ప్రాణం తీస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీస్తున్నారు!

Published Sat, Jul 1 2023 8:00 AM | Last Updated on Sat, Jul 1 2023 8:01 AM

- - Sakshi

సాక్షి యాదాద్రి : సికింద్రాబాద్‌ – ఖాజీపేట cమార్గంలో దుండగుల అఘాయిత్యాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఫుట్‌బోర్డు జర్నీ చేస్తున్న వారిపైకి రాళ్లు, కర్రలు విసురుతున్నారు. సెల్‌ఫోన్ల కోసం ఒడిగడుతున్న ఈ దుశ్చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలోని బీబీనగర్‌, పగిడిపల్లి, భువనగిరి, ఆలేరు పరిధిలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ట్రాక్‌ పక్కన మాటువేసి..
ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, పగడిపల్లి, అనంతారం, భువగగిరి, ఆలేరు వద్ద ఇటీవల రైళ్లపై దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా క్రాసింగ్‌ల వద్ద, ట్రాక్‌ పనులు జరుగుతున్న చోట ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దొంగలు, ఆకతాయిలు ట్రాక్‌ పక్కన కాపు కాసి రైలు దగ్గరకు రాగానే ఫుట్‌బోర్డులో సెల్‌ఫోన్లు చేతిలో పట్టుకుని కూర్చున్న ప్రయాణికులపై రాళ్లు, కర్రలు రువ్వుతున్నారు. సెల్‌ఫోన్లు కింపడగానే దుండగులు వాటిని తీసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికులు తమ చేతిలోనుంచి సెల్‌ఫోన్లు కిందపడుతున్న క్రమంలో అందుకునేందుకు చేసే ప్రయత్నంలో రైల్‌లో నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా రెండు నెలల క్రితం ఆలేరు బీసీ కాలనీ సమీపంలో నలుగురు యువకులపై రాళ్లు రువ్విన ఘటనలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

చోటు చేసుకున్న ఘటనలు ఇలా..
అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా నమోదైన కేసులన్నీ 20 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపువారే కావడం గమనార్హం. ఇవన్నీ బీబీనగర్‌ నుంచి భువనగిరి మధ్యలోనే జరిగాయి. మార్చి 6, మార్చి 7, ఏప్రిల్‌ 21, ఏప్రిల్‌ 24, జూన్‌ 20, జూన్‌ 22, జూన్‌ 28వ తేదీ వరకు ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లలోనుంచి జారిపడి మృతి చెందినట్లుగా కేసులు నమోదు చేశారు. అయితే 22వ తేదీన పగడిపల్లి వద్ద రైల్‌ లోంచి జారిపడిన కేసులో బిహార్‌కు చెందిన రతన్‌(29)గా, 28న చోటు చేసుకున్న ఘటనలో ముపుప శ్రీకాంత్‌గా గుర్తించారు. ఒకే తరహాలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలపై విచారణ జరిపించాలని, ట్రాక్‌వెంట కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైళ్లలో వెళ్తున్న ప్రయాణికులపై దాడులు

ఫ ఫుట్‌బోర్డులో ఉన్నవారిపైకి రాళ్లు, కర్రలు విసురుతున్న దుండగులు

ఫ సెల్‌ఫోన్ల కోసం ఘాతుకం

ఫ కిందపడ్డ ఫోన్లను తీసుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు

ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు

ఫ మార్చి నుంచి ఏడుగురు మృతి

ఫ గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు

హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం నెరేళ్ల గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సెలవు ఉండడంతో బుధవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి శాతవాహన సూపర్‌ ఫాస్ట్‌ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ఖాజీపేటకు బయలుదేరాడు. రైల్‌ ఫుట్‌బోర్డులో నిలబడి సెల్‌ఫోన్‌ చూస్తుండగా బీబీనగర్‌ సమీపంలో ట్రాక్‌ పక్కన కాపుకాసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శ్రీకాంత్‌పై కర్ర విసిరారు. ఈ ఘటనలో శ్రీకాంత్‌ చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ కిండపడింది. ఫోన్‌ తీసుకునే ప్రయత్నంలో శ్రీకాంత్‌ రైలు కింద పడిపోయాడు. ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగడంతో రైలు కొద్దిదూరం వెళ్లి ఆగింది. వారంతా వచ్చి చూడగా అప్పటికే శ్రీకాంత్‌ మృతి చెందాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement