Odisha Rail Crash: ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న బాధితుల మాటలు | Odisha Rail Tragedy Survivor Recounts Struggle Alive Because | Sakshi
Sakshi News home page

సజీవంగా ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న రైలు ప్రమాద బాధితుల మాటలు

Published Sun, Jun 4 2023 1:28 PM | Last Updated on Sun, Jun 4 2023 1:37 PM

Odisha Rail Tragedy Survivor Recounts Struggle Alive Because - Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగి ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించాయి. ప్రాణలతో బయటపడ్డ కొందరూ చెబుతున్న మాటలు వింటుంటూ అంత తేలిగ్గా ఆ విషాదాన్ని మర్చిపోలేరేమో అన్నంతగా భయబ్రాంతులకు లోనయ్యారు.

ఈ నేపథ్యంలో ఆ ఘోర ప్రమాదం నుంచి బయటడ్డ బాధితులు తాము ఎలా సజీవంగా బయటపడ్డానో చెబుతుంటే ఆ దృశ్యం కళ్లముంగిట కదలాడినట్లుగా ఉంది. ఆ బాధితుడు అస్సాంకు చెందిన దీపక్‌ దాస్‌. తాను ‍ప్రయాణిస్తున్న రైలు గూడ్సు రైలుని ఢీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో కోచ్‌లు బోల్తాపడ్డాయి. తాను విండో సీటు వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగానని. తాను ఆ సమయంలో కిటికీని గట్టిగా పట్టుకుని ఉన్నానని లేదంటే తాను కూడా చనిపోయే వాడినని ఆవేదనగా చెప్పుకొచ్చాడు.

ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డ బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ..రైలు అకస్మాత్తుగా ఢీ కొన్న తర్వాత భారీ కుదుపు విన్నానని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా  గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గురించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందిందని, తనను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నట్లు చెప్పాడు.

ఇదిలా ఉండగా, ఆ ఘోర ప్రమాదానికి కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యం అని, తద్వారా రైళ్లను ఈ ట్రాక్‌పై యథావిధిగా నడిచేలా చేయొచ్చని అన్నారు. 

(చదవండి: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement