యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్వరం మారింది. నాటో సభ్యత్వం విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నాటో సభ్యత్వం కోసం ఇకపై కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రష్యాతో శాంతియుత చర్చల కోసమే తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు.
ఏబీసీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు (Eastern European country) వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్‌ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు జెలెన్‌స్కీ.
అంతేకాదు రష్యా స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ యొక్క పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు.
దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్‌స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్‌పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది.
2008లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
సంబంధిత వార్త: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్‌స్కీ డబుల్ గేమ్!
Comments
Please login to add a commentAdd a comment