Kerala police
-
కారు ఓనర్‌కి పోలీసుల షాక్.. అంబులెన్స్‌కి దారి ఇవ్వలేదని..
తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్‌ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ.. నేరుగా ఆ కారు యాజమాని ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn— MDApp (@MDAppMDApp) November 17, 2024 -
మొదటిసారి పోలీస్ ఫ్లీట్లోకి జిమ్నీ.. వీడియో
మహీంద్రా థార్ ఎస్‌యూవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను పొందినప్పటికీ.. ప్రస్తుతం డీలా పడింది. దీనికి ప్రధాన కారణం పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే ఎక్కువ ధర కలిగి ఉండటం. ఈ కారు అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల ఈ కారును కేరళ పోలీసులు పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా జిమ్నీ కార్లను తమ ఫ్లీట్‌లో చేర్చలేదు. మొదటిసారి కేరళ పోలీసులు ఈ కారును తమ విభాగంలో చేర్చారు. ఈ జిమ్నీ ఫ్రంట్ విండ్షీల్డ్పైన కేరళ పోలీస్ స్టిక్కర్స్ ఉండటం చూడవచ్చు. బానెట్‌పై రాజాక్కాడ్ పోలీస్ స్టేషన్ స్టిక్కర్ ఉండటం గమనించవచ్చు. ఈ కారును ప్రత్యేకంగా రెస్క్యూ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆఫ్-రోడర్ కార్లలో ఒకటి ఈ మారుతి జిమ్నీ. ఇది కే15బీ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 పీఎస్ పవర్, 134 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'కేరళ పోలీసులు 4x4 వాహనాలను తమ విభాగాల్లో చేర్చడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే బోలెరో ఇన్వాడర్ 4x4, ఫోర్స్ గూర్ఖా 4×4 వంటి వాటిని పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మారుతి జిమ్నీ 4x4 కార్లు.. పోలీస్ విభాగంలోకి అడుగుపెట్టాయి. పరిమాణం పరంగా జిమ్నీ.. దాని ప్రత్యర్థుల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. జిమ్నీ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). View this post on Instagram A post shared by Rahulkaimal (@rahul.kaimal) -
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది. మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం?
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన కేరళలోని పతనంతిట్ట జిల్లా నరబలి కేసు దర్యాప్తులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ చేతిలో చాలా మంది బలైపోయినట్లు తెలుస్తోంది. నరబలి కేసు బయటపడిన క్రమంలో కనిపించకుండా పోయిన మహిళల కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నాయి. వారు కనిపించకుండా పోవటం వెనక నరబలి నిందితుడు షపీ హస్తం ఉండి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఎలంతూర్ గ్రామంలో ఇద్దరు మహిళలను బలిచ్చిన కేసులో షఫీ, భగవల్ సింగ్, అతడి భార్య లైలాను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 2013 నుంచి కనిపించకుండా పోయిన బింధు పద్మనాభన్ అనే మహిళ బంధువులు.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆమె మిస్సింగ్‌కు కొద్ది రోజుల ముందు షఫీకి సంబంధించిన ఓ వ్యక్తితో బింధును చూసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై షఫీని ప్రశ్నించామని, ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు తెలిపారు. బింధు పద్మనాభన్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కందకరపల్లిలో ఒంటరిగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయినట్లు 2013లో కేసు నమోదైంది. 2017లో మరోమారు ఆమె ఆస్తులను నకిలీ పత్రాలను ఉపయోగించి సీజ్ చేశారని బాధితురాలి సోదరుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సంఘటనలో 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కే. సరోజిని నివాసం.. ఎలాంతూర్ నిందితులకు కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో ఆమె కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని బంధువులు కోరుతున్నారు. కనిపించకుండా పోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరిగి దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో 12, ఎర్నాకులం జిల్లాలో 14 కేసులు గత ఐదేళ్లలో నమోదైనట్లు సీనియర్ అధికారోకరు తెలిపారు. ఈ 26 మంది మహిళల మిస్సింగ్ వెనుక షఫీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. తల నరికి, నాలుక కోసి.. -
వైరల్: మామిడి పండ్ల దొంగ.. పోలీసోడే!
కొట్టాయం: కక్కుర్తితో ఎవరూ లేని టైంలో ఓ దుకాణం బయటి నుంచి మామిడి పండ్లను కాజేసిన దొంగను.. పోలీసుగా గుర్తించారు కేరళ అధికారులు. కొట్టాయం కంజిరాపల్లి సెప్టెంబర్ 28న ఓ రోడ్ సైడ్ దుకాణం దగ్గర ఈ దొంగతనం జరిగింది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్.. ఓ మామిడి పండ్ల దుకాణం ముందు ఈ చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్ ద్వారా తరలించాడతను. అయితే.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ చోరీని గుర్తించాడు ఆ దుకాణం యాజమాని. దొంగ హెల్మెట్, రెయిన్‌కోట్ ధరించి ఉండడంతో.. తొలుత అతన్ని గుర్తించడం వీలుకాలేదు. అయితే బైక్ నెంబర్ ఆధారంగా.. అతను షిహాబ్‌గా గుర్తించారు. దీంతో డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అధికారులు గాలింపు చేపట్టారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. When @TheKeralaPolice was #caughtoncamera stealing mangoes... The incident happened in Kanjirappally, Kottayam. The accused has been identified as PV Shihab, a Civil Police Officer posted at Idukki AR Camp.#CCTV #theft #keralapolice pic.twitter.com/CqT3y8ESID — Bobins Abraham Vayalil (@BobinsAbraham) October 4, 2022 -
పోలీసులకు రక్షణగా ‘పాములు’!! ఎక్కడంటే..
ఇడక్కి(కేరళ): సమాజంలో శాంతిభద్రతలను కాపాడే రక్షక భటులను వానర దండు నుంచి కాపాడేవారే లేరు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం వెంట కేరళలోని అటవీప్రాంతంలోని కుంబుమెట్టు పోలీస్ స్టేషన్‌పై కోతుల గుంపులు దూసుకొచ్చి నానా హంగామా చేయడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే పోలీసులకు తమ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక తెగ హైరానా పడ్డారు. వీరికి స్థానికంగా యాలకులు సాగు చేసే ఒక రైతు చక్కని ఉపాయం చెప్పి ఆదుకున్నాడు. చైనా తయారీ రబ్బర్ పాములను రంగంలోకి దించారు. కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్న పోలీస్‌స్టేషన్ పై కప్పుపై, స్టేషన్ ప్రాంగణంలోని కూరగాయల తోటలో, స్టేషన్ గ్రిల్స్‌కు, చెట్లకు ఇలా పలు చోట్ల రబ్బర్ పాములను ఉంచారు. దీంతో పాములను చూసి హడలిపోయిన కోతులు స్టేషన్ పరిసరాలకు రావడం మానేశాయని పోలీస్‌స్టేషన్ సబ్–ఇన్స్పెక్టర్ పీకే లాల్‌భాయ్ ఆనందం వ్యక్తంచేశారు. చాలా సంవత్సరాలుగా స్టేషన్‌ను వేధిస్తున్న ఈ సమస్యకు సర్పాల రూపంలో పరిష్కారం దొరకడం సంతోషకరమని సునీశ్ అనే పోలీసు అన్నారు. అడవి జంతువులను హడలగొట్టేందుకే తమ సాగుభూమిలో అమలుచేస్తున్న చిట్కానే వీరికి చెప్పానని ఉదంబన్చోళ తాలూకాకు చెందిన ఒక రైతు వెల్లడించారు. చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. -
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ‘పొల్యూషన్’ జరిమానా.. నవ్వులపాలైన పోలీసులు
మలప్పురం: పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదని జరిమానా విధిస్తే?! కేరళ పోలీసులు ఇదే పనిచేసి నవ్వులపాలయ్యారు. మలప్పురం జిల్లాలో కరువరాకుండు పోలీసు స్టేషన్ పరిధిలోని నీలాంచెరీలో గతవారం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వస్తుండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపేశారు. పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ చేతిలో పెట్టి, రూ.250 వసూలు చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల నిర్వాకంపై జోకులు పేలాయి. టైపింగ్ మిస్టేక్ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. స్కూటర్ యజమాని డ్రైవింగ్ లైసెన్స్ చూపించలేకపోయాడని చెప్పారు. మెషిన్లో తప్పుగా టైప్ చేయడంతో పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ వచ్చిందని అన్నారు. -
మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో గురువారం పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గత సోమావారం రోజున (జూలై 4) తిస్సూర్లోని ఎస్ఎన్ పార్క్‌లో శ్రీజిత్ ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు సీసీటీవీమ ఆధారంగా గుర్తించారు. బాలికల వయసు 9, 14 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. కాగా శ్రీజిత్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా అతడు ఇలాంటి ఆరోపణలను ఎదర్కొని అరెస్ట్ అయ్యాడు. 2016లో ఓట్టప్పలం పోలీసుల ఇలాంటి కేసులోనే అతడిని అరెస్ట్ చేశారు. కొందరు స్కూల్ గల్స్‌కు చెందిన గ్రూప్‌తో అసభ్యకరరీతిలో అతడి ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తూ అసభ్యకర రితీలో ప్రవర్తించడమే కాకుండా బాలికల ఫొటోలను తీసుకున్నాడు. దీంతో స్కూల్ ప్రిన్స్పాల్య ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు టి.జి రవి కుమారుడైన శ్రీజిత్ రవి మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులలో ఒకరు. అతడు సహా నటుడిగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. చదవండి: ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు -
బంపర్ ఆఫర్.. తుపాకీ వాడకంపై పోలీసులే శిక్షణ ఇస్తారంటా..
మీకు తుపాకీ వాడటం ఇష్టమా.. కానీ, అది ఎలా వాడాలో తెలియదా..?. మీ సేఫ్టీ కోసం తుపాకీ వాడాలనుకుంటున్నారా.? అయితే, తుపాకీని ఎలా ఉపయోగించాలో సామాన్య పౌరులకు పోలీసులు శిక్షణ ఇవ్వబోతున్నారు. అదేంటి పోలీసులు శిక్షణ ఇవ్వడమేంటీ అనుకుంటాన్నారా.. మీరు విన్నది నిజమే. కేరళ పోలీసులు.. పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేరళ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. తుపాకీ వినియోగంపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కేరళ డీజీపీ అనిల్‌కాంత్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. అయితే, ఇప్పటికే తుపాకీ వినియోగించడానికి లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. తుపాకీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా అనుభవం లేనివారికి రూ.5,000.. అలా కాకుండా కాస్త అవగాహన ఉన్నవారు, ఫైన్-ట్యూనింగ్ అవసరం ఉన్నవారు రూ.1000కే శిక్షణ పొందవచ్చు. ఇదిలా ఉండగా.. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంపిక కారని డీజీపీ స్పష్టం చేశారు. వారి ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుందని.. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ సెలక్షన్ ట్రయల్‌లో ఉత్తీర్ణులైన వారికే శిక్షణ ఉంటుందన్నారు. కాగా, ఇటీవల ఓ వ్యక్తి తుపాకీ వినియోగంపై కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా న్యాయస్థానం తుపాకీ లైసెన్స్ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. The venerated gun culture, existed only in Malayalam flicks, is getting a mainstream treatment with Kerala Police pushing a "practical weapon training"https://t.co/5rtkQRDoVi — VM Abijeet (@poetsandgypsies) June 7, 2022 ఇది కూడా చదవండి: వాడో బచ్చా సీఐ, మూడో కన్ను తెరుస్తా.. మండిపడ్డ ఎమ్మెల్యే -
హీరోయిన్ లైంగిక దాడి కేసు, దిలీప్ భార్యను విచారించిన పోలీసులు
Kerala Police Investigate Accused Dileep Wife Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్టార్ నటుడు దిలీప్ కుమార్ భార్య కావ్య మాధవన్‌ను తాజాగా కేరళ క్రైం పోలీసులు విచారించారు. ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఇటీవల బయటకు వచ్చిన కొన్ని ఆడియో క్లిప్స్‌తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్ బావ మరిది సూరజ్, శరత్‌లకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ దీంతో ఈ కేసులో దిలీప్ భార్య కావ్య మాధవన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆలువాలోని తన నివాసంలో దాదాపు 4 గంటల పాటు ఆమెను విచారించారు. అయితే ఈ విచారణంలో కావ్య పోలీసులకు సహకరించలేదని తెలిసింది. పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆమె సంబంధం లేని సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి గుర్తులేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలో కావ్యకు పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేయగా తాను చెన్నైలో ఉన్నందున విచారణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. చదవండి: నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు ఈ క్రమంలో ఇటీవల ఆమెకు మరోసారి సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారించగా తన నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదల కాగా... అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
నటుడు దిలీప్‌కు ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని
Kerala High Court Restrains Police From Arresting Actor Dileep: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు కాస్త ఊరట లభించింది. స్టార్ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దిలీప్‌ను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై నిషేధం విధించింది. అలాగే దిలీప్‌పై ఇచ్చిన సినీ దర్శకుడు బాలాచంద్ర కుమార్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని జస్టిస్ గోపీనాథ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. ఇటీవల దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్తగా కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్‌లు బయటకు రావడంతో వీరిపై ఐపీసీ సెక్షన్లు 116, 118, 120B, 506, 34 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో దిలీప్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే విచారణ అధికారులు బైజు పౌలోస్, సుదర్శన్, సంధ్య, సోజన్లు ఇబ్బంది పడతారని దిలీప్ బెదిరించినట్లు కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్లో ఉన్నట్లు సమాచారం. సుదర్శన్‌తో పాటు మరో దర్యాప్తు అధికారి చేతిని నరికేందుకు దిలీప్ కుట్ర పన్నాడని అందులో ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2017 రాత్రి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు. ఇదీ చదవండి: స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై -
స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై
Non Bailable Case Registered Against Actor Dileep By Kerala Police: మలయాళ సూపర్ స్టార్ దిలీప్ లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు తిరిగింది. సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్‌పై ఓ ముఠా లైంగిక వేధింపులు పాల్పడి, ఆ సన్నివేశాలను చిత్రీకరించిన కేసులో దిలీప్ అరెస్టయిన సంగతి తెలిసిందే. 2017 జూలైలో అరెస్టయిన దిలీప్ రెండు నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంకా కొనసాగుతోన్న ఈ కేసు విషయంలో దిలీప్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సమచారం ప్రకారం దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై (దిలీప్ బంధువులు, కుటుంబ సభ్యులు) కొత్త కేసు నమోదైంది. దిలీప్, మిగిలిన ఐదుగురు విచారణ అధికారులను బెదిరించారట. ఈ విషయాలను దర్శకుడు బాలచంద్ర కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌లు బయటపడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను దిలీప్, ఆతని బృందం బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ల ద్వారా తెలుస్తోందట. ఈ లైంగిక దాడి చేసేందుకు ముఠా కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. బాలచంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడి ఫిర్యాదు ప్రకారం దిలీప్‌తోపాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నించారట. ఇదీ చదవండి: మరో నెగెటివ్ రోల్లో సమంత !.. ప్రేమకు అడ్డుగా -
అయ్యో పాపం ఉత్తర.. త్వరలోనే ఆ దుర్మార్గుడికి శిక్ష!
కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేదింపుల సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మరణించినట్లుగా తొలుత వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ పకడ్బందీగా ప్లాన్ చేసి చంపినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన కేరళ పోలీసు బృందం సజీవ పాము, డమ్మీ చేతిని ఉపయోగించి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నించారు. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర శిక్షణా కేంద్రంలో ఈ ప్రయత్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం మీడియాకు విడుదల చేశారు. కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. మంచంపై పడుకున్న డమ్మీ బొమ్మపై నాగుపామును విడిచారు. If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy pic.twitter.com/NNwkSicbIi — Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021 ఈ విషయం గురించి మహీంద్రా వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఛైర్మన్ మనీష్ కుమార్ చెబుతూ.. "మేము చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. పామును డమ్మీ శరీరంపై రెండు, మూడు సార్లు పడేశాను, కానీ అది ఆ బొమ్మను ఏమీ చేయలేదు. ఆ తర్వాత మా బృందం పామును రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. చికెన్ మాంసం ముక్కను డమ్మీ చేతికిచుట్టూ చుట్టి పాము ముందు అనేకసార్లు ఊపారు. అయితే, నాగుపాము ఆ చేతిని కరవలేదు. ఎందుకంటే నాగుపాము జాతులు సాధారణంగా రాత్రి పూట చాలా చురుకుగా ఉండవు. పామును అంతగా రెచ్చగొట్టినప్పటికీ అది దాడి చేయలేదు" అని మనీష్ కుమార్ అన్నారు.(చదవండి: అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..) If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy. This is the video pic.twitter.com/C8XPTy1m3y — Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021 పామును డమ్మీ చేతి ద్వారా తాకడానికి ప్రయత్నించినప్పుడు అనేక ప్రయత్నాల తర్వాత నాగుపాము కరుస్తుంది. ఈ సహజ కాటును బృందం కొలిచింది. అప్పుడు ఆ కాటు వెడల్పు 1.7 సెం.మీ. దీని తర్వాత బృందం పాము తలను పట్టుకొని దాని కోరలను డమ్మీ చేతికి చుట్టిన చికెన్ మాంసాన్ని కరిపించారు. "కోరల వెడల్పులో మార్పులను మేము గమనించాము. మొదటి కాటు 2 సెం.మీ, రెండవ కాటు 2.4 సెం.మీ" అని మనీష్ కుమార్ చెప్పారు. ఈ బృందం.. పాము కదిలే దవడను ఒక స్కేలును ఉపయోగించి కొలిచింది. దాని దవడ 2 నుంచి 2.5 సెం.మీ వెడల్పు ఉంది. అందువల్ల సహజ కాటు మధ్య మార్పులు ఉన్నాయి అని అన్నారు. 2020 మే 7న కొల్లంలోని అంచల్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఇరవై ఆరేళ్ల ఉత్తర శవమై కనిపించింది. ఆమె భర్త సూరజ్ ఒక బ్యాంకు ఉద్యోగి. పాము పట్టే వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన విషపూరిత పాము చేత ఆమెను చంపించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. అతను అరెస్టు అయిన తర్వాత సూరజ్ నేరాన్ని అంగీకరించాడని, అతను ఉత్తర నిద్రమాత్రల వల్ల మత్తులో ఉన్నప్పడు నాగుపామును ఆమెపై వేస్తే అది కరవడం వల్ల ఆమె చనిపోయినట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు) ఉత్తర చంపడానికి సూరజ్ చేసిన రెండవ ప్రయత్నం ఇది అని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మార్చి 2020లో ఉత్తర కొరకే ఆ పామును అద్దెకు తీసుకున్నాడు. అయితే, ఆమె తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్నప్పడు ఆమె నాగుపాము కాటుకు గురై చనిపోయింది. అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను చంపడంలో సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది. అందుకే కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో(సీన్ రీకన్స్ట్రక్షన్) ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
వైరల్: కేరళ పోలీసుల స్టెప్పులు.. మారండయ్యా!
తిరువనంతపురం: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. ఇంతలా విజృంభణకు ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించకపోవడమే ఓ కారణమనే చెప్పాలి. అధికారులు, డాక్టర్లు ఎంత చెబుతున్నా కొందరు నిబంధనలు పాటించకుండా వారితో పాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నంగా ఓ వీడియో చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఏముంది ఈ పాటలో.. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఎంజాయి ఎంజామి’ పాట తెలిసే ఉంటుంది. కేరళ పోలీసులు ఈ పాట లిరిక్స్‌ను మార్చి కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా రూపొందించారు. దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ చేసిన ఓ వీడియోను తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ పాటలో.. ‘‘కొవిడ్ అడ్డుకట్టకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ తప్పకుండా ధరించాలి. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్క్ పెట్టుకోవడం కాకుండా కరోనా అంతమయ్యేవరకు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా శానిటైజర్ వెంట తీసుకువెళ్లాలి. ప్రస్తుతమున్న ఆపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది మన ప్రాణాలనే తీస్తుంది. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్ వస్తోంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. అందరం కలిసి కరోనా రహిత భవిష్యత్తు కోసం పోరాడదాం’’ అంటూ ఓ సందేశాన్ని వీడియో రూపంలో రూపొందించారు. ఈ వీడియోకు.. ‘కరోనాపై కలిసిపోరాడుదాం.. కేరళ పోలీసులు ఎల్లప్పుడూ మీ వెంటే’ అనే టైటిల్‌తో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ తరహా అవగాహన మొదటి సారి కాదు కేరళ పోలీసులు కోవిడ్‌పై అవగాహనకు ఇటువంటి వీడియో రూపొందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలోనూ ‘హ్యాండ్ వాష్ డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజా వీడియోకు పోలీస్ మీడియా సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించగా.. హేమంత్ నాయర్, షిఫిన్ సీ రాజ్, రాజీవ్ సీపీలు కెమెరా మెన్లుగా వ్యవహరించారు. డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఆదిత్య ఎస్ నాయర్, రాజేష్ లాల్ వమ్షాలు స్వరాలు సమకూర్చగా.. నిలా జోసెఫ్, నహూమ్ అబ్రహామ్ అనే ఉద్యోగులు గీతాన్ని ఆలపించారు. ( చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ ) #Kerala #Police awareness video on #Covid. Do watch pic.twitter.com/PxedFptZw7 — RadhakrishnanRK (@RKRadhakrishn) April 27, 2021 -
యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు..
కేరళ : సినిమాల్లో నటించకపోయినా కొందరు ఆస్కార్ నటులు మన మధ్యలోనే ఉన్నారని అప్పడప్పుడు మన స్నేహితులనో , బంధువులనో చూస్తే అనిపిస్తుంది. అలాంటి ఆస్కార్ ఆర్టిస్ట్ నటనే ఇప్పుడు వీడియో రూపంలో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన వారందరు ఆ వ్యక్తి నటనకు 'ఏం నటన గురూ.. ఇరగదీశావ్'.. ‘నువ్వు కేక అంతే’ అంటూ కితాబిస్తున్నారు. నెటిజన్లేంటి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పొగుడుతోంది. ఇంతకీ అసలేం అక్కడ ఏం జరిగింది. అంతటి ఆస్కార్ నటన ఎవరిదీ అనుకుంటున్నారా.... అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ బుక్ ఖాతాలో శుక్రవారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఫన్నీగా ఉండటం, ఆ ఫన్నీ వీడియోకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తమదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ జోడించడంతో ఇట్టే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఏప్రిల్ 15వ తారీఖున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వెళ్తున్నారు. వాళ్లకు కొద్ది దూరంలోనే ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ వస్తోందని గ్రహించారు. ఆ స్కూటీని నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదు. ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. పోలీసులకు చిక్కితే వాళ్ల లాఠీలకు పని చెబుతారని గ్రహించి, ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అందులో ఇద్దరు పరారయ్యారు. ఓ వ్యక్తి మాత్రం సాధారణ పౌరుడిగా వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన జేబులో ఉండే మాస్కును తీసి పెట్టుకున్నాడు. పోలీస్ వ్యాన్ అతడి పక్కగా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లి ఏమీ తెలియనట్లు వారితో మాట్లాడాడు. ఇంకేముంది హమ్మయ్యా బతికి పోయామని అనుకున్నాడు. కానీ ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోను పోలీసులు 'అమాయకుడిగా నటిస్తున్న ఓ బ్రదర్‌ను చూడండంటూ' శీర్షిక పెట్టి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి నటనకు.. నువ్వు కేక అంటూ ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) -
ద్యావుడా, అల్లు అర్జున్ను ఇలా వాడుకున్నారా?
