తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా పరిచయమైన నటుడు రవికిషన్. అల్లు అర్జున్ మూవీ రేసుగుర్రంతో టాలీవుడ్ ప్రియులను అలరించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ ఏడాది అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లపట్టా లేడీస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ పోలీసు అధికారి పాత్రలో నటించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికిషన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దాదాపు 34 ఏళ్లపాటు పోరాటం చేశానని వెల్లడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న రవికిషన్ వెనుక ఎంతో కృషి దాగి ఉందని వివరించారు.
రవికిషన్ మాట్లాడుతూ.. 'నేను పూజారి కొడుకుని. నాకు మా నాన్న ఆధ్యాత్మికత, నిజాయితీ గురించి మాత్రమే నేర్పారు. నేను థియేటర్‌లో ఉండేవాడిని. నా చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించా. దీంతో నాన్న నన్ను కొట్టారు. ఆ తర్వాత కోపంతో నువ్వు నర్తకి అవుతావని ఎగతాళి చేశారు. కానీ సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ముంబయిలో చెప్పుల్లేకుండా నడిచా. చిన్నరూమ్‌లో ఉండేవాడిని. నాకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కానీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మాత్రం తెలుసు' అని అన్నారు.
తాను తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని రవికిషన్ తెలిపారు. అలాగే మీరు నన్ను బుల్లితెరపై కూడా చూస్తారని అన్నారు. నటనలో సహజత్వాన్ని తీసుకురావాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ 90వ దశకంలో వచ్చారని.. నా ప్రయాణం మొదలైంది కూడా అప్పుడేనని వెల్లడించారు. కానీ వారి జీవితాల్లో త్వరగా ఎదిగారని.. వారిలా ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికిషన్ తెలిపారు. కాగా.. ఆయన నటించిన లపట్టా లేడీస్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment