సన్నివేశం.. కారులో వెళుతున్న పోలీసు కుటుంబాన్ని యాక్సిడెంట్ చేసి చంపేందుకు ప్లాన్ వేస్తాడు మద్దాలి శివారెడ్డి. ఎదురుగా యమస్పీడుతో వస్తున్న వాహనాన్ని చూసి భయపడిపోయిన ఆ ఫ్యామిలీ కారులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కారు డోర్లు లాక్ అయిపోతాయి. ఇక చావు తథ్యం అని అందరూ కళ్లు మూసుకోగా వారిని కాపాడేందుకు బుల్లెట్‌లా బైక్ మీద దూసుకొచ్చి విలన్స్‌కు షాకిస్తాడు ఓ యంగ్ పోలీస్ అదేనండీ అల్లు అర్జున్. అతడిని చూడగానే రౌడీలు సడన్ బ్రేక్ వేస్తారు. ఇంకేముందీ, కారు అద్దాల్లోంచి గాల్లోకి లేచి కొద్ది అడుగుల దూరంలో పడిపోతారు విలన్లు. ఈ సీన్ ఏ సినిమాలోనిదో ఈపాటికే అర్థమై ఉంటుంది.
బన్నీ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'రేసుగుర్రం'లో వచ్చే ఓ కీలక సన్నివేశమిది. ఇప్పుడిదంతా ఎందుకంటే కేరళ పోలీసులు ఈ సీన్‌ను ప్రజల రక్షణ కోసం వాడేసుకున్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో పోల్ యాప్ మీ దగ్గరుంటే మిమ్మల్ని కూడా మేము అలాగే కాపాడుకుంటాం అని చెప్తున్నారు పోలీసులు. కేవలం ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మీ ముందు వాలిపోతామని చెప్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా బన్నీని ఇలా వాడుకున్నారన్నమాట అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ పోలీసుకు హెల్మెట్ కూడా ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పిస్తున్నారు.
പോൽ ആപ്പ് - പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc
— Kerala Police (@TheKeralaPolice) February 19, 2021
Comments
Please login to add a commentAdd a comment