Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Tirumala Laddu Row: AP High Court Key Comments1
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం.. హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్‌ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది.

 Tennis Stars Father Owned Multiple Properties2
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!

నెలకు రెంట్‌ల రూపంలో రూ. 15 నుంచి 17 లక్షల వరకూ ఆదాయం. ఒక లగ్జరీ ఫామ్‌ హౌస్‌. ఇంకా పలు రకాలైన ఆస్తులు. విలాసవంతమైన జీవితం. ఆ ఊరిలో శ్రీమంతుడు అనే హోదా. పెద్ద మనిషి అని ఊరి వాళ్లు తగిలించిన బిరుదు. చేతికి ఒక లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనిషి అంటే కాసింతైనా ఇలా బ్రతకాలనిపిస్తుంది కదూ. ఇక్కడ ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి.. సిరి సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్‌ చేశాడు. దాంతో పాటు కాస్త అహంకారం, మూర్ఖత్వం కూడా ఉన్నట్లు ఉంది. అదే ఇప్పుడు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అహంకారానికి పోయి కూతురి ప్రాణాల్ని తీసి జైలు పాలయ్యాడు. కారణాలు ఏమైనా మూర్ఖత్వానికి పోయి ఎంతో గారాబంగా చూసుకున్న కూతుర్ని చంపడం ఒకటైతే, ప్యాలెస్‌ లాంటి భవనంలో బ్రతికిన ఆ వ్యక్తి ఇప్పుడు కఠిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. 49 ఏళ్ల దీపక్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఇప్పుడు కన్న కూతురి హత్య కేసులో ఒక్కసారిగా ‘విలన్‌’ అయిపోయాడు. ఇన్‌ స్టా రీల్స్‌ చేసిందని కూతుర్ని చంపేశాడు..!హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌ సుశాంక్‌లో ఫేజ్‌-2లో నివాసముంటున్న దీపక్‌ యాదవ్‌.. టెన్నిస్‌ ప్లేయర్‌ అయిన కూతురు రాధికా యాదవ్‌ను హత్య చేశాడు. తన లైసెన్స్‌డ్‌ రివాల్సర్‌తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కూతురి ప్రాణాలు తీశాడు. కూతురు భవిష్యత్‌ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూతురు తనకు నచ్చని సోషల్‌ మీడియా వీడియో ఒకటి చేసిందని, అందుకే చంపేశానని దీపక్‌ యాదవ్‌ అంటున్నాడు. తనకు వద్దని చెప్పినా వినలేదని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకూ వెళ్లిందని దీపక్‌ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం పోలీస్‌ దర్యాప్తు జరుగుతుండగా, అసలు ఏం జరిగిందనే దానిపై మీడియా ఆరా తీసింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియా చానెల్‌ ఎన్డీటీవీ రిపోర్ట్‌ ఆధారంగా అసలు హత్యకు ఈ కారణాలు కాకపోవచ్చనేది ఆ కుటుంబంతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.కూతురంటే అత్యంత గారం..ఈ ఘటనపై దీపక్‌ సొంత గ్రామం వాజిరాబాద్‌లో అతనితో పరిచయమున్న ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. అసలు కూతుర్ని చంపాల్సిన అవసరం దీపక్‌ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అతనికి ఆస్తు-పాస్తులు అన్నీ ఉన్నాయి. విలాసవంతమైన జీవితం అతనిది. కూతురంటే అత్యంత గారం. కూతురు టెన్నిస్‌ ప్లేయర్‌ అవ్వడం కోసం రూ. 2 లక్షల పెట్టి రాకెట్‌ తీసుకొచ్చాడు. కూతురు ఈ హోదాకు రావడానికి దీపకే కారణం. కూతురు రాధికా యాదవ్‌ టెన్నిస్‌ అకాడమీ పెట్టినందుకో, ఇన్‌ స్టా రీల్స్‌ చేసినందుకో ఆమెను దీపక్‌ హత్య చేశాడనేది నమ్మశక్యంగా లేదు. ఇంకేదో కారణం ఉండి ఉండొచ్చు’ అని సదురు గ్రామస్తుడు తెలిపాడు.25 ఏళ్లకే టెన్నిస్‌ అకాడమీ..టెన్నిస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన రాధికా యాదవ్‌.. ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 113వ స్థానంలో ఉంది. ఎన్నో పోటీలు ట్రోఫీలు గెలిచి తనకంటూ ఏర్పరుచుకున్న రాధిక.. 25 ఏళ్ల వయసులోనే టెన్నిస్‌ అకాడమీ కూడా ప్రారంభించింది. ఇందులో ఎంతోమందికి ట్రైనింగ్‌ ఇస్తుంది రాధికా. గురుగ్రామ్‌ సెక్టార్‌ 57లో ఒక టెన్నిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ను రాధికా యాదవ్‌ రన్‌ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. టెన్నిస్‌ ప్లేయర్‌ను.. హత్య చేసిన తండ్రి!

Chandrababu Comedy At World Population Day Event3
బాబోరు మళ్లీ ఏసేశారు..!

చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్‌కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వంటివి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు).ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్‌. నారా లోకేష్‌కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్‌!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.-సిమ్మాదిరప్పన్న

Delhi Woman Plots Husband's Phone Snatching4
లవర్‌తో దిగిన ఫోటోలు భర్త ఫోన్‌లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!

న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్‌లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్‌ తీసుకుని లవర్‌తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్‌ చేయాలనే ప్లాన్‌ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్‌ మ్యాప్‌ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్‌కు ఏ రూట్‌లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్‌ టైమింగ్స్‌ అన్ని షేర్‌ చేసింది. భర్త ఫోన్‌లో లవర్‌తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్‌తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్‌తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్‌ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్‌ గోహ్లత్‌ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్‌ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్‌ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్‌ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్‌తో దిగిన ఫోటోలను డిలీట్‌ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్‌ అవుట్‌ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్‌ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్‌) డీసీపీ అంకిత్‌ చౌహాన్‌ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్‌ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్‌ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది.

Video Goes Viral Maha Minister Seen With Bag Allegedly Full Of Cash5
వామ్మో.. మంత్రి గారి బ్యాగ్‌ చూస్తే షాకే!

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ ఇప్పుడు ఆ వీడియోతో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ మంచంపై కూర్చొని సిగరెట్‌ కాల్చుకుంటూ ఫోన్‌లో మాట్లాడున్న సమయంలో పక్కనే ఒక బ్యాగ్‌ ఉంది. అయితే ఆ బ్యాగ్‌లో భారీ నగదు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధానంగా ఆయన గత ఐదేళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. సదరు మంత్రి పైసా తీసుకోకుండా ఏ పని చేయ్యడనే ఆరోపణలు కూడా చుట్టుముట్టిన తరుణంలో ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తనకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు అందిన విషయాన్ని మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌ కూడా అంగీకరించారు. దీనిపై స్పందిస్తానని, తనపై అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన పక్కన సూట్‌కేసులో భారీగా డబ్బులున్నాయనే విషయంపై కూడా ఆయన స్పందించారు. ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెబుతూనే, ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఆయన ఆస్తులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా పెరగడం కూడా అనుమానాలకు దారి తీసింది. Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025 ఈ క్రమంలోనే మంత్రిపై పలువురు వ్యక్తులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని, ఆ క్రమంలోనే తాను నోటీసు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించడానికి తనకు తగినంత సమయం కావాలని మంత్రి వేడుకుంటున్నారు. మంత్రి సంజయ్‌ శిర్‌సాత్‌.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌(వెస్ట్‌) నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ శివసేన పార్టీకి చెందిన శిర్‌సాత్‌ ఆస్తులు గత ఐదేళ్లలో గణనీయంగా ఎలా పెరిగాయనే దానిపై వివరణ ఇవ్వాలని ఐటీ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు ఇచ్చింది.

Rishabh Pant confirmed to bat at No. 5 despite painful net session,6
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్‌..

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కార‌ణంగా ఫీల్డింగ్‌కు దూర‌మైన వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. తిరిగి బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చేందుకు పంత్ ప్యాడ్స్ క‌ట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.కాగా తొలి రోజు ఆట సంద‌ర్భంగా బుమ్రా బౌలింగ్‌లో పంత్ చూపుడు వేలికి గాయ‌మైంది. దీంతో ఆట మ‌ధ్య‌లోనే మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆట‌లో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అత‌డి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన పంత్‌..అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిష‌బ్ పంత్‌.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సంద‌ర్బంగా అత‌డు కాస్త ఆసౌక్యర్యంగా క‌న్పించాడు.ఇంకా అత‌డికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి త‌గ్గ‌న‌ట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికి జ‌ట్టు అవ‌స‌రం దృష్ట్యా అతడు బ్యాటింగ్‌కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీల మోత మ్రోగించిన పంత్‌.. రెండో టెస్టులో హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

Prakasam Ongole Kid Lakshit Incident Mystery Still Continue7
Ongole: పాపం పసివాడు

చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్‌ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్‌దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్‌ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్‌ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్‌లక్షిత్‌ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్‌వాడీ టీచర్లపైనే లక్షిత్‌ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్‌ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్‌ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్‌ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Sanyasi Comment Goes Viral in Kannappa Special Premiere at Vijayawada8
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రకటించినప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయి. టీజర్‌ విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. కానీ ఆ వెంటనే రిలీజ్‌ చేసిన పాటతో ట్రోలింగ్‌ అంతా మట్టికొట్టుకుపోయింది. ట్రైలర్‌ కూడా బాగుండటంతో నెగెటివిటీ కాస్తా పాజిటివిటీగా మారిపోయింది. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సాధువులతో సినిమా చూసిన మోహన్‌బాబుకన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కన్నప్ప సినిమాను జూలై 8న విజయవాడలో ప్రదర్శించారు. అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్‌బాబు సినిమా చూశారు.కొంచెం మసాలా పెట్టినప్పటికీ..అనంతరం స్వామీ సదానందగిరి మాట్లాడుతూ.. ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ, శంకరాభరణం చూశాం. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశాం. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ.. నిజమైన భక్తిని దర్శకుడు, రచయిత అద్భుతంగా చూపించారు.ఆ పాటల వల్లే..సన్యాసులమైన మాకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించింది. ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లం. అది మా సన్యాసి బుద్ధి. అయితే ఆ పాటల్లోనూ ఎటువంటి అసభ్యత లేదు. ఆ కాలపు నాగరికత ఆధారంగానే తీశారు అని పేర్కొన్నారు. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.చదవండి: ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి

KSR Comment: How Kutami Prabhutvam Increase YS Jagan Charisma9
జగన్‌ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!

మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్‌, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్‌ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

south central railway ticket cancellations full details10
ట్రైన్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చ‌ద‌వండి!

దూర ప్ర‌యాణాలు అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట్రైన్‌. శుభ‌కార్యాలు, పండగ‌లు, ప‌నుల నిమిత్తం ఎక్కువ దూరం వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు సాధార‌ణంగా రైలు ప్ర‌యాణానికే ప్రాధాన్య‌త ఇస్తుంటాం. అయితే ట్రైన్ జ‌ర్నీ చేయాలంటే ముందుగా టికెట్ రిజ‌ర్వు చేసుకోవాలి. పండ‌గ‌లు, సెల‌వులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో రైలు టికెట్ల‌కు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత పేరుకుపోయి ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్న‌వారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్‌లోని వారికి ప్రాధాన్య‌తా క్ర‌మంలో టికెట్ దొరుకుతుంది. ప్ర‌యాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్‌లోని టికెట్ క‌న్ఫామ్ కాక‌పోయినా డ‌బ్బులు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ‌. నిబంధ‌న‌ల మేర‌కు కొంత మిన‌హాయించుకుని మిగ‌తా మొత్తాన్ని మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు రిఫండ్ చేస్తుంది. టికెట్ క్యాన్సిలేష‌న్స్‌ ద్వారా రైల్వేకు భారీగానే ఆదాయం వ‌స్తోంద‌ని తాజాగా వెల్ల‌డైంది.టికెట్ల ర‌ద్దు.. పెద్ద ప‌ద్దే!సికింద్రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే.. టికెట్ క్యాన్సిలేష‌న్స్‌ (ticket cancellations) ద్వారా గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో దాదాపు రూ. 700 కోట్లు ఆర్జించిన‌ట్టు తెలిసింది. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వార్షిక ఆదాయంలో ఇది 3.5 శాతం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ ద‌ర‌ఖాస్తు ద్వారా ఈ వివ‌రాలు రాబ‌ట్టింది. ప్ర‌యాణికుల ద్వారా 2024-25లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేకు వ‌చ్చిన‌ ఆదాయం రూ. 5,710 కోట్లు. 2024లో 1.4 కోట్ల టికెట్లు క్యాన్సిల్ కాగా, ఇందులో 65 ల‌క్ష‌లు వెయిటింగ్‌లిస్ట్‌లోనివే. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెయిటింగ్‌లిస్ట్ ప్ర‌యాణికుల సంఖ్య‌ గ‌త 4 ఏళ్ల‌లో నాలుగింత‌లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. 2021లో 15.96 ల‌క్ష‌ల‌ టికెట్లు క్యాన్సిల్ కాగా, 2024లో ఈ సంఖ్య 65.62 ల‌క్ష‌ల‌కు పెరిగింది. ఈ ఏడాది జ‌న‌వరి నుంచి మే నెల‌ వ‌ర‌కు 31.52 ల‌క్ష‌ల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. రిఫండ్ ఎంత‌?రైల్వే నిబంధ‌న‌ల ప్ర‌కారం.. క‌న్ఫామైన టిక్కెట్‌ను.. ప్ర‌యాణానికి 12 నుంచి 48 గంట‌ల ముందు ర‌ద్దు చేసుకుంటే టికెట్ ధ‌ర‌లో 25 శాతం మిన‌హాయించుకుని మిగ‌తా మొత్తం జ‌మ అవుతుంది. ప్ర‌యాణానికి 4 నుంచి 12 గంట‌ల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే స‌గం మొత్తం మాత్ర‌మే రిఫండ్ వ‌స్తుంది. వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ క‌న్ఫామ్ కాకుంటే క్ల‌రిక‌ల్ చార్జి కింద రూ. 60 తీసుకుని మిగ‌తా మొత్తం తిరిగిచ్చేస్తారు.'ర‌ద్దు'డే రుద్దుడు!కాగా, రైల్వే శాఖ క్యాన్సిలేష‌న్ చార్జీలు ఎక్కువ‌గా వ‌సూలు చేస్తోంద‌ని ప్ర‌యాణికులు వాపోతున్నారు. క‌న్ఫార్మ‌డ్ టికెట్ బుక్ చేసినప్పుడు నామినల్ చార్జీలు తీసుకుంటున్నార‌ని, మరి వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ కన్ఫామ్ కాక‌పోయినా క్ల‌రిక‌ల్ చార్జి ఎందుకు వ‌సూలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ టికెట్లు తీసుకోకుండా ఉండేందుకే క్యాన్సిలేష‌న్ చార్జీలు వ‌సూలు చేస్తున్న‌ట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. త‌మ జోన్ వార్షికాదాయంలో క్యాన్సిలేష‌న్ చార్జీల ద్వారా వ‌చ్చే మొత్తం చాలా స్వ‌ల్ప‌మ‌ని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు.చ‌ద‌వండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభ‌వం మీకు ఎదురైందా?2024-25లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ఆదాయ‌ గ‌ణాంకాలుమొత్తం ఆదాయం: రూ.20,569 కోట్లుస‌ర‌కు రవాణా: రూ.13,864 కోట్లుప్ర‌యాణికులు: రూ. 5,710 కోట్లుపార్శిల్‌, టికెట్ చెకింగ్‌: రూ.513.6 కోట్లుపార్కింగ్‌, కేట‌రింగ్‌, యాడ్స్‌: 402.7 కోట్లు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement