Railway accidents
-
అయినా.. పట్టాలెందుకు తప్పుతున్నాయ్!
సాక్షి, అమరావతి: రైల్వేలను ఆధునికీకరిస్తున్నాం.. బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఘనమైన ప్రకటనలివి. అయినా.. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి.. ప్రమాదానికి గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరుగుతుండడంఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. రైల్వే శాఖ ఘనమైన చర్యలు చేపడుతున్నా దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతుండటంపై కం్రప్టోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తీవ్రంగా ఆక్షేపించింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, గేజ్ మార్పిడి, కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గాడి తప్పుతున్న రైళ్లు నాలుగేళ్లుగా రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు పెరుగుతున్నాయి. 2021–22లో 27 ప్రమాదాలు సంభవించగా... 2022–23లో 36 చోట్ల రైళ్లు పట్టాలు తప్పాయి. ఒకే ట్రాక్ మీదకు ఎదురెదురుగా రైళ్లు వచ్చి ఢీకొన్న ప్రమాదాలు కూడా సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2021–22లో రెండు ప్రమాదాలు సంభవించగా.. 2022–23లో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదాలు ఏకంగా ఆరు సంభవించాయి. కొత్త లైన్ల నిర్మాణానికీ నిధుల తగ్గింపు రైల్వే భద్రతకు కీలకమైన కొత్త లైన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపును కూడా రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రైల్వే బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులను కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించాలన్నది ప్రామాణికంగా నిర్దేశించారు. కానీ.. రైల్వే శాఖ మూడేళ్లుగా ఈ ప్రమాణాలను పాటించడం లేదు. 2022–23 బడ్జెట్లో 14.1 శాతం నిధులు కేటాయించగా.. 2023–24కు కొత్త రైల్వే లైన్ల నిర్మాణ నిధులను 10.3 శాతానికి తగ్గించారు.ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో కొత్త లైన్ల నిర్మాణం కోసం కేవలం 7 శాతం నిధులనే కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. అదే విధంగా గేజ్ మారి్పడి కోసం మొత్తం బడ్జెట్లో కనీసం 3 శాతం నిధులు కేటాయించాలన్న ప్రామాణిక నిర్దేశం. రైల్వే శాఖ మాత్రం 2022–23లో 2 శాతం నిధులు కేటాయించగా.. 2023–24లో కేవలం 1.6 శాతం నిధులే కేటాయించారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో కొద్దిగా పెంచి 1.8 శాతం నిధులతో సరిపెట్టారు. మరోవైపు కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా రైల్వే శాఖ ఆయా పనులకు పూర్తిగా వెచ్చించడం లేదు. దాంతో రైల్వే ట్రాక్‌ల నిర్వహణ లోపభూయిష్టంగా మారి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేధిస్తున్న నిర్వహణ వ్యయంతో కోత రైళ్లు పట్టాలు తప్పి.. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు సంభవించడానికి 24 రకాల కారణాలు ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత, ట్రాక్‌ల నిర్వహణ ప్రమాణాల ఉల్లంఘన, రైల్వే కోచ్‌లు, వ్యాగన్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు అత్యంత ప్రధానమైనవి. కాగా.. రైల్వే శాఖ కొన్నేళ్లుగా రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధిస్తుండటం ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది.2017–2021 వరకు రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాల్లో 26 శాతం రైల్వే ట్రాక్‌ల నిర్వహణల లోపమే కారణమని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇంత జరుగుతున్నా రైల్వే శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధించడాన్ని కొనసాగిస్తోంది. ఏటా రైల్వే బడ్జెట్ పెరుగుతోంది కానీ.. అందులో ట్రాక్‌ల నిర్వహణ వ్యయం వాటాను మాత్రం తగ్గిస్తుండటం గమనార్హం. 2022–23 రైల్వే బడ్జెట్రూ.1.2 లక్షల కోట్లు కాగా.. అందులో రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ కోసం 13.5 శాతం నిధులు కేటాయించారు. కాగా.. 2023–24 రైల్వే బడ్జెట్ 1.5 లక్షల కోట్లకు పెరిగినా అందులోనూ రైల్వే ట్రాక్‌ల రెన్యూవల్, నిర్వహణ నిధులను 11 శాతానికి తగ్గించడం గమనార్హం. గత వారం ప్రవేశపెట్టిన 2024–25 రైల్వే బడ్జెట్లో 1.8 లక్షల కోట్లు కేటాయించారు. కానీ,, రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ నిధులను కేవలం 9.7 శాతానికే పరిమితం చేశారు. -
ప్రాణం తీస్తున్నారు!
సాక్షి యాదాద్రి : సికింద్రాబాద్ – ఖాజీపేట cమార్గంలో దుండగుల అఘాయిత్యాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఫుట్‌బోర్డు జర్నీ చేస్తున్న వారిపైకి రాళ్లు, కర్రలు విసురుతున్నారు. సెల్ఫోన్ల కోసం ఒడిగడుతున్న ఈ దుశ్చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలోని బీబీనగర్, పగిడిపల్లి, భువనగిరి, ఆలేరు పరిధిలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్ పక్కన మాటువేసి.. ఘట్కేసర్, బీబీనగర్, పగడిపల్లి, అనంతారం, భువగగిరి, ఆలేరు వద్ద ఇటీవల రైళ్లపై దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా క్రాసింగ్‌ల వద్ద, ట్రాక్ పనులు జరుగుతున్న చోట ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దొంగలు, ఆకతాయిలు ట్రాక్ పక్కన కాపు కాసి రైలు దగ్గరకు రాగానే ఫుట్‌బోర్డులో సెల్ఫోన్లు చేతిలో పట్టుకుని కూర్చున్న ప్రయాణికులపై రాళ్లు, కర్రలు రువ్వుతున్నారు. సెల్ఫోన్లు కింపడగానే దుండగులు వాటిని తీసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికులు తమ చేతిలోనుంచి సెల్ఫోన్లు కిందపడుతున్న క్రమంలో అందుకునేందుకు చేసే ప్రయత్నంలో రైల్లో నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా రెండు నెలల క్రితం ఆలేరు బీసీ కాలనీ సమీపంలో నలుగురు యువకులపై రాళ్లు రువ్విన ఘటనలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చోటు చేసుకున్న ఘటనలు ఇలా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా నమోదైన కేసులన్నీ 20 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపువారే కావడం గమనార్హం. ఇవన్నీ బీబీనగర్ నుంచి భువనగిరి మధ్యలోనే జరిగాయి. మార్చి 6, మార్చి 7, ఏప్రిల్ 21, ఏప్రిల్ 24, జూన్ 20, జూన్ 22, జూన్ 28వ తేదీ వరకు ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లలోనుంచి జారిపడి మృతి చెందినట్లుగా కేసులు నమోదు చేశారు. అయితే 22వ తేదీన పగడిపల్లి వద్ద రైల్ లోంచి జారిపడిన కేసులో బిహార్‌కు చెందిన రతన్(29)గా, 28న చోటు చేసుకున్న ఘటనలో ముపుప శ్రీకాంత్‌గా గుర్తించారు. ఒకే తరహాలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలపై విచారణ జరిపించాలని, ట్రాక్‌వెంట కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైళ్లలో వెళ్తున్న ప్రయాణికులపై దాడులు ఫ ఫుట్‌బోర్డులో ఉన్నవారిపైకి రాళ్లు, కర్రలు విసురుతున్న దుండగులు ఫ సెల్ఫోన్ల కోసం ఘాతుకం ఫ కిందపడ్డ ఫోన్లను తీసుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ మార్చి నుంచి ఏడుగురు మృతి ఫ గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నెరేళ్ల గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సెలవు ఉండడంతో బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి శాతవాహన సూపర్ ఫాస్ట్ఎక్స్ప్రెస్ రైల్లో ఖాజీపేటకు బయలుదేరాడు. రైల్ ఫుట్‌బోర్డులో నిలబడి సెల్‌ఫోన్ చూస్తుండగా బీబీనగర్ సమీపంలో ట్రాక్ పక్కన కాపుకాసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శ్రీకాంత్‌పై కర్ర విసిరారు. ఈ ఘటనలో శ్రీకాంత్ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కిండపడింది. ఫోన్ తీసుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ రైలు కింద పడిపోయాడు. ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో రైలు కొద్దిదూరం వెళ్లి ఆగింది. వారంతా వచ్చి చూడగా అప్పటికే శ్రీకాంత్ మృతి చెందాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Odisha Rail Crash: ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న బాధితుల మాటలు
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగి ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించాయి. ప్రాణలతో బయటపడ్డ కొందరూ చెబుతున్న మాటలు వింటుంటూ అంత తేలిగ్గా ఆ విషాదాన్ని మర్చిపోలేరేమో అన్నంతగా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఘోర ప్రమాదం నుంచి బయటడ్డ బాధితులు తాము ఎలా సజీవంగా బయటపడ్డానో చెబుతుంటే ఆ దృశ్యం కళ్లముంగిట కదలాడినట్లుగా ఉంది. ఆ బాధితుడు అస్సాంకు చెందిన దీపక్ దాస్. తాను ప్రయాణిస్తున్న రైలు గూడ్సు రైలుని ఢీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో కోచ్‌లు బోల్తాపడ్డాయి. తాను విండో సీటు వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగానని. తాను ఆ సమయంలో కిటికీని గట్టిగా పట్టుకుని ఉన్నానని లేదంటే తాను కూడా చనిపోయే వాడినని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డ బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ..రైలు అకస్మాత్తుగా ఢీ కొన్న తర్వాత భారీ కుదుపు విన్నానని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గురించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందిందని, తనను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఆ ఘోర ప్రమాదానికి కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యం అని, తద్వారా రైళ్లను ఈ ట్రాక్‌పై యథావిధిగా నడిచేలా చేయొచ్చని అన్నారు. (చదవండి: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..) -
ఘటన స్థలాన్ని పరిశీలించిన రైల్వే మంత్రి
-
ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
రద్దయిన పలు రైళ్లు .. ప్రయాణికుల తిప్పలు
-
ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి చెప్పిన సంచలన విషయాలు
-
దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే!
ఒడిశా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన.. భారీ విషాదాన్ని నింపేదిగా కనిపిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సుమారు 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగానే ఉండడం.. ఇంకా బోగీల్లో వాళ్లను బయటకు తీసే చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చు. ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొట్టడంతో.. అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు పలువురు. కానీ, స్వాతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతకన్నా ఘోరమైన ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. 👉 దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్‌లో జరిగింది. తుపాను సమయంలో రైలు బాగ్మతి నది బ్రిడ్జ్ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. రెండు రోజుల తర్వాత.. 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల తర్వాత 235 మంది మరణించారని, ముగ్గురి జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ, వందల మంది తమ వాళ్ల జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్లంతా కొట్టుకుపోయి ఉండొచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా. 1988లో దక్షిణ భారత్‌లోని క్విలోన్ వద్ద ఓ సరస్సులో రైలు భోగీలు పడిపోయాయి. ఈ ఘటనలో 106 మంది చనిపోయారు. 👉 ఆగస్ట్ 20, 1995న ఫిరోజాబాద్ సమీపంలో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఆఘటనలో దాదాపు 358 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. దీన్ని భారతీయ రైల్వేస్.. రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా పరిగణించింది. ఫిరోజాబాద్ వద్ద కాళింది రైలు నీల్గై(ఒకరకం జంతువు)ను ఢీ కొట్టింది. ఆపై అది బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుకు సాగలేదు. ఈలోపు సిగ్నలింగ్‌వ్యవస్థలో లోపంతో మరో రైలు అదే పట్టాలపై దూసుకొచ్చింది. కాళింది ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీ కొట్టడంతో.. 358 మంది నిద్రలోనే మరణించారు. కానీ, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 400 దాకా ఉండొచ్చనేది అంచనా. నవంబర్ 26, 1998న జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. పంజాబ్‌లోని ఖన్నాలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్‌ని జమ్ము తావి సీల్దా ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో సుమారు 212 మంది మరణించారు. 👉 ఆగస్ట్ 2, 1999న నార్త్ ఫ్రాంటియర్ రైల్వేకతిహార్ డివిజన్లోని గైసల్ స్టేషన్లో మరో రైలు ప్రమాదం జరిగింది. బహ్మపుత్ర మెయిల్, అవధ్ ఎక్స్‌ప్రెస్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 285 మందికి పైగా మరణించగా 300 మందికి పైగా గాయప్డడారు. కానీ బాధితుల్లో చాలామంది ఆర్మీ, బీఎస్ఎస్ లేదా సీఆర్పీఎఫ్ సిబ్బందే ఉండటం బాధకరం. 👉 సెప్టెంబరు 9, 2002న హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రఫీగంజ్‌లోని ధావే నది వంతెనపై నుంచి పట్టాలు తప్పడంతో 140 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు ఉగ్రవాద విధ్వంసమే కారణమని ఆరోపణలు వచ్చాయి. 👉 డిసెంబర్ 23, 1964న రామేశ్వరం తుఫాను కారణంగా పాంబన్-ధనుస్కోడి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. అందులో ఉన్న 126 మంది ప్రయాణికులు మరణించారు. 👉 మే 28, 2010న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్లే ఆ రైలు ఝర్గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది, ఆపై ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 148 మంది ప్రయాణికులు మరణించారు. 👉 నవంబర్ 20, 2016న కాన్పూర్‌కు సుమారు 60 కి.మీ దూరంలో పుఖ్రాయాన్ వద్ద ఇండోర్ రాజేంద్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో సుమారు 14 కోచ్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ ఘటనలో 152 మంది ప్రాణాలు కోల్పోగా, 260 మంది తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు..) -
నిర్లక్ష్యమే.. ప్రాణం తీస్తోంది..
సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం రాత్రి సిగడాం–చీపురుపల్లి సెక్షన్ బాతువ రైల్వే గేటు సమీపానికి వచ్చే సరికి ఎవరో చైను లాగడంతో ఆగిపోయింది. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు దిగి వెళ్తుండగా పక్క ట్రాక్‌పై అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకుంటే నిండు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. దీనికి ఉదాహరణే సిగడాం–చీపురుపల్లి సెక్షన్లో జరిగిన రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వేసిన గేటు కింద నుంచి వెళ్లకూడదు. ఈ నిబంధనలు పాటించడంతో ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా.. నిండు ప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. – తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) రెల్వే ప్రమాదాలకు కారణం సరైన అవగాహన లేకపోవడమే. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొందరు అనవసరంగా.. ఏ కారణం లేకుండా అలారం చైన్ లాగుతుంటారు. కొన్ని సార్లు రైళ్లు ఏదైనా కారణాల వలన స్టేషన్లో కాకుండా మధ్యలో ఆగుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో ముఖ్యంగా జనరల్ ప్రయాణికులు రైలు దిగి, వేరే ట్రాక్‌లపైకి వెళ్లి కూర్చోవడం, ట్రాక్‌ల మీద తిరగడం చేస్తుంటారు. దీని వలన ఆ ట్రాక్‌పై వస్తున్న రైళ్లు గురించి తెలుసుకోలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్లో కాకుండా మధ్యలో ఆగినపుడు.. రైలు నుంచి దిగొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రయాణికులు ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. ఏ కారణం లేకుండా చైన్ లాగడం వలన రైలు ఆలస్యం కావడంతో పాటు.. వెనుక వచ్చే రైళ్లు కూడా ఆలస్యమవుతాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో చైన్ లాగడం వలన ప్రయాణికులు దోపిడీలకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కారణం లేకుండా అలారం చైన్ లాగడం రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన నేరం. అలా చేసిన వారికి రూ.1000 జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అజాగ్రత్త.. సరదా.. రైలు ప్రమాదాలకు ప్రజల అజాగ్రత్త కూడా ఒక కారణం. రైల్వే ట్రాక్‌లను ప్రజలు, ప్రయాణికులు ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. కొన్ని చోట్ల బహిర్భూమి కోసం.. కొందరైతే ఆటలాడుకునేందుకు.. మరికొందరు కాలకృత్యాలు తీర్చుకుంటుంటారు. ఈ విధంగా చేయడం ప్రమాదం అని తెలిసినా.. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌లను దాటుతుంటారు. మరికొందరు ట్రాక్‌లపై సెల్ఫీలు తీసుకుంటూ..చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంత వాసులు ట్రాక్‌లను దాటేటప్పుడు, లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కొందరు ట్రాక్‌ల మీద నడుస్తూ ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. కరోనా లాక్డౌన్ సమయంలో పట్టాలు దాటుతున్న వలస కూలీలను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అప్పట్లో తీవ్రంగా కలచివేసింది. స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు రైళ్లలో ప్రయాణించేటపుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. అలా చేయడం శిక్షార్హమైన నేరమని వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ప్రయాణికులను హెచ్చరించారు. డీఆర్ఎం ఆదేశాలతో మంగళవారం విశాఖపట్నం, విజయనగరం, దువ్వాడ, శ్రీకాకుళంరోడ్, జగదల్పూర్ వంటి స్టేషన్లలో బ్యానర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఏ కారణం లేకుండా చైన్ లాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రత విషయమై వాల్తేర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతోందని.. ప్రయాణికులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్ భద్రత విభాగం, సెక్యూరిటీ, సివిల్ డిఫెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. పయాణ సమయంలో.. స్టేషన్లో రైలు కదులుతున్నప్పుడు..ఎక్కడం, దిగడం చేస్తుంటారు. మరికొందరు తలుపు దగ్గర నిల్చొని.. కూర్చొని ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ఎంతో ప్రమాదకరం. ఇటువంటి ప్రమాదమే మంగళవారం అనకాపల్లి జిల్లాలోని నరసింగబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య జరిగింది. రైలు నుంచి జారి పడి బావ, బావమరిది దుర్మరణం చెందారు. రైళ్లలో సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకునేందుకు వీలుగా రైల్వే అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలి. అత్యవసర సమయాల్లో రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్ రైల్వే పోలీసుల సహా యం తీసుకోవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్ 139ను సంప్రదించవచ్చు. -
ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్
సాక్షి, నల్లగొండ/ భువనగిరి: ప్రేమ విఫలమైందని.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆరోగ్య సమస్యలు కుదుటపడడం లేదని.. సంతాన భాగ్యం కలగలేదని.. ఉద్యోగం రావడం లేదనే ఆత్మన్యూనతా భావంతో ఎందరో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. కారణాలు ఏమైతేనేం క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను చేజేతులా బలితీసుకుంటున్నారు. అందుకు రైల్వేట్రాక్‌లు కేరాఫ్‌లుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైళ్ల కిందపడి 166మంది అఘాయిత్యాలకు ఒడిగట్టారని రైల్వేపోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు క్షణికావేశంలో రైలు పట్టాలను కేరాఫ్‌గా మార్చుకుని అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా యువకులే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. క్షణికావేశంలో వెంటనే తీసుకుని సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతినెలా 6 నుంచి 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రైల్వేపోలీస్ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. మృతుల్లో అధికమంది 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎదిగివచ్చిన పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. అధికంగా ఎక్కడెక్కడంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్ల పరిధిలో అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైల్వే లైన్ పగిడిపల్లి నుంచి విష్ణుపురం వరకు 134.5 కిలోమీటర్లు, బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆలేరు వరకు 45 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నల్లగొండకు అప్ అండ్ డౌన్ 32రైళ్లు, భువనగిరి–ఆలేరు మధ్య 37 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన వ్యక్తితో భారతికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనారోగ్య కారణాలతో ఆ కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారం భారతిపై పడింది. తాను నార్కట్‌పల్లిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తూ బతుకుబండిని లాగిస్తోంది. అయితే డిగ్రీ చదువుతున్న భారతి కుమారుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి తిరస్కరించడంతో గత ఏడాది అక్టోబర్‌లో సీతారాంపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మన్యూనతతో.. అధికంగా నల్లగొండ–రాయినిగూడెం, మిర్యాలగూడ–కొండ్రపోలు , బీబీనగర్–వంగపల్లి మధ్య, బీబీనగర్ పగిడిపల్లి మధ్య ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీస్ రికార్డుల పరిశీలనలో తేలింది. క్షణికావేశం, ప్రేమవిఫలం, ఉద్యోగాలులేవని అనేక రకాలుగా కలత చెందిన యువత ఆత్మన్యూనతా భావానికి లోనై ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తూ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారని రైల్వేపోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య పిట్టల నర్సింహ మృతదేహం భువనగిరి అర్బన్: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తారకరామానగర్‌కు చెందిన పిట్టల నర్సింహ(41) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. భువనగిరి–పగిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కిలోమీటర్ నంబర్ 245/11–13 వద్ద సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ టి.అచ్చుతం తెలిపారు. దంపతుల బలవన్మరణం ఆర్థిక ఇబ్బందులా..? సంతానం లేకనా..? నల్లగొండ క్రైం: పట్టణంలోని పాతబస్తీలోని మాల్బౌలికి చెందిన ఆటో డ్రైవర్ మురారిశెట్టి నగేశ్(36), భార్య చరిత(21) సోమవారం రాత్రి 9గంటలకు విజయవాడ నుంచి సికిం ద్రాబాద్ వైపు వెళ్తున్న అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా.. పిల్లలు లేరన్న కారణమా అన్నది తెలియరాలేదు. రైల్వే ఎస్సై అచ్యుత్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా జీవనంసాగిస్తున్న నగేశ్, భా ర్య చరితలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రైలుకు అడ్డంగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఎయిర్ పైప్‌కు అడ్డంగా మృతదేహాలు ఇరుక్కుపోవడంతో అర కిలోమీటర్ దూరం ఈ డ్చుకెళ్లింది. ఈ సంఘటనతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 8నిమిషాలు ఆగింది. ఎయిర్ పైప్‌కు అడ్డంగా ఉన్న మృతదేహం అవయవాలను తొలగించారు. ఆ తర్వాతనే రైలు సికింద్రాబాద్ వైపు నకు వెళ్లింది. లోకో పైలెట్ నల్లగొండ రైల్వేస్టేషన్ మేనేజర్ రవికుమార్‌కు సమాచా రం అందించారు. వెంటనే ఆయన పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో మృతదేహాల అవయవాలను మంగళవారం మార్చురీకి తరలిం చి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగేష్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతోపాటు సంతానం లేదని మదన పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం నగేశ్‌తో చరితకు వివాహమైంది. వీరి స్వగ్రామం హాలియా మండలం యాచారం. అక్కడినుంచి వచ్చి నల్లగొండలో స్థిరపడ్డాడు. క్షణికావేశంలోనే.. క్షణికావేశంలోనే యువకులు ఆత్మహత్యే శరణ్యంగా భావించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వస్తున్నారు. రైలు తాకిడికి వారి శరీరం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోతుండడంతో వాటిని తొలగించేందుకు మనస్సు గగుర్పొడుస్తుంది. అన్నం కూడా తినలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. – రైల్వే ఎస్సై, అచ్యుత్‌రామ్ -
‘డెత్‌ట్రాక్స్’పై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో రక్తసిక్తమవుతున్న రైలుపట్టాల గురించి ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘డెత్ ట్రాక్స్’ నివారణకు చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు అవకాశమున్న అన్ని చోట్లా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కలిసి కార్యాచరణ కొనసాగించనున్నట్లు చెప్పారు. జంటనగరాల్లో ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలపై.. ‘డెత్‌ట్రాక్స్’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురిం చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కదిలిన రైల్వే శాఖ.. పోస్టర్లు, కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రచారం చేయడంతోపాటు రైల్వే చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించింది. గతంలో కంటే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పట్టాలు దాటకుండా అనేక చర్యలు చేపట్టామని రాకేశ్ తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్నట్లు గమనించామన్నారు. అవసరమైన అన్ని చోట్లా సైడ్‌వాల్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజల భద్రత దృష్ట్యా ట్రాక్‌లపై రైల్వే శాఖ చేపట్టే అవగాహన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని సుమారు 48 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ట్రాక్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సీపీఆర్వో స్పష్టం చేశారు. -
రక్తమోడుతున్న రైలు పట్టాలు
కాజీపేట రూరల్ : రైలు పట్టాలు రక్తమో డుతున్నాయి. ఆత్మహత్యలకు అడ్డాలుగా మారు తున్నాయి. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల జీఆర్పీ పరిధులు సూసైడ్ స్పాట్లుగా మారుతు న్నాయి. ఉమ్మడి జిల్లాలో వరంగల్ నుంచి తాళ్లపూసపల్లి మధ్యలో నిత్యం ఎవరో ఒకరు మృత్యు వాత పడుతున్న సంఘటనలున్నాయి. ఇక కొన్ని ప్రమాదాలైతే వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు అరకిలో మీటరు దూరంలోపే జరుగుతుండడం విశేషం. తాజాగా గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన హమాలీ కార్మికుడు గట్ల శాంతయ్య(50) స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ ఫాంలోని పట్టపగలు హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లు ముట్టుకుని అందరూ చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అలాగే ఇదే రోజు అండర్ బ్రిడ్జిపైన ఓ వృద్ధురాలు (60) ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఘటనలు సుమారు కిలో మీటర్ లోపలే జరగడం సంచలనం రేపుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఆత్మహత్యలను నివారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. వరంగల్ పరిధిలో.. నగరంలోని వరంగల్ రైల్వే స్టేషన్ జీఆర్పీ పరిధి ఇటు కాజీపేట దర్గా, అటు తాళ్లపూసపల్లి వరకు ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా వరంగల్ రైల్వే మినీ బ్రిడ్జి(సంతోషిమాతగుడి వద్ద), వరంగల్ చింతల్ ఆర్వోబీ, ధర్మారం గేట్, హంటర్‌రోడ్ ఆర్వోబీ, గూడ్స్‌షెడ్, రైల్వేగేట్, బొందివాగు, దర్గాగేట్ మొదలైన ప్రాంతాలు ఆత్మహత్యల స్పాట్లుగా ఉన్నాయి. అంతే కాకుండా వరంగల్ రైల్వేస్టేషన్ కూడా ఇందులో ఉంది. కాజీపేట పరిధిలో.. కాజీపేట జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి కాజీపేట, కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, పెండ్యాల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఇప్పగూడ, రఘునాథపల్లి, యశ్వంత్‌పూర్, జనగాం, పెంబర్తి వస్తాయి. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కడ రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యలు జరిగితే కాజీపేట జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తారు. పనిచేయనిసీసీ కెమెరాలు.. వరంగల్ రైల్వేస్టేషన్లో గతంలో 8 సీసీ కెమెరాలుండగా ఆ మధ్య మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 14 సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తెలిసింది. గురువారం ప్లాట్‌ఫాం-3లో శాంతయ్య అనే హమాలీ కార్మికుడు విద్యుత్‌పోల్ ఎక్కుతున్నపుడు సీసీ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉంది. కానీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడం ఇక్కడ సమస్యగా మారింది. అలాగే ప్లాట్ ఫాంల మీద బందోబస్తు నిర్వహించే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులైన శాంతయ్యను అడ్డుకుని ఉంటే ఒక ఆత్మహత్య చేసుకోకుండా ఉండేవాడని సాటి ప్రయాణికులు అనడం వినిపించింది. అప్పుడు పోలీసులు ఏంచేశారనేది ప్రశ్నార్థకం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆత్మహత్యల నివారణకు కావల్సిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు.. వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో గత జనవరి నుంచి మే నెల వరకు 14 మంది ఆత్మహత్య చేసుకోగా.. గత జూన్ నెల నుంచి ఈ ఆగస్టు ఈ మూడు నెలల్లో 24 మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం 38 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సంబంధిత జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఎక్కువగా కేఎం 375 నుంచి 376ల మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వారు వివరించారు. -
రైల్వే ప్రమాదాలపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు 'ప్రయాణికుల నిర్లక్ష్యం' అన్న సాకు చూపించే అవకాశం లేకుండా... ఏ చిన్న ప్రమాదం జరిగినా అందుకు తగ్గ పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ జారి పడి గాయాల పాలైనా లేదా ప్రాణాలు కోల్పోయినా.. అందుకు తగ్గ పరిహారం దేశీయ రైల్వేనే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనేందుకు వీలు లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది. ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124 ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పరిహారం ఇవ్వకుండా రైల్వే శాఖ తప్పించుకుంటోంది. ఓ మహిళ, 2002లో తన భర్త ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడిపోయిన సందర్భంగా తనకు రూ.4 లక్షల రూపాయల నష్టపరిహారం రైల్వే చెల్లించాలని కోరుతూ కోర్టుకు ఎక్కింది. రెండో క్లాస్ ట్రైన్ టిక్కెట్ తీసుకున్న తన భర్త జతన్ గోప్, ప్రయాణికుల రద్దీతో రైలు నుంచి జారీ పడిపోయి మరణించారు. అయితే గోప్ ప్రయాణికుడు కాదని, రైల్వే ట్రాక్‌పై తిరుగుతూ ఉన్నాడని దేశీయ రైల్వే వాదించింది. కానీ జతన్ గోప్ టిక్కెట్ కొనడం తాను చూశానని, తన కళ్ల ముందే రైలు నుంచి పడిపోయి చనిపోయాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ప్రస్తుతం రైలు ప్రమాద కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులను ఇస్తున్నాయి. ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రైల్వే మృతుల పరిహారం 8 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: రైల్వే ప్రమాదాల్లో ప్రాణాలు, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. నగదు సాయాన్ని రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే చట్టం–1989లోని నిబంధనలను సవరించింది. రైల్వే ప్రమాదాలు( నష్టపరిహారం) సవరణ నియమాలు–2016 ప్రకారం మృతులకు, చేతులు, కాళ్లు కోల్పోయిన వారికి, కుటుంబీకులకు నష్టపరిహారం పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన జారీచేసింది.