. శాంతి ఒప్పందంలో భాగంగా.. తూర్పు డోనాబాస్ ప్రాంతం విషయంలో తటస్థంగా ఉండడంతో పాటు వెనక్కి తగ్గేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆదివారం రష్యా జర్నలిస్టుల సమక్షంలో ప్రకటించాడు జెలెన్స్కీ. ‘‘ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, తటస్థత, అణు రహిత స్థితి.. ఈ అంశాలపై శాంతి చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ రష్యన్ భాషలోనే జెలెన్స్కీ ప్రసంగించడం విశేషం. జెలెన్స్కీ ప్రసంగాలు, ఉక్రెయిన్ పరిణామాలపై కథనాలు ప్రసారం చేయకూడదని రష్యా జర్నలిస్టులకు రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శాంతి కోరే దిశగా కీలక ప్రకటన కావడంతో వాళ్లు ఆ కథనం టెలికాస్ట్ చేయడం గమనార్హం!. అయితే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసిన వేళ.. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైర్య్లో బుడానోవ్ మాత్రం విరుద్ధమైన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని ఆక్రమించే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాడంటూ బుడానోవ్ వ్యాఖ్యానించారు. ‘‘కొరియాను విడగొట్టినట్లే.. ఉక్రెయిన్ను విడగొట్టాలనే దురాలోచనలు ఉన్నాయి కొందరికి. ఇది ఆపడానికి ఇప్పటికే మా దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. పాశ్చాత్యదేశాలను యుద్ధట్యాంకులు, విమానాలు, మిస్సైల్స్ పంపాలని కోరారు’’ అంటూ ఆదివారం ఒక విరుద్ధ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఆదివారం.. పుతిన్, టర్కీ అధ్యక్షుడు టాయిప్ ఎర్డోగాన్ మధ్య చర్చలు జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ నడుమ కాల్పుల విరమణ, పౌరుల సురక్షిత తరలింపు అంశాలు ఎజెండాగా ఇస్తాంబుల్ మధ్యవర్తిత్వం వహించేందుకు టాయిప్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఎప్పుడైనా.. రష్యా-ఉక్రెయిన్ అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. శనివారం పోల్యాండ్ పర్యటన సందర్భంగా పుతిన్ ఇక అధికారంలో ఉండడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలపై అమెరికా భద్రతా ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఒక స్పష్టత ఇచ్చారు. ‘‘పుతిన్‌ను గద్దె దించడమా? రష్యా సార్వభౌమ అధికారంలో తలదూర్చడం మాకేం పని? ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశం అమెరికా లేదు’’ అని పేర్కొన్నారు బ్లింకెన్. చదవండి: ఈయూ దేశాల్ని ఇరకాటంలో పెట్టిన పుతిన్ -
Ukraine Crisis: రష్యాకు బిగ్ షాక్.. పుతిన్‌కు మరో దెబ్బ!
Ukraine War Live Updates: ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను మరింతగా రెచ్చగొడుతోంది అమెరికా. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం 14వ రోజు కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రష్యా-ఉక్రెయిన్ ప్రజలు. పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి.. ►ఉక్రెయిన్‌లో మారియూపోల్ నగరంలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ బాంబు దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందని స్థానిక కౌన్సిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. రష్యా చేతిలో బందీలుగా 4 లక్షల మంది ఉక్రేనియన్లు.. ► ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్‌లోని మరియూపోల్‌లో 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బందించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా 3 వేల మంది నవజాత శిశువులకు సరైన వైద్యం, మెడిసిన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రష్యాను ఉక్రెయిన్ పౌరులు, పిల్లలపై దాడులు ఆపాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. Russia continues holding hostage over 400.000 people in Mariupol, blocks humanitarian aid and evacuation. Indiscriminate shelling continues. Almost 3.000 newborn babies lack medicine and food. I urge the world to act! Force Russia to stop its barbaric war on civilians and babies! — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 రష్యాకు బిగ్ షాక్.. ► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న అన్ని సంబంధాలను స్తంభింపజేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా ఆంక్షల జాబితాలో ఉన్నవారికి దావోస్‌లో జరిగే వార్షిక సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ప్రమాదంలో చెర్నోబిల్ న్యూ క్లియర్ ప్లాంట్.. ► ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్‌కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్‌లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్‌ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్‌ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్‌కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా టార్గెట్ కాదు.. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో రౌండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చర్చల్లో రెండు దేశాల బృందాలు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదని తెలిపింది. దేశాన్ని వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు ► యుద్ధం కారణంగా దేశాన్ని వీడుతున్న తన ప్రేయసికి ఉక్రెయిన్ సైనికుడు లవ్ ప్రపోజ్ చేశాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 సుమీ నుంచి రైళ్లలో భారతీయుల తరలింపు.. ► ఉక్రెయిన్‌లోని సుమీలో రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల సాయంతో సుమీ నుంచి భారతీయులను రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడమే తమ కర్తవ్యమని ఎంబసీ తెలిపింది. 🇮🇳n students from Sumy on board the special train organised with assistance of 🇺🇦n authorities. Mission will continue to facilitate their movement westwards. Bringing back our students safely and securely will remain our priority. Be Safe Be Strong pic.twitter.com/lGNnHsfRs7 — India in Ukraine (@IndiainUkraine) March 9, 2022 రష్యా, బెలారస్‌పై ఈయూ మరిన్ని కఠిన ఆంక్షలు ► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై పలు దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాడుల వేళ రష్యాకు సహకరిస్తున్న కారణంగా బెలారస్‌పై, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 12వేల మంది రష్యా సైనికులు హతం.. ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. బంగ్లా ప్రధాని ► ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్‌పై ప్రకటన ► ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) చెర్నోబిల్ గురించి కీలక ప్రకటన చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. IAEA says it has lost contact with Chernobyl nuclear data systems. The Chernobyl nuclear power plant is no longer transmitting data to the UN watchdog, the agency says, voicing concern for staff working under Russian guard at the Ukrainian facilityhttps://t.co/rzgZhLjAij pic.twitter.com/kaZvsTN7bn — AFP News Agency (@AFP) March 9, 2022 ► మరోసారి రష్యా కాల్పుల విరమణ. బుధవారం కూడా సేఫ్ కారిడార్ల నుంచి పౌరుల తరలింపునకు అనుమతి. ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు ముమ్మరం. అయినా రష్యా బలగాలు ఉల్లంఘనలతో దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపణ. రష్యా చేతిలోకి కీవ్! ► మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ► ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ► రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 14వ రోజుకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ► ఒకవైపు నాటో ప్రతికూల ప్రకటన, రష్యాతో సంధి కోసం పిలుపు ఇచ్చినట్లే ఇచ్చి.. యుద్ధం ఆపేదేలేదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని తమ పౌరులకు పిలుపునిచ్చారు. ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది. ► ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్‌లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వరం మారింది. నాటో సభ్యత్వం విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నాటో సభ్యత్వం కోసం ఇకపై కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రష్యాతో శాంతియుత చర్చల కోసమే తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. ఏబీసీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు (Eastern European country) వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు జెలెన్స్కీ. అంతేకాదు రష్యా స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ యొక్క పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్‌పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది. 2008లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్! -
War Updates: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్‌కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్‌కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పుతిన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్‌కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్‌కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్‌పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్‌కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్‌కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్‌కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్‌తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్‌కు. ముఖ్యంగా మరియూపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్‌ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్‌కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్‌తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
Sakshi Cartoon: శాంతి చర్చలు కొనసాగుతుండగానే..
ఐక్యరాజ్య సమితి శాంతి చర్చలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌పై రష్యా దాడి -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. పుతిన్‌తో చర్చలకు బైడెన్ ఓకే
