ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి, సామాజిక వేత్త షబానా అజ్మికి కుక్కలంటే భయమని చెప్పింది. ప్రస్తుతం నీరజ్ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కుక్కలతో చిత్రించాల్సి ఉండి వాటిని తీస్తున్న సమయంలో చాలా అసహనంగా అనిపిస్తుందంట. సినిమా సెట్లో కుక్కలు తన దగ్గరకు రావడం, తన స్పర్షించడం వంటివి చూసి కొంత భయం, కొంత చిరాకు, కొంత అసహనం వస్తుందని చెప్పారు. తాను ఎప్పుడు కుక్కలతో స్నేహం చేయలేదని, అలాగని తనకు కుక్కలంటే ఇష్టం లేదని కాదని, భయంవల్లే ఇలాంటి పరిస్థితి అని చెప్పుకొచ్చింది.