Yadadri District Latest News
-
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు!
ఉమ్మడి జిల్లాలో 72 కళాశాలలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 72 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 9, ఎయిడెడ్ 2, అటానమస్ 2, ప్రైవేట్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ , తృతీయ సంవత్సరం విద్యార్థులు 15 వేల వరకు ఉన్నారు. వీరంతా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. భువనగిరి: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరి ధిలో ఈనెల 14నుంచి జరగాల్సిన పరీక్షలపై విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు మరో సారి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేసేందుకు శుక్రవారం వారితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కళా శాలలు యాజమాన్యాలు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మంత్రులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గత నెల 1నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్, 11నుంచి ప్రారంభం కావాల్సిన సబ్జెక్ట్ పరీక్షలను నిర్వహించబోమని చేతులెత్తేశాయి. కాగా ఈ నెల 14నుంచి 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఈ నెల 6న షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో తాము లేమని ప్రైవేట్ కళాశాలలు మరోసారి స్పష్టం చేయడంతో పరీక్షలు ప్రారంభం అవుతాయా.. లేదోనని విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. ఉన్నత చదువులకు ఇబ్బందులు ఫీజు బకాయిలు, పరీక్షలకు ముడిపెట్టవద్దని యూనివర్సిటీ అధికారులు కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెబుతున్నా సేసేమిరా అంటున్నాయి. పీజీ ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావచ్చన్న ఆశతో విద్యార్థులు ఉన్నారు. కానీ, తాజా పరిణామాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫ బహిష్కరిస్తున్నట్లు మరోసారి ప్రకటించిన ప్రైవేట్ కాలేజీలు ఫ ఆందోళనలో విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లోనే నిర్ణయం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయ డం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. అద్దె భవనాలకు కిరాయి, అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. పీజీ సెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. వారికి జరుగుతుందని తెలిసినా విధిలేని పరిస్థితుల్లోనే పరీక్షల నిర్వహణకు ముందుకు రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. –బి.సూర్యనారాయణరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
టెక్స్టైల్స్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
భూదాన్‌పోచంపల్లి, భువనగిరిటౌన్ : హ్యాండ్లూం టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 205–26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలం కోర్సు వ్యవధి ఉంటుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూండ్లూమ్ టెక్నాలజీలో ఈనెల 16న కోర్సుపై అవగాహన సదస్సు ఉంటుందన్నారు. గుట్ట క్షేత్రంలో డిజిటలైజేషన్యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అన్ని విభాగాలు, కౌంటర్లను డిజిటలైజ్ (కంప్యూటరైజ్డ్) చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకట్రావ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈగవర్నెన్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన, సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట భువనగిరి: వేసవిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహించాలని డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 9,16,23,30 తేదీల్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అమ్మ అదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక బడిబాట నిర్వహించాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను కలిసి బడిలో చేర్పించాలన్నారు. వారి తల్లిదండ్రులను సైతం కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామపెద్దలు, యువత సహకారంతో పిల్లలను బడిలో చేర్చేవిధంగా కృషి చేయాలని కోరారు. ఐకేపీ ఏపీఎంకు అవార్డు బీబీనగర్: ఐకేపీ బీబీనగర్ మండల ఏపీఎం శ్రీనివాస్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించడంతో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. 15 నుంచి సమ్మర్ క్యాంపులు భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15నుంచి వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులు క్యాంపులో పాల్గొనేందుక అవకాశం ఉంటుందని, జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. యోగాతో పాటు ఆటలపోటీలు, సీడ్‌బాల్ తయారీ, ఆర్ట్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ తయారీ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వేసవి శిబిరాలు కొనసాగుతాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెరువులను సర్వే చేయండిభువనగిరిటౌన్ : హెచ్ఎండీఏ పరిధిలో 242 చెరువులు ఉన్నాయని, వీటిని సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలో, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చెరువులతో పాటు కాలువలను సర్వే చేయాలన్నారు. సర్వే నివేదికను ప్ర భుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, పక్కాగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ డీఈ నరసింహ ఉన్నారు. -
సుందరీమణుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈనెల 15వ తేదీన యాదగిరిగుట్ట క్షేత్రం, భూదాన్‌పోచంపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.గుట్ట, పోచంపల్లికి వచ్చే ప్రధాన మార్గాలను అర్చీలు, స్వాగత తోరణాలతో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.సుందరీమణులు పర్యటించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ అధికారులు ముందస్తుగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని, బ్యాటరీ వాహనాలు, రోప్‌వే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, గుర్తింపు పొందిన ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అకాల వర్షాల దృష్ట్యా జేసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ఏసీపీలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
ఆస్తిపన్ను వసూళ్లు రూ.3.20 కోట్లు
భువనగిరిటౌన్ : మున్సిపల్ శాఖ ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీంకు మంచి ఆధరణ లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ అవకాశం ప్రకటించింది. ఇందులో భాగంగా గడిచిన 38 రోజుల్లో వేలాది మంది ముందుకువచ్చి ఆస్తిపన్ను చెల్లించారు. ఐదు మున్సిపాలిటీల్లో 3 కోట్ల 22లక్షల 20వేలు వసూలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఏప్రిల్ 1నుంచి 31వ తేదీ వరకు మున్సిపల్ శాఖ ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈసారి వరుస సెలువులు రావడంతో పాటు మున్సిపల్ యంత్రాంగం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఫ్లెక్సీలు, ఆటోల ద్వారా ప్రచారం ఎర్లీబర్డ్ పథకంపై మున్సిపల్ యంత్రాంగ విస్తృతంగా ప్రచారం చేసింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఆటో ద్వారా ప్రచారం కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు ఇచ్చేందుకు మున్సిపాలిటీలకు వచ్చే ప్రజలకు ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవిధంగా సఫలీకృతమైంది. మున్సిపాలిటీలవారీగా వసూలు ఇలా.. ● భువనగిరిలో ఆస్తిపన్ను రూ.9.28 కోట్లు డిమాండ్ కాగా.. ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించడంతో రూ.1.61 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.7.67 కోట్లు వసూలు కావల్సి ఉంది. ● మోత్కూరులో రూ.1.49 కోట్లకు రూ.22 లక్షలు వ సూలయ్యాయి. రూ.1.27 కోట్లు పెండింగ్ ఉంది. ● యాదగిరిగుట్టలో రూ.3.44 కోట్లకు రూ.76 లక్షలు వసూలయ్యాయి. రూ.2.68 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ● భూదాన్‌పోచంపల్లిలో డిమాండ్ రూ.2.56 కోట్లు ఉండగా.. రూ.26.20 లక్షలు రాబడి వచ్చింది. రూ.29 కోట్లు పెండింగ్ ఉంది. ● ఆలేరు మున్సిపాలిటీలో రూ.2.36 కోట్లకు రూ.35 లక్షలు వసూలయ్యాయి. రూ.2.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఫ మున్సిపాలిటీల్లో ఐదు శాతంరాయితీకి మంచి ఆధరణ ఫ వేలాదిగా సద్వినియోగం చేసుకున్న పన్నుదారులు ఫ అత్యధికంగా భువనగిరిలో రూ.1.61 కోట్లు వసూలు -
ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన
భువనగిరిటౌన్ : సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అకారణంగా తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరిలోని బాబు జగ్జీవ న్‌రాం చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం తగదన్నారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐతో పాటు కుల, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజేఐ జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు కొలుపుల అమరేందర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ, ఏశాల అశోక్, బర్రె జహంగీర్, కందుల శ్రీనివాస్, ఎనబోయిన ఆంజనేయులు, టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌గుప్తా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, టీయుడబ్ల్యూజేఐ జేయు పట్టణ కార్యదర్శి కందుల శ్రీనివాస్, మాటూరు బాలరాజుగౌడ్, సురుపంగ శివలింగం, బూరుగు మణికంఠ, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూరెల్ల మల్లేష్, ఖాజా బాయ్, లక్ష్మీనారాయణ, పాక జహంగీర్, కనక బాలకృష్ణ, భువనగిరి శ్రీనివాస్, బండారు జగదీష్, గుర్రాల శివనాగేందర్, ఎస్డీ అఫ్జల్, ఎండీ జకీర్, నిమ్మల సురేష్, గడ్డం వెంకటేష్, సతీష్, బుగ్గ శ్రీను, శ్యామల శోభన్‌బాబు, నవీన్, హరిబాబు, ఇటుకల దేవేందర్, కైరంకొండ నవీన్, గుండేటి హరిబాబు, ఈరపాక నరసింహ, మాయ కృష్ణ, ఈరపాక నరసింహ, మాటూరి వెంకటేశ్వర్లు, ఎండీ జమాలుద్దీన్, శివనందుల రమేష్, లోడే చంద్రశేఖర్‌గౌడ్, వడ్లకొండ భరత్, కోరుటూరి ఉపేందర్, ఎర్ర శ్రీకాంత్, కూర వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసుల తనిఖీలను ఖండిస్తూ జర్నలిస్టుల ఆందోళన ఫ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు -
ప్రారంభించకుండానే శిథిలావస్థకు..
గుండాల మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది. బస్సుల కోసం ప్రయాణికులు ఎండ, వానలో నిరీక్షించకుండా ఎంపీ ల్యాండ్ నిధులతో బస్టాండ్ నిర్మించారు. కానీ, ఆర్టీసీ అధికారుల నిరక్ష్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం బస్టాండ్‌కు అమర్చిన షెట్టర్, కిటికీలు తుప్పుపట్టాయి. మరుగుదొడ్ల కిటికీలు, తలుపులు చెదలుపట్టాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సి వస్తుంది. బస్టాండ్‌ను ప్రారంభించి ఉపయోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. –గుండాల -
భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా..!
కోదాడ: కాశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టికరిపించి, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి మాజీ సైనికుడిగా తాను సెల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్ధావరాలను ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు. భారత సైన్యం ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందనీయన్నారు. తాను గతంలో భారత వైమానికదళంలో మిగ్ పైలెట్‌గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని, భారత్ సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు. ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఫ మాజీ సైనికుడిగా ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్నా ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పీహెచ్‌సీని సందర్శించిన యూనిసెఫ్ బృందం
భూదాన్‌పోచంపల్లి : యూనిసెఫ్ కన్సల్టెంట్ (ఢిల్లీ) క్యాతివాట్స్ బృందం గురువారం భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలు, ఆర్యోగ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఐరన్, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడే విధానం, వాటి ప్రయోజనాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశమై మాతాశిశు మరణాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెటర్నల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శిల్ప, న్యూట్రిషనిస్ట్ సౌజన్యతో, డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, వైద్యాధి కారిణి శ్రీవాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతారెడ్డి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
కనుల పండువగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశి సందర్భంగా గురువారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిన మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వ యంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజా భిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవో త్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
బునాదిగాని ఆధునీకరణ!
త్వరలో కాల్వ పనులు ప్రారంభం.. సిద్ధమవుతున్న యంత్రాంగంసాక్షి, యాదాద్రి : బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కాల్వ విస్తరణ, భూసేకరణ సాధ్యాసాధ్యాలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వానాకాలంలోగా వీలైన మేరకు పనులు పనులు చేపట్టాలని ఆదేశించారు. కాల్వ లోతు, వెడల్పు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.266.65 కోట్లు మంజూరు చేయగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. 98.64 కిలో మీటర్ల పొడవు ఆధునీకరణ భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో బునాదిగాని కాల్వను ఆధునీకరించనున్నారు. బీబీనగర్ మండలం మక్తా అనంతారం ఎర్రగుంట నుంచి బునాదిగాని కాల్వ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి భువనగిరి, వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం పెద్దచెరువు మీదుగా మోత్కూరు మండలం ధర్మారం ఊర చెరువు వరకు 98.64 కిలో మీటర్ల పొడవు కాల్వను ఆధునీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 50 క్యూసెక్కులు ఉంది. ఆధునీకరణలో భాగంగా కాల్వ పొడవు, వెడల్పు చేసి 350 క్యూసెక్కులకు పెంచనున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో భువనగిరి, వలిగొండ, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు కాల్వను ఆధునీకరించనున్నారు. భూ సేకరణే సమస్య బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే ముందుగా భూసేకరణ అవసరంలేని చోట పనులు చేపట్టాలని నిర్ణయించారు. భూ సేకరణకు రూ.44 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాల్వ వెడల్పు, లోతు పెంచడానికి భూసేకరణ చేయాలి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. తొమ్మిది రీచ్‌లుగా విభజన కాల్వ ఆధునీకరణ పనులను తొమ్మిది రీచ్‌లుగా విభజించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ నుంచి యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మక్తాఅనంతారం మీదుగా ముగ్ధుంపల్లి వరకు తొలి రీచ్ ఉండనుంది. కాల్వ ప్రారంభంలో 6.6 మీటర్ల వెడల్పు, లోతు 1.65 మీటర్లకు పెంచాలని నిర్ణయించారు. చివరి రీచ్‌లో రెండున్నర మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు. వానాకాలం లోగా కాల్వ పనులు ప్రారంభిస్తాం మూసీ కాల్వల ద్వారా అదనపు ఆయకట్టు స్థిరీకరించడం ప్రభుత్వ లక్ష్యం. పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వానా కాలం సాగు పనులు ప్రారంభించే లోపు కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తాం. యాసంగి పంటకాలానికి ముందు కూడా కాలువ పనులు చేస్తాం. ఇలా విడుతల వారీగి రైతులకు ఇబ్బందిలేకుండా పనులుచేస్తాం. ముందుగా భూసేకరణ అవసరం లేని పనులను ప్రారంభిస్తాం. భూసేకరణకు కూడానిధులు సిద్ధంగా ఉన్నాయి. రైతులు భూసేకరణకు సహకరించాలి. –కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫ తొలుత భూసేకరణ లేని చోట పనులు ఫ 350 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వ విస్తరణ ఫ రూ.266.65 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పంట కాలానికి ముందే పనులు వానాకాలంలోపే పనులు ప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బునాదిగాని కాల్వ వెంట పర్యటించి పరిశీలించారు. భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రైతులతోనూ చర్చించారు. కాల్వలో నీటి సామర్థ్యం పెరగడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చివరి భూముల వరకు సాఫీగా నీరందుతుందని, భూ సేకరణకు సహకరించాలని రైతులకు సూచించారు. యాసంగి సీజన్ ప్రారంలోపు పనులు పూర్తికాని పక్షంలో అవసరమైతే క్రాప్‌హాలిడే తీసుకుని పనులు పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నృసింహుడి జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రధానాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వస్తీవాచనంతో శ్రీకారం శుక్రవారం ఉదయం 8.45గంటలకు ఆలయంలో స్వస్తీవాచనంతో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం జరిపిస్తారు. తర్వాత లక్ష కుంకుమార్చన నిర్వహించి, తిరు వేంకటపతి అలంకార సేవలో ఆలయ తిరు, మాఢ వీధుల్లో స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం జరిపించి గరుఢ వాహనంపై పర వాసుదేవ అలంకార సేవను ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. ● శనివారం ఉదయం నిత్య నృసింహ మూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన నిర్వహించి స్వామిని కాళీయమర్ధన అలంకార సేవలో ఊరేగిస్తారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి జరిపి, హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో అలంకార సేవ నిర్వహిస్తారు. ● ఆదివారం ఉదయం 7గంటల నుంచి నృసింహ మూలమంత్ర హవనములు, 8.30గంటల నుంచి 9గంటల వరకు మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం చేపడతారు. సాయంత్రం 7గంటలకు విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తీ, నృసింహ ఆవిర్భావం, మహా నివేధన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవాలను ముగిస్తారు. పాతగుట్ట ఆలయంలో పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం శుక్రవారం నుంచే జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.45గంటలకు స్వస్తీవాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన జరిపిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహిస్తారు. సంగీత మహాసభలు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో భజన, భక్తి సంగీతం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు.. కళాకారులకు సైతం ఆహ్వానం అందజేశారు. ఆర్జిత సేవలు రద్దు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులచే నిర్వహించే నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు వంటి ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మూడుజుల పాటు భక్తులు ఇందుకు సహకరించాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ కోరారు.నేడు ఉదయం 8.45 గంటలకు స్వస్తీవాచనంతో శ్రీకారం ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అర్చకులు -
సుందరీమణుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: హైదరాబాద్‌లోని నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు సుందరీమణులు ఈ నెల 15వ తేదీన రానున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు రానున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి డీసీపీ ఆకాంశ్ యాదవ్, ఈఓ వెంకట్రావ్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొండ పైన ఏర్పాట్లు ఎలా ఉండాలనే అంశాలను ఈఓతో కలెక్టర్, డీసీపీ చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందాల భామలకు పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆలయ అధికారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రధానాలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వారి వెంట ఏసీపీ సైదులు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయాధికారులు దోర్బాల భాస్కర్‌రావు, రఘు, రాజన్‌బాబు, దయాకర్‌రెడ్డి తదితరులున్నారు. పోచంపల్లిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలనభూదాన్పోచంపల్లి: అందాల భామలు 15న పోచంపల్లికి కూడా రానున్న నేపథ్యంలో గురువారం పోచంపల్లిని స్పెషల్ బ్రాంచ్ డీసీపీ జి. నర్సింహారెడ్డి, ఏఆర్ డీసీపీ శ్యామ్‌సుందర్, అడిషనల్ డీసీపీ ఎం. వెంకట్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఐటీ ఏసీపీ నరేందర్, ఎస్డబ్ల్యూ ఏసీపీ శైలజ్కుమార్, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి సందర్శించారు. టూరిజం పార్కు ప్రాంగణం, పార్కులోని మ్యూజియం, గదులు, స్టాల్స్ ఏర్పాటు ప్రదేశాన్ని పరిశీలించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో తీసుకోవల్సిన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతురు, వారికి ఇచ్చే పాసులు, టూరిజం పార్కులో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను చౌటుప్పల్ ఏసీపీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.బుద్ధవనంలో మెడికల్ క్యాంపు.. నాగార్జునాసాగర్: నాగార్జుసాగర్ను ఈ నెల 12న అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో బుద్ధవనంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన బుద్ధవనం, విజయవిహార్ అతిథి గృహాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ మెడికల్ క్యాంపుతో పాటు స్థానిక కమలా నెహ్రూ ఆస్పత్రిలో అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్తో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ కేశ రవి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణకుమారి, పెద్దవూర మండల వైద్యాధికారి నగేష్, విజయ విహార్ మేనేజర్ కిరణ్‌కుమార్, బుద్ధవనం ఈఓ రవిచంద్ర తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలంలో నల్లగొండ–గుండ్లపల్లి రహదారిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యక్షాపురం గ్రామానికి చెందిన షేక్ మైబూషేన్(45) నల్లగొండకు వలస వచ్చి స్థానికంగా ఉంటూ.. నల్లగొండ నుంచి గుండ్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మైబూషేన్ డీజిల్ సప్లై చేసే వాహనం నడుపుకుంటూ గుండ్లపల్లి నుంచి నల్లగొండకు వస్తుండగా.. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పడంతో రహదారి పక్కన వ్యవసాయ భూమిలో ఉన్న సమాధులను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మైబూషేన్ను స్థానికులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గురువారం మృతుడి భార్య రమిజాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఆటో ఢీకొని ఒకరు దుర్మరణంమునుగోడు: బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందినా యంపల్ల నరేష్(30) బైక్‌పై నల్ల గొండకు వెళ్తుండగా.. గూడపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ రోడ్డుపై ఎగిరిపడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతియాదగిరిగుట్ట రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు–యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామాల మధ్యన రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఇన్చార్జి కృష్ణారావు తెలియజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. మహిళపై కేసునల్లగొండ: నల్లగొండ జిల్లా కోర్టులో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం తెలిపారు. కోర్టులో స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గాజుల జ్యోతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.50వేల చొప్పున 40 మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బాధితులు తిప్పర్తి, నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చిన డీఎస్పీ సూచించారు. -
భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి, కొడుకు
నార్కట్‌పల్లి: తమ భార్యలను తండ్రి, కొడుకు ఇంట్లో నుంచి గెంటివేయగా.. తమకు న్యాయం చేయాలని అత్త, కోడలు కలిసి ఇంటి ఎదుట దీక్షకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బద్దుల మల్లేష్ ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతడి మొదటి భార్య క్యాన్సర్‌తో మృతిచెందడంతో 2012లో యాదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మల్లేష్‌కు, అతడి మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో భార్యతో సంతానం కలగలేదు. కొంతకాలం మల్లేష్, అతడి రెండో భార్య యాదమ్మ కాపురం సజావుగానే సాగింది. పిల్లల పెళ్లిళ్లు అయిన తర్వాత యాదమ్మను మల్లేష్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మల్లేష్ మొదటి భార్య కుమారుడైన బద్దుల మహేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏపీలోని విజయవాడకు చెందిన దుర్గామల్లేశ్వరీని వివాహం చేసుకున్నాడు. అయితే మహేష్ కూడా తన భార్య దుర్గామల్లేశ్వరీతో పాటు మూడేళ్ల కుమారుడిని ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తమను ఇంట్లోకి రానీయకుండా తండ్రి, కొడుకు ఇంటికి తాళం వేసి వెళ్లడంతో తమకు న్యాయం చేయాలని గురువారం అత్త యాదమ్మ, కోడలు దుర్గామల్లేశ్వరి కలిసి నార్కట్‌పల్లిలోని మల్లేష్ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. పెళ్లి సమయంలో తన తల్లిగారు కిలో బంగారంతో పాటు విజయవాడలో ఓ ప్లాట్ ఇచ్చారని, తాను ఏం తప్పు చేశానని ఇంటి నుంచి వెళ్లగొట్టారని దుర్గామల్లేశ్వరీ కన్నీటి పర్యంతమైంది. వీరికి ఐద్వా నాయకురాళ్లు అండగా నిలిచారు. జల్సాలకు అటుపడి భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి మల్లేష్, కొడుకు మహేష్‌ను అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సరోజ, నాగమణి డిమాండ్ చేశారు. ఇంటి ముందు ధర్నాకు దిగిన అత్త, కోడలు -
ట్రాక్టర్ ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయాలు
తుంగతుర్తి: వరి ధాన్యం తూర్పార పడుతుండగా ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయమైంది. ఈ తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల విజయ తమ వరి ధాన్యాన్ని గ్రామ పరిధిలోని ఐకెపీ కేంద్రంలో పోశారు. గురువారం ఐకేపీ కేంద్రంలో ట్రాక్టర్‌కు పంక ఏర్పాటు చేసుకుని ఉప్పుల విజయ తూర్పార పడుతుండగా.. ఆమె చేయి ట్రాక్టర్ ఫ్యాన్ కు తగిలి కండరం తెగింది. విజయ చేయి నుంచి రక్తం కారుతుండడంతో అది చూసిన ఆమె భర్త నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. విజయను వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పతరికి తరలించారు. అక్కడి నుంచి సూర్యాపేట ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి విజయ చేతి ఎముక విరిగిపోయిందని, ఆపరేషన్ చేయాలని సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
11న గోమాతతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 11న అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాతతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు. గురువారం యాదగిరీశుడి ఆలయ సన్నిధిలో ఈఓ వెంకట్రావ్‌ను అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి గోమాతతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని విన్నవించారు. దీనిపై స్పందించిన ఈఓ.. గిరి ప్రదక్షిణ ప్రాధాన్యతను మరింత పెంచేందుకు గోమాతతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. అఖిల భారత గో రక్ష సమితి అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ.. గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 515 కిలోమీటర్లు 182 రోజులు 14 రాష్ట్రాలు ఒక చిన్న పుంగనూరు గోమాతతో పాదయాత్ర నిర్వహించామన్నారు. ఈ గోమాతతో పాటు 500 మంది గో భక్తులతో యాదగిరి దేవస్థానంలో ఈ నెల 11న ఉదయం 5గంటల నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడతామన్నారు. ఈఓను కలిసిన వారిలో హైందవ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, గో విజయ్‌కుమార్, తాటిపాల రాములుగౌడ్, అడ్వకేట్ సురేష్‌గౌడ్, రాఘవేంద్ర, మాణిక్‌యాదవ్, నాందేవ్, ఆకుల అనిల్, ఎరుకల అనిల్ కుమార్‌గౌడ్ ఉన్నారు. -
అమెరికాలో సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సంస్థాన్ నారాయణపురం: అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలోలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురకుల విద్యాలయం పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించారు. గురుకుల విద్యాలయంలో 1972–1975 మధ్య కాలంలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన వారు ఒకే చోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డి. సత్యనారాయణ, చెన్న రాజ, కె. రవికుమార్, కర్ర మల్లారెడ్డి, సీ. నారాయణ, ప్రభాకర్, బసిని వెంకటేశ్వర్లు, వనం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నేరేడుచర్ల: వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయం వీధికి చెందిన వృద్ధురాలు గుండా చంద్రకళ ఇంటికి గురువారం గుర్తుతెలియని మహిళ వచ్చి తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగింది. దీంతో చంద్రకళ ఇంట్లోకి వెళ్లి బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి ఆ మహిళకు ఇచ్చింది. ఆమె నీళ్లు తాగినట్లు చేసి బాటిల్ మూతను కింద పడేసింది. కిందపడిన బాటిల్ మూతను చంద్రకళ తీసేలోపే ఆమె కళ్లలో గుర్తుతెలియని మహిళ కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును లాక్కోని పారిపోయింది. చంద్రకళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వివరాలు తెలుసుకున్నారు. చంద్రకళ కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మెడలోని పుస్తెలతాడు అపహరణ -
రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
రామగిరి(నల్లగొండ): రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా నాయకులు మంగళవారం నలగొండ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో రైల్వే వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైల్వే రంగంలో భద్రతా చర్యలు పెంచాలని, ప్రమాదాలు అరికట్టాలని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల సరుకు రవాణా చార్జీలు పెరగడంతో వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. ప్రయాణికుల భద్రత కోసం సరైన చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్యాసింజర్ రైళ్లు పెంచాలని, రైళ్లల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, అవుట రవీందర్, నకరెకంటి సత్తయ్య, లింగస్వామి, వెంకన్న, రాధాకష్ణ పాల్గొన్నారు. -
ఈదురుగాలులకు ఒరిగిన ధ్వజ స్తంభం
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలో మంగళవారం భారీ ఈదురుగాలులతో కూడి వర్షం కురవగా.. గ్రామ శివారులోని పురాతన శ్రీలక్ష్మీనృసింహస్వామి, మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం ఒక పక్కకు ఒరిగింది. శివాలయంలోని భారీ చెట్లు నేలకొరిగాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా 1995లో ఇండియా సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్లు కొందూటి సిద్ధయ్య, పొదిల శ్రీనివాస్ తెలిపారు. విశిష్టమైన ఆలయాలు దెబ్బతినడం పట్ల అర్చకులు నాగేంద్రప్రసాద్శర్మ, సాంబశివరావుశర్మ, రామానుజాచార్యులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు.. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన మాదగాని లోకేశ్(24), కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దోనిబావి గ్రామానికి చెందిన రాచకొండ నిఖిల్(21) స్నేహితులు. లోకేశ్ ఐటీఐ పూర్తిచేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారుచేసే కంపెనీలో అంప్రెంటీస్ చేస్తున్నాడు. నిఖిల్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. లోకేశ్ మంగళవారం హైదరాబాద్ నుంచి బైక్‌పై పెద్దోనిబావి గ్రామానికి వచ్చి నిఖిల్‌ను పిలుచుకొని నకిరేకల్ మీదుగా 365వ నంబర్ జాతీయ రహదారిపై అర్వపల్లి వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాచకొండ నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో పాటు కారును నడుపుతున్న మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన దేశగాని విఠల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్, విఠల్‌ను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఇద్దరు యువకులు దుర్మరణం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
తిప్పర్తి: అతివేగంగా వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అనంతరం ఆ కారుపై విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఈ ఘటన తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో గుంటూరుకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడిపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం -
బావిలో పడి బాలుడు మృతి
వలిగొండ: సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ఎం. తుర్కపల్లిలో సోమవారం జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లికి చెందిన బట్టు సుధాకర్ చిన్న కుమారుడు బట్టు చరణ్(12) చెవిటి, మూగవాడు. సోమవారం మధ్యాహ్నం సుధాకర్ సోదరుడి కుమారుడు బట్టు గౌతంతో కలిసి చరణ్ ఎం. తుర్కపల్లి గ్రామానికే చెందిన తుమ్మల బాల్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరికి ఈత రాకపోవడంతో బావి ఒడ్డున స్నానం చేస్తుండగా చరణ్ కాలుజారి బావిలో పడిపోయాడు. భయంతో ఇంటికి వెళ్లిన గౌతం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. సాయంత్రం వరకు చరణ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చరణ్ బావిలో పడిన విషయాన్ని గౌతం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటార్లతో నీటిని తోడుతుండగా చరణ్ మృతదేహం లభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేతహుజూర్నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టకున్నారు. వివరాలు.. చిలుకూరు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి కొందరు అక్రమార్కులు టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాలుగు మట్టి టిప్పర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. మట్టి టిప్పర్లను పట్టకున్న విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేశామని, వారు జరిమాన విధిస్తారని చెప్పారు. ఎవరైనా అధికారుల అనుమతి లేకుండా మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలన చేతకాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని, అయినా పదేండ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని అన్నారు. ఆదాయ వ్యయాల్లో కేసీఆర్‌కు, రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రేవంత్ మాట్లాడిన ప్రతిమాట అబద్దమని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టే కేసీఆర్ హామీలిచ్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేసిండని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. గాలిమోటర్లో తిరిగి.. అప్పులు పుడతలేవంటున్నరని, సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని చెప్పారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి -
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికనకిరేకల్: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కొప్పుల శ్రీజ ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్ ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శ్రీజ గత నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీజ పాల్గొంటుందని తెలిపారు.రసాయన వ్యర్థాల శాంపిల్స్ సేకరణచివ్వెంల(సూర్యాపేట): లారీల్లో రసాయనిక వ్యర్థాలు తీసుకొచ్చి సోమవారం రాత్రి చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన రహదారి పక్కన వదిలిపెట్టారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రోడ్డు పక్కన పారబోసిన రసాయనిక వ్యర్థాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వ్యర్థాలు వదిలిన లారీలను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
అధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కోర్టులోని ఆయన చాంబర్లో జాతీయ లోక్ అదాలత్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని న్యాయమూర్తులు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. జూన్ 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి దాదాపు 3228 రాజీ పడదగు అన్ని క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. అత్యధిక కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, ఏపీపీఓలు సౌజన్య, పద్మజ, చంద్రశేఖర్, అవినాష్, పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, కోర్టు కానిస్టేబు ల్స్ పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జయరాజు -
రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూరు(ఎం): భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం, రహీంఖాన్‌పేటలో ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. సందర్భంగా రాఘవాపురంలో నాలుగు, రహీంఖాన్‌పేటలో 31 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. సమావేశంలో ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ లావణ్య, వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీటీ ఎండీ షఫీయోద్దీన్, ఆర్ఐలు మల్లిఖార్జునరావు, పాండు, సర్వేయర్ స్వప్న, సిబ్బంది నవనీత, సంజయ్, వనం రమేష్ పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలివలిగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శోభారాణి అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి మండల స్థాయి అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలోని నాతాళ్లగూడెంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలోని నర్సరీ, రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ పరిశీలించారు. అక్కంపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, ఏపీఎం జాని, ఎంపీఓ కేదారేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయం సిబ్బంది తదితరులున్నారు.విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలిసంస్థాన్ నారాయణపురం: వేసవి తరగతులకు హాజరై చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి భీంసింగ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. దూర ప్రాంతం విద్యార్థులకు బస్సు, హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ మాతేశ్వరి, అధ్యాపకులు ముత్యాలు, జనార్దన్, రమేష్, నర్సింహ, లక్ష్మీనర్సింహ, మాధవి, శారద, మహేశ్వరి, జూవేద్ తదితరులున్నారు.లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలిభువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు వివిధ మండలాల్లోని బ్యాంక్ మేనేజర్లతో మంగళవారం భువనగిరిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పథకం జిల్లా సమన్వయకర్త నాగిరెడ్డి పథకం మార్గదర్శకాలను వివరించారు. మే 10 నాటికి తాత్కాలిక లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. బ్యాంకులకు పంపిన జాబితాలను పరిశీలన చేసి, దినసరి పరిశీలన పురోగతిని ఎంపీడీఓల ద్వారా ప్రధాన కార్యాలయానికి అందించాలన్నారు. సమావేశంలో భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, బీసీ, మైనారిటీ సంక్షేమ జిల్లా అధికారి యాదయ్య పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు వారు దూరం
భువనగిరి: జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో చదువులకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లించే పరిస్థితి లేక చదువులకు దూరం కావాల్సి వస్తోంది. జిల్లాలో రెండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు జిల్లాలో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలున్నాయి. వీటిలో రామన్నపేట, ఆలేరు ఉన్నాయి. భువనగిరి పట్టణంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం భువనగిరి.. మున్సిపాలిటీ కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉంది. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం ఏర్పాటు చేయడంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రయత్నం చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, భవనాలు సైతం చూశారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు సైతం తమను గెలిపిస్తే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీలు ఇచ్చారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. పేద విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ప్రతి ఏటా 1000 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు తప్ప ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ప్రైవేట్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్పులు రాక ఫీజు చెల్లించలేని పేద విద్యార్థులు డిగ్రీ చేయలేక ఇబ్బందులు పడుతూ చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా.. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3 నుంచి దోస్త్ తొలి దశ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మూడు విడుతల్లో కొనసాగనుంది.ఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాగానే జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫ భువనగిరిలో అమలు కాని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ ఫ ప్రారంభమైన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయం. పేద విద్యార్థులు గత్యంతరం లేక ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. స్కాలర్ షీప్ రాక ఫీజు చెల్లించలేక చాలా మంది చదువులకు దూరం అవుతున్నారు. ఇప్పటికై న స్పందించి భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. – లావుడియా రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిపోరాటం కొనసాగిస్తాం భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పారాటం చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం కూడా పారాటం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు పారాటాన్ని కొనసాగిస్తాం. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – మణికంఠ, ఏబీవీపీ ఉమ్మడి నల్లగొండ జిల్లా విభాగ్ కన్వీనర్ -
మెరికల్లాంటి కార్యకర్తలకే ప్రాధాన్యం
ఆలేరు: మెరికల్లాంటి కార్యకర్తలు, నాయకులకే గ్రామ, మండల, బ్లాక్‌స్థాయి పార్టీ పగ్గాల అప్పగింతలో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం లేక పదేళ్లు ఎంత గోస పడ్డామో మీకు తెలుసని,.. ఇప్పుడు అధికారంలోకి వచ్చామనే ధీమాతో ఉన్నా.. ఉదాసీనత ధోరణి వీడాలని సూచించారు. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో..వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యమనే విషయాన్ని విస్మరించొద్దన్నారు. పార్టీ పదవులు అలంకారప్రాయం కాకూడదని.. నిత్యం ప్రజలతో మమేకమవ్వాలన్నారు. సైనికుల్లా పనిచేసే వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడూ మరింత బాధ్యతగా గ్రామాలు, మండల స్థాయిలో పర్యటిస్తూ రాష్ట్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ పదవుల విషయంలో ఎవరూ పోటీ పడొద్దన్నారు. ఎవరేం చేస్తున్నారో హైకమాండ్ గమనిస్తోందన్నారు. సంస్థాగత ఎన్నికల్లో పదవులను తాను నిర్ణయించనని.. కార్యకర్తలు, నాయకుల అభీష్టమే ఫైనల్ అని చెప్పారు. ఈసారి కమిటీల్లో మహిళలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి పదవులతోపాటు తనవంతు ఆర్థిక సాయం అందించడానికి ముందుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు ధన్వంతరి, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఇన్చార్జి అనిల్, మదర్‌డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు ఎంఎస్ విజయకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ.ఇజాజ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.ఫ స్థానిక సమరంలో గెలుపే లక్ష్యం ఫ ఈసారి కమిటీల్లో మహిళలకు చోటు ఫ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
జమకాని వంట గ్యాస్ రాయితీ
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా మొత్తం 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 1,25,762 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ప్రస్తుతం సిలిండర్‌ను రూ.875 విక్రయిస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.47 రాయితీగా ప్రతి వినియోగదారుడి ఖాతాలో జమచేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్ ఇవ్వాలంటే ఒక్కో సిలిండర్‌కు రూ.328 ఆయా లబ్ధిదారుడి ఖాతాలో జమకావాలి. కానీ ఐదు నెలలుగా జమ కావడం లేదు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు జిల్లాలో దీపం గ్యాస్ కనెక్షన్లు 51,391 ఉండగా, ఉజ్వల్ కనక్షన్లు 13,997 ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్లు 1,85,979 ఉండగా, మొత్తం 2,49,568 కనెక్షన్లు ఉన్నాయి. 14 కిలోల సిలిండర్ ధర రూ.875 ఉండగా.. అందులో కేంద్రం రూ.47 రాయితీని 13 సిలిండర్ల వరకు వర్తింపజేస్తుంది. ఇదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి పరిమితులు ఏమైనా విధించిందా అనే ప్రశ్న లబ్ధిదారుల్లో తలెత్తుతోంది. జిల్లా అధికారులకు సైతం దీనిపై అవగాహన లేకపోవడంతో రాయితీ ఎందుకు జమకావడం లేదో సమాధానం ఉండడం లేదు. ఫ ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు -
చెత్త సమస్య.. జనం అవస్థ
యాదగిరిగుట్ట : మున్సిపాలిటీని డంపింగ్ యార్డు సమస్య పట్టి పీడిస్తోంది.పట్టణ శివారులో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసినా స్థలం వివాదం కారణంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో రోజూ సేకరిస్తున్న చెత్తను యాదగిరిగుట్ట శివారులోకి తరలించి దహనం చేస్తున్నారు. దుర్వాసన, పొగతో పరిసర ప్రాంత ప్రజలు, దారిన వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. రోజూ ఏటు టన్నుల చెత్త వ్యర్థాల ఉత్పత్తి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 5,003 నివాస గృహాలు, 50కి పైగా హోటళ్లు, 120 వరకు దుకాణాలు ఉన్నాయి. 21వేల జనాభా ఉండగా యాదగిరి క్షేత్రానికి రోజూ ఐదు వేల మంది భక్తులు వస్తుంటారు. రోజుకు ఏడు టన్నుల చెత్త వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. శని, ఆదివారం, సెలవురోజుల్లో మరొక టన్ను వ్యర్థాలు అదనంగా ఉత్పత్తి అవుతాయి. పారిశుద్ధ్య నిర్వహణకు 47 మంది కార్మికులు ఉన్నారు. సేకరించిన చెత్తను 8 ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా ఏరోజుకారోజు యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే మార్గంలో ఓ చోట డంప్ చేసి కాల్చివేస్తున్నారు. గోదావరి జలాలు కలుషితం మల్లాపురం మార్గంలో తరలించిన చెత్తను కాల్చడం ద్వారా పొగ వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పక్కనుంచి వెళ్తున్న కాళేశ్వరం కాలువలోకి చెత్త చేరుతుంది. దీంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గండిచెరువులోకి వెళ్లే గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.గుట్టలో ప్రారంభానికి నోచని డంపింగ్ యార్డు ఫ పట్టణ శివారుకు చెత్త తరలింపు, కాల్చివేత ఫ దుర్వాసన, పొగతో ఇబ్బందులుపడుతున్న స్థానికులు ఫ కాళేశ్వరం కాలువలోకి చేరుతున్న వ్యర్థాలు డంపింగ్ యార్డు సమస్యకు కారణాలివీ.. మున్సిపాలిటీలో సేకరించిన చెత్త, వ్యర్థాలను తరలించేందుకు పట్టణ శివారులో రెండు ఎకరాల్లో స్వచ్ఛత పార్క్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయడానికి డంపింగ్ యార్డులో కోటి రూపాయల వ్యయంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ యంత్రాలను బిగించింది. ఈ పనులు ఏడాదిన్నర క్రితమే పూర్తయ్యాయి. ముఖ్యంగా పేపర్ అట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పరిశ్రమలకు విక్రయించి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్నది మున్సిపాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన స్థలం తమదంటూ ఓ మహిళా కోర్టుకు వెళ్లింది. దీంతో ఏడాది క్రితం ప్రారంభం కావాల్సిన ప్లాంట్ పెండింగ్ పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ సేకరించిన చెత్తను ఖాళీ స్థలంలో డంప్ చేసి కాల్చివేస్తున్నారు. కేసు కోర్టులో ఉంది మల్లాపురం సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశాం. చెత్త, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి యంత్రాలను సైతం బిగించాం. డంపింగ్ యార్డు భూమి తమదని ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. త్వరలోనే కేసు పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. ఆ వెంటనే ప్లాంట్‌ను ప్రారంభిస్తాం. పట్టణ శివారులోకి తరించిన చెత్తను కాల్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. –అజయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, యాదగిరిగుట్ట -
ధాన్యం కొనుగోలు పద్ధతులు భేష్
ఆలేరు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు అవలంబిస్తున్న పద్ధతులు భేష్ అని తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం ప్రశంసించారు. మంగళవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నేతృత్వంలోని ఐదుగురు అధికారుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వరిఽ సాగు నుంచి దిగుబడి తరువాత, కేంద్రాలకు తరలించి రైతులు పంటను విక్రయించే వరకు జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు, ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బుల చెల్లింపు విధానాన్ని వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20రోజుల్లో 10633 క్వింటాళ్ల(26వేల బస్తాల) 233మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడంపై తమిళనాడు బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదేవిధంగా తేమ శాతం, తుది నాణ్యత విశ్లేషణ, ధాన్యం మిల్లులకు తరలించిన ట్రక్కుల వివరాలతో కూడిన రిజిస్టర్లు, వాటి నిర్వహణ పద్ధతులు తెలుసుకున్నారు. ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ని దశలో రైతుల వివరాలను సేకరించి, నమోదు చేస్తున్నారో తెలుసుకున్నారు. రైతు ఊరు, ఆధార్ నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి వచ్చింది, నాణ్యతా ప్రమాణాలు ఆన్లైన్లో ఎలా నమోదు చేస్తున్నారో ఆలేరు వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు తమిళనాడు బృందానికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించడం పట్ల అధికారుల బృందం ప్రశంసించింది. అనంతరం వారిని సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, డీసీఎస్ఓ రోజా, డీఎంఓ హరికృష్ణ, మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మ, ఎఫ్‌పీఓ చైర్మన్ స్వామి, ఏఈ శివకుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం -
ధర్మోజిగూడెం అండర్‌పాస్‌కు మోక్షం
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజీ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం హైదరాబాద్‌లో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ధర్మోజీగూడెం కూడలి వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు మృత్యువాత పడ్డారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం జరిగే 17 బ్లాక్స్పాట్లతో పాటు ఇక్కడ కూడా పనులు చేపట్టాల్సి ఉండే. వెహికిల్ అండర్‌పాస్ వంతెన అవసరమని గుర్తించిన జాతీయ రహదారి సంస్థ అధికారులు.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో ఎట్టకేలకు మోక్షం లభించింది. వంతెన పూర్తయితే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నేషనల్ హైవే అథారిటీ నుంచి అనుమతులు రాగానే అండర్‌పాస్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని గడ్కరీ ప్రకటించారు.ఫ హైదరాబాద్‌లో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ -
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
ఆత్మకూరు(ఎం): రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆత్మకూర్(ఎం) మండలంలోని సర్వేపల్లి, రాయిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు లిఖితపూర్వకంగా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జూన్ 2న పరిష్కార పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సర్వేపల్లి గ్రామానికి చెందిన కాసరబాద అంజయ్య అనే రైతుతో మాట్లాడారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న సన్నబియ్యం ఏవిధంగా ఉన్నాయని అడగగా.. బాగున్నాయంటూ బదులిచ్చాడు. సదస్సుల్లో రాయిపల్లిలో 15, సర్వేపల్లిలో 4 దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్ లావణ్య రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐలు మల్లిఖార్జునరావు, పాండు, సర్వేయర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్లు నవనీత, సంజీవ కంప్యూటర్ ఆపరేటర్ వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు
ఫ శాస్త్రవేత్తలు భద్రునాయక్, అనిల్‌కుమార్ చౌటుప్పల్ రూరల్ : రైతులు పంటల సాగులో మెళకువలు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ భద్రునాయక్, డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రైతువేదికలో నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని రైతులకు సూచనలు, సలహాలు చేశారు. ఆధునిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని, భూసార పరీక్షలు చేయించి నేల స్వభావాన్ని బట్టి పంటలు వేయాలని సూచించారు. ఎరువుల వాడకం, రసాయనాలు తక్కువ మోతాదులో వాడాలన్నారు. శాస్త్రవేత్తలు, వ్వయసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పల్లె శేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రాసేనారెడ్డి, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
తరలివచ్చి.. వినతులిచ్చి
ఫ ప్రజావాణిలో 50కి పైగా అర్జీలు ఫ సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను వేడుకున్న ప్రజలు హామీలు అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు కోరారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నెలకు రూ.30వేలు పెన్షన్ ఇవ్వాలని, సమరయోధులుగా గుర్తించి గుర్తింపుకార్డులు జారీ చేయాలని, 250 గజాల ఇంటిస్థలం కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జార్ఖండ్ తరహాలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సంగిశెట్టి క్రిష్టపర్, సింగిశెట్టి జనార్దన్, మటె లింగయ్య, అవిశెట్టి రమేష్ పాల్గొన్నారు. భువనగిరిటౌన్ : బస్సు సౌకర్యం లేదని, భూములు ఆక్రమించారని, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని.. ఇలా వివిధ సమస్యలపై ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చిన అర్జీలు అందజేశారు. ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించి ఆయా శాఖలకు రెఫర్ చేశారు. 50కి పైగా అర్జీలు రాగా అందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 29 అర్జీలు ఉన్నాయి. పంచాయరాజ్ 8, సర్వే ల్యాండ్స్ 3, హౌసింగ్ 2, ఆర్టీసీ 2, లేబర్, విద్యశాఖ, ఇంటర్మీడియట్ , జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సత్వర పరిష్కారం చూపండి ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2లక్షలు, ఆ తదుపరి రూ.2లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్న విషయాన్ని తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్ పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● భువనగిరి మండలం రెడ్డినాయక్‌తండా పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన భూక్యా రఘు విన్నవించారు. ● రామన్నపేటలోని ధోబిఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రామన్నపేట మండల రజక సహకార సంఘం ప్రతినిధులు కోరారు. ● బీబీనగర్ మండలం నెమరగొముల గ్రామంలో 115 ఎకరాల భూదాన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలని కోరుతూ భువనగిరికి చెందిన ఖాజా ఖుత్బుద్ధీన్ కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం అందజేశారు. విచారణ జరిపించి అక్రమారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.స్కూల్ బస్సులను అద్దెకు ఇవ్వకుండా చూడాలని వినతి పాఠశాలల బస్సులు వివాహాది శుభకార్యాలకు అద్దెకు ఇవ్వకుండా చూడాలని ట్రావెల్స్ బస్సుల యజమానులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఒక్క బస్సుకు సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ట్యాక్స్, రూ.60 వేలకు పైగా ఇన్సురెన్స్ చెల్లిస్తున్నామని, కిరాయిలు లేకపోవడంతో కుటుంబసభ్యుల బంగారు అబరణాలు కుదువపెట్టి ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు రిజిస్ట్రేషన్ లేకపోయినా అద్దెకు ఇస్తున్నారని, పైగా తక్కువ చార్జి తీసుకుంటున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే స్కూల్ బస్సుల పర్మిట్లు రద్దు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కంచర్ల వెంకట్, జంగారెడ్డి, అంబటి సుధాకర్, పెండెం బాలనర్సింహ, లవణ్, కూనుజు నర్సంహాచారి, మైలారం నర్సింహా, పన్నల మల్లారెడ్డి ఉన్నారు. ప్రజావాణిలో న్యాయవాది నియామకం భూ సమస్యలు, ఇతర న్యాయపరమైన కేసులకు సంబంధించి అర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నందున ఇకపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి ఒక అడ్వకేట్ పాల్గొంటారు. బాధితులకు లీగల్ అడ్వైజ్ ఇవ్వడంతోపాటు కోర్టు కేసులకు సంబంధించిన అర్జీల స్థితిగతులను తెలియజేయనున్నారు. -
ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు
ఆలేరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం తహసీల్దార్ అంజిరెడ్డితో కలిసి ఆలేరు, కొల్లూరులో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేసిన తరువాత కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఏరోజుకారోజు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. ఆలేరు మండలంలో ఇప్పటి వరకు 84,248 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. శివుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవత, గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన తదితర పూజలు నిర్వహించారు. మహిళా సదస్సును జయప్రదం చేయాలి భువనగిరి : కేరళలో ఈ నెల 9,10 తేదీల్లో జరగనున్న మహిళా కూలీల జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ పేర్కొన్నారు. సోమవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కూలీల సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతుందన్నారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప.. తగడ్డం లేదన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. సదస్సుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుమారి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, కూలీలు సత్తమ్మ, మాధవి, సువర్ణ, స్వాతి, కవిత, బాలమణి,పోచమ్మ,అఖిల తదితరులు ఉన్నారు. కానిస్టేబుల్‌కు అవార్డుఆత్మకూరు(ఎం): విఽధి నిర్వహణలో ధైర్య సా హసాలు ప్రదర్శించినందుకు గాను ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన తాళ్లపెల్లి మహేందర్‌గౌడ్ తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. అదే విధంగా డీజీపీ చేతుల మీదుగా రూ.50వేల నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రం తీసుకున్నారు. -
హెచ్ఎండీఏ నుంచి 56
కోట్లుమున్సిపాలిటీలు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపుఫ సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీలకు ప్రాధాన్యం ఫ ప్రతిపాదనలకు హెచ్ఎండీఏ ఆమోదం ఫ 15వ తేదీ లోపు టెండర్లు పూర్తి సాక్షి,యాదాద్రి : హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అఽథారిటీ) పరిధిలోని మున్సిపాలిటీలకు, గ్రామాలకు ఆ సంస్థ నుంచి రూ.56.18 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల పనులు చేపడతారు. ఈ నెల 15లోపు టెండర్లు పిలిచి ఆరు నెలల్లో పూర్తయ్యేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు నిధులను వీటికి ఖర్చు చేస్తారు ● భువనగిరి మున్సిపాలిటీలో రూ.5.80 కోట్లతో ప్రధాన రోడ్డు ఫుట్‌పాత్, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైయినేజీ, సీసీ డ్రైయినేజీ నిర్మిస్తారు. వార్డుల్లో అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైయిన్లు, ఫుట్‌పాత్ పేవ్మెంట్ పనులకు రూ.7.80 కోట్లు కేటాయించారు. ● భూదాన్పొచంపల్లి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.7.90 కోట్లు ● భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.9.50 కోట్లు ● బీబీనగర్ మండలంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.16.08 కోట్లు ● భూదాన్‌పోచంపల్లి మండలంలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రెయినేజీలకు రూ.9.10 కోట్లు కేటాయించారు. కొత్త మండలాలకూ త్వరలో నిధులు హెచ్ఎండీఏలో కొత్తగా చేరిన మండలాలకు నిధుల కేటాయింపునకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం ఐదు మండలాలు, మూడు మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చొరవతో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిధుల కోసం అక్కడి ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తక్షణ అవసరాలకు ఖర్చు చేస్తాం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూయ్యాయి. ఈ నిధులను తక్షణ అవసరాల నిమిత్తం ఖర్చుచేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి హెచ్ఎండీఏకు పంపగా ఆమోదించింది. టెండర్లు నడుస్తున్నాయి. కొత్తగా హెచ్ఎండీఏలో చేరిన వలిగొండ మండలానికి వచ్చే బడ్జెట్లో నిధులు మంజూరవుతాయి. –కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పెరిగిన హెచ్ఎండీఏ పరిధి 2025 మార్చిలో హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిసారి 2009లో హెచ్ఎండీఏ పరిధిని విస్తరించారు. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు కోర్ అర్బన్ సిటీగా, ఔటర్ రింగ్ రోడ్డునుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు సెమీఅర్బన్ ఏరియాగా ప్రభుత్వం నిర్ధారించింది. హెచ్ఎండీ పరిధిలో ఇప్పటికే భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. తాజాగా పరిధి పెంచడంతో కొత్తగా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురంలోని పలు గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఏడాదిలోగా అమలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. -
సమ్మర్ క్యాంపుతో వినోదం, విజ్ఞానం
భూదాన్‌పోచంపల్లి : వినోదంతో పాటు విజ్ఞానం పంచేందుకు సమ్మర్ క్యాంపు దోహదపడుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పురంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. లలితకళలు, సంగీతం, డ్యాన్స్, డ్రాయింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లిష్, గణితంలో మెళకువలు, యోగా, క్రీడల్లో ఈనెల 20వరకు శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల నుంచి 100 మంది విద్యార్థులు క్యాంపులో పాల్గొంటున్నార, వీరికి ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఈక్విటీ కోఆర్డినేటర్ సీహెచ్ రాధ, క్యాంప్ కోఆర్డినేటర్ ఇందిర, అసిస్టెంట్ కోఆర్డినేటర్ భవానీ, రిసోర్స్ పర్సన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.ఫ డీఈఓ సత్యనారాయణ -
ముమ్మరంగా సుందరీకరణ పనులు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లికి ఈ నెల 15న మిస్ట్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు రానున్న నేపథ్యంలో స్థానిక టూరిజం పార్కులో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పార్కులోని గదులు, హాల్, మ్యూజియంలో రంగులువేసి సుందరీకరిస్తున్నారు. అలాగే పార్కు ప్రాంగణాన్ని పచ్చని లాన్‌తో తీర్చిదిద్దుతున్నారు. అందాల భామల బృందం సాయంత్రం 6 గంటలకు వచ్చి నుంచి రాత్రి 8.30 గంటలవరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో టూరిజం ప్రాంగణంలో గల విద్యుద్దీపాలన్నింటినీ రిపేర్ చేస్తున్నారు. మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పనులను వేగవంతం చేశారు. -
సస్యశ్యామలం చేస్తాం
ఫ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి ఫ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫ ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖపై మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఫ హాజరైన గుత్తా, మంత్రి కోమటిరెడ్డి మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి, పౌరసరఫరాల శాఖ (వరి ధాన్యం సేకరణ, సన్న బియ్యం పంపిణీ)పై సమీక్ష నిర్వహించారు. ముందుగా తెలంగాణ గీతం ఆలపిస్తుండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికా రులంతా గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వం ట్రిబ్యునల్‌తో ఒప్పందం చేసుకుందని, సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 811 టీఎంసీల నీటిని 512 టీఎంసీలు ఏపీకి, 298 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా గత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ రీఓపెన్ చేసి పునఃపరిశీలన చే యాలని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోందని తెలిపారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తామే పూర్తి చేస్తామని, నిర్లక్ష్యానికి గురైన డిండి ప్రాజెక్టుకు గాను రూ.1,800 కోట్లు కేటాయించామన్నారు. ఈ యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం పథకం తెచ్చామన్నారు. సాగునీటి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో సాగునీటి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్‌నంద్‌లాల్, భూసేకరణ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌కృష్ణారెడ్డి, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్, అడిషనల్ డీ జీపీ చౌహాన్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీని వాస్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.మరమ్మతులకు నిధులివ్వాలి –శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడమకాల్వ మరమ్మతుకు నిధులు కేటాయించాలని అన్నారు. ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్‌కు రూ.440కోట్లు మంజూరు చేశారని, మరో 3, 4 కిలోమీటర్లు ప్రధాన కాల్వ లైనింగ్ పెంచితే 2లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ నుంచి నల్లగొండకు అక్రమంగా వస్తున్న ధాన్యం రవాణాలను అరికట్టాలని అధికారులకు సూచించారు.మాది పేదల ప్రభుత్వం – ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజా ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అన్నింటి కంటే సన్న బియ్యం పంపిణీ పథకం తమకు నచ్చిందన్నారు. పదేళ్ల పాటు ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్ కాంగ్రెస్‌ను విలన్‌గా చూపించడం అతని అసహనానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ. 150 కోట్లు కేటాయించామన్నారు. జూన్‌లో టెండర్లు పిలిచి జూలైలో పనులు ప్రారంభిస్తామన్నారు. -
రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు
ఫ పంటల సాగు విధానాలపై అవగాహన ఫ నేటి నుంచి జూన్ 13 వరకు సదస్సులు ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ సద్వినియోగం చేసుకోవాలి చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్ : రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకుడు గాదె శ్రీనివాస్, చౌటుప్పల్ మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.చౌటుప్పల్ డివిజన్ పరి ధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి మండలాల్లోని 42 గ్రామాల్లో నేటినుంచి ఈనెల 13వ తేదీ వరకు సదస్సులు ఉంటాయన్నారు.రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చౌటుప్పల్ మండలంలో ఇలా.. 5న దండుమల్కాపురం, 8న చిన్నకొండూర్, 13న పెద్దకొండూర్, 16న తంగడపల్లి, 20న డి.నాగారం, 22న జైకేసారం, 24న మసీదుగూడెం, 29న ఎస్.లింగోటం, 30న ఎల్లగిరి, జూన్ 3న మందోళ్లగూడెం, 5న పంతంగి, 10న చౌటుప్పల్, 12న లింగోజిగూడెంలో సదస్సులు ఉంటాయి. త్రిపురారం : పంటల సాగులో అవలంభించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతుల ముంగిటకు వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి. జిల్లాలో సోమవారం నుంచి జూన్ 13వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. వీటిపై అవగాహన : భూసార పరీక్షలు, ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించుకోవడం, చీడపీడల నివారణ మార్గాలు, విత్తానాభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులు, సమీకృత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, యాంత్రీకరణ, వ్యవసాయ శాఖ పథకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు వివరిస్తారు. -
తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మంత్రి ఉత్తమ్
తిరుమలగిరి (తుంగతుర్తి): తన స్వగ్రామం తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బ్రిడ్జి, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చెన్నూరు రిజర్వాయర్ నుంచి నీరందిస్తామని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా.. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రిని కోరారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగో పాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక సంఘం సభ్యుడు సంకెపల్లి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్ అవార్డు
మోత్కూరు: ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా’ వంటి ఉద్యమ గీతాన్ని రాసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మోత్కూరు వాసి అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్–2025 అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ ప్రాంగణంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాయి అలేఖ్య ఫౌండేషన్ వారి 32వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతులమీదుగా అభినయ శ్రీనివాస్‌కు ఈ అవార్డును నిర్వాహకులు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, అవార్డుల కమిటీ అధ్యక్షురాలు అలేఖ్య, తెలంగాణ రచయితలు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయ ంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
ఆత్మకూరు(ఎం) : భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వి.లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆత్మకూర్(ఎం) మండలాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో నేటి నుంచి 15వ తేదీ వరకు సదస్సులు జరుగుతాయన్నారు. మొదటి రోజు సర్వేపల్లి, రాయిపల్లిలో రెవెన్యూ సదస్సులు ఉంటాయన్నారు. భూ సమస్యలున్న రైతులు నిర్దేశిత ఫారాలను నింపి రెవెన్యూ సదస్సుల్లో అందజేయాలని కోరారు. విచారణ జరిపి జూన్ 2న పరిష్కార పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి పునరుద్ధరణభువనగిరిటౌన్ : ప్రజా సమస్యల సత్వర పరి ష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాన్ని నేటినుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టం అవగాహన సదస్సుల దృష్ట్యా ప్రజవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. సదస్సులు ముగిసినందున ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేసేందుకు రావచ్చన్నారు. ఫాల్కే పురస్కారం ప్రదానం చౌటుప్పల్ : పట్టణానికి చెందిన సినీ నిర్మాత చిరందాసు ధనుంజయ్య ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోసల్ జస్టిస్.. చిత్రానికి ఈయన నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ నిర్మాత కేటగిరీలో పురస్కారానికి ఎంపికయ్యారు. అదే విధంగా ఉమా భవాని ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో రూపొందించి మరో లఘు చిత్రం ది అవార్డు 1996 జ్యూరీ అవా ర్డుకు ఎంపికైంది. దీంతో చిరందాసు ధనుంజయ్యను ది బెస్ట్ సోషల్ అవేర్నెస్ నిర్మాతగా ప్రకటించారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యాలయంలో ధనుంజయ్య అవార్డు అందుకున్నారు. అవార్డు లభించడం ఆనందంగా ఉందని, మరిన్ని చిత్రాలు నిర్మించేందుకుగాను నిచ్చెనలా పని చేస్తుందని తెలిపారు. 7 నుంచి క్రికెట్ కోచింగ్ భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈనెల 7వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఇంచార్జ్ సయ్యద్ అమీనొద్దీన్ అదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అండర్–14,16,19 విభాగాల్లో బాలబాలిలకు కోచింగ్ ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలక కోసం ఫోన్ నంబర్ 83413 13449ను సంప్రదించాలని కోరారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గచ్చిబౌలి: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నూతన్‌కల్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి డాక్టర్ మర్రి సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన చురుకంటి పవన్‌రెడ్డి, చురుకంటి అశోక్‌రెడ్డి, చురుకంటి శ్యామ్‌సుందర్‌రెడ్డిలు టీజీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ ఆర్.రామ్మోహన్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు. -
సీఐ.. ఇక ఠాణా బాస్
ఆలేరు: ప్రజలకు పోలీస్ సేవలు చేరువలో ఉండేలా ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా పాలనాసౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా స్షేషన్ల స్థాయిని పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆలేరు ఠాణాను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఎస్ఐ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)గా వ్యవహరిస్తుండగా.. ఇకపై సీఐ పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్‌రావును ఆలేరు ఠాణా తొలి ఎస్హెచ్ఓగా నియమిస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు ఇచ్చారు. పెరగనున్న సిబ్బంది స్టేషన్ స్థాయి పెరిగిన నేపథ్యంలో అదనపు సిబ్బంది రానున్నారు. ప్రస్తుతం ఎస్తో పాటు 21 మంది కానిస్టేబుల్స్, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇప్పుడు సీఐతోపాటు అదనంగా ఎస్ఐ రానున్నారు. ప్రస్తుత ఠాణా కేటగిరీ ఏ లేదా బీకి పెంచి, అదనపు కానిస్టేబుల్స్, ఇతర సిబ్బందిని నియామకం చేయనున్నారు.ఆలేరు పోలీస్‌స్టేషన్ స్థాయి పెంపు ఫ ఎస్హెచ్ఓగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫ ఇక సీఐ పర్యవేక్షణలో కార్యకలాపాలు ఫ త్వరలో మరొక ఎస్ఐ,అదనపు సిబ్బంది నియామకం ఫ వేగవంతంగా కేసుల పరిశోధన మెరుగైన సేవలే లక్ష్యం అప్‌గ్రేడ్ వల్ల స్టేషన్లో ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. విజ బుల్ పోలీసింగ్ పెరగనున్నది. తద్వారా సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రజలకు సత్వర సేవలు అందనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ మెరుగుపడతాయి. నేరాలను పరిశోధించే సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు పద్ధతులు మరింత సులువవుతాయి. ప్రస్తుతం ఒక సీఐ, ఒక ఎస్ఐ ఉంటారు. త్వరలోనే మరో ఎస్ఐని, ఇతర అదనపు సిబ్బందిని నియమిస్తాం. మెరుగైన సేవలు అందించాలనేది లక్ష్యం. –సుధీర్‌బాబు, రాచకొండ సీపీ -
ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య
హుజూర్నగర్: ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్ట ణానికి చెందిన షేక్ ఖాసింబీ తన కుమార్తె షేక్ మహబూబీ అలియాస్ హసీనా(19)ని గత నెల 30వ తేదీన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసుఫ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కాగా హసీనా తన భర్త యూసుఫ్‌తో కలిసి శనివారం తన తల్లిగారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన హసీనా అందులో ఉన్న ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. హసీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలకృష్ణనాగారం : వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేంద్ర, జనరల్ సెక్రటరీ రూపానిరాజు, సోషల్ మీడియా ఇన్చార్జి శివరాత్రి గోపి, కార్యదర్శి బండారి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల రమేష్‌చంద్ర, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్ల య్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కంటెయినర్లో 101 పశువుల తరలింపు
● డ్రైవర్‌పై కేసు నమోదు కోదాడరూరల్ : కంటెయినర్లో అక్రమంగా తరలిస్తున్న 101 పశువులను ఆదివారం తెల్ల వారుజామున కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని హనుమాన్‌జంక్షన్ సంత నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు ఒకే కంటెయినర్లో 76 ఎద్దులు, 25 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. కోదాడ రూరల్ పోలీసులు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్‌రోడ్‌లో కంటెయినర్‌ను తనిఖీ చేయగా.. పశువులు పట్టుబడ్డాయి. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి డ్రైవర్ ఎర్రవళ్ల సునీల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణంగుర్రంపోడు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరు గ్రామానికి చెందిన నక్కనబోయిన సత్తయ్య(52) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. దిగుబడి లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలిభువనగిరిటౌన్ : న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరానికి జిల్లాలోని న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన సేవభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆదివారం సహస్రనామార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ధాన్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి
కోదాడరూరల్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించే ధాన్యం నిబంధనల ప్రకారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 ఉండేలా చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వారం రోజుల లోపే కాంటాలు వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకురాగానే వారికి సీరియల్ నంబర్లు ఇవ్వాలని ఆ ప్రకారం కాంటా వేయాలని ఆదేశించారు. సరిపడా గన్నీ బ్యాగులు వస్తున్నాయా లేదా లారీల సమస్య, హమాలీల కొరత ఏమైనా ఉందా అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 5000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని, మరో 1500 క్వింటాళ్లు ఉంటాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ధాన్యం రాశులను చూసి వాటి తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను సైతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో గోపతి శ్రీనివాస్ అనే రైతు ధాన్యం తేమశాతం పరిశీలించి నాణ్యత బాగుందని ఆ రైతుకు బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీజీఓ పద్మ, ఏపీడీ సురేష్, తహసీల్దార్ వాజిద్‌అలీ, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, డీటీసీఎస్ రాంరెడ్డి, కమతం వెంకటయ్య, అనూష ఉన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ -
రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తాం
హుజూర్నగర్: భారత ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తుపాకుల ద్వారానే చరిత్ర మారుతుందనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమని, క్లిష్టమైన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సీపీఐ నమ్ముతుందన్నారు. కర్రి గుట్టల్లో కూంబింగ్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి ఎన్కౌంటర్లను నివారించాలని కోరారు. మావోయిస్టులు కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకోచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, ఎన్నికల హామీలను సక్రమంగా అములు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్‌నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, సూర్యనారాయణ, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కొండమల్లేపల్లి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఆదివారం ఆటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు ఆటోలో కూర్చోగా.. మిగతా వారు బావిలోకి దిగారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆటోలో నలుగురు మాత్రమే వెళ్లారు. ఇదంతా వ్యవసాయ బావి వద్ద పనిచేసే ఓ రైతు గమనించి బావి దగ్గరకి వెళ్లి చూడగా.. జత దుస్తులు, చెప్పులు ఉండటం గమనించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు బావి వద్దకు చేరుకుని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని దేవరకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచార ఇవ్వగా వారు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని బావిలో గాలించగా.. వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 36 నుంచి 38 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిశెట్టి దుప్పలపల్లిలో..తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712670181 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
క్లాక్‌టవర్ (నల్లగొండ), తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని దేవుని గుట్టపై రాతియుగపు కాలం నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. మరుగునపడిన వారసత్వ చిహ్నాలను గుర్తించి, వాటి ప్రాముఖ్యతను స్థానికులకు తెలియజేసే శ్రీప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ఙీ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన రామలింగాలగూడెంలోని శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టపై ఆదివారం జరిపిన పరిశీలనలో పాల్గొని మాట్లాడారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, తాము నిత్యము వాడుకునే రాతి పనిముట్లతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా ఆనాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దారన్నారు. ఈ రాతికళ క్రీ.పూ. 6000– 4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని ఆయన చెప్పారు. గుట్టపై సహజంగా ఏర్పడిన నీటిదోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద బండల మాటున గల గుహల్లోనూ, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నివసిస్తూ, తీరిక సమయాల్లో తాము పాల్గొన్న సంఘటనలను, చూసిన దృశ్యాలను చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ పురాతన రాతికళను కాపాడి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పి వెంకటేష్, మోతీలాల్ పాల్గొన్నారు. పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు
ప్రశంసలు అందుకున్న ప్రశాంత్.. తెలంగాణ ఉద్యమంలో ‘అమ్మ తెలంగాణ.. మరో తెలంగాణ.. అమరవీరులే... అంటూ పాట రాసి స్వయంగా పాడాడు. కరోనా సమయంలో మంత్రి సీతక్క చేపట్టిన సేవలపై శ్రీమలినం లేని మట్టిమనిషి’ అంటూ వీడియో చేసి మంత్రి సీతక్క చేతుల మీదుగా అవిష్కరింపజేశాడు. ఇటీవల కశ్మీర్ పహల్గాం వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ ‘భరతమాత శిరస్సుపై సరిహద్దు కంచె తెంపి దూసుకొచ్చె సంగ్రామం’ అంటూ ఇటీవల దేశభక్తి వీడియో రూపొందించి ప్రముఖ కవి డి. అరవిందరాయుడు చేతుల మీదుగా విడుదల చేశాడు. గ్రామ పంచాయతీ కార్మికులపై కూడా వీడియోలు రూపొందిచాడు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటల రచన చేస్తున్న ప్రశాంత్ ఇటీవల హైకోర్డు జడ్జి చంద్రశేఖర్ చేతుల మీదుగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు సైతం అందుకున్నాడు. ప్రశాంత్ కృషిని మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ సైతం అభినందించారు. తనకు అవకాశం కల్పిస్తే సినిమా రంగంలో పాటలు రచన చేసి పాడగలని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ప్రశాంత్ అంటున్నాడు. ఆత్మకూరు(ఎం): మారుమూల పల్లెటూరిలో పుట్టి పాటలపై తనకున్న ఆసక్తితో సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడేనికి చెందిన చంద్రగిరి ప్రశాంత్. ప్రశాంత్ స్వయంగా పాటలు రాసి వాటిని పాడుతూ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మోదుబావిగూడేనికి చెందిన వసంత, రాజారామ్ దంపతుల కుమారుడు ప్రశాంత్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కప్రాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లో స్కూల్లో పాటల పోటీలు నిర్వహించగా.. తన తల్లి వసంత తోటి కూలీలతో కలిసి పొలంలో పాడిన పాట గుర్తొచ్చి దానిని ప్రశాంత్ పాడి వినిపించాడు. గొంతు చాలా చక్కగా ఉండటంతో ఉపాధ్యాయులు ప్రశాంత్‌ను అభినందించారు. అప్పటి నుంచి తానే స్వయంగా పాటలు రాసి, సీడీలు చేయాలని ప్రశాంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రతి పాట సీడీ చేయాలంటే సుమారు రూ.20వేల వరకు ఖర్చయ్యేదని, తన జీతంతో పాటు తల్లిదండ్రులు ఆర్ధికంగా సాయం అందించేవారని ప్రశాంత్ చెబుతున్నాడు. తమ కుమారుడు మంచి రచయితగా, మంచి గాయకుడుగా అందరు గర్వించే విధంగా ఎదగాలని ప్రశాంత్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రాసి, వీడియోలు రూపొందిస్తున్న ప్రశాంత్ మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోకతేజచే ప్రశంసలు -
ఆర్టీఐ కమిషనర్ల నియామకాన్ని పునఃపరిశీలించాలి
రామగిరి(నల్లగొండ): ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రస్తుతం జరిగిన ఆర్టీఐ కమిషనర్ల నియమాకాన్ని పునఃపరిశీలించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన ఆర్టీఐ కమిషనర్ల నియామకాన్ని పునఃపరిశీలించాలని శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే సమాచార కమిషనర్లుగా న్యాయబద్ధంగా వ్యవహరించే వారిని నియమించాలని కోరారు. సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని అనర్హులను ఎంపిక చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ రజీవుద్దిన్, సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య, ఆశ్రిత సంస్థకు చెందిన ధనమ్మ, సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బైరు సైదులుగౌడ్, చిత్రం శ్రీనివాస్, ఆర్టీఐ కార్యకర్త కుడుతల రవీందర్, ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గాదె యాదగిరి, ఆశ్రిత సంస్థ సభ్యులు శోభ, ఎం. శోభారాణి, అమత, రాజు, సీతా, వంశీ, కె. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాటిముంజ.. తింటే మజా
యాదగిరిగుట్ట రూరల్: వేసవి కాలంలో మాత్రమే దొరికే తాటిముంజలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తింటారు. వీటినే ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఈ తాటిముంజల్లో అమితమైన పోషకాహార పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ ముంజలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. వేసవి కాలంలో ఈ తాటిముంజలు తినడం వలన, ఎండ వేడికి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పల్లెల్లో మాత్రమే లభించే ఈ తాటిముంజలు ఇప్పుడు పట్టణాలకు కూడా తాకాయి. ముంజల అమ్మకంతో వేసవి కాలంలో ఉపాధి కూడా లభిస్తుందని గీత కార్మికులు, పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల వెంట అమ్మకంవరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో తాటిముంజల అమ్మకం విపరీతంగా పెరిగిపోయింది. ఆలేరు బైపాస్, వంగపల్లి, రాయగిరి, గూడూరు టోల్‌ప్లాజా గుండా వెళ్తున్న వాహనాలతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులు ఎక్కువగా తాటిముంజలను కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ఇతర ప్రధాన కూడళ్లలో కూడా తాటిముంజలను అమ్ముతుండడంతో వాహనదారులు వాటిని చూసి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వేసవి కాలంలో తాటిముంజలు అమ్మకాలు పెరిగిపోవడంతో పలువురికి ఉపాధి కూడా లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల వ్యాపారులు, గీత కార్మికులు తదితరులు తాటిముంజల గెలలను గ్రామాల్లో నుంచి తీసుకొచ్చి జాతీయ రహదారులపై, ప్రధాన కూడళ్లలో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎండల తీవ్రతకు పెరుగుతున్న తాటిముంజల విక్రయం ముంజలలో అనేక పోషకాలు ఉంటాయంటున్న వైద్య నిపుణులు డజన్ రూ.100 వరకు అమ్మకం వేసవిలో ఉపాధి పొందుతున్న గీత కార్మికులు, వ్యాపారులుతాటిముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలుu శరీరంలో వేడిని తగ్గిస్తుంది u బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి u గర్భిణులకు ఎసిడిటీ నుంచి రక్షణ కల్పిస్తుంది u మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది u కాలేయం, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి u అధిక బరువును తగ్గిస్తుంది u గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది u రక్తపోటును అదుపులో ఉంచుంతుంది u జీర్ణశక్తిని పెంచుతుంది u ఐరన్, కాల్షియం శరీరానికి లభిస్తాయి -
అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీల పట్టివేత
మిర్యాలగూడ అర్బన్: అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీ కంటే తెలంగాణలో ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో పాటు క్వింటాల్ సన్న ధాన్యానికి ఇక్కడి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో.. కొందరు అక్రమార్కులు ఏపీ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రాత్రివేళ నాగార్జునసాగర్, వాడపల్లి చెక్‌పోస్టులు దాటించి నల్లగొండ జిల్లాలోకి తీసుకొస్తున్నారు. శుక్రవారం వాడపల్లి చెక్‌పోస్టు నుంచి జిల్లాలోని అక్రమంగా ప్రవేశిస్తున్న 7 లారీలను పట్టుకోగా.. శనివారం ఉదయం మరో ధాన్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎనిమిది లారీల్లో సుమారు 2200 ధాన్యం బస్తాలు (165టన్నులు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న సుమారు వంద లారీలను వెనక్కు పంపినట్లు డీఎస్పి తెలిపారు. ఏపీ నుంచి తరలివచ్చే ధాన్యాన్ని నల్లగొండ, హుజూర్నగర్, నిజమాబాద్ జిల్లా, ఖానాపూర్‌కు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో 14మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం నిందుతుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు లక్ష్మయ్య, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు తరలించి బోనస్ కాజేసే యత్నం వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు -
108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన మరో అంబులెన్స్
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరొక 108 అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం కొల్‌ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ సమీపంలోని బాపూజీనగర్ వద్ద శనివారం జరిగింది. ప్రమాదానికి గురైన అంబులెన్స్‌ను తప్పించబోయి దేవరకొండకు ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులతో పాటు అంబులెన్స్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అంబులెన్స్, ఆటోను స్టేషన్‌కు తరలించారు. -
● రయ్.. రయ్.. తాటి పయ్యల బండి
తాటి పయ్యల బండి.. బహుశా పట్టణాల్లో పుట్టి పెరిగిన వారికి ఈ బండి గురించి తెలియకపోవచ్చు. కానీ.. గ్రామాల్లోని పిల్లలకు వేసవి సెలవుల్లో తాటిముంజలు తిన్న తర్వాత వాటితో తాతలు బండి తయారుచేసి ఇస్తే రోజంతా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంటారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో శనివారం ఇద్దరు పిల్లలు తాటి పయ్యల బండితో ఆడుకుంటూ కనిపించారు. వీరిని చూసిన కొందరు ‘ఆ రోజులు.. మళ్లీ రావు’ అంటూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. – యాదగిరిగుట్ట రూరల్ -
నేతన్న రుణమాఫీకి ముందడుగు
భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికుల రుణమాపీకి ముందడుగు పడింది. అసలు, వడ్డీ కలుపుకొని రూ.లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం జీఓ నంబర్ 56ను జారీ చేసింది. రుణమాపీ కోసం రూ.33 కోట్ల నిధులను మంజూరు చేసింది. కానీ రుణమాఫీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రెండు నెలలుగా రుణమాపీ ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు రుణమాఫీ చేస్తారని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రుణమాఫీ అమలుకు రెండు రోజుల క్రితం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రక్రియను పూర్తిచేసి జూన్ నెలాఖరు వరకు చేనేత కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేసేలా కసరత్తు చేస్తోంది. మార్గదర్శకాలు ఇవే..రుణాలు పొందిన కార్మికుల జాబితాను చేనేత, జౌళిశాఖ ఏడీలు బ్యాంకుల వారీగా తీసుకుంటారు. వాటిని జిల్లాల వారీగా క్లెయిమ్‌లను తయారుచేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలో సభ్యులుగా ఉండే డీసీసీబీ సీఈఓ, చేనేతశాఖ ఆర్డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారుల ఆమోదం అనంతరం రాష్ట్రస్థాయి కమిటీకి ప్రతిపాదిస్తారు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించే రాష్ట్రస్థాయి కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాబ్, నాబార్డు రాష్ట్రస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమవుతుంది. అనంతరం బ్యాంకర్లు బకాయిలు లేవని నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. రుణమాఫీ అనంతరం కార్మికులు కోరుకుంటే తిరిగి బ్యాంకులు రుణాలు జారీ చేస్తారు. 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలకే వర్తింపు..2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. వృత్తి పనిచేస్తున్న చేనేత కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలు, చేనేత వస్త్రాల ఉత్పత్తికి, వృత్తి సంబంధ కార్యకలాపాలు, ముద్ర రుణాలన్నింటిని మాఫీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు..యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 1162 మందికి రూ.8.04కోట్ల రుణమాఫీ జరుగనుంది. అందులో భూదాన్‌పోచంపల్లిలో 234 మంది కార్మికులకు రూ.1,17,82,200 రుణమాఫీ కానుంది. అదేవిధంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 670 మంది చేనేత కార్మికులకు గాను రూ.4.90 కోట్లు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. రూ.లక్ష లోపు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల ఉమ్మడి జిల్లాలో 1832 మంది చేనేత కార్మికులకు రూ.12.94 కోట్ల లబ్దిప్రక్రియ మొదలుపెడతాం మార్గదర్శకాలు అందిన వెంటనే చేనేత రుణమాఫీ ప్రక్రియను మొదలుపెడతాం. గతంలో రూ.2లక్షల లోపు ఉన్న కార్మికుల జాబితాను బ్యాంకర్ల నుంచి తీసుకొని ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తున్నందున తిరిగి రూ.లక్ష లోపు రుణాలు ఉన్న కార్మికుల జాబితాను రూపొందించి జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రాష్ట్రస్థాయి కమిటీకి పంపిస్తాం. అక్కడ ఆమోదం పొందిన వెంటనే కార్మికుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. – శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ ఏడీ, యాదాద్రి భువనగిరి జిల్లాసమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసినందుకు సంతోషం. చేనేత కార్మికుల రుణమాఫీ అమలుకై స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ద్వారా పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరారవు దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే నెలాఖరు వరకు కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – తడక వెంకటేశం, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు -
లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్: లిఫ్ట్‌లో ఎక్కేందుకు యత్నించిన వ్యక్తి లిఫ్ట్ గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వినుకొండ మండలం గంగవరం గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీరామమూర్తి(39) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత పదిహేళ్ల నుంచి భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవులు రావడంతో శ్రీరామమూర్తి భార్య ప్రశాంతి పిల్లలను తీసుకొని వారం క్రితం బాపట్ల జిల్లా ఇరుకులం మండలం తిమిడితపాడు గ్రామంలోని తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. దివీస్ పరిశ్రమలోనే పనిచేస్తూ చౌటుప్పల్‌లోని రత్నానగర్‌కాలనీలో నివాసముంటున్న తన మిత్రుడు అమర్నేని రమేష్ ఇంటికి శుక్రవారం రాత్రి శ్రీరామమూర్తి వెళ్లాడు. అక్కడ భోజనం చేసిన తర్వాత నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగేందుకు లిఫ్ట్ బటన్ నొక్కాడు. అయితే లిఫ్ట్ రాక ముందే వచ్చిందని భావించిన శ్రీరామమూర్తి బలవంతంగా డోర్ తెరిచి లిఫ్ట్‌లో ఎక్కేందుకు యత్నించి లిఫ్ట్ గుంతలో పడిపోయాడు. భారీ శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న రమేష్ బయటకు వచ్చి గమనించగా తీవ్ర గాయాలతో శ్రీరామమూర్తి కన్పించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే శ్రీరామమూర్తి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
స్వర్ణగిరీశుడికి వసంతోత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం శ్రీవేంకటేశ్వరస్వామికి వసంతోత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం 4500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, సహస్ర దీపాలంకరణ, మంగళహారతులు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మంటల్లో బైక్ దగ్ధంచింతపల్లి: మంటల్లో బైక్ దగ్ధమైన ఘటన చింతపల్లి మండలం కిష్టరాయనిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టరాయనిపల్లి గ్రామానికి చెందిన మోర శ్రీరాములు తన పల్సర్ బైక్‌ను రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో శ్రీరాములు తండ్రి మోర రామచంద్ర బహిర్భూమికి వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు రాగా.. పల్సర్ బైక్ మంటల్లో తగలబడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని శ్రీరాములుకు చెప్పడంతో అతడు వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. తన బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని శ్రీరాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిగుర్రంపోడు: గాలి వానకు తెగిపడిన సర్వీస్ వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం కాల్వపల్లి గ్రామంలో శనివారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన పంగ యాదయ్య ఇంటి సర్వీస్ వైరు గత రాత్రి కురిసిన గాలి వానకు తెగిపడింది. దీంతో గ్రామంలో కరెంట్ పనులు చేసే కొండమీది అశోక్(40)ను వైరు సరిచేసేందుకు తీసుకెళ్లాడు. అశోక్ సర్వీస్ వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. హుటాహుటిన అతడిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీడిన హత్య కేసు మిస్టరీ ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు మండలం బస్వాపూర్ శివారులో జరిగిన గుర్తుతెలియని యువకుడి హత్య మిస్టరీ వీడింది. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన దాచారం సాయికుమార్(25)గా పోలీసులు గుర్తించారు. మృతుడు పశువులకాపరి అని, అతడు కనిపించకుండా పోయినట్లు తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదైందని గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. తుర్కపల్లిలో మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో తదుపరి విచారణ తుర్కపల్లి పోలీసులు నిర్వహిస్తారని వివరించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నంమిర్యాలగూడ: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన భూక్య చిన్నా కుటుంబ కలహాలతో శనివారం గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత 108కు ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది ఎర్రబెల్లి శ్రీనివాస్, సైదయ్య గ్రామానికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఓ చెట్టు కింద అపస్మారకస్థితిలో చిన్నాను గుర్తించి.. అతడి సెల్‌ఫోన్ తీసుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వాడపల్లి పోలీసులు పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల కలను నిజం చేస్తూ..
చివ్వెంల(సూర్యాపేట) : గిరి పుత్రిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తల్లిదండ్రుల కల సాకారం చేసింది. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపికకానప్పటికీ.. నిరుత్సాహపడకుండా ఈ సారి కష్టపడి చదివి జడ్జి పీఠంపై కూర్చుంది. చివ్వెంల మండలం రాజునాయక్ తండాకు చెందిన ధరావతు భాస్కర్, సంధ్య దంపతులకు కుమారుడు నిఖిల్‌నాయక్, కుమార్తె సుష్మ సంతానం. భాస్కర్ అడ్వకేట్ల వద్ద క్లర్క్‌గా పనిచేస్తూ తన కుమారుడు, కుమార్తెను లా చదివించాడు. అయితే రెండేళ్ల క్రితం కుమారుడు నిఖిల్‌నాయక్ మృతిచెందడంతో.. కుమార్తెను జడ్జిని చేసేందుకు శిక్షణ ఇప్పిస్తూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పదో తరగతి వరకు సూర్యాపేటలో చదివిన సుష్మ, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సులో చేరి 2020లో లా పూర్తి చేసింది. అనంతరం 2020లో సూర్యాపేట బార్ అసోషియేషన్‌లో సభ్యత్వం తీసుకుని, రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ.. జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు కోచింగ్ తీసుకుంది. 2022లో సుష్మ మొదటిసారి జూనియర్ సివిల్ జడ్జి ఎంపికలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహపడకుండా 2024 జూలైలో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో, నవంబర్‌లో నిర్వహించిన మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఏప్రిల్ 30న వెల్లడించిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో సెలక్ట్ అయ్యింది. తన తలిదండ్రుల కల సాకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని సుష్మ పేర్కొంది. తమ కుమార్తె జడ్జిగా ఎంపిక కావడంతో సుష్మ తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుష్మను గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అభినందించారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న గిరి పుత్రిక -
‘భూ భారతి’పైనే ఆశలు
సదస్సులు ఈ తేదీల్లో 5న సర్వేపల్లి, రాయిపల్లిలో, 6న రాఘవాపురం, రహీంఖాన్‌పేట, 7న పల్లెర్ల, సింగారం, 8న లింగరాజుపల్లి, కాల్వపల్లి, 9న కూరెల్ల, కప్రాయపల్లి, 12న తుక్కాపురం, పారుపల్లి, 13న మొరిపిరాల, పల్లెపహాడ్, 14న ధర్మాపూర్, 15న ఆత్మకూరు(ఎం)లో సదస్సులు ఉంటాయని తహసీల్దార్ లావణ్య తెలిపారు. 5 నుంచి రెవెన్యూ సదస్సులు ఫ నూతన చట్టంపై అవగాహన, భూ సమస్యలకు పరిష్కారం ఫ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆత్మకూరు(ఎం) మండలం ఎంపిక ఆత్మకూరు(ఎం) : సర్వే నంబర్లలో తప్పిదాలు, సరిహద్దుల గొడవ, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నేచర్.. ఇలా అనేక భూ సమస్యలతో ఏళ్లుగా సతమతమవుతున్న భూ యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇకనైనా తమ సమస్యలు తీరుతాయన్నా ఆసక్తితో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆత్మకూర్(ఎం)మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 5నుంచి 15వ తేదీ వరకు అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. మొదటి రోజు సర్వేపల్లి, రాయిపల్లి రెవెన్యూ గ్రామాల నుంచి సదస్సులను ప్రారంభించి ఆత్మకూరు(ఎం)తో ముగించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు సదస్సులు నిర్వహిస్తారు. సదస్సుల నిర్వహణకు రెండు బృందాలు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ లావణ్య నేతృత్వంలో తొమ్మిది మంది అధికారులు, వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది అధికారులు బృందంలో ఉంటారు. రెవెన్యూ సదస్సుల విజయవంతం కోసం అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) ఆత్మకూర్(ఎం) తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిష్కారానికి నోచుకోని సమస్యలు వేలల్లో.. మండలంలో పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు అనేకం ఉన్నాయి. మండలంలో 36,356 సాగు భూములు, 15,048 మంది రైతులు ఉన్నారు. సర్వే నంబర్లకు సంబంధించి 40 దరఖాస్తులు, డిజిటల్ సిగ్నేచర్ కాని భూసమస్యలు 1,411 దరఖాస్తులు, ధరణిలో పరిష్కారం కానివి 8 ఉన్నాయి. 2014 జూన్ 6వ తేదీకి ముందు సాదాబైనామా ఫిర్యాదులు 132 వరకు వరకు ఉన్నాయి. కాగా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై దరఖాస్తు దారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగానే విచారణ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఆత్మకూరు(ఎం) మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. తొలి రోజు సర్వేపల్లి, రాయిపల్లిలో రెవెన్యూ సదస్సులు ఉంటాయి. ధరణి ఏర్పాటుకు ముందు మూడేళ్ల పహణీలతో పాటు భూరికార్డులను తీసుకుని రెవెన్యూ సదస్సులకు వెళ్తాం. భూసమస్యలపై ఫిర్యాదు చేసే రైతులకు దరఖాస్తు ఫారాలను ఇంటింటికీ అందజేస్తాం. అట్టి దరఖాస్తు ఫారాలను నింపి రెవెన్యూ సదస్సుల్లో అందజేయాలి. స్థానికంగా విచారణ జరిపి పరిష్కార పత్రాలను జూన్ 2న అందజేస్తాం. –లావణ్య, తహసీల్దార్, ఆత్మకూరు(ఎం) -
ఆర్యూబీ పనుల్లో కదలిక
ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో రైల్వేగేట్ స్థానంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనుల్లో కదలిక వచ్చింది.ఆర్యూబీ పనులు ప్రారంభించి ఆరేళ్లు గడిచినా నేటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా పనుల అగ్రిమెంట్ గడువు కూడా ముగింపు దశకు చేరిన నేపథ్యంలో ‘మూడు నెలలే గడువు.. పనులేమో కదలవు’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం రైల్వే జేఈ కరుణాకర్ పర్యవేక్షణలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన మిషన్ భగీరథ పైప్లైన్న షిఫ్టింగ్ పనులను ముమ్మరం చేశారు. -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
భూదాన్‌పోచంపల్లి : మిస్‌వరల్డ్ పోటీదారులు ఈనెల 15న భూదాన్‌పోచంపల్లికి వస్తున్న నేపథ్యంలో అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్, పోచంపల్లి మిస్ వరల్డ్ ప్రోగ్రాం ఇంచార్జ్ డాక్టర్ కె.లక్ష్మి అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం ఆమె తెలంగాణ టూరిజం జీఎం మందాడి ఉపేందర్‌రెడ్డితో కలిసి భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులోని గదులు, మ్యూజియం, మగ్గాలు, హాంప్లి థియేటర్, థియేటర్ ప్రాంగణాన్ని పరిశీలించారు. పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఏచిన్న సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బొట్టుపెట్టి, కోలాట బృందాలతో స్వాగతం 25 మంది మిస్ వరల్డ్ కాంటెస్టులు ఈనెల 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని మాదాపూర్నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భూదాన్‌పోచంపల్లికి రానున్నారని టూరిజం శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. రాత్రి 8.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగంగా కాంటెస్టులకు బొట్టుపెట్టడం, మహిళల కోలాటాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో లైవ్ మ్యూజిక్, మెహందీ, మగ్గాల పరిశీలన, దారం నుంచి వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ వచ్చిన చేనేత మహిళచే ఇక్కత్ డిజైన్ల విశిష్టతను వివరిస్తామని చెప్పారు. అలాగే హాంప్లి థియేటర్ ప్రాంగణంలో సిద్ధిగాంచిన పోచంపల్లి ఇక్కత్‌తో పాటు సిద్ధిపేట గొల్లభామ, గద్వాల, నారాయణపేట వస్త్రాల ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. టూరిజం పార్కు ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తామని, ఈ బాధ్యతను హెచ్వర్క్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.ఫ స్పోర్ట్స్ అఽథారిటీ డైరెక్టర్ లక్ష్మి -
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరిప్రదర్శన కోసం మే 10 తేదీ సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామన్నారు. మార్గమధ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 92980 08888ను, అన్ని బస్స్టేషన్లలో సంప్రదించవచ్చని తెలిపారు. తగ్గిన ఉష్ణోగ్రతలు భువనగిరిటౌన్ : భానుడు కాస్త శాంతించాడు. 44 డిగ్రీలకు పైనా నమోదైన ఉష్ణోగ్రతలు 42.2 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం ఎండకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. సాయంత్రం చల్లని వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారు. శనివారం బీబీనగర్, గుండాల, రాజాపేటలో 42.2 డిగ్రీలు, మిగతా మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ తగ్గడం, వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆశ్రమాల్లో ఉచిత వైద్యసేవలు అందించాలి భువనగిరి: మండలం మండలంలోని రాయగిరి పరిధిలో గల సహృదయ వయోవృద్ధుల అశ్రమాన్ని శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశ్రమంలో వసతులు, భోజన నాణ్యతపై ఆరా తీశారు. అనాథ ఆశ్రమాల్లో ఉంటున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. 15100 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఆమె వెంట మానసిక ఆరోగ్య వైద్యుడు స్వరూప్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్.జైపాల్ ఉన్నారు. నేత్రపర్వంగా నృసింహుడినిత్యకల్యాణం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజల్లో భాగంగా ఉత్సవమూర్తుల నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు.అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్ర థమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, ఆ తరువాత స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక పూర్తి చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. పలువురు సీఐల బదిలీ యాదగిరిగుట్ట : జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేష్‌ను భువనగిరి పట్టణ సీఐగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కమిషనరేట్ కార్యాలయంలోని సీఐ సెల్లో విధులు నిర్వహిస్తున్న బి.భాస్కర్ రానున్నారు. యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్‌రావును ఆలేరు ఎస్హెచ్ఓగా బదిలీ చేశారు. సీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఎం.శంకర్ యాదగిరిగుట్ట రూరల్ సీఐగా రానున్నారు. -
పట్టణాల గొంతెండుతోంది!
సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఎండ తీవ్రత పెరగడం, మరోవైపు మిషన్ భగీరథ నీరు తగినంత సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బోర్ల నీటిని కలిపి పంపిణీ చేస్తున్నా, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసినా సరిపోను నీళ్లు రావడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రోజువారీ అవసరాలకోసం ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించుకుంటున్నారు. తాగడానికి ఆర్వో ప్లాంట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అధికారులు చెబుతున్నా సమస్య తీర్చలేకపోతున్నారు. ● భువనగిరి మున్సిపాలిటీ జనాభా సుమారు 75 వేలు. ప్రభుత్వ నీటి లెక్కల ప్రకారం పట్టణానికి రోజుకు 11 ఎంఎల్డీల నీరు అవసరం. కానీ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి 5.44 ఎంఎల్డీలు మాత్రమే వస్తోంది. చాలా ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటిని విడుస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు స్థానిక బోర్ల నీటిని కలిపి సరఫరా చేస్తున్నారు. నీరు కలుషితం అవుతుండడంతో తాగలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భగీరథ నీటిని అవసరాలకు వినియోగిస్తున్నారు. ● యాదగిరిగుట్టలో రోజు విడిచి రోజు నల్లాల ద్వారా నీరు వదులుతున్నారు. పట్టణ జనాభా 25వేలకు పైగా ఉంది. రోజుకు 12లక్షల లీటర్ల నీరు అవసరం. మిషన్ భగీరథ నీరు 60 శాతం మాత్రమే వస్తుంది. ప్రశాంత్‌నగర్, గాంధీనగర్, హనుమాన్ వీధిలో పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు. ప్రత్యామ్నాయంగా బోర్ల నీటిని కలిపి, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ● మోత్కూరు పట్టణ జనాభా సుమారు 18వేలు ఉంటుంది. రోజుకు 2.84 ఎంఎల్డీల నీరు అవసరం. మిషన్ భగీరథ ద్వారా 1.54 ఎంల్డీలు మాత్రమే వస్తుంది. బోర్ల ద్వారా 1.30 ఎంఎల్డీల నీటిని మిషన్ భగీరథ నీటితో కలిపి సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తీవ్రం.. ట్యాంకర్ల ద్వారా సరఫరాబోర్ల నీళ్లే దిక్కు ప్రశాంత్‌నగర్‌లో పది రోజు లుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు నీళ్లే దిక్కవుతుంది. అధికారులు చొరవచూపి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలి. –నవీన్ ఠాగుర్, ప్రశాంత్‌నగర్, యాదగిరిగుట్ట రెండు రోజులకోసారి సరఫరా.. సినిమా టాకీస్ గల్లీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో రెండు రోజులకోసారి నీరు వస్తుంది. గతంలో గంటకు పైగా నీరు వచ్చేది. ప్రస్తుతం పావుగంట కూడా రావడం లేదు. వచ్చేది కూడా భగీరథ నీళ్లో, బోర్ల నీళ్లో తెలియడం లేదు. కనీసం అరగంటైనా నీటిని వదలాలి. –కప్పల వసంత, మోత్కూరు గత నెల రూ.3వేలు వెచ్చించాం తాగునీటికోసం ఇబ్బంది ప డుతున్నాం. మూడు రోజు లకు ఒకసారి మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నారు. అవి సరిపోవడం లేదు. ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. గత నెల రూ.3వేలు వెచ్చించి కొనుగోలు చేశాం నీటిని కొనడం భారంగా మారింది. –వి.మీనాక్షి, రత్నానగర్, చౌటుప్పల్ఫ మిషన్ భగీరథ నీటిలో బోర్ల నీళ్లు కలిపి సరఫరా చేస్తున్నా కటకటే.. ఫ ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ఏర్పాటు ఫ మున్ముందు నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశంచౌటుప్పల్లో ఇలా.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రధానంగా 7,16,17,18,19 వార్డుల పరిధిలోని హనుమాన్‌నగర్, రత్నానగర్, బంగారిగడ్డ, సుందరయ్య కాలనీ, బస్టాండ్ ఏరియా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీకి మిషన్ భగీరథ ద్వారా 6ఎంఎంల్డీల నీరు రావాలి. ప్రస్తుతం 2.5 ఎంఎల్డీల నీరు మాత్రమే వస్తుంది. -
అన్న ప్రసాద కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం
యాదగిరిగుట్ట : అన్నప్రసాద కేంద్ర భవనాన్ని త్వరలోనే ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. యాదగిరికొండ దిగువన నూతనంగా నిర్మించిన అన్నప్రసాద కేంద్రం పనులు పూర్తయినా ప్రారంభించకపోవడంపై ప్రారంభంలో జాప్యంశ్రీ శీర్షికన ఈనెల 2న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఈఓ స్పందించారు. శనివారం భవనాన్ని సందర్శించి అందులో వసతులను పరిశీలించారు. వెగెశ్న ఫౌండేషన్ నిర్వాహకులతో సంప్రదింపులు చేసి త్వరలో అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.అనంతరం టెంపుల్ సిటీపై వేద పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రసాద విక్రయశాల, టిక్కెట్ కౌంటర్, పరిసరాలను తనిఖీ చేశారు. అధికారులు, అర్చకులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈఓ భాస్కర్‌శర్మ, అధికారులు దయాకర్‌రెడ్డి, రామారావు ఉన్నారు. ఫ గుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
15న సుందరీమణుల రాక
సాక్షి,యాదాద్రి : వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 15న జిల్లా సందర్శనకు రానున్నారని, ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ వేదికగా ఈనెల 7నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వస్తున్నారని, తమ పర్యటనలో భాగంగా యాదాద్రి జిల్లాను సందర్శిస్తారని వెల్లడించారు. 15వ తేదీన సాయంత్రం భూదాన్‌పోచంపల్లి రూరల్ టూరిజంపార్క్కు 30 మంది, యాదగిరిగుట్టకు 30 మంది వస్తారని పేర్కొన్నారు. పోచంపల్లిలో చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీని పరిశీలిస్తారని, యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దర్శనంతోపాటు కొండపైన ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తారని చెప్పారు. అదేరోజు రాత్రి తిరిగి హైదారాబాద్ వెళ్తారని తెలిపారు. ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయ ని, టెన్త్ ఫలితాలే నిదర్శనమన్నారు. అట్రాసిటీ కేసులపై సమీక్ష భువనగిరి టౌన్ : కలెక్టరేట్లో శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసులపై ఎమ్మెల్యే సమీక్షించారు. పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రతి నెలా అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ఏసీపీలు, కమిటీ సభ్యులు సుదర్శన్, శివలింగం, నర్సింగరావు, తిరుమలేష్, రాజన్‌నాయక్ పాల్గొన్నారు. గవర్నర్‌ను కలిసిన ఐలయ్య యాదగిరిగుట్ట : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజభవన్లో కలిశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందన్నారు. 8,162 ఇళ్లు మంజూరు భువనగిరిటౌన్ : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 5నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,932 ఇందిరమ్మ ఇళ్లకు గాను ఇప్పటి వరకు 8,162 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్, డీఈలు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం బొమ్మలరామారం : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హేమిమా తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయని, ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నెల 1నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలోని 901 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 24 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, ఆయాలకు 15 రోజుల చొప్పున సెలవులు ఉండనున్నాయి. మిగతా రోజుల్లో ఇంటింటి సర్వే, చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చడానికి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, సిబ్బందికి ఉపశమనం కలిగినట్లయింది. -
మూడు నెలలే గడువు పనులేమో కదలవు!
ఆరేళ్లు గడిచినా పూర్తికాని ఆర్యూబీ ఆగస్టు లోపు పూర్తిచేస్తాం వివేకానంద విగ్రహం నుంచి ఆర్యూబీ ప్రవేశ ద్వారం వద్ద 120 మీటర్ల పొడవు రిటైయినింగ్ వాల్ పనులు జరుగుతున్నాయి. వాహనాలు బయటకు వెళ్లే ద్వారం(ఎగ్జిట్) వద్ద 124 మీటర్ల పొడవుతో వాల్ పనులు పూర్తయ్యాయి. అయితే మిషన్‌భగీరథ, ఇతర పైప్లైన్లు ఉండడంతో పనులకు అడ్డంకి మారుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి ఆర్యూబీని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. –కరుణాకర్, రైల్వే జేఈ అందరికీ ఇబ్బందులే.. ఆర్యూబీ పనులు వేగవంతంగా జరగటం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు కార్యాలయాలకు, పింఛన్ల కోసం వృద్ధులు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా అధికారులు శ్రద్ధ చూపాలి. –తునికి దశరథ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఆర్యూబీ నిర్వాసితుల సమితి కన్వీనర్ఆలేరు: ఆవలి వైపు వెళ్లడానికి పట్టుమని పది మీటర్ల దూరం ఉండదు. కానీ, రెండు కిలోమీటర్ల ప్రయాణిస్తే తప్ప అక్కడికి చేరుకోలేం. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో రైల్వేగేట్ స్థానంలో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల పట్టణాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రిమెంట్ ప్రకారం మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ 60 శాతం కూడా పూర్తికాలేదు. 2019 అక్టోబర్‌లో పనులు మొదలు ఆలేరు రైల్వే లెవల్ క్రాసింగ్(గేట్) మీదుగా హైదరాబాద్ – వరంగల్ల మధ్య రైళ్ల రాకపోకల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ నిత్యం గేట్ పడటం వల్ల ప్రజలు ఆర్ఓబీ మీదుగా 2కి.మీ చుట్టూ తిరిగి పట్టణంలోకి రావాల్సిన పరిస్థితి. నాయకులు, స్థానిక ప్రజలు ఆందోళన నేపథ్యంలో ఆర్యూబీ మంజూరైంది. 2019 అక్టోబర్‌లో పనులు ప్రారంభం అయ్యాయి. మొదట రూ.11కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే భూ నిర్వాసితులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నందున ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.13 కోట్లకు పెంచారు. అత్యవసర సమయంలో.. అంత్యక్రియలసమయంలో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. రైల్వేగేట్ అవలి వైపు నుంచి హైదరాబాద్ మార్గంలోని శ్మశానవాటికకు పార్థీవదేహాన్ని తరలించడం, అక్కడికి కుటుంబ సభ్యులు రావడానికి ప్రయాస పడాల్సిన పరిస్థితి. అత్యవసర వైద్యసేవల కోసం గర్భిణులు, వృద్ధులు ఆస్పత్రికి వెళ్లడానికి కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ చుట్టూ తిరిగి, పట్టణంలోకి రావడం, లేదా బాధితుని ఇంటికి వెళ్లడానికి ఆలస్యమవుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవతోంది. తద్వారా సకాలంలో రోగులకు చికిత్స అందక ప్రాణాపాయ పరిస్థితులకు కారణమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఫ చుట్టూ తిరిగి వెళ్లలేక రైలు పట్టాలపైనుంచే వెళ్తున్న ప్రజలు ఫ రూ.13 కోట్ల వ్యయంతో పనులు -
పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ
భూదాన్‌పోచంపల్లి : చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కేంద్రీకృతంగానే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ చేనేత సదస్సులో ఆయన మాట్లాడారు. రైతన్నలు, నేతన్నలు తమకు రెండు కళ్లని, వారి కష్టం, త్యాగాల వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. తన దృష్టికితీసుకొచ్చిన చేనేత సమస్యలను కేబినెట్లో పెట్టి, మరికొన్నింటిపై సీఎంను ఒప్పించి పరిష్కరించుటకు కృషిచేస్తానన్నారు. హ్యాండ్లూమ్ పార్కు లేదా స్వామిరామానందతీర్థ గ్రామీణసంస్థలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఐఐహెచ్‌టీకి ఆచార్య కొండాలక్ష్మణ్‌బాపూజీ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న మండలాలతో పాటు భూదాన్‌పోచంపల్లి మండలానికి కూడా టెక్నికల్ సమస్యల వల్ల రైతుభరోసా ఆగిపోయిందని, వచ్చే రైతుభరోసాలో తప్పకుండా రైతులందరికీ ఖాతాలో డబ్బులు పడుతాయని, ఆందోళన చెందవద్దని కోరారు. అంతకుముందు కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత సహకార సంఘాన్ని సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా : ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి చేనేత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తాను కేంద్రంలోని చేనేత, జౌళిశాఖ కన్సంటెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని ఇటీవల పోచంపల్లి ఇక్కత్ డుప్లికేషన్పై పార్లమెంట్లో అడిగానని గుర్తు చేశారు. అదేమాదిరిగా కేంద్రం నుంచి రావల్సిన పథకాలు, నిధులు, పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుపై ఈ నెల 6న జరిగే సమావేశంలో కేంద్రజౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌తో చర్చిస్తానని చెప్పారు. నూలుడిపో ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలని, సహకార సంఘంతో పాటు సహకారేతర సంఘాల నుంచి కనీసం 25 శాతం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత, జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి, రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేశం, అర్భన్‌బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత కార్మికసంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు కొట్టం కరుణాకర్‌రెడ్డి, రేఖాబాబురావు, పాక మల్లేశ్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఫ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం ఫ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆర్డీ అకౌంట్లో డబ్బులు జమ చేయండి ఫ చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, చేనేత కార్మికులు త్రిఫ్ట్ పథకానికి సంబంధించి ఆర్డీ 1 అకౌంట్లో తమ వాటా ధనం జమచేసుకుంటే ప్రభుత్వం ఈ నెల 10నుంచి ఆర్డీ 2 అకౌంట్లో తన వాటా డబ్బులు జమచేస్తుందని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. చేనేత బీమా కింద చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.5 కోట్లు చెల్లించామన్నారు. సహకార సంఘాల ద్వారా రూ. 15 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశామని, ఇందులో యాదాద్రి జిల్లాలో రూ.4.50 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి టెస్కో షోరూంల ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు. రెండు నెలల్లో రుణమాఫీ డబ్బులను కార్మికుల ఖాతాలో జమచేస్తామని, చేనేతవస్త్రాల డుప్లికేట్ నిరోధానికి తెలంగాణ లేబుల్ తీసుకొస్తున్నామని తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో మ్యూజియం, డిజైనింగ్, డైయింగ్, ఎగ్జిబిషన్ అన్ని ఒకేదగ్గర ఏర్పాటు చేసేలా డీపీఆర్ తయారు చేస్తున్నామని చెప్పారు. -
మరింత చేరువగా ‘రైతు నేస్తం’
రామన్నపేట : రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహలు చేస్తోంది. ఇప్పటి వరకు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు గాను ప్రతి మండలంలో కొత్తగా రెండు వ్యవసాయ క్టస్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. రైతునేస్తం ఉద్దేశం ఇదీ.. వ్యవసాయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమం ప్రారంభించింది. రైతువేదికలకు వీడియో కాన్పరెన్స్‌ను అనుసంధానం చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెళకువలు, యాజమాన్య పద్ధతులను, చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారం చేరవేయడం జరుగుతుంది. డిజిటల్ ప్లాట్పామ్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎంతగానో దోహదపడుతుండడంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేయగా.. అదనంగా రెండు క్లస్టర్లకు విస్తరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున 92 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఫ ప్రస్తుతం రైతువేదికల్లోనే ప్రసారం ఫ అదనంగా మండలానికి మరో రెండు క్లస్టర్లలో ఏర్పాటు ఫ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఫ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు రైతునేస్తం ప్రసారం జరుగుతున్న రైతువేదికలు ఇవీ.. రాజాపేట, గుండాల, వలిగొండ, అడ్డగూడూరు, కొలనుపాక, ఆత్మకూర్(ఎం), అనాజిపురం, రాయరావుపేట, బొమ్మలరామారం, జైకేసారం, చాడ, పాటిమట్ల, మాదాపురం, సంస్థాన్‌నారాయణపురం, బీమనపల్లి, రామన్నపేట, మాసాయిపేటలోని రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
మన దర్శకులకు ‘ఫాల్కే’ పురస్కారం
ఈ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది ఆర్యూబీ ఆలస్యం వల్ల మున్సిపాలిటీలోని రామ్శివాజీనగర్, పోచ్చమ్మగుడి, రంగనాయకుల గుడి, శాంతినగర్, కుమ్మరి వాడ, ఎస్సీ కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బంది మారింది. అంతేకాకుండా రాజాపేట, రఘునాథపురం తదితర గ్రామాలకు ఇక్కడినుంచే వెళ్లాలి. ఆర్యూబీ పనుల్లో జాప్యం వల్ల అవస్థలు పడుతున్నారు. రజాకార్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ, ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ దర్శకుడు విజయ్‌కుమార్‌ను వరించిన పురస్కారంచిట్యాల, భూదాన్‌పోచంపల్లి : ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ, భూదాన్‌పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌కుమార్‌లకు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటిసారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్త ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్; డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే15వ ఫిల్మ్ ఫెస్టివల్లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగి రీలలో పురస్కారానికి ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్ ఎంపికయ్యారు. యాట సత్యనారాయణ గురువారం రాత్రి జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే పురస్కారం అందుకోగా.. బడుగు విజయ్‌కుమార్ శనివారం అందుకోనున్నారు. -
ఈదురుగాలులు, వడగండ్లు
భువనగిరిటౌన్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట రూరల్: భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, యాదగిరి గుట్ట మండలాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయి సామగ్రి తడవడంతో బాధిత కుటుంబాలు ఇబ్బంది పడ్డారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రహరీ కూలింది. చెట్లు విరిగిపడటంతో కారు ధ్వంసమైంది. కిసాన్‌నగర్‌లో విద్యుత్ స్తంభం కూలిపోయింది. మామిడి కాయలు నేలరాలాయి. పోచంపల్లిలో అంధకారంఈదురుగాలుల వల్ల కరెంట్ సరఫరా నిలిచిపోయి పోచంపల్లి అంధకారంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. యాదగిరిగుట్ట మండలం గౌరా యపల్లిలో పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. అత్యధికంగా భువనగిరి 25, యాదగిరిగుట్టలో 23.3, బీబీనగర్‌లో 14 మి.మీ వర్షం కురిసింది.ఫ భువనగిరి కోర్టు ఆవరణలో కూలిన చెట్లు ఫ మామిడి తోటల్లో రాలిన కాయలు ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం -
భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..
2. భూసార పరీక్షల వలన ఉపయోగాలు ● పొలంలో పోషకాల స్థాయి తెలుస్తుంది. ● ఆ పొలంలో ఏయే పంటలు పండించవచ్చో, ఎరువులు ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుస్తుంది. ● నేల సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం ఎరువులను ఉపయోగించవచ్చును. ● ఎరువుల అనవసరపు ఖర్చు తగ్గించవచ్చు. ● సరైన సమయంలో భూసార పరీక్షలు చేయిస్తే సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి నాణ్యమైన పంటలను పండించవచ్చు.నడిగూడెం: ప్రస్తుతం రబీ సీజన్ పూర్తయ్యింది. ఈ సమయంలోనే రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలు తీసి భూసార పరీక్షలు చేయించాలని, వాటి ఫలితాల ఆధారంగా ఎరువులు ఉపయోగించాలని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ. కిరణ్ చెబుతున్నారు. భూసార పరీక్షలపై ఆయన సలహాలు, సూచనలు.. ● పొలం నుంచి సేకరించిన మట్టిని భౌతిక, రసాయన పద్దతుల ద్వారా విశ్లేషించి దాని భౌతిక, రసాయన లక్షణాలు తెలుసుకొని ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష లక్ష్యం. ● పంట కోత తర్వాత పొలాల్లో నుంచి మట్టి తీయవచ్చు. ● వేసవిలో పంటలు లేని సమయంలో మట్టి నమూనాలు సేకరించవచ్చు. ● ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు మట్టి నమూనాలు తీయరాదు. ● నీరు పెట్టిన తర్వాత, నీడపడే ప్రదేశాలు, నీటి ముంపు ప్రాంతాలు, పెంట కుప్పల దగ్గర, గట్లు, చెట్లు, రోడ్ల దగ్గర తీయరాదు. ● ఒక రకం పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరీ పెద్దయితే ప్రతి ఐదెకరాలకు ఒక నమూనా తీయాలి. ● నేల నిర్మాణం, రంగు, మురుగు, నీటి పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, గుణాలు, పంటల సరళి మొదలగు విషయాల్లో ఏదైనా తేడా కన్పిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుంచి తీయాల్సి ఉంటుంది. ● పైరు పంటలకు భూమిలో 6 అంగుళాలు లోతులో మట్టి నమూనాలు సేకరించాలి. ● పండ్ల తోటల్లో 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా తీయాలి. ● కారి, చౌడు, ఆమ్ల నేలల్లో అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి. ● నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేసి మట్టి నమూనాలు సేకరించాలి. ● గడ్డపార లేదా పారతో గొయ్యి తీసి దాని అంచుల నుంచి పారతో లేదా తాపీతో మట్టిని సేకరించాలి. ● పొలంలో 8 నుంచి 10 స్థలాల నుంచి మట్టిని తీయాలి. ● సేకరించిన మట్టినంతటిని కలిపి నేలపై పరచి దానిని 4 భాగాలు చేయాలి. ● మూలలకు ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారవేయాలి. ● ఈ విధంగా 500 గ్రాముల మట్టి నమూనాలను సేకరించాలి. ● ఈ అరకేజీ మట్టిని గుడ్డ సంచిలో లేదా పాలిథిన్ సంచిలో వేసి, రైతు పేరు, చిరునామానా, సర్వే నంబర్, పొలం విస్తీర్ణం, మెట్ట, పల్లం, ఆరుతడి పంటలు, గత 3 సంవత్సరాలుగా వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ మొదలగు వివరాలను జతచేయాలి. ● ఈ సమాచారంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు లేదా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. లేదా గడ్డిపల్లి కేవీకేకు పంపించినా పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్‌కార్డు పంపిణీ చేస్తారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ సూచనలు -
పరారైన జీవిత ఖైదీ అరెస్టు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : పెరోల్‌పై వచ్చి, గత ఆరు సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న జీవిత ఖైదీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. కోదాడ పోలీస్ డివిజన్ మఠంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు తిరుపతి 2012లో రాచకొండ (అప్పటి సైబరాబాద్) కమిషనరేట్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యాడు. ఈమేరకు 2015లో రంగారెడ్డి జిల్లా మూడవ అదనపు సెషన్ కోర్టు సదరు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. 2019 ఆగస్టు 17న ముప్పై రోజుల పెరోల్ పై విడుదలయ్యాడు. పెరోల్ అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లకుండా గత ఆరు సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ నివేదిక ఆధారంగా మఠంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా నిందితుడు గుంటూరు జిల్లాలో ఉన్నట్లు నిర్ధారించారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ ప్రత్యేక బృందం నిందితుడు బొడ్డు తిరుపతిని గుంటూరు పట్టణంలో అరెస్ట్ చేశారు. నిందితుడు తన స్వగ్రామం, కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా బంధాలను ఆపేసి గుంటూరులోని ఓ హోటల్లో పనిచేస్తూ అక్కడే ఓ మహిళను వివాహం చేసుకొని స్థిరపడినట్లు తెలిపారు. ఈ కేసు చేదించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్
రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆన్లైన్ పేమెంట్ల దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఆర్టీసీ బస్సులో వాడుతున్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్)తో చిల్లర సమస్య తలెత్తేది. ఈ సమస్యలను అధిగమించేందుకు నూతనంగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు (ఐ టిమ్స్) ప్రవేశపెట్టనుంది. నల్లగొండ రీజియన్ వ్యాప్తంగా ఏడు డిపోలు ఉన్నాయి. అన్ని డిపోల్లో టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్)తో పాటు కొత్తగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సిస్టమ్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోలు ఉండగా అన్ని డిపోల్లో 600 ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగదు రహిత సేవలు.. జిల్లాలో ప్రయోగాత్మకంగా ముందుగా దేవరకొండ డిపో పరిధిలో 10 ఈ టిమ్స్ మిషన్లను ప్రవేశపెట్టింది. దీంతో పాటు సూర్యాపేట, కోదాడ డిపోల్లో దూర ప్రయాణం చేసే బస్సుల్లో ఈ మిషన్లు వాడుతున్నారు. వీటితో నగదు రహిత సేవలు అందించేందుకు వీలు ఉంది. ఈ మిషన్ల ద్వారా ప్రయాణికులు యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఏటీఎమ్ కార్డు స్వైపింగ్ తో డబ్బులు చెల్లించి టికెట్ పొందే అవకాశం ఉంది. ఈ టీమ్ సేవలను త్వరలో దశలవారీగా ఇతర బస్సుల్లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు తప్పనున్న ఇబ్బందులు కండక్టర్ వద్ద చిల్లర లేని సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. గమ్య స్థానంలో దిగేటప్పుడు ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులకు కలిపి డబ్బులు ఇచ్చేవారు. ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లతో చిల్లర సమస్యకు చెక్ పడనుంది. అందుబాటులోకి రానున్న ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు (ఐటిమ్స్) ప్రయాణికులకు తొలగనున్న చిల్లర సమస్య జిల్లాకు 600 ఐ టిమ్స్ మంజూరు ఇప్పటికే సిస్టమ్ సూపర్వైజర్లకు శిక్షణ సేవలు వేగవంతం అవుతాయి ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఉమ్మడి నల్లగొండ రీజి యన్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో మిషన్ల ద్వారా సేవలు అందిస్తాం. యూపీఐ, ఏటీఎం కార్డు ద్వారా టికెట్ తీసుకునే సదుపాయం ఉంది. ఈ మిషన్ ద్వారా బస్సు ప్రయాణించే సమయంలో కూడా సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ తీసుకునే సదుపాయం ఉంది. ఆర్టీసీ లావాదేవీలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. – జానిరెడ్డి, రీజినల్ మేనేజర్ రీజియన్‌లో డిపోల వారీగా మిషన్ల వివరాలు డిపో టిమ్‌ల సంఖ్య కోదాడ 80 నార్కట్‌పల్లి 15 మిర్యాలగూడ 135 దేవరకొండ 90 నల్లగొండ 115 సూర్యాపేట 95 యాదగిరిగుట్ట 70 -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
డిండి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం డిండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. డిండి పట్టణానికి చెందిన కాసుల వెంకటేష్ చారి ఇంటికి తాళం వేసి గత నెల 30న మండల పరిధిలోని తవక్లాపూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్ చారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం తవక్లాపూర్ నుంచి ఇంటికి తిరిగొచ్చి న వెంకటేష్ తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చోరీ ఘటనపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణంకొండమల్లేపల్లి : కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పీఏపల్లి మండలంలోని మేడారం గ్రామపంచాయతీకి చెందిన చెనమోని సత్యం(53) బైక్‌పై తిరుగుతూ చేపలు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపంలోని సంజీవని ట్రస్ట్ వద్దకు రాగానే పెద్దవూర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపు తప్పి సత్యం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. చోరీ నిందితులకు రిమాండ్కేతేపల్లి : చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని అమ్మేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా కేతేపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై ఇద్దరు యువకులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా కొర్లపహాడ్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుపడ్డారు. వారిని స్టేషన్ తీసుకెళ్లి విచారించగా సూర్యాపేట పట్టణం సీతారామపురం గ్రామానికి చెందిన కంభం కుమార్, మనబోలు లక్ష్మీనర్సింహగా గుర్తించారు. వీరు గత ఫిబ్రవరిలో కొప్పోలు గ్రామంలో బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బైక్‌ను రికవరీ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలుపెన్పహాడ్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్షతో పాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు. పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన మేడం రమణయ్య శుక్రవారం మద్యం సేవించి వాహనాన్ని నడుపుతుండగా పోలీసులు తనిఖీ చేస్తున్న సమమంలో పట్టుబడ్డాడు. ఈమేరకు కేసు నమోదు చేసి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి వెంకటరమణ ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు అస్వస్థత
ఆలేరు: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను వెంటనే బస్సును పక్కకు నిలపడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం జనగాం డిపోకు చెందిన ఏపీ 29 జెడ్–1715 నంబర్ గల ఆర్టీసీ బస్సు జనగాం నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్‌కు బయలుదేరింది. ఈక్రమంలో ఆలేరు బస్టాండ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని సుమారు మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరింది. బస్సు ఆలేరు శివారు దాటగానే డ్రైవర్ లక్ష్మయ్య అస్వస్థతకు గురయ్యాడు. తనకు కళ్లు తిరుగుతున్నాయని చెబుతూనే స్టీరింగ్ మీదకి వాలాడు. ఈ క్రమంలోనే అతను అప్రమత్తమై బస్సు డివైడర్ మీదకి దూసుకెళ్లకుండా బ్రేక్ వేసి బస్సును వెంటనే ఆపివేశాడు. దీంతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కండక్టర్ జనగాం డిపోకు చెందిన బచ్చన్నపేట–జేబీఎస్ ఆర్టీసీ బస్సును ఆపి, ప్రయాణికులను అందులోకి ఎక్కించాడు. ఎండల తీవ్రత కారణంగా డ్రైవర్‌కు వడదెబ్బ తగిలి, కళ్లు తిరిగి ఉంటాయని ప్రయాణికులు తెలిపారు. యాదగిరికొండపై ఆర్టీసీ బస్సు బ్రేక్డౌన్యాదగిరిగుట్ట: యాదగిరికొండపై ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ అయింది. శుక్రవారం సాయంత్రం సమయంలో కొండ కింద నుంచి భక్తులను ఎక్కించుకొని కొండపైకి వస్తున్న సమయంలో స్వాగత తోరణం వద్ద బస్సు ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో డిపోలోని గ్యారేజీలో ఉన్న మెకానిక్‌లు వచ్చి బస్సుకు మరమ్మతులు చేశారు.● వాహనాన్ని వెంటనే పక్కకు నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం -
జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. శుక్రవారం యాదగిరి కొండపైన గల తన కార్యాలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖలు, ఎస్పీఎఫ్ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన ఉదయం స్వస్తి వాచనంతో శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన, తిరు వెంకటపతి అలంకార సేవ ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ నిర్వహిస్తామన్నారు. 10వ తేదీన ఉదయం లక్ష పుష్పార్చన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కాళీయ మర్థన అలంకార సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు.సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకార సేవను ఊరేగించనున్నట్లు వెల్లడించారు. 11వ తేదీన మహా పూర్ణాహుతి చేసి, సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7గంటలకు విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తీ, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవ సమాప్తి ఉంటుందని పేర్కొన్నారు. శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఆలయంలో భక్తులచే జరిపించే నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం, జోడు సేవను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యాలపై దృష్టి సారిస్తా వేసవిలో భక్తులు శ్రీస్వామి వారి చెంతకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చలువ పందిర్ల ఏర్పాటు, మంచి నీటి సౌకర్యం కల్పించే అంశాలపై దృష్టి సారిస్తామని ఈఓ వెంకట్రావ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు యాదగిరి క్షేత్రాన్ని సైతం ఈ నెల 15వ తేదీన సందర్శించనున్నట్లు, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ -
మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నాగార్జునసాగర్ : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 12న నాగార్జునసాగర్‌కు రానుండటంతో శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైందని బుద్ధవనం ఓఎస్డీ సుదన్‌రెడ్డి తెలిపారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన మిస్‌వరల్డ్ పోటీదారులు నాగార్జునసాగర్‌ను సందర్శించనున్న సందర్భంగా సాగర్‌లోని విజయ్‌విహార్, బుద్ధవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్‌వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ కు తీసుకువచ్చే ఓల్వో బస్సులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు శుక్రవారం ఒక బస్సును టూరిజం అధికారుల పర్యవేక్షణలో నాగార్జునసాగర్‌కు తీసుకువచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సు మొదటగా మిస్‌వరల్డ్ పోటీదారులు బస చేసే విజయ్‌విహార్ అతిథి గృహం, బుద్ధవనం చేరుకొని ఆ తరువాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లింది. ఈ సందర్భంగా ఓఎస్డీ సుదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మిస్‌వరల్డ్ పోటీదారులను హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు లగ్జరీ బస్సులో తీసుకువచ్చి తిరిగి వెళ్లే ప్రక్రియలో ఎంత సమయం పడుతుంది, అంతరాయం లేకుండా ఉండే రూట్ మ్యాప్ కోసం శుక్రవారం ట్రయల్‌రన్ చేసినట్లు తెలిపారు. ట్రయల్‌రన్‌లో టూరిజం ఎస్ఈ భాస్కర్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ సంపత్‌గౌడ్, ఆర్ఐ దండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా గుత్తా మోహన్‌రెడ్డి
చిట్యాల: చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమాఖ్య ఎన్నికల్లో ఆయనను ఎన్నికయ్యారు. మోహన్‌రెడ్డి 1978లో ఎన్జీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు 1978, 1985లో నల్లగొండ శాసన సభ నియోజకవర్గ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా గుత్తా మోహన్‌రెడ్డి ఎన్నిక కావటం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ప్రమాదవశాత్తు నదిలో మునిగి విద్యార్థి మృతి హుజూర్నగర్ (చింతలపాలెం) : వేసవి సెలవులు రావడంతో ఈత నేర్చుకునేందుకు కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటేశ్వర్లు కొడుకు లోకేష్ (16) కోదాడలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన అతను కృష్ణానదిలో (ప్రాజెక్టు వెనుక జలాల్లో) ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. నడుముకు డబ్బా కట్టుకుని నీటిలోకి దిగాడు. డబ్బా ఊడి పోవడంతో నీటిలో మునిగి పోయాడు. అక్కడ ఉన్నవారు గమనించి గాలించి అతడిని బయటకు తీశారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబెషనరీ ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. -
ఆస్తి పన్ను చెల్లింపునకు రాయితీ గడువు పొడిగింపు
భువనగిరిటౌన్ : ముందస్తు ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకం గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మున్సిపాలిటీల్లో 5శాతం రాయితీ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయితే ఈ నెల7 వరకూ ఈ గడువును పొడిగిస్తున్నట్లు పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను రూ 9.23 కోట్లు డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం రూ .1.41 కోట్లు వసూలైంది. మిగతా రూ.7.81 కోట్లు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.ఆలేరు జూనియర్ సివిల్ జడ్జిగా అజయ్‌కుమార్ ఆలేరురూరల్: ఆలేరు జూనియర్ సివిల్ జడ్జిగా అజయ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిర్మల్ జిల్లా కోర్టు నుంచి ఆలేరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిరియాల వనమరాజు, న్యాయవాదులు జూకంటి రవీందర్, తుంగ హరికృష్ణ, ఎండీ చాంద్‌పాషా, శివకుమార్, రావుల రవీందర్, రవికుమార్, రాజశేఖర్, సిద్దులు తదితరులున్నారు. స్వర్ణగిరి క్షేత్రంలో సహస్ర దీపాలంకరణ సేవభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు గురువారం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. సాయంత్రం స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో సుమారు 3500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. -
కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి
చిట్యాల: ఉపాధి హామీ కూలీలకు రోజువారీగా వేతనం గిట్టుబాటు అయ్యేలా అధికారులు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని తిరులనాథస్వామి ఆలయ గుట్టపై ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకం తవ్వకం పనులు, వన నర్సరీలను గురువారం ఆమె జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు, రోజుకు వస్తున్న వేతన వివరాలు, సమస్యలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో తాము సొంత డబ్బులతో పనులు చేయాల్సి వస్తోందని ఆమెకు పలువురు కార్యదర్శులు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్ క్రిష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏపీఓ శ్రీలత, ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనులను నిర్లక్ష్యం చేయొద్దు నార్కట్‌పల్లి: ఉపాధి హామీ పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. నార్కట్‌పల్లిలో ఉపాధి పనులు, కంపోస్ట్ షెడ్, బ్రాహ్మణ వెల్లంలలో బృహత్ పల్లె ప్రకృతి వనం, మాదవ ఎడవల్లిలో పామ్‌పాండ్ పనులను గురువారం ఆమె పరిశీలించారు. అడిషనల్ పీడీ నవీన్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, ఏపీఓ యాదయ్య, కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన -
1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత
నాగార్జునసాగర్: బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఈ నెల 12న నాగార్జునసాగర్ సందర్శనకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో 1200 నుంచి 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్లీ జోన్–2 ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్ అతిథి గృహం, బుద్ధవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ను 30 నుంచి 40 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ బృందం ముందుగా విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని అక్కడి నుంచి బుద్ధవనం సందర్శనకు వెళ్తారని పేర్కొన్నారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేసి జాతకవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. సుమారు మూడున్నర గంటల పాటు మిస్ వరల్డ్ పోటీదారులు సాగర్‌లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా నిరసనలకు దిగి ఈ పర్యటనకు అంతరాయం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐలు సంపత్, వీరబాబు, వీరశేఖర్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
గరిడేపల్లి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన లచ్చిమల్ల లక్ష్మయ్య(41) బైక్‌పై గరిడేపల్లి నుంచి హుజూర్నగర్ వైపు వెళ్తుండగా అప్పన్నపేట గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మయ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేతచౌటుప్పల్ రూరల్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పశువులను గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సంతలో కొనుగోలు చేసిన 12 ఎద్దులు, రెండు ఆవులను ఆటోలో హైదరాబాద్‌లోని బహదూర్‌పూరాలో గల కబేళాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తునికి చెందిన ఆటో డ్రైవర్ యలమంచిలి అప్పలరాజు, జగ్గంపేటకు చెందిన అవాల నూకరాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణంబీబీనగర్: బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన కూనూరు దుర్గాప్రసాద్(20) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం తెల్ల వారుజామున హైదరాబాద్ నుంచి దుర్గాప్రసాద్ కాటేపల్లి గ్రామానికి బైక్‌పై వస్తుండగా.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వెనుక బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ బైక్ పైనుంచి ఎగిరిపడి ఫ్లైఓవర్ గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బంధువు కూనూరు నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.ఉరేసుకుని ఆత్మహత్యమర్రిగూడ: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రా మంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడ గ్రామానికి చెందిన ఐతరాజు సత్తయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఐతరాజు మహేష్(32) మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మహేష్ తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, కుమార్తె ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు. -
కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందని, ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ముందుగా కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గురువారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో సవతి తల్లి ప్రేమను చూపుతోందన్నారు. సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు..తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్థరహితమన్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నోసార్లు సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదనలేమన్నారు. అందుకే ప్రజలు పదేళ్లు అధికారాన్ని కూడా ఇచ్చారన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కేసీఆర్ పాత్ర, సోనియాగాంధీ పాత్ర, సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించలేమన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తవుతుంది..ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అనుమానం వద్దని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో పూర్తవుతుందన్నారు. టన్నెల్ ప్రమాదం వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని కానీ, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిపుణులు ఏవిధంగా పూర్తి చేయాలనేది చెప్పాల్సి ఉందన్నారు. వెలుపలి నుంచి ప్రాజెక్టు చేపడితే పర్యావరణ అనుమతులు అవసరం కాబట్టి కేంద్ర సహకారం కూడా ప్రాజెక్టు పూర్తి అవసరం ఉందని గుత్తా చెప్పుకొచ్చారు. ఏఎమ్మార్పీ కాలువ పెంచాలి..ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.442 కోట్లు ఇచ్చిందని సుఖేందర్‌రెడ్డి చెప్పారు. కెనాల్లో 4వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని, లైనింగ్ పనులు పూర్తయితే పెరుగుతుందన్నారు. కాబట్టి కాలువును రెండు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేస్తే మేలు జరుగుతుందని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ ఆలోచించాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అనడం సరైంది కాదు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలిపాకిస్తాన్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రథమ కర్తవ్యమని సుఖేందర్‌రెడ్డి అన్నారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను అప్పగిస్తే కొంతవరకు ఉద్రిక్తతను అరికట్టవచ్చన్నారు. పాకిస్తాన్ మంత్రుల ప్రకటనలను చూస్తే పరిష్కారం దిశగా లేవని కవింపు చర్యలుగా ఉన్నాయని గుత్తా పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి, ఉగ్రవాద దేశంగా పేరుపడిన పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే తన చావును తాను కొని తెచ్చుకోవడమేనని అన్నారు. -
104 సేవలకు సెలవేనా!
భువనగిరిటౌన్ : వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 104 వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మందులు సరఫరా చేసేందుకు 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 104 వాహనాలు సమకూర్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 104 సేవలను రద్దు చేయడంతో వాహనాలు మూడేళ్లుగా మూలనపడ్డాయి. వీటిని కలెక్టరేట్ ఆవరణలో పార్కింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 104 సేవలను తిరిగి పునరుద్ధరిస్తుందని ప్రజలు ఆశించినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎండకు ఎండి.. వానకు తడుస్తూ.. 104 పథకాన్ని ఎత్తివేసినందున రెండేళ్ల క్రితం వాహనాలను వేలం వేసేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ అమలుకాలేదు. ఒక్కో వాహనాన్ని సుమారు రూ.7లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అవి ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. ఉమ్మ డి జిల్లాకు 24 వాహనాలు మంజూరు కాగా.. అందులో నల్లగొండ 11, యాదాద్రి భువనగిరి 7, సూర్యాపేట జిల్లాకు 6 కేటాయించారు. ఫ మూడేళ్ల క్రితం నిలిచిన సేవలు ఫ మూలనపడ్డ వాహనాలు -
కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి
క్యాంపస్ సమాచారంనల్లగొండ టూటౌన్: నానో పార్టికల్స్ సహాయంలో నీటిలోని పెస్టిసైడ్స్‌ను తొలగించి నీటిని కాలుష్యరహితంగా మార్చి చెరువుల్లో ఉండే జీవరాశులను కాపాడేందుకు కృషి చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్ వి.శ్రీధర్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. ప్రశాంతి ఆధ్వర్యంలో ‘కిటాలసిస్ అండ్ బయోలాజికల్ అప్లికేషన్స్ ఆఫ్ మెటల్ ఆకై ్సడ్ నానో పార్టికల్స్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ పూర్తి చేసిన శ్రీధర్‌ను వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ అల్వాల రవి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వసంత, రూప, రమేష్, జ్యోతి, కళ్యాణి, శ్రీధర్‌రావు, శంకరాచారి, అమరేందర్, తిరుపతి, అభిలాష, శ్వేత, మహతి, పరిమళ తదితరులు పాల్గొన్నారు. బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూ నివర్సిటీ పరిధిలో బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని, విద్యార్థులు వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సీఓఈ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపిక నల్లగొండ టూటౌన్: నానో సాంకేతికత, జీవరసాయన శాస్త్ర పరిశోధనల్లో విశేష కృషి చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. రాంచందర్‌గౌడ్ మలేషియాలో జూన్‌లో జరిగే అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపికయ్యారు. ‘నానోకణాలు, జీవ అణువుల మధ్య జీవ భౌతిక పరస్పర చర్యలు’ అనే అంశంపై రాంచందర్‌గౌడ్ రచించిన పరిశోధనా వ్యాసాన్ని ఈ సదస్సులో పాల్గొని వివరించనున్నారు. ఆయన పరిశోధనలు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే దిశగా, నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ఉన్నట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. రాంచందర్గౌడ్కు వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి అభినందనలు తెలియజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
విద్యకు అధిక ప్రాధాన్యత
భువనగిరి: విద్యకు అఽత్యధిక ప్రాధాన్యత ఇస్తానని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్లో ఐదుగురు విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. వచ్చే ఏడాది ప్రతి కళాశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తే 50 సైకిళ్లను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రమణి పాల్గొన్నారు. సమాజాభివృద్ధికి విద్య దోహదంసమాజాభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఐఈఓ రమణి, ఎస్సీ షెడ్యూల్డ్ అధికారి వసంతకుమారి, ఇన్చార్జి విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
సత్తా చాటిన సర్కారు బడులు
భువనగిరి: ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కంటే అధిక ఉత్తీర్ణత శాతంతో పాటు అత్యధిక మార్కులు సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 25వ స్థానంలో ఉండగా 2024–25 సంవత్సరానికి 7వ స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా గత మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 8,631 మంది విద్యార్థులు హాజరు కాగా 8,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 199 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇందులో 163 ప్రభుత్వ పాఠశాలలుండగా 4453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,298 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా కేజీబీవీ, టీఎస్ఆర్ఐఎస్, ఎస్టీ ఆశ్రమ పాఠశాలలు 15 ఉండగా ఆయా పాఠశాలలకు చెందిన మొత్తం 713 మంది హాజరుకాగా 696 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మైనార్టీ, వెల్ఫేర్ 14 పాఠశాలలుండగా ఈ పాఠశాలకు చెందిన మొత్తం 908 మందికి గాను 906 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లు, 5 కేజీబీవీలు, 81 జెడ్పీ పాఠశాలలు, నాలుగు బీసీ వెల్ఫేర్, మూడు మైనార్టీ గురుకులాలు, ఐదు సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆయా పాఠశాలల్లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 677 మంది ఉన్నారు. కాగా.. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అత్యధిక మార్కులు సాధించింది వీరే.. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించారు. భువనగిరిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మాదురియ(521), గూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శ్రీహిత(572), మల్యాలలోని మోడల్ పాఠశాలకు చెందిన ఉద్భవ్సాయి (562), కేజీబీవీ వలిగొండకు చెందిన శ్రావణి (532), భువనగిరి మండలం అనంతారం గ్రామపరిధిలోని బీసీ గురుకుల పాఠశాలకు చెందిన రమేష్ (587), చౌటుప్పల్ రెస్సిడెన్షియర్ పాఠశాలకు చెందిన కీర్తిక (567), ఆలేరులోని మైనార్టీ పాఠశాలకు చెందిన ప్రసన్న(562), చౌటుప్పల్‌లోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన లాస్యప్రియ (572), బీబీనగర్ బీసీ గురుకుల పాఠశాలకు చెందిన సాయి మేఘన (582), భువనగిరిలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రత్యూష (501) ఉన్నారు. టెన్త్ ఫలితాల్లో ప్రైవేట్‌కు దీటుగా రాణించిన ప్రభుత్వ పాఠశాలలు 500పైగా మార్కులు సాధించిన 677 మంది విద్యార్థులుఅత్యధిక మార్కులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థికే.. జిల్లాలో అత్యధిక మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే సాధించారు. ఇందులో భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామ పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన రమేష్ అనే విద్యార్థి 587 మార్కులు సాధించాడు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఇన్ని మార్కులు రాకపోవడం గమనార్హం. -
ప్రారంభంలో జాప్యం!
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు విశాలమైన ప్రదేశంలో గత ప్రభుత్వ హయాంలో అన్నదాన ప్రసాద కేంద్రం పనులు చేపట్టారు. ఈ పనులకు 2021 మార్చిలో శంకుస్థాపన చేయగా.. ఈ ఏడాది మార్చి 23వ తేదీన పూర్తి చేశారు. సుమారు 4 సంవత్సరాల పాటు పనులు కొనసాగాయి. గత నెల 23వ తేదీన పనులు పూర్తి అయినప్పటికీ భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ప్రభుత్వంతో పాటు భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలు సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభోత్సవం ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, దాతలు సమయం ఇస్తే వచ్చే నెల శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని చెబుతున్నారు. భవన నిర్మాణానికి 2.7 ఎకరాల స్థలం.. అన్నదాన భవన నిర్మాణానికి వైటీడీఏ 2.7ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 1.3ఎకరాల్లో అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ అన్నదాన భవనంలో రెండు డైనింగ్ హాల్స్, రెండు వెయిటింగ్ హాల్స్, 12 స్టోర్ రూమ్‌లు నిర్మించారు. ఒకేసారి ఒక్కో హాల్లో 500మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు అవకాశం ఉంది. భక్తుల కోసం బయట గార్డెన్ సైతం ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చొని తినేందుకు కుర్చీలు, టేబుల్స్‌ను సైతం సిద్ధం చేశారు. ఇక భవనం ఆవరణలో జల ప్రసాదాన్ని నూతనంగా సిద్ధం చేశారు. భవన నిర్మాణానికి వెగెశ్న ఫౌండేషన్ మొదటగా రూ.11కోట్లు అందజేసింది. ఆ తరువాత వైటీడీఏ సుమారు రూ.11కోట్ల వరకు ఖర్చు చేసింది. కాగా గతేడాది క్రితంగా మిగిలిన పలు పనుల కోసం తిరిగి వెగెశ్న సంస్థ మరో రూ.2కోట్లు ఖర్చు చేసి, పూర్తి చేసింది. మొదట్లో ఈ భవన నిర్మాణం ఆలస్యం కావడంతో రెండేళ్ల క్రితం అప్పటి ఈఓ గీతారెడ్డి పనులు పూర్తికాక ముందే హడాహుడిగా గత ప్రభుత్వ పెద్దలతో ప్రారంభోత్సవం చేయించారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులను నూతన భవనంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం గండి చెరువు పక్కన ఉన్న లక్ష్మీ పుష్కరిణి చెంత గత దీక్షాపరుల మండపంలోనే భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తున్నారు. ఫ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రం భవనం పనులు పూర్తి ఫ ప్రభుత్వ పెద్దలు, దాతల సమయం కోసం వేచి చూస్తున్న ఆలయాధికారులు -
‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకావిష్కరణ
మిర్యాలగూడ: ప్రముఖ కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కస్తూరి ప్రభాకర్ పదవీ విరమణ సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాసిన ‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకంతో పాటు మధనం, ప్రభాకర చలనం పుస్తకాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్‌నాయక్, గోరేటి వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు ఆవిష్కరించారు. ప్రభాకర్ కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అనేక సేవలు అందించారని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన సేవలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, ప్రముఖ కార్టూనిస్ట్ నర్సింహ, మాజీ జెడ్పీ చైర్మన్ సీడీ. రవికుమార్, మానవ హక్కుల వేదిక నాయకుడు పి. సుబ్బారావు, భువనగిరి ఎంఈఓ నాగవర్ధన్‌రెడ్డి, సాహితీవేత్తలు ఉప్పల పద్మ, పెరుమాళ్ల ఆనంద్, సాగర్ల సత్తయ్య, పందుల సైదులు, నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరు బాలు తదితరులు పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్
నల్లగొండ: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నల్లగొండ వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు గురువారం నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్, కాకినాడ జిల్లా తడలరేవు మండలం గాడిమొగ్గ గ్రామానికి చెందిన పాసిల సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన కామాడి శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. వీరు 2024 అక్టోబర్‌లో కాకినాడ నుంచి రైలులో నల్లగొండకు వచ్చి పట్టణంలోని అల్కాపురి కాలనీకి చెందిన పాశం జనార్దన్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడి 2 బంగారు చైన్లు, రూ.40వేలు నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా 2024 డిసెంబర్లో నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణం వద్ద నివాసముంటున్న బోయిని కరుణాకర్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగిలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దొంగిలించిన పల్సర్ బైక్‌పై కాకినాడ నుంచి నల్లగొండకు వచ్చి అక్కలాయిగూడెం ప్రాంతంలో నివాసముంటున్న జెట్టి నాగరాజు ఇంట్లో 12 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి కాళ్ల కడియాలు, రూ.1,25,000 నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిలో పాసిల సత్యనారాయణ, కామాడి శ్రీనివాస్‌ను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 గ్రాముల బంగారు గొలుసు, పల్సర్ బైక్, 50 తులాల వెండి కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ధర్మాడి దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ధర్మాడి దుర్గాప్రసాద్‌పై 50 చోరీ కేసులు, పాసిల సత్యనారాయణ మీద 16 చోరీ కేసులు, కామాడి శ్రీనివాస్‌పై 3 కేసులు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల పరిధిలో నమోదైనట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ డానియల్ కుమార్, ఎస్ఐ శివకుమార్, సిబ్బంది విష్ణు, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ గోపాల్‌రావు, హెడ్‌కానిస్టేబుల్ శివరామకృష్ణ, శ్రీకాంత్, అంజాద్, గాంధీని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. -
భూదాన్ భూములపై విచారణ జరిపించాలి
భూదాన్‌పోచంపల్లి: భూదాన్ భూముల అక్రమాలపై సిట్టింగ్ జిడ్జితో విచారణ జరిపించాలని ఆలిండియా సర్వసేవాసంఘ్ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కు ఆవరణలో ఉన్న ప్రథమ భూదాత వెదిరె అరవిందారెడ్డి, భూదానోద్యమపితామహుడు ఆచార్య వినోబా భావే విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసి పేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేశారన్నారు. కానీ నేడు భూదానోద్యమానికి సంబంధం లేని వ్యక్తులు ఈ భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నాగారంలోని వందలాది భూదాన భూములను ధరణి రికార్డుల్లో పట్టా భూములుగా మార్చుకున్నారన్నారు. భూదాన బోర్డును ప్రక్షాళన చేసి నూతన అధ్యక్షుడిని నియమించాలన్నారు. భూదాన భూముల అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవిందారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తొలుపునురి కృష్ణగౌడ్, ప్రథమ భూదాత కుమారుడు వెదిరె ప్రమోద్ చంద్రారెడ్డి, ప్రఽథమ భూగ్రహీత మనుమడు కరగల్ల శ్రీనివాస్, భూదాన్ రాంచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కరగల్ల కుమార్, ఎడ్ల లింగస్వామి పాల్గొన్నారు. ఆలిండియా సర్వసేవాసంఘ్ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి -
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
ఆలేరురూరల్: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆలేరులో మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని రోడ్డుపై నిరసన తెలిపారు. అనంతరం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వనజారెడ్డి, జిల్లా ఇన్చార్జి కృష్ణవేణి, దివ్య, పావనిరెడ్డి, నీరజ, అనిత, దీప, విజయజ్యోతి, జాన్సీ, విజయలక్ష్మి, కవిత, సిద్దిలక్ష్మి, నాగజ్యోతి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు -
సుందరీమణుల రాక కోసం..
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్ వేదికగా ఈ నెల 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు పోచంపల్లితో పాటు నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. వారి రాక కోసం సాగర్‌లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు తదిత పర్యాటక ప్రాంతాలను అధికారుల ప్రత్యేంగా ముస్తాబు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 140 దేశాలకు చెందిన సుందరీమణులను బృందాలుగా విభజించి తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించే విధంగా అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 15న సుమారు 40దేశాలకు చెందిన అందాల భామల బృందం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా ఇక్కడి టూరిజం పార్కులోని ఇంటీయర్తో పాటు బయటి ప్రాంగణమంతా రంగులు వేస్తూ సుందరీకరణ చేస్తున్నారు. మ్యూజియం, హాప్లి థియేటర్, గెస్ట్ రూంలను అందంగా అలంకరిస్తున్నారు. చేనేత సంస్కృతి ఉట్టిపడేలా.. పోచంపల్లికి వచ్చే అందాల భామలకు చేనేత థీమ్ ప్రతిబించేలా అధికారులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పది రోజుల క్రితం అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి అధికారులకు, ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అందుకనుగుణంగా చేనేత మ్యూజియంలోని గోడలకు పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల వస్త్రాలతో అలంకరించనున్నారు. అంతేకాక టూరిజం ప్రాంగణంలో ఆయా చేనేత వస్త్రాల తయారీ విధానాలను లైవ్ డెమాన్స్ట్రేషన్తో పాటు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక మహిళలచే అందాల భామలకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాంప్లి థియేటర్ వద్ద నిర్వహించే చేనేత కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో కనీసం మూడు వందల మంది స్థానికులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే స్థానిక యువతులచే చేనేత ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్‌వాక్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు గంటల పాటు ప్రోగ్రాం.. 15వ తేదీ ఉదయం యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సుందరీమణులు సాయంత్రం పోచంపల్లికి వస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇక్కడ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వారం క్రితం టూరిజం అధికారులు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి రూట్లలో టూరిజం బస్సులను నడిపి రోడ్డు మార్గం ఎలా ఉందని ట్రయల్ రన్ నిర్వహించారు. ముస్తాబవుతున్న సాగర్‌లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు చేనేత థీమ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులుసుందరంగా బుద్ధవనం నాగార్జునసాగర్: మరో అందాల భామల బృందం ఈ నెల 12న బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. ఇందు కోసం గత నెల రోజులుగా సాగర్ తీరాన గల విజయవిహార్ అతిథి గృహం, బుద్దవనంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనంలో పచ్చదనంతో కూడిన ప్రకృతి అందాలు ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనం ప్రవేశ ద్వారం నుంచి మహాస్థూపం వరకు విద్యుత్ వెలుగులతో చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. తపోవనం, స్థూపవనం, జాతక మార్పు తదితర ప్రదేశాలను అన్నింటిని పరిశుభ్రం చేశారు. విదేశీయులు కాసేపు సేదతీరేలా విజయవిహార్ను ఆధునీకరిస్తున్నారు. ఏర్పాట్లను చూసేందుకు వారానికి ఓమారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం ఐజీ, జిల్లా ఎస్పీతో కలిసి సాగర్‌ను సందర్శించారు. -
మహాత్మా శ్రీ బసవేశ్వరకు నివాళి
భువనగిరిటౌన్ : సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంపై అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వర అని, జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ వారిచ్చి న శాంతి సందేశం పాటించినట్లయితే ఉద్రిక్త వాతావరణం ఉండదన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ సమాజ చైతన్యానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల్లేవుసాక్షి,యాదాద్రి : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని, కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కలెక్టర్లు, పౌరసరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 366 కేంద్రాల ద్వారా 76,561 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 176.82 కోట్లకు గాను రూ.85.66 లక్షలు చెల్లించినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లై జిల్లా అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా సహకార అధికారి మురళీ, వ్యవసాయ శాఖ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతను వీడని అకాల వర్షం
అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి కోటమర్తి, చిర్రగూడూరు, అడ్డగూడూరు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కాంటా వేసిన వడ్లబస్తాలు తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులకు అడ్డగూడూరు మండల కేంద్రంలో రామనర్సయ్య, మొత్కు బ్రహ్మయ్యకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. నేటి నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఈడీ, ఎంఈడీ కాలేజీలకు గురువారం నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు. -
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే ‘భూ భారతి’
యాదగిరిగుట్ట : రెవెన్యూ వ్యవస్థను బలోపేతానికి చేయడమే భూ భారతి పోర్టల్ ఉద్దేశమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భూ భారతి చట్టంపై యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి ఆధార్‌లాగా ప్రతి రైతు భూమికి ప్రభుత్వం భూధార్ కార్డు జారీ చేస్తుందన్నారు. భూ రికార్డుల్లో మార్చి ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకు ఉంటుందన్నారు. ధరణి వల్ల భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ భూ భారతి చట్టంతో సులభంగా పరిష్కారం అవుతాయన్నారు. అంతకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, భూభారతి చట్టం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇంచార్జ్ తహసీల్ధార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ నవీన్‌కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ అయిలయ్య -
టెన్త్‌లో 7 వ స్థానం
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025సాక్షి,యాదాద్రి : పదో తరగతి పరీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించింది. 97.80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. గత ఏడాది 26 స్థానంలో నిలవగా.. ఈసారి 19 ర్యాకులు మెరుగుపడింది. జిల్లా ఆవిర్భావం తరువాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత కావడం గమనార్హం. ఏప్రిల్ 3నుంచి 24వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 8,631 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8,432 మంది (97.80శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.బాలురు 4,215 మందికి 4,111(97.5శాతం), బాలికలు 4,407 మందికి 4,321 (98శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. సత్తాచాటిన ప్రభుత్వ విద్యార్థులు జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 266 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 159 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో ప్రైవేట్ 54 పాఠశాలలు ఉన్నాయి. 81 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాయి. ఇంకా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు 5, నాలుగు బీసీ గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా ఒకే ఒక విద్యార్థి ఉన్న సీఎస్ఐ గుండ్లగూడెం విద్యార్థి పాసయ్యాడు. వలిగొండ(బీబీనగర్)లోని జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థినులు సాయి మేఘన 582, సాత్విక 578 మార్కులు సాధించారు. పక్కా ప్రణాళికతో.. ఉత్తమ ఫలితం రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ టెన్‌లో నిలువడం వెనుక కలెక్టర్, విద్యాశాఖ అధికారుల కృషి ఎంతగానో ఉంది. గత ఏడాది జిల్లా ర్యాంకు రాష్ట్రస్థాయిలో 25 స్థానానికి పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అటువంటి పరి స్థితి పునరావృతం కాకుండా కలెక్టర్ హనుమంతరావు చొరవతో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేసింది. కలెక్టర్‌తో పాటు డీఈఓ సత్యనారాయణ, విద్యాశాఖతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ప్రత్యేక తరగతులను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులతో ప్రతి వారం జూమ్ మీటింగులు నిర్వహించి అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కలెక్టర్ సొంత ఆలోచనతో విద్యార్థులకు మార్నింగ్ వేకప్ కాల్ చేయడం, విద్యార్థి ఇంటి తలుపుతట్టి కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు అధికారులు, ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకున్నారు.కౌన్సెలింగ్ ఇస్తూ సబ్జెక్టుల వారీగా శ్రద్ధ తీసుకున్నారు.100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పరీక్షలకు సన్నద్ధం చేశారు. జ్యోతిబా పూలే రెసిడెన్సియల్ స్కూల్, వలిగొండఈఓగా బాధ్యతల స్వీకరణ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. - IIలోన్యూస్రీల్ఫలితాల్లో మెరిసిన యాదాద్రి జిల్లా.. 97.80 శాతం ఉత్తీర్ణత ఫ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రస్థాయిలో 19 స్థానాలు మెరుగు ఫ 159 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ఫ వలిగొండ జ్యోతి బా పూలే గురుకుల విద్యార్థినులకు అత్యధిక మార్కులు ఫ ఫలించిన కలెక్టర్, విద్యాశాఖ అధికారుల కృషి ఎక్కువ మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు : కలెక్టర్పరీక్షల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను బుధవారం తన చాంబర్లో ఇంచార్జి డీఈఓ, అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఇంచార్జ్ డీఈఓ ప్రశాంత్‌రెడ్డిని కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా త్వరలో సన్మానం చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి (రెవె న్యూ), భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఆర్డీఓ విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.జగన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతంపాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం వందశాతం ప్రభుత్వ స్కూళ్లు 231 209 90.5 - జెడ్పీహెచ్ఎస్ 3,637 3,515 96.6 81 టీజీఎం 585 574 98.1 03 కేజీబీవీ 462 445 96.3 05 టీఎస్‌ఆర్‌ఈఐఎస్ 235 235 100 03 ఎస్టీ ఆశ్రమ 16 16 100 01 ఎంజేపీటీబీసీ 271 271 100 04టీఎంఆర్ఈఐఎస్ 114 114 100 03టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 523 521 99.6 05 ఎయిడెడ్ 01 01 -100 01 ప్రైవేట్ స్కూళ్లు 2,556 2,531 99 54 జిల్లా ఆవిర్భావం తరువాత ఫలితాలు సంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం 2016–17 80.95 25 2017–18 82.98 19 2018–19 95.57 162019–20 100 కోవిడ్ 2020–21 100 కోవిడ్ 2021–22 93.61 13 2022–23 80.97 23 2023–24 90.44 252024–25 97.80 07 -
భరత్‌చంద్రచారి.. కంగ్రాట్స్
సంస్థాన్ నారాయణపురం : ‘భరత్‌చంద్రచారి కంగ్రాట్స్.. నేను జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్న.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. మొదటగా నీ ఫలితాలే చూశా.. మధ్యలో చదువు అపినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించావు.. 73 శాతం మార్కులు వచ్చాయి.. సెకండ్ లాంగ్వేజ్‌లో తక్కువగా వచ్చినా గణితంలో 86 మార్కులు సాధించావు.. ఒకటిరెండు రోజుల్లో మీ ఇంటికి వస్తా’ అని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేశ్యతండాలో నివాసం ఉంటున్న దేవరకొండ భరత్ చంద్రచారికి బుధవారం కలెక్టర్ కాల్ చేసి అభినందించారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు. పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చని, అది వద్దనుకుంటే ఐటీఐ చేయమని సలహా ఇచ్చారు. బాసర్ ట్రిపుల్ ఐటీలోనూ దరఖాస్తు చేయాలన్నారు. అనంతరం అతని తల్లి విజయలక్ష్మితో కలెక్టర్ మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్. మీ ప్రోత్సాహం వల్లే..కలెక్టర్ మాటలకు విద్యార్థి భరత్ చంద్రచారి ఆనందం వ్యక్తం చేశారు. మీ ప్రోత్సాహంతో చదవగలిగా సర్.. అని సమాధానం ఇచ్చారు. విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమానికి భరత్ చంద్రచారి ఇంటినుంచే శ్రీకారం టెన్త్‌లో 100శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని దేశ్యాతండాలో భరత్ చంద్రచారి ఇంటి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.ఫ దేశ్యతండాలో దత్తత తీసుకున్న విద్యార్థికి కలెక్టర్ ఫోన్ కాల్ ఫ పదో తరగతిలో మంచి మార్కులు సాధించావంటూ కితాబు -
వేసవి ఆటలకు వేళాయే..
క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలివే.. వాలీబాల్: వలిగొండ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (పి.సాయికుమార్), మల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (వినోద్‌కుమార్), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (సుక్క గిరిబాబు), శారాజీపేట జెడ్పీహెచ్ఎస్ శిక్షకుడు (మధుసూదన్). ఖోఖో: వలిగొండ (మత్య్సగిరి), మర్యాల (కె.గోపాల్), అనాజీపురం జెడ్పీహెచ్ఎస్, (ఆంజనేయులు). అథ్లెటిక్స్: మర్యాల, శిక్షకుడు (సునీల్) తైక్వాండో: జూలూరు జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (కృష్ణ), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (భరత్‌కుమార్). భువనగిరి: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికి తీసేందుకుగాను ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి 10 మందిని ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రూ.50వేల నిధులు క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ. 50వేలు రానున్నాయి. ఇందులో క్రీడా సామగ్రి కొనుగోలు, ప్రథమ చికిత్సకు రూ.10వేలు, ఒక్కో శిక్షకుడికి రూ. 4వేల చొప్పున 10 మందికి రూ. 40వేలు రానున్నాయి. శిబిరాల నిర్వహణకు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. యువజన క్రీడల సర్వీసుల అధికారి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. వీళ్లు అర్హులు: శిబిరాల్లో 14 ఏళ్ల లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ శిబిరాల్లో నాలుగు రకాల క్రీడలు ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఇందులో ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఉన్నాయి. ఆన్లైన్లో నమోదు: శిబిరాలకు వచ్చే విద్యార్థుల వివరాలు గతంలో శిక్షకులు నమోదు చేసుకునే వారు. ఇందుకోసం ప్రత్యేకంగా హాజరు రిజిస్టర్ నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి క్రీడాకారుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. నేటి నుంచి విద్యార్థులకు క్రీడా శిక్షణ ఫ జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు ఏర్పాటు ఫ 14ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం -
గుట్ట ఈఓగా వెంకట్రావ్ బాధ్యతల స్వీకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్ (ఐఏఎస్) బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా వెంకట్రావ్‌ను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా బాధ్యతలు అప్పగించింది. బుధవారం సాయంత్రం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఈఓ చాంబర్లో బాధ్యతలు స్కీరించారు. ఆలయ రికార్డులను, పత్రాలను బదిలీ అయిన భాస్కర్‌రావు నూతన ఈఓకు అప్పగించారు. నూతన ఈఓ, బదిలీపై వెళ్తున్న భాస్కర్‌రావును అర్చకులు, ఆలయ ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నూతన ఈఓ క్యూలైన్లో నిల్చున్న భక్తులను పలకరించారు. దర్శనానికి ఎక్కడి నుంచి వచ్చారు, క్యూలైన్లలో ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ పనులు, నూతన నిర్మాణాలు, పూజలకు సంబంధించిన అంశాలను అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పాత ఈఓ భాస్కర్‌రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా భాస్కర్‌రావుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి ఘన సన్మానంనల్లగొండ: డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డిని డీఈఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఈఓ భిక్షపతి సన్మాన పత్రం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ిపీఏగానూ సేవలు అందించిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని డీఈఓ ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఏడీ రమాచారి, ఏసీజీఈ యూసుఫ్ షరీఫ్, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్తెమ్మ, డీసీసీబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, యేసు ఆదినారాయణ, సూపరింటెండెంట్ మోహన్, మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాటేపల్లి ప్రధాన రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. నాలుగు గంటల పాటు మోత్కూరు–రాయిగిరి రోడ్డును దిగ్భందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. బాధిత కుటుంబాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వేర్వేరుగా వచ్చి పరామర్శించారు. తగిన న్యాయం చేయటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంపెనీలో పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. మృతులకు రూ.కోటి నష్టపరిహారం.. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యంతో భువనగిరిలోని ఓ హోటల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్, పలువురు నాయకులు చర్చలు జరిపారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50లక్షలు, మిగతా రూ.50లక్షలు తర్వాత చెల్లిస్తామని ఒప్పుకున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద రూ.5లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని, తిరిగి వారు పనిలో చేరేవరకు పూర్తి జీతం, అంగవైక్యం సంభవిస్తే తగిన న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో ఆందోళన విరమించారు. రెండు మృతదేహాల వెలికితీత.. రియాక్టర్ పేలుడు ధాటికి మాంసం ముద్దలుగా మారి శిథిలాల కింద చిక్కుకున్న మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నోజి దేవిచరణ్, కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్ మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పోలీసులు వెలికితీసి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సందీప్ తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు. న్యాయం చేయాలని బాధితుల కుటుంబ సభ్యుల ఆందోళన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామని యాజమాన్యం హామీ క్షతగాత్రులకు రూ.5లక్షల ఆర్థికసాయంనరేష్ అంత్యక్రియలు పూర్తిఆత్మకూరు(ఎం): ఈ ఘటనలో మృతిచెందిన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) అంత్యక్రియలను మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నరేష్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
నల్లగొండ: రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పరిశీలకుడు వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో, ఇతర పదవుల్లోనూ అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● 14 బైక్‌లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్నల్లగొండ: బైక్‌లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలమాల ఎర్రబ్బాయి అలియాస్ లూథర్, అదే గ్రామానికి చెందిన గంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపహాడ్ గ్రామానికి చెందిన వట్టిపల్లి శ్రీకాంత్ ముఠాగా ఏర్పడి బైక్‌లు చోరీ చేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. నలమాద ఎర్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, దామరచర్ల, నార్కట్‌పల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు ఏపీలోని మార్టూరు, పొన్నూరులో ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, వైన్స్‌లు, రాత్రివేళ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేసి వాటిని గంజి అంకమరావు, మట్టిపల్లి శ్రీకాంత్‌తో కలిసి తక్కువ ధరకు విక్రయించేవాడు. బుధవారం ఉదయం వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రబ్బాయి, అంకమరావు చోరీ చేసిన బైక్‌లను అమ్మడానికి దామరచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా.. అనుమానం వచ్చి ఎస్ఐ వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మట్టిపల్లి శ్రీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, ఏడు పల్సర్ బైక్‌లు, ఒక షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నిందితులపై వాడపల్లి పోలీస్ స్టేషన్లో 3, నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషనల్లో ఒక్కోటి చొప్పున, నార్కట్‌పల్లి పీఎస్‌లో 2, ఇబ్రహీంపట్నం పీఎస్‌లో 1, ఏపీలోని మార్టూర్ పీఎస్‌లో 2, పొన్నూరు పీఎస్‌లో 1, రాజమండ్రిలో 1 కేసు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. మొత్తం 22 బైక్‌లు దొంగిలించినట్లుగా నిందితులు అంగీకరించారని, మిగతా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, సీసీఎస్ సీఐ డానియేల్, వాడపల్లి ఎస్ఐ ఎ. శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్, సీసీఎస్ సిబ్బంది విష్ణువర్ధనగిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్‌రెడ్డిని ఎస్పీ అభినందించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లు -
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్
నల్లగొండ, గుర్రంపోడు: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.442 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు సైతం ఇస్తూ బుధవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ల లైనింగ్‌కు 113 కిలోమీటర్ల మేర కాల్వ సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. ఇటీవలే అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే నేరుగా కృష్ణాజలాలు అందే 23వ కిలోమీటర్ కామన్ పాయింట్ నుంచి ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్ పనులు మొదలవుతాయి. బిడ్లుగా విభజించి త్వరలో టెండర్లు పిలువనున్నారు. కాల్వకు నీటి విడుదల జరగని జూలైలోగా కాల్వ సీసీ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు సీసీ లైనింగ్ .. 1984లో తవ్విన ప్రధాన కాల్వకు దశాబ్దాలు గడిచినా కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో కాల్వగట్టు శిథిలమై నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది. 3వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ప్రధాన కాల్వలో 1,200 క్యూసెక్కుల నీటి ప్రవాహ కొనసాగుతుండగా మధ్యలోనే లీకేజీలతో చివరకు నీరు చేరే సరికి సగానికి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే లైనింగ్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు లైనింగ్ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లైనింగ్ పూర్తయితే 3వేల క్యూసెక్కుల నీటితో 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం పానగల్ రిజర్వాయర్‌ను నిండడానికి పది, పదిహేను రోజులే పట్టనుంది. ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ వల్ల సుమారు 2.20లక్షల ఎకరాల్లోని ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు కూడా సాగు నీరందుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ పాలనా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను సీఎం అనుముల రేవంత్‌రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ.442 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు ఉత్తర్వులు జారీ చేసిన నీటిపారుదల శాఖ త్వరలోనే టెండర్లకు ఆహ్వానం సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి -
ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు తప్పదు
గట్టుప్పల్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలబించే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులు, భూ స్వాములకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతు న్నాయన్నారు. కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఎర్రజెండా అలుపులేకుండా పోరాడుతోందన్నారు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకూ ఎర్రజెండాను అంతం చేయడం ఎవ్వరి తరం కాదన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడతోందని విమర్శించారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు కార్మిక వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు కలిసి నివాళులు అర్పించారు. జాన్‌వెస్లీ రాక సందర్భంగా గట్టుప్పల్‌లో నిర్వహించిన ర్యాలీలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఆ పార్టీ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు కట్ట నర్సింహ, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, బండ శ్రీశైలం, చాపల మారయ్య, శంకర్, నాంపల్లి చంద్రమౌళి, రవీందర్‌రెడ్డి, కర్నాటి సుధాకర్, పెద్దులు, దోనూరి నర్సిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలిసంస్థాన్ నారాయణపురం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే శాంతియుతంగా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కర్రి గుట్టల్లో ఆదివాసీలను చుట్టుముట్టి చంపుతున్నారని, కర్రిగుట్టల్లో సహజ ఖనిజాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నివేదికను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
‘పది’లో జయ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 587 మార్కులు, 15 మంది విద్యార్థులు 580పైగా మార్కులు, 52 మంది విద్యార్థులు 570పైగా మార్కులు, 106 మంది విద్యార్థులు 560 పైగా, 154 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు. వి. హాసిని, కె. శ్రేష్ట, ఎం. అనన్య, ఎం. శ్రీదేవి 587 మార్కులు, కె. శరణ్య 586 మార్కులు, లోకేష్ 585, సాయి చర్విత, శ్రీజ 584 మార్కులు, చాణక్య, హర్షవర్దని 583 మార్కులు, రేవంత్‌రెడ్డి, మన్విత, ప్రగతి, వేద 580 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు అభినందించారు. -
సర్వేల్ గురుకులంలో 100శాతం ఉత్తీర్ణత
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 85మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 85మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సండ్ర స్వాతిక్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలువగా, 540పైగా మార్కులు సాధించిన వారు 15మంది విద్యార్థులున్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ అభినందించారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్యిక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికిశయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
జీవితంపై విరక్తితో బిల్డర్ ఆత్మహత్య
నల్లగొండ: వ్యాపారంలో నష్టాలు రావడంతో జీవితంపై విరక్తితో బిల్డర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. అమ్మనబోలు మండలం బెండలపహాడ్ గ్రామానికి చెందిన జిల్లా యాదగిరి(45) నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని రాక్హిల్స్ కాలనీలో నివాసముంటూ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో యాదగిరి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో అతడు బుధవారం రాక్హిల్స్ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు గాయాలుభువనగిరిటౌన్: ట్రాఫిక్ మళ్లిస్తున్న కానిస్టేబుల్ కాలు పైనుంచి గూడ్స్ వాహనం వెళ్లడంతో గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. భువనగిరి పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ వాహనాలు వెళ్తుండడంతో భువనగిరి పట్టణానికి చెందిన కానిస్టేబుల్ మురళి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న క్రమంలో అతడి కాలు పైనుంచి గూడ్స్ వాహనం వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ మురళి కిందపడిపోవడంతో స్థానికులు అతడిని పైకి లేపి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాహనంలో మురళిని ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుతో రెండు ఎద్దులు, గేదె మృతిడిండి: డిండి మండల కేంద్రానికి చెందిన బద్దెల బచ్చలు తన వ్యవసాయ పొలం వద్ద గేదెను కట్టేయగా.. బుధవారం కురిసిన వర్షానికి పిడుగుపడి గేదె మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జబ్బు పెద్దయ్య వ్యవసాయ పొలంలో పిడుగు పడడంతో సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే రెండు ఎద్దులు మృతిచెందాయి. కుక్కల దాడిలో గొర్రె పిల్లలు..నడిగూడెం: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతిచెందాయి. ఈ ఘటన బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఒట్టె సతీష్ తన గొర్రెలను మేత కోసం శివారు ప్రాంతానికి తోలుకెళ్లాడు. ఈ క్రమంలో గొర్రె పిల్లలను ఇంటి వద్దే ఉంచగా.. వాటిపై కుక్కలు దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రె పిల్లల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి హల్చల్హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ రాక ముందే గుడిమల్కాపురం గ్రామానికి చెందిన రైతు దొంగరి నాగరాజు వచ్చి తమకు దొండపాడు శివారులోని 187, 200 సర్వే నంబర్లలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కావడంలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపాడు. పోలీసులు, స్థ్ధానికులు అతడిని సముదాయించారు. అనంతరం సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ అన్నారు. -
యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషానిచ్చిందన్నారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రతిఒక్కరికి అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ట్రావెల్స్ బస్సు ఢీకొని గేదెలు మృతి
నేరేడుచర్ల: ట్రావెల్స్ బస్సు ఢీకొని మూడు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన మంగళవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం నుంచి తులసీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. మార్గమధ్యలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వీవీఆర్ స్కూల్ వద్దకు రాగానే బస్సు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెం వాసి మన్నెం వెంకన్నకు చెందిన మూడు పాడి గేదెలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వడదెబ్బతో కూలీ మృతిఆత్మకూర్.ఎస్(సూర్యాపేట): ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీ తలారి నరసయ్య(59) మృతిచెందాడు. సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన నరసయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే రాత్రి మృతిచెందాడు. -
సేంద్రియ ఎరువులే పంటకు బలం
ఉపయోగాలు ఇవే.. సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు కూడా ఇంకుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరిస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువకాలం పట్టి ఉంచుకొని పంటను బెట్టకు గురికాకుండా చేస్తుంది. అలాగే నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.నడిగూడెం : మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులను పంటలకు తక్కువ మంది రైతులు వినియోగిస్తుంటారు. అయితే సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటలకు చాలా ఉపయోగం. చాలా వరకు పంటలకు పురుగులు, తెగుళ్లు తగ్గడంతోపాటు, పురుగు మందు ఖర్చూ తగ్గుతుందని పలు పరిశోధనల్లోనూ, కొందరు రైతులు తమస్వీయ పర్యవేక్షణలో తెలుసుకున్నారు. అందుకే చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ సాగుపై నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్ సూచనలు. పశువుల ఎరువు పశువుల ఎరువు రైతులు అనాదిగా వినియోగిస్తున్న ఎరువే. అయితే రాను రాను వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశు సంతతి తగ్గి పశువుల ఎరువు అందుబాటులో లేకుండా పోయింది. పంటలకు ఉపయోగించే ఎరువుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రాథమికంగా పశువుల ఎరువు ఏ పంట సాగులోనైనా వేసి తీరాల్సిందే. పంటలకు పోషకాలను అందించడంతో పాటు పొలంలో కురిసిన వాన నీటిని ఒడిసి పట్టి పంటలకు అందించడంలో పశువుల పేడ కీలక పాత్ర పోషిస్తుంది. మిగతా ఎరువులను పంటకు అందించాలన్నా ఈ ఎరువు తరువాత ఏదైనా పొలంలో ఒక వరుస మట్టి, ఆ తరువాత పశువుల ఎరువు మరో పొరమట్టి, పశువుల ఎరువు ఇంకో పొర ఆకులు, అలములు, పశువుల మేత వేయగా తొక్కి పడేసిన చెత్త చెదారాలను తొలకరి వర్షాలు కురవగానే వెంటనే ఆ కుప్పలోని ఎరువు మట్టిని చిన్నచిన్న కుప్పలుగా పోసి పొలమంతా చల్లితే మంచి ఫలితం ఉంటుంది. కంపోస్టు ఎరువు గ్రామాల్లో లభ్యమయ్యే చెత్త, రాలిన ఆకులు, ఇతర కలుపు మొక్కలు కుళ్లి కూరగాయలు, వేరుశనగ కాయల పొట్టును కలిపి పశువుల పేడ, మూత్రంతో కుప్పగా వేసి, కుళ్లింపజేస్తే కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువు బాగా కుళ్లిపోతుంది. దీనిని కూరగాయల పంటలకు, ఇతర పంటలకు వేస్తే మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు, చీడ పీడలు లేకుండా ఆశించిన దిగుబడి వస్తుంది. కోళ్ల ఎరువుకోళ్ల ఫారాల్లో కోళ్ల కింద వేసిన పొట్టు, మల మూత్రాలతో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దాదాపు 40 కోళ్ల నుంచి ఏడాదికి టన్ను ఎరువు వస్తుంది. ఈ కోళ్ల ఎరువులో 3 శాతం నత్రజని, 2 శాతం భాస్వరం, 2 శాతం పొటాష్ పోషకాలు ఉంటాయి. తేమ తగ్గేకొద్ది పోషక శాతం పెరుగుతుంది. పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువుతో అధిక దిగుబడులు -
బ్యాగేజ్ స్కానర్ ప్రారంభం
యాదగిరిగుట్ట ఆలయంలోని ధర్మ దర్శనం క్యూలైన్లో ఎక్స్‌రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ స్కానర్‌ను ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, బీటీ టీం ఆర్ఎస్ఐ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ స్కానర్ ద్వారా భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను స్కాన్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు స్కానర్లను సైతం త్వరలోనే వీఐపీ ప్రొటోకాల్ కార్యాలయం వద్ద లిఫ్టులో, ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు
సంస్థాన్ నారాయణపురం: రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మించి శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ల ద్వారా ఆ ప్రాజెక్టులను నింపుతామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ప్రకటించారు. యాద్రాది భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రాష్ట్ర రాజధానికి చేరువలో రాచకొండ ప్రాంతం విస్తరించి ఉంది. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో ఒకటి, చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో మరొక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధవుతున్నాయి. ఈ రిజర్వాయర్ల నిర్మాణంపై నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విన్నవించారు. నీళ్లు ఉంటేనే రాచకొండ అభివృద్ధి.. హైదరాబాద్‌కు అతి చేరువులో యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం రాచకొండ. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం, ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్మార్ట్ సిటీ, పవన విద్యుత్ ఉత్పత్తి లాంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక ప్రతిపాదనలు మూలనపడ్డాయి. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు.. ఓ వైపు ఫ్లోరైడ్‌తో, మరోవైపు సాగుజలాలు లేక బీడు భూములుగా మారిన చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా, కరువు పరిస్థితులు భవిష్యత్ అవసరాలకు రిజర్వాయర్లు ఎంతో దోహదం చేస్తాయి. రాచకొండలో ప్రకృతి అందాలతో ఉన్నప్పటికి వేసవి కాలం వస్తే మోడుబారిన చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందాడానికి అవకాశం ఉంది. రాచకొండ అటవీ ప్రాంతంలోని మూగ జీవాల దాహార్తి కూడా తీరుతుంది. రిజర్వాయర్ల నిర్మాణంతో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రాంత స్వరూపం, ఇక్కడి ప్రజల జీవనశైలి కూడా మారిపోనుంది. ఫ చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో ఒకటి, నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో మరొకటి నిర్మించాలని యోచన ఫ శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌ల ద్వారా ఈ రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వం ప్రతిపాదన ఫ ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఫ పదేళ్ల క్రితమే రాచకొండలో 4 రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే చేసిన అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించి నీళ్లు ఇవ్వాలి గత కొన్నేళ్లుగా రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మిస్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదు. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కష్టాలు తీర్చాలి. వర్షాలు వస్తేనే పంట దిగుబడి లేకపోతే పంటలు ఎండి నష్టపోవడం మాకు పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఆచరణలో సాధ్యం చేయాలి. – నాగులపల్లి సత్తయ్య, రైతు, ఆరెగూడెం, సంస్థాన్ నారాయణపురం మండలం 10 సంవత్సరాల కిందటే సర్వే..సాగు నీటి అవసరాలు, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాచకొండ ప్రాంతంలో 4 రిజర్వాయర్లు నిర్మించాలని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లు నిర్మించాలని హైదారాబాద్ జలమండలి అధికారులు, నిపుణులు మూడుసార్లు రాచకొండ ప్రాంతంలో పర్యటించారు. 40టీఎంసీల నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో 2, చౌటుప్పల్ మండలం డి.నాగారం చెరువు వెనుక భాగంలో ఒకటి, మల్కాపురం శివారులో మరొకటి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాథమికంగా 5వేల ఎకరాల భూమి అవసరమని అంచనాలు రూపొందించారు. రాచకొండ గుట్టల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతలను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. నివేదక ఆధారంగా రూ.1,960కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. నివేదిక మూలనపడింది. -
బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి దుర్మరణం
వేములపల్లి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన మందడి వేణుగోపాల్‌రెడ్డి(47) మంగళవారం ఉదయం బైక్‌పై నల్లగొండ సమీపంలోని మర్రిగూడలో ఉంటున్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. వేములపల్లి మండల కేంద్రంలోకి రాగానే స్థానిక జెడ్పీ హైస్కూల్ పక్క వీధి నుంచి ఒక్కసారిగా బ్లాక్ స్కార్పియో కారు వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మందడి ప్రణీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. -
ప్రయాణికులను కుటుంబ సభ్యులుగా భావించాలి
యాదగిరిగుట్ట: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిని సిబ్బంది తమ కుటుంబ సభ్యులుగా భావించి గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో మంగళవారం నల్లగొండ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్ర పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీజియన్‌లోని 7 డిపోల్లో ఈ త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు గ్యారేజీ ఉద్యోగులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి డ్రైవర్ బస్సులు నడపాలన్నారు. కండక్టర్లు ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలన్నారు. గ్యారేజీలో మెకానిక్‌లు బస్సులను మంచి కండీషన్లో ఉంచేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆపరేషన్ సుచరిత, డిప్యూటీ రీజినయల్ మేనేజర్ మెకానికల్ ఎస్. భీమ్‌రెడ్డి, ఆయా డిపోల మేనేజర్లు మురళీకృష్ణ, శ్రీనాథ్, రామ్మోహన్‌రెడ్డి, ఎస్. లక్ష్మీనారాయణ, బి. శ్రీనివాస్, యాదగిరిగుట్ట డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎం. ప్రవీణ్, రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానిక్ ఆర్. హనుమాన్ నాయక్, ఎల్. జయప్రకాష్ తదితరులున్నారు. ఫ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి ఫ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, గ్యారేజీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత -
వరంగల్ భద్రకాళికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి: వరంగల్‌లోని శ్రీభద్రకాళి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 2న నిర్వహించే కల్యాణోత్సవానికి పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రుద్ర శ్రీశైలం, రుద్ర చెన్నకేశవులు, రుద్ర పాండురంగశాస్త్రి కుటుంబ సభ్యులు మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టువస్త్రాలను తయారు చేశారు. 15 రోజుల పాటు శ్రమించి అమ్మవారికి చిలుకపచ్చ, సాఫ్రాన్ రంగు కల్గిన రెండు ఇక్కత్ పట్టుచీరలతో పాటు స్వామివారికి పట్టు పంచెలను తయారుచేశారు. కల్యాణం రోజు ప్రదర్శనగా వెళ్లి పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలను ఈఓ కె. శేషుభారతికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు రుద్ర శ్రీశైలం మాట్లాడుతూ.. తాము గత ఐదు సంవత్సరాలుగా భద్రకాళి అమ్మవారికి, భద్రేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన దేవస్థాన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖబరస్థాన్‌లో బయటపడ్డ పురాతన శాసనాలు
కోదాడరూరల్: కోదాడలోని రామాలయం పక్కన గల ఖబరస్థాన్‌లో మంగళవారం ఓ వ్యక్తిని ఖననం చేసేందుకు ముస్లింలు గొయ్యి తవ్వుతుండగా పురాతన శాసనాలు బయటపడ్డాయి. వక్ఫ్‌బోర్డు సభ్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని శాసనాలను స్వాధీనం చేసుకొని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమిళంతో పాటు పలు భాషల్లో ఉన్న రాగి పలకలు బయటపడినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తహసీల్దార్ వాజిద్ అలీ, పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ రంజిత్‌రెడ్డి, ఆర్ఐ రాజేష్ ఉన్నారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం కొండ కింద గల శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా నగదు రూ.2,41,35,238, మిశ్రమ బంగారం 143 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 250 గ్రాములు వచ్చిందని ఈఓ వెల్లడించారు. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాలకు సంబంధించిన కరెన్సీని సైతం భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. ఈ హుండీ ఆదాయం 34రోజులదని ఈఓ తెలిపారు. -
కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలి
వలిగొండ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హనుమంత రావు సూచించారు. మంగళవారం వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులకు తాగు నీరు, టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తొందరగా తూకాలు చేసి వెంటనే ఎగుమతులు చేయాలని అన్నారు. ఆదర్శ రైతు వెంకటేష్ సహకారంతో అందజేసిన మజ్జిగను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు రానీయొద్దు రామన్నపేట: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది రానీయొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రామన్నపేట మండలంలోని బోగారం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం రాశులు, తేమను శాతాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు, ఎగుమతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయనవెంట వ్యవసాయ విస్తరణాధికారి కీర్తన ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంత రావు -
మళ్లీ తెరపైకి ‘రాచకొండ’
రాచకొండ ప్రాంతంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. - IIలోహైదరాబాద్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు భువనగిరిటౌన్ : మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుళ్లలో గాయపడిన కార్మికులను మొదటగా భువనగిరికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న ముగ్గురిని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని వేర్వేరు అంబులెన్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో రాజబోయిన శ్రీకాంత్ (చాడ), బుగ్గ లింగస్వామి (పులిగిల్ల), నరేష్ (ఆత్మకూర్), బర్ల శ్రీకాంత్ (ఆలేరు), నల్ల మహేష్ (అనాజపురం)తో పాటు మరో కార్మికుడు ఉన్నాడు. భువనగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మహేందర్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. -
రూ.50కోట్లు వాపస్
సాక్షి, యాదాద్రి: నృసింహసాగర్ (బస్వాపురం) రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు పునరావాసం, పరిహారం అందడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 16 ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్‌లో భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపూర్‌తోపాటు మరో రెండు తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. బీఎన్ తిమ్మాపూర్‌కు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత డిసెంబర్లో ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఇవి నిర్వాసితులకు సరిపోకపోవడంతో పూర్తి నిధులు వచ్చాక పంపిణీ చేద్దామని అధికారులు వేచిచూశారు. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగియడంతో వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి. నత్తనడకన లేఅవుట్ అభివృద్ధి పనులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా భువనగిరి హుస్సేనాబాద్‌లో (బీఎన్ తిమ్మాపూర్) 28 ఎకరాల లేఅవుట్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.80 కోట్లు మంజూరు చేసినా పనులు కావడంలేదు. 1047 మందికి ప్లాట్లు పంపిణీ చేశారు. నూతన లేఅవుట్లో మౌలిక వసతుల కోసం తొలుత రూ.35 కోట్లు, రెండవ విడతలో రూ.45 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, పార్కులు, మంచినీటి సరఫరా, రోడ్లు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. లేఅవుట్లో ట్యాంకులు నిర్మించి, అంతర్గత పైప్‌లైన్ వేసి, బోర్లు వేసి ఏడాదిన్నర కావస్తున్నా నీరివ్వలేకపోతున్నారు. మురుగు కాల్వల నిర్మాణం, పార్కులు, సీసీరోడ్లు, బీటీ రోడ్లు, ప్రభుత్వం భవనాల నిర్మాణం ప్రారంభం కాలేదు. బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు ఇక్కడ ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.7.61 లక్షల నగదును ఇచ్చారు. కొందరు సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కోర్టుకు అఫిడవిట్ సమర్పించినా.. బీఎన్ తిమ్మాపూర్, జంగంపల్లి, బస్వాపూర్, వడపర్తి, లప్పానాయక్‌తండా, రుస్తాపూర్ భూనిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద బీఎన్ తిమ్మాపూర్, లప్పానాయక్ తండా, చోక్లాతండాల్లో ముంపు బాధితులకు మౌలిక సదుపాయాలకుగాను డబ్బులు ఇస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. మూడు విడతల్లో రూ.598.67 కోట్ల పరిహారం అందిస్తామని అప్పట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ఆలస్యం చేస్తుండడంతో హైకోర్టు రెండు సంవత్సరాల క్రితం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాసితులను ఆదుకోవాలి ముంపు గ్రామమైన తిమ్మపురం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. సుమారు రూ.400 కోట్లు ఇస్తే భూ నిర్వాసితులు, ముంపు గ్రామ బాధితులకు పరిహారం అందుతుంది. సకాలంలో నిధులు పంపిణీ చేయకపోవడంతో వచ్చిన రూ.50కోట్ల నిధులు వాపస్ పోయాయి. మొత్తం పరిహారం ఇవ్వాలి. – ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్ తిమ్మాపూర్ పరిహారం అందిస్తాం బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. పరిహారం పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్అండ్ఆర్ కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాం. త్వరలో మంచినీటి సమస్య తీరనుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పరిహారం పంపిణీ చేస్తాం. – కృష్ణారెడ్డి, ఆర్డీఓ, భువనగిరి ఫ బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు పరిహారం కింద వచ్చిన డబ్బులు వెనక్కి ఫ పంపిణీలో ఆలస్యం, ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు వాపస్ ఫ ఆర్అండ్ఆర్ లే అవుట్లో చేపట్టిన పనుల్లో జాప్యం ఫ ప్రారంభం కాని మురుగు కాల్వలు, సీసీ, బీటీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు -
ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పంచాయతీ కార్మికుల విధుల్లో సడలింపుభువనగిరిటౌన్ : ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ కార్మికులైన పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్ల విధుల్లో సడలింపు ఇచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు పనులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలో పనులు పూర్తి కాకపోతే సాయంత్రం సమయంలో చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు జరిపించారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశీలనభువనగిరి: డిప్యూటీ ఆర్ఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుచరిత మంగళవారం భువనగిరి బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో ఉన్న దుకాణాల్లో తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ను ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని డీఎంను ఆదేఽశించారు. ఆమె వెంట యాదగిరిగుట్ట డీఎం వెంకటయ్య, కంట్రోలర్ సోమరాజు, టీఐ శ్రీనివాస్, మణికంఠ ఉన్నారు. వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్‌ల వేలంభువనగిరిటౌన్ : వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్‌ల వేలం పాట నిర్వహిస్తున్నట్లు గనుల, భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు గోవిందరాజు తెలిపారు. వేలానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్లో గనులు, భూగర్భ శాఖ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమైన సందేహాలు ఉంటే 98666 33414 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. నేడు మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలుభువనగిరిటౌన్ : కలెక్టరేట్లో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10:00 గంటలకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హనుమంతరావు పాల్గొంటారని తెలిపారు. యాదగిరిగుట్ట: ఎక్స్‌ప్లోజివ్ కంపెనీల్లో కార్మికులకు భద్రత లేకుండా పోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వెరసి భారీ ప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మంగళవారం మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ.. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూర్, బొమ్మలరామారం, టంగుటూరు, మొటకొండూర్ మండలం కాటేపల్లిలో పేలుడు పదార్థాల (ఎక్స్ ప్లోజివ్స్) కంపెనీలు ఉన్నాయి. ఆయా ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమల్లో తయారు చేసిన డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు, డీఆర్డీఏ, శ్రీహరికోటతో పాటు ఆర్మీ, నావికాదళం వంటి సంస్థలతో పాటు ఇక్కడి నుంచి పేలుడు పదార్థాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. దీంతో ఆయా కంపెనీల్లో కార్మికులు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తుంటారు. కంపెనీల యాజమాన్యాలు సైతం వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులతో పాటు, జిల్లా అధికారులు, కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేయడానికి వస్తున్న అధికారులు.. పటిష్ట చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించడంలో అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ఇలా.. ఫ 2012లో పెద్దకందుకూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో సీ– 6 బ్లాక్ లో మొదటిసారిగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆలేరు ప్రాంతానికి చెందిన ఎల్లయ్య, వంగపల్లి ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఫ 2019లో జరిగిన మరో పేలుడు ఘటనలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన జయపాల్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఫ 2020లో పరిశ్రమలోని ఫ్యూరింగ్ బిల్డింగ్ లో పేలుడు ప్రమాదం సంభవించగా, అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా.. రెండు సార్లు పీఆర్డీసీ బ్లాక్ లోనే ప్రమాదాలు కావడం గమనార్హం. ఫ ఈ ఏడాది జనవరి 4న పెద్దకందుకూర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడులో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో బయట పడగా.. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివాహమై ఆరు నెలలు .. మోటకొండూర్: ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుళ్లలో కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్(30) మృతిచెందాడు. ఇతడి వివాహం గత నవంబర్‌లో జరగగా.. ఆరు నెలలు కాకుండానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. అతడి భార్య మూడు నెలల గర్భిణి. కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజీవ్స్ కంపెనీ ప్రారంభం నుంచి సందీప్ అక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. కాగా.. సందీప్ తండ్రి శ్రీనివాస్ గత మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను, కుమారుడిని కోల్పోయిన మంగమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.ఆత్మకూరు(ఎం)లో విషాదఛాయలు ఆత్మకూరు(ఎం): ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో జరిగిన పేలుళ్లలో ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మండల కేంద్రానికి చెందిన కల్వల అంజయ్య– లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు నరేష్ ఉన్నాడు. ఇతడికి వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. నరేష్ గత రెండు సంవత్సరాలుగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం పగలు డ్యూటీ కావడంతో ఉదయమే వెళ్లాడు. పేలుళ్లతో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్క కొడుకూ.. మృతిచెందడంతో.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన బుజ్జమ్మ కుమారుడు దేవిచరణ్. కొంత కాలం క్రితమే భర్తను కోల్పోవడంతో కుట్టుమిషన్ కుడుతూ కుమారుడిని ఇంటర్ వరకూ చదివించింది. అనంతరం దేవిచరణ్ కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న సమయంలో కుమారుడు మృతిచెందడంతో తల్లి బుజ్జమ్మ రోదనకు అంతులేకుండా పోయింది. భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడ మీదుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మట్టి పాత్రలను చూసి అక్కడ కొద్దిసేపు ఆగారు. అక్కడే వంట పాత్రలను కొనుగోలు చేశారు. మట్టి పాత్రల్లో ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. – భువనగిరిటౌన్ రామన్నపేట నుంచి కక్కిరేణి మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రయాణికులతో కలిసి బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. – రామన్నపేట మట్టి పాత్రలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బస్సు సర్వీస్ ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే వీరేశం న్యూస్రీల్ఫ కనీస రక్షణ చర్యలు చేపట్టని కంపెనీల యాజమాన్యాలు ఫ తనిఖీలు చేపట్టని అధికారులు ఫ గాల్లో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు ఫ తాజాగా మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు ఫ ముగ్గురు కార్మికులు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు -
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
యాదగిరిగుట్ట : యువతను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ పిలుపునిచ్చారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా రెండవ మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వారందరికి వెంటనే డబ్బులు అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ దళిత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ.. మతోన్మాదానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత నడుం బిగించవలసిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు యాదగిరిగుట్ట పట్టణంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, కొండూరు వెంకటేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభలో పలు నివేదికను జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మహమ్మద్ నయీమ్, బద్దుల శ్రీనివాస్, సుద్దాల సాయికుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, జిల్లా సమితి సభ్యుడు బబ్బురి శ్రీధర్, సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చెక్క వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఫ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ -
పార్టీ కేడర్‌ను పట్టించుకోవడం లేదు
సాక్షి,యాదాద్రి: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ కేడర్‌ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, ప్రమోద్ కుమార్, తంగెల్లపల్లి రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో కొద్దిమందికే ప్రాధాన్యత లభిస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీలో కనబడకుండా చేస్తున్నారని పార్టీ పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వడంలేదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. అయితే గ్రామ, మండల, బ్లాక్, డీసీసీ అధ్యక్ష పదవులను కొత్తవారితో భర్తీ చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌లు ధనవంతి, డాక్టర్ అనిల్‌కుమార్ ప్రకటించారు. ఎవరెవరు పోటీలో ఉంటారో ముందుకు రావాలని కోరారు. కార్యకర్తలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఫ కాంగ్రెస్ జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీ ముఖ్య కార్యకర్తల ఆవేదన -
రైతుల సంక్షేమాభివృద్ధికే భూభారతి
తుర్కపల్లి: రైతుల సంక్షేమాభివృద్ధి కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండల పరిధిలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి చట్టం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. భూవివాదాల సమస్యల పరిష్కరానికి భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికా ర్డుల్లో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. కొత్త చట్టం పై రైతులకు అవగాహన కల్పించేందుకు పది రోజులగా సదస్సులు ఏర్పాటు చేసి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ ఝన్సీలక్ష్మి బాయి, ఏసీపీ రమేష్ కుమార్, డి ప్యూటీ తహసీల్దార్ కల్పన, దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్ కుమార్‌తో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెపహాడ్ స్టేజీ నుంచి బాబునాయక్‌తండా మీదుగా పర్రెబాయితండా వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నల్లగొండ జిల్లాలోని బక్కతాయికుంట (రూ.20.22 కోట్లు), మునుగోడు (రూ.6.08కోట్లు), నర్సింగ్‌బట్ల (రూ.19.95 కోట్లు) ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్‌కు ఎదుల ద్వారా నీరందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, జిల్లా నుంచి పిలిిప్పిన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి.. వెంకట్‌రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్ అదనపు బ్లాక్, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్ సరిపోవడం లేదన్నారు. అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్‌కు తీసుకొస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే కార్యాలయాల్లో ఎక్కువ సమయం ఉంటారని, సౌ కర్యవంతంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్‌కుమార్, నీటిపారుదల సీఈ అజయ్‌కుమార్, డీఆర్ఓ అశోక్‌రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ సాగునీటి ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ రూ.1,600 కోట్లతో రోడ్ల నిర్మాణం సాగుతోంది : మంత్రి కోమటిరెడ్డి ఫ నల్లగొండ కలెక్టరేట్లో అదనపు భవన సముదాయం, లిఫ్టు పనులకు శంకుస్థాపన -
కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ రెడ్డి, పరమేష్, నవీన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్‌లు, ఆటో సీజ్ -
భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
చౌటుప్పల్ : పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రమదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ డైరెక్టర్ బి.రాజగోపాల్రావు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ వై.మోహన్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్–2025ను పురస్కరించుకొని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భద్రత అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చౌటుప్పల్పట్టణ పరిధిలోని లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమ ఉద్యోగులు సేఫ్రీ డ్రాయింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి, సేఫ్టీ పద్య పోటీల్లో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. భద్రత విషయంలో రాజీపడద్దన్నారు. భద్రత ప్రమాణాలు పాటించడం వల్ల కంపెనీ ఉత్పత్తులు పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. బహుమతులు సాధించిన దివీస్ ఉద్యోగులను వారు అభినందించారు. -
వరి కొయ్యలను కాల్చొద్దు
గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే.. ● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్‌తో పాటు 1400 కిలోల కార్బన్‌డైయాకై ్సడ్ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్ పాస్పేట్ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్‌డైయాక్సెడ్ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి. నేలలో కలియ దున్నితే అధిక లాభాలు గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్ -
కోతుల దాడిలో వృద్ధుడికి గాయాలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోదాడలో పిచ్చి కుక్క స్వైర విహారం ● 10 మందిపై దాడి ● ఓ బాలుడికి తీవ్రగాయాలు కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్‌నగర్, తిలక్‌నగర్, ఖమ్మం క్రాస్‌రోడ్ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్ విగతజీవిగా కనిపించాడు. హజరత్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
కేసీఆర్ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు
నకిరేకల్: వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, వంటల చేతన్, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
సూర్యాపేట టౌన్: బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్‌పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్‌పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గల అండర్ పాస్ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్మార్, దోగిపర్తి సంతోష్, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు. -
మఠంపల్లిలో పందెం గిత్తల జోరు
● కొనసాగుతున్న ఎద్దుల పందేలుమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్‌ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్‌రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్‌రెడ్డి, గ్రేగోల్డ్ సిమెంట్స్ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్‌రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్‌రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం
రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్ రెగ్యూలేటరీని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్ బాక్స్‌లను బిగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్‌ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. హెడ్రెగ్యూలేటర్ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్, అమర్, వర్క్ ఇన్‌స్పెపెక్టర్ రజినీకాంత్, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్‌రెడ్డి, చాడ రమేశ్‌చందర్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, రైతులు తదితరులు ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
నష్టం రూ.10 కోట్లపైనే!
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు సాక్షి, యాదాద్రి : వరుస వర్షాలు అన్నదాతను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏప్రిల్ ఒక్క నెలలోనే ఎనిమిది పర్యాయాలు కురిసిన వర్షాలకు వరి, ఉద్యాన తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. మామిడి రాలి పోయాయి. జిల్లా వ్యాప్తంగా 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,525 మంది రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు. మొత్తం రూ.10కోట్లకు పైనే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఏటా ఇవే కష్టాలు జిల్లాలో ఏటా ఇదే సమయంలో అకాల వర్షాలు కురువడం పరపాటిగా మారింది. ఈ ఏడు కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ ఒక్క నెలలోనే 3, 10,15, 18,19, 20,21,27 తేదీల్లో వర్షాలు కురిశాయి. వర్షాలకు తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, రామన్నపేట, మోటకొండూరు, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, అడ్డగూడూరు, అత్మకూర్(ఎం), గుండాల మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది. నష్టంపై ప్రాథమిక అంచనా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా నష్టాన్ని అంచనా వేశారు. అత్యధికంగా వరి 2,050 ఎకరాల్లో రూ.8.50 కోట్లు, ఆ తరువాత మామిడికి 250 ఎకరాల్లో రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగినట్లు లెక్కక ట్టారు. నష్టంపై నివేదిక రూపొందించి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించారు. ప్రాణ, ఆస్తినష్టం పిడుగు పాటుకు మూగజీవాలు మృత్యువాత పడి యజమానులు నష్టపోయారు. రాజాపేట మండలం రేణికుంటలో బండిమల్లయ్యకు చెందిన 40 మేకలు, 10 గొర్రెలు, చల్లూరులో ఎర్ర నర్సయ్యకు చెందిన పాడిగేదె, పాడి ఆవు, బీబీనగర్ మండలం పడమటి సోమారంలో రెండు పాడి అవులు మృత్యువాత పడ్డాయి. మోటకొండూరు మండల తేర్యాలకు బాలగాని రాజు 18 ఎకరాల వరి సాగు చేశాడు. ఇదులో 12 ఎకరాలు సొత భూమి కాగా, ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సుమారు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. మూడు రోజుల్లో కోతకు సిద్ధం అవుతుండగా వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి కంకులు పెద్దెత్తున నేలరాలాయి. ఉన్న పంటను కోయగా ఎకరాకు 20 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోయాడు. ఫ 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడికి నష్టం ఫ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత ట్రాక్టర్ వడ్లు రాలాయి ఏడు ఎకరాల్లో వరి వేశాను. మూడెకరాలు నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రంలో పోశాను. స్థలం లేదని మిగిలిన పొలం కోయలేదు. ఈనెల 15వ తేదీన కురిసిన వడగండ్ల వానకు కోయని పొలంలో దాదాపు ట్రాక్టర్ వడ్లు రాలిపోయాయి. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి. –ఆవుల లక్ష్మీనారాయణ, నీర్నెముల -
నిస్సహాయులుగా గీత కార్మికులు
బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరైనా చేతికిరాని చెక్కులురూ.2.77 కోట్లు రావాలి జిల్లాలో తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన, గాయపడిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషి యా రూ. 2.77 కోట్లు రా వాల్సి ఉంది. పరిహా రం మంజూరైనా బాధితుల చేతికి అందలేదు. అధికారులను సంప్రదిస్తే బడ్జెట్ లేదని చెబుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. బాధితులకు ఎక్స్‌గ్రేషియా డబ్బులు ఇవ్వనట్లయితే అందోళన కార్యక్రమాలు చేపడుతాం. –బోలగాని జయరాములు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడ్జెట్ లేకపోవడంతో ఆలస్యం గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా మంజూరైంది వాస్తవమే. బడ్జెట్ లేకపోవడంతో చెక్కులు అందచేయలేకపోయాం. జిల్లాలో 79 మంది బాధితులున్నారు. ప్రస్తుతం ముగ్గురికి రూ.5 లక్షల చొప్పున, ఇద్దరికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేస్తాం. మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ వస్తుంది. వచ్చె నెల అందరికీ చెక్కులు ఇవ్వడానికి సిద్ధం చేశాం. బడ్జెట్ వస్తేనే అందజేస్తాం. –విష్ణుమూర్తి, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆత్మకూరు(ఎం) మండలం తుర్కల రేపాకకు చెందిన మూల ఆదినారాయణగౌడ్ వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 3న కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ఏడాది క్రితం అతని భార్య శోభ అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా నిధులు మంజూరైనా చేతికి చెక్కు రాలేదు.మోదుబావిగూడేనికి చెందిన వంగాల రమేష్ 20 ఏళ్లకు పైగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. 2017లో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరి వివాహం అయింది. వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 28న కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. కొంత అప్పు తెచ్చాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బంగారు నగలు కూడా అమ్మాడు. కుటుంబం గడవడం కోసం చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరైనా చేతికి రాలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మకూరు(ఎం) : తాటిచెట్లపై నుంచి పడి మృతిచెందిన, గాయపడి వైకల్యం చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకును వెళ్లదీస్తున్న గీత కార్మికులు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలతో వృత్తిని కొనసాగించలేకపోతున్నారు. కుటుంబ పెద్ద మరణించడం, గాయపడి మంచం పట్టడంతో ఆ కుటుంబం ఉపాధి కోల్పోతుంది. ఇటువంటి సందర్భాల్లో గీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎకై ్సజ్‌శాఖ ద్వారా ఎక్స్‌గ్రేషియా అందజేస్తుంది. కానీ, జిల్లాలో రెండేళ్లుగా ఎక్స్‌గ్రేషియా అందక బాధిత కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మృతులు, గాయపడిన కార్మికులు.. జిల్లాలో 14,262 మంది గీత కార్మికులు ఉన్నారు. వృత్తిలో భాగంగా గడిచిన రెండేళ్లలో 13 మంది చనిపోయారు. 42 మంది శాశ్వత, 24 మంది తాత్కాలిక వైకల్యం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం చెందితే రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా, తాత్కాలిక అంగవైకల్యం చెంది వానికి ప్రభుత్వ రూ.10వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. రూ. 2.77 కోట్లు మంజూరైనా బాధిత కుటుంబాలకు అందలేదు. గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, సీఎం రేవంత్‌రెడ్డికి, ఉన్నతాధికారులకు విన్నపాలు అందజేసినా ఫలితం లేకపోయింది. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు తీరనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాన్‌నారాయణపురంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తన కుంటుంబసభ్యుల కొసం ధరణి చట్టం తీసుకొస్తే, పేద రైతుల భూములు పోవద్దని, భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. రాచకొండ ప్రాంతంలో ఎన్నో రకాల భూ సమస్యలు ఉన్నాయన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఆధికారులు జలగల్లా రైతులను పీక్కుతున్నారని, అవినీతికి తావుండరాదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాలను సస్యశ్యామలం చేస్తానన్నారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని 33 ముక్కలుగా విభజించాని విమర్శించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాచకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారని అరో పించారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మే 1నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీని వాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ ఎంపీపీలు గుత్త ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, బుజ్జి, ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ డైరక్టర్లు లోడే రఘు, మెగావత్ బిచ్చానాయక్, బచ్చనగోని గాలయ్య, గౌసొద్దిన్ ఖురేషి తదితరలు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి -
బాల్య వివాహాలు నేరం
భువనగిరిటౌన్ : బాల్యవివాహాలు నేరమని, పెళ్లిళ్ల సీజన్ కావడంతో నిఘా ఉంటుందని జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారి నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 30న సామూహిక వివాహాలు జరిపే సంప్రదాయం ఉంటుందని, మైనర్ల వివాహాలు చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పురోహితులు, మత పెద్దలు, టెంట్ హౌస్‌లు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు జాగ్రత్త వహించి బాల్యవివాహాలు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా శిక్షార్హులన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి భువనగిరి : ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ రైతులకు సూచించారు. సోమవారం భువనగిరిలోని హుస్నేబాద్లోని కోనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు, హమాలీలతో మాట్లాడారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు ఉండాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. శివపార్వతులకు సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. ఆశతో వచ్చి.. నిరాశగా వెనుదిరిగి భువనగిరిటౌన్ : కలెక్టర్‌లో సోమవారం జరగాల్సిన ప్రజవాణి కార్యక్రమాన్ని భూ భారతి అవగాహన సదస్సుల వల్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రజావాణి రద్దయిన విషయం చాలా మందికి తెలియక ఎప్పటి మాదిరిగానే తరలివచ్చారు. ఎండకు అవస్థలు పడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిరీక్షించారు. అధికారుల సూచన మేరకు అర్జీలను ఇన్‌వార్డులో అందజేసి వెళ్లారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్‌కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి.. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్, దొడ్డి మనోజ్ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
నీళ్లు లేవు.. నీడా లేదు!
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కొరత వాచ్‌మన్ కూడా లేడు గుండాల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాం. రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదు. ఎండలకు అవస్థలు పడుతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీటి కోసం సమీపంలోని వాటర్ప్లాంటుకు వెళ్తున్నాం. నీడ సౌకర్యం లేకపోవడంతో పక్కనే ఉన్న ఆలయానికి వెళ్లి సేద దీరుతున్నాం. నైట్ వాచ్‌మన్‌ను లేకపోవడంతో రాత్రి వేళలో ధాన్యం వద్దే కాపలా కాయాల్సి వస్తోంది. –మచ్చ మధిరమ్మ, గుండాల గన్నీ బ్యాగులు ఇవ్వలేదు పది రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చా. ఇంత వరకు కొనుగోలు చేయలేదు. గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. ఎండలు మండిపోతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. టార్పాలిన్న్లతో చిన్నపాటి గుడారం ఏర్పాటు చేశారు. కానీ, టార్పాలిన్లు ప్లాస్టిక్‌వి కావడంతో సేదదీరే పరిస్థితి లేదు. –జొన్నవాడ భాస్కర్‌రెడ్డి, భట్టుగూడెం సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాత నానా యాతన పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడిచినా ఇంకా సౌకర్యాలే కల్పించలేదు. చాలా చోట్ల తాగునీటి వసతి లేకపోవడంతో మండుటెండలకు రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. నీడ సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. కూర్చోడానికి కుర్చీలూ లేవు. మరుగుదొడ్లు, టాయిలెట్లు అరకొరగా ఉన్నాయి.వీటితో పాటు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం తేమ చూసేందుకు మాయిశ్చర్ యంత్రాలు, తూర్పార పట్టేందుకు ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 372 కొనుగోలకు గాను ఇప్పటి వరకు 342 కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఏ ఒక్క చోట పూర్తిస్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు కేంద్రాల్లో సమస్యలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ● బీబీనగర్ మండలం భట్టుగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వందకు పైగా వడ్ల రాశులు నిల్వ ఉన్నాయి. కేంద్రాన్ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. కానీ, కొనుగోళ్లు చేయడం లేదు. నీరు, నీడ సౌకర్యం లేదు. ● వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం సమకూర్చిన ప్యాడీ క్లీనర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకుంటున్నారు. మహిళా రైతులకు టాయిలెట్ సౌకర్యం లేదు. అక్కంపల్లి ఐకేపీ సెంటర్లో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడం లేదు. టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. ● మోత్కూరు మండలం పాటిమట్ల ఐకేపీ కేంద్రంలో నీడ సౌకర్యం లేదు. కొనుగోళ్లు మందకొడిగాసాగుతున్నాయి. ● ఆలేరు మండలం టంగుటూరులో డ్రమ్ములు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. ఎండ వేడికి నీరు వేడెక్కుతుండడంతో రైతులు తాగలేకపోతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచలేదు. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఫ తాగునీటికి కటకట, చెట్ల నీడే దిక్కు ఫ ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్లకూ అవస్థలు ఫ కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఫ వర్షాలకు తడస్తున్న ధాన్యం ఫ నష్టపోతున్న రైతులు కేంద్రం ప్రారంభించడంతోనే సరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్ కొనుగోలు కేంద్రానికి 20 రోజుల నుంచే ధాన్యం రాక మొదలైంది. 22వ తేదీన కేంద్రాన్ని ప్రా రంభించారు. కానీ, ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. ఈనెల 25వ తేదీ నాటికి 30 మంది రైతుల ధాన్యం కుప్పలు కేంద్రంలో ఉన్నాయి. తాగడానికి కేవలం రెండు క్యాన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడం, తూర్పార పట్టే మిషన్లు లేకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు గాను తూర్పారపట్టే యంత్రాంగానికి గంటలకు రూ.1400 వరకు చెల్లిస్తున్నారు. ఇక నీడ సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న వేప చెట్టు కింద రైతులు సేదదీరుతున్నారు. -
ప్రశాంతంగా మోడల్ స్కూళ్ల పరీక్ష
భువనగిరి : మోడల్ స్కూళ్లలో 6,7,8,9,10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 973 మంది విద్యార్థులకు గాను 659 మంది హాజరయ్యారు. 314 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి సంస్థాన్‌నారాయణపురం : జిల్లా యువజన, క్రీడల శాఖ, సంస్థాన్‌నారాయణపురం స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలని క్లబ్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు సిలివేరు సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీ బాల్, యోగా, తైక్వాండ్‌లో మే 1వ తేదీనుంచి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు బాల, బాలికలు శిక్షణకు అర్హులన్నారు. జూన్ 6వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆ తరువాత గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర తుర్కపల్లి : రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అదనపు కలెక్టర్ (రెవె న్యూ) వీరారెడ్డి సూచించారు. తుర్కపల్లి మండలం పెద్దతండా, మాదాపురం, పల్లెపహాడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. బీసీ గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు భువనగిరి : జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల(బాలురు) డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జెల్ల స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీజెడ్సీ, బీకాం సీఏ, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా రూ.200 ఫీజు చెల్లించి మే5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
రైతులకు సోలార్ ప్లాంట్లు
పీఎం–కుసుమ్ పథకం కింద యూనిట్ల స్థాపన హుజూర్నగర్ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్ రెడ్కో అధికారులు ఎల్ఓ (లెటర్ ఆఫ్ అవార్డు) అందజేశారు. దీర్ఘకాలిక ఆదాయ వనరు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. సబ్‌స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరం.. వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఫ కర్షకుల ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక ఫ మూడున్నర ఎకరాల పట్టా భూమి ఉన్న రైతులు అర్హులు ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్ఓ చెల్లింపులు ఇచ్చింది నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24యాదాద్రి 224 58 31