వాషింగ్టన్: యూరప్‌లో యుద్ధ భయాల నడుమ చివరి ఆశగా శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కని్పస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్‌తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే ముందునుంచీ తమ వైఖరి అన్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ ఈ వారం భేటీ కానున్నారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు భేటీలూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగని పక్షంలో మాత్రమే జరుగుతాయన్నారు. దీనిపై రష్యా ఆచితూచి స్పందించింది. అధ్యక్షుల సమావేశం జరిగే ఆస్కారముందన్న పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ‘‘అయితే అవి ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న దానిపై ఈ దశలో మాట్లాడటం తొందరపాటే అవుతుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘భేటీ జరగడం మంచిదేనని అధ్యక్షులిద్దరూ భావిస్తేనే జరుగుతుంది. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాల్సిన అవసరముందన్న వరకూ మాత్రం ప్రస్తుతానికి స్పష్టత ఉంది’’ అన్నారు. చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని, కాదని యుద్ధానికే దిగితే దీటుగా స్పందించేందుకు రెడీగా ఉన్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. జోరుగా రష్యా సైనిక విన్యాసాలు రెబెల్స్ ముసుగులో ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి కవి్వంపు చర్యలకు దిగి, ఆ సాకుతో దాడి చేయడం పుతిన్ వ్యూహమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. శనివారం నాటి అణు పరీక్షలకు కొనసాగింపుగా బెలారుస్తో రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారమూ పెద్ద ఎత్తున జరిగాయి. తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పులు, బాంబుల మోతలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బెలారుస్ సరిహద్దుల నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతుందని నాటో అనుమానిస్తోంది. విన్యాసాల పేరిట 30 వేల దాకా సైన్యాన్ని బెలారుస్‌కు ఇప్పటికే తరలించిందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌కు మూడువైపులా మోహరించిన దాదాపు రెండు లక్షల సైన్యం నెమ్మదిగా ముందుకే కదులుతోందని అమెరికా, పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాడికి దిగితే రష్యాపై విధించాల్సిన కఠినమైన ఆంక్షల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. మాక్రాన్ మధ్యవర్తిత్వం బైడెన్, పుతిన్ తాజా భేటీ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యవర్తిత్వం వహించారు. బైడెన్, పుతిన్‌తో ఆయన మాట్లాడారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ‘‘అధ్యక్షుల భేటీలో చర్చించాల్సిన అంశాలను అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై ఖరారు చేస్తారు. వీటితో పాటు ఉక్రెయిన్ విషయమై ఇరు దేశాల మధ్య ఇతర స్థాయిల్లో కూడా చర్చలు కొనసాగుతాయి’’ అని వివరించింది. ఈలోగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకూడదన్నదే ఈ చర్చలన్నింటికీ ఏకైక షరతని వెల్లడించింది. -
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్ఈ)లతో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ వీడి భారత్‌కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన) -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా
US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. ఆ ఒక్కటి తప్ప.. అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్‌ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్‌లోకి అనుమతించాలని సైతం కోరనుంది. చదవండి: ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్‌పై మాస్కోలో సదస్సు -
Panjshir Valley: తాలిబన్లతో మాటలా? తూటాలా?
తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్‌షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. మేజర్ అమీర్ అక్మల్.. పంజ్‌షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్‌పోస్ట్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్. పటిష్టమైన పద్మవ్యూహం హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్ లోయ ఉంది. పంజ్‌షిర్(పంజ్‌షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్‌షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది. లొంగుబాటు కథనాలు పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు. నిజంగా ఆక్రమించారా? మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్‌కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్‌షిర్‌లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది. చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో? -
ఇరాన్‌తో చర్చలు ఫలవంతం
టెహ్రాన్: ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్ నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది. ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్‌లోని దేశాలతో భా రత్ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్‌నాథ్ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై భారత్ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్ మరింత దృష్టిసారించింది. -
దోహా చేరుకున్న తాలిబన్ నేతలు
ఇస్లామాబాద్: అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాలిబన్ నేతల బృందం ఖతార్ రాజధాని దోహాకు చేరుకుంది. ఫిబ్రవరిలో దోహాలో అమెరికా– తాలిబన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఈ చర్చలు కొనసాగింపు. ఈ చర్చల కోసం అమెరికా అటు అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ఆధారంగా అఫ్గాన్ భవితవ్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, మిలిషియాలను నిరాయుధులను చేయడం, పునరావాసం కల్పించడం వంటి అనేక కీలకాంశాలు ఈ చర్చలపై ఆధారపడి ఉన్నాయి. గత వారం చర్చల కొనసాగింపునకు సంబంధించి అఫ్గాన్ అధ్యక్షుడితో యూఎస్ సెక్యూరిటీ సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్ మంతనాలు జరిపారు. మరోవైపు తాలిబన్లను చర్చలకు ఒప్పించేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే ఈ చర్చలు జరగాల్సిఉండగా, ఖైదీల విడుదలపై ఎటూ తేలకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. చర్చలకు ముందే ఇరుపక్షాలు హింసను విడనాడాలని యూఎస్, అఫ్గాన్ ప్రభుత్వాలు చెబుతుండగా, తర్వాతే కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని తాలిబన్లు అంటున్నారు. -
తాలిబాన్ దాడిలో 47 మంది పోలీసుల మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో పోలీసు బలగాలే లక్ష్యంగా తాలిబాన్ దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా జరిపిన వేర్వేరు దాడుల్లో 47 మంది పోలీసులతో సహా మొత్తం 57 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశంలో అంతర్యుద్ధం సమసిపోయేందుకు మాస్కోలో చర్చలు ప్రారంభమైన తరుణంలోనే తాలిబాన్ రెచ్చిపోవడం గమనార్హం. ప్రావిన్షియల్ రాజధాని కుందుజ్ సెక్యూరిటీ పోస్ట్‌పై మంగళవారం వేకువజామున విరుచుకుపడ్డ తాలిబన్లు 23 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు సహా 26 మందిని చంపేశారు. అంతకుముందు ఉత్తర బఘ్లాన్ ప్రావిన్స్ బఘ్లానీ మర్కాజీ జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు జరిపిన దాడిలో 11 మంది పోలీసులతోపాటు మొత్తం 21 మంది చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అదేవిధంగా ఉత్తర సమంగన్ ప్రావిన్సులో గ్రామ రక్షక దళానికి చెందిన 10 మందిని తాలిబన్లు చంపేశారు. అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం సమసిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో తాలిబాన్, అఫ్గాన్ ప్రముఖులు, ప్రతిపక్షాల నేతలు, గిరిజన పెద్దలతో సమావేశం ప్రారంభం కానుండగానే తాలిబాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం. ఈ సమావేశానికి ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదు. అయితే, దేశంలో శాంతి స్థాపన సాధనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా అఫ్గాన్ ప్రభుత్వమే కేంద్రంగా ఉండాలని కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా పేర్కొన్నారు. -
ఇండో పాక్ యుద్ధంపై ఇమ్రాన్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : శాంతి ప్రక్రియ కోసం తాను చేసిన ప్రతిపాదనలపై భారత్ స్పందించడం లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది ఆత్మహత్యాసదృశ్యమేనని హెచ్చరించారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాలకు కోల్డ్ వార్ సైతం వాంఛనీయం కాదని టర్కీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చర్చల ప్రతిపాదనను భారత్ పలుమార్లు తోసిపుచ్చిందన్నారు. కశ్మీరీ ప్రజల హక్కులను భారత్ ఎన్నడూ అణిచివేయలేదన్నారు. కాగా 2016లో భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిపిన దాడి దరిమిలా పాక్ భూభాగంలో భారత్ మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. -
యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం తనదేనని భావించిన ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి, తాను భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నానని, కశ్మీర్‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాక్ సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కయిందని, ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి ప్రధాని అయితే భారత్‌కు ముప్పేనంటూ విశ్లేషణలు వెల్లువెత్తిన నేపథ్యంతో అనూహ్యంగా ఆయన నుంచి శాంతి చర్చల మాట వెలువడడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ అదొక వ్యూహం. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారమంతా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు. అహ్మది తెగ బహిష్కరణను తీవ్రంగా సమర్థించిన విషయాన్ని ఎలా మరచిపోతారు (అహ్మది తెగవారు ముస్లింలు కాదంటూ 1973లో జుల్ఫీకర్ అలీ భుట్టో నిషేధం విధించగా, జనరల్ జియా ఉల్ హక్ ఏకంగా 1984లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు) మైనారిటీలను చిత్ర హింసలకు గురిచేస్తున్న మత విద్రోహ రాక్షస చట్టాన్ని ఇమ్రాన్ వెనకేసుకొస్తున్న విషయాన్ని, తాలిబన్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్ ఖాన్‌గా ముద్రపడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు చర్చలకు సిద్ధమంటే ఎవరు నమ్ముతారు!! అంతా ఒక వ్యూహం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనుసరించిన వ్యూహమే అది. పాకిస్థాన్ బూచిని చూపించి దేశభక్తి పేరిట ఓట్లు దండుకోవడమే ఆ వ్యూహం. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పాక్ పేరునే జపిస్తుంది. వ్యూహానికి ప్రతి వ్యూహంగా నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని నవాజ్ షరీఫ్‌కు ప్రియమిత్రుడని కాంగ్రెస్ పార్టీ సంబోధిస్తోంది. 2015లో మోదీ అనూహ్యంగా పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్న విషయం తెల్సిందే. బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇమ్రాన్ ఖాన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ భారత్‌ను తిడుతూ వచ్చారు. ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ అవసరం లేదు. భారత్‌ను నిజంగా ఇరుకున పెట్టాలంటే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకరావడమే. పైగా అంతర్జాతీయ సమాజం ముందు మంచి మార్కులు కొట్టేయవచ్చు. అందుకనే చర్చల ప్రతిపాదన చేశారు. అందుకు స్పందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ లబ్ధి పొందాలంటే పాకిస్తాన్‌తో వియ్యానికి బదులు కయ్యానికి కాలుదువ్వాలి. అందుకు కశ్మీర్ భారత్‌కు ఎప్పుడూ ఆయుధమే! -
దక్షిణ సిరియాపై ముప్పేట దాడి
దరా: తిరుగుబాటుదారుల అధీనంలోని దక్షిణ సిరియా వైమానిక దాడులతో దద్దరిల్లింది. రెండు వారాలుగా కొనసాగుతున్న దాడులను ప్రభుత్వ అనుకూల బలగాలు గురువారం తీవ్రతరం చేశాయి. రష్యా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు బుధవారం విఫలమయ్యాయి. ఫలితంగా జరిగిన తాజా దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని, వేల మంది స్వస్థలాలు విడిచి వెళ్తున్నారని వార్తలు వెలువడ్డాయి. సాయిదా పట్టణంలో మహిళ, నలుగురు పిల్లలు సహా ఆరుగురు మృతిచెందినట్లు తెలి సింది. సిరియా, రష్యా బలగాలు ఉమ్మడిగా ఈ ఆప రేషన్‌ను నిర్వహిస్తున్నాయి. దరా ప్రావిన్స్‌లోని టఫా స్, జోర్డాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో బుధ వారం రాత్రి నుంచి శక్తిమంతమైన క్షిపణులు, క్రూడ్ బ్యారె ల్ బాంబులతో దాడులు చేస్తున్నారని సిరియా లో సేవలందిస్తున్న మానవ హక్కుల సంస్థ పేర్కొంది. -
వాళ్లు కలవటం మాటేమోగానీ...
సింగపూర్ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ఆపై అనువాదకుల సాయంతో వారిద్దరూ తమ సమావేశాన్ని వారిద్దరూ కొనసాగించారు. అయితే వారి కలయిక సోషల్ మీడియా ట్రెండింగ్‌లో కొనసాగగా.. అదే స్థాయిలో ట్రోలింగ్.. మెమెలతో పలువురు విరుచుకుపడ్డారు. చారిత్రాత్మక భేటీని హిల్లేరియస్ పోస్టులతో మార్చి పడేస్తున్నారు. వాటిలో కొన్ని మీకోసం... “Kim, it is finally great to meet someone who has a worst hairstyle than me” ~ Trump#TrumpKimSummit pic.twitter.com/0ZCFm2A4MG — Rashi Kakkar (@rashi_kakkar) 12 June 2018 BREAKING: Tiny little dictator with a funny haircut meets Kim Jong Un in Singapore. #TrumpKimSummit RT to spread the truth! pic.twitter.com/4Oa2167tHr — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 History is made.#TrumpKimSummit pic.twitter.com/NNBormKSUN — 9GAG (@9GAG) 12 June 2018 Did We Just Become Good Friends?!@realDonaldTrump and Kim Jung Un!#TrumpKimSummit pic.twitter.com/sbMqtS7hnj — mad-liberals (@mad_liberals) 12 June 2018 BREAKING: President Trump and Kim Jong Un take part in the traditional Hair Swap during their historical Summit in Singapore. Who looks better?#TrumpKimSummit pic.twitter.com/VfSldDXlYq — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 Hillary Clinton spotted in Singapore just before #TrumpKimSummit pic.twitter.com/pdWVx2W3RI — Mark Dice (@MarkDice) 12 June 2018 "Donald Trump y Kim Jong-un" pic.twitter.com/oNFuT1FOUw — (#Gabriel) ♓ (@G4briel_8) 12 June 2018 The guy off The Apprentice is the president... Kim Kardashian is successfully discussing justice reform... & Denis Rodman is brokering peace between America and North Korea. ... Welcome to 2018 people!#TrumpKimSummit #TrumpKim #DennisRodman pic.twitter.com/xgeSgKCgA7 — Samantha Quek (@SamanthaQuek) 12 June 2018 Observations from the #TrumpKimSummit: 1. Trump is scared 2. Possible worst combination of haircuts in the history of this planet 3. Hand size appears to be the same 4. Kim Jong Un wearing a special version of his dictator outfit 5. Trump and Kim are a match made in heaven ❤️ — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 You are entering another dimension. Welcome to The Twilight Zone. #TrumpKimSummit pic.twitter.com/8gaYAbFgIX — Cameron Grant (@coolcam101) 12 June 2018 Thanks for making North Korea great, again, you shambolic choad. #TrumpKimSummit pic.twitter.com/TqtS7UFWVH — Holly Figueroa O'Reilly 🌊 BWCS (@AynRandPaulRyan) 12 June 2018 When #PlayStationE3 is more important than the #TrumpKimSummit pic.twitter.com/kAQGTkhziU — Alex🌴 (@FloTownx) 12 June 2018 The historic accord #KimJongUn#TrumpMeetsKim #TrumpAndKim #KimTrumpSummit pic.twitter.com/NQvBrAuwV9 — Piotr Van Gogh 🇵🇱🇪🇺 (@PiotrVanGogh) 12 June 2018 సోమవారం సింగపూర్‌లో నిరాయుధీకరణే ప్రధాన ఏజెండాగా సాగిన భేటీ చివరకు విజయవంతంగా పూర్తయినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పంద పత్రాల ప్రతుల ఫోటోలు, వాటిపై అమెరికా-డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర) అధ్యక్షుల సంతకాలు వైరల్ అవుతున్నాయి. JUST IN: Here's the full text of the document that Donald Trump and Kim Jong Un signed https://t.co/7Z77s8JNpj #TrumpKim pic.twitter.com/6D9Yw15jXx — Bloomberg (@business) 12 June 2018 -
ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్
సింగపూర్ సిటీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సోమవారం రాత్రి తాను బస చేసిన సెయింట్ రెజిస్ హోటల్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. ఆయన్ని అలా చూసే సరికి ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అణ్వాయుధాలతో అగ్రరాజ్యాన్ని సైతం వణికించిన కిమ్.. సరదాగా నవ్వుతూ తమ మధ్య తిరగటాన్ని ప్రజలు ఆస్వాదించారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దారి పొడవునా కిమ్ కిమ్.. అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట సోదరి కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో, ఇంకా పలువురు రిపోర్టర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌తో కూడా దౌత్య సంబంధాలు మెరుగుపడే దిశగా కిమ్ చర్చలు జరపటం విశేషం. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కిమ్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా, భారత కాల మానం ప్రకారం ఈ వేకువ ఝామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాగా.. చర్చలు ఫలవంతమైనట్లు ట్రంప్ ప్రకటించారు. మరికాసేపట్లో ఇద్దరు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కిమ్‌తో భేటీ రద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగబోవడం లేదని తేల్చిచెప్పారు. ‘కిమ్‌తో భేటీ జరగొచ్చు. జరగకపోవచ్చు’ అంటూ బుధవారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా గురువారం ఆ భేటీ జరగడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్‌కు ఓ లేఖ రాశారు. ‘ఒకవైపు చర్చలు అంటూ.. మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు, ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది. మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ‘మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను’ అని కిమ్‌తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయనే భావాన్ని ట్రంప్ వెల్లడించారు. ‘ఈ అత్యంత కీలమైన సదస్సు విషయంలో మీరు మనసు మార్చుకున్నట్లయితే నాతో మాట్లాడేందుకు సంకోచించవద్దు’ అని రాశారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది. అణు పరీక్ష కేంద్రాల ధ్వంసం అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని ప్రకటించిన విధంగానే ఉత్తర కొరియా తన మాట నిలబెట్టుకుంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది. ట్రంప్, కిమ్ భేటీ రద్దు కావటంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు. -
కిమ్‌తో భేటీ రద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగబోవడం లేదని తేల్చిచెప్పారు. ‘కిమ్‌తో భేటీ జరగొచ్చు. జరగకపోవచ్చు’ అంటూ బుధవారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా గురువారం ఆ భేటీ జరగడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్‌కు ఓ లేఖ రాశారు. ‘ఒకవైపు చర్చలు అంటూ.. మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు, ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది. మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ‘మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను’ అని కిమ్‌తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయనే భావాన్ని ట్రంప్ వెల్లడించారు. ‘ఈ అత్యంత కీలమైన సదస్సు విషయంలో మీరు మనసు మార్చుకున్నట్లయితే నాతో మాట్లాడేందుకు సంకోచించవద్దు’ అని రాశారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది. అణు పరీక్ష కేంద్రాల ధ్వంసం అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని ప్రకటించిన విధంగానే ఉత్తర కొరియా తన మాట నిలబెట్టుకుంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది. ట్రంప్, కిమ్ భేటీ రద్దు కావటంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు. -
కిమ్ కర్తవ్యం?
సాక్షి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య తిట్లు, శాపనార్ధాలతో ఏడాదిగా సాగిన ‘బంధం’ త్వరలో వారిద్దరి శిగరాగ్ర సమావేశంతో ఎలా మారుతుంది? అనే ప్రశ్న ఎన్నెన్నో ఊహాగానాలకు అవకాశమిస్తోంది. బుల్లి రాకెట్ మనిషి అని తనను ట్రంప్ అంటే, బుర్ర పనిచేయని మదుసలి అని ట్రంప్‌ను కిమ్ నిందించిన చరిత్ర ఇప్పటిదే. ట్విటర్ ద్వారా ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రపంచానికి వినోదం పంచారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేసవిలో జరిపే భేటీ తన ఘనతేనని ట్రంప్ భావిస్తుంటే, కిమ్ తన తొలి ప్రతిపాదనతోనే ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందని సంబరపడుతున్నారు. కిమ్ ప్రతిపాదనను ట్రంప్ ముందుంచిన దక్షిణ కొరియా తన ‘మధ్యవర్తిత్వం’ వల్లే ఇద్దరు పొగరుబోతు నేతల మధ్య సమావేశం సాధ్యమైందని అనుకుంటోంది. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధం ముగిసినాగాని సాంకేతికంగా ఇంకా ఆగలేదు. దశాబ్దాలుగా ఉద్రిక్తత కొరియా ద్వీపకల్పాన్ని పీడిస్తోంది. చైనా వంటి కొన్ని మిత్ర దేశాలు మినహా ఇతర ప్రపంచంతో సంబంధం లేని ఉత్తర కొరియాను ‘ఏకాకి’గా భావిస్తారు. అణ్వాయుధాల తయారీనే ఆత్మరక్షణకు మార్గంగా ఎంచుకున్న ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇచ్చి, దాని దారి నుంచి మళ్లించడానికి ఉపకరిస్తే ఈ సమావేశం విజయవంతమైందని పరిగణించవచ్చు. అయితే, ఈ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు వెనుక చెప్పుకోదగ్గ కృషి లేకపోవడంతో అది సత్ఫలితాలిస్తందనే ఆశ పెద్దగా లేదు. అణ్వాయుధాల తొలగింపే లక్ష్యం! కొరియా ద్వీపకల్పం నుంచి అణ్యాయుధాలు పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని అమెరికా, ఉత్తర కొరియా అగ్రనేతలు చెబుతున్నారు. కిమ్ ఏకపక్షంగా ట్రంప్ చెప్పినట్టు నిరాయుధీకరణ అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా తన శత్రు వైఖరి విడనాడాలని, దక్షిణ కొరియాను అణ్వాయుధాల దాడి నుంచి కాపాడడానికి అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన అణ్వాయుధ నిరోధక గొడుగును తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేస్తోంది. ఇదంతా జరిగేది సమీప భవిష్యత్తులో ఈ భేటీలో సాధ్యమైతేనే. ట్రంప్‌తో భేటీకి కిమ్ లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. సోమవారం ఉత్తర కొరియా రాజధానిలో కిమ్‌ను కలిసిన దక్షిణ కొరియా జాతీయ భద్రతా డైరెక్టర్ చుంగ్ యూ-యాంగ్ చర్చల ఫలితంగా ఇద్దరు నేతల సమావేశంపై ప్రతిపాదన ముందుకు సాగింది. ట్రంప్‌తో జరిపే సమావేశం నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ కిమ్ వెల్లడించలేదు. మరో పక్క ట్రంప్ కూడా కొన్ని షరతులు పెడుతున్నారు. భేటీ సమయంలో కిమ్ క్షిపణి పరీక్షలు జరపకూడదనీ, ఈ భేటీలో ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఉత్తర కొరియాపై ఆంక్షలు తొలగిస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. మొండి ఘటాల మీటింగ్ ఎక్కడ? ఎలా? ట్రంప్-కిమ్ తొలి సమావేశంలో ఏం మాట్లాడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. భేటీకి సమయం, వేదిక నిర్ణయించలేదని వైట్‌హౌస్ ప్రకటించింది. 1972లో బీజింగ్‌లో చైనా నేత మావో జెడాంగ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ సమావేశం, 1985లో జెనీవాలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియెట్ యూనియన్ నేత మిహాయిల్ గోర్బోచేవ్ జరిపిన శిఖరాగ్ర భేటీతో ట్రంప్-కిమ్ తొలి సమావేశాన్ని పోల్చడం విశేషం. ఇద్దరు దుందుడుకు నేతల భేటీ నిర్వహించడానికి అవసరమైన అధ్యయనం, సామర్ధ్యం ట్రంప్ సర్కారుకు ఉన్నాయా? అనేది కీలక ప్రశ్న. ట్రంప్ పోకడలు నచ్చని అనుభవజ్ఞులైన కొరియా నిపుణులు వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. అమెరికా విదేశాంగ శాఖతో సంబంధం లేకుండా ఇంతటి కీలక భేటీపై చర్చలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఫ్రికా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్సన్కి ట్రంప్-కిమ్ సమావేశం గురించి చెప్పినట్టు కూడా కనిపించడం లేదు. ఉత్తర కొరియాతో సంప్రదింపులకు ఇప్పట్లో అవకాశం లేదని గురువారం ఆయన అన్నారంటే ఆయన పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలకు దారితీసే ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్‌కు నల్లేరు మీద నడకలా సాగింది. ఈ అనుభవంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో కిమ్ విషయంలో కూడా ఆయన ఎవరినీ సంప్రదించకుండా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అనేక రియల్ఎస్టేట్ ఒప్పందాలు వికటించి ఆయన కంపెనీలు ఖాయిలా పడినన సందర్భాలున్నాయనే విషయం మరిచిపోకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 2011లో అధికారంలోకి వచ్చిన కిమ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అణ్వాయుధాలున్నాయంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా చివరికి అమెరికా అధినేతతో సమావేశమై అగ్రరాజ్యం నుంచి రాయితీలు సాధించడానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి లక్ష్యం నెరవేరుతుందో మే నెలలో జరిగే శిఖరాగ్ర సమావేశం నిర్ణయిస్తుంది. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
'వస్తే రండి.. లేదంటే మూల్యం తప్పదు'
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు హాజరుకాకపోవడంతో తాలిబన్లపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాంతియుత చర్చలకు హాజరుకావాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో తాలిబన్లు ఆపరేషన్ ఒమారి (తాలిబన్ ఫౌండర్ ముల్లా మహమ్మద్ ఒమర్) పేరిట అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని దించేయాలని నిర్ణయించింది. అయితే, గత డిసెంబర్లో పాక్, అఫ్ఘానిస్తాన్, చైనా, యూఎస్‌లు చేసుకున్న నాలుగుదేశాల ద్వైపాక్షిక ఒప్పందం(క్యూసీజీ)కి తాలిబన్ల ప్రకటన వ్యతిరేకంగా ఉండటంతో శాంతి చర్చలు చేపట్టాలని పాక్ ప్రభుత్వం తాలిబన్లకు సూచించింది. సంప్రదింపులను వ్యతిరేకిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 600 మంది అప్ఘాన్ పౌరులు, 161 మంది పిల్లలు తాలిబన్ల దాడిలో మరణించారు. -
యుద్ధానికైనా, శాంతికైనా సిద్ధం: పాక్ తాలిబన్లు
పాకిస్థాన్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని, కానీ తమమీద ఏమైనా చర్యలు చేపడితే మాత్రం పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడతామని పాకిస్థానీ తాలిబన్లు తెలిపారు. ప్రభుత్వం కావాలనుకుంటే చర్చలకు సిద్ధమేనని, కానీ వాళ్లు యుద్ధమే కావాలనుకుంటే తాము కూడా దాన్నే ఎంచుకుంటామని తెహరిక్ - ఎ - తాలిబన్ పాకిస్థాన్ రాజకీయ కమిషన్ సీనియర్ సభ్యుడు ఇహ్సానుల్లా ఇహ్సాన్ తెలిపారు. తాలిబన్లు శాంతి చర్చలకు ముందుకొచ్చారని, ఇక పాక్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పినట్లు ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ప్రభుత్వం శాంతికి, సమరానికి కూడా సిద్ధమేనన్న పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇహ్సాన్ స్పందించారు. నిసార్ అలీఖాన్ యుద్ధానికి సిద్ధమతే తాము కూడా నూరుశాతం ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధమేనని చెప్పారు. గతంలో పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం శాంతిమంత్రం జపించిందని, ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చర్చలకు సిద్ధమనే చెప్పారని అన్నారు. గతంలో పీపీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా షరతులతో కూడిన చర్చల కోసం తాలిబన్లు ముందుకొచ్చారు. కానీ, పీపీపీ సర్కారు దాన్ని పట్టించుకోకుండా, ఆయుధాలు దించి వస్తేనే ఎలాంటి చర్చలకైనా అంగీకరిస్తామని తెలిపింది. మే 11న పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తాలిబన్లు తమ దాడుల ఉధృతిని పెంచారు. రెండు నెలల్లో దాదాపు 400 మందిని హతమార్చారు.