struggle
-
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
చిన్నగదిలో బతికా.. నాన్న కూడా అవమానించారు: రేసుగుర్రం నటుడు
తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా పరిచయమైన నటుడు రవికిషన్. అల్లు అర్జున్ మూవీ రేసుగుర్రంతో టాలీవుడ్ ప్రియులను అలరించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ ఏడాది అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లపట్టా లేడీస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ పోలీసు అధికారి పాత్రలో నటించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికిషన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దాదాపు 34 ఏళ్లపాటు పోరాటం చేశానని వెల్లడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న రవికిషన్ వెనుక ఎంతో కృషి దాగి ఉందని వివరించారు.రవికిషన్ మాట్లాడుతూ.. 'నేను పూజారి కొడుకుని. నాకు మా నాన్న ఆధ్యాత్మికత, నిజాయితీ గురించి మాత్రమే నేర్పారు. నేను థియేటర్లో ఉండేవాడిని. నా చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించా. దీంతో నాన్న నన్ను కొట్టారు. ఆ తర్వాత కోపంతో నువ్వు నర్తకి అవుతావని ఎగతాళి చేశారు. కానీ సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ముంబయిలో చెప్పుల్లేకుండా నడిచా. చిన్నరూమ్‌లో ఉండేవాడిని. నాకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కానీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మాత్రం తెలుసు' అని అన్నారు.తాను తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని రవికిషన్ తెలిపారు. అలాగే మీరు నన్ను బుల్లితెరపై కూడా చూస్తారని అన్నారు. నటనలో సహజత్వాన్ని తీసుకురావాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ 90వ దశకంలో వచ్చారని.. నా ప్రయాణం మొదలైంది కూడా అప్పుడేనని వెల్లడించారు. కానీ వారి జీవితాల్లో త్వరగా ఎదిగారని.. వారిలా ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికిషన్ తెలిపారు. కాగా.. ఆయన నటించిన లపట్టా లేడీస్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్‌హౌస్ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్ ఉద్యోగులు పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్ తాజాగా చేసిన జాతీయ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తాము గడిచిన మూడు నెలల్లో తిండికి కూడా కష్టాలు పడినట్లు నివేదించారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.సియాటిల్‌కు చెందిన వాల్‌మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్. యూఎస్ వేర్‌హౌసింగ్ పరిశ్రమ వర్క్‌ఫోర్స్‌లో అమెజాన్ 29 శాతం వాటాను కలిగి ఉందని పరిశోధకుల అంచనా. అమెజాన్ వేర్‌హౌస్‌లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నుంచి స్పందనలను క్రోడీకరించి నివేదికను విడుదల చేసింది. -
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
ఫ్లోర్లు ఊడ్చా..టాయ్లెట్లు క్లీన్ చేశా...కానీ: హీరోయిన్
జీవితంలో అనుకున్నది సాధించాలంటే..అనేక కష్టనష్టాల్ని భరించాలి. ఆటుపోట్లను తట్టుకుని రాటు దేలాలి. అపుడు మాత్రమే అందరికంటే మిన్నగా, ఉన్నతంగా నిలుస్తాం. అందులోనూ సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే మరింత కష్టపడాలి. దేశం ఏదేనా.. ప్రాంతం ఏదైనా సినీ హీరోయిన్లకు ఇదే పరిస్థితి...! మహీరా ఖాన్ పాకిస్తాన్లో పాపులర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.'ఖిరాద్'టీవీ సీరియల్‌తో పాటు, ఫవాద్ ఖాన్‌తో నటించిన హమ్ సఫర్తో మరింత పాపులరయ్యారు. 2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్‌తో రెండో వాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతోపాటు మహిరా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పైకి ఎదగడానికి పడిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఒకానొక సమయంలో ఫ్లోర్లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని గతంలో ఒక మ్యాగజైన్ ఇచ్చిన గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం, ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు. నిజానికి చేతిలో ఒక్క డాలర్ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని సోదరుడితో కలిసి సర్దుకున్న వైనాన్ని వివరించారు. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డా సెలబ్రిటీ జీవితంలో కఠినమైన విమర్శలు ఎంత అనివార్యమైన భాగమని పేర్కొన్నారు. తాను కూడా బైపోలార్ డిజార్డర్ అనే 'మానిక్ డిప్రెషన్'తో పోరాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా "రయీస్" చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఇటీవల వెల్లడించారు. దాదాపు ఆరేడు సంవత్సారలు యాంటి డిప్రెసెంట్స్‌తో మేనేజ్చేసినట్టు తెలిపారు. .తన ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు చాలా గొప్ప విషయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ ఆశాభావంతో ముందుకు సాగాలి. తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్ ఒకటుందని అందరికీ తెలియాలనే తానే విషయాలన్నీ షేర్ చేస్తున్నాన్నారు సలీం కరీమ్‌తో మహిరా ఖాన్ రెండో వివాహం ఈ ఏడాదిల అక్టోబర్ 2 మహీరా ఖాన్ , తన చిరకాల మిత్రుడు సలీం కరీంని రెండో వివాహం చేసుకుంది. అయితే అంతకు ముందు 17 ఏళ్ల వయసులో అలీ అక్సారిని పెళ్లాడింది. అజ్లాన్ అనే కుమారుడున్నాడు. అయితే 2015లో కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. అటు అలీ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. -
మన దేశంలో దివ్యాంగులకు అనువైన ఇల్లు ఉందా..?
అద్దెకు ఎన్నో ఇళ్లు, ఫ్లాట్లు ఉంటాయి కదా అనిపించవచ్చు. కాని వీల్‌చైర్‌లో మాత్రమే జీవనం గడిపేవారికి ఆ ఇళ్లేవీ పనికి రావు. బెంగళూరులో ఐటి ఇండస్ట్రీలో పని చేస్తున్న మృణ్మయి తను నివసించడానికి బెంగళూరులో తగిన ఫ్లాటే దొరకడం లేదని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ విశేషంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. లిఫ్ట్‌లో అడుగు పెట్టడం దగ్గరి నుంచి బాత్రూమ్ల వరకూ ప్రతిదీ వీల్‌చైర్‌కు వీల్లేనివేనని ఆమె తెలిపింది. ఆమె మాత్రమే కాదు సాధారణ వ్యక్తులకు జబ్బు చేస్తే వీల్‌చైర్‌లో ఆస్పత్రికి వెళ్లిరావడం కూడా దుర్లభమే. మన నిర్మాణ పద్ధతుల్లో మానవీయత రాదా? ‘అందరికీ అందుబాటు’ (యాక్సెసెబిలిటీ టు ఆల్) అనే మాట వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని అది ఆచరణ యోగ్యం కావడం ఇంచుమించు అసాధ్యంగా ఉంది మన దేశంలో. ‘మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తే అందరూ ఆ ఆహ్వానాన్ని మన్నించగలరా? మన ఇల్లు దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉందా? నివసించే ఫ్లాట్స్‌లో సులభంగా వీల్‌చైర్‌తో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కట్టుకున్న ఇళ్ల మెయిన్గేట్నైనా వీల్‌చైర్ దాటగలదా? అందరూ మెట్లు వాడగలరని, మెట్లు ఉంటే సరిపోతుందని ఇప్పటికీ భావిస్తున్నామంటే యాక్సెసెబిలిటీ టు ఆల్ హక్కును నిరాకరిస్తున్నట్టే. ర్యాంప్‌లు కట్టి దివ్యాంగుల రాకపోకలను అన్ని ప్రయివేటు, పబ్లిక్ ప్లేసుల్లో సులభం చేసినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు. ఇల్లు కావాలి బెంగళూరులో అమేజాన్‌లో పనిచేస్తున్న మృణ్మయి‘నాకు ఇల్లు కావాలి. కాని అలాంటి ఇల్లు దొరకడం లేదు’ అని ‘ఎక్స్’ (ట్విటర్)లో తాజాగా పెట్టిన పోస్టు దివ్యాంగుల ఘోషను మరోసారి బయటపెట్టింది. ‘నేను ఇన్నాళ్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అందులో ర్యాంప్‌లు ఉన్నాయి. నా మోటర్డ్ వీల్‌చైర్‌తో కిందకు రావడం మళ్లీ ఫ్లాట్‌లోకి వెళ్లడం సులభంగా ఉంటుంది. ఫ్లాట్‌లో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఇప్పుడు మా ఫ్లాట్ ఓనర్ ఏవో కారణాల రీత్యా ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుంచి తగిన ఫ్లాట్ కోసం ఎంతో వెతుకుతున్నాను. కాని వీల్‌చైర్‌తో రాకపోకలు సాగించేలా ఒక్క ఫ్లాట్ కూడా లేదని తెలపడానికి చింతిస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. అన్ని చోట్లా మెట్లే చాలా ఫ్లాట్లలో లిఫ్ట్ దగ్గర మెట్లు ఉండటం ఒక సమస్యగా మృణ్మయి చెప్పింది. అంటే ఒకటో రెండో మెట్లు ఎక్కి లిఫ్ట్ ఎక్కాలి. కొన్ని లిఫ్ట్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీల్‌చైర్‌తో ప్రవేశించి లోపల దానిని తిప్పుకుని డోర్ వైపుకు ముఖం పెట్టడం కష్టం. ‘అపార్ట్‌మెంట్స్‌లో చాలా ఫ్లాట్లకు గడప అడ్డంగా ఉంటుంది. వీల్‌చైర్‌తో దాటలేము. దాటినా అన్ని ఫ్లాట్లలో బాత్రూమ్లు ఒక మెట్టు ఎత్తులో ఎందుకు కడతారో అర్థం కాదు. నేను వీల్చైర్తోటే బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేయాలి. కాని సింకో, టాయిలెట్ సీటో అడ్డంగా ఉంటుంది. అదీగాక బాత్రూమ్ ద్వారాలు మరీ సన్నగా పెడతారు. నా వీల్‌చైర్‌తో అడుగుపెట్టాలంటే అవి కనీసం 25 అంగుళాల వెడల్పు ఉండాలి. అలా ఉండవు’ అంటుంది మృణ్మయి. ‘మరో సమస్య ఏమిటంటే... ఇలా వీల్‌చైర్‌కు అనువుగా ఉన్న ఫ్లాట్లకు రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. 25 వేల రూపాయల ఫ్లాట్ 40 వేలు చెబుతున్నారు’ అందామె. యాక్సిడెంట్ వల్ల మృణ్మయి అందరిలా హుషారుగా తిరిగే అమ్మాయి. కాని 2011లో జరిగిన కారు ప్రమాదం వల్ల ఆమెకు స్పైనల్ కార్డు ఇంజూరీ జరిగింది. సర్జరీ చేసినా రెండు భుజాల కింద ప్రాంతమంతా అధీనాన్ని కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మోటర్డ్ వీల్‌చైర్ ద్వారా ఆమె మామూలు జీవనం గడపడానికి ప్రయత్నిస్తోంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఆఫీస్ పని కోసం డిక్టేషన్ సాఫ్ట్వేర్ వాడతాను. వేళ్ల మీద అధీనం ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ ఉపయోగిస్తాను. కాని నాకూ తిరగాలని ఉంటుంది. బయటికొస్తే రెస్టరెంట్‌కు కూడా పోలేను. ప్రతి రెస్టరెంట్కూ మెట్లు ఎక్కి వెళ్లాలి. ఎక్కడా ర్యాంప్‌లు ఉండవు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారికే ప్రవేశం అన్నట్టుగా మన నిర్మాణాలు ఉంటాయి. సినిమా హాళ్లు చెప్పే పనే లేదు. టాక్సీ సర్వీసులు కూడా వీల్‌చైర్ ఫ్రెండ్లీ కావు. అందుకే మాలో చాలామంది యాక్సెసబిలిటీ యాక్టివిస్ట్లుగా మారి సమాజంలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపింది మృణ్మయి. ‘ఎక్స్’లో మృణ్మయి పెట్టిన పోస్ట్‌కు చాలామంది స్పందించారు. నిజంగా మీ ఇబ్బంది మీరు చెప్తుంటే తెలుస్తోంది అని చాలామంది చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆఫీసులు, పార్కులు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదీ దివ్యాంగుల రాకపోకలకు అనువుగా మారడం, మార్చడం తప్పనిసరి. వాటిని వాడేది ఒకరిద్దరైనా ఆ ఒకరిద్దరి హక్కును నిరాకరించే అధికారం మనకు లేదు. (చదవండి: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! ) -
Odisha Rail Crash: ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న బాధితుల మాటలు
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగి ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించాయి. ప్రాణలతో బయటపడ్డ కొందరూ చెబుతున్న మాటలు వింటుంటూ అంత తేలిగ్గా ఆ విషాదాన్ని మర్చిపోలేరేమో అన్నంతగా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఘోర ప్రమాదం నుంచి బయటడ్డ బాధితులు తాము ఎలా సజీవంగా బయటపడ్డానో చెబుతుంటే ఆ దృశ్యం కళ్లముంగిట కదలాడినట్లుగా ఉంది. ఆ బాధితుడు అస్సాంకు చెందిన దీపక్ దాస్. తాను ప్రయాణిస్తున్న రైలు గూడ్సు రైలుని ఢీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో కోచ్‌లు బోల్తాపడ్డాయి. తాను విండో సీటు వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగానని. తాను ఆ సమయంలో కిటికీని గట్టిగా పట్టుకుని ఉన్నానని లేదంటే తాను కూడా చనిపోయే వాడినని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డ బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ..రైలు అకస్మాత్తుగా ఢీ కొన్న తర్వాత భారీ కుదుపు విన్నానని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గురించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందిందని, తనను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఆ ఘోర ప్రమాదానికి కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యం అని, తద్వారా రైళ్లను ఈ ట్రాక్‌పై యథావిధిగా నడిచేలా చేయొచ్చని అన్నారు. (చదవండి: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..) -
నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి
సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. (ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) -
తేజ్ 6 నెలలుగా..పోరాడుతూనే ఉన్నాడు
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
Viral Video : కట్టి ని తీసుకుపోవడానికి కుక్క పడ్డ పాట్లు చూడండి..!
-
అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!
రన్నింగ్ రేస్ ట్రాక్ సిద్ధంగా ఉంది. పోటీదారులందరూ పరుగుకు సిద్ధంగా ఉన్నారు. విజిల్ వినిపించగానే వింటి నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాలనే కసి వారందరిలో సమానంగా ఉంది. ఉన్నట్లుండి... ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు... ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఓ అథ్లెట్ కాలికి ఓ బంధనం చుట్టుకుంది. అయినా పట్టించుకోకుండా పరుగు మొదలు పెట్టినప్పటికీ కాలు తేలికగా నేలను తాకడం లేదు. బరువుగా కదులుతోంది. మనసులో అలజడి. మెదడు నిండా ప్రశ్నలు... ఆందోళన పెరిగిపోతోంది. పోటీ నుంచి తప్పుకోవడమా లేక పోటీదారుల జాబితాలో ఆఖరున నిలబడడమా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇదీ ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ పరిస్థితి. ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అబ్బాయిలతో సమానంగా దీటుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న మహిళ... తల్లి కావడం కోసం కెరీర్లో రాజీ పడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ప్రైవేట్ రంగంలో అంత సులువుగా ఏమీ జరగడం లేదు. ఆ విరామాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బిడ్డ పెరిగిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా తమ ఉద్యోగం నిత్యపోరాటం దినదినగండంగానే ఉంటోంది. ఇంట్లో ఏ అవసరం వచ్చినా అందరి కళ్లూ ‘ఆమె ఉద్యోగం’ వైపే మళ్లుతాయి. ‘ఉద్యోగం మానేయచ్చు కదా’ ఉచిత సలహాల పర్వం మొదలవుతుంది. ఏది మంచి పరిష్కారం? రజని ఓ పెద్ద ప్రైవేట్ స్కూల్లో టీచర్. భర్త కూడా ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజ్కొచ్చారు. అత్తగారికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్లో చేర్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చారు. పరామర్శకు వచ్చిన బంధువులందరిదీ ఒకటే సలహా. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్లి పోతే ఎలాగ! ఆమెకు తోడుగా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా! మంచిదే... ఆ ఒకరు ఎవరు? అందరి తీర్పూ ‘ఆమె ఉద్యోగం’ మీదనే. ‘ఉదయం నేను అన్నీ అమర్చి వెళ్తాను. అత్తమ్మను రోజంతా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్ అసిస్టెంట్ లేదా నర్సును పెట్టుకుంటాను. నేను ఉద్యోగం మానడం కంటే మరొకరికి ఉద్యోగం కల్పించడం మంచి పరిష్కారమేమో కదా... ఆలోచించండి’ అని చెప్పి చూసింది రజని. ఆ పరిష్కారం ఎవరికీ నచ్చడం లేదు. ఎవరి ముఖంలోనూ ప్రసన్నత లేదు. మారు మాట్లాడకుండా ఉద్యోగం మానేసింది రజని. నాలుగు నెలలకు అత్తగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్దామంటే స్కూల్లో తన ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తూ ఉండదు. అప్పటికీ ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాసు చెప్పడానికి సిద్ధమై వెళ్లింది. ‘అకడమిక్ ఇయర్ మధ్యలో అలా మానేశారు. పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి కదా వేరే టీచర్ని అపాయింట్ చేశాం. ఎవరైనా మానేసినప్పుడు ‘అవసరమైతే’ తెలియచేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్... ఇక మీరు వెళ్లవచ్చు అనే అర్థాన్ని ధ్వనింపచేస్తూ. ‘ఆ అవసరం’ రాకపోవచ్చనే భావం కూడా అవగతమైంది రజనికి. ప్రసూతి విరామాన్ని స్వీకరించడానికి, ఆ మేరకు కెరీర్లో వెనుకబాటును స్వాగతించడానికి మాతృత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కోడలి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగంలో కొనసాగడానికి, మల్టీటాస్కింగ్‌కి కూడా తాను సిద్ధమే. కానీ ఈ నిర్ణయం ఒప్పనే వాళ్లేరి? రజనిలాగ ఎందరో! ఇది ఒక్క రజని సమస్య మాత్రమే కాదు. సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ రంగాలలో మహిళలకు కూడా దాదాపుగా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కుటుంబ కారణాలరీత్యా ఉద్యోగం మానేసిన వాళ్లు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చిన్న సవాల్ కాదు. అన్ని రకాల అడ్డంకులనూ ఎదుర్కొని కేవలం 27 శాతం మహిళలు మాత్రమే తిరిగి ఉద్యోగినులవుతున్నారు. వారిలో పదహారు శాతం మాత్రమే కొత్త ఉద్యోగాన్ని తన సమర్థతకు దీటుగా సంపాదించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక కోణం మాత్రమే. నాణేనికి మరో వైపు పరిశీలిస్తే అంతులేని ఆందోళన కలుగుతోంది. కుటుంబ అవసరాల కారణంగా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో కనీసంగా మనిషిగా కూడా చూడడం లేదనే ఆవేదనతో కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. చివరికి వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు న్యాయవాది పార్వతి. చేజార్చుకుంటే కష్టమే! ‘‘నా క్లయింట్ ఒకావిడ ఉన్నత చదువులు చదివింది. భార్యాభర్తలు యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను ఉద్యోగం మానేయమని భర్త నుంచి ఒత్తిడి మొదలైంది. ‘అతడి తల్లిదండ్రులు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉండడానికి వస్తున్నారు. వాళ్లను సౌకర్యంగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయమని’ అతడి డిమాండ్. ‘అంత చదివి ఉద్యోగంలో కీలక స్థాయికి చేరిన దశలో ఉద్యోగం మానేస్తే తిరిగి ఇలాంటి ఉద్యోగం తెచ్చుకోవడం సాధ్యం కాద’నేది ఆమె వాదన. ఒకవేళ ఆమె భర్త ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగం మానేస్తే... ఆరు నెలల తర్వాత ఆమె తిరిగి వెళ్లేసరికి ఆమె ఉద్యోగం ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సంస్థలు కూడా ఆమెకిచ్చే జీతంతో ఇద్దరు జూనియర్లను చేర్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాయి. మహిళలు మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అయితే ఆ ఉద్యోగాన్ని కొనసాగించడంలో మాత్రం మన భారతీయ సమాజంలో ఆమెకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు, లాయర్లను సంప్రదిస్తున్న మహిళలే అందుకు ఉదాహరణ’’ అంటారామె. ‘ఆమెను ఉద్యోగం చేయనిస్తున్నాం కదా’ అని తమ విశాలత్వాన్ని చాటుకునే భర్తలకు కొదవలేదు. అలాగే తాము ఎప్పుడు మానేయమంటే అప్పుడు మానేయడమే ఆమె ముందున్న ఆప్షన్ అనే ధోరణికి కూడా కొదవలేదు. చివరికి ‘ఆమె ఉద్యోగం’ ఆమెది కాకుండా పోతోంది. చట్టం అందరికీ ఒక్కటే! కానీ... మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో వచ్చింది. అప్పుడు పన్నెండు వారాల వేతనంతో కూడిన సెలవు ఉండేది. తర్వాత 26 వారాలకు పొడిగించింది ప్రభుత్వం. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎక్కువ కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రానివే ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో యాభై మంది ఉద్యోగులున్న సంస్థ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. దాంతో అనేక చిన్న చిన్న కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఈ పరిస్థితి ఆ కంపెనీల్లో పని చేసే మహిళలకు పెద్ద సమస్యగా మారుతోంది. డెలివరీ తర్వాత, కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగంలో విరామం తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది. – పార్వతి, న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
సవాళ్లెదురైనా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన సైద్ధాంతిక పోరు కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ఆమె అన్నారు. తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ విభజన వాద శక్తులపై తమ సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడానికో, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకో, బెదిరించటానికో దివంగత రాజీవ్ దానిని ఒక అవకాశంగా తీసుకోలేదని పరోక్షంగా మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘1989 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సీట్లు గెలుచుకోకపోవడంతో, ఏకైక పెద్ద పార్టీ అయినప్పటికీ రాజీవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. రాజీవ్ నిజాయితీని, మనస్సాక్షినే నమ్ముతారనేందుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు. రాజీవ్ నమ్మి, ఆచరించిన విలువలను కొనసాగించేందుకు పునరంకితం కావాలని, అదే రాజీవ్‌కు ఘనమైన నివాళి అని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. రాజీవ్ వల్లే భారత సమాఖ్య బలోపేతం మాజీ ప్రధాని రాజీవ్ హయాంలో కుదిరిన పంజాబ్, అస్సాం, మిజోరం ఒప్పందాల వల్లే మన సమాఖ్య మరింత బలోపేతమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సాధించిన విజయాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. -
విద్యార్ధుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పోరాడుతాం
-
ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న అచ్యుత సామంత
-
బి.కాంలో ఫిజిక్స్‌పై జలీల్‌ఖాన్ అవస్థలు
-
గట్టెక్కేదెలా!
17 రోజులైనా అవే కష్టాలు సొమ్ముల్లేక రైతన్నల గగ్గోలు ఫీజులు కట్టలేక విద్యార్థుల అగచాట్లు పింఛన్ సొమ్ము వేసేది బ్యాంకు ఖాతాల్లోనే సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దు కారణంగా వ్యవసాయాధారితమైన ’పశ్చిమ’లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. త్వరలో రబీ సీజన్ ప్రారంభం అవుతోంది. కనీసం పొలం పనులు చేయడానికి, పొలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో రబీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో కూలీలకు డబ్బులు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ఫీజు కట్టే పరిస్థితి లేక విద్యార్థులు ఆగచాట్లు పడుతున్నారు. లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన నిమ్మగడ్డ రవితేజ ఎస్సై పరీక్షకు అవసరమైన శిక్షణ కోసం రూ.30 వేలు చెల్లించాల్సి ఉండగా, డబ్బు సమకూరకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేక రెండు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాడు. కామవరపుకోటకు చెందిన ఎం.బాలాజీకి బ్యాంకు రుణం మంజూరు కాగా, రేపోమాపో సొమ్ము చేతికి వస్తుందని సంబరపడ్డాడు. ఈ లోగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో బ్యాంకు అధికారులు రుణం ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుత గందరగోళానికి తెరపడ్డాక వెలువడే ఆదేశాలను అనుసరించి రుణమిచ్చేదీ లేనిదీ చెబుతామన్నారు. ప్రక్కిలంక గ్రామానికి చెందిన చదరాసి శ్రీనివాస్ తన బంధువును ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే పెద్దనోట్లు తీసుకోలేదని వాపోయాడు. జిల్లాలో ఎవరిని కదిపినా ఇవే కష్టాలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ విభేదించకపోయినా.. సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావించగా.. 17 రోజుల తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. జేబులో పెద్ద నోట్లు కావలసినన్ని ఉన్నా ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తడంపై సామాన్య మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చిల్లర సమస్యతో పెద్ద నోట్లు మార్చుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వెళ్లినా సొమ్ము రావట్లేదు ఇదిలావుంటే.. పాత నోట్లు తీసుకుని, కొత్తనోట్లు ఇచ్చే కార్యక్రమం నిలిచిపోవడంతో శుక్రవారం కూడా బ్యాంకులు వెలవెలబోయాయి. కరెంట్ అకౌంట్ గలవారికి రూ.20 వేల రూపాయలు తీసుకునే సదుపాయం కల్పించారు. జిల్లాలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎంలు తప్ప మిగతావి పని చేయలేదు. వాటిలో నగదు పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్‌కు సొమ్ము తీసుకునేందుకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బ్యాంకులో నగదు లేని కారణంగా సొమ్ములు ఇవ్వలేకపోతున్నామంటూ బోర్డు పెట్టారు. ఇదిలావుంటే.. రేషన్ దుకాణాలకు కరెంట్ ఖాతాలు తెరవాలని అధికారుల నిర్ణయించారు. డిసెంబర్ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
అన్నదాతకూ అగచాట్లు
కష్టాల ముంగిట వ్యవసాయం ధాన్యం అమ్మినా చేతికందని డబ్బు పంట కోత, రబీ పెట్టుబడులకు తప్పని ఇబ్బందులు వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు గంటా సుబ్రహ్మణ్యం. భీమవరం మండలం తాడేరులో ఏడు ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటంతా కోతకొచ్చింది. నాలుగు ఎకరాల్లో కోత కోసే పనిని కూలీలకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఎకరాకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.8 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. 22 మంది కూలీలొచ్చి పని పూర్తి చేశారు. వారికి కూలి డబ్బులు చెల్లించేందుకు సుబ్రహ్మణ్యం బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకుంటే రూ.2 వేల నోట్లు ఇచ్చారు. వాటిని కూలీలకు ఇవ్వగా, పెద్దనోట్లు ఇస్తే తాము ఎలా పంచుకోవాలని ప్రశ్నించారు. చిల్లర నోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ రైతు చిల్లర నోట్ల కోసం రెండు రోజులుగా తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటే.. కూలి డబ్బులు చేతికి అందక కూలీలు బేలచూపుతు చూస్తున్నారు. ఈ పరిస్థితి సుబ్రహ్మణ్యం ఒక్కరికే పరిమితం కాదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దు రైతన్నలకు కష్టాలు తెచ్చిపెట్టింది. వరి కోత, మాసూళ్లు చేసుకోవడం కష్టతరంగా మారింది. కొత్త పంట వేయడం సంగతి దేవుడెరుగు.. కోతకొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకునే పరిస్థితి లేక రైతుల బిత్తరచూపులు చూస్తున్నారు. ధాన్యం అమ్మినా నగదు చేతికి అందక ఆందోళన చెందుతున్నారు. కష్టాలకోర్చి మాసూళ్లు పూర్తిచేసి కమీషన్‌దారులకు ధాన్యం అమ్మినా బదులు చెక్కులు ఇస్తున్నారు. చెక్కుల క్లియరెన్స్ కోసం 10 రోజులకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ సొమ్ము చేతికొచ్చినా రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో వాటిని మార్చుకోలేని పరిస్థితి. మరోవైపు ధాన్యం వ్యాపారుల్లో కొందరు రూ.500, రూ.1000 నోట్లు అంటగడుతున్నారు. ఽవీటిని మార్చుకోవడం కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. కూలి డబ్బులు సైతం ఇవ్వలేక.. కోత, నూర్పిడి, ధాన్యాన్ని బస్తాలకు ఎక్కించడం వంటి పనులు చేసిన కూలీలకు సొమ్ములు ఇచ్చేందుకు చిల్లర నోట్లు లేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు రబీ సీజన్ మొదలవుతుండటంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎరువుల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. పొగాకు పంటకు, రాబోయే రబీ పంటకు ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఏటా ఈ సీజన్లో జరిగే వ్యాపారంతో పోలిస్తే పదో వంతు కూడా ఎరువుల అమ్మకాలు సాగడం లేదు. రద్దు చేసిన నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. మెట్టలోనూ ఇక్కట్లే వ్యాపారులు చెక్కులు ఇచ్చినప్పటికీ బ్యాంకుల్లో వారానికి రూ.20 వేలకు మించి ఇవ్వకపోవడంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే పత్తి పంట చేతికి రాగా, దానిని విక్రయించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. పత్తి వ్యాపారులు కొంత మందికి చెక్కులు, మరికొంత మందికి పాత నోట్లు ఇస్తున్నారు. మరోవైపు సరైన ధర రావడం లేదు. పత్తి ఏరిన కూలీలకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందని సాగుదారులు వాపోతున్నారు. ఆంక్షలు సడలించినా.. బ్యాంకుల నుంచి నగదు తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను రైతుల విషయంలో కొంతమేర సడలించినా కష్టాలు తీరడం లేదు. పంట రుణం పొందిన, కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చని, పంట అమ్మగా వచ్చిన డబ్బు ఆర్టీజీఎస్ లేదా చెక్కు ద్వారా తన ఖాతాలోకి వచ్చి ఉంటే అదనంగా వారానికి మరో రూ.25 వేఽలు డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా బ్యాంకు అధికారులు అంత నగదు ఇవ్వడం లేదు. రబీ సీజన్ మొదలైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులకు గరిష్టంగా రూ.50 వేలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. ఎరువులు కొనాలంటే కష్టంగా ఉంది ఎరువులు కొనుక్కోవాలంటే కష్టంగా ఉంది. పెద్దనోట్లు మారకపోవడంతో పంటలకు పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. గేదెలకు మినరల్ మిక్చర్ కొనడానికి కూడా డబ్బులు ఉండటం లేదు. పల్లపోతు శ్రీనివాసరావు అప్పనవీడు, పెదపాడు మండలం కూలీలకు డబ్బులివ్వలేదు ధాన్యం మాసూళ్లు చేసిన కూలీలకు డబ్బులివ్వాలి. కోసిన ధాన్యమంతా పొలంలోనే ఉంది. పాత నోట్లు తీసుకోమంటే మాకొద్దని కూలీలు, కోత యంత్రాల వాళ్లు అంటున్నారు. టౌన్‌కు వెళ్లిరావాలంటే కష్టంగా ఉంది. అక్కడ బ్యాంకుల చుట్టూ తిరిగే సమయం లేదు. వెళ్లినా అవసరమైనన్ని నోట్లు ఇస్తారనే ఆశలేదు. బ్యాంకుల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి. సారిక సుబ్బారావు, కౌలు రైతు, మారంపల్లి -
మరక మంచిది కాదు !
-
స్పందించిన హృదయాలు
విశాఖపట్నం : మాట్లాడడానికి ఓపిక లేదు...బక్కచిక్కిన శరీరం..ముడతలు పడిన చర్మం...కళ్లు మూతలు పడుతున్నాయి..ఓపిక తెచ్చుకుని ఎవరైనా గుక్కెడు నీళ్లు పోస్తారా?అని ఎదురుచూస్తుందే తప్పా మాట బయటకు రావడం లేదు. ఇలా వారం రోజులు.. మలమూత్రవిసర్జన జరుగుతున్నా స్పృహ లేదు. పాపం ఆ తల్లికి ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్లో...! నా అన్న వాళ్లు వదిలేశారా? ఏ దిక్కూ లేక ఇలా కూలబడిపోయిందా?? కారణం ఏదైతేనేం ఆ మాతమూర్తి కష్టమిది. ఆర్పీఎఫ్ క్యాంపు ఆఫీసు దరిలో దీనస్థితిలో ఉన్న 80 ఏళ్ల బామ్మను జీఆర్పీఎఫ్ సిబ్బంది గమనించారు. చలించిపోయారు. వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ విభాగంలోని ఐసీపీఎస్ సిబ్బందికి, సాతి సంస్థ, ఆత్రేయ ఓపెన్ షెల్టర్ ప్రతినిధులు సమాచారమందించారు. వారంతా చేరుకుని బామ్మకు స్నానం చేయించి. వస్త్రాలు కట్టి..అల్పాహారం అందజేశారు. ప్రాణం లేచి వచ్చినట్టు బామ్మ కళ్లలో ఆనందం చూశారు వీరంతా...అనంతరం అక్కడ నుంచి కాంప్లెక్స్ దరిలో ఉన్న ఆత్రేయ ఓపెన్ షెల్టర్‌కు తరలించారు. మనసున్నోళ్లని నిరూపించారు. -
పోరాటాల ఫలితంగానే కూలి పెంపు
ఖిలావరంగల్ : చేనేత సమస్యలపై అఖి ల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శివనగర్ తమ్మెర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. చేనేత కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా చేనేత కార్మిక సహకార సొసైటీ(టెస్కో) 20 నుంచి 27 శాతానికి కూలి రేట్లు పెంచిందన్నారు. మీటరు నేత కు రూ.3 50 పైసలు, టెరికాటన్ షూటింగ్ క్లాత్, షర్టింగ్, లంగా, పాలిస్టర్ బ్లౌజ్, ఓణీ క్లాత్ నేతకు రూ.4. 50 పైసలు పెరిగాయ ని తెలిపారు. జౌళిశాఖ నుంచి చేనేతను విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులు పో రాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో గోరంట్ల శరత్‌బాబు, చె రుకు వెంకట్రాం నర్సయ్య, గుల్లపెల్లి సాం బమూర్తి, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
పోరుబాట పట్టాలి
వైఎస్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం పథకాల పేరు మార్చి పబ్బం గడుపుతున్నారు ప్రజలకు అండగా శ్రేణులు ఉద్యమించాలి జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది లోటస్‌పాండ్ సమావేశంలో జిల్లా నేతలకు దిశానిర్దేశం సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ పార్టీ తరఫున పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు జిల్లాపార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాజధానిలోని లోటస్‌పాండ్‌లో పార్టీ ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, సేవాదళ్ అధ్యక్షుడు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీలేదని, జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. కానీ ప్రసుత్తం ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే దూరదృష్టితో వైఎస్.జలయజ్ఞం కింద జిల్లాలో తీసుకున్న ప్రాజెక్టుల పేరును ప్రభుత్వం మార్చి వాటిని ముందుకు సాగకుండా చూస్తోందన్నారు. వీటిపైనే పార్టీ శ్రేణులు దృష్టి పెట్టి, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యమించాలన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాడి.. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా నేతలు, శ్రేణులు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో ఉండి కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీతోపాటు అనుబంధ సంఘాల బాధ్యుల నియామకాలు కూడా చేపడతామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు తరలివెళ్లారు. జిల్లా నేతలు జిల్లపల్లి సైదులు, మందడపు వెంకటేశ్వర్లు, ఆలస్యం సుధాకర్, సంపెట వెంకటేశ్వర్లు, వాలూరి సత్యనారాయణ, రాములు, ఎస్కె.కరీం, ఎస్కె.మీరా, మర్రి బాబూరావు, గనపారపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ జ్యోతి, ఏసురత్నం, రమేష్‌బాబు, పులి సైదులు, రుద్ర హనుమంతరావు, రుద్ర ఉపేందర్, రేవతి, జయమ్మ, కుర్తం సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఒకటే గది..ఐదు తరగతులు
-
ఒక్క ఛాన్స్ కోసం.. ఎంత కష్టపడాలో
ముంబై: చిత్రపరిశ్రమతో సంబంధంలేని తనలాంటి వారికి సినిమాల్లో నటించేందుకు ఒక్క అవకాశం రావాలంటే ఎంతో కష్టపడాలని బాలీవుడ్ నటి కృతీ కుల్హారి చెబుతోంది. సినిమాల్లో నటించేందుకు అవకాశం వచ్చినా, ప్రతిభను నిరూపించుకుంటేనే మళ్లీ అవకాశాలు వస్తాయని, లేకుంటే సినిమాల్లో కొనసాగడం కష్టమని వెల్లడించింది. వారసుల పిల్లలకు అయితే సులభంగా అవకాశాలు వస్తాయని, తనలాంటి వారి పరిస్థితి పూర్తిగా భిన్నమని వెల్లడించింది. ’ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా ప్రతిభను చూడండి’ అన్నట్టుగా తాపత్రయపడతారని చెప్పింది. తనకు సినిమాల్లో నటించే అవకాశం రాకుంటే చాలామందిలా అనామకురాలిగా ఉండేదాన్నని కృతి పేర్కొంది. కిచ్డీ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన కృతికి ’పింక్’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించే అవకాశం వచ్చింది. అమితాబ్‌తో కలసి నటించడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నానని, దాన్ని మాటల్లో చెప్పలేనని అంది. -
ప్రియుడి కోసం చైనా యువతి మౌనపోరాటం
-
కాంగ్రెస్‌ను వెంటాడుతున్న దావూద్నీడ
-
ఆకాశంలో, పోరులో సగం... అధికారంలో?!
(సందర్భం) తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో ఏడాది పాలన కూడా గడిచింది. ఏడాది దొర ల పాలన గడిచిందనటం సబ బేమో. ఎందుకంటే అరవై ఏళ్ల తెలంగాణ పోరాటం సామా జిక న్యాయం కోసం జరిగింది. 2009 నుంచి 2014 వరకు సామాజిక, ప్రజాస్వామిక నినాదాల మీద జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా మలిదశ (1996) తెలంగాణ ఉద్య మం నడిచింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ లకు అధికారంలో వాటా కోసమనే సామాజిక న్యాయం డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉంది. అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగం కావటం వలన రాబోయే తెలంగాణలో వారి వాటా ఉండాలని భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడిన శక్తులకు అన్యాయం జరిగింది.ఆ కాలంలో ఉదాసీనంగా లేదా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు, శక్తులకు అధికారం లో వాటా దక్కింది. ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఇతర వృత్తుల ప్రజలు పోరాడారు. ఇక్కడ ప్రస్తావించిన అన్ని రంగాల వారితో కలసి స్త్రీలు కూడా సగభాగమై పాల్గొన్నారు. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలు అన్నిటా అన్యాయానికి గురైనట్లే తెలంగాణలో కూడా గురయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ జనాభాలో రెండు కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఆకాశంలో సగంగా ఉన్న వీళ్లు పోరాటంలో కూడా సగమైనారు. తెలంగాణలో స్త్రీల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఎదిరించి యుద్ధం చేస్తూ అమరులైన సమ్మక్క-సారక్కల వారసత్వాన్ని వారు అందిపుచ్చుకు న్నారు. నైజాం పరిపాలనలో విసునూర్ రామచంద్రారెడ్డి గూండాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి నాళ్లలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. ఆరుట్ల కమ లాదేవి మరొక అద్భుత ఉదాహరణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటై దూసుకొచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. తన పాతిక సంవత్సరాల జీవితాన్ని తెలం గాణ రాష్ట్రం కోసం అర్పించింది. ఆమెతో పాటు ఎంతో మంది దళిత, బీసీ, ఆదివాసీ, స్త్రీ కళాకారులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టారు. ఆ ఉద్యమాల పునా దుల మీదనే 2001లో టీఆర్ఎస్ పుట్టింది. 2009 నుంచి 2013 వరకు జరిగిన పోరాటంలో కూడా మంజుల (వరంగల్), రాధ (కరీంనగర్), కావలి సువర్ణ (పాలమూరు), కురువ సరిత (రంగారెడ్డి), చామంతి శ్రుతి (నిజామాబాద్) వంటి ఎందరో విద్యార్థి నులు ఆత్మబలిదానంతో ఉద్యమ దీపాన్ని వెలిగించారు. ప్రత్యేక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పా టుకు కావాల్సిన మెజారిటీతో గెలిచింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అతడే గద్దెనెక్కి కూర్చున్నాడు. పైగా 66 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మహిళలకు మంత్రిపదవి దక్కని మంత్రివర్గం ఒక్క కేసీఆర్‌దే. ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, లోక్‌సభ స్పీకర్‌గా కూడా ఇప్పుడు మహిళలు అవకాశం పొందారు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎంతో కొంత మహిళలకు అధికారంలో భాగస్వామ్యం దక్కింది. కాని పోరాట చైతన్యం ఉన్న తెలంగాణలో పోరాడిన మహిళలకే అధికారంలో వాటా దక్కక పోవటం చూస్తే మగ పెత్తనం ‘దొరల’ రాజ్యం నడుస్తున్నదని అర్థమవుతుంది. టీఆర్ఎస్లో బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖానాయక్, పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, కొండా సురేఖ లాంటి ఆరుగురు మహి ళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్క లేదు. పైగా కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవని తుమ్మ ల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహ రిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి వలస వచ్చిన శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి కట్టబె ట్టారు. మహిళలకు మంత్రి పదవి వస్తే ఈ రాష్ట్రంలో మహిళలందరి జీవితాలూ మొత్తం మారిపోతాయని కాదు కాని, ఇది తెలంగాణలోని రెండు కోట్ల మహిళల ఆత్మగౌరవం సమస్య. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ వంటి సామాజిక విప్లవకారుల స్ఫూర్తితో సమ్మక్క -సారక్క, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత పోరాట స్ఫూర్తితో మంత్రివర్గంలో చోటుతో పాటు అన్ని రంగాలలో స్త్రీలకు 50 శాతం వాటా దక్కటం కోసం పోరాటం చేయటం తప్ప మరో మార్గంలేదు. తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, ప్రజాస్వామికవాదులు, మహిళా ఉద్యమ నాయకులు, విప్లవకారులు ఈ న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. (నేడు హైదరాబాద్‌లో జరిగే మహిళా గర్జన సందర్భంగా...) (వ్యాసకర్త మందకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు) మొబైల్: 94407 23808 -
ఆ నటికి కుక్కలంటే భయమట
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి, సామాజిక వేత్త షబానా అజ్మికి కుక్కలంటే భయమని చెప్పింది. ప్రస్తుతం నీరజ్ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కుక్కలతో చిత్రించాల్సి ఉండి వాటిని తీస్తున్న సమయంలో చాలా అసహనంగా అనిపిస్తుందంట. సినిమా సెట్లో కుక్కలు తన దగ్గరకు రావడం, తన స్పర్షించడం వంటివి చూసి కొంత భయం, కొంత చిరాకు, కొంత అసహనం వస్తుందని చెప్పారు. తాను ఎప్పుడు కుక్కలతో స్నేహం చేయలేదని, అలాగని తనకు కుక్కలంటే ఇష్టం లేదని కాదని, భయంవల్లే ఇలాంటి పరిస్థితి అని చెప్పుకొచ్చింది. -
కేసీ నీటి కోసం పోరాటం
సాక్షి ప్రతినిధి, కడప: కేసీ కెనాల్ ఆయకట్టుదారుల భవిష్యత్ ప్రశ్నార్థక ం కావడంతో వైఎస్సార్సీపీ పోరాటానికి సన్నద్ధమవుతోంది. శ్రీశైలం జలాశయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాయి. కనీస నీటిమట్టం నిల్వకు సైతం పాతర వేస్తున్నారు. రాయలసీమ వాసులకు తాగునీరు దక్కేందుకు కూడా ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు. పాలకుల నిర్వాకంపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పిడికిలి బిగించనున్నారు. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును కలిసి పరిస్థితిని వివరించనున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌భాష, రాచమల్లు ప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టి జయరాములు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి మంత్రిని కలిసి జిల్లా తాగు, సాగునీటి అవసరాలపై వివరించనున్నారు. శ్రీశైలంలోకి నీటి ప్రవాహం తగ్గి, నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు నీరు అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పాదన చేపట్టేవారు. ఫిబ్రవరి ఆఖరు వరకు శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కనీసస్థాయి నీటిమట్టాన్ని ఉంచేవారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ శ్రీశైలం కుడి, ఎడమ గట్ల వద్ద రెండు ప్రభుత్వాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేపట్టాయి. ఫలితంగా అక్టోబర్ చివరినాటికే నీటిమట్టం కనీసస్థాయికి చేరుకుంది. ఫలితంగా కడప, కర్నూలు జిల్లాల్లోని 2.50 లక్షల ఎకరాల కేసీ కెనాల్ ఆయకట్టు, 1.60 లక్షల ఎస్ఆర్బీసీ ఆయకట్టు, 3.25 లక్షల ఎకరాల తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీరు విడుదల ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ ప్రకటనతోనే..... సెప్టెంబర్ మొదటి వారంలో నీరు విడుదల చేస్తామని, రైతులు పంటల సాగు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయకట్టు రైతులు వరితో పాటు వివిధ పంటలు సాగుచేశారు. కేసీ కెనాల్ కింద వరినాట్లు పూర్తయ్యాయి. ఈ పంటలు చేతికి అందాలంటే జనవరి 15వ తేదీ వరకైనా శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని ఉంచాలి. రాయలసీమ ప్రాంతంలోని ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీల నీటిని, చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీల నీటిని, తెలుగుగంగ ఆయకట్టుకు 25 టీఎంసీల నీటిని, కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు 10 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి కేటాయింపులు చేపట్టారు. ఈ నీటిలో ఇంత వరకు ఎస్ఆర్బీసీకి 8 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 10 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నీటిని జనవరి 15 వరకు విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచాలి. వైఎస్సార్ జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ నీరు కూడా విడుదల కాలేదు. గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌కు ఈయేడు 6 టీఎంసీలు, మైలవరం రిజర్వాయర్‌కు 3 టీఎంసీలు విడుదల చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేట్లు కనిపించడంలేదు. అంతేకాకుండా హెచ్ఎల్సీ ద్వారా వైఎస్సార్ జిల్లాలోని పీబీసీకి 4 టీఎంసీలు, మైలవరానికి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అవి ఏనాడూ వైఎస్సార్ జిల్లాకు రావడం లేదు. ఈ పథకాలకు అందాల్సిన నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. కేటాయింపులు జరిగిన నీటిని ఎస్ఆర్బీసీ ద్వారా గండికోట, మైలవరం రిజర్వాయర్లకు మళ్లించాలి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జనవరి 15 వరకు శ్రీశైలంలో 854 అడుగల నీటి మట్టం ఏమాత్రం తగ్గకుండా చర్యలు తీసుకుని రాయలసీమ జిల్లాలకు సాగునీటిని అందించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. ఈ విషయాలన్నీ చర్చించుకునేందుకు గాను కృష్ణాబోర్డును రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసినా అటు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లకు అనువుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. -
''నిత్యవసర వస్తువులు దొరకని పరిస్థితి''
-
విద్యుత్ కోసం రైతుల ఆందోళన
చింతలపూడి, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయూలని మండలంలోని వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాలకు చెందిన రైతులు చింతలపూడి సబ్‌స్టేషన్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. కార్యాలయం గేటుకు తాళాలు వేసి, సిబ్బందిని బయటకు పంపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి అధికారులను నిలదీశారు.రోజుకు 4 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని, సబ్‌స్టేషన్ పరిధిలో మొక్కజొన్న, పసుపు, మిర్చి, పొగాకు, కూరగాయల తోటలు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సం బంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని, కనీసం అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు తోటలకు 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులు, ఆహార పంటలకు సరఫరా చేయకపోవడం దారుణమని రైతు గోలి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోరుు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారితో చర్చించారు. ఈలోగా వెలగలపల్లి గ్రామానికి చెందిన గోలి లోకేశ్వరరెడ్డి, వంగాల సోమిరెడ్డిలు పక్కనే ఉన్న విద్యుత్ టవర్ ఎక్కి నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని బలవంతంగా కిందకు దింపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.