సన్నివేశం.. కారులో వెళుతున్న పోలీసు కుటుంబాన్ని యాక్సిడెంట్ చేసి చంపేందుకు ప్లాన్ వేస్తాడు మద్దాలి శివారెడ్డి. ఎదురుగా యమస్పీడుతో వస్తున్న వాహనాన్ని చూసి భయపడిపోయిన ఆ ఫ్యామిలీ కారులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కారు డోర్లు లాక్ అయిపోతాయి. ఇక చావు తథ్యం అని అందరూ కళ్లు మూసుకోగా వారిని కాపాడేందుకు బుల్లెట్లా బైక్ మీద దూసుకొచ్చి విలన్స్‌కు షాకిస్తాడు ఓ యంగ్ పోలీస్ అదేనండీ అల్లు అర్జున్. అతడిని చూడగానే రౌడీలు సడన్ బ్రేక్ వేస్తారు. ఇంకేముందీ, కారు అద్దాల్లోంచి గాల్లోకి లేచి కొద్ది అడుగుల దూరంలో పడిపోతారు విలన్లు. ఈ సీన్ ఏ సినిమాలోనిదో ఈపాటికే అర్థమై ఉంటుంది. బన్నీ కెరీర్లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'రేసుగుర్రం'లో వచ్చే ఓ కీలక సన్నివేశమిది. ఇప్పుడిదంతా ఎందుకంటే కేరళ పోలీసులు ఈ సీన్‌ను ప్రజల రక్షణ కోసం వాడేసుకున్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో పోల్ యాప్ మీ దగ్గరుంటే మిమ్మల్ని కూడా మేము అలాగే కాపాడుకుంటాం అని చెప్తున్నారు పోలీసులు. కేవలం ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మీ ముందు వాలిపోతామని చెప్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా బన్నీని ఇలా వాడుకున్నారన్నమాట అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ పోలీసుకు హెల్మెట్ కూడా ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పిస్తున్నారు. പോൽ ആപ്പ് - പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc — Kerala Police (@TheKeralaPolice) February 19, 2021 చదవండి: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ.. అతడే డైరెక్టర్? పుష్ప: హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్.. -
పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ పూర్ణ
కొచ్చి : ప్రముఖ హీరోయిన్ పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. పూర్ణను నలుగురు యువకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను త్రిసూర్‌కు చెందిన శరత్, అష్రఫ్, రఫీక్, రమేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన నలుగురిని ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉంచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. పూర్ణకు పెళ్లి సంబంధం తీసుకొచ్చామనే నెపంతో నిందితులు ఆమె ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. వారిది కోజికోడ్ అని, పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులమని నిందితులు పూర్ణ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత వారు పూర్ణకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమె కేరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారు. దీంతో పూర్ణ తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. పూర్ణ ఫొటోలు తీస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తొలుత డ్యాన్సర్‌గా, మోడల్‌గా కేరీర్ ప్రారంభించిన పూర్ణ.. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, తెలుగులో అవును, అవును 2, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటి చిత్రాల్లో నటించారు. పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు రియాల్టి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి : పెళ్లికి నేను సిద్ధం : పూర్ణ) -
పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్
కొచ్చి : కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ పాటిస్తున్న వేళ కేరళ పోలీసుపై హైకోర్టులో వింత పిటిషన్ దాఖలైంది. తన పెంపుడు పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్ నిరాకరించారని హైకోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కొచ్చి ప్రాంతానికి చెందిన ఎన్ ప్రకాశ్ అనే ఓ వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలంటూ ఏప్రిల్ 4న ఆన్లైన్ ద్వారా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాను శాకాహారినని, తన పిల్లులను ఇష్టమైన మియో పెర్సియన్ బిస్కెట్ల ఇంట్లో తయారు చేయలేనని, కోనేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేశారు. (చదవండి : మాస్క్‌లు ధరించకపోతే జరిమానా) అయితే ప్రకాశ్ చెప్పిన కారణం అత్యవసరమైనది కాదని భావించిన పోలీసులు ఆయనకు పాస్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జంతు హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం పెంపుడు జంతువులకు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నారు.కాగా, కేరళలో కరోనా బాధితుల సంఖ్య 314కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 109 మంది మరణించారు. -
వైరల్ వీడియో: కరోనాపై వినూత్న డ్యాన్స్
తిరువనంతపురం: చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకీ దీని ప్రభావం మరింత ప్రబలుతోంది.ఈ నేపథ్యంలో కరోనాను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. వీటిలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం అతి ముఖ్యం. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు సైతం దిగివస్తున్న విషయం తెలిసిందే. టీవీ ఆర్టిస్టుల నుంచి అగ్ర తారల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తమ వంతు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా పోలీసులు కూడా ప్రజల్లో అవగాహన పెంచేందుకు నడం బిగించారు. (ప్లీజ్ వారికి సాయం చేయండి.. కాజల్) కేరళ రాష్ట్ర పోలీసు మీడియా సెంటర్ 1.24 సెకనుల ఓ వీడియోను మంగళవారం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆరుగురు పోలీసులు ముఖానికి మాస్క్‌లు ధరించి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. పోలీసులు వినూత్నంగా డ్యాన్స్ చేస్తూ.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలంటూ అవగాహన కల్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పటికే లక్షల మంది దీన్ని వీక్షించారు. ఇక 145 దేశాలకు కరోనా వ్యాప్తి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా 1,75,530 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఏడు వేల మందిని కరోనా బలితీసుకుంది. (కరోనా: ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శానిటైజర్!) -
ఏపీ ఫార్ములాను ఫాలో అబుతామంటున్న కేరళ పోలీసులు
-
కేరళలో ఎస్కేప్... శంషాబాద్‌లో అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: విథుర సెక్స్‌రాకెట్ కేసులో అతడు 18 ఏళ్లపాటు తప్పించుకుతిరిగాడు. ఎట్టకేలకు కేరళ కోర్టు ముందు లొంగిపోయి బెయిల్ పొందాడు. మళ్లీ అజ్ఞాతంలోకి పారిపోయి ఐదేళ్ల తర్వాత శంషాబాద్‌లో పట్టుబడ్డాడు. అతడే విథుర సెక్స్ స్కాండల్‌లో ప్రధాన నిందితుడు సురేష్. ఈ సెక్స్ స్కాండల్ అప్పట్లో కేరళలో సంచలనం సృష్టించింది. పోలీసులు సోమవారం అతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేరళలోని కడక్కల్ ప్రాంతానికి చెందిన సురేష్ అలియాస్ షాజహాన్ ప్రేమ పేరుతోనో, మరో రకంగానో మహిళలను వశపరుచుకుని వ్యభిచారగృహాలకు అమ్మేవాడు. కేరళవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా నడిపాడు. అక్కడి విథుర ప్రాంతానికి చెందిన అజిత బేగం అనే ఏజెంట్ ద్వారా 1995లో ఓ బాలికను సంపన్నుల ఇంట్లో పని ఇప్పిస్తానంటూ ఎర్నాకుళం తీసుకువచ్చాడు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి అదే ఏడాది అక్టోబర్ 21న ఓ వ్యభిచారగృహానికి అమ్మేశాడు. అనేక ప్రాంతాల్లోని వ్యభిచారకూపాల్లో మగ్గిన ఆ బాలికను పోలీసులు 1996 జూలై 16న వ్యభిచార కేసులో అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ బాలిక కొట్టాయం పోలీసులకు సురేష్‌పై ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ బాలిక వెల్లడించిన విషయాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపాయి. 20 కేసులు నమోదు... ఆ బాలిక స్ఫూర్తితో బయటకు వచ్చిన మరికొందరు మహిళలు అతడిపై ఫిర్యాదులు చేయడంతో మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. విథుర సెక్స్ స్కాండల్‌గా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇతర నిందితులు అప్పట్లోనే అరెస్టు అయినా, ప్రధాన నిందితుడు సురేష్ దాదాపు 18 ఏళ్లు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు 2014లో కొట్టాయం కోర్టు ముందు లొంగిపోయాడు. ఇతడిపై పోలీసులు అభియోగపత్రాలు సైతం దాఖలు చేశారు. బెయిల్ పొందిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐదేళ్లుగా అనేక ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, వృత్తుల ముసుగులో తలదాచుకుంటూ తప్పించుకుతిరుగుతున్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బైజూ పౌలోస్ నేతృత్వంలో బృందం సాంకేతిక పరిజ్ఞానంతో సురేష్ సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్‌లో తలదాచుకున్నట్లు గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి తీసుకువెళ్లింది. సురేష్ ముంబైలోనూ తన దందా కొనసాగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి గురించిన సమాచారం ముంబై పోలీసులకు ఇవ్వాలని కేరళ పోలీసులు భావిస్తున్నారు. -
‘శబరిమల ఆలయంలోకి 8 మంది మహిళలు’
తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్నవారు) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. అయితే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ.. బుధవారం (రెండో తారీఖు) తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు) సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీలంక మహిళ శశికళ చేసిన ప్రయత్నాన్ని ప్రహసనంగా వర్ణించింది. ఎందుకు శుద్ధి చేశారు? ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్ను ట్రావెన్కోర్ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను పాలక మండలి వివరణ అడిగింది. (వారు చివరి మెట్టును చేరగలిగారు) -
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది. -
శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.