బాధ్యత కలిగిన కుర్రాడు | Allu Arjun plays powerful role in 'Race Gurram' | Sakshi
Sakshi News home page

బాధ్యత కలిగిన కుర్రాడు

Published Fri, Nov 29 2013 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

బాధ్యత కలిగిన కుర్రాడు

బాధ్యత కలిగిన కుర్రాడు

పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. జడ్చర్ల పరిసరాల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బన్నీ, బ్రహ్మానందం, ప్రతినాయకుడు రవికిషన్, ఫైటర్స్‌పై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. 
 
ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ వర్గాల సమాచారం. డిసెంబర్ మూడో వారానికి ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పాటు, బ్యాలెన్స్ రెండు పాటల్ని  పూర్తి చేసుకోనుంది. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
 
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస,  సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement