మనవరాలితో బోరిస్ రోమన్‌చెన్‌కో
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
బోరిస్ రోమన్‌చెన్‌కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్‌వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు ఈయన. ఖార్కీవ్‌లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్‌చెన్‌కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది.
రోమన్‌చెన్‌కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్‌వాల్ద్ కాన్‌సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్‌సెంట్రేషన్ క్యాంప్‌లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్‌లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు.
Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్‌లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్‌వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్‌చెన్‌కో పాల్గొన్నాడు.
Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9
— Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022
నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్‌చెన్‌కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్‌కు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్‌చెన్‌కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment