కార్యశూరుడు నరేంద్రమోదీ | Narendra modi birthday on september 17 | Sakshi
Sakshi News home page

కార్యశూరుడు నరేంద్రమోదీ

Published Thu, Sep 17 2015 12:30 AM | Last Updated on Mon, Oct 8 2018 4:24 PM

నేడు నరేంద్ర మోదీ పుట్టినరోజు - Sakshi

నేడు నరేంద్ర మోదీ పుట్టినరోజు

నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమైన రోజు, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీయే. మోదీ ఇంతటి ప్రజాదరణ ఎలా పొంద గలుగుతున్నాడో అర్థం చేసుకోవాలంటే ఆయన జీవిత మూలా ల్లోకి వెళ్లాలి. ఇటీవల ‘టైమ్’ మ్యాగజైన్ ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, పేదరికంలో పుట్టి పెరగడమే తనకు మొదటి స్ఫూర్తి అన్నారు మోదీ. 1950లో గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీకి చిన్ననాడే ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయమైంది. ప్రచారక్‌గా సామా జిక, సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు సాధించి, దృఢమైన నేతగా ఎదిగారు. 1987లో బీజే పీలో చేరి, అంచెలంచెలుగా 1998లో బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 2001 నాటి గుజరాత్ దారుణ భూకంపం దరిమిలా పునరావాస కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి మోదీని కేశూభాయ్ పటేల్ స్థానంలో ముఖ్యమంత్రి గా పార్టీ నియమించింది.
 
 2002లో గోద్రా అల్లర్లు మోదీ కను సన్నలలోనే జరిగాయని విపక్ష కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసి ఆయనను మత వాదిగా చిత్రీకరించింది. 2014 వరకు ఈ విషప్రచారం సాగుతూనే ఉంది. అయితే నిబద్ధతతో, కార్యదీక్షతతో ప్రతీ సారి కాంగ్రెస్‌ను చిత్తు చేశాడు మోదీ. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగం లోకి దిగిన మోదీ  సాంకేతిక పరిజ్ఞానంతో, వాగ్ధా టితో ప్రజల చేత నమో, నమో అని  మంత్రం జపం చేయించారు. ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా సంకీర్ణాలకు చరమగీతం పాడి బీజేపీకి పట్టం కట్టారు జనం. కాంగ్రెస్‌ను 44 స్థానాలకు కుదించారు.
 
 మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధిపతులను ఆహ్వానించి మొట్టమొదటిరోజు నుండే ప్రత్యేకతను చాటారు. ప్రపంచ దేశాలను మెప్పించి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినో త్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ప్రక టింపజేశారు. అమెరికాలోని మ్యాడి సెన్ స్క్వేర్‌లోనైనా, ఆస్ట్రేలియాలోై నెనా, దుబాయిలోనైనా, చైనాలోనైనా జన నీరాజనాలందుకుంటున్నారు. శత్రుభావంతో ఉన్న చైనాకు ఇరుదేశాల సాం స్కృతిక సంబంధాలను గుర్తుచేసే విధంగా ప్రపంచంలో 16 శాతంగా ఉన్న చైనీయులు మాట్లాడే మాండరీన్‌లోకి వేద సం పదను అనువదించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి ఆ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. అరబ్ దేశా లతో సైతం స్నేహసంబంధాలను నెలకొల్పారు.
 
 యూపీఏ పదేళ్ల పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే ప్రయత్నంలో మోదీ ఉన్నారు. అవినీతిని నిరోధించి ఖజానాను కాపాడుకోవడం, పోటీతత్వం, సహజ వనరుల కేటాయింపులో  పార దర్శకత, తద్వారా అదనపు ఆర్థిక వనరులను సృష్టిం చుకోవడం, సబ్సిడీల హేతుబద్ధీకరణ, విదేశీ పెట్టు బడులను ఆకర్షించడం వంటి వాటిపైన దృష్టి పెట్టా రు. వీటితోపాటు స్కిల్ ఇండియా ద్వారా యువ తలో నైపుణ్యాలను పెంచి మానవ వనరులను మో దీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. జనధన్ యోజన ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి వారిని బ్యాం కింగ్‌కు అనుసంధానం చేయడం, వ్యవసాయం, విద్యుత్తు, రైల్వే, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా ప్రాధాన్య రంగాలను అభివృద్ధి చేస్తున్నది. ఫలితం గా మొదటిసారిగా ఇటీవల మనం 7.5 జీడీపీ వృద్ధి రేటుతో చైనా వృద్ధి రేటును దాట గలిగాం.
 
కుటుంబ పాలనలు సాగుతున్న ఈ రోజుల్లో బంధుప్రీతి చూపకుండా యావత్ దేశం తన కుటుం బంగా భావించి పరిపాలన కొనసాగించడం ఈ దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులకు సాధ్యం?  మన భారతీయ సాంస్కృతిక పరంపర నుండి అందిపుచ్చుకున్న సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్న మన మోదీ ఆయురా రోగ్యాలతో ప్రజలకు మేలు చేకూర్చే మరిన్ని నిర్ణ యాలు, పథకాలు, విధానాలతో ప్రజల ఆకాంక్ష లను నెరవేరుస్తారని ఆశిద్దాం.
 వ్యాసకర్త, రాష్ట్ర కార్యదర్శి, భారతీయ జనతా యువమోర్చా, 90005 22400
 - ఏనుగుల రాకేష్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement