Ukraine Crisis
-
మాక్రాన్ Vs పుతిన్: ఫ్రాన్స్‌కు రష్యా మాస్ వార్నింగ్..
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న ఫ్రాన్స్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్‌కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది. కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్‌లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్‌లో ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్‌కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్‌కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. -
అణు బాంబు దాడిని నిలువరించిన మోదీ!
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి.. పలు దేశాలు ఆయనకిచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో.. భారీ నష్టం జరగకుండా ఆయన చూపించిన చొరవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై అణు బాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట!. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘2022లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్నిరోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కీవ్ నగరం(ఉక్రెయిన్ రాజధాని)పై అణు బాంబు దాడికి రష్యా దిగబోతోందన్న సమాచారం అమెరికాకు చేరింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. మిత్రపక్షంకాని దేశాలతో పాటు భారత్ సహాకారాన్ని కోరింది అగ్రరాజ్యం. .. భారత్, చైనా సహా పలు దేశాలు అణు బాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర దేశాల నుండి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని ఆ అధికారులిద్దరూ చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. తొలి నుంచి తటస్థ వైఖరి అవలంభిస్తూనే.. మానవ హక్కుల ఉల్లంఘనల చర్యలను ఖండిస్తోంది భారత్. అంతేకాదు ఈ సంక్షోభ ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కారమని చెబుతూ వస్తోంది. ఇక ఉజ్బెకిస్తాన్ వేదికగా కిందటి ఏడాదిలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు (షాంఘై సహకార సంఘం) సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సమయంలో ‘‘ఇది యుద్ధాల శకం కాదు’’ అని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్లోనూ ఈ ప్రకటన హైలైట్ కావడం గమనార్హం. -
ఆ దేశంలో ఉద్యోగాల పేరిట దారుణ మోసం: కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్ ఏజెంట్ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన అస్వాన్.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా?
మాస్కో: మూడో ఏడాదిలోకి అడుగుపెట్టక ముందే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియనుందా? శాంతి స్థాపనలో భారత్ పెద్దన్న పాత్ర వహించబోతోందా?.. తాజా పరిణామాలు అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో క్రెమ్లిన్‌లో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్ ఆహ్వానించారు. ‘‘మా చిరకాల మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు మేం ఆత్రుతతో ఉన్నాం. ఆయన్ని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. ఉక్రెయిన్ పరిణామాల్ని నేను ఆయనకు( భారత ప్రధాని మోదీ) ఎప్పటికప్పుడు వివరిస్తుంటాను. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడటానికి ఆయన తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా’’ అని జైశంకర్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్కని పరిష్కారం చూపగలరని తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై తరచూ ఇరు దేశాల నేతలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని జైశంకర్ మీడియాకు తెలిపారు. ఈ తరుణంలో మోదీకి పుతిన్ ఆహ్వానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పుతిన్ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది వేసవి లోపు.. వీలైతే ఫిబ్రవరిలోపే మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విజయాన్నిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ప్రెస్మీట్లో ధృవీకరించారు కూడా. Honoured to call on President Vladimir Putin this evening. Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message. Apprised President Putin of my discussions with Ministers Manturov and Lavrov. Appreciated his guidance on the further developments of… pic.twitter.com/iuC944fYHq — Dr. S. Jaishankar (@DrSJaishankar) December 27, 2023 External Affairs Minister Dr S Jaishankar met Russian President Vladimir Putin in Moscow pic.twitter.com/aD7LCyjzDD — ANI (@ANI) December 28, 2023 ఇక.. భారత్-రష్యాల ద్వైపాక్షిక ఒప్పందాలు.. ఇతర సంబంధాల బలోపేతం కోసం జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్‌తో భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు.. ఇరుదేశాల ఆర్థిక సంబంధిత ఒప్పందాలకు సంబంధించి రష్యా ఉప ప్రధాని డెనిస్‌తో సమావేశం అయ్యారు. -
వికీపీడియా ఓనర్‌కు భారీ షాక్ ఇచ్చిన రష్యా
మాస్కో: ఆన్లైన్ ఎన్క్లోపీడియాగా పేరున్న వికీపీడియాకు రష్యా భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఫేక్ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ మేరకు వికీపీడియా ఓనర్ అయిన వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ల రూబుల్స్(24 వేల డాలర్లపైనే.. మన కరెన్సీలో 20 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా విధించింది. ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు సమాచారం తొలగించని కారణంగానే ఈ జరిమానా విధిస్తున్నట్లు మాస్కో కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. స్వతంత్ర సమాచారం పేరిట వికీపీడియాలో సమాచారం పొందుపరుస్తుండడంపై రష్యా తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో వికిపీడియాకు జరిమానాల మీద జరిమానాలు విధిస్తూ వెళ్తోంది. అయితే.. వికీమీడియా మాత్రం వికీపీడియా స్టాండర్స్‌కు తగ్గట్లుగానే, పక్కా సమాచారన్ని పొందుపరుస్తున్నట్లు చెబుతూ వస్తోంది. -
రష్యా భరతం పట్టాలంటే సరికొత్త ఆయుధాలు కావాలి.. త్వరగా ఇవ్వండి
కీవ్: ఉక్రెయిన్ తూర్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా తరచూ దాడులు చేస్తోందని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తాము అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రష్యాను దీటుగా ఎదుర్కోవాలంటే తమకు సరికొత్త ఆయుధాలు కావాలని, ప్రపంచ దేశాలు వేగంగా వాటిని తమకు అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు. డొనెస్క్‌లోని బాఖ్ముత్, వుహ్లెడార్తో పాటు ఇతర చోట్ల రష్యా తరచూ భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా సాగదీయాలని చూస్తోందని, అందుకే సమయాన్ని ఆయుధంగా మార్చుకుని శత్రు దేశాన్ని చావుదెబ్బతీయాలని జెలెన్స్కీ చెప్పారు. అత్యంత వేగంగా తమకు అధునాతన ఆయుధాలు సమకూర్చాలన్నారు. డొనెస్క్‌లోని బ్లాహొదాట్నే ప్రాంతంపై రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం ఉదయమే వెల్లడించారు. రష్యా మాత్రం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా తయారు చేసిన ఏటీఎసీఎంస్ క్షిపణులను తమకు ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. 300 కీలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ క్షిపణులను ఉక్రెయిన్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది. చదవండి: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్‌పై ఒకేసారి 120 మిసైల్స్‌తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్‌ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్‌తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్‌తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
ఉక్రెయిన్‌కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్‌కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్‌లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
ఎలాన్ మస్క్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రింత ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది. తాజాగా మస్క్ ప్రతిపాదనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు. ద న్యూయార్క్ టైమ్స్ బుధవారం నిర్వహించిన డీల్‌బుక్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న జెలెన్స్కీ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు వచ్చి చూడాలని స్పష్టం చేశారు. ‘ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా. రష్యా చేసిన మారణకాండను అర్థం చేసుకోవాలనుకుంటే.. ఉక్రెయిన్ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించాలి. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముంగించాలి?’ అని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇదీ చదవండి: Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్స్కీ భార్య -
ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్‌పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్‌ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్‌ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
Russia Ukraine War: పులిని చూసిన మేకల్లా పారిపోయారు!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు. మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! -
ఉక్రెయిన్ యుద్ధం: రష్యాకు ఎదురుదెబ్బ
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణలో కీలక పరిణామం చోటుచేసుకుంది!. ఉక్రెయిన్ కీలక నగరం, ప్రస్తుతం రష్యా స్వాధీనంలో ఉన్న ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఖేర్సన్ సమీపాన ఉన్న నిప్రో నది వెంట ఉన్న రష్యా బలగాలను వెనక్కి పిలిపించుకుంది రష్యా. మాస్కోకు ఈ పరిణామం ఎదురుదెబ్బ కాగా, ఈ ప్రభావంతో ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ మరోలా స్పందించింది. ఖేర్సన్లో ఇంకా రష్యా బలగాలు ఉన్నాయని, ఆ ప్రాంతానికి మరిన్ని రష్యన్ బలగాలు చేరుకుంటున్నాయని ఆరోపించింది. ఖేర్సన్లో ఉక్రెయిన్ జెండా ఎగిరేంత వరకు.. రష్యా బలగాల ఉపసంహరణ ప్రకటనకు అర్థమే లేదని ఉక్రెయిన్ అధ్యక్ష భవన సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్ ప్రకటించారు. ఉక్రెయిన్ దురాక్రమణ మొదలయ్యాక.. ఖేర్సన్ను వెంటనే రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్ బలగాలను ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకున్నాయి రష్యా బలగాలు. ఇక సెప్టెంబర్‌లో రష్యాలో విలీనం అయినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఖేర్సన్ కూడా ఉంది. పైగా ఈ ప్రాంతం నుంచే అణుదాడులు జరగవచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఈ తరుణంలో.. అంతటి కీలక ప్రాంతం నుంచి రష్యా తన సైన్యం ఉపసంహరణ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ సైనికుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి పౌరుల భద్రత దృష్ట్యా బలగాలను వెనక్కి తీసుకోవాలని రష్యా భావించిందట!. ఈ మేరకు రక్షణ మంత్రి షోయిగు.. రష్యా యుద్ధ పర్యవేక్షకుడు జనరల్ సెర్గేయ్ సురోవికిన్ మధ్య జరిగిన చర్చల సారమే.. బలగాల ఉపసంహరణగా తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఉక్రెయిన్ బలగాలు ఖేర్సన్ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: 165 కిలోమీటర్లు కాలినడక నడిచి మరీ ఆ పని -
రష్యాపై గెలుపే లక్ష్యంగా ఉక్రెయిన్ 2023 వార్షిక బడ్జెట్
కీవ్: రష్యా సైనిక చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్.. వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. 2023 ఆర్థిక ఏడాదికి గానూ ప్రవేశపెట్టిన ముసాయిదా పద్దుకు ఆ దేశ పార్లమెంట్ గురువారం ఆమోదం ముద్ర వేసింది. ఈసారి రికార్డ్ స్థాయిలో 38 బిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ పార్లమెంటేరియన్ తెలిపారు. ఇది రష్యాపై విజయాన్ని సాధించటమే లక్ష్యంగా తీసుకొచ్చిన బడ్జెట్‌గా పేర్కొన్నారు. మొత్తం 295 మంది సట్టసభ్యులు బడ్జెట్‌కు జై కొట్టారని పార్లమెంట్ ఆర్థిక, ట్యాక్స్, కస్టమ్స్ పాలసీ కమిటీ తొలి డిప్యూటీ ఛైర్మన్ యరస్లావ్ ఝెలెజ్నాక్ టెలిగ్రామ్ యాప్ వేదికగా వెల్లడించారు. అయితే, ఇతర విషయాలేమీ బయటకు చెప్పలేదు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బడ్జెట్ లోటు స్థూల దేశీయోత్పత్తిలో 20.6 శాతంగా ఉంటుదని, 2023లో జీడీపీ వృద్ధి 3.2 శాతంగా ఉండనుందని అంచనా. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 28 శాతంగా ఉండవచ్చని కమిటీ పేర్కొంది. ‘ఇది విజయం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఎందుకంటే 27.08 బిలియన్ డాలర్లు సాయుధ దళాలు, దేశ భద్రత కోసమే కేటాయించారు. ఆ తర్వాత పింఛన్లు, ఆరోగ్యం, విద్యారంగానికి అధిక వ్యయాలు ఉన్నాయి.’ అని ప్రధానమంత్రి డేనిస్ శ్యామ్హాల్ తెలిపారు. ఇదీ చదవండి: ఊహించని ఝలక్: రష్యాకు రహస్యంగా ఉత్తరకొరియా ఆయుధ సరఫరా! -
జెలెన్స్కీ తీరుపై బైడెన్ అసహనం.. అత్యాశకు పోతే అంతే!
వాషింగ్టన్: రష్యా దాడిని తప్పుపడుతూ ఎప్పటికప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌కు అడగక ముందే ఆర్థికంగా, ఆయుధాల సాయం అందించారు. అలాంటిది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై జో బైడెన్ అసహనం వ్యక్తం చేశారంటే నమ్ముతారా? అది నిజమే.. జో బైడెన్ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుండగా ఆయుధాల విషయంపై బైడెన్ అసహనం వ్యక్తం చేసినట్లు ఎన్బీసీ న్యూస్ సోమవారం వెల్లడించింది. జూన్ 15వ తేదీన 1 బిలియన్ డాలర్ల మానవీయ, సైనిక సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన ఆయుధాల జాబితాను జెలెన్స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేమి లేదని బుకాయించేప్రయత్నం చేశారు జెలెన్స్కీ. సాయం చేసినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు వచ్చాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్ నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా -
ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ల వర్షం.. ఆ నగర ప్రజలకు హెచ్చరిక!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్‌తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్స్కీ. ఖేర్సన్ నగరాన్ని వీడండి.. రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
ఇరాన్ ‘డ్రోన్’లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. రష్యా కొత్త పంథా!
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్‌పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్‌లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. డ్రోన్ల దాడిలో కీవ్‌లో ఓ గర్భిణి, ఆమె భర్త సహా మొత్తం నలుగురు, సుమీ ప్రాంతంలో మరో నలుగురు కలిపి మొత్తం 8 మంది మరణించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానం కూలిపోయి నలుగురు మృతి చెందిన క్రమంలో ఈ దాడులు చేసినట్లు సమాచారం. డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఖండించారు. రష్యాకు డ్రోన్లు అందిస్తున్న ఇరాన్‌పై ఆంక్షలు విధించాలను యూరోపియిన్ యూనియన్ను కోరారు. ఇదీ చదవండి: పుతిన్ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు -
ఉక్రెయిన్ను కాపాడేందుకు రంగంలోకి అమెరికా!
వాషింగ్టన్: కెర్చ్ వంతెన పేలుడుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు దిగింది రష్యా. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. మిసైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్‌ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా క్షిపణి దాడుల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడారు బైడెన్. ‘అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను అందిస్తామని బైడెన్ భరోసా కల్పించారు. విచక్షణారహిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం, యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యుడిగా చేయటానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. బైడెన్‌తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేశారు జెలెన్స్కీ. రక్షణ సహకారంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కీవ్‌పై రష్యా భీకర దాడులు -
రష్యా ప్రతీకార చర్య.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు
కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి భారీగా అంబులెన్స్‌లు తరలివెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో చాలా నగరాల్లో సోమవారం మిసైల్ దాడులు జరిగినట్లు ఆరోపించారు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ‘మిసైల్స్ దాడిలో ఉక్రెయిన్ చిక్కుకుంది. దేశంలోని చాలా నగరాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాజధాని కీవ్‌లోని షెవ్చెన్కివిస్కీ జిల్లాలో పలు భారీ స్థాయి పేలుళ్లు సంభవించాయి.’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్చ్కో. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో పలు ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్‌పై చివరిసారిగా జూన్ 26న దాడి చేశాయి రష్యా సేనలు. తాజాగా కెర్చ్ వంతెన కూల్చివేతకు ప్రతీకార దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా ఆదివారం జరిపిన మిసైల్స్ దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ దాడిలో 11 మంది చిన్నారుల సహా మొత్తం 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని కీలక వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ పేలుళ్ల ఘటనలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్ -
రష్యాకు గట్టి షాక్.. ఉక్రెయిన్ చేతికి ‘విలీన’ ప్రాంతాలు!
కీవ్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలోనే నాలుగు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే.. ఉక్రెయిన్ తెగువకు రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుతిన్ సేనలను చుట్టుముడుతూ.. ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్. కీవ్ వ్యూహరచనతో రష్యా సేనలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కీలక ప్రాంతాలను వదిలి వెనక్కి మళ్లుతున్నట్లు రష్యా సైతం ఒప్పకోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా మరో రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. క్రెమ్లిన్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ‘అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖేర్సన్ ప్రాంతంలో సుమారు 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని ఉక్రేనియన్ దక్షిణ ఆర్మీ కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెనియుక్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను తోసిపుచ్చింది రష్యన్ ఆర్మీ. రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను మరింత వెనక్కి పంపించినట్లు పేర్కొంది. దడ్చనీ, సుఖనోవ్, కడాక్, బ్రుస్కినస్కో ప్రాంతాల్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ బలగాలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం -
ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్!
కీవ్: ఉక్రెయిన్‌తో గత కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా బలగాల ఆధీనంలో ఉన్న ఖార్కీవ్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లైమన్‌ను ఉక్రెయిన్ దళాలు చుట్టుముట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి మాస్కో తన బలగాలను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇది జెలెన్స్కీ సేనకు వ్యూహాత్మక విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇలా జరగటంతో రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో మాస్కో స్వల్ప శ్రేణి అణు బాంబులను పరిశీలించాలని సూచించారు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, చెచ్నియా నాయకుడు రామ్జాన్ కడిరోవ్. సరిహద్దు ప్రాంతంలో మార్షల్ చట్టాన్ని ప్రయోగించాలన్నారు. లైమన్ నగరం నుంచి బలగాలను ఉపసంహరించినట్లు రష్యా సైతం ప్రకటన చేసింది. అయితే, ఉక్రెయిన్ దళాలు తమను చుట్టుముట్టలేదని, తామే వ్యూహాత్మకంగా వదిలేసి వచ్చామని బుకాయించే ప్రయత్నం చేసింది. లైమన్ నగరంలో రష్యా దళాలు సుమారు 5000లకుపైగా ఉన్నాయని, శత్రు దేశ బలగాలు అంతకన్నా తక్కువేనని పేర్కొంది. ‘ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందన్న అంచనాలతో వ్యూహాత్మకంగా తమ బలగాలను ఉపసంహరించుకున్నాం.’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. లైమన్ నగరాన్ని చుట్టుముట్టామని, తమ బలగాలు నగరంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం -
Russia Ukraine War: ‘విలీనం’ రోజే రష్యా మొదలెట్టేసిందిగా..!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఆ రోజు నుంచే తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉక్రెయిన్ మద్దతుదారులను అణచివేసే దుశ్చర్యలు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎనెర్హోడార్కు వెళ్తున్న క్రమంలో మురాషోవ్ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్ ప్రభుత్వ న్యూక్లియర్ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్’ వెల్లడించింది. మురాషోవ్ కిడ్నాప్.. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతను ప్రమాదంలో పడేసిందని ఎనర్జోఆటమ్ ప్రెసిడింగ్ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మురాషోవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. మురాషోవ్ కిడ్నాప్‌పై రష్యా, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదీ చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు -
రష్యా ఆక్రమిస్తోంది.. ‘నాటో’లో త్వరగా చేర్చుకోండి మహా ప్రభో!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అధ్యక్ష కార్యాలయం. ‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్స్కీ. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా. Ukrainian President Volodymyr Zelenskyy signs application for fast-track NATO membership after Russia's annexation of Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia.#NATORussia #RussiaUkraineWar #UkraineRussianWar pic.twitter.com/i1YXuJ0B4I — Annu Kaushik (@AnnuKaushik253) September 30, 2022 ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ -
రష్యా మరో ఎత్తుగడ.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనానికి ‘రిఫరెండం’
కీవ్: ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్స్క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్స్క్లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇది మంగళవారం దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్ ఈనెల 27న ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు.. రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. రిఫరెండంపై పశ్చిమ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు! -
రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందేందుకు శుత్రుదేశాన్ని చావుదెబ్బకొడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాతో సరిహద్దు ప్రాంతమైన ఆగ్నేయ ఖార్కివ్‌ను ఉక్రెయిన్ దాదాపు తిరిగి తమ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓస్కిల్ నది, స్వాతోవే మధ్య రష్యా సేనలు ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ దళాలు నిర్వీర్యం చేశాయి. ఆ ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లాయి. దాదాపు తమ భూభాగంలో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందాయి. ఉక్రెయిన్ సైన్యం ఇచ్చిన ఊహించని షాక్‌తో రష్యా సేనలు వెనక్కి తగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత్యంతరం లేక ఆ ప్రాంతానికి దూరంలో మరో రక్షణవలయాన్ని రష్యా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాయి. ఒకవేళ దాన్ని కూడా ఉక్రెయిన్ దళాలు తిరిగి ఆక్రమించుకోగలిగితే యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాయి. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఇజియం నగరం నుంచి రష్యా దళాలు వెనుదిరిగిన తర్వాత ఉక్రెయిన్ అధికారులు అక్కడ శవాల దిబ్బను గుర్తించారు. అక్కడ దాదాపు 440 మృతదేహాలున్నట్లు చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు. 440 మంది మృతుల్లో వందలాది మంది పౌరులు, పిల్లలు, ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. కొంతమందిని చిత్రహింసలు పెట్టి, మరొకొంతమందిని బాంబులతో చంపి ఉంటారని తెలిపారు. రష్యా మారణహోమానికి ఇదే నిలువెత్తు సాక్ష్యమన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందుతున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి.. -
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్‌తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పుతిన్‌లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
Russia-Ukraine war: బలపడుతున్న శక్తి
‘మహిళ మగవారికన్నా బలహీనమైనది. ఆమె మనసు బహు సున్నితం. రకరకాల భావోద్వేగాలలో ఆమె స్థిరంగా ఉండలేదు...’ ఇలాంటి స్టేట్మెంట్లను ఏళ్లుగా వింటున్నాం. ఇప్పుడు స్త్రీ తనేం తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. శక్తిని పుంజుకుంటోంది. ఆ శక్తి ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో నుంచి పుట్టుకొచ్చింది. సమస్య వచ్చినప్పుడే సమర్థత స్థాయి ఏంటో అర్థమవుతుంది. దీనికి సరైన అర్థంలా ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతోంది ఉక్రెయిన్ మహిళ. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళల సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేళ్లక్రితం వరకు ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం వెనకంజ వేసింది. కానీ, యుద్ధం తర్వాత మహిళల్లో వచ్చిన మార్పులతో స్త్రీ శక్తి బలపడుతోంది. ఎలా పుట్టిందంటే.. భయం లేకుండా ముందుకు వచ్చే మహిళలకు రెండేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చి, ప్రేరణగా నిలుస్తోంది హన్నా అనే 34 ఏళ్ల మహిళ. దీంతో ఇక మహిళలు చేయలేరు అనుకున్న మరో 450 రకాల ఉద్యోగాలలో నిషేధాన్ని తొలగించి అక్కడి ప్రభుత్వం మహిళలకు ఆహ్వానం పలికింది. భయం నుంచి భరోసా వైపుగా కదులుతున్న మహిళ మార్గం మరింతగా శక్తిమంతం అవుతోంది. ఉత్తర ఉక్రేనియన్లోని చెర్నిహివ్‌ను చూస్తే చాలు ఐదు నెలల క్రితం జరిగిన యుద్ధం చేసిన నాశనం ఎలా ఉంటుందో చూడచ్చు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, దెబ్బతిన్న పెద్ద పెద్ద బిల్డింగులతో రోడ్లు మూసుకుపోయి ఉంటాయి. ‘ఇక్కడ పేలని మందుపాతరలు ఉన్నాయి’ అని సూచించే బోర్డ్ ఉన్నచోట ‘మందుపాతరల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా గుర్తించాలో, దూరంగా ఎలా ఉండాలో’ హన్నా తన చుట్టూ ఉన్న వారికి వివరిస్తుంటుంది. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తోంది. హన్నా రెండేళ్ల క్రితం మందుపాతరలను తొలగించే ఫౌండేషన్‌లో చేరింది. కిందటి ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగినప్పుడు ఆమె నార్త్ ఉక్రెయిన్వైపుగా వెళ్లింది. యుద్ధ నాశనం తర్వాత మందుపాతరల నుండి నగరాలను, పట్టణాలను సురక్షితంగా మార్చడానికి చెర్నిహివ్ పనిచేస్తోంది. ఏం చేస్తోందంటే... తూర్పు ఉక్రెయిన్‌లో 2014 జరిగిన అలజడుల కారణంగా మహిళలు అధిక సంఖ్యలో కొత్త పాత్రలను పోషించడంతో రక్షణ, భద్రతా రంగాలలో మార్పులు వేగవంతం అవడం కొంతకాలంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు స్త్రీలు సమాజంలో పోరాట పాత్రల నుండి నిషేధించబడ్డారు. ఇప్పటికీ పురుషులతో సమానమైన హోదా, ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోరాటంలో పాల్గొంటూనే ఉన్నారు. ఎంతోకాలంగా ఉన్న మూస పద్ధతులను ఎదుర్కొనేందుకు యుద్ధంలో ఒక శక్తిగా మారారు అక్కడి మహిళలు. పురుషులు ఇప్పటికే సైన్యంలో మెజారిటీ సంఖ్యలో యోధులుగా ఉండటంతో, మహిళలు తమ కుటుంబాలు చూసుకోవడంతోపాటు వ్యాపారాలను నడుపుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో మహిళ స్థానం మరింతగా శక్తిని పుంజుకుంటోందని స్పష్టం అవుతుంది. ఉక్రేయిన్ సామాజిక శాస్త్రవేత్త అన్నా క్విట్ మాట్లాడుతూ –‘సాధారణంగా మహిళలలో అవగాహన పితృస్వామ్యంగా ఉంటుంది. ఈ యేడాది పెరిగిన యుద్ధంతో ఎదుర్కోవడానికి మహిళల భాగస్వామ్యం పెరిగింది’ అని వివరించడం చూస్తుంటే సమస్య మహిళను సమర్థవంతంగా ప్రపంచానికి చూపడానికే అనేది స్పష్టం అవుతోంది. ప్రపంచం చూపు తనవైపు నిజానికి సైన్యం, యుద్ధం మహిళల స్థలం కాదు. ఇది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న మాటే. కానీ, నేడు అన్నిదేశాలలో మహిళలకు సాయుధ దళాలలో పురుషులతో సమానమైన చట్టపరమైన హోదా ఇచ్చింది. ఈ మార్పు మరిన్ని కొత్త మార్పులకు, అవకాశాలకు మార్గం విస్తృతం చేసింది. ఫలితంగా ఉక్రెయిన్‌లో మహిళలకు నిషేధంలో ఉన్న రంగాలను గుర్తించి, అక్కడి చట్టాలను పక్కన పెట్టి 450 రక్షణ, భద్రతాపరమైన వృత్తులలో దేనిలోనైనా మహిళలు చేరచ్చు అని ఆహ్వానం పలికింది. వీటిలో మందుపాతర తొలగింపుతో పాటు ట్రెక్కింగ్, వెల్డింగ్, అగ్నిమాపక, భద్రత, రక్షణ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఉక్రెయిన్ దేశ సాయుధ దళాలలో 50,000 మందికి పైగా మహిళలు ఉన్నారని, యుద్ధం మొదలైననాటి నుంచి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’ని అక్కడి రక్షణ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ కీలక నిర్ణయాధికారులు, మెజారిటీ యోధులు పెరుగుతున్న మహిళల సంఖ్య స్పçష్టంగా చెప్పడం లేదనేది నిపుణులు చెబుతున్న మాట. నిజానికి మహిళలు తమకు ఏ మాత్రం గుర్తింపులేకున్నా కీలకమైన పనులు చాలా చేస్తారు. రకరకాల సంఘర్షణల్లో ఉన్న సమాజాలను నిలబెట్టే అన్ని విషయాల్లోనూ స్త్రీలు తమ సమర్థతను చూపుతారని ఉక్రెయిన్ మహిళ యుద్ధరంగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుండటం స్పష్టం చేస్తోంది. -
ఉక్రెయిన్‌తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా?
కీవ్: రష్యాతో ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి చెందిన 45,550 మంది సైనికులను మట్టబెట్టినట్లు ఉక్రెయిన్ శనివారం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 250 రష్యా బలగాలను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఫేస్బుక్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 2,000 యుద్ధ ట్యాంకులు, 1,045 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3,165 వాహనాలను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ చెప్పిన లెక్కలకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇటీవల బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలేస్ అంచనాలకు ఇవి దాదాపు సమానంగా ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు మొత్తం 80వేల మంది ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. అమెరికాకు న్యూయార్క్ టైమ్స్ నివేదిక మాత్రం యుద్ధంలో 25 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. అలాగే 9000 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పేర్కొంది. రష్యా దాడుల్లో 5,587మంది ఉక్రెయిన్ పౌరులు మరణించి ఉంటారని కచ్చితంగా చెప్పగలమని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తాము ఒకవేళ నాటోలో చేరాలనే ఆలోచన మార్చుకున్నా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. చదవండి: అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన -
తెరపైకి పుతిన్ బాడీ డబుల్ థియరీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో పాశ్చాత్య మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఉక్రెయిన్ యుద్ధం వంకతో వీలైనంత రీతిలో పుతిన్‌ను బద్నాం చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఎక్కువ కాలం బతకడంటూ వీడియో కథనాలతో ఊదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా మరో థియరీని తెరపైకి తెచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగోలేదని చాలాకాలం నుంచి వెస్ట్రన్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో 69 ఏళ్ల పుతిన్ తనకు బాడీ డబుల్‌ను తెరపైకి తెచ్చాడంటూ ఉక్రెయిన్ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. నిత్యం మెడికల్ చెకప్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అధికారిక కార్యక్రమాలకు ఆయన తన బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నాడని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్లో బుడానోవ్ చెప్తున్నాడు. పుతిన్ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే.. చాలా భేటీల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో తేడాలను పరిశీలించవచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మనిషి చేతి వేళ్లు యూనిక్‌గా ఉన్నట్లే.. చెవి భాగం సైతం యూనిక్‌గా ఉంటుంది. అలాంటిది పుతిన్‌లో ఆ భాగంలో తేడాను సులువుగా గమనించవచ్చు. బహుశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్‌ను ఉపయోగించుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్. అంతేకాదు ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్నే పంపించాడని, పైగా ఆ పర్యటనలో పుతిన్ బాగా జోష్‌లో కనిపించిన విషయం ఆ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని చెప్పాడాయన. మరోవైపు ఈ వాదనపై క్రెమ్లిన్ గప్‌చుప్‌గా ఉండిపోయింది. పుతిన్ బాడీ డబుల్ థియరీ ఇలా తెర మీదకు రావడం ఇదే కొత్త కాదు. 2018లో పుతిన్ లాగ ముగ్గురు ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఆ సమయంలో ట్విటర్లోనూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మూడు భిన్నమైన రూపాలున్న పుతిన్ ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. బాడీ డబుల్ అంటే.. ఒక వ్యక్తి బదులుగా అలాంటి కవళికలు ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం. చరిత్రలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ లా మోంట్‌గోమెరీ, సద్దాం హుస్సేన్, జోసెఫ్ స్టాలిన్లు బాడీ డబుల్‌ను ఉపయోగించేవాళ్లన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదీ చదవండి:: గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్ -
ఉక్రెయిన్ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!
కీవ్: ఉక్రెయిన్‌లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదీ చదవండి: డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు.. -
Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: తమ పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ రెండో రోజు దీక్ష సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. భారతీయ వైద్య వర్సిటీల్లో తమకు అవకాశం కల్పించేలా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్టు–1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్టులకు సవరణలు చేయాలని కోరారు. పొరుగు దేశం శ్రీలంకకు సాయం చేస్తున్న కేంద్రం దేశంలోని విద్యార్థులకు న్యాయం చేయదా అని ప్రశ్నించారు. నీట్ ర్యాంకు వచ్చినా భారత్‌లో ఫీజులు అధికం కాబట్టే తమ పిల్లలను ఉక్రెయిన్‌కు పంపాల్సి వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వమే వారి భవిష్యత్తును కూడా కాపాడాలని కోరారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
Ukraine War: కన్నపేగు బంధం.. వీడియోలు చూస్తే కన్నీరు ఆగదు!
కీవ్: యుద్ధంలో పాల్గొనడమంటే మృత్యువుకు ఎదురెళ్లడమే. కదన రంగంలోకి అడుగుపెట్టాక ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామనే గ్యారంటీ ఉండదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ల చిన్నారి చాలా రోజుల తర్వాత తన తల్లి ఇంటికి రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటి గేటు వద్దే గోడ చాటున ఆమె కోసం ఎదురు చూశాడు. తీరా తల్లిని చూసిన ఆనందంలో ఏం చేయాలో కూడా అతనికి పాలుపోలేదు. తల్లి చిన్నారిని దగ్గరగా హగ్ చేసుకున్న ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్చెన్కో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ ఇప్పుడు పోరాడుతోందని దీనికోసమే అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోయారు. This is what we're fighting for. pic.twitter.com/nX6Lxd3sN6 — Anton Gerashchenko (@Gerashchenko_en) July 19, 2022 ఈ వీడియోలో పెంపుడు కుక్క కూడా చాలా రోజుల తర్వాత మహిళా సోల్జర్ను చూసి తెగ సంబరపడిపోయింది. దానికి కూడా ఒక హగ్ ఇవ్వాల్సింది అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు. మరో వీడియోలో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తండ్రిని చూపించేందుకు ఓ బాలికను కళ్లు మూసి అతని వద్దకు తీసుకెళ్లింది తల్లి. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన ఆ పాప భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. తండ్రి కూడా ఆమెను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. Daddy came home from war - 2. pic.twitter.com/iOZORtnUSL — Anton Gerashchenko (@Gerashchenko_en) July 9, 2022 చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
రష్యాను ఏకాకిని చేయటమా? అది అసాధ్యం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో విరుచుకుపడుతున్న రష్యాను నిలివరించేందుకు పశ్చిమ దేశాలతో పాటు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా.. వెనక్కి తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగిస్తున్నారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించి.. ప్రపంచ దేశాలకు దూరం చేయాలనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యాను వేరు చేసి ఏకాకిని చేయటం అసాధ్యమని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు దశాబ్దాలుగా మాస్కో సాధించిన ప్రగతిని నిలువరించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు పుతిన్. ‘ప్రస్తుత పరిస్థితి మా దేశానికి ప్రధాన సవాలు అని తెలుసు. మా శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. మేము ప్రజల నమ్మకాన్ని, దశాబ్దాల పురోగతిని కోల్పోము. దేశంలోని సొంత సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పరిష్కారం కోసం దేశం చూస్తోంది. మా దేశానికి పెద్ద సవాలు ఇది. కానీ, మేము వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచానికి దూరంగా ఏకాకిగా మారటమనేది అసాధ్యమని విస్పష్టం.’ అని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టారు పుతిన్. అందుకోసం దేశీయ తయారీని ప్రోత్సహించటం, అంతర్గతంగా ఎండ్ టూ ఎండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం, విదేశీ ఎగుమతులను నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. రష్యా సాంకేతిక విభాగాలను ప్రోత్సహించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు ఆ దేశ ఆర్థిక మంత్రి అంటోన్ సిలునోవ్. ప్రభుత్వం ఒక రూబల్ పెట్టుబడితో వస్తే.. ప్రైవేటు సంస్థలు మూడు రూబల్ పెట్టాలని కోరారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా! -
Russia Ukraine War: యుద్ధ రక్కసికి బలైన బాల్యం
కీవ్: రష్యా యుద్ధకాంక్షకు బలైన తన చిన్నారి పాపాయి మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదించాడు ఓ తండ్రి. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఉక్రెయిన్‌లోని వినిట్సియా సిటీలో గురువారం ఈ చిన్నారిని ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రష్యా సేనలు బాంబులతో దాడిచేశాయి. చిన్నారితో పాటు 24 మంది దుర్మరణం పాలవగా తల్లి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది! ఇదీ చదవండి: బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు -
ఉక్రెయిన్‌పై దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్‌కు ఏడేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్, రష్యా యుద్ధం గత నెలుగు నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుద్ధం ముగించాలని ప్రపంచ నేతలు సూచిస్తున్నా, కఠిన ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గటం లేదు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్ అలెక్సీ గోరినోవ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ మాట్లాడటమే ఆయన చేసిన తప్పు. క్రాస్నోసెల్స్కీ మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన 60 ఏళ్ల గోరినోవ్.. సిటీ కౌన్సిల్ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రశించారు. ఉక్రెయిన్‌లో వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. బాలల దినోత్సవంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చినిపోయిన వారికి సంతాపం తెలుపుతూ కొద్ది సేపు మౌనం పాటించారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. రష్యా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంగా కేసు నమోదైనట్లు తీర్పు చెబుతున్న సందర్భంలో న్యాయమూర్తి ఒలెస్యా మెండెలెయెవ తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య తర్వాత అసమ్మతి వాదులను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించటం ఇదే మొదటి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించారు. సైనిక చర్య ద్వారా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజల్లో ఆందోళన నెలకొనేలా గోరినోవ్ మాట్లాడారని తీర్పు సందర్భంగా జడ్జి తెలిపారు. విచారణకు హాజరైన సందర్భంగా ఓ చిన్న కాగితంపై 'ఇప్పటికీ ఈ యుద్ధం మీకు అవసరమా?' అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు గోరినోవ్. దానిని కెమెరాకు కనిపించకుండా చేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. చదవండి: Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది -
Russia-Ukraine War: రష్యా బలగాల దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి
కీవ్: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్‌గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్‌లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు. థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్‌లో పెష్‌మెర్గాస్ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు. నటిగా.. థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్‌గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్‌గా సేవలందిస్తోందని తెలిపాడు. అదే చివరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్‌కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది. -
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు. -
యూరప్ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్‌తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు. ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. -
బంధం మరింత దృఢం
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుచా నరమేధం ఆందోళనకరమని మోదీ అన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇరువురు నేతలు సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్, అమెరికాలో భారత రాయబారి తరంజిత్‌సింగ్ సంధు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సమక్షంలో వైట్‌హౌస్ సౌత్ కోర్ట్ ఆడిటోరియం నుంచి బైడెన్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిన వేళ ఈ భేటీ జరుగుతోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడానని, సంక్షోభాన్ని ముగించేందుకు పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించానని మోదీ గుర్తు చేశారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగస్వాములన్నారు. ఒకే వైఖరి: బైడెన్ ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందజేస్తున్న మానవీయ సహాయాన్ని బైడెన్ ప్రశంసించారు. యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను అస్థిరపరచకుండా జాగ్రత్త పడటంతో పాటు వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అందుకు తమ తాజా చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రపంచ శాంతికీ ఇవి తోడ్పడతాయన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పటిష్ట రక్షణ బంధాన్ని బైడెన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘భారత్, అమెరికా ప్రగతిశీల ప్రజాస్వామ్యాలు. కరోనా, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పుల వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇరు దేశాలదీ ఒకటే వైఖరి. ఇరు దేశాల ప్రజల మధ్య ఓ కుటుంబంలో, మిత్రుల మధ్య ఉండే తరహా విలువలతో కూడిన లోతైన సంబంధాలున్నాయి’’ అన్నారు. మే 24న జపాన్‌లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్రంలో మోదీతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుగుతాయని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ని భారత్ ఖండించకపోవడంపై, ఆ దేశంనుంచి చవకగా చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. -
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం,పుతిన్‌కు ఎదురు దెబ్బ!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తుంది. సౌత్ ఈస్ట్రన్ ఉక్రెయిన్ సిటీ మారియుపోల్ టార్గెట్‌గా రష్యా సైన్యం షెల్లింగ్‌తో విరుచుకుపడుతోంది. మరోవైపు రష్యాపై ఆంక్షల భారం పెరగుతోంది. ఇప్పటి వరకు దేశాలే ఆంక్షలు ప్రకటించగా..ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు,పెట్టుబడి దారులు చేరిపోయారు. రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు, పుతిన్ తనకు ప్రధాన శత్రువుగా భావించే బిల్ బ్రోడర్ పుతిన్నుపై విరుచుకు పడ్డారు. రష్యాతో వాణిజ్యం చేసేది లేదని తెగేసే చెప్పారు. ఇప్పుడీ బిల్ బ్రోడర్ నిర్ణయం పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యా మరింత ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. ఇప్పటికే అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ముడి చమురుతోపాటు రష్యా నుంచి ఎలాంటి ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకోకుండా నిషేధించాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యాను అమెరికా, దాని మిత్ర దేశాల బ్యాంకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వాణిజ్యంపై రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు బిల్ బ్రోడర్ స్పదించారు.రష్యాలో మిగిలి ఉన్న కంపెనీలు "నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు. బ్రౌడర్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతఖర్చైనా సరే "ప్రతి వ్యాపారస్థుడికి రష్యా నుండి బయటపడే నైతిక బాధ్యత ఉంది. పుతిన్ తర్వాతి పాలనలో ప్రతి ఒక్కరూ తిరిగి రావొచ్చి. కాబట్టి రష్యాలో వ్యాపారం చేయడం ఇష్టం లేక, ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపి వేసిన వ్యాపార వేత్తలకు రష్యాకు తిరిగి రావడం ఎలా అనే అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం రష్యాలో వ్యాపారం చేయడం అంటే"నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు. ఒక వేళ పుతిన్ అధికారం కొనసాగితే.. రష్యా నుంచి సంస్థలు 'వెనక్కి వెళ్లాలని' కోరుకోకూడదని ఆయన అన్నారు. రష్యాకో దండం! యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం..ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆ దేశం ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో..రష్యాలోని వందల సంస్థలు కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి.యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ సంస్థ ఇప్పటి వరకు 800 కంపెనీలు రష్యాకు గుడ్ బైచెప్పాయని తెలిపింది. మరికొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో రష్యా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'! -
ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ.. రష్యా సంచలన ఆరోపణ
నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ సహకారం, ముందస్తు ఎన్నికల ప్రకటనతో అవిశ్వాసం నుంచి తప్పించుకున్న పాక్ ప్రధాని(డీ-నొటిఫై పీఎం) ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని పాకిస్థాన్ ఎన్నికల కమీషన్ తేల్చేసింది. మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంత తక్కువ టైంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పాక్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరమని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకానికి ఆరు నెలల సమయం పడుతుందని ఈసీపీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 26వ సవరణ ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం, జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను అనుగుణంగా తీసుకురావడం ప్రధాన సవాళ్లని ఆయన పేర్కొన్నట్లు డాన్ ఒక కథనం ప్రచురించింది. పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పాక్ రాజకీయ బంతి.. కోర్టులో ఉంది. ప్రపంచం నవ్వుతోంది ఇదిలా ఉండగా.. తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు, ఇమ్రాన్ ఖాన్‌ను హేళన చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాక్‌ను చూసి నవ్వుతోందని ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అహ్షన్ ఇక్బాల్ పేర్కొన్నారు. చివరి బంతి దాకా పోరాడతానన్న వ్యక్తి వికెట్లు పీకేసుకుని పారిపోయాడు అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. ఇక నుంచి ఇమ్రాన్ ఖాన్ అవినీతి కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని అంటున్నాడు . ఈ విషయంలో న్యాయస్థానాలు గనుక జోక్యం చేసుకోకపోతే.. రాజ్యాంగానికే అర్థం ఉండదని, భవిష్యత్తు మొత్తం నియంతలదే రాజ్యమవుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా పగ బట్టింది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాస్కోలో పర్యటించినందుకే అమెరికా పగబట్టిందని రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. పాక్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన రష్యా.. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో.. రష్యా పర్యటనను ఆయన (ఇమ్రాన్ ఖాన్) వాయిదా వేసుకోలేదు. అందుకే అమెరికా అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది అంటూ రష్యా విదేశాంగ శాఖ పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇదిలా ఉండగా.. అవిశ్వాస తీర్మానానికి కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రతిపక్షాలతో కలిసి.. ఆ విదేశీ శక్తులు కుట్ర పన్ని తనను గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించాడు కూడా. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నడుమే ఖాన్, మాస్కోలో పర్యటించాడు. ఆ సమయంలో ‘వాట్ ఏ టైమింగ్..’ అంటూ పాక్ పీఎం తన ఎగ్జయిట్మెంట్ కనబరిచిన వీడియో ఒకటి బయటకు వచ్చింది కూడా. -
భారత్ ఎకానమీకి ఉక్రెయిన్- రష్యా యుద్ధం సవాల్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. 6 శాతం కనిష్టం–7.8 శాతం గరిష్ట స్థాయిలో జీడీపీ పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. వృద్ధి తక్కువ స్థాయికి పడే క్లిష్ట పరిస్థితులే ఉంటాయని విశ్లేషించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భారత్‌తో పాటు గ్లోబల్ ఎకానమీకి తీవ్ర సవాలని పేర్కొంది. కాగా, ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) రేటు 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరగవచ్చని సర్వే అంచనా వేసింది. సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆర్బీఐ తన ఏప్రిల్ పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని, తద్వారా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతును కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ► వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వృద్ధి అంచనా 2022–23కి 3.3 శాతం. పరిశ్రమలు, సేవల రంగాల వరుసగా 5.9 శాతం, 8.5 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. ► కోవిడ్–19 మహమ్మారి నుండి ముప్పు ఇంకా పొంచి ఉండగానే, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు తీవ్ర సవాలును విసురుతోంది. ► రష్యా– ఉక్రెయిన్లు క్రూడ్‌సహా కీలక ఉత్పత్తులకు ప్రపంచ సరఫరాదారులుగా ఉన్నందున, అంతర్జాతీయ స్థాయిలో కమోడిటీల ధరలు తీవ్రమవుతున్నాయి. ఇది ప్రపంచానికి తీవ్ర సవాలు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు, సహజ వాయువు, ఆహారం, ఎరువులు, లోహాలతో సహా ప్రధాన ముడి పదార్థాల సరఫరాను మరింత దెబ్బతీస్తుంది. ► 2022 ప్రథమార్థంలో ప్రపంచ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. ఆ తర్వాత తగ్గుతూ మధ్యస్థానికి చేరుకోవచ్చని సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ► పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థికవేత్తల నుండి మార్చిలో స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎకనామిక్ అవుట్‌లుక్ సర్వేను ఫిక్కీ రూపొందించింది. 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి), 2022–23 ఆర్థిక సంవత్సరం ఒకటవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ఆర్థిక అంచనాలపై సర్వే దృష్టి పెట్టింది. -
భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్, డిస్కౌంట్లో ఆయిల్ కొంటే తప్పేంటట!
రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోళ్లు అమెరికాతో పాటు పలు మిత్ర దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమని కాదని రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే భారత్‌పై ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పంపుతుంది. ఈ నేపథ్యంలో రష్యా- భారత్‌ల మైత్రిపై ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్న అమెరికాకు భారత్ గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. 'డిస్కౌంట్‌కే ముడి చమురు ఇస్తామని రష్యా అంటుంది. దేశం కోసం రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తే తప్పేంటని' ప్రశ్నించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ఏప్రిల్ 1న జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన మరింత చమురు ఉత్పత్తుల్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని' అన్నారు. చమురు ఉత్పత్తుల కొనుగోళ్లపై రష్యా డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ ప్రోత్సహాకాలతో రష్యా నుంచి ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఒక్కో బ్యారల్‌పై భారత్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ ఇస్తుందని, యుద్ధానికి ముందే చమరు బ్యారెల్ కొనుగోళ్ల గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయినా “నేను నా జాతీయ ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తాను. నా ఇంధన భద్రతకు మొదటి స్థానం ఇస్తాను. డిస్కౌంట్లో ముడి చమురు అందుబాటులో ఉంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే తప్పేంటని అర్ధం వచ్చేలా కేంద్రం ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ షాక్! -
మొండిఘటం: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..ఆ దేశాలకు రివర్స్ ఝులక్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ యురప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు యుద్ధంతో ఉక్రెయిన్‌తో పాటు శత్రు దేశాల్ని వణికిస్తూనే.. నెక్ట్స్ టార్గెట్‌గా ఆయా దేశాల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేని పక్షంలో శత్రు దేశాలుగా భావిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. వారాల తరబడి యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహాలు రచయిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను టార్గెట్‌గా ఐరోపాలో పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అదే సమయంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో- యూఎస్ డాలర్‌తో పోలిస్తే రష్యా రూబెల్స్ విలువ ఘోరంగా పతనమైంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న దేశాలకు భారీ ఝలక్ రష్యా అధ్యక్షుడు పుతిన్. తమ నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లింపులు చేయాలని షరతు విధించారని రష్యన్ మీడియా సంస్థ 'రియా నోవోష్ఠి' కథనాన్ని ప్రచురించింది. వీళ్లంతా మా శత్రువులే ఇప్పటికే తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్ని పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రష్యా 48 దేశాలతో ఓ జాబితాను విడుదల చేశారు. అమెరికా నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు అన్నీ యూరప్ దేశాలను ఈలిస్ట్‌లో చేర్చారు పుతిన్. ఈ దేశాలేవీ తమకు మిత్రపక్షాలు కావని స్పష్టం చేశారు. ఇప్పుడీ దేశాలు రష్యా రూబెల్స్లోనే రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
Russia-Ukraine war: మూతబడ్డ ‘నోబెల్ శాంతి’ పత్రిక
మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం. నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి) -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: ఈ వారం స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు.... రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు. -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
పుతిన్ పరమ కసాయి.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో భారీ ప్రాణ నష్టం చవిచూస్తూ.. మరో పక్క ప్రపంచాన్ని ఆందోళనలో నెట్టేసిన పుతిన్‌ను పరమ కసాయి వాడిగా అభివర్ణించాడు బైడెన్. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా.. అగ్ర రాజ్యం అధ్యక్షుడు యుద్ధ క్షేత్ర సమీపంగా వెళ్లారు. రష్యా బాంబుల దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్‌లో బైడెన్ పర్యటించారు. శనివారం రాజధాని వార్సా నగరానికి వెళ్లిన బైడెన్.. అక్కడ పోల్యాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులు తదితరాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఈ వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల కూటమిగా ఉన్న నాటోను చీల్చే దిశగా పుతిన్ చాలా యత్నాలే చేశారని ఆరోపించిన బైడెన్.. అందులో పుతిన్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బైడెన్.. ఉక్రెయిన్ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు యత్నించి బొక్కబోర్లా పడ్డారని బైడెన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు పుతిన్‌ను పరమ కసాయిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ ఆక్రమణలో.. రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చి ఉంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక బైడెన్‌తో చర్చల అనంతరం.. అమెరికా స్పందనపై ఉక్రెయిన్ రక్షణ మంత్రి స్పందించారు.ఈ చర్చల్ని ‘‘ఆశావాదం’’గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉదయం బలగాలతో సరదగా గడిపిన బైడెన్.. వాళ్లతో పిజ్జా షేర్ చేసుకోవడంతో పాటు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఉక్రెయిన్‌కు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు బైడెన్. మరోపక్క రష్యా.. ఉక్రెయిన్ మిలిటరీ చర్యలో తొలి దశ మాత్రమే పూర్తైందని ప్రకటించడం విశేషం. -
కీవ్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న రష్యా..షాకిచ్చిన హ్యాకర్లు!
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంలో రష్యా సైన్యం కల్లోలమే సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ తీరును తప్పు బట్టిన ఆ దేశ హ్యాకర్లు అధ్యక్షుడు పుతిన్‌కు షాకిస్తున్నారు. ఈ వారంలో రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన రహస్యాల్ని బహిర్గతం చేశామని గుర్తు తెలియని హ్యాకర్స్ గ్రూప్ అధికారికంగా ట్వీట్ చేసింది. నెల రోజుల క్రితమే వార్నింగ్ తాజాగా Anonymous అనే హ్యాకర్స్ గ్రూప్ చీకటి ఒప్పందాలకు సంబంధించి 35వేల పేపర్లను బహిర్ఘతం చేస్తామని ట్వీట్ చేసింది "జస్ట్ ఇన్ #Anonymous కలెక్టివ్ రష్యా సెంట్రల్ బ్యాంక్‌ను హ్యాక్ చేశాం.48 గంటల్లో 35,000 కంటే ఎక్కువ రహస్య ఒప్పంద పత్రాలు విడుదల చేయబడతాయి" అని ట్వీట్లో పేర్కొంది. నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా..రష్యన్ హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. త్వరలో మీరు ప్రపంచ హ్యాకర్ల ఆగ్రహానికి గురవుతారని ప్రకటించారు. JUST IN: The #Anonymous collective has hacked the Central Bank of Russia. More than 35.000 files will be released within 48 hours with secret agreements. #OpRussia pic.twitter.com/lop140ytcp — Anonymous TV 🇺🇦 (@YourAnonTV) March 23, 2022 అన్నట్లుగానే ఈ వారం ప్రారంభంలో ఉక్రేనియన్ భవనాలపై దాడికి గురైన దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు రష్యన్ స్టేట్ టీవీ నెట్‌వర్క్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రష్యన్లు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రష్యా సైన్యం కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా.. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నారు. భవిష్యత్‌లో హ్యాకింగ్ కొనసాగుతుందని ట్వీట్ల ద్వారా పుతిన్‌ను హెచ్చరిస్తున్నారు. -
పుతిన్-జెలెన్స్కీ.. వాటి వెనుక బోలెడంత కథ!
దేశం కోసం అంటూ ఒకరు, తన సరిహద్దుల్లో నాటో వద్దంటూ మరొకరు.. విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు. ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశిస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి? నష్టం ఎటువైపు ఎక్కువ ఉంటోంది అనే విషయాలను పక్కనపెడితే.. వాళ్ల ఆటిట్యూడ్‌కు సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే వాళ్ల డ్రెస్సింగ్.. మామూలురోజుల్లో సూట్ బూట్లో సందడి చేసే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్‌కలర్ టీషర్టులో కనిపిస్తున్నాడు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడాయన. ఫ్యాషన్ హిస్టారియన్స్ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు. కానీ, ఒలివ్, గ్రీన్ కలర్ టీషర్టుల్లోనే జెలెన్స్కీ ఎక్కువ దర్శనమిస్తున్నాడు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన.. ఉక్రెయిన్ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. పలు దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పుతిన్ సంగతికొస్తే.. రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్ ఈవెంట్లో హాజరైన పుతిన్ ఓ ఫ్యాషనబుల్ కోట్లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్ భావించాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్ ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి. కానీ, ఉక్రెయిన్ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయి. రష్యా ఆర్థిక పతనం తర్వాత.. రూబుల్స్(కరెన్సీ)విలువ దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్‌కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట. డ్రెస్సులోనే అంత ఉంది పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది కొత్త విషయం ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. యూకే అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ సైరన్ సూట్‌ను ధరించేవాడు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా అది. ►ఇక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్.. మిలిటరీ దుస్తుల్లో సైన్యానికి సపోర్ట్‌గా కనిపించేవారు. ►ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ది ఈ విషయంలో మరో తరహా వైఖరి. తానొక నియంత అని చెప్పుకోవడానికి వీలుగా.. తనలాంటి జాకెట్లు మరెవరూ ధరించకూడదన్న ఉద్దేశంతో నిషేధాజ్ఞలు, ధరించిన వాళ్లకు శిక్షలు అమలు చేయించాడు. ►ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్.. ఎయిర్‌ఫోర్స్ హూడీ ద్వారా సాదాసీదాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతోనే.. జెలెన్స్కీని కాపీ కొడుతూ.. ఇలా సింప్లిసిటీ డ్రామాలు ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో మాక్రోన్‌పై ట్రోలింగ్ నడుస్తోంది. -
రష్యా బహిష్కరణ? ఆ హక్కు ఎవరికీ లేదు!
యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో రష్యాను.. జీ-20 గ్రూపు నుంచి బహిష్కరించాలని అమెరికా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక ఆంక్షల ద్వారా ఇప్పటికే రష్యాను అంతర్జాతీయ సమాజం నుంచి వెలేసినంత పని చేశాయి అమెరికా దాని మిత్రపక్ష పాశ్చాత్య దేశాలు. ఈ తరుణంలో చైనా, తన మిత్ర పక్షం రష్యాకు అనుకూల గళం వినిపించింది. జీ 20 అనేది అందులో ఉన్న సభ్య దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించుకునే వేదిక. అదేం దేశాల మధ్య జరిగే వ్యాపారం కాదు. అందులో రష్యా కీలక సభ్యత్వం ఉన్న దేశం. అలాంటి దేశాన్ని బహిష్కరించే హక్కు ఏ ఒక్క దేశానికి ఉండదు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వింటర్ ఒలింపిక్స్టైంలోనే రష్యా-చైనాలు తమ బంధం బలమైందని ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్ పరిణామంలో అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా చైనా రష్యాకు మద్ధతుగా నిలుస్తోంది. మరోవైపు జీ20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించే విషయమై మిత్రపక్షాలతో చర్చించనున్నట్లు వైట్‌హౌజ్ జాతీయ భదత్రా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీ 20 దేశాల్లో మొత్తం 19 దేశాలు ఐదు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి(యూరోపియన్ యూనియన్ అదనం). భారత్, రష్యాతో పాటు గ్రూప్-2 లో ఉంది. జీ 20కి పుతిన్! క్రిమియా ఆక్రమణ తర్వాత 2014లో జీ8 దేశాలు పుతిన్‌ను(రష్యా) బహిష్కరించాయి. దీంతో జీ8 కాస్త జీ7గా మారింది. ఈ తరుణంలో జీ20 నుంచి రష్యాకు అలాంటి అనుభవమే పునరావృతం అవుతుందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఈ ఏడాది జీ20 సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ చివర్లో బాలి(ఇండోనేషియా)లో జరగబోయే జీ 20 సదస్సుకు పుతిన్ హాజరవుతారని ఇండోనేషియాలో రష్యా దౌత్యవేత్త ల్యుద్మిలా వోరోబియెవా ప్రకటించారు. చదవండి: చైనాను ఇరుకున పెడుతున్న రష్యా! అమెరికాకు మరింత మంటపుట్టించేలా.. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కోవిడ్–19 మహమ్మారి అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ► ఉక్రెయిన్‌పై యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు. ► ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి. ► డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ►2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్‌లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్ పరిస్థితి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్ వేవ్‌ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ►ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్ బ్యాండ్ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం. ► గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్‌గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము. ► 2022 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే. అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్ తన అంచనాల్లో పేర్కొంది. ►యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ బ్యారల్ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్ ఇయర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. -
Ukraine War: యుద్ధం ఆపకుంటే ఆకలి కేకలు తప్పవు!
ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే దేశం. అలాంటి దేశం యుద్ధంతో తల్లడిల్లుతోంది. రష్యా బలగాల దాడుల్లో పంట పండించడం కష్టతరంగా మారడమే కాదు.. ఇప్పటికే ఉన్న పంట నాశనం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో పాటు కొన్ని దేశాల్లో ఆకలి కేకలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న జెలెన్స్కీ.. ఏది ఏమైనా శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 27వ రోజుకి చేరిన వేళ.. మంగళవారం ఇటాలియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్స్కీ ప్రసంగించాడు. రష్యా దాడులు ఒక్క ఉక్రెయిన్ను మాత్రమే సంక్షోభంలో నెట్టేయదని, చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందిపడతాయని జెలెన్స్కీ అంటున్నాడు. కాబట్టి, ఆక్రమణదారులను ఓడించేందుకు సాయం చేయాలంటూ ఇటలీ ప్రతినిధులను కోరాడాయన. దానికి ఇటలీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇక ఉక్రెయిన్ నుంచి గోధుమలు, మొక్కజోన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మేజర్ వాటాదారునిగా ఉంది ఉక్రెయిన్. అయితే రష్యా దాడుల నేపథ్యంలో.. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్థంభించి పోయింది. పైగా ఉత్పత్తుల్లో చాలావరకు పాడైపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. లెబనాన్, ఈజిప్ట్, యెమెన్.. ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో ఉక్రేనియన్ గోధుమలపై ఆధారపడుతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్‌తోనే గోధుమల ధరలు గత నెలలో 50% మేర పెరిగాయి. ఇదిలా ఉంటే.. పాశ్చాత్య దేశాల అధినేతలను ఉద్దేశించి జెలెన్స్కీ ఓ వీడియో లింక్‌ను విడుదల చేశాడు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటనే విషయం తెలుసు కదా, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఆకలి కేకలు పెట్టొచ్చు. రష్యన్ ఫిరంగి దాడులతో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి.. ఇంక కొత్త పంటలు ఎలా పండుతాయి? అని నిలదీశాడు. పోప్.. ప్లీజ్ జోక్యం చేసుకోండి ఉక్రెయిన్ పరిణామాలపై జెలెన్స్కీ, పోప్ ఫ్రాన్సిస్‌తో ఫోన్లో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి చర్చల ద్వారా ఒక ముగింపు పలకాలని ఆయన్ని జెలెన్స్కీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు చర్చల సారాంశం తాలుకా సందేశాన్ని ఆయన ట్విట్టర్లో సైతం పోస్ట్ చేశారు. అయితే పోప్-Russian Orthodox Patriarch Kirill మధ్య శాంతి స్థాపన కోసం ఈ నెల మొదట్లోనే చర్చలు జరిగాయి. కానీ, Patriarch Kirill of Moscow మాత్రం.. ఉక్రెయిన్ బలగాలను దుష్టశక్తులుగా పేర్కొంటూ యుద్ధానికి ఎగవేస్తుండడం విశేషం. ఇక యుద్ధం మొదలై.. దాదాపు నెలరోజులు కావొస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. Talked to @Pontifex. Told His Holiness about the difficult humanitarian situation and the blocking of rescue corridors by Russian troops. The mediating role of the Holy See in ending human suffering would be appreciated. Thanked for the prayers for Ukraine and peace. pic.twitter.com/wj4hmrTRGd — Володимир Зеленський (@ZelenskyyUa) March 22, 2022 చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. ఆ అంధుడికి సలాం! -
హిట్లర్ వదిలేసినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బోరిస్ రోమన్చెన్కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు ఈయన. ఖార్కీవ్లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్చెన్కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది. రోమన్చెన్కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్వాల్ద్ కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్‌లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్చెన్కో పాల్గొన్నాడు. Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9 — Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022 నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్చెన్కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్‌కు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్చెన్కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విరామం లేకుండా కొనసాగుతోంది. రష్యా దాడితో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. కోట్ల సంపద సర్వ నాశనం అవుతోంది. సైనికులు, అమాయక పౌరులు యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా మరోసారి తమ అక్కసుని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో అమెరికన్ సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో జంకుతోందని వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని అన్నారు. రష్యాపై భారత్ కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయడంలో కొంతవరకు వణుకుతోందని పేర్కొన్నారు. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉందని పేర్కొన్నారు. చదవండి: రష్యా చెప్పేదానిని నమ్మలేం.. అది అంత ఈజీ కాదు: అమెరికా క్వాడ్‌లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని.. మిగతా జపాన్, ఆస్ట్రేలియా, తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని జో బైడెన్ తెలిపారు. కాగా క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన మూడు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. అయితే రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్న భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అలాగనీ అటు యుద్ధాన్ని కూడా సమర్థించడం లేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతోంది. చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం! -
Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వసం కొనసాగుతోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలైన కీవ్, మరియూపోల్‌పై రష్యా సైన్యం విరుచుపడుతోంది. అయితే ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని కోరదనే విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే దానికి బదులుగా ఉక్రెయిన్ భద్రత దృష్యా రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, తమ దళాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అదే విధంగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మరియూపోల్‌లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ని ఓ పాఠశాలపై బాంబులతో దాడికి తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. కాగా కాగా సగటు ఉక్రేనియన్లు తమ భాష తప్ప మరోటి మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇంగ్లిష్ అర్థం చేసుకుంటారు. మాట్లాడే వారైతే మరీ తక్కువ. స్థానికులకు కూడా చాలావరకు అటు ఇంగ్లిష్, వీరి భాష రావు. దాంతో పరాయి దేశాల్లో వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే కనీసం బస్టేషన్, రైల్వే స్టేషన్ పేర్లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లిష్, ఉక్రేనియన్ తెలిసిన విద్యార్ధులు, మేధావులు శిబిరాలకు వెళ్లి సాయం చేస్తున్నారు. బుడాపెస్ట్‌లో వాలంటీర్‌గా పని చేసేందుకు ముందుకొచ్చిన అంధుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘‘శరణార్థుల్లో చాలామందికి మా భాష రాదు. వారికి అనువాదకునిగా సాయం చేస్తున్నా. నాకు 7 భాషలొచ్చు. వారికి ఏ భాషలో కావాలన్నా సాయం చేస్తా. చాలామందికి ఎటు పోవాలో కూడా తెలియదు. వారిని ఎన్జీవో శిబిరాలకు పంపుతున్నా. అంతా వదిలేసి కట్టుబట్టలతో, పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భరోసా ఇవ్వడమే మనం చేసే గొప్ప సాయం!’’ అన్నాడతను. -
ఉక్రెయిన్ పరిస్థితులపై సాక్షి ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
-
సేవకు చూపు అడ్డుకాదు.. అంధుడికి సేవకు సలాం
-
చైనాను ఇరుకున పెడుతున్న రష్యా ప్రకటన!
ఉక్రెయిన్ సంక్షోభంలో పెద్దన్న పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. రష్యాకు ఉక్రెయిన్ దురాక్రమణలో సహకరిస్తే.. తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చైనాను హెచ్చరిస్తూ వస్తున్నాయి. అయినా రష్యాకు పరోక్ష సాయం అందిస్తూనే.. శాంతి సందేశం వినిపిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఈ క్రమంలో రష్యా తాజా ప్రకటన.. చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేదిగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాల మధ్య బంధం మరింత బలపడుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. ‘‘అంతర్జాతీయ వ్యవస్థ ఆధారపడి ఉన్న పునాదులను అన్ని పాశ్చాత దేశాలు అణగదొక్కుతున్నాయి. కానీ, చైనా, రష్యాలు మాత్రం గొప్ప శక్తులుగా ముందుకు ఎలా వెళ్లాలి అనే కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలోనూ చైనా సహకారం మాకు అందడం ఆనందాన్ని ఇస్తోంది. ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆశిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. యూటర్న్ తర్వాతే.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా బీజింగ్(చైనా రాజధాని) పర్యటనకు బయలుదేరారు. గురువారం ఆయన ప్రయాణించిన విమానం.. మార్గం మధ్యలోనే యూటర్న్ తీసుకుంది. సెర్బియా నోవోసిబిర్స్క్ నుంచి మాస్కోకు తిరుగుటపా కట్టింది. అనూహ్యమైన ఈ పరిణామాలపై జోరుగా చర్చలు నడిచాయి. అమెరికా వార్నింగ్ నేపథ్యంలో పుతిన్.. సెర్గీని వెనక్కి రప్పించుకున్నాడని.. కాదుకాదు చైనానే ఆయన్ని పర్యటన రద్దు చేసుకోమని ఒత్తిడి చేసిందని.. ఇలా కథనాలు మొదలయ్యాయి. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఆయన పర్యటన రద్దుపై రష్యా సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయిన కొన్ని గంటలకే రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. సెర్గీ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉక్రెయిన్ యుద్ధం ఎవరూ కోరుకోని సంక్షోభం అని జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుమారు రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం వాళ్లిద్దరి మధ్య సంభాషణ సాగింది. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. రష్యాకు సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేరుగా హెచ్చరించిన తర్వాతే.. జిన్‌పింగ్ భేటీ కావడం కొసమెరుపు. -
చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది. 10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు: ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది. ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. (చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!) -
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
వెనక్కి రాకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే.. ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్‌లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన. మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్గెని. అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు. -
రష్యాకు మరో దిగ్గజ కంపెనీ భారీ షాక్..!
ఉక్రెయిన్ - రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తుంటే, ఫేస్బుక్, యూట్యూబ్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. అయితే, తాజాగా మరో దిగ్గజ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ అమెరికా విధించిన ఆంక్షలకు అనుగుణంగా రష్యన్ కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయించడం నిలిపివేసినట్లు తెలిపింది. క్వాల్కామ్ కంపెనీ సీనియర్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేట్ టిబ్బిట్స్ ఈ నిర్ణయాన్ని ట్వీటర్ వేదికగా వెల్లడించారు. "ఇది తప్పు. @Qualcomm ఉక్రెయిన్'లో దురాక్రమణ చేయకుండా శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మేము ఉక్రేనియన్ ప్రజలకు మద్దతుగా అందించే విరాళం, తమ ఉద్యోగులు అందిస్తున్న విరాళాలకు సమానంగా ఉంటుంది. మేము అమెరికా చట్టాలు & ఆంక్షలను పాటిస్తున్నాము. రష్యన్ కంపెనీలకు మా కంపెనీ ఉత్పత్తులను విక్రయించడం లేదు" అని నేట్ టిబ్బిట్స్ అన్నారు. ఈ ట్వీట్'ని రిట్వీట్ చేస్తూ "మీ కంపెనీ @Qualcomm ఉత్పత్తులను రష్యాకు విక్రయించనందుకు ధన్యవాదాలు. @NateTibbits మాకు సహాయం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్వాల్కామ్ సహాయం చేయాలనుకుంటే ఉక్రేనియన్ రక్షకుల కోసం శాటిలైట్ ఫోన్లను పంపవచ్చు. దీని వల్ల సైనికులు సమాచార బదిలీ వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది." అని ఫెడోరోవ్ అన్నారు. (చదవండి: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?) -
పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించిన బైడెన్
-
Kamala Harris: ఉక్రెయిన్‌పై కమలా హ్యారిస్ ట్వీట్.. దుమారం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో వేసిన ఓ ట్విటర్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో భాగమేనంటూ అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన ఆమె.. కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ, ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో యూరప్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పోల్యాండ్ వెళ్లిన ఆమె.. అక్కడి ప్రెసిడెంట్ అండ్ర్‌జెజ్ డూడాతో రష్యా దురాక్రమణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పోల్యాండ్ అధికారులకు, పోల్యాండ్లోని అమెరికా రక్షణ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేసి.. ఉక్రెయిన్ వెంట అమెరికా ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్లో ఉక్రెయిన్, నాటో కూటమిలో భాగం అని అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్ట్‌కి నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో అసలు విషయం అర్థమైన ఆమె.. గంట తర్వాత ఆ ట్వీట్ తొలగించి.. మరో ట్వీట్ చేశారు. చివర్లో మరియు and అనే పదం చేర్చి మరోసారి ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే కమలా హారిస్ డిలీట్ చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్లు షేర్ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలికి వాస్తవ పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా లేదు. ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదకరమంటూ మాజీ భద్రతా అధికారి డెర్రిక్ కామెంట్ చేశాడు. ఈయనే కాదు.. వేలమంది యూజర్లు కమలా హారిస్ రాంగ్పోస్ట్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
తగ్గేదే లే.. ఐసీజే ఆదేశాల్ని తిరస్కరిస్తున్నాం!: రష్యా
ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ఒక ప్రకటన చేసింది. ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేయనుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు UN ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్‌లో ఉన్న తీర్పు మీదే ఉక్రెయిన్ భవితవ్యం ఆధారపడి ఉందన్నిక ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా. మరోపక్క శాంతి చర్చలపై స్పష్టత కొరవడి గందరగోళం నెలకొంది. ఇంకోవైపు రష్యా బలగాలు మెరెఫాలో స్కూల్ భవనాన్ని నాశనం చేశాయి. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. ఐసీజే ఆదేశాలివి.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. కానీ, రష్యా మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ (భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ) రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న కథనాలను మాస్కో వర్గాలు ఖండించాయి. సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న Mariupol థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తమ బలగాలు మరియూపోల్ భవనంపై దాడి చేయలేదని చెప్తున్నాయి. ఇంకోపక్క ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేలమంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ జనరల్‌స్టాఫ్ ప్రకటించారు. కొత్త గోడ ధ్వంసానికి సాయం చేయండి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ జర్మనీకి ఆసక్తికరమైన పిలుపునిచ్చారు. ఐరోపాలో రష్యా నిర్మిస్తున్న కొత్త గోడ ధ్వంసం చేయడంలో సహాయపడాలని కోరాడు. బుండెస్టాగ్ దిగువ సభ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసగించిన జెలెన్స్కీ.. భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. ఇక శాంతి చర్చలపై స్పష్టత కొరవడింది. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఊహూ అంటోంది. -
భారత్‌పై ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు! ఇక బాదుడేనా?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం భారత్ నుంచి కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్రంగా ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ లోక్‌లోభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఫార్మా సూటికల్స్, టెలికం పరికరాలు, టీ, కాఫీ, సముద్ర ఉత్పత్తులపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోందని అన్నారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే... ► యుద్ధం వల్ల దేశంలో కూడా కొన్ని నిత్యావసర వస్తువుల సరఫరాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి ఉంది. సమస్య నుంచి బయటపడ్డానికి సంబంధిత వర్గాలపై నిరంతరం సంప్రదింపులు నిర్వహిస్తున్నాం. సన్‌ఫ్లవర్ సహా వంటనూనెల సరఫరాలు తగిన విధంగా ఉండడం, ధరల కట్డడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► యుద్ధానంతర పరిస్థితిపై ఇప్పుడే మరింత ఖచ్చితమైన అంచనాలకు రాలేం. ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. సవాలు అంచనాకు ప్రస్తుతం ఈ అనిశ్చితి తొలగిపోయి, పరిస్థితి స్థిరపడాల్సి ఉంటుంది. ► భారతదేశం నుండి రష్యాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువుల్లో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, ఇనుము, ఉక్కు, టీ, రసాయనాలు ఉన్నాయి. అయితే దిగుమతులలో పెట్రోలియం, ముత్యాలు, పాక్షిక విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, వంట నూనెలు ఉన్నాయి. ► ఉక్రెయిన్‌కు భారతదేశం ఎగుమతులలో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, వేరుశెనగ, సిరామిక్, ఇనుము, ఉక్కు ఉన్నాయి. దిగుమతుల్లో వంట నూనెలు, ఎరువులు, ఇన్కార్బానిక్ రసాయనాలు, ప్లాస్టిక్, ప్లైవుడ్, దాని అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి. ► కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) రూపొందించడానికి సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా సంబంధిత వర్గాలతో పలు సమావేశాల నిర్వహణ జరిగింది. వారి సూచనలు, సలహాలను పూర్తి స్థాయిలో కేంద్రం పరిశీలిస్తుంది. ► భారత్ 2021–22లో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్సి సాధిస్తుంది. ► 2021 ఏప్రిల్–జనవరి 2022 మధ్య వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు (పాడి, పాల ఉత్పత్తులతో సహా) 25 శాతంపైగా వృద్ధితో 40.87 బిలియన్లకు పెరిగాయి. ► రబ్బర్ పరిశ్రమ పురోగతికి చట్ట సవరణ. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు నితిన్ గడ్కరీ శుభవార్త! -
Ukraine Russia Conflict: ముంచుకొస్తున్న కొరత!.. మేలుకోకుంటే అనర్థమే
Russia-Ukraine War: ప్రపంచ ఎరువుల కొరతకు రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం ఆజ్యం పోయనుందని ప్రముఖ వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, వంటచమురు ధరలకు రెక్కలు వచ్చాయి. త్వరలో ఈ ప్రభావం ప్రపంచ ఆహార వ్యవస్థపై పడుతుందని ఆందోళనలున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడుతుందని, దీంతో ఒక్కమారుగా వీటి ధరలు పెరిగి పంట ఉత్పత్తి భారీగా క్షీణిస్తుందని జాన్ హామండ్, వైయోర్గోస్ గడ్నాకిస్ అనే ఆహార శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణంలోని నత్రజనిని హైడ్రోజన్‌తో సంయోగం చెందించడం ద్వారా అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఎరువుల ఉత్పత్తిలో అమ్మోనియాది కీలక స్థానం. అమ్మోనియా తయారీకి భారీగా శక్తి అవసరపడుతుంది. అంటే ఇంధన ధరల పెరుగుదల అమ్మోనియా ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే అమెరికాలో అమ్మోనియం నైట్రేట్ ధర టన్నుకు 650 నుంచి వెయ్యి డాలర్లకు పెరిగింది. ఇంతవరకు ఒక్క కిలో నైట్రోజన్ ఎరువు వాడిన పొలంలో సుమారు 6 కిలోల దిగుబడి వస్తే ఖర్చులు పోను లాభం మిగిలేది. కానీ ఎరువు ధర పెరగడంతో ఇప్పుడు లాభం రావాలంటే ఒక్క కిలో ఎరువు వాడకానికి 10 కిలోల పంట రావాల్సిఉంటుందని అంచనా. అలాగని ఎరువులు తక్కువగా వాడితే దాని ప్రభావం దిగుబడి, నాణ్యతపై పడుతుంది. ఈ పరిస్థితి రైతును అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తోందని జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: జపాన్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ వచ్చే సీజన్ నుంచి ప్రభావం ఉక్రెయిన్ సంక్షోభ ఫలితంగా ఇంధన ధరలు పెరిగిన ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై వచ్చే పంట సీజన్లో కనిపిస్తుందని పరిశోధకుల అంచనా. అప్పటికి ముందే కొనుగోలు చేసిన ఎరువులు రైతుల వద్ద అయిపోవడంతో కొత్తగా ఎరువుల కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పటికి ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగి ఉంటాయి. దీనివల్ల రైతు తక్కువగా ఎరువులు కొనుగోలు చేయడం జరగవచ్చని, ఇది కమతంలో పంట దిగుబడి తగ్గడానికి దారితీస్తుందని జాన్ విశ్లేషించారు. ప్రపంచ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్ధాల సరఫరా అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి జరుగుతుంది. యూరప్‌లో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారైన యారా కంపెనీ అవసర ముడిపదార్థాలను ఉక్రెయిన్ నుంచి కొం టుంది. సంక్షోభం కారణంగా ఉక్రెయిన్ పతనమవ డం, రష్యాపై ఆంక్షలు విధించడం ముడిపదార్ధాల సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. బెలారస్, రష్యాలు ప్రపంచ పొటాషియం ఉత్పత్తిలో మూడోవంతును ఉత్పత్తి చేస్తున్నాయి. ఎరువుల తయారీలో పొటాషియం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: దాడులు ఆపండి.. రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు ఆహార భద్రత ఎరువుల ఉత్పత్తి తగ్గడం తత్ఫలితంగా ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గడం కలిసి అంతిమంగా ప్రపంచ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయని జాన్, వైయోర్గోస్ అంచనా వేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ ఆహార భద్రత విషమంగా మారింది. 2019లో ప్రపంచ జనాభాలో 9 శాతం మంది కరువు కోరల్లో ఉన్నారు. కరోనా ప్రభావంతో వీరి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఎరువుల కొరత కారణంగా ప్రపంచ ఆకలి కేకలు మరింతగా పెరగనున్నాయి. ప్రభుత్వాలు తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే చాలామంది కరువు రక్కసికి బలికాక తప్పదని నిపుణుల హెచ్చరిక. ప్రజలను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు ముందుగా మేలుకొని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టడం, దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడం, పేదరిక రేఖకు దిగువన ఉన్నవారికి తగినంత ఆహార భద్రత కల్పించడం, సరిపడా ఆహారధాన్యాలను సమీకరించి నిల్వ చేసుకోవడం తదితర చర్యలు చేపట్టాలని సూచించారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
మాదేశానికి రండి..వద్దు.. ఇక్కడే చదవండి
సాక్షి, హైదరాబాద్: యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రష్యా దాడుల నేపథ్యంలో అర్ధంతరంగా భారత్‌కు చేరుకున్న విద్యార్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు, వారిని ఆకర్షించేందుకు ఉక్రెయిన్ పొరుగుదేశాలు ప్రయత్నిస్తోంటే, మరోవైపు వారిని నిలబెట్టుకునేందుకు ఉక్రెయిన్ యూనివర్సిటీలు కృషి చేస్తున్నాయి. బోధన మధ్యలోనే ఆగిపోవడాన్ని అదనుగా చేసుకుని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, పోలండ్, జార్జియా, అర్మేనియా, రుమేనియాల్లోని మెడికల్ కాలేజీలు ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులకు వల వేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఆగిపోయిన చదువును తమ దేశాల్లో పూర్తి చేయాలంటూ తమ ఏజెంట్ల ద్వారా కోరుతున్నా యి. ‘రుమేనియాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మూడో ఏడాది ఎంబీబీఎస్ తమ దేశంలో తక్కువ ఫీజుతో చేయమంటూ ఏజెంట్ చెప్పాడు’అని కూకట్‌పల్లికి చెందిన ఉక్రెయిన్ వైద్య విద్యార్థిని దివ్య తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే సమయంలోనే భారత విద్యార్థుల వివరాలను కొంతమంది సేకరించారు. ‘మా కాలేజీతో సంబంధం లేని వాళ్లు అప్పుడు మా ఫోన్ నంబర్లు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. వారం రోజులుగా వాళ్లు ఫోన్ చేస్తున్నారు. హంగేరీలో మిగతా విద్య పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు’అని బోరబండలో ఉంటున్న స్వాతి చెప్పింది. హడావుడిగా ఆన్లైన్: ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు వల వేయడంతో ఉక్రెయిన్ కాలేజీలు హడావుడిగా ఆన్లైన్ మంత్రం అందుకుంది. బొకోవినియా స్టేట్ మెడికల్ కాలేజీ గూగుల్ మీట్ ద్వారా ఇప్పటికే వర్చువల్ క్లాసులు ప్రారంభించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, అవి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని మలక్‌పేటలో ఉంటున్న వైద్య విద్యార్థిని రూపా శ్రీవాణి చెప్పారు. యుద్ధం రాకపోతే ఈపాటికి సిలబస్ చాలా వరకూ పూర్తవ్వాల్సి ఉందని, జూన్‌లో రెండో సెమిస్టర్‌కు వెళ్లేవాళ్లమని వారన్నారు. కీలకమైన నాల్గో సంవత్సరంలో ఇంటర్నల్ మెడిసిన్, నరాల సంబంధిత సబ్జెక్టుల ప్రాక్టికల్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. కానీ థియరీ మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఎక్కువ మంది వాపోతున్నారు. అనాటమీ కేవలం పుస్తకాల్లోని పాఠాల ద్వారా నేర్చుకుంటే ఎలా బోధపడుతుందని ప్రశ్నిస్తున్నారు. వేరే చోట విద్య ఎలా?: ఉక్రెయిన్ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్లంలోనే విద్యాభ్యాసం ఉంటుంది. విద్యార్థులు తేలికగా సబ్జెక్టు అర్థం చేసుకునే వీలుంది. అదేవిధంగా అక్కడ ఫ్యాకల్టీతో లోతుగా తమ భావాలు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉక్రెయిన్ పొరుగు దేశాలు చాలావరకూ స్థానిక భాషను అనుసరిస్తున్నాయి. దీనివల్ల హంగేరీ, జార్జియా, పోలండ్ తదితర దేశాల్లో వైద్య విద్య చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈలోపాన్ని గుర్తించిన పొరుగు దేశాల కాలేజీలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు కొత్త ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తామంటూ గాలం వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొంతమంది అక్కడ ప్రవేశాలు పొందారు. ఆన్లైన్ అరకొరే: పి.దీప్తి (బొకోవినియన్ స్టేట్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని) నాల్గో సంవత్సరం వైద్య విద్య బోధన ఈ మధ్యే ఆన్లైన్లో మొదలుపెట్టారు. ఈ ఏడాది కీలకమైన సబ్జెక్టులుంటాయి. ప్రాక్టికల్స్‌తో నేర్చుకుంటే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో రోజుకు గంట మాత్రమే చెబుతున్నారు. ప్రత్యక్ష బోధనతో పోలిస్తే వైద్య విద్యకు ఆన్లైన్ ఏమాత్రం సరిపోదు. సరిహద్దు దేశాలు ఆకర్షిస్తున్నాయి: రాజు (ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, హైదరాబాద్) ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు తాజా పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ బోధన అనుకున్న స్థాయిలో లేదు. అక్కడి భాషను విద్యార్థులు ఇప్పటికిప్పుడు అర్థం చేసుకోవడమూ కష్టమే. అయితే, ఇవేవీ ఆలోచించకుండానే కొంతమంది చేరుతున్నారు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే విద్యార్థులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. -
రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..! A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda." She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa — The New York Times (@nytimes) March 16, 2022 ‘ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్ డీల్.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా -
రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!
రష్యాలో పెట్టుబడులు, వ్యాపారాలు నిలిపేస్తాం అంటూ కొన్నాళ్ల కిందట అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్’ సీఈవో అల్బర్ట బౌర్లా స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా కంపెనీల్లాగే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ నిర్ణయంలో పెద్ద మార్పే వచ్చింది ఇప్పుడు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు పారిశ్రామిక దిగ్గజాలు వరుస షాకులు ఇస్తున్నాయి. మెజారిటీ కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా రష్యాలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించిన ఔషధ తయారీ దిగ్గజం ఫైజర్ ఆపై ఓ కీలక ప్రకటన చేసింది. మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఇప్పుడు వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఫైజర్ సీఈవో వెల్లడించారు. ‘‘రష్యాలో మందుల కొరత ఏర్పడింది. ఈ తరుణంలో మేం మానవతా కోణంలో ఆలోచించాలి. అందుకే వ్యాపారం కొనసాగించాలనుకుంటున్నాం. మందులు పంపిస్తాం. అయితే.. రష్యాలో వచ్చే మొత్తం లాభాలను మాత్రం ఉక్రెయిన్‌కే సాయంగా అందిస్తాం. అంతేకాదు... రష్యాకు మందుల వరకు సరఫరా చేసినప్పటికీ.. అక్కడ నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ మాత్రం నిలిపివేస్తాం. ఇకపై రష్యాతో కొత్త ఒప్పందాలుండబోవ్’’ అని ఫైజర్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలతో పాటుగా మెజారిటీ సంస్థలు తప్పుబడుతున్నాయి. అందుకు నిరసనగా రష్యాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా కూడా మెజారిటీ దేశాలు, సంస్థలు ప్రకటించాయి. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ మాత్రం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే.. రష్యాలో వచ్చే లాభాలను ఉక్రెయిన్‌కు సాయంగా ప్రకటిస్తామని కొత్త తరహాలో ప్రకటన చేయడం రష్యాకు షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. -
వల్లకాడుగా మారిన కీవ్ నగరం! (ఫొటోలు)
-
ఈ సంక్షోభానికి అసలు మూలం
ఈరోజు ప్రపంచం మొత్తం పుతిన్ గురించి మాట్లాడుతోంది. కానీ రష్యాలో పాతుకుపోయిన సనాతన మతతత్వమే అసలు సమస్య. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా అక్కడి సనాతన మతం వ్యతిరేకిస్తోంది. ఈ రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక పునాదే నేడు పుతిన్‌ను ఇలా తయారు చేసింది. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల మత ఛాందసవాదాలతో తలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, ఉదారవాద మత ప్రపంచం తమ ప్రజాస్వామ్యం, లౌకికవాదాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించక తప్పదు. ఆధునిక కాలాల్లో పాలకవర్గ రాజకీయ శక్తులు తీవ్రమైన మత లేదా మత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలడం అత్యంత ప్రతికూల పరిణామాలను తీసుకొస్తుంది. రష్యన్ అనుభవం దీన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు దశ సంపూర్ణంగా మత వ్యతిరేకతతో కూడుకుంది. కమ్యూనిస్టు పాలనలో భయంకరమైన బాధలకు గురైన సనాతన చర్చితో ఇప్పుడు పుతిన్ రష్యా ప్రగాఢంగా ముడిపడివుంది. 20వ శతాబ్ది ప్రారంభం నుండి రష్యన్ సమాజం, ప్రభుత్వం– రెండూ మత సమస్యపై అత్యంత తీవ్రమైన వైఖరులను తీసుకున్నాయి. బోల్షివిక్ విప్లవం తర్వాత రష్యాలో మత వ్యతిరేక ప్రచారం ఎంత తీవ్రంగా సాగిందంటే, చర్చికి సంబంధించిన చిహ్నాలు, భవనాలను కూల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అప్పటికీ మతస్ఫూర్తితో ఉంటున్నందున ప్రజలందరూ నాస్తికత్వాన్ని పాటించాలని కమ్యూనిస్టులు భావించేవారు. ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్... మతాచరణను రాజ్యవిధానంగా నమ్మాలని ప్రజలను బలవంతపెడుతున్నారు. రష్యన్ సనాతన చర్చి ప్రామాణికమైన పితృస్వామిక వ్యవస్థ నేతృత్వంలో ఉండేది. ఇది రోమన్ కేథలిక్ మతతత్వానికి భిన్నమైనది. అందుకే పుతిన్ నిరంకుశ వ్యవస్థను పూర్తిగా సమర్థించడం, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని బలపర్చడమే కాకుండా యుద్ధానికి అవసరమైన బలగాలను కూడా ఇది సమీకరించింది. రష్యన్ చరిత్ర, జాతీయత పట్ల సనాతన చర్చి వ్యాఖ్యానం సరిగ్గా ఇతర ఆధ్యాత్మిక మతతత్వాలను అచ్చుగుద్దేలా ఉంటుంది. మతం అనేది జాతిని నిర్వచించే కీలక వనరుగా మారిపోయినప్పుడు ప్రతి అంశంలోనూ ఛాందసవాదం పాతుకుపోతుంది. రష్యాలో ఉక్రెయిన్ భాగమని రష్యన్ సనాతన మతబోధకులు నమ్ముతారు. ఎందుకంటే రష్యన్ సనాతన చర్చి ప్రస్తుత ఉక్రెయిన్ ప్రాంతంలో 10వ శతాబ్దంలో పుట్టింది. సెయింట్ ఆండ్రూస్ కీవన్ రస్ ప్రాంతంలో తొలి చర్చిని నెలకొల్పినట్లు చెబుతారు. అదే ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరుతో చలామణిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, బెలారస్లను సనాతన అఖండ రష్యాగా చెప్పేవారు. దీనికీ... ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను సనాతన హిందూ ప్రాంతాలుగా గుర్తిస్తూ అఖండ భారత్ గురించి ఆరెస్సెస్ నేతలు చెప్పేదానికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు. సోవియట్ యూనియన్ శాంతియుతంగా విచ్ఛిన్నమైపోవడం ఆమోదించకూడదనీ, కనీసం సనాతన చర్చి కేంద్రంగా ఉన్న రష్యాను ఎలాగైనా సరే మళ్లీ ఐక్యపర్చాలనీ భావిస్తున్న సనాతన మతబోధకుల నుండి పుతిన్ ఈ థియరీని తీసుకొచ్చారు. సనాతన చర్చిలో కూడా అసమ్మతివాదులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ చాలావరకు సనాతన నేతలు పుతిన్‌తో ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంగా పుతిన్ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య ఒక్క పుతిన్ మాత్రమే కాదు. మొత్తం సనాతన మతతత్వానికి చెందిన మత జాతీయతే అసలు సమస్య. రోమన్ కేథలిక్ చర్చితో సనాతన రష్యన్ చర్చి విభేదించడంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన ప్రొటెస్టెంట్ చర్చితో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సనాతన చర్చి మద్దతుతో పుతిన్ రష్యాకు ఎదురులేని నేతగా మారిన తర్వాత రష్యాలోని రోమన్ కేథలిక్కులపై హింసాత్మకంగా దాడి చేయడం మొదలైంది. గర్భస్రావాలపై, స్వలింగ వివాహాలపై రోమన్ చర్చి కాస్త ఉదారవాద దృక్పథం తీసుకోవడమే కాకుండా ఉదారవాద డ్రెస్ కోడ్‌ను కూడా పాటిస్తూ వచ్చింది. దీంతో ఇవన్నీ పాశ్చాత్య ప్రపంచ ఆధునికానంతర దశలో చొచ్చుకువచ్చిన అనైతిక విధానాలుగా సనాతన చర్చి భావించేది. పాశ్చాత్య ఉదారవాదులను సనాతనవాద రష్యన్లు తమ శత్రువులుగా భావించేవారు. అయితే రష్యన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని దీని అర్థం కాదు. కమ్యూనిస్టు దశలో శ్రామికవర్గ నియంతృత్వ భావన రష్యన్ ప్రజల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం కలిగించింది. కమ్యూనిస్టు పాలనలో వారి అనుభవం వల్ల కావచ్చు. ప్రత్యేకించి సనాతన భావాలు కలిగినవారు సనాతన నిరంకుశ రాజకీయ పాలననే గట్టిగా విశ్వసిస్తున్నారు. నేటి రష్యాను ఆధ్యాత్మిక రాజ్యంగా మనం పిలవలేనప్పటికీ పుతిన్ వంటి స్వార్థ కాంక్షగల పాలకులు ఇలాంటి సనాతన వాతావరణాన్ని క్రమేపీ ఆధ్యాత్మిక నిరంకుశత్వంలోకి సులువుగా తీసుకుపోతారు. ఉదారవాదం, లౌకికవాదం రెండూ ప్రమాదకరమైన సిద్ధాంతాలని రష్యన్ సనాతనవాదులు నమ్ముతున్నారు. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా సనాతన చర్చి వ్యతిరేకిస్తోంది. పుతిన్ మితవాద నిరంకుశత్వం చాలా ఉపయోగకరమని ఇలాంటి జాతీయవాద ప్రాపంచిక దృక్పథాలు భావిస్తున్నాయి. తమ పొరుగున ఉన్న ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యం తమ మితవాద, లాంఛనప్రాయమైన ఎన్నికలతో కూడిన నిరంకుశత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సనాతన చర్చి భావిస్తోంది. చైనా తరహా మార్కెట్ కమ్యూనిజాన్ని రష్యన్లు కోరుకోవడం లేదు. కమ్యూనిస్టు వ్యవస్థలు ప్రజల ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తిని నిర్మూలించడమే కాకుండా ప్రజాజీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తూ రావడంతో... ప్రభుత్వమూ, మతమూ ఒకటిగా కలిసిపోయి ఉండే తరహా నియంతృత్వాన్ని రష్యన్ సనాతనవాదులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, మతాన్ని విడదీయడానికి ఆస్కారమే లేని ఈ వ్యవస్థే పుతిన్‌ను సంపూర్ణంగా బలపర్చింది. చాలావరకు ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక నిరంకుశ రాజ్యవ్యవస్థలలోనే నడుస్తుంటాయి. కానీ ఇవి లౌకికవాదంతో ఘర్షణ పడవు. అఫ్గాన్ తాలిబనిజం ఒక్కటే అత్యంత తీవ్రరూపంలోకి మళ్లింది. మతం, రాజ్యవ్యవస్థ కలగలిసిన నిరంకుశత్వం... విభిన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలను కొనసాగించదలుస్తున్న పొరుగుదేశాలతో యుద్ధాలు కోరుకుంటుంది. సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలిన తర్వాత ప్రపంచం తిరిగి సోషలిస్టు పూర్వ ఘర్షణల స్థాయికి చేరుకుంది. రష్యాలో ప్రజాస్వామిక సంక్షేమ జాతీయవాదం కాకుండా ఆధ్యాత్మిక జాతీయవాదమే జాతి కార్యాచరణను నిర్ణయిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం రష్యాను ఒక ధూర్తదేశంగా వర్ణిస్తున్నప్పటికీ తమపై ఈ ముద్రను ఆధ్యాత్మిక జాతీయవాదం లెక్కచేయదు. క్రిస్టియన్ ప్రపంచంలో ఈ దిశను రష్యా ఇప్పుడు చూపిస్తున్నట్లుంది. ఉక్రెయిన్ కూడా ప్రభుత్వాన్ని, చర్చిని నామమాత్రంగా మాత్రమే విడదీసే ప్రజాస్వామిక నమూనాను ఆమోదించే సనాతన క్రిస్టియానిటీని కలిగి ఉన్నది కనుక ఈ యుద్ధంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల ఆధ్యాత్మిక ఛాందసవాదాలతో తలపడుతోంది. భారతదేశంలో హిందుత్వశక్తులు పదేపదే తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనీ, రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నామనీ చెప్పుకుంటున్నప్పటికీ, మతపరమైన ఛాందసవాదం ఈ శక్తులను ఏవైపునకు తీసుకుపోతుందనేది చెప్పలేం. మతమనేది ప్రభుత్వ పాలనతో కలిసిపోయాక, ఒక పాలకుడు జీవితకాల పాలకుడిగా మారాలని అభిప్రాయానికి వచ్చాక, మతపర శక్తులు పౌరసమాజాన్ని దూకుడుగా నియంత్రిస్తాయి. ఎన్నికల వ్యవస్థను కూడా తారుమారు చేసినప్పడు ఏ వ్యవస్థ అయినా నియంతృత్వంలోకి వెళ్లి తీరుతుంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, క్రిస్టియన్ ప్రపంచం తమ జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాద తత్వాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించడం ఖాయం. ప్రొ‘‘ కంచ ఐలయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త షెపర్డ్ -
గూగుల్ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ!
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో రష్యాకు ధీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దిగ్గజ టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ గూగుల్.. యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ టెక్నికల్ అంశాలను సాకుగా చూపించి రష్యాలో గూగూల్ ప్లే స్టోర్, యూట్యూబ్ పేమెంట్స్ ఆధారిత అన్ని సేవలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్యన్లు గూగుల్ ఆధారిత పెయిడ్ సబ్ స్క్రిప్షన్లను కొనుగోలు చేయలేరు. షాపింగ్ చేయలేరు. గూగుల్ కాకుండా వేరే సెర్చ్ ఇంజిన్లు రష్యాలో సేవలు కొనసాగిస్తున్నాయి. కానీ గూగుల్ మించిన సర్వీసులు లేకపోవడం గూగుల్ నిర్ణయం ఆదేశ ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే టెక్ కంపెనీలు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ సేవల్ని నిలిపివేశాయి. ఆర్దిక సంస్థలైన పేపాల్,వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లు సర్వీసుల్ని ఆపేశాయి. తద్వరా రష్యాకు ఆర్ధిక సంక్షోభం తలెత్తనుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్! -
దేశ భద్రత పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
-
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్‌ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్‌కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్‌కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్‌కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్‌లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్‌ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో భారత్ ఎకానమీ ఢమాల్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చి 31వ తేదీతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో అంచనావేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొన్న నివేదిక, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని వివరించింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు ఎకానమీకి తీవ్ర ప్రతికూల అంశాలని పేర్కొంది. ప్రత్యేకించి క్రూడ్ ధరల తీవ్రతను ప్రస్తావించింది. ‘ఇండియా అవుట్‌లుక్, ఫిస్కల్ 2023’ పేరుతో రూపొందించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను విశ్లేషిస్తే... ► కోవిడ్–19 మహమ్మారికి సంబంధించి మూడవవేవ్ ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేకపోవడం ఎకానమీకి లాభించింది. అయితే తద్వారా లభించిన ప్రయోజనం ఎకానమీకి ఏదైనా ఉందంటే, అది ఉక్రెయిన్‌పై రష్యా దాడి నుండి ఉత్పన్నమైన భౌగోళిక రాజకీయ కలహాల ద్వారా నీరుగారిపోయే పరిస్థితి తలెత్తింది. యుద్ధం ప్రపంచ వృద్ధి మందగమనానికి దారితీసే అంశం. చమురు సంబంధిత ఉత్పత్తుల ధరలు దీనివల్ల భారీగా పెరుగుతాయి. ప్రపంచ వృద్ధికి పొంచిఉన్న సవాళ్లలో ఇది తీవ్రమైనది. ఇది దేశీయ ఎకానమీపై కూడా తీవ్ర ప్రతికూలత చూపుతుంది. ► ప్రైవేటు వినియోగం ఇంకా బలహీనంగానే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ద్రవ్యపరమైన మద్దతు కూడా అంతగా లేదు. ► రిటైల్ద్రవ్యోల్బణం విషయానికొస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.4 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. అయితే దీనికి ముడి చమురు ధర సగటు బ్యారల్‌కు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండాలి. గత సంవత్సరం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపులను పరిగణనలోకి తీసుకోవాలి. ► చమురు ధరల తీవ్రత దీర్ఘకాలం కొనసాగితే ఎకానమీ పురోగతికి తీవ్ర విఘాతం కలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ గత జరిగిన జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2022–23లో క్రూడ్ బ్యారల్ ధర 75 డాలర్లగా లెక్కించి, ఈ ప్రాతిపదిన బడ్జెట్ రూపకల్పన జరిగింది. భౌగోళిక ఉద్రిక్తతలు ఈ అంచనాలను దెబ్బతీయవచ్చు. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక విధానాల అమల్లో కొంత దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించే పథకాల ప్రకటన, ఆహార సబ్సిడీలకు కేటాయింపులను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన వర్గానికి ఈ చర్యలు దోహదపడతాయి. అలాగే ఈ చర్యల వల్ల ప్రైవేట్ వినియోగ డిమాండ్ స్థిరంగా పురోగమిస్తుంది. ► ముడి చమురు ధరల తీవ్రత వల్ల, దిగుమతుల భారం పెరిగి 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2.2 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ముడి చమురు ధరలో 10 డాలర్ల పెరుగుదల వల్ల క్యాడ్ 40 బేసిస్ పాయింట్లు (జీడీపీలో) పెరుగుతుంది. కార్పొరేట్ రంగం ఇప్పటికి సానుకూలం రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ప్రకారం, చమురు ఎక్కువ కాలం పాటు బ్యారెల్‌కు 100 డాలర్లకు మించి కొనసాగితే ఎకానమీలోని పలు విభాగాలపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. పలు భారత్ కంపెనీల నిర్వహనా లాభాలు భారీగా పడిపోతాయి. ఇప్పటి వరకూ పరిస్థితిని పరిశీలిస్తే, దాదాపు 700 దేశీయ కంపెనీల స్థూల ఆదాయాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండవ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా రంగాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలు, ఇతర ఊహించని సంఘటనలు ఎదురుకాకుంటే, 2022–23లో ఆర్థిక రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉంటుంది. 10 నుంచి 14 శాతం కార్పొరేట్ ఆదాయ వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) వంటి పథకాలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన త్రైమాసికంలో పారిశ్రామిక మూలధన పెట్టుబడులు రూ.3 నుంచి 3.5 లక్షల కోట్లు ఉంటే, 2025–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ శ్రేణి రూ.4 నుంచి 4.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతదేశ పెట్టుబడి దృష్టి ఇప్పుడు గ్రీన్ (పర్యావరణ అనుకూల) క్యాపిటల్ వ్యయం వైపు మళ్లుతోంది. 2023 నుండి 2030 ఆర్థిక సంవత్సరం మధ్య వార్షికంగా రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఈ విభాగాలపై వ్యయం ఉంటుందని అంచనా. ఈ కాలంలో వార్షికంగా మొత్తం పెట్టుబడులలో దాదాపు 15–20 శాతం మౌలిక, పారిశ్రామిక రంగాల్లో ఉంటాయని భావిస్తున్నాం. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ దెబ్బ!! -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ దెబ్బ!!
అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం ఉంటుందని అంచనావేసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.9 శాతానికి తగ్గిస్తున్నట్లు (8.4 శాతం నుంచి) పేర్కొంది. చమురు ధరల తీవ్రత దేశంలో సవాళ్లకు దారితీస్తుందని పేర్కొంది. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిలోనే 6 శాతంగా కొనసాగుతుందని విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశానికి అంతర్జాతీయంగా సవాళ్లను తెచ్చిపెడతాయని, ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్టంభన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయని విశ్లేషించింది. రికవరీ కొనసాగినా అది బలహీనంగా ఉంటుందని పేర్కొంది. కరెంట్ అకౌంట్ లోటు పదేళ్ల గరిష్టం 3 శాతానికి (జీడీపీలో) పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరమే సరళతర ఆర్థిక విధానానికి ముగింపు పలకవచ్చని, ఏప్రిల్ లేదా జూన్ విధాన సమీక్షలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (వరుసగా 10 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా 4 శాతంగా కొనసాగుతోంది) పావుశాతం వరకూ పెంచే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో సరళతర ఆర్థిక విధానాలు మరెంతోకాలం కొనసాగించే పరిస్థితి లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా బడ్జెట్ అంచనావేయగా ఇది 6.9 శాతం వరకూ పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. చదవండి: Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే