Race Gurram
-
వీళ్లు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు: 'రేసుగుర్రం' విలన్
'రేసుగుర్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రవికిషన్. స్వతహాగా ఇతడికి బిహార్. భోజ్‌పురి భాషలో బోలెడన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటం వల్ల నటన తగ్గించేశాడు. రీసెంట్గా ఢిల్లీలోని సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఇతడు.. తన జూనియర్లు భోజ్‌పురి ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)'ఇప్పుడొస్తున్న చాలామంది నటీనటులు భోజ్‌పురి చిత్రపరిశ్రమ ఖ్యాతి నాశనం చేస్తున్నారు. నేను భోజ్‌పురి ఇండస్ట్రీలో మూడో జనరేషన్లో వచ్చాను. నా తర్వాత వచ్చేవాళ్ల కోసం అన్ని ఏర్పాటు చేశాం. కానీ వాళ్లీ దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. భోజ్‌పురి 25 కోట్లమంది మాట్లాడే భాష. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను''భోజ్‌పురి ఇండస్ట్రీ.. చాలామందికి జాబ్స్ కల్పిస్తోంది. అయినాసరే చిన్నచూపు చూస్తున్నారు. ఈ రోజు ఇండస్ట్రీలో లక్ష మందికి పైగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు' అని రవికిషన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో భోజ్‌పురి నటుడిగా ఈయన కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ రేసుగుర్రం, సుప్రీం, సైరా తదితర సినిమాలలో నటించారు. (ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
చిన్నగదిలో బతికా.. నాన్న కూడా అవమానించారు: రేసుగుర్రం నటుడు
తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా పరిచయమైన నటుడు రవికిషన్. అల్లు అర్జున్ మూవీ రేసుగుర్రంతో టాలీవుడ్ ప్రియులను అలరించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ ఏడాది అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లపట్టా లేడీస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ పోలీసు అధికారి పాత్రలో నటించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికిషన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దాదాపు 34 ఏళ్లపాటు పోరాటం చేశానని వెల్లడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న రవికిషన్ వెనుక ఎంతో కృషి దాగి ఉందని వివరించారు.రవికిషన్ మాట్లాడుతూ.. 'నేను పూజారి కొడుకుని. నాకు మా నాన్న ఆధ్యాత్మికత, నిజాయితీ గురించి మాత్రమే నేర్పారు. నేను థియేటర్లో ఉండేవాడిని. నా చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించా. దీంతో నాన్న నన్ను కొట్టారు. ఆ తర్వాత కోపంతో నువ్వు నర్తకి అవుతావని ఎగతాళి చేశారు. కానీ సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ముంబయిలో చెప్పుల్లేకుండా నడిచా. చిన్నరూమ్‌లో ఉండేవాడిని. నాకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కానీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మాత్రం తెలుసు' అని అన్నారు.తాను తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని రవికిషన్ తెలిపారు. అలాగే మీరు నన్ను బుల్లితెరపై కూడా చూస్తారని అన్నారు. నటనలో సహజత్వాన్ని తీసుకురావాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ 90వ దశకంలో వచ్చారని.. నా ప్రయాణం మొదలైంది కూడా అప్పుడేనని వెల్లడించారు. కానీ వారి జీవితాల్లో త్వరగా ఎదిగారని.. వారిలా ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికిషన్ తెలిపారు. కాగా.. ఆయన నటించిన లపట్టా లేడీస్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా?.. సరికొత్త వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్నాడు!
రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా ప్రేక్షకులను అలరించాడు. తనదైన నటనతో, కామెడీతో టాలీవుడ్ అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత కిక్-2, సుప్రీమ్, 90 ఎంఎల్, లై చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో చిత్రాలతో బిజీగా ఉన్న రవికిషన్.. గతేడాది మిషన్ రాణిగంజ్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రవి కిషన్, నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో మామ్లా లీగల్ హై అనే కామెడీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోర్టు రూమ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్‌ను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ పాండే దర్శకత్వంలో రూపొందించారు. కాగా.. ఈ సిరీస్ మార్చి 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
రాత్రికి రమ్మంది.. నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: నటుడు
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ నేను దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని, నీ పనితనాన్ని నిజాయితీగా నిరూపించుకోవాలని మా నాన్న నాకు నేర్పించాడు. నా దగ్గర టాలెంట్ ఉంది, అందుకే షార్ట్‌కర్ట్ నేను ఎంచుకోలేదు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. సినీపరిశ్రమలో ఉన్న ఓ మహిళ కాఫీ తాగడానికి రాత్రి రావాలని పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా పొద్దున్నో, సాయంత్రమో కాఫీ తాగుదామంటారు. కానీ తను ప్రత్యేకంగా రాత్రి రావాలని నొక్కి చెప్పడంతో నాకు విషయం అర్థమైంది. వెంటనే నేను నో చెప్పాను. తనిప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు వెల్లడించలేను' అని పేర్కొన్నాడు. కాగా రవికిషన్‌కు నటుడు కావాలని చిన్నప్పటినుంచి కోరికగా ఉండేది. తండ్రికి అతడి కోరిక నచ్చలేదు కానీ తల్లి మాత్రం రవికిషన్‌కు మద్దతిచ్చేది. ఓ రోజు ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబై పంపించేసింది. అలా తల్లి సపోర్ట్‌తో, తన కష్టంతో గొప్ప నటుడిగా ఎదిగాడు. భోజ్‌పురిలో బాగా ఫేమస్ అయిన రవి కిషన్.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. గతేడాది రిలీజైన ఖాఖీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. -
అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన టాప్ 5 చిత్రాలు..
అల్లు అర్జున్... ఆయన అభిమానులకు ఈ పేరొక పవిత్ర మంత్రం. బన్నీ సినిమా రిలీజైందంటే చాలు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయేలా సందడి చేస్తుంటారీ ఫ్యాన్స్. అలాంటిది రేపు ఆయన బర్త్‌డే అంటే వీళ్ల హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు చోట్ల పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ర్యాలీలు తీస్తూ స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. వీళ్లు ఇంతగా అభిమానిస్తున్న ఆ హీరో కూడా మామూలోడు కాదు. ఏ సినిమా జనాలకు నచ్చుతుందో, ఎలాంటి కథలైతే ప్రేక్షకులకు బోర్ కొట్టవో, ఏవి తీస్తే అభిమానులు ఎగిరి గంతులేస్తారో అచ్చంగా అలాంటి సినిమాలే ఎంచుకుంటాడు. అవలీలగా హిట్లు సాధిస్తాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో అమాయక చక్రవర్తిగా కనిపించిన అల్లు అర్జున్ 'దేశముదురు'లో సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అదుర్స్ అనిపించుకున్నాడు. తండ్రిని ఆరాధించే కొడుకుగా, ప్రేయసి కోసం పాట్లు పడే ప్రేమికుడిగా, అన్న కోసం ఎవరినైనా ఎదిరించే తమ్ముడిలా, ఆశయం కోసం అన్నీ వదులుకునే యువకుడిగా.. ఇలా అన్నిరకాల పాత్రల్లోనూ ఒదిగిపోయాడాయన. డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ను సృష్టించే ఈ హీరో కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం.. సెన్సేషన్ క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అల వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామా, కామెడీ పార్ట్ మెండుగా ఉన్న ఈ చిత్రం జనాలకు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు థమన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. గతేడాది సంక్రాంతికి బరిలో దిగిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లు దాటేసిన సరైనోడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుడి ముందుకు వచ్చింది. రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి రూ.127 కోట్లు వచ్చాయి. బాక్సాఫీస్‌ను దున్నేసిన దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఒక పాత్రలో బన్నీ పూజారిగా కనిపిస్తే, మరో పాత్రలోఅండర్కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇందులో కిషోర్ కామెడీ, పూజా హెగ్డేతో బన్నీ కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సుమారు రూ.115 కోట్ల వసూళ్లు కురిపించింది. శభాష్ అనిపించుకున్న సన్నాఫ్ సత్యమూర్తి విలువలే నా ఆస్తి అంటూ తండ్రి సిద్ధాంతాన్ని నమ్ముతాడు బన్నీ. ఇందులో అన్నీ ఉన్న శ్రీమంతుడి స్థాయి నుంచి ప్రతీది కోల్పోయిన నిరుద్యోగి మారతాడు బన్నీ. విలువల కోసం అన్నింటినీ వదులుకునే వ్యక్తిగా బన్నీ నటన అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్, సమంత క్యారెక్టరైజేషన్, ఉపేంద్ర, స్నేహ, నిత్యామీనన్‌లు కనిపించే సీన్లు ప్రేక్షకుడిని వినోదాన్ని పంచుతాయి. ఈ చిత్రం సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోయి రూ.90 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెట్టిన రేసుగుర్రం 2014లో ఈ సినిమాలో బన్నీ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బన్నీ రౌడీతో తలపడే సన్నివేశాలు, అన్నతో ఫైట్ చేసే తీరు, స్పందనగా శృతి హాసన్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ప్రేక్షకుడికి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రూ.60 కోట్లు వచ్చాయి. చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్ కోహ్లిని ఎత్తిపడేసిన అనుష్క.. వీడియో వైరల్! -
ద్యావుడా, అల్లు అర్జున్ను ఇలా వాడుకున్నారా?
సన్నివేశం.. కారులో వెళుతున్న పోలీసు కుటుంబాన్ని యాక్సిడెంట్ చేసి చంపేందుకు ప్లాన్ వేస్తాడు మద్దాలి శివారెడ్డి. ఎదురుగా యమస్పీడుతో వస్తున్న వాహనాన్ని చూసి భయపడిపోయిన ఆ ఫ్యామిలీ కారులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కారు డోర్లు లాక్ అయిపోతాయి. ఇక చావు తథ్యం అని అందరూ కళ్లు మూసుకోగా వారిని కాపాడేందుకు బుల్లెట్లా బైక్ మీద దూసుకొచ్చి విలన్స్‌కు షాకిస్తాడు ఓ యంగ్ పోలీస్ అదేనండీ అల్లు అర్జున్. అతడిని చూడగానే రౌడీలు సడన్ బ్రేక్ వేస్తారు. ఇంకేముందీ, కారు అద్దాల్లోంచి గాల్లోకి లేచి కొద్ది అడుగుల దూరంలో పడిపోతారు విలన్లు. ఈ సీన్ ఏ సినిమాలోనిదో ఈపాటికే అర్థమై ఉంటుంది. బన్నీ కెరీర్లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'రేసుగుర్రం'లో వచ్చే ఓ కీలక సన్నివేశమిది. ఇప్పుడిదంతా ఎందుకంటే కేరళ పోలీసులు ఈ సీన్‌ను ప్రజల రక్షణ కోసం వాడేసుకున్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో పోల్ యాప్ మీ దగ్గరుంటే మిమ్మల్ని కూడా మేము అలాగే కాపాడుకుంటాం అని చెప్తున్నారు పోలీసులు. కేవలం ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మీ ముందు వాలిపోతామని చెప్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా బన్నీని ఇలా వాడుకున్నారన్నమాట అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ పోలీసుకు హెల్మెట్ కూడా ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పిస్తున్నారు. പോൽ ആപ്പ് - പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc — Kerala Police (@TheKeralaPolice) February 19, 2021 చదవండి: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ.. అతడే డైరెక్టర్? పుష్ప: హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్.. -
‘రేసుగుర్రం’ రిపీట్ కానుందా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రేసుగుర్రం’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన ఈ చిత్రం అప్పట్లో రికార్డుల సునామీ సృష్టించింది. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందట. ‘రేసుగుర్రం’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీతో కలిసి బన్ని కోసం ఓ కథను స్దిదం చేస్తున్నారట సురేందర్ రెడ్డి. ‘రేసుగుర్రం’కు మించిన పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో వంశీ-సురేందర్ ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్న బన్ని ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’కు కమిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని సురేందర్ రెడ్డి భారీగా ప్లాన్ చేస్తున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి మరో చిత్రాన్ని ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు. పలువురు హీరోలతో కథాచర్చలు జరిపినప్పటికీ కుదరలేదని టాలీవుడ్ టాక్. ఇక వీరిద్దరి కలయికలో మరో చిత్రం రావాలని బన్ని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. రేసుగుర్రం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. చదవండి: హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆలయ ఘటనలతో... ద్యావుడా!
‘రేసుగుర్రం’ చిత్రంలో అల్లు అర్జున్ పలికిన ‘ద్యావుడా’ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య ముఖ్య పాత్రల్లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో శాన్వీ క్రియేషన్స్, అమృత సాయి ఆర్ట్స్ పతాకాలపై హరికుమార్ రెడ్డి.జి నిర్మించిన చిత్రం ‘ద్యావుడా’. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, లోగోను ‘హ్యాపీడేస్’, ‘వంగవీటి’ ఫేమ్ వంశీ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘దైవాంశ పరమైన అంశంతో ముడిపడి ఉన్న చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా చిత్రమిది. ఇండియాలోని కొన్ని దేవాలయాల్లో జరిగిన సంఘటనలతో తెరకెక్కించాం. నటీనటులు కొత్తవారైనా బాగా చేశారు’’ అని దర్శకుడు చెప్పారు. ‘నాటుకోడి’ చిత్ర నిర్మాత బందరు బాబీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరణ్. కె, సోను. కె. -
నువ్వు మేకవన్నె పులివి రాజా!
మాట కంఠంలోనే ఆపెయ్ నీ మనసులో ఏమున్నా... అది లోనే దాచెయ్ బయటికి రానీకు. దాటి బయటికి వచ్చిందా... వస్తే? బాడీ... పార్ట్స్ పార్ట్స్‌గా విడిపోవచ్చు. అంతా మాత్రాన... మద్దాలి శివారెడ్డి అన్నీ సూటిగా చేస్తాడని కాదు. అవసరమైతే...కాళ్లు పట్టుకుంటాడు. ‘నువ్వు నా తమ్ముడిగా ఎందుకు పుట్టలేదురా? నీ కాళ్లకు దండం పెడతా!’ అంటూనే కాళ్లు లాగి అవతలి వ్యక్తిని కింద పడేయగలడు. వికటాట్టహాసం ఒకటి చేసి... ‘మంత్రి శివారెడ్డిని మళ్లీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా ఇది రౌడీ శివారెడ్డి పవర్’ అని తన పవర్ ఏమిటో చూపగలడు. ‘రేసుగుర్రం’ సినిమాతో మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సరికొత్త విలన్ రవి కిషన్. ‘లక్’ సినిమాలో రవి కిషన్ డెరైక్టర్ సురేందర్‌రెడ్డికి బాగా నచ్చాడు. ముఖ్యంగా కళ్లు. అలా ‘రేసుగుర్రం’ సినిమాతో ‘మద్దాలి శివారెడ్డి’గా తెలుగు చిత్రసీమకు ‘ఉత్తమ విలన్’గా దిగుమతి అయ్యాడు. ‘కిక్-2’లో సోల్మాన్సింగ్ ఠాకూర్, ‘సుప్రీమ్’ సినిమాలో బీకుగా రవికిషన్ మనకు మరింత దగ్గరయ్యాడు. హీరోగా నటించడం కంటే విలన్‌గా నటించడమే కష్టం అంటారు. ఆ కష్టం రుచి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడేమో రవికిషన్. భోజ్‌పురి ఫిల్మ్ సూపర్‌స్టార్ అయిన రవి కిషన్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో విలన్‌గా కనిపిస్తున్నాడు. రవి శరీర దారుఢ్యానికి ఆకర్షించే కళ్లు తోడై డైలాగులు బాంబుల్లా పేలుతున్నాయి. విలనిజం ఇరగ పండుతుంది. ‘రౌడీయిజం మా నాన్న దగ్గర నేర్చుకున్న. రాజకీయం నీ దగ్గర నేర్చుకున్న’ అనేది విలన్‌గా రవికిషన్ డైలాగ్. మరి నటన ఎక్కడ నేర్చుకున్నాడు? నటుడు ఎలా అయ్యాడు? ఆ స్టోరీలోకి వెళదాం పదండి.... ముంబైలోని శాంటాక్రాజ్లో ఒక చిన్న ఇంట్లో పుట్టాడు రవి. తండ్రికి చిన్న డైరీ బిజినెస్ ఉండేది. అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఆ వ్యాపారం మూతపడింది. అప్పుడు ఆయన తన మకాంను సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని జోన్పూర్కు మార్చాడు. చదువు మీద రవికి ఎంత మాత్రం ఆసక్తి ఉండేది కాదు. మరోవైపు చూస్తే...ఇంట్లో పేదరికం. దీపావళిలాంటి పెద్ద పండగలకు కూడా కొత్త బట్టలు కొనే స్థోమత ఉండేది కాదు. రవికి ఒక లక్ష్యం అంటూ ఉండేది కాదు. ‘గూండాగా మారుతానేమో’ ‘చనిపోతానేమో’ ‘నాకు పిచ్చిపడుతుందేమో’ ఇలా ఏవో పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడు. ఆరోజుల్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు బాగా చూసేవాడు. ఆ సినిమాలు రవిని బాగా ప్రభావితం చేశాయి. ‘నా వెనకాల ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. చదువు లేదు. టీచర్ లేడు. సినిమానే నా గురువు’ అనుకున్నాడు. ఆ గురువే తనకు నటనలో కూడా పాఠాలు నేర్పించింది. పదిహేడు సంవత్సరాల వయసులో తల్లి ఇచ్చిన ఐదొందల రూపాయలు తీసుకొని ముంబైకి వెళ్లిపోయాడు. పాత ఫ్రెండ్ హృదయ్షెట్టి రూమ్‌లో ఉన్నాడు. అతడే రవిని ఎందరో దర్శకులకు పరిచయం చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, తినడానికి భోజనం లేకుండా ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో తెలియదుగానీ బి-గ్రేడ్ ఫిల్మ్ ‘పీతాంబర్’లో నటించే అవకాశం వచ్చింది. ‘తేరే నామ్’ సినిమాతో రవి కిషన్‌కు కాస్త గుర్తింపు వచ్చింది. అందులో పూజారి పాత్ర వేశాడు. ఆ తరువాత కూడా పెద్ద గుర్తింపు లేదు. డబ్బులు లేవు. ఈ సమయంలోనే ఒక భోజ్‌పురి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘భోజ్‌పురి సినిమా నాకు గౌరవాన్ని, గుర్తింపును, డబ్బును ఇచ్చింది. నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది’ అని భోజ్‌పురి మీద కృతజ్ఞత చాటుకున్న రవికిషన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ విలన్‌గా గుర్తింపు పొందుతున్నాడు. -
'ధూమ్ 4'లో అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ధూమ్ 4తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ హీరోగా నటించిన ధూమ్ 4 త్వరలోనే బాలీవుడ్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదేంటి ధూమ్ 4 సినిమాలో బన్నీనా..? అది కూడా అప్పుడే రిలీజ్‌కు రెడీ అయ్యిందా...? అని ఆశ్చర్యపోకండి. అక్కడే ఉంది అసలు కథ. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా రేసుగుర్రం, ధూమ్ 4 పేరుతో హిందీలో రిలీజ్ అవుతోంది. తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి, సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా అరుదు. అయితే ఈసారి మాత్రం బన్నీ.., ధూమ్ టైటిల్‌తో మంచి పబ్లిసిటీనే సాధించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. శృతితో పాటు విలన్‌గా నటించిన రవికిషన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్‌లు నార్త్ ప్రేక్షకులకు సుపరిచితులు కావటంతో రేసుగుర్రం అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ఆ తర్వాతే ‘విజయ నిర్మల’ అయ్యా : విజయనిర్మల
‘‘మరో వందేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనివి విజయా వారి చిత్రాలు. మా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ప్రారంభోత్సవానికి ఆ స్టూడియోలో అమ్మోరు విగ్రహం సెట్ వేయించాను. నాగిరెడ్డిగారిని కెమెరా స్విచ్చాన్ చే సి, చక్రపాణిగారిని క్లాప్ ఇవ్వమని అడిగాను. కానీ చక్రపాణిగారు మాత్రం నాగిరెడ్డి హస్తవాసి మంచిది. ఆయననే క్లాప్ ఇవ్వమన్నారు. అలాగే చేశారు. అప్పుడు నాగిరెడ్డిగారు ‘‘ ‘పాతాళభైరవి’ సినిమాలోని పెద్ద విగ్రహం సెట్ కూడా ఇక్కడే వేశాం. ఆ చిత్రంలానే ‘అల్లూరి సీతారామరాజు’ కూడా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి’’ అని హీరో కృష్ణ చెప్పారు. ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందించే శ్రీ బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ప్రకటించారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా. వెంకటేశ్వరరావులకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డు ప్రదానం చేశారు. సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ- ‘‘విజయా వారి చిత్రాల్లో నటించాక విజయనిర్మల అయ్యాను. ‘షావుకారు జానకి’ చిత్రాన్ని నాగిరెడ్డిగారు తమిళంలో రీమేక్ చేశారు. అందులో జానకిగారు చేసిన పాత్రను నేనే చేశాను. ఈ సినిమాలో నేను ఎస్వీ రంగారావు పక్కన నటించాలి. కానీ, నేను చాలా పీలగా ఉన్నాననీ, ఆయనకు సరిజోడీగా ఉండనని ఎస్వీఆర్ వేరే అమ్మాయిని తీసుకోమన్నారు. కానీ నాగిరెడ్డిగారు ఎస్వీఆర్గారిని తీసేసి ఆయన పాత్రలో సుబ్బారావుగారిని ఎంపిక చేశారు. ఆయన పట్టుదలకు నిదర్శనం ఇది’’ అని చెప్పారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదును విజయా సర్వీసెస్ విభాగానికి అందజేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘నాగిరెడ్డిగారు మంచి చిత్రాలు తీసి ఉండకపోతే తెలుగు సినిమాకు అంత మంచి చరిత్ర ఉండేదే కాదు. ఈ అవార్డు నాకు ఒక బూస్ట్‌లా ఉపయోగపడుతుంది’’ అని చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ అవార్డు కమిటీ జ్యూరీ సభ్యుల్లో ఒకరైన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ- ‘‘ఓ నిర్మాతకు సత్కారం చేయడం నిజంగా దేశంలో ఏ సంస్థ చేయలేదు. కానీ విజయా సంస్థ వారు చేయడం, అందులో నాకూ భాగస్వామ్యం కల్పించడం నిజంగా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశానికి ముందు విజయా వారి చిత్రాల్లోని అలనాటి పాటలతో జరిగిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని రావు బాలసరస్వతి, సింగీతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘రేసు గుర్రం’కి బి. నాగిరెడ్డి పురస్కారం
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో కళాఖండాలు నిర్మించిన బి. నాగిరెడ్డి స్మారకంగా ప్రతి ఏటా ఓ సకుటుంబ వినోదాత్మక చిత్రానికి జాతీయ పురస్కారం అందిస్తున్న విషయం తెలిసిందే. 2014కు సంబంధించి బి. నాగిరెడ్డి జాతీయ పురస్కారం ‘రేసుగుర్రం’ని వరించింది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరిపే వేడుకలో కృష్ణ, విజయనిర్మల చేతుల మీదగా చిత్రనిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని నాగిరెడ్డి కుమారుల్లో ఒకరైన బి. వెంకట్రామిరెడ్డి చెప్పారు -
మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు
‘‘మా అబ్బాయి అయాన్ పుట్టిన తర్వాత ‘రేసు గుర్రం’ విడుదలైంది కాబట్టి, తనవల్లే ఆ చిత్రం ఘనవిజయం సాధించిందని అంటే దర్శకుడు సురేందర్‌రెడ్డి అంత ఆనందపడకపోవచ్చు. ఎందుకంటే, తన ఏడాది కష్టం, ఇతర చిత్రబృందం శ్రమ తాలూకు ఫలితమే ఈ విజయం. అఫ్కోర్స్ మా అబ్బాయి వచ్చి నా జీవితాన్ని మార్చేశాడనుకోండి. అది కాదనలేని విషయం’’ అని ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయాన్ పుట్టిన తర్వాత మునుపటికన్నా జీవితం ఇంకా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ చెబుతూ -‘‘అయాన్ని మొదటిసారి చూసిన క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని దేనితోనూ వెలకట్టలేం... దేనికీ దీటు కాదు. ఈ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తండ్రి కావాల్సిందే’’ అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రేసుగుర్రాలు
-
అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే!
శ్రుతీహాసన్ తన తోటి కథానాయికలందరికీ షాక్ ఇచ్చారు. ‘దక్షిణాదిన అందరూ అత్యంత ఇష్టపడుతున్న హీరోయిన్ ఎవరు?’ అనే అంశంపై ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందర్నీ వెనక్కు నెట్టి ఆమె మొదటి స్థానంలో నిలిచారు. బళ్లు ఓడలు అవ్వడం... అంటే ఇదే. గతంలో శ్రుతీహాసన్ పేరెత్తితే చాలు ‘ఐరన్‌లెగ్’ అనేవారు. అలాంటి హీరోయిన్ ఇలాంటి క్రెడిట్ సాధించడం నిజంగా విశేషమే. గబ్బర్‌సింగ్, ఎవడు, బలుపు, రేసుగుర్రం... ఇలా వరుసగా విజయాలను అందుకుంటూ తెలుగు సినీరంగంలో దూసుకుపోతున్నారు శ్రుతి. నిజానికి, గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 11వ స్థానంలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇప్పుడిలా ప్రేక్షకాదరణలో ప్రథమ స్థానం పొందడాన్ని బట్టి... శ్రుతి కెరీర్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. పెద్దగా విజయాలు లేకపోయినా తమన్నా ఈ సర్వేలో రెండోస్థానంలో నిలవడం విశేషం. శ్రీయ, ఇలియానా, హన్సిక, నయనతార, కాజల్ టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకోగా, ప్రస్తుతం తెలుగులో నంబర్‌వన్ హీరోయిన్గా భాసిల్లుతున్న సమంత 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సర్వేలో నంబర్‌వన్‌గా నిలిచినందుకు శ్రుతి చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు. -
కాపీ క్యాట్‌గా మారిన తమన్..?
-
వసూళ్లలో నంబర్ ఫోర్ మేమే!
తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా మా ‘రేసు గుర్రం’ నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ కెరీర్లోనే ఇది నంబర్ వన్ సినిమా. అమెరికాలో కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది’’ అని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) చెప్పారు. అల్లు అర్జున్, శ్రుతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డా.కె. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన నిర్మించిన ‘రేసుగుర్రం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో బుజ్జి ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం మీద నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. అందుకే చాలా ఏరియాల్లో మేమే సొంతంగా పంపిణీ చేశాం. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలు చవిచూపించింది. నాలుగో వారంలోనూ మంచి షేర్స్ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రియల్‌గా యాభై రోజులు ప్రదర్శితం కానున్న సినిమా ఇదే. త్వరలో భారీ ఎత్తున యాభై రోజుల వేడుక కూడా చేయనున్నాం’’ అని బుజ్జి తెలిపారు. ‘రేసు గుర్రం’ విజయానికి గల కారణాలను బుజ్జి విశ్లేషిస్తూ -‘‘ఈ కథలో దమ్ముంది. మంచి సెంటిమెంట్ ఉంది. బన్నీ, సురేందర్‌రెడ్డి ఈ సినిమా విజయానికి మూలస్తంభాలుగా నిలిచారు. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగా కలిసొచ్చింది’’ అన్నారు. ఇతర ప్రాజెక్టుల గురించి బుజ్జి వివరిస్తూ -‘‘నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తీస్తున్న సినిమా సుమారు నలభై శాతం పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొత్త హీరో హీరోయిన్లతో ఓ సినిమా చేయబోతున్నాం. సునీల్ హీరోగా రచయిత విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్‌తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సూర్య-మురుగదాస్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నా. వీటన్నిటికీ కూడా ‘ఠాగూర్’ మధు నిర్మాణ భాగస్వామి’’ అని తెలిపారు. మీపై పొగరుబోతు అనే ముద్ర ఉండటానికి గల కారణమేమిటని అడిగితే -‘‘ఇప్పుడు చాలామంది నిర్మాతలు కేవలం పెట్టుబడిదారులుగానే మిగిలిపోతున్నారు. నాలాంటి కొంతమంది మాత్రమే సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ జోక్యాన్ని చూసి చాలామంది పొగరు అనుకుంటున్నారు. అయినా ఏం ఫర్లేదు. సినిమా బాగా రావడానికి చివరి క్షణం వరకూ చిత్తశుద్ధితో పనిచేస్తాను’’ అని బుజ్జి సమాధానమిచ్చారు. -
ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ హవా!
అన్ని రంగాలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న రోజులివి. టాలీవుడ్ లో కూడా హీరోలందరూ సోషల్ మీడియాతో అనుసంధానమై ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో యువ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులను వెనక్కి నెట్టి అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో 40 లక్షల లైక్ లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మిగితా టాలీవుడ్ హీరోల కంటే అల్లు అర్జున్ కు ఫేస్ బుక్ లైక్స్ రెండింతలు ఎక్కువ. ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. అంతేకాక అల్లు అర్జున్ ఓ బిడ్డకు తండ్రైన సంగతి తెలిసిందే. -
నేను మగాణ్ణి అయితే.. లుంగీలే కట్టేదాన్ని!
‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటారు. అంటే.. తెలివితేటలున్న అందగత్తె అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికో ఉదాహరణగా శ్రుతిహాసన్ని చెప్పుకోవచ్చు. ఆమెతో మాట్లాడితే ఆత్మవిశ్వాసానికి చిరునామా అనిపించక మానదు. కెరీర్ ప్రారంభంలో ‘అన్‌లక్కీ’ అనిపించుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడు వరుస విజయాలతో ‘లక్కీ’ అనిపించుకుంటున్నారు. కానీ, తాను ఇవేమీ పట్టించుకోనని, ప్రతి సినిమాకీ శాయశక్తులా కృషి చేస్తానని శ్రుతి చెప్పారు. ఇటీవల విడుదలైన ‘రేసుగుర్రం’ విజయం ఆనందాన్నిచ్చిందంటున్న శ్రుతితో జరిపిన ఇంటర్వ్యూ... వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తోంది? ఆనందంగా ఉంది. కానీ పూర్తిగా ఆస్వాదించే సమయం మాత్రం లేదు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. దాంతో షూటింగ్స్‌తోనే సరిపోతోంది. ‘రేసుగుర్రం’లో ఉద్వేగాలను బయటపెట్టని స్పందనగా నటించారు కదా.. ఆ పాత్ర ఎలాంటి అనుభూతినిచ్చింది? నా నిజజీవితానికి భిన్నమైన పాత్ర ఇది. నా ఫీలింగ్స్‌ని బయటపెట్టేస్తుంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వడం, భయపడటం కూడా లోలోపలే. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. నిజానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి స్వభావం ఈ పాత్రలానే ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ, తను ఏం తీయాలనే విషయాల మీద స్పష్టత ఉంటుంది. ఈ సినిమాలో లుంగీ కట్టుకున్నారు...? లుంగీ కట్టడం ఇదే ప్రథమం. చాలా సౌకర్యవంతంగా అనిపించింది. ఒకవేళ మగాణ్ణి అయ్యుంటే ఎక్కువగా లుంగీలే కట్టుకునేదాన్ని ఆ మధ్య అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది కదా.. ఆ తర్వాతేమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆరోగ్యం విషయంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు మరింత జాగ్రత్త వహిస్తున్నా. ఎందుకంటే ఆ ఆపరేషన్ తర్వాత బరువు పెరుగుతారని, త్వరగా నీరసపడతారని విన్నాను. మరి.. బరువు పెరగకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు? ఎప్పటిలానే యోగా చేస్తున్నాను. వ్యాయామాలను మిస్ కాను. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. అలాగని కడుపు మాత్రం మాడ్చుకోను. ఓకె.. ఇప్పటివరకు మీ జీవితంలో జరిగినవాటిలో మర్చిపోలేని కొన్ని సంఘటనలను చెబుతారా? నా చిన్నప్పుడు జరిగిన రెండు సంఘటనల గురించి ముఖ్యంగా చెప్పాలి. నాన్నగారి వరల్డ్ టూర్లో భాగంగా నేను వేదిక మీద ఓ పాట పాడాను. అప్పుడు నా వయసు ఐదేళ్లు. స్టేజి మీద పాడటం అదే మొదటిసారి కావడంతో కొంచెం బెరుకుగా అనిపించింది. కానీ, పాడేశాను. మా చెల్లెలు పుట్టినప్పుడు నాకు భలే అనిపించింది. అప్పుడు నా వయసు నాలుగున్నరేళ్లు. చెల్లెలు పుట్టినప్పుడు ఆడుకోవడానికి మనకు మంచి బొమ్మ దొరికింది అనిపించింది. మామూలుగా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే దాదాపు గొడవ పడుతుంటారు. కానీ, మేమిద్దరం అస్సలు గొడవపడేవాళ్లం కాదు. అక్షర కథానాయికగా నటిస్తోంది కదా. సలహాలేమైనా తీసుకుందా? ఎందుకు తీసుకోవాలి? తన కెరీర్ తన ఇష్టం కదా. మీరు కూడా మీ అమ్మానాన్నల సలహా తీసుకోరనుకుంటా! అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిదేగా? మంచిదే. కాదనడంలేదు. కానీ, నేను చేయబోయే సినిమాల గురించి వారి సలహా తీసుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ఏ సినిమాకైనా 50, 60 రోజులు షూటింగ్ చేస్తాం. అన్ని రోజులు ఒకే యూనిట్‌తో ఉండబోయేది నేనే. మా అమ్మానాన్న కాదు. అలాంటప్పుడు ఏ యూనిట్‌తో సినిమా చేస్తే బాగుంటుందో నేనే నిర్ణయించుకోవాలి. ఇక, ఎలాంటి పాత్రలు చేయాలనే విషయం మీద ఎప్పుడైనా సందేహం వచ్చిందనుకోండి తప్పకుండా మా అమ్మానాన్నని అడుగుతాను. అంతేకానీ చిన్న చిన్న విషయాలకు కూడా వారి సలహా మీద ఆధారపడాలనుకోను. తెలుగు కాకుండా ఇతర భాషల్లో మీరు చేస్తున్న సినిమాల గురించి? తమిళంలో విశాల్ సరసన ‘పూజై’, హిందీలో ‘గబ్బర్’, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాల్లో నటిస్తున్నాను. సో.. విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తున్నారన్నమాట? అవును. కానీ, ఇదే బాగుంది. మా కుటుంబానికి సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేదు. వేరే ఏదైనా చేయాలన్నా మాకు తెలియదు. ఈ సినిమా ప్రపంచానికి దూరమైతే ఇంత ఆనందంగా మాత్రం బతకలేను. అందుకని నాకు విశ్రాంతి దొరక్కపోయినా ఫర్వాలేదు. ముంబయ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆ మధ్య ఓ వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడ్డాడు కదా. ఆ సంఘటనతో ఇక ఒంటరిగా ఉండకూదని ఫిక్స్ అయ్యారా? ఊహూ. జీవితం అన్నాక ఇలాంటివి జరగడం సహజం. అంత మాత్రాన బేలగా మారిపోతే మున్ముందు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలబడలేం. ఇలాంటి సంఘటనలు మరింత ధైర్యం పెంచడానికి ఉపయోగపడతాయన్నది నా అభిప్రాయం. నన్నంత సులువుగా ఎవరూ భయపెట్టెయలేరు. అంటే.. చాలా ధైర్యవంతురాలనుకోవచ్చా? కచ్చితంగా అనుకోవచ్చు. భయపడితే ఏమీ చేయలేం. భయపడకపోతే ఏదైనా సాధించగలుగుతాం. - డి.జి.భవాని -
'రేసు గుర్రం' సక్సెస్ మీట్
-
కొడుకు సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరబ్బా!
‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు లక్కీ. నిజానికి కూడా నేను లక్కీనే. నా జీవితంలోనే లక్ ఉంది. ఎందుకంటే... అందరూ ఒకటో మెట్టు నుంచి జీవితాన్ని మొదలుపెడతారు. కానీ నేను 11వ మెట్టునుంచి ప్రయాణం మొదలు పెట్టాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో... నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన చిత్రం ‘రేసుగుర్రం’. ఈ చిత్రం విజయోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘సాంకేతికంగా అద్భుతం ‘రేసుగుర్రం’. ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు బ్రహ్మానందానివే. ‘నీ సినిమాలో బ్రహ్మానందానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమేంటి?’ అని చాలామంది అన్నారు. సినిమాను హీరో ఒక్కడే మోయకూడదు. అందరూ మోయాలి. ఓ సినిమా విజయానికి కారణాలు చాలా ఉంటాయి. ఈ సినిమా విజయం విషయంలో అన్ని కారణాలూ సురేందర్‌రెడ్డే’’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాల్లో పూర్తి వినోదాత్మక చిత్రం ఇదేనని శ్రుతిహాసన్ చెప్పారు. 987 సినిమాల్లో నటించిన తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమా ‘రేసుగుర్రం’ అని బ్రహ్మానందం అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘కొడుకు సినిమా హిట్టయితే... ఆ కిక్కే వేరబ్బా. ఈ సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు భిన్నంగా తీర్చిదిద్దాడు. మంచి సినిమా తీయాలనే తపన గల నిర్మాత నల్లమలుపు బుజ్జి. ఇందులోని బన్నీ నటన చిరంజీవిగారిని గుర్తుచేసిందని కొందరు అంటుంటే... తండ్రిగా అమితానందం అనుభవించాను. బన్నీకి అది నిజంగా గొప్ప ప్రశంస’’ అన్నారు. ‘‘ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడతాను. కానీ... బ్లాక్ బస్టర్స్ మాత్రం నాకు అరుదుగానే వరించాయి. ఈ మధ్య నా దక్కిన గొప్ప విజయం ‘రేసుగుర్రం’. బన్నీ నాకు తమ్ముడు లాంటి వాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్ అద్భుతమైన బాణీలిచ్చాడు’’ అని సురేందర్‌రెడ్డి చెప్పారు. తనికెళ్ల భరణి, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం!
కథ పాతదా, కొత్తదా అనేది ముఖ్యం కాదు. బాగా తీశారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఆ విధంగా చూసుకుంటే... ‘రేసుగుర్రం’ నిజంగా మంచి సినిమా అంటున్నారు అల్లు అర్జున్. ఈ నెల 11న ‘రేసుగుర్రం’గా ప్రేక్షకుల ముందుకు దూసుకురానున్నారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం తనకు భారీ విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారాయన. నేడు బన్నీ పుట్టినరోజు. ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. మంచి హ్యాపీమూడ్‌లో ఉన్నట్టున్నారు? మరి హ్యాపీనే కదండీ... అల్లువారింట్లో మరో హీరో పుట్టాడంటున్నారు! ఊరుకోండి సార్.. బేబీని పట్టుకొని హీరో ఏంటి! వాడు పెరగనీయండి. తర్వాత చూద్దాం. అసలు నాన్న అయిన ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా ఆ మూడ్ నుంచి బయటకు రాలేదు. అమ్మాయిల్లో మీకుండే ఫాలోయింగే వేరు. ఇప్పుడు బన్నీ ఓ బిడ్డకు తండ్రి అంటే.. ఆ విషయాన్ని వాళ్లు తేలిగ్గా జీర్ణించుకోలేరేమో! మీకు తెలీదేమో... ఎంత మెచ్యూరిటీ ఉంటే అమ్మాయిలు అంత ఇష్టపడతారు(నవ్వుతూ) పేరేమైనా అనుకుంటున్నారా? లేదు... పేర్లయితే వింటున్నాను. మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కూడా మంచి పేరు ఉంటే చెప్పండని అడుగుతున్నాను. మంచి పేరు ఉంటే మీరు చెప్పినా పర్లేదు. జన్మ నక్షత్రాలను బట్టి కాదా పేర్లు పెట్టేది? ఆ సెంటిమెంట్లు మీకు లేవా? అసలు అలాంటివి నమ్మను నేను. పేరు బాగుంటే పెట్టేయడమే. ఇంతకీ అబ్బాయి అమ్మ పోలికా, నాన్న పోలికా? అప్పుడే అర్థం కాదు. ముందు ముందు తెలుస్తుంది (నవ్వుతూ) ‘రేసుగుర్రం’ విషయానికొద్దాం. ఈ టైటిల్ మీకే యాప్ట్ అని అంటున్నారు. మీరేం అంటారు? అదే నాకూ అర్థం కావడంలేదు. అందరూ ఇదే మాట. బహుశా, నాకు ప్రతి విషయంలోనూ వేగం ఎక్కువ. ఆ కారణంగానే... అలా ఉంటున్నారేమో. అసలు ఇది ఎలాంటి సినిమా? యాక్షన్ ఎంటర్టైనర్. అంతకు మించి చెబితే కిక్ ఉండదు. చూస్తేనే కరెక్ట్. యాక్షన్ ఎంటర్టైనర్లు చాలా చేశారుగా. మరి ఇందులో కొత్తదనం ఏంటి? ‘ఆర్య’ సినిమా బావుంటుంది. అలాగే కొత్తగా ఉంటుంది. ‘బన్నీ’ సినిమా బావుంటుంది. అయితే... పాతగా ఉంటుంది. రెండూ హిట్లే. సో... ఇక్కడ బాగుండటం ముఖ్యం. ‘రేసుగుర్రం’ కచ్చితంగా బావుంటుంది. కథలో పాత ఫ్లేవర్ కనబడకుండా ఎంతవరకూ కొత్తగా చూపించొచ్చో అంతవరకూ ప్రయత్నించాం. అందుకే దీన్ని భిన్నమైన సినిమా అని చెప్పను. రెగ్యులర్ ఫిలిమే. స్క్రీన్‌ప్లే కూడా సురేందర్‌రెడ్డి గత చిత్రాల్లా ఉండదు. స్ట్రయిట్ నేరేషన్ ఫిలిం. ఫ్యాష్బ్యాక్లు కూడా ఏమీ ఉండవు. అన్నదమ్ముల మధ్య సాగే కథ. మాస్‌కి కావాల్సిన అన్ని అంశాలు మాత్రం మెండుగా ఉంటాయి. బాలీవుడ్లో కొత్త కథలొస్తున్నాయి. వాణిజ్యపరంగా కూడా అవి విజయాలు చవిచూస్తున్నాయి. మీలాంటి హీరోలు పూనుకుంటే... ఇక్కడా మంచి సినిమాలొస్తాయి. ఎన్నాళ్లు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లు? కచ్చితంగా.. అందుకు నేనూ రెడీ. అయితే... అది నా ఒక్కడి చేతుల్లో లేదు. డెరైక్టర్ సైడ్ నుంచి కూడా రావాలి. దర్శకుడు ప్రయోగాత్మకంగా ఆలోచించగలగాలి. దాసరి, రాఘవేంద్రరావుగార్ల టైమ్‌లో ఓ వైపు బాపుగారు, కె.విశ్వనాథ్‌గారు ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వెళుతూ.. వాణిజ్యపరంగానూ విజయాన్ని అందుకోగల దర్శకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ మధ్య ‘క్వీన్’ సినిమా చూశాను. అద్భుతం అనిపించింది. అలా తీస్తే ఎక్కడైనా విజయం తథ్యం. ‘క్వీన్’ చూశాక ‘ఇలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నామనే నిర్వేదానికి లోనై ఉండాలే? యాక్టర్‌గా సినిమా చేయడం తేలిక, స్టార్‌గా సినిమా చేయడం కష్టం. ఎందుకంటే స్టార్‌కి రెస్పాన్సిబిలిటి ఎక్కువగా ఉంటుంది. అందరి శ్రేయస్సునూ గుర్తెరిగి ముందుకెళ్లాలి. కానీ బాలీవుడ్లో స్టార్లందరూ యాక్టర్లయిపోతున్నారు. పాత్రల కోసం ఏ రిస్కునైనా చేస్తున్నారు? అందుకే వాళ్లకు స్టార్డమ్ తగ్గిపోతోంది. అసలు బాలీవుడ్లో సల్మాన్, షారుక్, ఆమిర్, అక్షయ్, హృతిక్... తప్ప ప్రేక్షకులను హాలుకు రప్పించేవారు ఎవరున్నారు చెప్పండి? కానీ... మనకు పదిమంది దాకా ఉన్నారు. ఇద్దరు హీరోలు కలిస్తే కానీ అక్కడ ఓపెనింగ్స్ రాని పరిస్థితి. ఇక్కడ అలాకాదు... పదిమంది క్రౌడ్పుల్లర్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే నటునిగా ఎదగాలి. అదే నా ధ్యేయం. స్టార్లు ఎక్కువవ్వడంవల్లే మల్టీస్టారర్లు ఇక్కడ వేగాన్ని అందుకోలేకపోతున్నాయని భావించొచ్చా? మల్టీస్టారర్లు బాలీవుడ్వారికి అవసరమండీ. మనకు అక్కర్లేదు. పైగా ఇక్కడ మల్టీస్టారర్లు తీయడం అంత శ్రేయస్కరం కూడా కాదు. ఉదాహరణకు నాది యాభై కోట్ల మార్కెట్. చరణ్‌ది యాభై కోట్ల మార్కెట్. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటిస్తే అది వందకోట్ల సినిమా అవ్వాలి. కానీ కాదు. అరవై, డబ్భై కోట్లు చేస్తుంది అంతే. పైగా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. ఇద్దరం కలిసి నటించి వందకోట్లు లాగలేనప్పుడు అంత రిస్క్ ఎందుకు చేయాలి చెప్పండి? నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు కదా! ఆ సినిమా మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ నెల 10న ఆ సినిమా పూజా కార్యక్రమం ఉంటుంది. -
అల్లు అర్జున్ 'రేసుగుర్రం' ట్రయిలర్
-
'నాకు నేనే పోటీ'
-
రేసుగుర్రం ఆడియో ఆవిష్కరణ
-
బన్నీ హీరో మెటీరియల్ అని అప్పుడే అనుకున్నాను : చిరంజీవి
‘‘సినీ పరిశ్రమలో ఉండే కష్టసుఖాలేంటో తెలుసుకోకపోతే... బన్నీ వైల్డ్ గుర్రంగా మిగిలిపోయేవాడు. తెలుసుకున్నాడు కాబట్టే ‘రేసుగుర్రం’ అయ్యాడు’’ అని చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్ కథానాయకునిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రేసుగుర్రం’. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిరంజీవి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని వి.వి.వినాయక్‌కి అందించారు. చిరంజీవి ఇంకా మాట్లాడుతూ-‘‘చిన్నప్పట్నుంచీ బన్నీ యాక్టీవ్. తనకిష్టమైన నటులందర్నీ అనుకరించేవాడు. హాలీవుడ్ యాక్టర్ జిమ్క్యారీని, నన్ను, వాళ్ల తాతయ్య రామలింగయ్యగారిని ఇలా అనమాట. అప్పుడే అనుకున్నా ‘వీడు హీరో మెటీరియల్’ అని. హీరో అవ్వాలని కోరుకున్నాను కూడా. ‘డాడీ’ సినిమాలో కథ రీత్యా ఓ డాన్సింగ్ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర కోసం ఎవరెవర్నో చూస్తుంటే... నేను బన్నీ పేరు సూచించా. ఆ పాత్రే ‘గంగోత్రి’కి కారణమైంది. కానీ... ఆ సినిమాలో బన్నీ నటన నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. బన్నీ అంటే... ఇదికాదు అనిపించింది. ‘దేశముదురు’ చూశాను. అప్పుడనిపించింది. ‘ఎస్... ఇది బన్నీ అంటే’ అని. మా కుటుంబం గర్వించే నటుడు అవుతాడని నిశ్చయించుకున్నాను. సురేందర్‌రెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. మొన్ననే టీవీలో తన ‘కిక్’ సినిమా వచ్చింది. కాసేపు చూద్దాం అనుకొని సినిమా మొత్తం చూసేశాను. రవితేజ చేశాడు కానీ... నా ఫిట్నెస్ సరిగ్గా ఉన్న టైమ్‌లో నేను చేసి ఉంటే ఎలా ఉండేదో అనిపించింది. ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి క్యాషియర్లలా తయారైంది. సినిమాలోని ప్రతి విషయంలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ అవసరం. అప్పుడే సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. ‘రేసుగుర్రం’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తమన్‌తో పనిచేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ మనసుపెట్టి పనిచేశాడు. ‘తల్లిదండ్రుల ఆస్తి ఎంతైనా ఉండొచ్చు. కానీ మనం సంపాదించుకున్న పదివేలు చేతులో ఉంటే ఆ కిక్కే వేరు’ అనే విషయాన్ని తెలియజేసింది నాకు శ్రుతిహాసన్. పెద్ద సూపర్‌స్టార్ కుమార్తె అయ్యుండి కూడా తాను కష్టపడే తీరు అద్భుతం. మిగిలిన ఇండస్ట్రీల్లోని దర్శకులు తమ సినిమా బాగుండాలని సినిమాలు తీస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలోని దర్శకులు అలా కాదు. తమ హీరో బాగుండాలి, తమ సినిమా బాగుండాలని తీస్తారు. అందుకే ఇంతమంది హీరోలం ఇక్కడున్నాం. సురేందర్‌రెడ్డి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను’’అని అల్లు అర్జున్ చెప్పారు. రేసుగుర్రాలు పనిచేసిన సినిమా ఇది. విజయం తథ్యం అని సురేందర్‌రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘చిరంజీవిగారితో చక్రవర్తి, రౌడీఅల్లుడు, అన్నయ్య చిత్రాలను నిర్మించాను. మూడూ విజయవంతమైన సినిమాలే. 11ఏళ్ల విరామం తర్వాత నేను నిర్మిస్తున్న చిత్రమిది. మళ్లీ ఒక మంచి సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన కె.వెంకటేశ్వరరావు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్, బి.గోపాల్, అలీ, కె.ఎల్.నారాయణ, సి.కల్యాణ్, పైడిపల్లి వంశీ, ఎన్వీ ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, మారుతి, జెమినీ కిరణ్, ఎం.ఎల్.కుమార్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
రేస్‌కు గుర్రం రెడీ
సమ్మర్ బాక్సాఫీస్ రేస్‌లో సత్తా చాటడానికి ‘రేసుగుర్రం’ రెడీ అయ్యింది. అల్లు అర్జున్ పాత్ర చిత్రణే ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. బన్నీ కెరీర్లో గుర్తుండిపోయేలా దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇందులో బన్నీ పాత్ర చిత్రణ అత్యంత శక్తిమంతంగా ఉంటుందట. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలయ్యతో పోటీపడుతున్న బన్నీ
-
వాయువేగంతో రేసుగుర్రం
వాయు వేగమే ఆయుధం. లక్ష్యసాధనే ధ్యేయం. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా... అవన్నీ డెక్కల కింద నలిగి చావాల్సిందే. సింపుల్‌గా ‘రేసుగుర్రం’ అంటే అది. కథానుగుణంగా అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే.. ‘రేసుగుర్రం’ అనే టైటిల్ పెట్టారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. బన్నీలోని ఎనర్జీ లెవల్స్ ఏంటో ఈ చిత్రం చెప్పబోతోందని సమాచారం. మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని వినికిడి. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉండే సురేందర్‌రెడ్డి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుందని యూనిట్ సభ్యుల సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందీ టీజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్ పరిసరాల్లోని ఓ కళాశాల ఆవరణలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. నేడు(మంగళవారం) ఆర్ఎఫ్సీలో జరిగే చిత్రీకరణతో ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకూ భారీ సెట్లో బన్నీ, కథానాయిక శ్రుతిహాసన్‌పై పాట చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు. -
లావిష్‌గా రేసుగుర్రం
‘డెక్కల తాకిడికి... దుమ్ము రేగిపోవాల్సిందే, ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే’ అన్నట్టుగా ఉంది ఇటీవల విడుదలైన ‘రేసుగుర్రం’ టీజర్. రేసుగుర్రాన్ని తలపించే బన్నీ పరుగు... ఈ టీజర్లో స్పెషల్ ఎట్రాక్షన్. హాలీవుడ్ సినిమాలను తలపించేలా సురేందర్‌రెడ్డి లావిష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ని చూస్తే అర్థమైపోతోంది. నేటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆర్ఎఫ్సీలో జరగనుంది. ఈ నెల 11 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఒక ఐటమ్ సాంగ్‌ని, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన చివరి పాట చిత్రీకరణ ఈ నెల 20 నుంచి 25 వరకూ జరుగుతుంది. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అల్లు అర్జున్ కెరీర్లో ఓ మేలిమలుపుగా ఈ చిత్రం నిలు స్తుందని యూనిట్‌వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు. -
ఇంటి వేటలో బిజీ
ఒకవైపు ‘రేసు గుర్రం’, మరోవైపు హిందీ చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రుతిహాసన్. గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ‘వెల్కమ్ బ్యాక్’ షూటింగ్లో పాల్గొన్న శ్రుతి ఓ రోజు క్రితమే ఇండియా చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఇంటి వేటలో పడ్డారామె. ఇటీవల ఓ వ్యక్తి శ్రుతి ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించడం, దాన్ని ఆమె అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్నుంచీ శ్రుతికి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదట. అందుకే కొత్త ఇంటికి మారాలనుకుంటున్నారామె. ముంబైలాంటి మహానగరంలో ఇల్లు వెతకడం అంటే అంత సులువు కాదు. పైగా, సెలబ్రిటీలంటే బోల్డన్ని సౌకర్యాలు ఉండాలి. అందుకే, ఇల్లు వెతికే పని తన ఒక్కదానివల్ల కాదని ఫిక్స్ అయిన శ్రుతి, ఆ పనిని ఏజెంట్లకు అప్పజెప్పారట. ఎంత అద్దె అయినా ఫర్వాలేదని, ప్రశాంతంగా ఉండటానికి వీలుగా ఉన్న ఇల్లు వెతికిపెట్టమని సదరు ఏజెంట్స్‌ని కోరారట శ్రుతిహాసన్. దీన్నిబట్టి ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో జరిగిన సంఘటన ఆమెను ఎంత బాధపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. -
అల్లు అర్జున్ 'రేసుగుర్రం' టీజర్ విడుదల
జులాయి తర్వాత బన్నీ రేసుగుర్రంగా దూసుకొచ్చాడు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టయిలిస్ట్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయినట్టేనని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని దర్శకుడు తెలిపారు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్గా చేస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
బన్నీకి అదే కరెక్ట్!
సందర్భం:సురేందర్ రెడ్డి బర్త్‌డే అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి చిత్రాలతో మాస్‌లోకి చొచ్చుకుపోయిన దర్శకుడు సురేందర్‌రెడ్డి.యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో బాగా నేర్పు కలిగిన ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ని ‘రేసుగుర్రం’గా తీర్చిదిద్దుతున్నారు. నేడు సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన సంభాషణ. 2005లో ‘అతనొక్కడే’తో దర్శకుడయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలే చేయగలిగారెందుకని? ‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. ఒక సినిమా చేస్తున్నానంటే నేనందులో పూర్తిగా లీనమై పని చేస్తాను. ఆదరాబాదరాగా ఏ పనీ పూర్తి చేయడం నాకిష్టం ఉండదు. ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ నాకు ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మ సంతృప్తి ముఖ్యం. మీరు క్రాంతికుమార్ శిష్యులు కదా. ఆయన తరహా సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? ఆయన తరహా అని కాదు కానీ, తక్కువ బడ్జెట్లో అంతా కొత్త తారలతో ఓ చిన్న సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వచ్చే ఏడాది కచ్చితంగా చేస్తాను. బన్నీతో మీరు చేస్తున్న సినిమాకు ‘రేసుగుర్రం’ టైటిల్ ఓకే చేశారా? డబుల్ ఓకే. బన్నీ ఎనర్జీకి, ఈ కథకు ఆ టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని గుర్రపు పందాల నేపథ్యంలో సినిమా అనుకునేరు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిగ్గా ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక పక్క చూపులు ఉండని పాత్ర తనది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. బన్నీతో పనిచేయడం ఎలా ఉంది? బన్నీ అంటేనే ఫుల్ ఎనర్జీకి ప్రతిరూపం. తనతో ఉంటే భయంకరమైన ఎంజాయ్మెంట్. తానో స్టార్‌ననే ఫీలింగ్ లేకుండా అందరితోనూ ఇట్టే కలిసిపోతాడు. ఎవరన్నా డల్‌గా కనిపిస్తే, అస్సలు క్షమించడు. వెంటనే వాళ్లల్లో ఎనర్జీ నింపేవరకూ వదలడు. భోజ్‌పురి హీరో రవికిషన్‌తో ఇందులో విలన్‌గా చేయిస్తున్నారట? అవును. ‘ఊసరవెల్లి’లోనే తనతో విలనీ చేయించాలనుకున్నా కుదర్లేదు. ‘రేసుగుర్రం’లో విలన్‌గా చాలామందిని అనుకున్నాం. చివరకు రవికిషన్ ఓకే అన్నారు. ఆయన చాలా ఇంట్రస్ట్ తీసుకుని పని చేస్తున్నారు. తెలుగు తెరకు ఓ మంచి విలన్ దొరికినట్టే. ఇంతకూ ‘రేసుగుర్రం’ విశేషాలు చెప్పండి? ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. రిలీజ్ ఎప్పుడనేది నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా.కె.వెంకటేశ్వర్రావులు చెబుతారు. బాలీవుడ్‌కి వెళ్లే ఉద్దేశం ఉందా? హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ‘కిక్’ నేనే చేయాలి. ‘ఊసరవెల్లి’ బిజీలో ఉండి చేయలేకపోయాను. ఇంకొన్ని ఆఫర్లు వచ్చాయి. ఎప్పటికైనా హిందీ సినిమా చేస్తాను. మీ నెక్ట్స్ కమిట్మెంట్స్? కొత్తవాళ్లతో సినిమా అని చెప్పానుగా. అలాగే రవితేజతో ‘కిక్-2’ చేయాలి. స్క్రిప్టు రెడీగా ఉంది. అలాగే నితిన్‌తో ఓ సినిమా చేయాలి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్? నా మనసులో ఒక ఆలోచన ఉంది. చాలా బిగ్ ప్రాజెక్ట్ అది. కార్యరూపం దాల్చడానికి చాలా కాలం పడుతుంది. -
బాధ్యత కలిగిన కుర్రాడు
పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. జడ్చర్ల పరిసరాల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బన్నీ, బ్రహ్మానందం, ప్రతినాయకుడు రవికిషన్, ఫైటర్స్‌పై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ వర్గాల సమాచారం. డిసెంబర్ మూడో వారానికి ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పాటు, బ్యాలెన్స్ రెండు పాటల్ని పూర్తి చేసుకోనుంది. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
సంక్రాంతి రేసులో గుర్రం
అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో దిగడానికి ‘రేసుగుర్రం’లా సిద్ధమవుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక. వీరిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం. బన్నీ చిత్రానికి తమన్ స్వరాలందించడం కూడా ఇదే తొలిసారి. భోజ్‌పురిలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతోన్న రవికిషన్ ఇందులో ప్రతినాయకునిగా నటిస్తుండటం విశేషం. నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన విలన్ హౌస్ సెట్లో ప్రస్తుతం అల్లు అర్జున్, రవికిషన్, ముఖేష్‌రిషి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూలు చిత్రం పూర్తయ్యే వరకూ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన పాటలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించనున్నారు. ఇందులో బన్నీ పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరులో పాటలను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘కిక్’ శ్యామ్, సలోని ఇందులో ముఖ్యతారలు. -
పండగచేస్కో..!
బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో... ఆ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా విషయంలో అప్పుడే ఫిలింనగర్లో చర్చలు మొదలయ్యాయి. డాన్ శీను, బలుపు చిత్రాలతో దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని సమాచారం. అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని ప్రేక్షకులకు అందించిన హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ‘దిల్’రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది. -
దూసుకుపోతున్న రేసుగుర్రం
అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసుగుర్రం’ షూటింగ్ రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బన్నీ నటించడం ఇదే ప్రథమం. యాక్షన్ ఎంటర్టైనర్లు తీయడంలో సురేందర్‌రెడ్డికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. బన్నీ ఇమేజ్‌కి తగ్గట్టుగా ‘రేసుగుర్రం’ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. ‘కిక్’ శ్యామ్, సలోని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ స్వరాలందిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో వినోదం పాళ్లు అధికంగా ఉంటాయి. బన్నీ కెరీర్లోనే ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్ ఇదే’’ అని చెప్పారు. ఈ నెల 5 నుంచి మరో షెడ్యూలు మొదలు కానుంది. 2014 సంక్రాంతికి ‘రేసుగుర్రం’ను విడుదల చేయాలనేది నిర్మాతల ప్లానింగ్. -
వీరభద్రం దర్శకత్వంలో బన్నీ?
అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తారని, తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో నటిస్తారని రకరకాల వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార నే తాజా వార్త ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి... ప్రస్తుతం నాగార్జునతో ‘భాయ్’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారాయన. ‘భాయ్’ తర్వాత బన్నీ-వీరభద్రంల సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని విశ్వసనీయ సమాచారం. సదరు నిర్మాత.. వీరభద్రానికి అడ్వాన్స్ కూడా అందజేసినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు వీరభద్రం... బన్నీతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే... -
శరవేగంగా దూసుకొస్తున్న రేసుగుర్రం
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా.. సలోని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న రేసుగుర్రం చిత్రం శర వేగంగా సిద్ధమవుతోంది. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతుఓంది. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. -
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం'
అల్లు అర్జున్ రేసుగుర్రంలా సిద్దమవుతున్నారు. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రేసుగుర్రం’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించకపోయినా, అభిమానుల్లో అదే టైటిల్ ప్రచారమవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. ఇటలీలో ఒక పాటను, స్విట్జర్లాండ్‌లో మరో పాటను తీశారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకూ బన్నీ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర చిత్రణ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం ‘ఏం మాయ చేసావె’ లాంటి చిత్రాలకు పని చేసిన మనోజ్ పరమహంస ఈ సినిమాకు ఛాయాగ్రహణం, తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి, కథ: వక్కంతం వంశీ, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి.