అత్యంత కిరాతకుల జాబితాలో మోడీ! | Modi is a list of the most savages! | Sakshi
Sakshi News home page

అత్యంత కిరాతకుల జాబితాలో మోడీ!

Published Wed, Jun 11 2014 4:11 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

అత్యంత కిరాతకుల జాబితాలో మోడీ! - Sakshi

అత్యంత కిరాతకుల జాబితాలో మోడీ!

కేరళ ప్రభుత్వ కాలేజీ మ్యాగజైన్‌లో ప్రచురణ

త్రిసూర్(కేరళ): ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచంలోనే అత్యంత కిరాతకుల్లో ఒకరిగా పేర్కొన్న ఓ కాలేజీ మ్యాగజైన్‌పై కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇక్కడి కుజూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది ఈ మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ‘నెగటివ్ ఫేసెస్’ పేరుతో ఈ నెల 4న కథనాన్ని ప్రచురించారు. ప్రపంచంలోనే అత్యంత కిరాతకుల జాబితాగా పేర్కొంటూ అల్‌కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్, ముంబై దాడులకు తెగబడిన అజ్మల్ కసబ్, స్మగ్లర్ వీరప్పన్, ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్, జర్మన్ నియంత హిట్లర్ వంటి వారి సరసన ప్రధాని మోడీ చిత్రాన్ని కూడా అందులో ప్రచురించినట్లు పోలీసులు తెలిపారు.

ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇందుకు కారణమైన ఎడిటోరియల్ బృందంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. వామపక్ష భావజాలమున్న విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ మ్యాగజైన్ నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు మ్యాగజైన్‌ను ఉపసంహరించుకుంటామని కాలేజీ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement