ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!
ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు
నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.
నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.
నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదు
విలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను.
ఐదు స్టార్ హోటల్‌లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలో
నేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.
నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.
ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.
చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారం
ఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు పనికిరావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. "మరణం తప్ప నిజమైనది ఏదీ లేదు."
అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం.ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్యమైన విలువను నొక్కి చెప్పింది.
డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్‌నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది. ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది.
ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
Comments
Please login to add a commentAdd a comment