survivor
-
తాగుడుకు బానిసైన టాలీవుడ్ హీరోయిన్.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)
-
సంచలనం రేపిన యువతి హత్య: కేసు వెనక్కి తీసుకోలేదని వెంటాడి.. వేటాడి ..!
లక్నో: కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై (ఇపుడు 19ఏళ్ల యువతి) లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపిన ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కౌషంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన కేసులో పవన్ నిందితుడు. బాధితురాలి (ఇపుడు హత్యకు గురైన) యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పటినుంచి కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబాన్ని, యువతిని వేధిస్తూనే ఉన్నాడు.దీనికి వారు ససేమిరా అనడంతో మరింత కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వ చ్చిన పవన్ ఎలాగైనా ఆమెను హత మార్చాలని పథకం వేశాడు. సరిగ్గా ఇదే సమయానికి మరో హత్య కేసులో నిందితుడిగా జైలుకెళ్లిన అతని సోదరుడు అశోక్ నిషాద్ కూడా బయటి కొచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి వారిని బెదిరించి, కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో పథకం ప్రకారం బాధిత యువతి పశువులను మేతకు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా, ఆమెపై దాడి చేశారు. అతి దారుణంగా వెంటాడి, వేటాడి గొడ్డలితో నరికి చంపేశారు. దీంతో స్థానికులు సైతం భయాందోళనకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు నిందితులను అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు. थाना महेवाघाट के ढेरहा गांव मे एक ही बिरादरी के दो पक्षों के बीच में पुरानी रंजिश और मुकदमेबाजी को लेकर आपस में विवाद हुआ जिसमे एक पक्ष के लोगों द्वारा दूसरे पक्ष की 20 वर्षीय युवती की धारदार हथियार से हमला कर हत्या कर दी गई है। प्रकरण में पुलिस अधीक्षक कौशाम्बी द्वारा दी गई बाइट pic.twitter.com/ve8TBRw5jv — KAUSHAMBI POLICE (@kaushambipolice) November 21, 2023 యూపీలో నేరస్థులు రెచ్చిపోతున్నారని, వారికి ఎలాంటి చట్టాల పట్ల భయంగానీ, గౌరవంగానీ లేదంటూ యూపీ కాంగ్రెస్ మండిపడింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ చీకటి నగరానికి వెలుగెన్నడు ఇంతట అధ్వాన్న స్థితిలో ఆడపిల్లలు స్వేచ్ఛా వాయువులు ఎపుడు పీల్చుకో గలుగుతారు? అంటూ అందోళన వ్యక్తం చేసింది. कौशाम्बी में सरेआम दो दरिंदों ने युवती की कुल्हाड़ी से काटकर हत्या कर दी। इनमें से एक दरिंदा हत्या के मामले में अभी 2 दिन पहले ही जमानत पर बाहर आया था। तो दूसरा इसी मृतक युवती के रेप का आरोपी था। UP में दरिंदे इस कदर बेखौफ़ हैं कि उनके मन में किसी कानून का कोई भय नहीं। कोई… pic.twitter.com/P5eligfE6T — UP Congress (@INCUttarPradesh) November 21, 2023 ఇది ఇలా ఉంటే ఈ ఘటన యూపీలో మహిళలు, యువతుల భద్రతను మరోసారి చర్చకు తెచ్చింది. ఆడబిడ్డలకు రక్షణలేకుండాపోయిందని కాంగ్రెస్ మండిపింది. మహిళలను వేధించిన వారిపై యమ్‌రాజ్ ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకుంటాడని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేసిన రెండు నెలల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. ఎన్సీఆర్బీ డేటా 2021 ప్రకారం యూపీలో మహిళలపై 56వేలకు పైగా నేరాలు నమోదు కాగా, వీటిల్లో అత్యాచారం, మర్డర్, యాసిడ్ దాడులు ఎక్కువగా ఉండటం గమనార్హం. -
సూరత్‌లో బాలుడి వీరగాథ.. సముద్రంలో గల్లంతై..
సూరత్: వినాయక నిమజ్జనాల సందర్బంగా గుజరాత్‌లోని సూరత్‌లో అద్భుతం జరిగింది. నిమజ్జనం సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన టీనేజి బాలుడు 24 గంటలపాటు జీవన్మరణ పోరాటం చేసి చివరికి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. ప్రతి ఏటా జరిగినట్లే ఈ యేడు కూడా వినాయాక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడు అనంతరం గంగాదేవి ఒడిలో ఒదిగిపోయాడు. అయితే ఉత్సవాల సందర్బంగా సూరత్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి భక్తుల్లాగే నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు డుమాస్ బీచ్‌కు తన బామ్మ, సోదరుడు సోదరితో కలిసి వెళ్ళాడు. అందరిలాగే ఆ సంబరాల్లో ఉన్న లఖన్‌ను సముద్రంలోని అలలు లోపలి లాక్కెళ్లిపోయాయి. లఖన్ దేవీపూజక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన తర్వాత అతని అమ్మమ్మ అక్కడి వారిని సాయమడగటంతో కొంతమంది యువకులు సహాయం చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగడంతో గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలుడు గల్లంతై 24 గంటలు దాటడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. కానీ ఆ గణనాధుని చల్లని దయ వలన బాలుడు నడిసంద్రంలో నిమజ్జనం చేసిన ఒక గణేశుడి ప్రతిమ కింద ఉండే చెక్కబల్లను పట్టుకుని రాత్రంతా నీటిపై తేలియాడుతూ అలాగే ఉన్నాడు. ఆ మరునాడు అటుగా వచ్చిన జాలరులు పడవ కనిపించడంతో చేతిని పైకి ఊపుతూ వారికి సైగ చేశాడు లఖన్. అది గమనించిన మత్స్యకారుడు రసిక్ తండేల్ బాలుడిని రక్షించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి కబురు పంపించారు. అప్పటికే బాలుడిపై ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు లఖన్ మళ్ళీ మృత్యుంజయుడై వారి కళ్లెదుట ప్రత్యక్షమవడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది కూడా చదవండి: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్ శుభ్రం చేయించిన ఎంపీ -
ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం మహా విషాదంగా మారింది. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. తాజాగా ప్రమాదం బారినపడిన విశాఖకు చెందిన ప్రత్యక్ష సాక్షి.. తమ ఘోర అనుభవాన్ని పంచుకున్నాడు. ఒడిశా దుర్ఘటన సమయంలో అసలేం జరిగిందో తమకు ఏం అర్థం కావడం లేదని అంటున్నాడు ప్రమాదంలో గాయపడిన లోకేష్. ఒకేసారి భారీగా శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు. చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చిందని బోగీలు పల్టీలు కొట్టాయని చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు 40 నిమిషాల పాటు ట్రైన్ లోనే ఉండిపోయామని తెలిపారు. అద్దాలను పగలగొట్టుకుని బయటికి వచ్చామని, స్థానికులు సకాలంలో స్పందించడంతో చాలామంది బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలములో చుట్టూ కారు చీకటి ఉందని, ట్రైన్ ప్రమాదం ఏ నది మీదో జరిగికుంటే మొత్తం ప్రయాణికులు అందరూ చనిపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా ముందే ఎంతో మంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు. ప్రమాదంలో నా ఇద్దరు పిల్లలు చనిపోయారు అనుకున్నాను. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి నా కుటుంబం బయటపడింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో నాకు, నా భార్యకు మెరుగైన వైద్యం అందుతుంది. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ముఖ్యమంత్రికి మేమందరం రుణపడి ఉంటాం’ అని తెలిపాడు. చదవండి: ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్ రైలు ఎక్కిన 30 మంది.. -
Odisha Rail Crash: ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న బాధితుల మాటలు
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగి ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించాయి. ప్రాణలతో బయటపడ్డ కొందరూ చెబుతున్న మాటలు వింటుంటూ అంత తేలిగ్గా ఆ విషాదాన్ని మర్చిపోలేరేమో అన్నంతగా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఘోర ప్రమాదం నుంచి బయటడ్డ బాధితులు తాము ఎలా సజీవంగా బయటపడ్డానో చెబుతుంటే ఆ దృశ్యం కళ్లముంగిట కదలాడినట్లుగా ఉంది. ఆ బాధితుడు అస్సాంకు చెందిన దీపక్ దాస్. తాను ప్రయాణిస్తున్న రైలు గూడ్సు రైలుని ఢీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో కోచ్‌లు బోల్తాపడ్డాయి. తాను విండో సీటు వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగానని. తాను ఆ సమయంలో కిటికీని గట్టిగా పట్టుకుని ఉన్నానని లేదంటే తాను కూడా చనిపోయే వాడినని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డ బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ..రైలు అకస్మాత్తుగా ఢీ కొన్న తర్వాత భారీ కుదుపు విన్నానని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గురించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందిందని, తనను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఆ ఘోర ప్రమాదానికి కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యం అని, తద్వారా రైళ్లను ఈ ట్రాక్‌పై యథావిధిగా నడిచేలా చేయొచ్చని అన్నారు. (చదవండి: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..) -
ఎటు చూసినా రక్తపు మడుగే:ఒడిశా ప్రమాద బాధితుడి ఆవేదన
తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు 13 కోచ్‌లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడు జనరల్ కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్డిఆర్ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్‌లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు. As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n — Anubhav Das (@anubhav2das) June 2, 2023 (చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ) -
టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..
ఇస్తాన్‌బుల్: తుర్కియే, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భూకంపం దాటికి ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడగా.. మరొకొందరు మాత్రం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. అయితే సోమవారం శిథిలాల కింద చికుక్కున్న 17 ఏళ్ల యువకుడు అద్నాన్ ముహమ్మెత్ కోర్కుట్ అనూహ్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. 94 గంటలపాటు శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడు గొంతు ఎండిపోకుండా తన మూత్రం తాగి బతికినట్లు భయానక విషయాలు వెల్లడించాడు. ఈ నాలుగు రోజులు ఎలా గడిచాయో స్వయంగా అతని మాటాల్లోనే.. 'సోమవారం ఇంట్లో నిద్రోపోయా. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లు కూలిపోయింది. నేను శిథిలాల కింద చిక్కుకున్నా. బయటకు రాలేని పరిస్థితి. సహాయక సిబ్బందికి నేను కన్పిస్తానే లేదో అని భయం వేసింది. నిద్రపోవద్దని ఫోన్లో ప్రతి 25 నిమిషాలకు అలారం పెట్టుకున్నా. రెండు రోజుల తర్వాత బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచాఫ్ అయింది. నాకు బాగా దాహం వేసినప్పుడు నా మూత్రమే తాగా. ఆకలి వేసినప్పుడు ఇంట్లోని పూలు తిన్నా. చివరకు 94 గంటల తర్వాత సహాయక సిబ్బంది నాకు కన్పించారు. కానీ నా మాటలు వారికి వినపడుతాయో లేదో అని ఆందోళన చెందా. శిథిలాలు తొలిగించేటప్పుడు నన్ను చూడకపోతే వాటి కిందే నలిగిపోతా అనుకుని భయపడ్డా. కానీ చివరకు నన్ను వారు చూసి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నన్ను కాపాడిన వాళ్లకి రుణపడి ఉంటా.' అని యువకుడు ఆస్పత్రిలో తన నాలుగు రోజుల నరకయాతన వివరించాడు. 📌Gaziantep'te 95.saatte 17 yaşındaki Adnan Muhammet Korkut enkazdan sağ olarak kurtarıldı. pic.twitter.com/fP4Bq1vseg — Şoreş Seven 7️⃣🐬🍃🕊🕊🕊H D P🕊🕊🕊 (@Sores1SevenHDP) February 10, 2023 తుర్కియే, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 24వేల మందికిపైగా చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమందిని సహాయక సిబ్బంది రక్షించారు. వీరిలో చిన్నారులు, అప్పడే పుట్టిన పసికందులు కూడా కన్పించారు. కొందరు తల్లిదంద్రులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలను కాపాడుకున్నారు. చదవండి: కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి.. -
Unnao Case: నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ
ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు మధ్యంతర బెయిల్ మంజురైన సంగతి తెలిసిందే. నాటి ఉన్నావ్ అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖ రాసింది. వాస్తవానికి నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన కుమార్తె పెళ్లి కోసం తనను విడుదల చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అతను విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తాడని బాధిత మహిళ లేఖలో ఫిర్యాదు చేసింది. అతను జైలు వెలుపల ఉంటే తమకు అత్యంత ప్రమాదమని ఆ మహిళ పేర్కొంది. ఇదంతా సెంగార్ కుటుంబం పన్నిన కుట్ర అని కుమార్తె వివాహం పేరుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఆడుతున్న నాటకమని లేఖలో ఆరోపించింది. ఇదిలా ఉండగా, కుమార్తె వివాహానికి హాజరయ్యేలా ఢిల్లీ హైకోర్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పెరోల్‌పై సెంగార్‌ను విడుదల చేయాలని ఆదేశించడం గమనార్హం. మధ్యంతర విడుదలకు సంబంధించిన దరఖాస్తు తనకు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెహమూద్ ప్రాచా సోమవారం తెలియజేయడంతో, కోర్టు సెంగార్ తరపు న్యాయవాదిని కాపీని అందించాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. వాస్తవానికి కుల్దీప్ సింగ్ సెంగార్‌కి ఉన్నావ్ 2017 అత్యాచార ఘటనలో దోషిగా తేలడంతో ట్రయల్ కోర్టు జీవత ఖైదు శిక్ష విధించింది. దీన్ని సెంగార్ సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో కూడా సెంగార్‌కు, అతని సోదరుడు అతుల్ సింగ్ సెంగార్తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కాంగ్రెస్ తొలి జాబితా .. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్) -
యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం. యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
శవం కూడా దక్కది అనుకున్నారు! కానీ..
వాషింగ్టన్: పాలబుగ్గల చిన్నారి.. స్నేహితులతో ఆటల్లో మునిగిపోయింది. సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడుతూ.. ఒక్కసారిగా చెట్టు చాటు నుంచి స్నేహితురాలిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. కానీ, ఊహించని సర్ప్రైజ్ ఆమెకు ఎదురైంది. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అదృష్టంకొద్దీ ప్రాణం మిగలడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. లిల్లీ క్రైజానివిస్కీ.. వయసు తొమ్మిదేళ్లు. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి బెడ్‌పై సగం చిధ్రమైన స్థితిలో పడి ఉంది. ఓ కౌగర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. మృత్యువు ముఖం నుంచి బయటపడింది. కౌగర్.. పిల్లి జాతికి చెందిన భారీ జంతువు.. మౌంటెన్ లయన్. బరువు 35 నుంచి 115 కేజీల మధ్య ఉంటుంది. ఇవి దాడి చేస్తే మనుషి బతకడం చాలా కష్టం. 1924 నుంచి వాషింగ్టన్ స్టేట్‌లో 20 మందిపై దాడులు చేశాయి ఇవి. దాడి చేస్తే రక్తమాంసాలు కూడా మిగల్చకుండా తినేస్తాయి. అలాంటి క్రూర జంతువు దాడిలో గాయపడి.. బతకడం లిల్లీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. లిల్లీ కుటుంబం వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్కు విహారయాత్రకు వెళ్లింది. అధికారులను హెచ్చరికలను ఆ కుటుంబాలు పట్టించుకోలేదు. పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించారు. అక్కడే స్నేహితులతో ఆడుకుంటున్న టైంలో.. ఆ చిన్నారిపై కౌగర్ దాడి చేసింది. ముఖంతో పాటు మొత్తం ఆ చిన్నారిని చీల్చి పడేసింది. నోట కరుకుకుని లాక్కుని పోయింది. ఆ హఠాత్ పరిణామంతో తోటి పిల్లలు గట్టి గట్టిగా అరిచారు. అంతా వచ్చి చూసేసరికి రక్తపు మరకలు తప్ప బిడ్డ కనిపించలేదు. అంతా కలిసి వెతకగా.. కొద్దిదూరంలో రక్తపు మడుగులో పడి ఉంది ఆ చిన్నారి దేహం. అధికారుల సాయంతో వెంటనే లిల్లీని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, శరీర పైభాగం దాడిలో ఘోరంగా దెబ్బతింది. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు ఆ కుటుంబానికి డబ్బు అవసరం పడింది. అందుకే ఆమె అంకుల్ గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరించారు. చిన్నారి పరిస్థితిని ఫొటోల ద్వారా చూసి చలించి.. విరాళాలు ధారల వెల్లువెత్తాయి. మొత్తానికి సోమవారం సర్జరీ జరిగింది. ఐసీయూ నుంచి, అంతకు మించి కోమా నుంచి లిల్లీ బయటకు వచ్చింది. కానీ, ఆమె మామూలుగా తిరగగలుతుందా? అనేది మాత్రం ఆరునెలలు గడిచాకే చెబుతాం అంటున్నారు వైద్యులు. -
భయంలోనూ సమయస్ఫూర్తి.. రక్తాన్ని పూసుకుని శవంలా నటించి..
ప్రాణాలు పోతున్నా.. తుపాకీ ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమవుతోంది. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించని వాళ్లంటూ లేరు ఇప్పుడు. చనిపోయిన పిల్లలు, టీచర్ల కుటుంబాల వ్యథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ‘‘మీకు దణ్ణం పెడతాం. ఏదో ఒకటి చేయండి. చనిపోయిన ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకుని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి. నా మనవరాలు చిన్నపిల్ల. అలాంటి ప్రాణాలు మరిన్ని పోకుండా చూడండి. దయచేసి చర్యలు తీసుకోండి’’ అని కన్నీళ్లతో బతిమాలుతోంది 63 ఏళ్ల ఓ బామ్మ. ఆమె పదేళ్ల మనవరాలు అమెరీ గార్జా.. కాల్పుల ఘటనలో కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసున్న మియా సెర్రిల్లో కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల సమయంలో మియా.. ఓ స్నేహితురాలు పూర్తిగా రక్తపుమడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ రక్తం తన ఒంటికి, బట్టలకు రాసుకుని చనిపోయినట్లు నటించింది. ఇంతలో తుపాకీతో వచ్చిన దుండగుడు.. ఆమె శరీరాన్ని తన్నుకుంటూ పరీక్ష చేసి వెళ్లిపోయాడట. అంతేకాదు.. అలా నటించే ముందు చనిపోయిన తన టీచర్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని.. 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు సాయం కోసం ఫోన్ చేసినట్లు వెల్లడించింది. కాల్పులు జరిపిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు.. తనను కూడా కాలుస్తాడని భయపడిపోయిందట!. అయితే దాడిలో బుల్లెట్ శకలాలతో స్వల్పంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నా.. దాడి భయం మాత్రం ఆమెలో ఇంకా పోలేదు. ఇదిలా ఉంటే 19 మందిని పొట్టనబెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్‌ను మట్టుపెట్టేందుకు గంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో టెక్సాస్ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: నరమేధాలకు కారణం వాళ్లేనా? -
బోయిగూడ అగ్నిప్రమాదం.. గాయపడిన ప్రేమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. న్యూబోయిగూడ కట్టెలమండిలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాంలో మార్చి 23న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది ఘటనా స్థలంలోనే సజీవ దహనం అయిన ఘటన విధితమే. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న బిహార్‌కు చెందిన మరో కార్మికుడు ప్రేమ్(20) తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ప్రేమ్ వేడిపొగ పీల్చడంతో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం అతడు మృతి చెందాడు. బిహార్ రాష్ట్రం చాప్ర జిల్లా పాస్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని అజాంపూర్‌కు చెందిన రాధాకిషన్ కుమారుడు ప్రేమ్ అని పోలీసులు గుర్తించారు. ప్రేమ్ మరణంతో అగ్నిప్రమాద మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ప్రేమ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు. చదవండి: కాల్చుకు తిన్నారు! సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో ఆవేదన -
హిట్లర్ వదిలేసినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బోరిస్ రోమన్చెన్కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు ఈయన. ఖార్కీవ్లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్చెన్కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది. రోమన్చెన్కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్వాల్ద్ కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్‌లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్చెన్కో పాల్గొన్నాడు. Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9 — Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022 నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్చెన్కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్‌కు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్చెన్కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించారు
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధిరాలితోపాటు, నిందితుడిని ఊరేగించిన వైనం కలకలం రేపింది. 16 ఏళ్ల బాధిత మైనర్ బాలికతోపాటు, నిందితుడిని తాళ్లతో కట్టేసి దాడిచేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. దాడి చేసిన వారిలో బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. (హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం) మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని గ్రామంలోఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులతో పాటు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపైన ఒకటి, ఈ దారుణానికి సహకరించిన బాలిక కుటుంబ సభ్యులు, సహా, ఇతరులపై మరో ఎఫ్ఐఆర్ నమెదు చేశామన్నారు. -
కరోనా: ‘మానవత్వం చూపించండి ప్లీజ్’
ముంబై : ప్రపంచమంతా ప్రస్తుతం కరోనాతో పోరాడుతోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలావిల్లాడిపోతున్నాయి. కొన్ని లక్షలమంది కరోనా బారిన పడగా.. వేలల్లో మృత్యుఘోష వినపడుతోంది. అయితే తాజాగా కరోనా లక్షణాలు లేకున్నా కూడా పాజిటివ్‌గా తేలడం మరింత విచారకంగా మారుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ తమకు ఎప్పుడు ఎలా సోకుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని పంచుకుంటున్నారు. కరోనా పాజిటివ్ తేలడంతో సమాజంలో వారిని చూసే విధానం తమతో పాటు తమ కుటుంబాలను కూడా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి ) ముంబైకు చెందిన వ్యక్తి మార్చి 4న యునైటైడ్ కింగ్‌డామ్‌లో పర్యటించారు. కరోనా మహమ్మారిగా రూపుదాల్చిన అనంతరం ఆ వ్యక్తి ముంబైకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే ప్రస్తుతం చికిత్స అనంతరం కోలుకుని తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ముందు జాగ్రత్తలు పాటించాను. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ముంబైకు తిరిగి వచ్చిన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయాను. కాగా మార్చి 21న ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడంతో.. మార్చి 22న జాస్లోక్ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వాళ్లు నన్ను పరీక్షించి ఇంటికి వెళ్లమని సూచించారు. నన్ను ఇంటికి పంపడం షాక్‌కు గురయ్యాను. మళ్లీ బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లాను. అప్పటికే నా శరీరంలోని లక్షణాలు క్షీణిస్తున్నాయి. మరి కొన్ని పుట్టుకొస్తున్నాయి. అప్పుడే నా ఆరోగ్యం క్షీణిస్తుందని నాకు అర్థమైంది. వెంటనే పరీక్షలు చేయించుకున్నాను. మార్చి 27న నాకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అనంతరం నేను కస్తూర్బా ఆసుపత్రిలో కోవిడ్ వార్డులో చేర్చారు. నాతో పాటు మరో తొమ్మిది మంది రోగులు ఉన్నారు. అక్కడ తీసుకున్న చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకున్నాను. నాలో కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆ సమయంలోనే నాకు ఓ వార్త షాక్‌కు గురిచేసింది’’ అని తన ఆవేదనను పంచుకున్నాడు. (కరోనా: ‘నా రక్తంలోనే సమాధానం ఉందేమో’) ‘మా నాన్న పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటి యాజమాని అతన్ని వేధింపులకు గురిచేశాడు. నా తండ్రిని పోలీసులకు అప్పజెప్పి అరెస్ట్ చేయిస్తామని బెదిరించాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా కరోనాపై పూర్తి అవగాహనకు రండి. మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా భయాందోళనకు గురై కరోనా బారిన పడిన వారిని, వారి కుటుంబ సభ్యులను దూషించడం మానేయండి. వారిపై కాస్తా మానవత్వం చూపించండి. నా కుటుంబంలో ఎవరికి పాజిటివ్ నిర్ధారణ జరగలేదు. కరోనా గుర్తించి వాస్తవాలు తెలుసుకొని, మీ చుట్టుపక్కలా వారిని అవగాహన కల్పించండి’ అని విజ్ఞప్తి చేశారు. అలాగే తన వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వాటిని లీక్ చేశారని, దీంతో తనకు రోజుకు 100కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని వాపోయాడు. అయితే అధికారులు కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని.. దీనివల్ల అనవసరమైన భయానికి గురయ్యానని తెలిపారు. ప్రస్తుతం ఈ మహమ్మారి నుంచి పూర్తి కోలుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’) -
ఆ వేదనే ఆమెను బలి తీసుకుంది
ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ కాల్పుల మారణహోమం గుర్తుందా ? సరిగ్గా ఏడాది క్రితం హఠాత్తుగా క్లాసులోకి ఎంటరై, పిల్లలు, టీచర్లపై విచరణా రహితంగా కాల్పుల జరిపి 17మందిని పొట్టన పెట్టుకున్న ఆ దుర్ఘటన ఇపుడు మరో యువతిని పొట్టన పెట్టుకుంది. ఈ విషాదం నుంచి అదృష్ట వశాత్తూ బతికి బయటపడిన ఓ యవతి అనూహ్యంగా ప్రాణాలు తీసుకుంది. దుండగుడి తుపాకీ గుళ్లనుంచి తప్పించుకున్నప్పటికీ తన స్నేహితురాలిని పోగొట్టుకున్నానన్న మానసిక వ్యధ ఆమెను మహమ్మారిలా పట్టి పీడించింది. చివరకు అదే ఆమె ప్రాణాలను బలితీసుకుంది. దీంతో ఆమె కుటుంబంతో పాటు, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు, స్కూలు సిబ్బంది సహా పలువురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్న సిడ్నీ ఐయోలో (19) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తల్లి కారా వెల్లడించారు. ఐయోలోకు యోగా అంటే చాలా ఇష్టమనీ, వైద్యరంగంలో ప్రవేశించాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. కానీ కాల్పుల్లో తన ప్రాణ స్నేహితురాలు మెడోవ్ పాలక్ ప్రాణాలు కోల్పోవడంతో సిడ్నీ బాగా కృంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీకి వెళ్లాలంటేనే వణికిపోయేదనీ, దీంతో చదువులో కూడా వెనకబడి పోయిందని తెలిపారు. ఎన్ని రకాల చికిత్స అందించినా, ఎంత ఊరట కల్పించినా, తన బిడ్డను కాపాడు కోలేకపోయామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అటు పాలక్ సోదరుడు హంటర్ పాలక్ కూడా సిడ్ని ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదానికి సంవత్సరం ముగిసిన సందర్భంగా 2019, ఫిబ్రవరి 14న స్కూలు యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు రాజకీయవేత్తలు మృతులుకు నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం గడిచినా చాలామంది విద్యార్థులను ఇంకా ఆ పీడకల వెంటాడుతోంది. దీంతో ఆ రోజంతా క్లాసులను ఆపివేసిన యాజమాన్యం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. కానీ ఇంతలోనే సిడ్నీ ఆత్మహత్య వారిని కలిచి వేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. మరోవైపు ’ ప్రియమైన మన బిడ్డ, మన చెల్లి, మనందరి స్నేహితురాలు’ అంటూ సిడ్నీ మరణంపై గోఫండ్‌మీ పేజీ సంతాపాన్ని వెలిబుచ్చింది. విరాళాలకు పిలుపునిచ్చింది. దీంతో క్షణాల్లో 20వేల డాలర్లు సమకూరాయి. ఈ సొమ్మును సిడ్నీ తల్లికి అందజేస్తామని ప్రకటించింది. కాగా అమెరికా ఫ్లోరిడా, పార్క్‌లాండ్‌లోని మర్జోరి స్టోన్మాన్ డగ్లస్ హై స్కూల్లో అదే స్కూల్ కు చెందిన పాత విద్యార్థి నికోలస్ క్రూజ్ ఎఆర్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో స్కూల్లో టీచర్లు, విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది క్లాస్ లోనే ర్యాక్ లు, డెస్కుల కింద దాక్కున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలో 17మంది (14 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు) చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. -
గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం
∙సరైన మందులు లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి l కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ములుగు : ఏజెన్సీ ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆరోపించారు. బుధవారం నాయకులతో కలిసి ఆయన మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడారు. మందులను ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని దృష్టికి తీసుకొచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో నిరుపేద ప్రజలు జేబులు ఖాళీ చేసుకొని ప్రైవేట్ షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని, ప్రణాళిక లేని ప్రభుత్వ తీరు వల్ల ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప నాణ్యమైన వైద్యం కరువైందని ఆరోపించారు. ఆస్పత్రిలో మందుల నిల్వపై సూపరింటెండెంట్ గోపాల్, వైద్యుడు నారాయణరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఓఎస్డీ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫోన్లో సమాచారం అందించారు. జ్వరానికి బయటికి మందులు రాసినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అని పేరు ఎందుకని ప్రైవేట్ ఆసుపత్రి అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. గిరిజనులను పట్టించుకోవాలి... రాష్ట్రంలో ఆదిలాబాద్, మణుగూరు, భద్రాచలం, ఏటూర్‌నాగారం ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై ప్రభుత్వం పట్టించుకునేది ఉందా లేదా అని బలరాం నాయక్ ప్రశ్నించారు. భద్రాచలం ఏజెన్సీలో నాలుగు రోజుల క్రితం నలుగురు విద్యార్థులు విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి నదితీరాల వెంబడి ఉన్న గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. వారికి సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వర్షా కాలంలోనైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ మేరకు స్వప్న అనే యువతితో జిల్లా కలెక్టర్ కరుణతో ఫోన్లో మాట్లాడించారు. టెస్టులతో సహా అన్ని బయటికి రాస్తున్నారని ఆమె కలెక్టర్‌తో తెలిపింది. దీనిపై స్పందించిన కలెక్టర్ రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రిని సందర్శిస్తానని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి, చింతలపూడి నరేందర్, ఇమ్మడి రమేశ్, మల్క రమేశ్, యుగేందర్, యూనస్, భద్రయ్య తదితరులు ఉన్నారు. -
అమితాబ్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 'నేనొక ట్యూబర్కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను. 2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు. దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు. -
అమితాబ్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 'నేనొక ట్యూబర్కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను. 2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు. దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు. -
ఇదే చాన్స్...దోచేయ్
మంగళగిరి : ఇదే చాన్స్...దోచేయ్ అనే విధంగా రాజధాని భూ సమీకరణ గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దళారులు కార్యాలయాల్లో తిష్టవేసి ఇప్పటికీ భూ అంగీకారపత్రాలు (9.3 ఫారాలు) ఇప్పిస్తున్నారనీ, వారికి అధికారులు సర్వేయర్లు సహకరిస్తూ సంపాదనలో పడ్డారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇవ్వని వారిని సర్వేయర్లు గుర్తించి దళారులకు సమాచారమిస్తున్నారు. దళారులు సదరు రైతులను భయపెట్టి భూసమీకరణకు ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివాదాల్లో ఉన్నవి, రికార్డులు సరిగ్గా లేని భూములను దళారులు గుర్తించి మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేయించి సర్వేయర్లకు లంచాలు ఇచ్చి అప్పటికప్పుడు అంగీకారపత్రాలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు సరిచేయాలంటే అడంగల్, సర్వే ఇలా ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాలతో పాటు కృష్ణా కరకట్ట వెంబడి వున్న గ్రామాల రైతులు తొలి నుంచి భూ సమీకరణను వ్యతి రేకిస్తున్నారు. చివరి గడువు ఫిబ్రవరి 28 నాటికి అధికారపార్టీ నేతలు, మంత్రులు సమీకరణకు ఇవ్వని వారి భూములను సేకరిస్తామని భయపెట్టడంతో రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. మరో వైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అండగా నిలవడంతో నిడమర్రు, కురగల్లుతో పాటు చాలా గ్రామాల్లో రైతులు అంగీకారపత్రాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రెవెన్యూ అధికారులు దళారులను రంగ ప్రవేశం చేయించి రైతుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుంటున్నారు. గత నెలలో నిడమర్రు, కురగల్లు గ్రామాలలోనే సుమారు 50 ఎకరాలకు పైగా అంగీకారపత్రాలు తీసుకోవడం విశేషం. అయితే అంగీకారపత్రాలు పాత తేదీలతోనే తీసుకున్నట్టు సమాచారం.