గోవా: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్‌తో బెనౌలిమ్ బీచ్ రిసార్ట్‌లో జై శంకర్ సమావేశమయ్యారు.
సరిహద్దు సమస్యతో పాటు ఎస్‌సీఒ, జీ–20, బ్రిక్స్‌కు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎస్‌సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment